అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/28/10

లేత మనసులు -3

మరీ మరీ తిరిగి చూడమన్న ప్రసాద్ గాడి హెచ్చరికలతో వెనక్కి తిరిగిచూసా . ఆమె చటుక్కున తల తిప్పుకుంది కానీ ఆమె అప్పటిదాకా నన్నే చూస్తుంది అని గుర్తించేసా :D. ఇక ఆ రోజు రాత్రి నిద్రపోతే ఒట్టు. మరురోజు ఉదయాన్నే పూలరంగడులా రంగురంగుల చొక్కా వేసి తయారై సైకిలెక్కి బయల్దేరా. వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చేసరికి ... అక్కడ ఆమె ఉంటుంది అని.. మేమిద్దరం చూసుకుంటాం అని .... ఎన్నెన్నో ఆశలతో వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. వాళ్ళంతా వంటగదిలో బిజీగా ఉంది నా ఆవేశం మీద నీళ్ళు చల్లారు :(. కానీ అప్పటికే నేను మున్నిని ప్రేమించేశాను.. మున్ని కూడా నన్ను ప్రేమించేసి ఉంటుంది అని మెంటల్ గా ఫిక్స్ అవడంతో కొద్దిగా ముందుకెళ్ళి ఏదో మర్చిపోయినట్టు మళ్లీ వెనక్కి రావడం వంటి ప్లాన్లు వేసి మరీ నాలుగైదు రౌండ్లు బెల్లు కొట్టుకుంటూ తిరిగినా ఉపయోగం లేదు. అంతలో "సీనుగా రేయ్ " అని ఒక సుపరిచితమైన గొంతు నుండి వెలువడిన పొలికేక నా కర్ణేంద్రియాలకు బలంగా తాకడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నాకు పళ్ళికిలిస్తూ కనిపించాడు హైదరాబాద్ కృష్ణ. అంటే హైదరాబాద్ లొ చుట్టాలింట్లో ఒక వారం ఉండి వచ్చిన దగ్గర నుండి హైదరాబాదీ తెలంగాణా స్లాంగ్ లొ మాట్లాడేస్తూ మా దుంపతెంచుతుండడంతొ వాడికా పేరు పెట్టేశాం అనమాట.

"శీనూ" చాలా గారాబంగా పిలిచేశాడు కిట్టి గాడు. "ఈడెబ్బ ఈడేంటి తేడాగా ఉన్నాడు కొంపదీసి మన ఫిగర్ కి లైన్ వెయ్యడం లేదుకదా" అనుకుంటూ "ఎరా హైదర్ ( హైదరాబాద్ కృష్ణ కి షార్ట్ కట్) ఏంది సంగతి" అని అడిగా. "నాతో బాటు ఎస్.ఎస్. యెన్. కాలేజి వరకు రావా" అని అడిగాడు. హమ్ అసలే మన టర్కీ కనిపించడం లేదు కదా ఈలోపు టైం పాస్ అవుతుంది అనుకుని " మరిసైకిల్ నువ్వే తొక్కాలిరోయి" అన్నాను . పరమానందభరితుడై "అలాగే మామా నువ్వు రా చెబుతా" అని నా సైకిల్ సారధిగా మారి కాలేజీ కి తీసుకెళ్ళాడు. మెయిన్ గేట్ దగ్గర ఆపమని చెప్పి " నువ్వు తొందరగా లోనికి వెళ్లి పని చూసుకుని తొందరగా వచ్చేయరా నేను ఇక్కడనే ఉంటాను" అన్నాను. అంత కాడికి నిన్ను ఇక్కడదాకా తొక్కుకుని తేవడం ఎందుకురా" అన్నాడు. "మరెందుకు తెచ్చావ్ రా " కాస్త అనుమానంగా అడిగా..... "అనన్యకి ఈ రోజు లెటర్ ఇవ్వబోతున్నా మామా" సిగ్గుపడుతూ చెప్పాడు. ఉలిక్కిపడి "అంత డేర్ చేశావేంటి రా ? " అన్నాను..సోనాలీ బెంద్రే పిన్ని కూతురు లా ఉండే అనన్య ని ఆదరాబదరా కట్టిన మట్టి గోడలా ఉండే కిట్టిగాడిని కంపేర్ చేస్తూ. "ఆలా అంటావేంటి మామా ...ఆ అమ్మాయే రా నాకు లవ్ లెటర్ రాసింది నీకు తెల్సుగా" అదోలా కళ్ళు మూసుకుని నవ్వుతూ . నాకేం తెలుసు.... అనబోతు అర్ధోక్తిలో ఆగిపోయా ..... వాడన్న మాట నిజమే. వాడికి అనన్య ఎఫెక్టు తగలడానికి కారణం నేనే! ఆ కధ తెల్సుకోవడానికి ఒక రెండు పేరాలు రెండు నెలల వెనక్కివెళ్లి వద్దాం. ...............

"మామా కిట్టి గాడికి బాగా ఎక్కువ అయింది రా" ... మేము రెగ్యులర్ గా కూర్చునే పిట్టగోడ మీద చేరగానే గురు అన్న మొదటి డైలాగ్ ఇది . "ఏం చేశాడురా" అన్నాడు రాజేష్. "ఈ గోడ మీద కూర్చుని అమ్మాయిల మీద వరస్ట్ కామెంట్స్ వేసిపోతున్నాడు ... ఆ ఎఫెక్ట్ మనకి పడేలా ఉంది"అన్నాడు గురు. "అరే టెన్త్ క్లాస్ అమ్మాయిలని కూడా వదలడం లేదురా" చాలా ఆవేశంగా కంప్లైంట్ చేశాడు గిరి. "దుప్పటేసి ఉతుకుదాం రా ఒకసారి ఎవడుకోట్టాడో తెలీకూడదు నాకొడుక్కి" ఆవేశపడ్డాడు ఆది . "ఆగండ్రా బాబు ఆడికి అంత అవసరం లేదు వాడిని ఏంటీవీ బకరా హాట్ సీట్ మీద కూర్చోబెట్టే టైం వచ్చింది " అన్నాను." ఏం చేద్దామంటావ్?" అన్నాడు గురు. "చెప్తా! ముందు ఒక పేపర్ తీసి నేను చెప్పినట్టు రాయి" అన్నాను. రాజేష్ గాడి పుస్తకం లోనుండి పుసుక్కున ఒక పేపర్ చినిగింది. "చెప్పురా" అన్నాడు గురు రాయడానికి సంసిద్ధం అవుతూ ... అప్పుడే తట్టిన ఐడియా ప్రభావం వల్ల ఒక చిటికేసి సీనియర్ లాయర్ టైప్ లొ ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయించా....:). లెటర్ రాయడం పూర్తి అయింది. "రేపు ఎవరైనా ఆవెనక చెట్టు మీద కూర్చుని సరిగ్గా ఏదో ఒక కాలేజి బస్సు వచ్చేటప్పుడు ఈ లెటర్ వాడి ముందు పడాలి వాడికి అనుమానం రాకుండా ఎలా చేస్తారో మీ ఇష్టం ... ముఖ్యంగా ఈ తింగరి రాజేష్ గాడు అక్కడ లేకుండా చూడండి" అని చెప్పా. టోటల్ గ్యాంగ్ మొత్తం కలిసి ప్రణాళిక రచించారు.

మరుసటి రోజు కావాలనే కాస్త లేటుగా వెళ్ళా ... వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం కోలాహలంగా ఉంది . "మామా మామా ఇటురా ఇటురా" అని ఆత్రంగా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు కిట్టిగాడు. "ఏందిరా నీగోల" అసహనంగా అనడానికి ట్రై చేశాను. "అబ్బా విసుక్కోకు మామా ఇది చదువ్" అని ఒక లెటర్ తీసి చేతిలో పెట్టాడు. మనోళ్ళు ప్లాన్ అమలు పరిచారన్న మాట అనుకుంటూ లెటర్ తీసి చదివా అందులో " డియర్ కృష్ణ , మీరు చాలా అందంగా ఉంటారు" అన్న వాఖ్యం చదివి వాడి వైపు చూసా ... "ఇంకా చదువు ఇంకా చదువు" అన్నాడు కిట్టిగాడు అపుకోలేని ఉత్సాహం ఆపుకోడానికి యత్నిస్తూ.... మళ్లీ మొదటి నుండి చదివా " డియర్ కృష్ణ , మీరు చాలా అందంగా ఉంటారు ముఖ్యంగా మీరు కళ్ళు మూసి నవ్వేటప్పుడు ఇంకా అందంగా ఉంటారు " అనే వాఖ్యం చదివి గిరుక్కున తల తిప్పి చూసా ... కళ్ళు మూసి నవ్వుతున్నాడు. "ఛి నీఎంకమ్మ" అనుకుని మళ్లీ లెటర్ చదవడం మొదలెట్టా " నేను రోజు బస్సు లోనుండి మిమల్నే చూస్తాను కానీ మీరు నన్ను కాకుండా అందరికీ లైన్ వేస్తున్నారు ... ఆలా చేయొద్దు ఇక నుండి నన్నే చూడాలి ప్రేమతో నీ ప్రియురాలు" చదవడం ముగించా. "ఎవరు రాశారురా ?" కాస్త పెద్దరికం జోడిస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడిగా. "తెలీదు మామా ఎస్.ఎస్.యెన్ బస్సు లోనుండి ఇది వచ్చి నా మీద పడింది" అన్నాడు. "అవున్రా నన్ను తప్ప ఇంకెవరినీ చూడవద్దు అన్నది కదా ఇకనుండి జాగర్త " అన్నాను. "అసలు ఆ పిల్ల ఎవరో తెలిస్తే కద మామా .... నన్నే చూడు అంటుంది అసలామె ఎవరో తెలిస్తే కాదా ఆమెనే చూసేది" ఆందోళనగా అన్నాడు కృష్ణ. "అందుకు నా దగ్గర ఐడియా ఉంది మామా ... ముందు మన గాలి నాయాల్ల పక్కన కూర్చోడం మానేయి ... ప్లేస్ మార్చు ... వేరే ఏరియా చూసుకో ... నీకు వర్క్ ఔట్ అయిపోద్ది "అని ఒక ఉచిత సలహా పారేశా .... అప్పుడు కళ్ళు మూసి నవ్వుతూ వెళ్ళి బస్సులెమ్మట తిరగడం మొదలెట్టిన కిట్టిగాడు .. ఇదిగో ఇప్పుడు లెటర్ రాసింది రాం నగర్ లొ ఉండే అనన్య అని ఫిక్స్ అయ్యి వచ్చాడు ... (ఇక ప్రస్తుతానికి వద్దాము.)

"ఆ లెటర్ రాసింది అనన్య అని ఎలా ఫిక్స్ అయ్యావ్ రా?" అని అడిగా . "ఆ రోజు నుండి ఆ బస్సు వెనకే ఫాలో అయ్యాను మామా చాల రోజులు ... బస్సు దిగిన అందరు అమ్మాయిలు మామూలుగా వెళ్ళిపోయేవారు కానీ ఒకరోజు ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి మళ్లీ గేటు దాకా వచ్చి వెళ్ళింది రా " అన్నాడు . "గేటు వెయ్యడం మర్చిపోయిందేమో రా అందుకే వచ్చి ఉంటుంది " అన్నా .. "కాదు మామా నాకోసమే వచ్చింది రా "అని వాదించడం మొదలు పెట్టాడు. "సరే ఇపుడు ఎం చేద్దాం అంటావ్ "అన్నాను "నువ్ కూడా తోడు వస్తే లెటర్ ఇస్తా నేను కూడా" అన్నాడు . "సరే అలాగే ఎడువ్ కానీ ఆరోజు ఆ లెటర్ ఆమె రాసి ఉండకపోతే ?" అన్నాను . "అందుకే ఆసంగతి ఇందులో రాయలేదు" మామా తెలివిగా రాశా కదా అన్నట్టు కళ్ళెగరేస్తూ అన్నాడు కిట్టి గాడు. "సరే ఇచ్చి రా.... నేనుకూడా వస్తే అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టాడా అని నీమీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది.. ఏదన్న తేడా జరిగితే నేను వచ్చి నిను సేవ్ చేస్తా అన్నాను. యే మూడ లొ ఉన్నాడో గానీ ఒప్పుకున్నాడు. " పాస్ బెల్లు కొట్టినప్పుడు పోయి ఇచ్చివస్తా "అన్నాడు. "నీ ఎంకమ్మ థూ నీ ఎలిమెంటరీ బుద్ది తగలడా .. 11.20 -11.30 లీషర్ టైం అప్పుడు బయటికి వస్తారు పోయి ఇచ్చిరా" అన్నాను. బిక్క మొహం వేసుకుని నిల్చున్నాడు

అనన్య బయటికి వచ్చింది . "రేయి పదినిముషాలే ఉంది పోయి ఇచ్చి రా నీకెందుకు నేను ఉన్నా" అని చెప్పి తోసా . వాడు బయల్దేరగానే గోడ వెనక నక్కి చూడడం మొదలెట్టా .... అనన్య ఉన్న ప్లేస్ కి మాకు ఒక వంద అడుగుల దూరం ఉంటుంది. అక్కడ జరిగేది స్ప్రష్టం గానే కనిపిస్తుంది. వీడు వెళ్లాడు ..లెటర్ ఇచ్చాడు.. ఆమె చదివింది .. అటు ఇటు చూసింది .. వాళ్ళ ఫ్రెండ్ ని ఏదో అడిగింది ..ఆమె పెన్ను తెచ్చి ఇచ్చింది .. ఇదే లెటర్ మీద ఏదో రాసి ఇచ్చింది.. మనోడు మొహం వేలాడేసుకుని వచ్చాడు. "ఏమైందిరా ?"అన్నాను.. లెటర్ చేతికి ఇచ్చాడు. లెటర్ మీద  రెడ్ ఇంకు తొ REJECTED అని రాసి ఉంది. రెడ్ ఇంకు పెన్  లేకపోతే ఫ్రెండ్ ని అడిగితీసు కుని మరీ రాసిందిరా.... అంటూ వేణుమాధవ్ ఎక్సప్రెషన్ ఇచ్చాడు కిట్టిగాడు. ఆ రోజు అర్ధరాత్రి దాకా మా బ్యాచ్ మొత్తం  కిట్టిగాడి కామెడీ మే చెప్పుకుని చెప్పుకుని మరీ నవ్వుకున్నాం అని వేరే చెప్పాలా?????

(ఇంకా ఉంది)

లేత మనసులు - 1

లేత మనసులు - 2

9/29/10

లేత మనసులు - 2

ఉత్తరాది నుండి వ్యాపారరిత్యా ఆంధ్రా లొ స్థిరపడిపోయిన కుటుంబానికి చెందిన అమ్మాయే మున్ని :) . ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంది. తన మేనమామ భార్యకి డెలివరీ కావడంతో తోడుగా ఉండడానికి ఒంగోల్ వచ్చింది. తనతోబాటు సెలవుల్లో ఉన్న తన కజిన్స్ ని కూడ తీసుకువచ్చింది. అయితే అంతమందికోసం వాళ్ళ ఇల్లు సౌకర్యంగా లేకపోవడం వల్ల వేరే చోట ఇల్లు తీసుకుని ఇల్లు మారారు. కొత్త ఇంటికి వచ్చి ఆటో దిగుతున్న మున్ని చూపుని కొంచెం దూరంగా సైకిల్ చక్రం లొ చున్నీ ఇరుక్కోవడంతో నానా ఇబ్బంది పడుతున్న ఒక పదిహేనేళ్ళ పాప ఆకర్షించింది. అసలే కొత్త డ్రెస్ ఏమో ఏడుపు కూడా మొదలెట్టేసింది ఆ పాప. క్షణాల్లో ఆ పాపదగ్గర నలుగురైదుగురు చేరి... ఆ చక్రం నుండి డ్రస్ తీయడం లొ తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించేస్తున్నారు కానీ పని అవడంలేదు.

కూలి వాళ్ళు సామాన్లు ఇంట్లోకి మోస్తుంటే ... మేనమామ కొడుకుని ఎత్తుకుని వరండాలో నిల్చుని అక్కడ జరిగేది చూడసాగింది. ఆ చక్రం నుండి డ్రస్ లాగే వాళ్ళ దెబ్బకి డ్రస్ ఇంకాస్త ఇరుక్కుపోయిందేమో పెద్దగా ఎడ్చేయడం మొదలెట్టింది. 'అయ్యొ పాపం ' అని మున్ని జాలిగా అనుకుంటు ఉండగానే .. హీరో రేంజర్ సైకిల్ మీద సర్రున వచ్చి ఆగాడొకడు . ఆమ్మాయిని ఏడవద్దని హెచ్చరిస్తున్నట్టుగా సైగ చేసి సైకిల్ వెనక టైర్ ఎత్తి పట్టుకుని ఫెడల్ వెనక్కి తిప్పాడు. చాలా ఈజీగా సైకిల్ చైన్ లోనుండి అమ్మాయి డ్రస్ బయటికి వచ్చింది. అందరి వంక పిచ్చ నా డాష్ ల్లారా అన్నట్టు చూసి .. సైకిలెక్కి ఎంత స్పీడ్ గా వచ్చాడో అంత స్పీడ్ గా వెళ్లిపోయాడు. 'వీడెవడ్రా బాబు రఫ్ అండ్ టఫ్ జీన్స్ యాడ్ లొ అబ్బాయిలాగా బలే వచ్చాడే' అనుకుంది మున్ని.

