హైతీలో భూకంపం ప్రకృతి ఆగ్రహం వలన కాదని, అగ్రరాజ్యం అమెరికా కుటిల ప్రయోగాల ఫలితమని వస్తున్న వార్తలు విని .. ఇలా ప్రజల ప్రాణాల మీద ప్రయోగాలు చేసే అలవాటున్న అమెరికాని అసహ్యించుకుంటున్నారా ... కాస్త ఆగండి మన రాష్ట్రంలో ఉన్న నరహంతకులను కూడా కలిపి ఉమ్మడిగా ఉమ్మేద్ధురు గాని.
అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే డబ్బున్న బహుళజాతి కంపెనీలకి ఆదివాశీల ప్రాణాలు బహు చులకన. ఆత్మాభిమానం లేని మన పాలకుల కక్కుర్తికి అమాయకులైన గిరిజనుల ప్రాణాలు ఎలా మార్కెట్ లో పెట్టారో తెలుసుకుంటే ....... ఇలాంటి పాలకులకు ఓటేసిన మన వేలిని మనమే నరుక్కోవాలి అనిపిస్తుందేమో చూడండి.
ఒరిస్సా లో “వేదాంత” ధన దాహానికి కి డోంగ్రియా కోండ్ గిరిజనుల ప్రాణాలు ఆహుతి అవుతుంటే , ఇక్కడ మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అమాయక అడవి పుత్రుల ప్రాణాలు “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” వారి ప్రయోగాలకు బలవుతున్నాయి.
సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ కి టీకాల కోసం జరిపే ప్రయోగాల కోసం “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” వారికీ భారీగా అమాయక ప్రాణాలు కావాల్సి వచ్చాయి . ప్రపంచ వ్యాప్తంగా డబ్బుకోసం మనుషుల ప్రాణాలు అమ్మేసే హేమాహేమీల కోసం వారు జరిపిన అన్వేషణలో ఆంధ్రపాలకులు అగ్రభాగాన నిలిచారట . 2008 లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం లో “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” తమ ప్రయోగాలకు అనుమతి కోరగా వెనువెంటనే ఖమ్మం జిల్లాలో ప్రయోగాలకి వారికి అనుమతులు లభించేశాయి.
అసలే ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో రక్షిత మంచినీటి లేమి, పౌష్టికాహార లోపం, విష జ్వరాలు, డయేరియా, మలేరియాలతో మరణ ఘోష వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రయోగాలు చేపడితే ఒకవేళ ప్రయోగాల దశలో ఎవరైనా మరణిస్తే రెగ్యలర్ మరణాల జాబితాలో వేసేయోచ్చని తద్వారా “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” వారి ప్రయోగాలకి ఆటంకాలు కలగవని రాజా వారి వ్యూహం అని తెలిసింది. “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” ప్రయోగాలు మొదలెట్టాకా మరణాల సంఖ్య పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఎక్కడి నుండో ఒకడొచ్చి మీ ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టండి మేము ప్రయోగాలు చేసుకుంటాం అంటే ఊళ్ళకి ఊళ్లు రాసిచ్చిన మన పాలకులను తిట్టడానికి నాకు పదాలు దొరకడం లేదు.
ఒరిస్సా డోంగ్రియా ఖోండ్ గిరిజనుల పక్షాన " సర్వైవల్ ఇంటర్నేషనల్ " అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతుంది. ఖమ్మం జిల్లా గిరిజనుల కోసం ఎవరు పోరాడాలి ? ఎదురు తిరిగి ఎన్కౌంటర్ లో పోయే ధైర్యం మనికి లేదుగా!