తర్వాత సాయంత్రం పనులన్నీ అయ్యాక తన చెల్లెల్లకి ఈ విషయం చెప్పింది. "అయితే బాగున్నాడా" కళ్ళు ఎగరేస్తూ కొంటెగా అడిగింది ముష్కాన్ . ముష్కాన్ ఇంటర్ చదువుతుంది. "ఓయ్ నొర్ముయి రాను రాను భయం లేకుండా పోతుంది " అంటు ముష్కాన్ ని కసిరింది పూజ. మున్ని కంటె రెండేళ్లు చిన్నది పూజ. పూజ కన్నా రెండు నెలలు చిన్నది ముస్కాన్ ... ముగ్గురూ అక్క చెల్లెళ్ళ బిడ్డలు. మున్నికి ఎందుకో ఆ పిల్లోడే తెగ గుర్తు వస్తున్నాడు. " ఛి ఏంటి నేను ఎవరి గురించో ఇంతలా ఆలోచించడం" అని తనలో తను అనుకుంటుంది కానీ ఎందుకో ఆ దృశ్యమే తనకి పదేపదే గుర్తువస్తుంది. ఇల్లు సరిగ్గా సర్దుకోలేదు . ఉదయాన్నే లేచి సర్దుకోవాలి అనుకుంటూ పడుకుంది. ఉదయాన్నే ఐదున్నరకి లేచి కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి వరండాలో నిల్చుంది. కళ్ళ ముందు నుండి ఆ హీరో రేంజర్ సైకిల్ వాడు ఆలా వెళుతున్నాడు. తనకి తెలీకుండానే ఒళ్ళు జలదరించింది మున్ని కి . రాత్రంతా వీడి గురించి ఆలోచించిన ఎఫెక్ట్ అనుకుంటా అని సర్దిచేప్పుకుంది. ఇంకవీడి గురించి ఆలోచించకూడదు అని డిసైడ్ అయిపోతే .... వీడేంటి నిద్రలేవగానే దర్శనం ఇచ్చాడు అనుకుంది. కాసేపటికి చెల్లెళ్ళు కూడా నిద్ర లేవడంతో ఇక దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

కొత్తగా తమ ఏరియాలోకి ముగ్గురు అమ్మాయిలూ దిగారు అన్న విషయం తెల్సుకున్న ఆ కాలనీ కుర్రాళ్ళు తడవకి ఒకరు వచ్చి చూసి వెళ్లడం చూసి "ఏంటి అక్కా వీళ్ళు... ఎప్పుడూ అమ్మాయిలని చూడలేదనుకుంటా" అంది పూజ వాళ్ళకేసి చూస్తూ . "మనకెందుకులేవే... అసలే కొత్తూరు........ లేనిపోని గొడవలు ఎందుకు ......అసలే ఇది మాస్ ఏరియా అంట.........." అంటూ మధ్యలోనే ఆగిపోయింది మున్ని. మళ్లీ ఆ సైకిల్ వాడే..తనలోకం తనదే అన్నట్టు ఏదో నవ్వుకుంటూ వెళ్తున్నాడు . వాడికేసి ఆలా చూస్తున్న మున్ని దగ్గరికి వచ్చి " అక్కా నిన్న నువ్వు చెప్పిన ఆ సైకిల్ హీరో వీడేనా ?" అంది పూజ. " ఆ వీడె.............. కానీ కొంచెం different గా ఉన్నాడు కదా .. మిగతా వాళ్ళలా లేడు" అంది మున్ని ( కానీ అప్పటికి వాడు ఇంకా తనని చూడలేదు అని మున్నికి తెలీదు ) .


రెండు రోజులు గడిచాయి ... మున్ని అండ్ కో కి అ పేట కుర్రాళ్ళ బీట్లు ఎక్కువ అయ్యాయి . బయట ఎక్కువగా కూర్చోవద్దని మామయ్య హుకుం జారీ చేశాడు. రెండు రోజులుగా సైకిల్ వాడు కనిపించడం లేదు . ఏమయ్యాడో ? అనుకుంటుండగా ప్రత్య్యక్షం అయ్యాడు వీధి మలుపు లొ. ఎప్పుడూ చాలా సరదాగా ఉన్నట్టు కనిపించే వాడు ఈ రోజు ఏంటి నీలుక్కుని వెళ్తున్నాడు అనుకుంది మున్ని ( వాడు ఆపాటికే తనని గమనించి ఫోజు కొడుతున్నాడని తెలీదు పాపం ) " అందరూ అక్క వైపు చూస్తుంటే అక్కేమో ఆ సైకిల్ వంక చూస్తుంది పాపం" అని కౌంటర్ వేసింది ముస్కాన్. "ఏయ్ చుప్ " అంటూ ముస్కాన్ ని కసిరింది మున్ని. "నేను అన్నదాన్లో తప్పేం ఉందక్కా " అంటూ బుంగమూతి పెట్టింది ముస్కాన్." అది కాదే, ఏంటో చాలా రోజులనుండి పరిచయం ఉన్న వాడిలా అనిపిస్తున్నాడు అంతకుమించి ఇంకేం లేదు " అనేసి లోపలకి వెళ్ళిపోయింది మున్ని. ఆలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ఉదయం మన సైకిల్ హీరో, పక్కన ఇంకొకడు నడుచుకుంటూ వస్తున్నారు. " అక్కా ... కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు వీడు సైకిల్ తో పుట్టాడా? యెప్పుడు చూసినా సైకిల్ తొక్కుతూ లేక నడిపించుకుంటూ కనిపిస్తాడు" అంది పూజ నవ్వుతూ .. పూజ మాటలకూ అందరూ నవ్వేశారు. కానీ మున్ని ఆలోచనలు వేరేగా సాగుతున్నాయి. " ఏంటి వీడు.... నాకేంటి వీడితో అసలు ... ఇప్పటిదాకా ఎంతమందిని చూసినా ఏమీ అనిపీలేదు కానీ వీడితో మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకు " అని తనలోతాను అనుకుంటూ వాడి వైపే చూస్తుంది. పక్కన ఉన్న పిల్ల బొండాం గాడు "అన్నా అన్నా ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది అన్న " అని చెప్పడం వినిపిస్తుంది. అంతలో ఆ సైకిల్ శాల్తీ వెనక్కి తిరిగి చూశాడు చటుక్కున తల దించేసుకుంది. పూజ ముస్కాన్ ల పరిస్థితి కూడా అంతే . తల వంచుకుని ఏదో పని చేస్తునట్టు నటించింది. కాసేపు ఆగి తలెత్తి చూసింది . ఆ బొండాం గాడి నెట్టిన మొట్టికాయ వేస్తూ నవ్వుకుంటూ వెళ్తున్న వాడిని చూసి ముసి ముసిగా నవ్వుకుంది.

కానీవాడు చూసే సమయానికి తను తలదించుకోవడం వాడు గమనించాడు అని తెలుస్కోలేకపోయింది. అ మర్నాడు .............


( ఇంకా ఉంది )


లేత మనసులు - 1

9/27/10

లేత మనసులు

అవి నేను పంతొమ్మిది -ఇరవై ఏళ్ళ వయసు మద్య నేను కుర్రపిల్లాడినా లేక పెద్దకుర్రాడినా అన్న మీమాంస లొనుండి పూర్తిగా బయటపడని రోజులు. అందరు అబ్బాయిలలాగే అమ్మయిలవంక తిరిగి తిరిగి చూసేవాడిని. మనలో మనమాట నాకూ ఒక గాళ్ ఫ్రెండ్ ఉండి తీరాల్సిందే అన్న ఆలోచన మనసులో బలంగా ఉండేది. కానీ ఎప్పుడూ ఏ అమ్మాయి వెనక వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ... వెళ్ళాలనిపించలేదు, ఆ అమ్మాయి హార్ట్ ని టచ్ చేయలేదు అనే టైపు సినిమా డైలాగులు చెప్పనుగానీ ప్రత్యేకించి పలానా అమ్మాయికి ఫిక్స్ అవడంలో నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్న టైం అని చెప్పుకోవచ్చు. జీన్ క్లాడ్ వాండమ్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ల సినిమాలు చూసి పూర్తిగా ఇన్స్పైర్ అయ్యి ఉదయాన్నే ఐదున్నరకి జిమ్ కి వెళ్లడం,కండలు కరిగేలా కసరత్తులు చేసి ఎనిమిదింటికి ఇంటికి రావడం ...ఏదో వెళ్ళాం అన్నట్టు కాలేజికి వెళ్లడం.... మద్య మద్యలో అమ్మాయిలకి బీట్లు కొట్టడం..ఇలా సాగేది దినచర్య.

సాయంత్రం అయ్యేసరికి గోడల మీద కూర్చుని వచ్చేపోయ్యే అమ్మాయిలకి బీట్లు కొడుతూ .....కామెంట్స్ విసుర్తూ వాళ్ళు తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తే ఒకటికి పదిసార్లు చెప్పుకుని నవ్వుకోవడం వంటివి చేసే తరహా సగటు ఆంధ్రా కుర్రాళ్ళ బ్యాచే మాదికూడా. సైకిల్ మీద వెళుతుంటే అమ్మాయి ఎదురుగా వచ్చేటప్పుడు అమ్మాయినే చూస్తూ ఉండగా ....దగ్గరగా వచ్చాక ఆ అమ్మాయి ఒక్క క్షణం చటుక్కున మనవైపు చూసి ఇద్దరి చూపులు కలుసుకుని మరుక్షణం ఆమె చూపులు తిప్పుకునే లోపు ఆ కళ్ళు కలిసిన టైంలో ఉండే జిల్ బలే ఉంటుందిలే. అలాంటి ప్రేమదేశం తరహా సంఘటనలు మనకి కోకొల్లలు. అంతకుమించి కధ ముందుకి వెళ్ళదు. ఆళ్ళు మనల్ని చూడడం మనం ఆళ్ళని చూడటం.

ఆలా సరదాగా రోజులు గడిచిపోతున్న సమయంలో ఒకరోజు మా కాలనీలొ చివరగా ఉండే ఇల్లు, అదీ గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఒక పెద్దఇంట్లోకి ఎవరో సామాన్లు మోసుకోవడం కనిపించింది. మరుసటి రోజు ఉదయాన్నే నేను జిమ్ నుండి వస్తుండగా ఆ ఇంట్లో ముందు వరండాలో ముగ్గురు అందమైన అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు.చాలా చక్కగా ఉన్నారు. అప్పటివరకు మేము ఒంగోల్లో అలాంటి అందగత్తెలని చూడలేదంటే నమ్మండి. నిజం చెప్పొద్దూ ఇక్కడే విధి తనపని తాను కానిచ్చింది అదేంటంటే ... ఇంత అందమైన అమ్మాయిలు అసలు మనవంక చూస్తారా .... అసలు మనల్ని పట్టించుకుంటారా ... అనవసరంగా మనం దేబిరిచ్చుకుని చూడటం తప్ప అనుకుని అసలు వాళ్ళని గమనించనట్టే వెళ్లిపోయా. కాస్త ముందుకి వెళ్ళాక మా సెంటర్ లొ కుర్రాళ్ళ మద్య బీబత్సమైన డిస్కషన్ జరుగుతుంది.

నేను ఊహించింది నిజమే మనోళ్ళు ఆ అమ్మాయిల గురించే ఒక రేంజిలో చర్చలు జరుపుతున్నారు. వాళ్లకి పాలు పోయడానికి కుదిరిన బర్రెల వెంకాయమ్మ ద్వారా మనోళ్ళు లాగిన విషయం ఏంటయ్యా అంటే ఆ అమ్మాయిలు ముగ్గురూ కజిన్స్ అనమాట అంటే ఆ ముగ్గురి తల్లులూ అక్క చెల్లెళ్ళు. వాళ్ళ మేనమామది ప్రేమవివాహం అవడం వల్ల బిడ్డ పుట్టినా ఆయన భార్య తరపువాళ్ళు ఎవరూ సాయానికి రాకపోవడం వల్ల వీళ్ళు వాళ్ళ అత్తకి తోడుగా ఉండటానికి వచ్చారు.పైగా వాళ్ళు నార్త్ ఇండియన్స్. కానీ చిన్నప్పటి నుండి ఆంధ్రాలో పెరగడం వల్ల తెలుగు అమ్మయిలలాగానే మాట్లాడతారు అన్నది సారాంశం.

చర్చలు ముగిశాయి .... తర్వాత ఆవిషయమే మర్చిపోయా .. మరో రెండు రోజుల తర్వాత నేను, మా ఫ్రెండ్ తమ్ముడు రాజేంద్ర గాడు సినిమా చూసి నడుచుకుంటూ వస్తున్నాము. ఆ ఇల్లు దగ్గర అమ్మాయిలని దూరంగానే చూశాను కానీ పట్టిచ్చుకోవడం అనవసరం అనుకున్నాగా అనుకుని మామూలుగా వచ్చేస్తున్నా .... " అన్నా ఆ అమ్మాయి నిన్ను తెగ చూస్తుంది అన్నా " అన్నాడు రాజేంద్ర . "ఏ అమ్మాయిరా" అన్నాను.అప్పటికే మేము ఆ ఇల్లు దాటి వచ్చేశాం. " అదే అన్నా ఆ చివర ఇంట్లో అమ్మాయి" అన్నాడు. "మనల్ని కాదేమోలేరా" అంటూ ముందుకే నడిచా ... వాడు వెనక్కి చూస్తూ "అబ్బా నిన్నే అన్నా నేను బాగా గమనించా కదా కావాలంటే చూడు" అన్నాడు. తల తిప్పి చూశా.............. అక్కడ .............( ఇంకా ఉంది )

9/22/10

అమ్మాయిలు అర్ధం చేసుకోలేరు

అది ఒక రోడ్ . అ రోడ్ లొ ఒక అబ్బాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడుangel . అదే రోడ్ లొ ఎదురుగా ఇంకొక అమ్మాయి మరొక కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుందిbusuk . వారు ఒకరినొకరు క్రాస్ చేసుకునే సమయంలో అబ్బాయి విండో ఓపెన్ చేసి పెద్దగా గాడిద అని అరిచాడు. క్షణం ఆలస్యం చేయకుండా అమ్మాయి అదే స్పీడ్ లొ కోతిగా అని తిట్టేసింది . ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయారు . తన స్పాంటేనియస్ రెస్పాన్స్ పట్ల అమ్మాయి తీవ్రంగా సంబరపడిపోతూ కొద్దిగా ముందుకి వెళ్లేసరికి ఇలా అయింది.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.


.
.
.
.
.
.



కధలో నీతి : అబ్బాయిలు తమకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అమ్మాయిలకి అసలు అర్ధం చేసుకోలేరు.

9/21/10

'పోకిరి' పులి

గమనిక : ఈ టపాలో కంటెంట్ నా స్వంతం కాదు , ఈమెయిలు లొ దొరికింది పట్టుకొచ్చా :))

సబ్జెక్ట్ : పోకిరి సినిమాలో గలగలా పారుతున్న గోదారిలా అనే సాంగ్ కి ముందు వచ్చె సీన్ లొ పవన్ కళ్యాణ్ ఉంటే ఎలాఉంటుంది

ఇలియానా : ఇప్పుడు మళ్లీ ఏం సినిమా తీశావ్ ... ఎంత ప్రేమించాను నిన్ను .. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను .. ఎంతో మంచి యాక్టర్ అనుకున్నాను.

(జనం పరిగెత్తుతుంటారు : అక్కడ ఎవరో పులి సినిమా చూసి పోయారట ... ఎవరు ?.. తెలీదు )

ఇలియానా : ఇప్పుడు నేనేం చెయ్యాలి .. నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా

పవన్ కళ్యాణ్ : మర్చిపో

ఇలియానా: ఎలా మరచిపోగలను ఈ సినిమాలు ఆపుతావా లేదా ? చెప్పు ... ప్రతిక్షణం నీ సినిమానే గుర్తువస్తుంది... నిద్రలో ఆ పీడకలలే ... ఖాళీగా ఉన్న బుకింగ్ కౌంటర్ చూస్తే నువ్వే గుర్తు వస్తావ్ ... కాస్త తేడాగా ఉన్న ఎవరు కనిపించినా నువ్వే గుర్తువస్తావ్ ... ఏ హెలికాప్టర్ చూసినా నువ్వే గుర్తు వస్తావ్ ..అన్నం తింటుంటే గుర్తువస్తావ్ ... ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తువచ్చి బాధ పెడతావ్... నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి డిస్ట్రిబ్యుటర్ అనుకుని భయపడతాను గడియారం వంక చూసుకుని ఈ టైం లొ ఏ ఫ్లాప్ తీస్తుంటాడో అనుకుంటాను ..ఏం చేస్తున్నాడో అనుకుంటాను . కానీ నువ్వేం తీస్తున్నావ్ బిల్డింగ్ ల మీద దూకుతూ తిరుగుతుంటావ్... ఆ డైరక్టర్ ఎవరు...

పవన్ కళ్యాణ్ : ఎస్.జే సూర్య అని ఫ్రెండ్

ఇలియానా: వాడితో ఎందుకు తీయడం ..వాడు డైరక్టర్ కాదు

పవన్ కళ్యాణ్ : అందుకే తీస్తున్నాను

ఇలియానా: వాడి సంగతి నాకు తెలీదు ఇలా ఎన్ని ఫ్లాప్స్ తీస్తావ్

పవన్ కళ్యాణ్ : శృతి నీకొక విషయం అర్ధం కాడం లేదు .. నేనెప్పుడు ఫ్లాప్ సినిమాలు తీస్తూనే ఉన్నాను .. ఇప్పుడు తీసిన ఫ్లాప్ సినిమా కొత్తదేమీ కాదు ఇదివరకు చేసిందే... కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నా సినిమా చూసి తప్పు చేశావ్. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయినే ప్రేమించాను .. నా సినిమాలు చూసి ఎడిచారు కానీ నాకోసం ఎవరూ ఇలా ఏడవలేదు అది బానచ్చింది. 

___________________________________________________________________


మన నాగార్జున సౌజన్యంతో క్రింది వీడియో చూడండి :)

9/20/10

తెలుగు లొ పూజిద్దాం :)

పిల్లలలో కొరవడుతున్న భక్తిశ్రద్ధల గురించి ఒకరోజు నాకు మిత్రునికీ మద్య చర్చకి వచ్చింది. చర్చలో మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు. దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ సంస్కృతం అందరికీ మద్య వారధిలా ఉండేది . ఆ సంస్కృతం పోయి ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాక సంస్కృతం అలవాటు లేక సంస్కృతంలో ఉన్న క్లిష్టమైన సహస్రనామాలు , అష్టోత్తరాలు వాళ్లకి అర్ధం కాక ఇదేదో మనకి సంబంధం లేని విషయం అనుకుని వదిలేస్తున్నారు అని. హమ్ నిజమే చాలామంది ఎకాడికీ ఈ జనరేషన్ ని ఆడిపోసుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు కానీ అసలు పిల్లల సమస్యని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా ప్రవర్తిస్తున్నారు అనేది నా అభిప్రాయం.

ఇప్పుడు కొత్త జనరేషన్ కి సంస్కృతం అలవాటు చెయ్యడం అనేది మనవల్ల కాని పని........... అది అందరికీ తెల్సు . ప్రస్తుతం ఎంత ఆంగ్ల మాధ్యమంలో చదువులు అయినా ఇంట్లో మాట్లాడుకునేది తెలుగులోనేగా ? దేవుడికి దణ్ణం పెట్టుకునేది తెలుగులోనేగా........... మరి అలాంటప్పుడు రామాయణ, భాగవత , భారతాల లాగా మన విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, మంత్ర పుష్పాలు అన్నీ ఎందుకు తెలుగులో అనువదించకూడదు. మాతృభాషలో భక్తిని పరిచయం చేస్తే ఏ పిల్లవాడు కూడా దైవానికి దూరం జరగడు అనిపిస్తుంది.

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అనుకోవడం లొ ఎంత ఆనందం ఉంది . మా ఇంట్లో రోజూ మా అమ్మ విష్ణు సహస్ర నామం చదువుతుంది కానీ మాకు ఒక్క ముక్క అర్ధం కాదు. లక్ష్మీ అష్టోత్తరం కూడా బట్టీ పట్టి నేర్చుకున్నా . కానీ నేను ఏం చదువుతున్నాను అనేది నాకే తెలీదు. ముఖ్యంగా ఒక చోట నృపవేశ్మ గతానంద అని ఉండాల్సిన చోట ప్రింటింగ్ మిస్టేక్ నృపవేస్య గతానంద అని ప్రింట్ చేశాడు . శివశివా అమంగళం ప్రతిహతమగుగాక .
కానీ సాయిబాబా చాలీసా , దశ నామాలు వంటివి ఒక్కసారి చదివితే సులువుగా అర్ధమవడం , అందులొ భావం మనసుకి హత్తుకోవడమే కాక అయన యెడల భక్తి మనస్సులో దృడంగా పాతుకుంటుంది.

అందుకే ఇకపై మాతృభాషలో పూజిద్దాం . పెద్దలు సంస్కృత పండితులు ఎవరైనా పూజా సంభంద విషయాలు తెలుగులో స్ప్రష్టంగా అర్ధమయ్యేలా అనువదిస్తే గ్రామగ్రామాన వాడవాడలా అందరికీ సులభంగా అర్ధమవుతూ భక్తి ప్రపత్తులు ఇనుమడయ్యే అవకాశం ఉంది.

ఈ విషయమై నేను ఒక మిత్రునితో చర్చిస్తే " మొదలు పెట్టావా బ్రాహ్మల పొట్ట గొట్టడం " అనేశాడు. ఎందుకలా అన్నాడో నాకు అర్ధం కాలేదు. తర్వాత తర్వాత ఆలోచించగా అర్ధం అయింది అనుకోండి. కానీ శూద్రులు వేదమంత్రాలు చదివేదరు అని బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు కదా :)

9/18/10

దీని భావమేమి వెంకటేశా!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఇమేజి పెద్దదిగా చేయుటకు డాని మీద క్లిక్ చేయండి. senyumkenyit


ముందు రోజు రాత్రి ప్రమాదవనం లొ ఇలా



ఈ ఉదయం బజ్ లొ ఇలా

9/17/10

పాపం 'తార'కెన్ని కష్టాలు :P

బ్లాగులు చదివే వారిలో అసైన్సు కబుర్లు తార తెలీని వాళ్ళు ఉండరు. అయితే ఈ తారకి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు. బ్లాగు లోకం లొ ఎవరూ ఎదుర్కోనన్ని నీలాపనిందలు ఎదుర్కొన్న మన తార .......యెంత మంది చవితి చంద్రులను దర్శించాడో గాని! ......... ప్రపీసస పుట్టిన కొత్తలో నేను అందులో తార అంటే అమ్మాయి అనుకుని మన నాగ ప్రసాద్ ని అడిగా "ఎవరా అమ్మాయి" అని ... 33 సార్లు gelakguling ఇలా పొర్లి పొర్లి నవ్విన నాగప్రసాద్ "అమ్మాయి కాదు అబ్బాయి"అని చెప్పాడు. కానీ అప్పటికే మెజారిటీ బ్లాగు లోకం తార ని అమ్మయిగానే గుర్తిస్తు వస్తుంది అప్పటి దాకా. అయితే ఇంగ్లీషు లొ స్టార్ అని ఉంటే అబ్బాయి అని తెలుగులో తార అని ఉంటే అమ్మాయి అనుకోవడం మన అవివేకం అనేది నా అభిప్రాయం.

ఇక ప్రజలు అప్పటికే అమ్మాయి అని అపార్ధం చేసుకున్న తార ని మొన్న ఒకాయన "బాబు యోగి అంటే నువ్వే కదా" అని అడిగాడట. దెబ్బకి దిమ్మ తిరిగిన తార ఆయనకి అసలు విషయం అర్ధం అయ్యేలా చెప్పి బయటికి వచ్చె సరికి విమల్ రెడీగా ఉన్నాడు . "హే తార బ్లాగు బాబ్జి నువ్వే కదా" అని టీనేజి పిల్లాడు విమల్ అమాయకంగా అడిగేసరికి మన తార గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. నేను బ్లాగు బాబ్జీ ని కాను మొర్రో అని మొత్తుకుని అక్కడి నుండి బయట పడ్డ తార నేరుగా బ్లాగు బాబ్జి దగ్గర ఈ విషయమై కామెంట్ పెడదామని వెళ్లాడు . అక్కడ తారని చూసిన బ్లాగు బాబ్జి .....................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

"అన్నాయి మార్తాండ అంటే నువ్వే కదా" అని అడిగేశాడు ihikhik. పాపం తార :P

9/16/10

ఒరేయ్ మీరు మారర్రా - మీరు మారరు

నిన్ననే ఒక టపా రాశాను ... కామెడీగా రాశాను కానీ అందులో కొని నిజం అవుతాయనుకోలేదు వా nangih ..

ఈ కింది లింక్ చూడండి . జగన్ కి కన్ను బాలేక ఓదార్పు ఆగడం వల్ల ముగ్గురు ఫట్ . ముందు సాక్షికి సలాం చెయ్యాలి :(

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11677&subcatid=16&Categoryid=3



‘గుండె’ చెదిరిన అభిమానం





ఒంగోలు మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనారోగ్య కారణంతో ఓదార్పు యాత్ర వాయిదా పడడంతో కలత చెంది ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఒంగోలు పట్టణంలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. సంతనూతలపాడు మండలానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజు(22)మృతి చెందాడు. ఆ యువకుని తల్లిదండ్రులు బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని కలిసి వారి ఆవేదనను చెప్పుకున్నారు.

మృతుడి తల్లిదండ్రులు రామలక్ష్మయ్య, రమణ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. ఒక కొడుకు అంకమరాజు ఏడాది క్రితం పోలియో వ్యాధితో మృతి చెందాడు. పెద్దబ్బాయి నాగరాజు పదేళ్లు వచ్చాక పోలియో సోకింది. వైఎస్‌ఆర్ హయాంలో నాగరాజుకు పింఛన్ మంజూరయింది. దీంతో వైఎస్‌ఆర్ మీద నాగరాజు అభిమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం దెబ్బతిని ఓదార్పుయాత్ర వాయిదా పడడంతో నాగరాజు ఆవేదన చెందాడు. హఠాన్మరణం చెందాడు. ఆదుకుంటామని సుబ్బారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

వైఎస్ అభిమాని గుండెపోటుతో మృతి
మేదరమెట్ల, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి చనిపోయాడు. కొరిశపాడు మండలం యరబ్రాలేనికి చెందిన కోటపూడి వెంకటేశ్వర్లు(59) మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో టీవీలో ఓదార్పు యాత్ర వార్తలు చూస్తూ ఉద్వేగానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. ఇతను వైఎస్‌ఆర్ వీరాభిమాని. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వైఎస్ మృతి చెందినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందేమోనని తీవ్రంగా బాధపడ్డాడని అతని భార్య సౌభాగ్యం ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని చెబుతుండేవాడన్నారు.


వైఎస్‌ఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంపై ఆగిన గుండె
కందుకూరు : జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడంపై కలత చెంది ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వలేటివారిపాలెం మండలం శాఖవరంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల నుంచి ఆ గ్రామానికి చెందిన దళితులు ప్రయత్నం చేస్తున్నారు. వివాదంలో ఉన్న పంచాయతీ స్థలంలో విగ్రహ ఏర్పాటును అగ్రవర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. భూమి పూజను కూడా నిలిపివేశారు. తమ అభిమాన నేత విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో గడ్డం అచ్చయ్య(62) తీవ్రంగా బాధపడ్డాడు. బుధవారం సాయంత్రం 4 గంటలకు గుండె పోటుతో మరణించాడు. మృతునికి భార్య, వివాహమైన కుమార్తె ఉంది. వైఎస్‌ఆర్ విగ్రహ ఏర్పాటుకు కమిటీ తరఫున అచ్చయ్య తీవ్రంగా కృషి చేశారు. అది విఫలం కావడంతో వేదన చెంది గుండెపోటుతో మరణించాడు.

9/15/10

జగన్.... నవ్వుల పాలు కాకముందే ఈ హత్యలు మానెయ్యి

మరణించిన వారి కోసం జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర జరగదేమో అన్న బెంగతో ఇప్పటికే మా జిల్లాలో చాలామంది చనిపోయారు. తాజాగా వై ఎస్ విగ్రహాలు తమ గ్రామం లొ పెట్టరేమో అనే బాధతోను , పెట్టడం కుదరడం లేదు అన్న బాధతోను గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. వీళ్ళందరినీ ఓదార్చుకుంటూ పోతే ఇక జగన్ మా జిల్లా దాటలేడు. ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో !!!!!!!!!!!!!!.

అసలు జగన్ ఒదార్చాల్సిన కుటుంబాలు ఉన్న గ్రామాలు కాకుండా వేరే గ్రామాలలో పర్యటించడం లొ తన హిడెన్ ఎజెండా తేటతెల్లం అయింది. అందులో భాగంగా తమకు రెగ్యులర్ గా అలవాటు అయిన మరణాల ఫార్ములా ని మళ్లీ తెర మీదకి తెచ్చారు. జగన్ తమ గ్రామానికి రాడేమో అన్న బెంగతో ఒకాయన మరణించడంతో మొదలైన కామెడీ అప్రతిహతంగా కొనసాగుతుంది. నిన్నటికి నిన్న జగన్ మా గ్రామానికి రాకపోతే కనీసం 20 దాకా చచ్చిపోతాం అని సాక్షి లొ ఒక యువకుడు రెచ్చిపోయాడు. తాజాగా ఈ రోజు తమ గ్రామంలో వైఎస్ విగ్రహం పెట్టరేమో అన్న బాధతో ఒక వీరాభిమాని మరణించడంతో కామెడీ తారా స్థాయికి చేరింది. నేను మరణించిన వ్యక్తిని ఇక్కడ అపహాస్యం చేయడం లేదు . సహజ మరణాలని తమకు అనుకూలమైన కారణాలకు మలుచుకుంటున్న పార్టీలు రేపు అవసరమైతే జనాన్ని చంపి తమ అవసరాలకి వాడుకునే దిశగా అడుగులు వేయకముందే ఈ కామెడీ మరణాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది . ముఖ్యంగా జగన్ ఇప్పటికే ఈ చావుల వ్యవహారం లొ పలుచన అవుతున్నాడు. ఇంకా జనాల్లో చులకన కాకుండా ఉండాలంటే ఈ హత్యల సంస్క్రుతి కి జగన్ చరమ గీతం పాడాల్సిందే .

9/13/10

రాజేష్ --- ఫైనాన్స్ మేనేజ్మెంట్

ఒకసారి రాజేష్ కి బాగా ఆకలిగా ఉంది . ఎదురుగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్  లొ భోజనం చేయాలనీ కోరికగా ఉంది కానీ తన వద్ద  వంద రూపాయలే ఉన్నాయి. యెలా యెలా అనుకుంటుండగా రాజేష్ కి ఒక మెరుపులాంటి ఐడియా తట్టింది. వెంటనే హోటల్ కి వెళ్లాడు కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాడు . బాగా మెక్కిన తర్వాత బిల్ చూస్తే రెండు వేలు అయి ఉంది.   అప్పుడు బేరర్ తో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు రాజేష్.  వెంటనే హోటల్ మేనేజర్ పోలీసులని పిలిచి రాజేష్ ని వాళ్లకి అప్పగించాడు. పోలీసులు రాజేష్ ని తీసుకెళ్ళారు.

తన వద్ద ఉన్న  ఆ వంద పోలీసులకి లంచంగా ఇచ్చి ఖుషీగా వెళ్ళిపోయాడు రాజేష్ .

9/9/10

దొంగ నా కొడుకు ఫైన్ వేసాడన్నా..

"దొంగనాకొడుకు రెండు వందలు దొబ్బాడు .. ఈడెమ్మ .. చి ... అనవసరంగా పోయి వాడి చేతిలో పడ్డాను" అంటూ తెగ అరుస్తున్నాడు నాగి అనబడే మా ఆస్థాన మెకానిక్ నాగేశ్వరరావు. "ఏమైంది నాగి" అన్నాను . "కొత్త ట్రాఫిక్ ఎస్సై అంట అన్నా నా కొడుకు నేను ఫోన్ మాట్లాడట బండి మీద పోతా ఉన్నా రోడ్డు పక్కన వాడు ఉన్నాడు గావాల నేను చూసుకోలా ఆపి రెండు వందలు ఫైన్ వేసాడు " అంటూ తన బాధ మొత్తం చెప్పాడు నాగి. " అదేంది నాగి ఆలా అంటావ్ మరి నువ్వు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం తప్పు కదా" నా మాట సగం లో ఉండగానే అక్కడ ఉన్న మరో ముగ్గురు నాతో వాదనకి దిగారు. " ఏందన్న తప్పు , మొన్న నన్ను ఆపి లైసెన్స్ అడిగాడు లేదు అని చెప్పా , ఇంటికెళ్ళితెమ్మన్నాడు .. లేదు అని చెప్పా నాలుగువందలు ఫైన్ రాసి .. స్టేషన్ కి వచ్చి బండి తీసుకెళ్ళమన్నాడు అన్నా" అన్నాడు ఇంకొకడు. " అదేన్దయ్యా మీరు చేసింది తప్పు అతను చేసింది కరక్ట్ " అని నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినే నాధుడు లేడు. పైగా నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూడడం మొదలెట్టారు. ఆ రోజు మొదలు ఆ ఎస్సై గురించి నేను రోజు ఎక్కడో దగ్గిర తిట్లు వినే వాడిని . అతను చేసిన పనల్లా తన డ్యూటి తను చెయ్యడమే. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ ఎస్పి కారు కి పేపర్లు లేవన్న కారణం చేత పదివేలు ఫైన్ వేసిన ఘనుడు. కొందరు ప్రజాప్రతినిధులు ఒక ఫంక్షన్ కి వచ్చి రోడ్డుకి అడ్డంగా బండ్లు పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన కారణం చేత బండి తీయమంటే .... డ్రైవర్లు పెడసరంగా సమాధానం ఇవ్వడంతో ఆ కార్లకి గాలి తీసి ఎమ్యెల్యే , మునిసిపల్ చైర్మన్ లని రోడ్డు మీద నిలబెట్టిన చరిత్ర ఉంది అతనికి. అయితే తన డ్యూటి తను చేయడం వల్ల అతని కింది ఉద్యోగస్తులు అతను హెరాస్ చేస్తున్నాడు అని తిట్టేవారు. అంటే మనం ఎలా వెళ్ళినా , ఏం చేసినా పర్లేదు పోలీసులు పట్టుకోకూడదు ఫైన్ వెయ్యకూడదు అన్న భావన చాలా శాతం ప్రజల్లో ఉంది నాకు తెల్సి. ఇలాంటి ప్రజలకి మళ్లా అవినీతి అధికారులని ప్రశ్నించే హక్కు ఎక్కడి నుండి వస్తుంది.

మరొక కేసులో జరిగిన ఇంకొక తమాషా చూద్దాం. మా ఇల్లు ఇండేన్ గ్యాస్ ఆఫీస్ కి దగ్గర లో ఉంది. ఒకరోజు ఉదయాన్నేఒక పెద్ద మనిషి బండ బూతులు తిడుతున్నాడు ఆ గ్యాస్ కంపెనీ ముందు. "ఏంటయ్యా నీ గోల " అంటే "రేషన్ కార్డ్ లో గ్యాస్ నెంబర్ లేకపోతే గ్యాస్ ఇవ్వరంట సార్" అని ఆవేశంగా అడుగుతున్నాడు. "మరి నిజమే కదయ్యా రేషన్ కార్డ్ లో గ్యాస్ నెంబర్ చేర్పించుకోవాలి కదా ఎందుకు చేర్పించుకోలేదు" అని అడిగితే నీళ్ళు నమిలి "అప్పుడేదో ఆలా అయిపొయింది సార్ కానీ ఇపుకు కొత్త జాయింట్ కలెక్టర్ ఈ రూలు పెట్టడం తప్పు సార్ "అన్నాడు. అతనొక్కడే కాదు గంట గడిచే సరికి ఆ గ్యాస్ ఆఫీస్ డివిజన్ కింద ఉండే ఖాతా దారుల్లో తొంబై శాతం మంది అక్కడికి చేరి గొడవ మొదలు పెట్టారు. కారణం వారు ఎవరూ రేషన్ కార్డ్ లో తమకు గ్యాస్ ఉంది చెప్పకుండా...... కిరోసిన్ కూపన్లు పొంది , రేషన్ షాపు లో కిరోసిన్ చవగ్గా కొట్టేసి అధిక ధరకు పక్కన అమ్ముకోవడం మరిగారు . అందరూ మద్య తరగతి ప్రజలే . తాము చేసింది తప్పు అని ఒప్పుకోకుండా గొడవకి దిగి చివరికి ఆ రూల్ తీసిన్దాకా గొడవ చేశారు అంటే జనాలు ఏ స్థాయి లో ఉన్నారు?

మరొక చోట తనకి వికలాంగ పించన్ అపేసినందుకు అధికారులని బండబూతులు తిడతాడు ఏ రకమైన అంగ వైకల్యమూ లేని ఒక చవట. గవర్నమెంటు వారు విద్యార్ధులకి స్కాలర్ షిప్ ఇస్తున్నారు అని తెల్సి అప్లికేషన్ లో తన సంవత్సర ఆదాయం 24000/- గా నమోదు చేయించిన ఒక పల్సర్ 220 మీద రేబాన్ గ్లాసులు పెట్టి తిరిగే ఇంకొక చదువుకున్న దద్దమ్మ ని చూస్తె అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది.


అవినీతి కేవలం రాజకీయ నాయకుల దగ్గరే ఉందా , అధికారులు ఉద్యోగుల దగ్గరే ఉందా ??? జనం లో లేదా?

మీకు ఒక కొస మెరుపు చెప్పనా .... అప్పటిదాకా గాలికి తిరిగిన ఒక మిత్రుడు లేటు వయసులో "లా" చదవడం మొదలెట్టాడు. ఎందుకు అన్నా ఇప్పుడు నీకీ అవస్థ అంటే ?? లేదురా చదివితే రేపు ఎవడు ఇల్లు కట్టుకుంటున్నా ఏదో ఒక క్లాజ్ పెట్టి కేసు వేసి నోటీస్ ఇవ్వచ్చు , వాడు ప్రైవేట్ సెటిల్ మెంట్ కి వచ్చి ఎంతోకంత ముట్ట చెబుతాడు ఆలా సంపాదించుకోవచ్చు .. అసలు ఒక సినిమా మీద గోల చెయ్యొచ్చు .... ఒక పుస్తకం రాసిన వాడి మీద కేసు పెట్టొచ్చు ... అసలేమీ సంబంధం లేకుండా నీ స్థలం లోకి నిను అడుగు పెట్టనీకుండా అపెయోచ్చు ఇలా ఎన్ని చేయోచ్చ్చో అని ఆవేశంగా ఆనందంగా చెబుతున్న ఆ మిత్రుడి మొహం లో నాకు భస్మాసురుడు కనిపించాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదేమో!

9/8/10

హిడెన్ కెమెరాల విషయం లో దొంగలు పడ్డ ఆరేళ్లకు టీవీ 9 మొరిగినా ......................

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగితే ....అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోయి ఉంటుంది . అలాగే హిడెన్ కెమెరాల విషయం లో టీవీ 9 ప్రసారం చేసిన కధనాలు చాలామందికి భయాన్ని కలిగించినా ఈ హిడెన్ కెమెరాల సంస్కృతి ప్రస్తుతం గ్రామాలకి సైతం పాకి పోయింది. ఒకప్పుడు ఆరుబయట స్త్రీ తన బిడ్డకి పాలిస్తుంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళేవారట. మారుతున్న విలువల వల్ల ఇంతకు ముందు ఆడకూతురు ఇంట్లోనుండి బయటికి వస్తే ... తిరిగి ఇల్లు చేరే లోపు తన శరీరాన్ని గుచ్చి గుచ్చి చూసే అనేక వందల కళ్ళ మద్య లోనుండి నడవాలి అన్నది జగద్విఖితం. అయితే పదునాలుగేళ్ళ వయసు నుండి ఆ చూపులకి అలవాటు పడి మొదట్లో కాస్త ఇబ్బంది పడినా .........తర్వాత తర్వాత ఒకరకంగా ఆ చూపులను పట్టించుకోని విధంగా బండబారి పోయి ఉంటారు అమ్మాయిలు. అయితే ఆ కళ్ళ సరసన ఇపుడు మరో కన్ను వచ్చి చేరింది . అది చూడడమే కాదు చూసిన దాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అదే కెమేరా కన్ను.

కూర్చునప్పుడో , ఒంగినప్పుడో వస్త్రం కొద్దిగా పక్కకి జరిగితే చాలు అది కెమేరా కంట్లో పడిపోతుంది. కాలేజీలలో అమ్మాయిల టాయిలెట్లు , చెంజింగ్ రూమ్స్ , ట్రయల్ రూమ్స్ , ఇలా ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి షూట్ చేసి , వాటిని నెట్ లోకి ఎక్కించి అందరికీ చూపించి మజా చేసుకుంటున్న యువత ఒకటి మర్చిపోతుంది............రేపు అదే పరిస్థితిలో వారి అక్కో చెల్లో ఉంటే ?????????????? అపుడు పగిలే వాడి గుండె కి బాద్యులు ఎవరు. వాడి సంస్కృతి చేజేతులా నాశనం చేసుకున్న తర్వాత వాడు ఎంత ఏడిస్తే మటుకు ఎం లాభం. త్రిష లాంటి ఒక హీరోయిన్ స్నానం చేస్తున్న దృశ్యాలు ఎవరో చిత్రీకరిస్తే దాన్ని గంటలో ఒకటికి ఇరవై సార్లు తిప్పి తిప్పి ప్రసారం చేసిన టీవీ 9 ఈ రోజు పత్తిత్తు అయింది. tv9 సంగతి మనకి అనవసరం . ప్రస్తుతం మనకి కావాల్సింది మారుతున్న విలువల వల్ల మన తర్వాతి తరానికి కలిగే నష్టాలు బేరీజు వేసుకోవడం.

ముందుగా మేల్కోవడం మనకి కావాలి , ఎంత సేపు చరిత్ర గురించి పేరాలు పేరాలు రాసుకోవడం , ఇదేదో మనకి అర్ధం కాని గొడవ అని యువతరం పెడచెవిన పెట్టడం ....ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ఎవడో మాక్స్ ముల్లర్ ఏదో రాశాడు , ఎవడో డల్హౌసీ మన సంస్కృతి మూలాలు కత్తిరించేందుకు శతాబ్దం క్రిందటే ప్రణాళిక రచించాడు అని అనుకోవడం తప్ప ... సంస్కృతి , విలువలు అనే భావన నుండి నేటి యువతరం చాలా దూరం వెళ్లి చాలా ఏళ్ళు అయింది అన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు.

చీప్ గా కెమేరా ఉన్న ఫోన్ దొరికింది కదా అని అమ్మాయిల ప్రైవేట్ జీవితాలలోకి తొంగి చూసే యువత ఈ పెడ సంస్కృతి పెచ్చుమీరి రేపు ఎవడో తన భార్య తన కూతురు ని ఇలాగే చిత్రీకరించే అవకాశం ఉంది తను ఆవిధమైన అలవాట్లకి తనే వారధిగా మారబోతున్నాడు అన్న విషయం గుర్తించడం లేదు. మద్య వయసు మనుషులు కూడా రేపు ఇదే ప్లేస్ లో నా బిడ్డ ఉంటే ఏమవుతుంది అన్న ఆలోచనే లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరకు నగరాలలో ఆడవాళ్ళ మూత్రవిసర్జన శాలల్లో సైతం కెమేరా పెట్టేంత దారుణమైన స్థాయికి చేరుకున్నారు అంటే మనం ఎంత దిగజరిపోయాం అన్నది అర్ధం అవుతుంది.

దీనికి పరిష్కారం గా ప్రస్తుత తరం ఏమి చేయాలి అన్నది చర్చిద్దాం . అసలు మనది ఒక సంస్కృతే కాదు, ఆడవాళ్ళని గౌరవించండి అని చెప్పిన ఆర్యులు అసలు మనవాళ్ళు కాదు అని చెప్పే వాళ్ళని చూసి మనసులో తిట్టుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేమా? యెంత సేపు విద్యావ్యవస్థ లో మార్పు కోసం యత్నించడం కాకుండా మన వంతుగా మన చుట్టూ ఉన్న పిల్లలకి విలువలు నేర్పించడం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు అన్న మాట పిల్లల మెదళ్ళలోకి ఎక్కేలా చెప్పడం ముఖ్యమైనది అని నా అభిప్రాయం. మన సంస్కృతి ఎలా నాశనం అయింది అన్న విషయాన్ని వారికీ విసుగు పుట్టని విధంగా తెలియచేసి .. ఒకనాటి మన వైభవాన్ని తిరిగి తెచ్చే బాధ్యత వారిమీదే ఉంది అన్నంతగా వారిని ప్రభావితం చేయడం అత్యవసరం. ఇది వందేళ్ళ పోరాటం. ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఏ ప్రభుత్వం మీదో, ఏ వ్యవస్థ మీదో ఆధారపడక మంచిని కాంక్షించే ప్రతి మనిషి తన బాధ్యతగా దీన్ని గుర్తించి ఇప్పటినుండే అమలు పరచాల్సిన విషయం. ఇది మారాల్సిన సమయం ... ఇపుడైనా మనం మేల్కొకపోతే ... ఇప్పుడు రామాయణ మహాభారతాల మీద........ అవి నిజమా కాదా అని జరుగుతున్న చర్చలానే కొన్నేళ్ళ భూమిమీద స్వార్ధం లేని మనుషులు ఉండేవారట అప్పట్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారట , స్త్రీలని గౌరవించేవారట , అసలు పెళ్లి అనే పద్ధతి ఉండేదట అనే అంశాల మీద భిన్న వాదోపవాదాలు నడిచే రోజు వస్తుంది.

ఇబ్బంది అనుకోకుండా ఒక్కసారి ఈ వీడియో చూశాక నేటి మెజారిటీ యువత ప్రస్తుత గురించి స్ప్రష్టమైన అవగాహన
వస్తుంది . ఆ వీడియోలో అంత అసభ్యత ఉండదు . ఒక మంచి మెసేజ్ ఇస్తుంది

9/7/10

అదే కారణం

ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. వారి అన్యోన్య దాంపత్యం లోకి బి.పి. అనే రోగం ప్రవేశించింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ భర్త డాక్టర్ ని సంప్రదిస్తే ... పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి హై బి.పి ఉన్న కారణంగా ఆహార నీయమాలు పాటించాలని, ఉప్పు అసలు వాడకూడదు అని చెప్పాడు. అ రోజు నుండి అతని భార్య ఎంతో ప్రేమగా అతనికి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ , అతనికి కావాల్సిన విధంగా ఉప్పు లేకుండా వంట చేస్తూ ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఒకనాటి ఉదయాన్నే అతను బాత్ రూం లో అచేతనంగా పడి ఉన్నాడు . హుటా హుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ ..... హై బిపి వలన అతను ఆలా పడిపోయాడని చెప్పారు . రెగ్యులర్ గా మందులు వాడుతున్నా , ఆహార నీయమాలు పాటిస్తున్నా అతనికి అంత ఉదయాన్నే అంత బి.పి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. చాలా పరిశోధనల తర్వాత డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



వాళ్ళ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందిgelakguling

9/6/10

రాజేష్ రిటర్న్స్

అవి మేము ఇంటర్ చదివే రోజులు. మాది లాస్ట్ బెంచ్ బ్యాచ్. ఆ రోజుల్లోనే రాజేష్ ఒకమ్మాయిని ప్రేమించాడు... అదీ చాలా ఘాడంగా! అయితే ఆ పిల్లకి ఆ విషయం చెప్పడానికి ఆడికి భయం. సరిగ్గా అదే సమయంలో ఫరూక్ ఒక కత్తి లాంటి ఐడియా రాజేష్ కి ఇచ్చాడు. అదేంటంటే తన ప్రేమనంతా పేపర్ మీద పెట్టి ఆమెకి ఇవ్వమని. సరే అని చెప్పి వెళ్ళిన రాజేష్ రెండు రోజులకి ఫరూక్ దగ్గరకి వచ్చి ప్రేమని పేపర్ మీద పెట్టడం ఎలా అని ఎర్రి మొహం ఏసుకుని అడిగాడు. "చెత్తనాయాలా, చెత్తనాయాలా, చెత్తనాయాలా ( ఇక్కడ మూడు మొట్టికాయలు) ప్రేమని పేపర్ మీద పెట్టడం అంటే లవ్ లెటర్ రాయమని అర్ధం రా అని రాజేష్ కి అర్ధమయ్యేలా చెప్పాడు ఫరూక్. ప్రపంచం లో ఎవడూ రాయలేనన్ని తప్పులని ఆ లవ్ లెటర్ లో పొందు పరుస్తూ రాసిన రాజేష్ ఆ లెటర్ ని ఆ పిల్ల నోట్ నోట్ బుక్ లో ఫరూక్ సాయంతో పెట్టేశాడు. తన జీవితం లో అంత దారుణమైన ప్రేమలేఖ అంత చిన్న వయసులో చదవాల్సివస్తుంది అని కలలోనైనా ఊహించని ఆ అమ్మాయి ఆ లెటర్ ని ప్రిన్సిపాల్ కి అందచేసింది. మనోడు అ లెటర్ కింద సంతకం పెట్టి రోల్ నంబర్ కూడ వేసేశాడని వేరే చెప్పనవసరం లేదనుకుంటా .

ఆగ్రహించిన ప్రిన్సి మనోడిని ఆ పిల్ల ముందే సావగొట్టడంతోబాటు మూడు వారాల పాటు సస్పెండ్ కూడా చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు చూడడానికే భయపడిన రాజేష్ ని చూసి జాలి పడిన అమ్మాయి కొన్నాళ్ళకి రాజేష్ ని ప్రేమించి ఆ ప్రేమని పేపర్ మీద పెట్టి రాజేష్ బుక్కు లో పెట్టింది. కానీ రాజేష్ ఆ రెండేళ్లలో ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వలేదు కనీసం కన్నెత్తి చూడలేదు. కారణం
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

మనోడు అసలు పుస్తకం తెరిచిన పాపాన పోలేదు కాబట్టి.

9/3/10

టీవీ --> 9.1 క్రైం వాచ్ - కొన్ని కామెడీ సత్యాలు

ఇది చివరిదాకా చూసి ఒక్కసారి కూడా నవ్వకపోతే డాక్టర్ ని కలవాల్సిందే మరి

8/28/10

విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలన్న కెసిఆర్ - ప్రొఫెసర్లను తరిమి కొట్టిన విద్యార్ధులు



పై ఇమేజ్ చూశారుగా తెలంగాణా ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కె . చంద్రశేఖర రావు చెబుతూ ఉండగానే ఉస్మానియా  లో బి.ఇడి. స్పాట్ వాల్యూయేషన్‌లో సీమాంధ్ర అధ్యాపకులనుతెలంగాణా విద్యార్ధులు తరిమి తరిమి కొట్టారు. 

8/18/10

వి కాంట్ పీక్ ఎనీ థింగ్

కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు నా అసహాయతకు నవ్వుకుంటూ నేను అనుకునే మాట .... వి కాంట్ పీక్ ఎనీ థింగ్ ( మనమేం పీకలేం) మచ్చుకి కొన్ని చూద్దాం.

1. అసలే బోరు కొడుతుంది .... ఆ పైగా అరగంట నుండి కాలుతున్న టార్టాయిస్ కాయిల్ చుట్టూ సరదాగా తిరుగుతూ మధ్యమధ్యలో వచ్చి కుడుతున్న దోమల్ని చూసినప్పుడు.

2. అసలే కోతి ఆ పై కల్లు తాగిన చందాన వ్రాతలు మాని వీడియో మేకింగ్ కి తన మేధస్సుని కారాగార శర్మ ధారపోస్తున్నప్పుడు.

3. ఒకరోజు టీవీ చూస్తుండగా వచ్చిన మా రాజేష్ గాడు ...టీవీ లో వస్తున్న పాట సినిమాలో మొదటి భాగం క్రూరంగా ప్రవర్తించిన పాత్ర రెండవ భాగానికి వచ్చేసరికి రియలైజ్ అయ్యి ఏడ్చేటప్పుడు " ఏంట్రా వీదిప్పుడు పశ్చాతాప్తం తో రగిలి పోతున్నాడా ?" అన్నప్పుడు .... పశ్చాతాప్తం తో ఎవడూ రగలడు రా కుములుతాడు ఎదవ.... ఎదవ ...ఎదవ ..... అని పీకుదాం అనుకుని కూడా పక్కన చుట్టాలు ఉండడం వల్ల పీకలేనప్పుడు.

4. RESUME లో మనోడు కెరిర్ ఆబ్జెక్టివ్ లో Seeking a position as a leader where i can entertaining fellow employees." అని రాసి hobbies దగ్గర "sleeping, eating, partying అని రాసినప్పుడు.


వి కాంట్ పీక్ అనీ థింగ్.

సరదాగా ఏదో రాశా నా బ్లాగుకి నేనే సుమన్ , ప్రభాకర్ కాబట్టి :))

8/15/10

రాజేష్ మళ్లీ వస్తున్నాడోహో

ప్రియమైన పాఠకులకు చెప్పెచ్చేదేంటంటే... మొదటి నుండి నా బ్లాగుపరిచయం ఉన్నవారికి మా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ ఈ మద్య కొత్తగా వచ్చిన కొందరు మిత్రులకి మాత్రం పరిచయం చేసి తీరాలి ఎందుకంటే రాజేష్ ఇకముందు కొన్నాళ్ళు నా బ్లాగు నిండా పాకబోతున్నాడు. రాజేష్ పరిచయం లేని వాళ్ళు ఒక్కసారి ఈ క్రింది టపాలు చదివి రండి.

రాజేష్ --- ఓ మంచి మిత్రమార్కుడు

రాజేష్ ప్రేమ కధ

నీ పేరు రాజేషా!!?

బ్లాగ్కర్ణుడు వీడికి బ్లాగు లేదు

రాజేష్ రియాలిటీ షో

కధ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా

పై టపాలు చదివిన తర్వాత ..మీకు రాజేష్ గురించి బాగా అర్ధం అవుతుంది. తర్వాత నుండి మరిన్ని రాజేష్ కబుర్లు మనం చెప్పుకుందాం.

8/13/10

ఆమె - నేను - కేరళ

టపా శీర్షిక చూసి పక్కా రొమాంటిక్ లేదా కామెడీ అనుకోకండి ఇందులోకూడా కాసింత విషాదం ఉంది. అయితే జీవితం లో మొదటి నన్ను నేనే థు నా మొహం మీద చీమ చీమిడెయ్య అని తిట్టుకున్న సందర్భం ఇదే. ఇది పన్నెండేళ్ళ క్రితం స్టోరీ. అప్పట్లో మేము రోజు ఒంగోలు లో ఒక ఏరియాలో ఉన్న ఒక నర్సింగ్ హాస్టల్ పక్కనే ఉన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆ హాస్టల్ గోడ ఆనుకునే గ్రౌండ్ ఉండేది. ఆ హాస్టల్ లో ఉండే కేరళ అమ్మాయిలు మొదట్లో ఫోజు కొట్టినా పోను పోను మా ఆట చూడ్డానికి గోడ ఎక్కి కూర్చునేవారు. అయితే మా పిల్ల బ్యాచ్ లో కూడ ఎవరూ వాళ్ళని కదిలించ లేదు అనుకోండి ( అప్పుడు అంత ధైర్యం కూడా లేదు). అయితే మాకంటే ఒక నాలుగేళ్ళ పెద్ద బ్యాచ్ అయిన కన్నా అండ్ కొ బ్యాచ్ మాత్రం ఆ గ్రౌండ్ మద్య లో ఉన్న రాళ్ళ మీద కూర్చుని వాళ్లకి లైన్ వేసే వాళ్ళు. మద్య మద్య లో వచ్చి మా దగ్గర బలవంతంగా బ్యాట్ లాక్కుని ఆడేవాళ్ళు కూడా. అయితే ఎప్పుడు ఏ గొడవ జరగలేదు. పోను పోను ఆ పెద్ద బ్యాచ్ లోకి కొత్త మొహాలు రావడం స్టార్ట్ అయింది. వేరే వేరే గల్లీల వాళ్ళు, కన్నా కి పరిచయం ఉన్న వాళ్ళు రావడం మొదలైంది. ఎవడో కోతి కామెంట్లు చేయడం .. అమ్మయిలు గోడ ఎక్కడం మానుకోవడం అన్నీ చకా చకా జరిగిపోయింది. అయితే .. మేము గమనించిన అంశం ఏంటంటే .. వీళ్ళకి వాళ్లకి మద్య ఏదో నడిచింది.. మాకు అర్ధం అయ్యేది కాదు. అప్పుడప్పుడు కన్నా గాడి బ్యాచ్ ... అ నర్సులు ఉండే హాస్పిటల్ కి కూడా ఏదో వంకతో పోయి వచ్చేవారట. ఈ విషయం మా ఆస్థాన వికెట్ కీపర్ కర్ణ చెప్పాడు.

కొన్నాళ్ళు గడిచాయి ... ఒకరోజు కన్నా నన్ను వెతుకుతున్నాడు అని తెల్సి నేనే వాళ్ళ అడ్డాకి వెళ్లాను . కాసేపటికి కన్నడు వచ్చాడు. " ఏంటి కన్నా నా గురించి అడిగావంట" అన్నాను .. వీడెక్కడ అప్పు అడుగుతాడేమో అన్న భయంతో. " రేయ్ శీనుగా నువ్వు ఒక హెల్ప్ చేయాలిరా .దీనికి నువ్వు అయితేనే కరక్ట్ .... ఇంకెవారినీ నమ్మలేను " అన్నాడు దీనంగా. " ఏమైంది కన్నా " అన్నాను . డబ్బులు మాటర్ కాదని అర్ధం అయింది. "చెప్తా పద" అని నన్ను ఒక హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి చెప్పాడు " మా ఫ్రెండు దుర్గా గాడు తెల్సు కదరా వాడు .. ఆ నర్సింగ్ హాస్టల్ లో ఒక అమ్మాయిని పడేశాడు రా " అన్నాడు ... "ఓహో అయితే నేను ఇపుడు ఆ అమ్మాయికి లెటర్లు గట్రా అందివ్వాలా" అన్నాను. " కాదురా .. అ అమ్మాయి వాడికి పడింది ... ఇపుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ " అన్నాడు. ఒర్నీయయ్య ... మాకు తెలీకుండా ఎంత కత నడిపారురా అనుకుని .. "సరే ఇప్పుడేంటి మాటర్ "అన్నాను . ఏముంది నిన్న ఆ పిల్ల హాస్టల్ నుండి వచ్చేసి నా సంగతి తేల్చు అని మనోడిని నిలదీసింది. వీడు ఆపిల్లకి ఎం మాయ మాటలు చెప్పి తెచ్చాడో గానీ రాత్రి ఈ హాస్పిటల్ కి తెచ్చి అబార్షన్ చేయించాడు. తర్వాత అమ్మాయి నిద్రపోతుంది. ఆటైం లో మాఇంటికి వచ్చి .... మామా కొంప మునిగిందిరా ..... షీబా ప్రెగ్నెంట్ అయింది రా.. నేను అబార్షన్ చేయించాను ... అదేమో పెళ్లి చేసుకోమని దొబ్బుతుంది. మా ఇంట్లో చెప్తే చంపేస్తారు .. ఎలాగోలా కాపాడమని కాళ్ళు పట్టుకున్నాడు రా ... ఆ పిల్లని ఎలాగైనా కేరళా లో వదిలి రమ్మని చెప్పి జంప్ అయ్యడురా ఎటుపోయాడో తెలీదు .... ఇపుడు నాకేం అర్ధం కాడం లేదు" అన్నాడు .


ఒక్కసారిగా నాకు దిమ్మ తిరిగిబొమ్మ కనపడింది . "అబార్షన్ చేయించడం ఏంటి కన్నా తప్పు కదా" అన్నాను. దుర్గా గాడు కనిపిస్తే బహుశా కొట్టేవాడినేమో. సరే ఇంతకీ ఆ షీబా ఎవరో చూద్దామని లోపలి చూశా ... చాలా నీరసంగా మంచం మీద పడుకుని దీనంగా చూస్తుంది. నాకు చాలా బాదేసింది. ఏ తల్లి కన్నా బిడ్డో ఎందుకు ఈ పిల్లకి ఈకర్మ అనుకున్నా . లోపలోకి వెళ్లి ముందు అమ్మాయిని కేరళ వెళ్ళడానికి ఒప్పిద్దాం అన్నాడు. సరే పద అని లోపలికెళ్ళా.

దాదాపు అరగంట బతిమాలాక ఆమె ఒప్పుకుంది కానీ ... కన్నా వాళ్ళ చెల్లి పెళ్లి నాలుగు రోజుల్లో ఉంది .. కన్నాకి కుదరదు. మిగిలిన వాళ్ళకి చెబితే మొత్తం టాం టాం చేస్తారు కనుక ఆ పిల్లని కేరళ లో దింపే బాద్యత నా భుజాల మీద పెట్టాడు కన్నా. అప్పటి దాకా అటు విజయవాడ , ఇటు తిరపతి తప్ప దాటి పోనీ నేను కేరళ దాకా..... అదీ అమ్మాయిని తీసుకుని ... అని తలచుకుంటేనే ముందు భయం వేసింది. ఒక పక్క ఆపిల్లకేమో ఆరోగ్యం పూర్తిగా డామేజ్ అవుతుంది. పైగా బ్లీడింగ్ ఆగడం లేదు అని చాలా బాధగా చెప్పుకోలేక చెప్పుకుంది. నాకైతే కడుపులో దేవినట్టు అయింది. అప్పుడు సాయంత్రం ఐదు అయింది టైం .. ఎనిమిది గంటలకి శబరీ ఎక్స్ప్రెస్ ఉంది అన్నాడు కన్నా. డిస్చార్జి చేయించి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లాం ... కనిసం నేను ఇంట్లో కూడా చెప్పలేదు. టిక్కెట్లు కన్నా తీసుకొచ్చాడు . ట్రైన్ వచ్చింది. "రేయ్ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కండి ... నేను టిసి తో మాట్లాడి మీకు బెర్త్ ఆరెంజ్ చేస్తా" అని చెప్పి వెళ్లాడు కన్నా .. నేను జాగ్రత్తగా ఆమెని రైల్ ఎక్కించి ... బాత్రూం పక్కనే ఉన్న సీట్ లో అతన్ని బతిమాలి ఆమెని కూర్చోబెట్టా . ట్రైన్ కదిలింది. కన్నా అంతు పత్తా లేడు. ట్రైన్ ఊరు దాటింది. నా దగ్గర అసలు డబ్బులు లేవని అప్పుడు గుర్తు వచ్చింది. .. అమ్మాయి కడుపు నొప్పితో విల విల లాడుతుంది .... పక్కనే కింద సీట్లో జనాన్ని బతిమాలి .. పడుకోపెట్టా. జనాలు నా వైపు వింతగా చూస్తున్నారు. ఆడాళ్ళు అసహ్యంగా చూస్తున్నారు. బహుశా అమ్మాయి వాలకాన్ని బట్టి కేసు అర్ధమై అబార్షన్ చేయించింది నేనే అనుకుని ఉంటారు .

ఇక ఆరాత్రి అంతా .. అమ్మాయి బాత్రూం అన్నప్పుడల్లా తీసుకెళ్లడం .... మళ్లా తీసుకొచ్చి పడుకోబెట్టడం .... మద్య మద్యలో " విధి .. చాలా స్ట్రాంగు " అని బ్రహ్మానందం టైప్ లో వైరాగ్యంగా అనుకోవడంతో గడిచింది. ఆమె మాత్రం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాట్లాడేది. మర్నాడు మద్యాహ్నానికి కేరళ లోకి ట్రైన్ ఎంటర్ అవడం తోనే ఇక నేను ఎవరో తెలీనట్టు బిహేవ్ చేయడం మొదలెట్టింది. ట్రైన్ లో మలయాళీలు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు పెట్టినవి తిని కనీసం కావాలా అని కూడా అడగ లేదు . పోన్లే మళ్లా తెల్సిన వాళ్ళు ఉంటారు అని భయపడుతుంది ఏమో అనుకున్నా . అప్పటికి నేను తిని 24 గంటలు స్నానం చేసి 30 గంటలు అయింది. ఏర్నాకూలం చేరాం . అక్కడ ట్రైన్ దిగి ఆ మలయాళీలతో మాట్లాడుకుంటూ వెళ్లి అక్కడ ఏదో బస్సు ఎక్కి కూర్చుంది. ఒక థాంక్స్ కాదు కదా అసలు నా వైపు చూడను కూడా చూడలేదు. ఆ బస్సు కదిలి వెళ్ళిపాయింది. నా దగ్గర డబ్బులు లేవని అప్పుడు గుర్తు వచ్చింది. ఇక వెనక్కి ఎలా వచ్చానో ... ఇంట్లో ఎన్ని తిట్లు తిన్నానో .... హు థు నా మొహం మీద చీమ చీమిడెయ్య.

( ఇంతటితో ఈ తరహా విషాద ప్రేమ కధల సీరిస్ ముగిస్తూ ... ఇక నుండి కొన్నాళ్ళు కామెడీ టపాలు వేస్తా : )

8/12/10

ప్రేమే నేరమై - స్నేహం శాపమైతే !

ముందు మాట : ఇలాంటి యదార్ధ సంఘటనలను కధలుగా చెప్తే కొందరు అమాయకులైనా మోసపోకుండా ఉంటారేమో అనే ప్రయత్నమే తప్ప ఏ వర్గాన్ని కించపరచడానికి కాదని గమనించగలరు :)

అది ఒక మల్టీ నేషనల్ కంపెనీ. బి టెక్ పూర్తి చేయకముందే వచ్చిన ఉద్యోగాలు అవడంతో నూనుగు మీసాల కుర్రాళ్ళు .. ఉరకలేసే వయసు లో ఉండే అమ్మాయిలూ ఎక్కువగా ఉండేవారు. సాధారణం గానే ఒక సంవత్సరం లోపు కొన్ని ప్రేమ కధలు సఫలమై ఆ వెంటనే వివలమై ... మళ్లీ చేరొకరిని వెతుక్కోవడం లాంటి షరామామూలు గొడవల మద్య .. ప్రకాశం జిల్లా లో మారు మూల పల్లె నుండి చాలా కష్టపడి చదివి పైకి వచ్చి ఆకంపెనీలో ఉద్యోగం సంపాదించిన సుధాకర్ మాత్రం స్వచ్చమైన మనసుతో ఒక అమ్మాయిని ప్రేమించాడు. సుధాకర్ నేపధ్యం ఒకసారి పరిశీలిద్దాం. సుధాకర్ తండ్రిగారు , సుధాకర్ చిన్నతనం లోనే కాలం చేశారు. అతని అమ్మ గారు కూలి పనికి వెళ్తూ సుధాకర్ ని చదివించారు . సుధాకర్ కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాడు కానీ అప్పటికే అతని తల్లి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కానీ ఎదిగి వచ్చిన కొడుకుని చూసుకుని ఆమె మురిసిపోయేది.

అలాంటి సుధాకర్ జేవితంలోకి అనూహ్యంగా ప్రవేశించింది గీతిక . అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా కనపడే గీతికకి మొదట్లో తాగుడు , సిగరెట్ , ఫ్లర్టింగ్ వంటి అలవాట్లు లేని సుధాకర్ సకలగుణాభి రాముడు లాగానే కనిపించాడు. ముందు ఆమె ప్రపోస్ చేసింది. చిన్న తనం నుండి కష్టాల మద్య దిగువ మధ్యతరగతి మనుషుల మద్య పెరిగిన సుధాకర్ కి ఒక్క సారిగా అప్సరస లాంటి అమ్మాయి లభించడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆఫీసులో తన హితం కోరే కొందరు మిత్రులు వారిస్తున్నా వినలేదు .ఆమె అంటే వల్ల మాలిన ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే గుండె జబ్బు తో బాధ పడే తన తల్లి కి ఆపరేషన్ చేయించడం కూడా మరిచి గీతిక కోసం బ్యాంక్ లోన్ తీసుకుని ఒక ఫ్లాట్ కొన్నాడు.

కొన్నాళ్ళు పోయాక .. సాధారణ యువకుడు లా కనిపించే సుధాకర్ కన్నా పోష్ గా కనిపించే రాజేష్ ఆమె దృష్టిని ఆకర్షించాడు. ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ .. A జోక్స్ కట్ చేస్తూ తిరిగే రాజేష్ మీద గీతికకి క్రష్ ఏర్పడింది. సుధాకర్ తో ప్రేమ నటిస్తూనే రాజేష్ తో తిరగడం మొదలెట్టింది. పైగా రాజేష్ , సుధాకర్ కి అఫేసులో స్నేహితుడు కూడాను. సుధాకర్ కి ఏమో గీతిక అంటే అపారమైన నమ్మకం. సరిగ్గా అదే సమయంలో సుధాకర్ ఇంకా మరి నలుగురు ఉద్యోగులు కొరియా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో . సుధాకర్ స్థానే గీతిక ఇంకా రాజేష్ వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు వారు ఉండి పని చేయాల్సి ఉంది.

కొరియా వెళ్ళిన రోజు నుండి రాజేష్ గీతిక విచ్చలవిడిగా ఎంజాయి చేయడం మొదలు పెట్టారు. రాజేష్ పై పూర్తిగా మొహం పెంచుకున్న గీతిక తమ గది లో అతడు హిడెన్ కెమెరాలు ఫిక్స్ చేయడం గమనించలేదు. రాజేష్ ప్రతి రోజు తమ శృంగారాన్ని చిత్రీకరించి .. దాన్ని ఏంఏంఎస్ రూపం లో తన ఆఫీస్ కొలీగ్స్ అందరికీ పంపేవాడు. ఒక్క సుధాకర్ కి తప్ప. సుధాకర్ క్లోస్ ఫ్రెండ్స్ కి కూడా ఆ ఎంఎంఎస్ వెళ్ళింది. ఈ విషయం సుధాకర్ కి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్ధం కాక , అసలు చెప్పకపోవడమే మంచిది అని వదిలేశారు.

రెండు నెలల తర్వాత ఇండియా వచ్చిన రాజేష్ ...గీతికని తను ఏమేం చేసింది పెద్ద హీరోఇజం లా ఫీల్ అవుతూ చెప్పుకునే వాడు. కొన్నాళ్ళకి ఆఫీసు వ్యవహారానికి సంబంధించిన ఒక విషయం లో సుధాకర్ కి రాజేష్ కి మాటా మాట పెరిగింది .. వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత సంయమనం కోల్పోయిన రాజేష్ " నీ లవర్ పెద్ద పతివ్రత అనుకున్నావా ... అది నాతో ఎలా పడుకుందో చూడు" అని తన ఫోన్ తీసి అందులో ఎంఎంఎస్ లు సుధాకర్ కి చూపించాడు . అవి చూసి ఒక్కసారిగా కాళ్ళకింద భూమి కదిలినట్టైన సుధాకర్ మాట పలుకు లేకుండా అయిపోయాడు. స్నేహితులు ఎంతగా కదిలించినా అతనిలో మాట పలుకు లేదు .సాయంత్రం ఆఫీసు నుండి మౌనంగా వెళుతున్న సుధాకర్ ని చూసిన అతని స్నేహితుడు .. వీడిని ఇలా వదిల్తే ఎమైపోతాడో .. కాస్త బయటికి తీసుకెళ్దాం అని సుధాకర్ ని పిలుస్తూ బయటికి వచ్చాడు. అప్పటికే రోడ్డు దగ్గరికి వచ్చేసిన సుధాకర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నవ్వాడు .... తర్వాత అటు తిరిగి రోడ్డు మీద ఒక ఆల్విన్ నిసాన్ వ్యాను వేగంగా రావడం చూసి అది దగ్గరికి రాగానే రోడ్డు మీదకి దూకాడు . ఒక్క క్షణం లో సుధాకర్ ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. అనుకోని పరిణామానికి ఆశ్చర్యపోయిన అతని మిత్రులు తేరుకుని ఇక జరగాల్సిన కార్యక్రమం చూశారు. సుధాకర్ మరణించిన ఒక నెల లోపు అతని తల్లి మరణించింది. కొన్నాళ్ళకి ఆర్ధిక మాంద్యం పుణ్యమాని అందరి ఉద్యోగాలు ఊడాయి.గీతికకి సుధాకర్ కొనిచ్చిన ఫ్లాటుని వాయిదాలు కట్టలేక పోవడంతో బ్యాంకు వారు రికవరీ చేశారు.

సుధాకర్ మరణానికి కారకుడిని అయ్యాను అన్న దిగులుతోనూ , ఇటు ఉద్యోగం ఊడిన బాధతో ఉన్నరాజేష్ కి ... ఏంఏంఎస్ వ్యవహారం బయటికి పొక్కడంతో .. అందరూ పురుగుని చూసినట్టు చూస్తుండడంతో .. బిక్క చచ్చిపోయి ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. మరో పక్క గీతిక ఉద్యోగం పోయాక ... తల్లిదండ్రులు చూసిన ఒక సంభందం చేసుకుంది. ఆమె దురదృష్టవశాత్తు పెళ్లి అయిన కొన్నాళ్ళకి అతనికి ఆ ఎంఎంఎస్ వ్యవహారం తెల్సింది. ఇక ఆమెకి నిత్యం నరకం చూపించసాగాడు అ మొగుడు. రెండు సార్లు ఆత్మహత్యా యత్నం చేసినా .. మృత్యువు కూడా ఆమెని అసహ్యించుకుంది. ప్రస్తుతం క్షణమొక గండంగా గీతిక బతుకు ఈడుస్తుంది. స్వయంకృతం మరి.

ఈ యదార్ధ గాధలో నీతి .. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా !!!!!!!!!!!

8/11/10

మాళవిక కత కమామిషు

నా గత టపాలో మాళవిక కి నాకు జరిగిన పరిచయం వగైరా వగైరా వివరాలు చెప్పాను ....ఇక అసలు కధలోకి మనం ఇప్పుడే ఎంటర్ అవబోతున్నాం.

ఆ తర్వాత మాళవిక చాలా మందితో ఏక కాలం లో చాటింగ్ చేసి బకారాలు చేసిందని ... అవతల వాళ్ళకి అన్నీ అబద్దాలు చెప్పి .... ఒక చక్కని వ్యక్తిత్వం , అభిరుచి , భావాలు ఉన్న అమ్మాయి అనే అభిప్రాయం కలగచేసి ... తీరా వారు ప్రపోస్ చేసే సమయానికి వాళ్ళకి అల్విదా ( గుడ్ బై ) చెప్పాడం వంటి అనేక పనులు చేసింది అని ... అలాగే ఒకరి దగ్గర మాటలు ఇంకొకరి దగ్గర చెప్పి తగాదాలు కూడా పెట్టేది అని తెల్సింది. చాలామంది సున్నిత మనస్కులు ఆవిడ వల్ల హార్ట్ అయ్యారు అని కూడా కధనాలు ఉన్నాయి. ఆవిడ ఆడిన గేం లో పడనీ అతి కొద్ది మంది కంత్రి లలో నేను కూడా ఒకడిని అనమాట. అయితే ఇవన్నీ నిజాలు అయి ఉండవచ్చు లేక కధనాలు అయి ఉండవచ్చు . అయితే నా పాత మిత్రుడు ఒకాయన ఈ మద్య మళ్లీ కలవడంతో మాళవిక టాపిక్ మరో సారి తెర మీదకి వచ్చింది. అతను చెప్పిన విషయాన్ని మీకు చిన్ని కధ రూపం లో అందిస్తా.

ఆ అబ్బాయి వరుణ్ , చక్కగా చదువుకుని ఒక మంచి జాబ్ చేస్తూ ఖాళీ సమయాల్లో చాటింగ్ చేసుకునే యువకుడు. అయితే ఒక సారి రాత్రివేళ అతను అనుకోకుండా యాహూ చాట్ లోకి వెళ్ళినప్పుడు దరిద్రం లా తగిలింది మాళవిక. వరుణ్ చిన్నతనం నుండి కాస్త ట్రెడిషనల్ ఫ్యామిలీ లో పెరిగాడు. అమ్మయిలపట్ల చాలా మంచి అభిప్రాయం , అందులోనూ వాళ్ళల్లో మోసాలు చేసే వారు ఉంటారు అని గ్రహించలేని మనస్తత్వం. యధాప్రకారం మాళవిక తన భావుకత్వాన్ని బయటికి తీసింది. వరుణ్ మీద రోజు కొంచెం కొంచెం ఆ బావుకత్వ దాడి కొనసాగింది. వరుణ్ కూడా మాళవిక కోసం ఎప్పుడు చూసిన మెసెంజర్ లోనే కాలం గడిపే వాడు. ఇదే సమయం లో మాళవిక గోపీ అనే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక రియల్టర్ తో కూడా ఇదే వ్యవహారం నడిపింది ... అయితే వరుణ్ తో తనకి సాన్నిహిత్యం ఉన్నట్టు గోపీకి . గోపీ తో పరిచయం విషయం వరుణ్ కి చెప్పింది. వరుణ్ పెద్దగా పట్టించుకోకపోయినా గోపీ మాత్రం వరుణ్ మీద కసి పెంచుకున్నాడు.

మరోపక్క మాళవిక వరుణ్ కి సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెల్సుకుని అవన్నీ గోపీకి చేరవేసేసింది. ... కొంత కాలానికి మాళవిక వరుణ్ ల పరిచయం చాట్ విండో లోనుండి ... ఫోన్ సంభాషణల వరకు వెళ్ళింది. మాళవిక చెప్పే కబుర్లకు ముగ్ధుడైన వరుణ్ ఒక అశుభ ముహుర్తాన మాళవిక కి ప్రపోస్ చేశేశాడు. వాస్తవానికి అప్పటికే పెళ్లి అయ్యి ఒక బాబు కూడా ఉన్న మాళవిక ఆ విషయాన్ని ఖండించకుండా ముందు మీరు ప్రస్తుతం చేసే జాబ్ కన్నా మంచి జాబ్ సంపాదించుకొండి తర్వాత చూద్దాం అని .....జ్యోతి లక్ష్మీ కనిపించీ కనిపించకుండా .. డాన్స్ చేసినట్టు అర్ధం అయ్యీ అవకుండా ఒక మాట చెప్పడంతో .. దాన్ని అర్ధాంగీకారంగా భావించిన వరుణ్ ఆమెకి తన గుండెలో గుడి కట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. వరుణ్ ఆమెకి తన ఫోటోలు పంపాడు కానీ మాళవిక తన ఫోటోలు పంపలేదు. పైగా రేపు నేను అందవికారంగా ఉంటే ఏం చేస్తావ్ అని అడుగుతూ వరుణ్ లో లేని పోనీ ఆలోచనలు క్రియేట్ చేసింది.

ఇందులో కీలక మలుపేంటి అంటే జరిగే ప్రతి విషయాన్నీ గోపీతో పంచుకోవడం. మాళవిక ని మాటల్లో పెట్టి వరుణ్ కి సంబంధించిన అన్ని వివరాలు సేకరించిన గోపీ ఇంక వరుణ్ మీద ఎటాక్ మొదలెట్టాడు. మాళవిక వరుణ్ ఇంటి నంబరు కూడా గోపీకి చేరవేయడంతో ఏకంగా ఇంటికే ఫోన్ చేసి మీ వాడిని ఇవాళ గంట లో లేపేస్తా అని అతని తల్లిదండ్రులను బెదిరించడం మొదలెట్టాడు. ఒక్కొక సారి అర్ధరాత్రి ఫోన్ చేసి తెల్లవారే లోపు మే ఇంట్లో బాంబ్ పేలుతుంది అని చెప్పేవాడట. ఆ పేరెంట్స్ ఎంతగా భయపడ్డారు అంటే ఫోన్ మోగితే ఉలిక్కిపడే స్థాయికి వచ్చేశారు .. ఎవడు చేస్తున్నాడో తెలీదు ... ఎందుకు లేపేస్తా అంటున్నాడో తెలీదు.... నువ్వు ఏమీ చేయకపోతే వాడెవడో ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు అని రోజు ఇంట్లో గొడవ పెట్టుకునే తన అన్న కి ఎం సమాధానం ఇవ్వాలో వరుణ్ కి అర్ధం అయ్యేది కాదు. వరుణ్ ఈ అయోమయం లో ఉండగానే.. వరుణ్ ఫ్యామిలీని తను రోజూ ఎలా బెదిరించేది గోపీ మాళవికకి రోజూ చెప్పి నవ్వించేవాడట.

వరుణ్ కి డైరక్ట్ ఎటాక్ ఇచ్చి చావగొట్టి మాళవికతో మాట్లాడడం ఆపమని వార్నింగ్ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్న గోపీకి ..... చాట్ మిత్రుల ద్వారా ఒక నిజం తెల్సింది. అదే మాళవిక అసలు జీవితం గురించి........ స్వతహాగా రియల్టర్ అవడం, పెద్ద సర్కిల్ అవడం వల్ల మాళవిక అసలు పేరు.. హైదరాబాద్ లో ఆమె అడ్రస్ వగైరా అన్నీ ఒక వారం లో కనిపెట్టేసిన గోపీ నిశ్చేస్టుడు అయ్యాడు. మూడు పదులు దాటిన వయసు ఉన్న మాళవిక .... పెళ్లి చేసుకుని ఒక బాబుకి తల్లి అయిన మాళవిక .. చెప్పిన మాటలు విని ఒక అమాయకుడిని ఆరు నెలల పాటు టార్చర్ చేశానే అని బాధపడ్డాడు. తర్వాత అలోచించి వరుణ్ కి ఫోన్ చేసి నింపాదిగా అన్ని వివరాలు చెప్పాడు ... మొదట బిత్తర పోయిన వరుణ్ చివరికి నిజం, తెల్సుకుని కుప్పకూలిపోయాడు. అసలే సున్నిత మనస్కుడు .,....ఇంత బాగా మాట్లాడుతూ తనకి సంబందించిన వివరాలన్నీ మరొకరికి ఎలా చేరవేయగాలిగింది .. .. ఇంత కర్కోటకురాలినా నేను ఇష్టపడింది ... అని మధనపడ్డాడు .... తనకి తెలీకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.... నిజమేంటో మాళవికనే అడిగి తెల్సుకుందాం అని అనుకున్నాడు .. కానీ అప్పటికే విషయం చూచాయగా తెల్సుకున్న ఆమె తన కాంటాక్ట్ డీటైల్స్ అన్నీ మార్చేసుకుంది.

ఇక పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఆఫీస్ కి కూడా సరిగ్గా వెళ్ళక పోవడంతో వరుణ్ ఉద్యోగం పోయింది. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటూ విపరీతంగా నిద్ర మాత్రలు మింగుతూ ... తిరుగుతున్న ఆ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు పడ్డ వేదన వర్ణనాతీతం. వరుణ్ పరిస్థితి సరిగా అర్ధం చేసుకోకుండా అతని అన్న చీటికి మాటికి గొడవ పెట్టుకోవడంతో ... ఒక రోజు ఆ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యి .. అన్నగారు అలిగి భార్యని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. కుటుంబం ముక్కలు అయింది. కొడుకు బాధ చూడలేక తల్లిదండ్రుల ఆరోగ్యాలు పాడు అయ్యాయి.
ఇటువంటి పరిస్థితి లోనే వరుణ్ ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు .... చాలా సేపు పిచ్చాపాటీ మాట్లాడిన తర్వాత అసలు విషయం చెప్పాడు .

"అసలు చాట్ లో ఇలాంటివి అన్నీ నమ్మకూడదు మాష్టారు ... అయినా మీరెలా నమ్మారు .. ఇంతకీ ఆ అమ్మాయి ఐడి చెప్పండి "అన్నాను .. మాళవిక ఐడి చెప్పాడు వరుణ్. నా యాహూ లో చెక్ చేశాను . మాళవిక ఐడి అని కన్ఫర్మ్ అయింది . మొదట మాళవిక మీద కోపం వచ్చింది... కానీ వరుణ్ పరిస్థితిలో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అర్ధం అయింది. అందుకే శంకర్ దాదా ఎంబిబిఎస్ లో .... చైలా చైలా సాంగ్ టైపు లో భగవద్గీత రేంజ్ లో ఒక రెండు గంటలు నాన్ స్టాప్ భోద చేశా ..... నేను ఊహించిన దానికంటే వరుణ్ లో చాలా మార్పు వచ్చింది. నా మాటలు ఎలా పని చేశాయో గాని .. " చీ అసలు ఇలాంటి దాని కోసమా నేను ఇలా అయిపోయింది .... మళ్లీ జాబ్ కొట్టి .. మంచి పోసిషన్ కి వచ్చి ...ఏదో ఒకరోజు అది నాకు కనిపించకపోదు అప్పుడు మంచి గుణపాఠం నేర్పిస్తా " అని చెప్పి వెళ్ళిన వరుణ్ ... అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నా.

8/6/10

కధ కాని కధ -- ఒక అమాయకుని మనో వ్యధ

" అబ్బా నాకైతే చక్కగా పెళ్లి చేసుకుని మా ఆయన్ని తీసుకుని మనుషులు ఎవరూ లేని చోట .. ఒక సెలయేటి ఒడ్డున చిన్న గుడిసె వేసుకుని ... అందులో రాత్రివేళ చిన్న గుడ్డి దీపం మాత్రమే ఉండేలా ఉండే చోట ఉండాలనీ , ఇంకా .....ఒక కుక్కి నులక మంచం మాత్రమే ఉండాలి మాకు. అప్పుడు మా ఆయన పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి కి వేడి వేడి అన్నం పెట్టి ఆ తర్వాత అయన నులక మంచం పై వెల్లికిలా పడుకుని ఉంటే .... ఆయన గుండెల మీద నేను తల పెట్టుకుని పడుకుని ఉంటే .. నా తలలోని మల్లెల వాసన ఆయన కి మత్తెక్కించి ....ఇంకా పైన నేను చెప్పను బాబు " అని ముగించింది మాళవిక యాహూ వాయిస్ చాట్ లొ.....ఇది దాదాపు 2005 అ ప్రాంతంలో జరిగిన సంఘటన. ఆరోజుల్లో నేను ఏ కొంచెం ఖాళీ దొరికినా రిడీఫ్ చాట్ అప్పటికే మూత పడడం తో యాహూ లో యూసర్ క్రియేటేడ్ రూం అయిన " పాడుతా తీయగా " అనే రూం కి వెళ్లి చాట్ చేసే వాడిని . అప్పుడు పరిచయం అయిన కొందరు చాట్ మిత్రులం ... పబ్లిక్ రూం లో బూతులు ఎక్కువ అవడంతో మా పాటికి మేము కాన్ఫరెన్స్ పెట్టుకుని పాటలు పాడుకుంటూ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళం . ఒకసారి మలక్ పేట్ రౌడీ ని కూడా ఈ కాన్ఫరెన్స్ కి పిలిచినట్టు గుర్తు. సరిగ్గా అప్పుడే నాకు ఎందరో పరిచయం అయ్యారు .. మాకు ఖాళీ సమయం దొరికినప్పుడే చాట్ చేసేవాళ్ళం. అదిగో అలాంటి రోజునే అందరూ బిజీగా ఉన్న ఒక రోజు ... నేను ఒక్కడినే యాహూ రూం లో సంచారం చేస్తున్న రోజు నన్ను కెలికింది మాళవిక .... వెంటనే కాన్ఫరెన్స్ షురూ .... గల గలా మాట్లాడడం ... పాటలు పాడడం .. వగైరా వగైరా లతో సన్నిహితం ( చాట్ వరకే లెండి ) అయ్యి ఒకనెల రోజులకి పైన చెప్పిందే అలాంటి డైలాగులు చెప్పే స్టేజీ కి వచ్చింది.ఆ అమ్మాయి అమెరికా లో ఉండేది . ఏదో జాబ్ చెప్పింది నాకు గుర్తులేదు.

ఆ అమ్మాయి చెప్పే మాటలు బాగా నచ్చేవి ... చక్కగా మాంచి కాలక్షేపం ...అయితే అప్పుడప్పుడు తనకి కాబోయే భర్త గురించి చెప్పే టప్పుడు కాస్త శృతి మించుతున్నట్టు అనిపించినా మనం వచ్చింది కాలక్షేపానికి ..అంతే కదా అనవసరంగా పూసుకుని తలనెప్పులు తెచ్చు కోవడందేనికి అనిపించేది. అందుకే తను ఫోన్ నంబర్ అడిగినా నేను ఇవ్వలేదు . అయితే ఆమె మాటలు కాస్త భావుకత్వం నిండిన వాళ్ళకి .....లేదా ఊరికే స్పందించే సెన్సిటివ్ కుర్రాళ్ళకి అయితే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారేమో గానీ .... నాలాంటి పక్కా ప్రాక్టికల్ మరియు చాట్ లో విషయాలు చాట్లోనే వదిలేసి పోయే రకానికి ఎం అర్ధం అవుతుంది. అందుకే నేను ఏనాడు గట్టు దాటలేదు. ఇలా సంవత్సరం గడిచింది.

ఒక సంవత్సరం తర్వాత నాకు ఇంకా తీరిక దొరకనటువంటి పనులలో బిజీ అయిపోయా .... దాదాపు చాలా కాలం తర్వాతా మళ్లీ ;లాగిన్ అయ్యి చూస్తే ... పాతవాళ్ళు చాలామంది కనిపించలేదు. మా రిడీఫ్ ఫ్రెండ్ సముద్ర ( ఇతని అసలు పేరు మలక్ గెస్ చేయొచ్చు) కనిపించాడు . పాత మిత్రుల గురించి అడుగుతూ ఈ అమ్మాయి ప్రస్తావన వస్తే తను అప్పుడు చెప్పాడు... ఆ అమ్మాయి అసలు పేరు అది కాదు ..... చెప్పిన జాబ్ అది కాదు .. అసలు ఆ అమ్మాయికి ఇది వరకే పెళ్లి అయిపోయింది ఒక బాబు కూడా ఉన్నాడు .. కనీ చాట్ లో అందరికీ రక రకాలుగా చెబుతుంది ... అని చెప్పాడు. సముద్ర మాటలకి నేను పెద్దగా ఆశ్చర్య పోలేదు . ఎందుకంటే మేము రిడీఫ్ చాట్ లో ఇంతకీ పదింతలు చూసి వచ్చాము. మాళవిక అలా చెప్పడం తప్పు అని కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే చాట్ లో ఎవరినీ నమ్మలేము కనుక . అంతటితో మాళవిక కి నాకు మద్య జరిగిన ఎపిసోడ్ క్లోస్ .

మరి అమాయకుడి వ్యధ అన్నారు ఏంటా అనుకుంటున్నారా ??? అసలా అమాయకుడు ఎవరు ? అతని వ్యధ ఏంటి? మాళవిక కి ఈ కధకి సంబంధం ఏంటో తరువాత ఎపిసోడ్ లో చెబుతా :)

8/5/10

ఏసే దేవుడు - తక్కిన వాళ్ళు కాదు - అవును దయ్యం చెప్పింది

మా ఫ్రెండు వాళ్ళ సెల్ ఫోన్ షోరూం లో చిన్న పని ఉండి వెళ్ళిన నేను .. అక్కడ వాళ్ళు బిజీగా ఉండడం తో ..వాళ్ళ సిస్టం లో పాత దయ్యాల సినిమా చూస్తుండగా .. వెనక నుండి " అది సైతానా బాబు " అన్న మాటలు చెవి పక్కగా వినిపించడం తో ఉలిక్కిపడి వెనక్కి తిరిగా . నా వెనక వైట్ అండ్ వైట్ లో కాలర్ బటన్ కూడా పెట్టుకుని టక్ చేసుకుని నిల్చున ఒక 50 ఏళ్ళ శాల్తీ కనిపించాడు.(బహుసా తన సెల్ రిపేర్ కి ఇచ్చి ఉంటాడు) ... "అంటే అది దయ్యం మాష్టారు" అన్నాను. "దయ్యానికి ఆకారం ఉండదు బాబు . అది సైతాన్ బానిస ... అది ఎవరికి అయినా పట్టాలి కానీ ,దానికి అంటూ ఆకారం ఉండదు .. ఈ సినిమా అంతా డూపు " అన్నాడు . ఓహో అని మళ్లీ సినిమా చూడడం లో మునిగిపోయ్యా . కాసేపు ఆగి మళ్లీ " నేను చాలా దయ్యాలని తరిమా తెల్సా" అన్నాడు. ఇదేదో మనకి పనికొచ్చే అంశంలా ఉంది అనుకంటూ సినిమా పాజ్ లో పెట్టి చైర్ ని గిర్రున 180 డిగ్రీలకి తిప్పా . ( అంటే వెనక్కి తిరిగా). ఇక మా మధ్య సంభాషణ ....

నేను : నిజ్జంగా దయ్యాలని మీరు చూశారా ?


దయ్యాలాయన : చూడడానికి అవి కనిపించవు బాబు ఎవరి ఒంట్లో అయినా ఆవహిస్తే .. వాళ్ళని అదుపులో ఉంచుకుని తిప్పలు పెట్టద్ది"

నేను : ఓహో అవునా!

దయ్యాలాయన : అవును . అప్పుడు నేను వెళ్లి ప్రార్ధన చేస్తా ... అప్పుడు దయ్యం వదిలిపోయిద్ది ... కాస్త పవర్ఫుల్ దయ్యం అయితే నేను పిడికిలి తెరిస్తే గానీ పోదు ..

నేను : అదేంటి పిడికిలి??????????

దయ్యాలాయన : అంటే నేను సాధారణంగా చెయ్యి విప్పను నేను గనక పిడికిలి ....విప్పితే ఎలాంటి సైతాన్ అయినా పారిపోవాల్సిందే.

నేను : ఓహో .. అదేలెండి. ..........సరేగానీ ఈ సారి మీరు .. దయ్యాన్ని వదల గొట్టేటప్పుడు నన్ను కూడా తీసుకు పోతారా ?

దయ్యాలాయన : అది .. నేను ఇప్పుడు చెయ్యడం లా .... నీ వయసులో ఉండగా ప్రార్ధనలు చేసే వాడిని ..... అప్పుడు దయ్యం వదిలిపోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు .. అందుకని మానేశా ఇప్పుడు నా పవర్ పోయింది .

నేను : ఓహో .. అసలు దయ్యాలు ఎలా తయారవుతాయట?

దయ్యాలాయన : అదా .. జనరల్ గా పరలోకము నుండి ప్రభువు పిలిస్తే ... సహజం గా మరణిస్తే అక్కడికి వెళ్తారు .. కానీ ఎదవ వేషాలు వేసి .. యాక్సిడెంట్ లలో మరణించిన వారు .. అక్కడికి వెళ్లేసరికి ప్రభువు తలుపు తెరవడు ... అక్కడ తలుపు మూసి ఉండేసరికి .. వెనక్కి వచ్చి ఇక్కడ తిరుగుతాయి ... అప్పుడు నాలాంటి పాస్టర్లు వాళ్ళని పరలోకానికి పంపాలి.

నేను : ఓహో అలాగా ..హ్మం

దయ్యాలాయన : అవును ... నేను ఎన్నో చోట్ల ప్రార్ధన చేశా .. నేను వెళ్ళిన చోట .. వేరే హిందువుల దేవుళ్ళ పటాలు ఉంటే తీసేస్తా ... వాళ్ళు ఆ పటాలు తీసేశాక ప్రార్ధన చేస్తా ..... "

అసలు టాపిక్ ఒక్కసారిగా ఇటు మళ్ళింది ఏంట్రా బాబు అనుకుని అసలేం చెబుతాడో విందాం అని .. "ఓహో ఎందుకలాగా " అన్నాను .. "ఏసు ప్రభువు ఒక్కడే దేవుడు .. మిగతా వాళ్ళు కాదు.. అసలు వాళ్ళు లేరు అంతా ఉత్తదే .. .... ఈ విషయం నాకు ఒక దయ్యం చెప్పింది" అన్నాడు . "అబ్బో ... అదెలా "అన్నాను . " ఒక కాగితం మీద దేవుళ్ళ పేర్లు రాసి ఇస్తే అందరి పేర్లు కొట్టేసి ఏసు పేరు మీద టిక్కు పెట్టి ఇచ్చేది "అన్నాడు . " ఓహో ... దయ్యం ఇంకా ఏమేం చెప్పింది" అన్నాను ? " ఆ ఒక సారి సునామీ వచ్చిన రోజుల్లో రాజు పాలెం లో ఒక అమ్మాయికి ఒక దయ్యం పడితే వెళ్లాను ... అక్కడ ఆ ఇంట్లో ఉన్న హిందువుల దేవుళ్ళ పటాలు మొత్తం తీసేయమని ఆ పిల్ల అమ్మకి చెప్పాను ... ఆమె తీసేసింది. కాసేపటికి దయ్యం పట్టిన అమ్మాయి వంట్లోకి దత్తాత్రేయుడు వచ్చాడు .. ఎవరు నువ్వు అన్నాను ... నేను దత్తాత్రేయుడిని.... ఈ ఇంటామెని నువ్వు పటాలు తీసేయమని చెప్పావు .... అయిన తీసేయలేదు ఒక మూల ఒక దేవుడి పటం దాపెట్టింది అది నీకు చెబుదామని వచ్చాను అన్నాడు ... ఓహో సరే నువ్వు గొప్పా మా ఏసు గొప్పా అన్నాను .. ఏసే దేవుడు అని ఒప్పుకున్నాడు .. సరే ఇంక వెళ్ళు అన్నాను దత్తాత్రేయుడు వెళ్ళిపోయాడు ... నేను కూడా దయ్యం వదలగొట్టి వచ్చేసాను" అన్నాడు.

"ఓహో .. సరే గానీ మీరు ఇరవయ్యేళ్ళ కింద మానేశాను ఇప్పుడు పవర్ అంతా పోయింది అన్నారు కదా మరి ... సునామీ వచ్చింది ఈ మద్య కదా మరెలా పవర్ వచ్చింది?" అన్నాను

నీళ్ళు నములుతూ అదీ అదీ .. అని తడుముకునే లోపు ... అవును హిందూ దేవుళ్ళు అసలు లేరు అన్నారు కదా ...మరి దత్తాత్రేయుడు ఎలా వచ్చాడు ... అని అడిగాను .. ఓక్క నిముషం బాబు . ఏదో ఫోన్ వస్తుంది అని ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడుతూ బయటికి వెళ్లాడు . ఈ లోపు సర్వీస్ సెంటర్ కుర్రాడు బయటికి వచ్చి .. అన్నా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడే ఆయన ఫోన్ లో బ్యాటరీ వేయడం మర్చిపోయి ఉత్త ఫోన్ ఇచ్చాం .. ఆయన వస్తే ఇవ్వు అని బ్యాటరీ నా చేతిలో పెట్టి వెళ్ళాడు.

7/31/10

ఇది మీరు నమ్మకపోయినా .... నిజంగా జరిగిన సంఘటన

రెండు నెలల క్రితం ప్రవీణ్ అనే యువకుడు ముంబై నుండి పూణే వెళుతున్నాడు. అయితే ప్రకృతిని ఆస్వాదించే కారణం చేత కొత్తగా వేసిన ఎక్స్ప్రెస్ వే ని కాదని పాత మార్గం లోనే వెళుతున్నాడు. అది ఘాట్ రోడ్డు. సాయంత్రం అయింది అమావాస్య రోజులేమో.......... చిమ్మ చీకటి........ కాసేపటికి సన్నగా వర్షం కూడా మొదలైంది . సడన్ గా అతని కారు ఆగిపోయింది. యెంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో ... దిగి నడక ప్రారంభించాడు. ఏదన్నా వాహనం వస్తే దిగి దగ్గరలో ఉండే ఏదేని ఊరికి వెళ్ళవచ్చు అన్నది అతగాడి ఆలోచన. ఉన్నట్టుండి వర్షం పెద్దది అయిపొయింది ... ఆ కటిక చీకటిలో ... జోరున కురిసే వానలో తడిసి ముద్ద అయిన ప్రవీణ్ కి చలి మూలంగా వణుకు కూడా మొదలైంది. కన్ను పొడుచుకున్నా కాన రాని చీకటి .. వల్ల ఏదో తనకి రెండు లేక మూడు అడుగుల దూరం వరకే చూడ గలుగుతున్నాడు. .. కాసేపటికి ఒక కారు అతని దగ్గరికి నెమ్మదిగా రావడం చూసిన ప్రవీణ్ ఇంకేం ఆలోచించకుండా ఒక్క గెంతులో వెళ్లి కారు బాక్ డోర్ తీసి ఎక్కేశాడు ... పక్కన ఎవరు లేరు. డ్రైవర్ కి థాంక్స్ చెబుదాం అని ముందుకి వంగాడు ... ఆశ్చర్యం అక్కడ కూడా ఎవరూ లేరు. ఇంజను యొక్క శబ్దం లేదు మరి కార్ ఎలా???? అని అతను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యి తరువాత భయానికి గురయ్యాడు ...ఆ భయం లోకూడా తను కూర్చున్న కారు నెమ్మదిగా కదలదాన్ని గుర్తించాడు. అది ఘాట్ రోడ్డు కావడం వల్ల బిగుసుకుపోయి రోడ్డు వంక చూడడం మొదలెట్టాడు ... ఏ మలుపులో అదుపు తప్పినా నేరుగా లోయలో ఉంటాడు ...... మలుపు సమీపించగానే ప్రవీణ్ దేవుడిని ప్రార్ధించాడు ... అంతే మలుపు చేరేలోపే విండో లో నుండి ఒక చెయ్యి వచ్చి స్టీరింగ్ ఆపరేట్ చెయ్యడం మొదలెట్టింది. దాంతో ప్రవీణ్ మరింత షాక్ కి గురయ్యాడు. అక్కడి నుండి ప్రతి మలుపు వద్ద ఆ చెయ్యి వచ్చి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూనే ఉంది. ఆలా కాస్త దూరం వెళ్ళాకా దూరంగా అతనికి లైట్స్ కనిపించాయి. వెంటనే ధైర్యం తెచ్చుకుని .. డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా కదులుతున్న కారు నుండి ఒక్క జంప్ చేసి పరిగెత్తి అక్కడికి వెళ్లాడు .

అదొక చిన్న టౌన్ .. అక్కడ ఉన్న ఒక దాబా దగ్గరికి పరిగెత్తుతూ భయం తో వచ్చిన ప్రవీణ్ ని చూసి అక్కడి స్థానికులు అతన్ని వివరం అడిగి తెల్సుకున్నారు. ప్రవీణ్ చెప్పిన విషయాలు విన్న స్థానికులు .."ఈ అబ్బాయి తాగి లేడు.. నిజంగానే భయపడుతూ ఏడుస్తున్నాడు. పాపం ఇతను చెప్పింది నిజమే అయి ఉంటుంది " అని అతనికి ధైర్యం చెప్పారు. " చూడు బాబు నీకు మేము ఏ సహాయం కావాలన్నా చేస్తాము ..భయపడకు .... పోలీసులకు చెప్పి నీకు రక్షణ .. చర్చి ఫాదర్ కి చెప్పి నీ కోసం ప్రార్ధన చేస్తాం " అని ధైర్యం చెప్పసాగారు . వారిలో ఒకరు ఇంతకీ మీది ఏ ఊరు అని అడిగారు ...అయినా భయం తగ్గని ప్రవీణ్ వణికిపోతు మాది శ్రీకాకుళం అని చెబుతూ ఉండగానే .... అప్పుడే సరిగ్గా ఆ దాబా లోకి .......................................................................................................


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ... ప్రవీణ్ ని చూసిన వారిలో ఒకరు ఇంకొకడితో అంటున్నాడు " అరేయ్ ఇందాకా మన కారు నెట్టుకుంటూ వచ్చేటప్పుడు .. గబుక్కున ఎక్కి కూర్చుని ఈ ఊరు రాగానే దూకి పారిపోయాడే వాడు వీడే".


ఒక email ఆధారంగా ...:)

7/30/10

రాముడు వాలిని చాటు నుండి చంపడం తప్పు

రాముడు వాలిని చాటు నుండి చంపడం తప్పు .... ప్రస్తుతం యువతరాన్ని అయోమయం లోకి గురి చేస్తున్న వాఖ్యం ఇదే. రామాయణం పై అనేక నీలి నీడలను ప్రసరింప చేస్తున్న అనేక వివాదాస్పద విషయాలలో ఇది కూడా ఒకటి. అయితే పూర్తి నిజాలు తెలుసు కున్న తర్వాత .. బుర్రతో కాకుండా బుద్ధితో ఆలోచించేవారికి రామయ్య ఏ ధర్మం ప్రకారం వాలిని సంహరించాడు అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వాలి, సుగ్రీవులు పోరాటం జరిపేటప్పుడు చాటు నుండి వాలి ని రామయ్య బాణం సంధించి కింద పడవేసిన తర్వాత .. కిందపడ్డ వాలి రామయ్య మీద అనేక ఆరోపణలు చేశాడు. వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాలి ఇలా అన్నాడు " రామా అందరూ నీ గురించి నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమవంతుడివి అంటారు. అటువంటి నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని" అని ఆవేశం గా మాట్లాడుతాడు.

అప్పుడు రామయ్య ఇలా సమాధానం ఇస్తాడు

ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||

" వాలీ , నీకు అసలు ధర్మార్ధకామ మోక్షాల గురించి తెలుసా ? నువ్వు అజ్ఞానివి. ఒక చిన్న బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము. నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం) అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది.

నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.

న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||

నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.


కాబట్టి వానర జాతి ధర్మాన్ని తప్పి కోడలు వంటి రుమ ని బలవంతంగా అనుభవించడం వాలి తప్పు ...... అందుకు శిక్షకి అర్హుడు. మృగం అయిన వాలిని మానవుడు , క్షత్రియుడు అయిన రాముడు తనని శరణు కోరిన సుగ్రీవుని కోసం సంహరించడం అధర్మం కాదు ( పైగా వాలికి వరం కూడా ఉంది)

కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వాలిని హీరో ని చేసి ... రామయ్య ధర్మం తప్పాడు అని ప్రచారం చేసి భావితరాలకి అసలు ధర్మమే తెలియకుండా చేయకండి.

నోట్ : నేను కూడా వాలిని రామయ్య చంపడం యెంత వరకు కరక్టు అనే ప్రశ్న లేపి పెద్దల చేత వివరణలు ఇప్పిద్దాం అనుకున్నాను కానీ గతం లో ఇలాంటి ఒక పోస్ట్ లో చర్చ పక్కదారి పట్టడం వల్ల ... నాకు తెల్సిన వివరణ నేను ఇచ్చాను .... పెద్దలు ఎవరైనా మరింత వివరణ ఇస్తే బాగుంటుంది :)

7/28/10

పడయప్పా ............. కాదు పాములోడప్పా

( ఇది టీనేజ్ కుర్రాళ్ళ సిల్లీ కధ ... ఇంటలెక్చువల్ గా ఉంటుంది అని ఆశించకండి)

అది 1999 వ సంవత్సరం .... నేను 19 -20 ఏళ్ళ వయసులో ఉండగా ఒంగోల్లో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టారు . అంత వరకు మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తప్ప గతి లేని మా ఊరికి ఇంజనీరింగ్ కాలేజీ రావడం పెద్ద విషయం కాపోయినా ......అందులో చదవడానికి... రాష్ట్ర నలుమూలల నుండి చాలా మంది అమ్మాయిలు వచ్చారు అన్న వార్త ప్రధానంగా మా కుర్ర బ్యాచ్ ని ఆకర్షించింది. అంతవరకు ఊర్లో చాలావరకు మాకు పరిచయం ఉన్న అమ్మాయిలే ఉండేవారు .. వాళ్ళతో చిన్ననాటి నుండి ఉన్న పరిచయం కారణంగా కాస్త ఆరోగ్యకరమైన స్నేహాలు ఉండేవి . కొత్తగా వంద మందికి పైగా సిటీ నుండి వచ్చిన అమ్మాయిలని చూడగానే ఏదో విధంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించాలి అనే మా కుర్రాళ్ళ తాపత్రయం ...అంతా ఇంత కాదు. కానీ ఎలా??????????? .. వాళ్లేమో వాళ్ళ హాస్టల్ నుండి ఫర్లాంగు దూరం మెయిన్ రోడ్ మీదకి వచ్చి అక్కడ బస్సు ఎక్కి కాలేజికి పోవడం తిరిగి అక్కడే దిగి మళ్లా హాస్టల్ కి పోవడం .. అంతేగానీ ఇంకెక్కడా కనిపించేవారు కాదు.

కానీ విధి చాలా చిత్రమైనది .. వాళ్ళ దృష్టిని ఆకర్చించాలని విపరీతంగా కృషి చేసిన మా నికృష్టులు..... కన్నా , రవూఫ్, సృజన్, ఇంతియాజ్, మల్లి గాడు , భానుగాడు తదితర బేవార్స్ లని వదిలేసి ... పాపం పదో తరగతి వరకే చదివి ఆ తరువాత తండ్రి చనిపోవడం వల్ల ఇంటి పోషణ భారం నిమిత్తం కూలి పనికి వెళుతున్న చాంద్ బాషా అనే పదిహేడేళ్ళ అబ్బాయిని అనవసరంగాకెలుక్కునారు ఆ అమ్మాయిలు. వివరాల్లోకి వెళ్దాం ........................ చంద్ బాషా కి ఒక కాలు మడమ దగ్గర చిన్న సమస్య ఉంది అందుకే కొంచెం ఎగిరినట్టు నడుస్తాడు ఒక రోజు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న వాడిని చూసి "అబ్బో లారెన్స్ ఒంగోల్లో తిరుగుతున్నాడే" అని ఒకరు అనడం అదో భయంకరమైన కామెడీ అన్నట్టు మిగతా వాళ్ళు నవ్వడం .. వీడు చూడగానే "లారెన్స్ కి కోపం వచ్చిందే" .. అని ఒకరు , "అయితే తాండవం చేయమను" అని ఇంకొకరు ఇలా రోజు ఏదో ఒకటి అనడంతో తిక్క రేగి మన గాలి దళానికి ఫిర్యాదు చేశాడు. ఆ రోజు సాయంత్రం మా అడ్డాకి అందరం చేరుకునే సమయానికి అక్కడ ఇదే టాపిక్ జరుగుతుంది. అక్కడ చంద్ బాషాకి న్యాయం చేద్దాం అన్న తపన కన్నా ఈ వంకతో అమ్మాయిల కంట్లో పడచ్చు అన్న యావ మన జనాలలో బాగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి గమనించిన ఫరూక్ .. " అన్నా మాటర్ చాలా కంపు అయ్యేటట్టు ఉంది దీన్ని ఇక్కడే కట్ చేయడం మంచింది" అన్నాడు. నేను చాంద్ బాశాని పక్కకి తీసుకెళ్ళి " అరె చాంద్ , మనం వెళ్లి అడిగితే మీ వాడి పేరేత్తామా.. ఊరేత్తామా అంటారు ప్రస్తుతానికి కాం గా ఉండు .. రేపు నేను చెప్తా .. ఈలోపు ఎవర్నన్నా తీసుకెళ్ళి గొడవ చెయ్యబాక" ... అని చెప్పా ... వాడు ఒప్పుకున్నాడు కానీ పక్కనోళ్ళు ఒప్పుకోవడం లా .... చివరికి ఎలాగో ఒప్పించి ..... అసలు ముందు కామెంట్ చేసిన అమ్మాయి ఎవరో చూడాలని డిసైడ్ అయ్యాం. అందరం గుంపుగా కాకుండా ... నేను , చాంద్ఇంకా కన్నా వెళ్ళాలని నిర్ణయం జరిగింది.

ఆ మర్నాడు ఉదయాన్నే ముగ్గురం ఆ ఏరియా లో రెడీగా ఉన్నాం వాళ్ళు బస్సు ఎక్కే ఏరియా కి దగ్గరలో గోడ మీద కూర్చున్నాం . అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి బస్సు ఎక్కుతున్నారు . " అన్నా ఆ పింక్ డ్రెస్ అమ్మాయి అన్నా.... ఆ పక్కన వచ్చే వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఉండి వంత పాడుతుంటారు అన్నా " అన్నాడు చాంద్. చూద్దును కదా సన్నగా పొడవుగా గట్టిగా ఊదితే పడిపోయెలా ఉన్న ఒకపిల్ల నడుచుకుంటూ వస్తుంది .... ప్రేమదేశం లో టబు ని ఇమిటేట్ చేయాలనీ ప్రయత్నించడం తెలుస్తునే ఉంది. ఆ అమ్మాయి పక్కనే ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరూ తన వీర ఫాలోయర్స్ అని అర్ధం అయింది. ఊరికే చూద్దాం అని వచ్చిన నేను ఎందుకో సంయమనం కోల్పోయాను " ఈ మినప గింజ మొహందా నిన్ను కామెంట్ చేసింది ... అందంగా ఉన్న ఆ అమ్మాయో ... లేక అబోవ్ యావరేజ్ గా ఉన్న ఈ అమ్మాయో అంటే పర్లేదుగానీ " అని కాస్త పెద్దగానే అన్నాను .... అయితే చాంద్ గాడు ఆ అమ్మాయి గురించి చెప్పిన దాన్ని బట్టి కాస్త ఘాటు గానే రిప్లై ఆశించాను .... కానీ ఆ ముగ్గురు చటుక్కున తలదించుకుని వెళ్ళిపోయారు. కానీ రియాక్షన్ పక్కన ఉన్న కన్నా గాడి దగ్గర నుండి వచ్చింది. " అరె మనం ఊరికే చూద్దాం అని కదా వచ్చాం నువ్వేమో పెద్ద పుడింగి లా కామెంట్ వేసేసావ్ ..... ఇప్పుడు చూడు రేపటి నుండి మనల్ని ఎదవల్లాగా చూస్తారు .. ఒక్కపిల్ల కూడా పడదు ..... అంతా నీవల్లే" అంటూ నస మొదలెట్టాడు. " అరె జఫ్ఫా మూసుకుని వాళ్ళలో వచ్చే రియాక్షన్ చూడు" అని చెప్పా .... మర్నాడు మళ్లీ వెళ్ళాం .... మొదటి రోజు కలిసి వెళ్ళిన వాళ్ళు ... ఈ రోజు ముగ్గురు వేరు వేరుగా ఒంటరిగా రావడం మినప గింజ నన్ను క్రోధం తో కూడిన చూపు చూడడం.... అబొవ్ యావరేజ్ కోర కోరా చూడడం ...... అందగత్తె ఫోజు కొడుతూ వెళ్ళడం చకా చకా జరిగిపోయాయి.
( నేను అన్న మాటలకి ..... వాళ్ళ అందం విషయం లో వాళ్ళ మద్య పెద్ద యుద్ధం జరిగింది అని తర్వాత తెల్సింది. సో ఆ బ్యాచ్ ని విజయ వంతంగా విడగొట్టా ......ఆ రోజు తర్వాత చాంద్ గాడిని ఎవరూ ఏమీ అనలేదు .... మనోడు కూడా హ్యాపీ ..... ఆలా చూసి వద్దామని వెళ్లి కాల్చి ( అమ్మాయిల ఫ్రెండ్ షిప్ ని ) వచ్చా. :P

ఒక రెండు నెలలు సాదా సీదాగా గడిచాయి... . తర్వాత ఒకరోజు అప్పటి తెలుగుదేశం గవర్నమెంటు లో మంత్రిగా పని చేసిన దామచర్ల ఆంజనేయులు గారి ఆఫీసుకి మా ఫ్రెండు రవూఫ్ పని మీద వెళ్లడం జరిగింది ...నేను కూడా వెళ్ళా. అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలు అవుతుంది .. వాడు లోపలి వెళ్లాడు నేను బయటే ఉన్నా ... కారణం ఆ పక్క బిల్డింగ్ అమ్మాయిల హాస్టల్ కావడమే :)) కాసేపటికి హాస్టల్ లో నుండిపెద్దగా కేకలు వినిపించాయి ..అమ్మాయిలు అందరూ మూకుమ్మడిగా అరుస్తున్నారు .... " పాము పాము" అని. మనికి అసలే ఆవేశం ఎక్కువ కదా...... పాము అన్న మాట వినపడితే మనల్ని ఎవరు ఆపలేరు. వెళ్లి హాస్టల్ గేటు ఎక్కి దూకా ... అది తీసే ఉందని తర్వాత అర్ధం అయింది. ఆ కాంపౌండ్ లో రెండు బిల్డింగ్ ల మద్య ఖాళి స్థలం ఉంది అక్కడ గడ్డిలో పాము కొట్టుకుంటూ కనపడింది ... అమ్మాయిలు అందరూ గోడలు కుర్చీలు ఎక్కేసారు. ఆ టైం లో అక్కడికి వచ్చిన నను సాక్షాత్తు శ్రీక్రిష్ణుడే వాళ్ళని రక్షించడాని వచ్చినట్టుగా చూసి . .... "సార్ సార్ అక్కడ ఉంది పాము చూడండి" అన్నారు. దగ్గరికి వెళ్లి చూద్దును కదా దాని తల అప్పటికే నలిగి ఉంది కానీ కొన ప్రాణం తో కొట్టుకుంటుంది. ఆ విషయం అమ్మాయిలకి కి తెలీదు . ఏ పక్షులో తీసుకెళుతుండగా జారి పడినట్టు ఉంది .. ఇలాంటి అద్భుత అవకాశాన్ని గత పదిహేనేళ్ళు గా తెలుగు సినిమాలు చూస్తున్న కుర్రాడు వదులుకుంటాడా చెప్పండి :P. వెంటనే దాని తోక దగ్గర పట్టుకుని గాల్లో గిర గిరా తిప్పి అక్కడే నేలకేసి కొట్టి , తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని నడిచి వస్తుంటే అబ్బా అబ్బా అబ్బా ...... అమ్మాయిలు అంతా చప్పట్లు .. సూపర్ ... అనే అరుపులు .. నరసింహా .. రజనీకాంత్ అని సెటైర్లు ..మద్య నడుచుకుంటూ వెళ్లి దాన్ని దూరంగా పారేశా....

అప్పటికే తాజాగా నరసింహ సినిమా రిలీజ్ అయి ఉంది. ఆహా ఏమి కో- ఇన్సిడెన్స్ అనుకుంటూ .. గేటు దగ్గర నిలుచున్నా ... అమ్మయిలు అందరూ వచ్చి అక్కడ చెరి ..పొగడ్తలు .. థాంక్స్ లు గట్రా అవుతున్డగానే మా రవూఫ్ గాడు బయటికి వచ్చాడు. ...... అక్కడ అమ్మాయిల మద్య లో ఉన్న నన్ను చూసి వాడి నవరంధ్రాల నుండి ఉక్రోషం పొంగి " పోదాం పా " అన్నాడు కాస్త సీరియస్సుగా. అక్కడి నుండి వెళ్ళిపోయాం . జరిగిన విషయం చెప్పగానే . అబ్బా జస్ట్ చాన్స్ మిస్సు అని తెగ గింజుకున్నాడు.

క్రింది వీడియో చూడండి







ఈ వీడియో లోలాగా పాముని పట్టుకున్న నన్ను కూడా వాళ్ళు ముద్దుగా నరసింహా ( పడయప్పా) అని పిలుచుకుంటారేమో ఆనుకున్నా ... కానీ చాలా కాలానికి .. హాస్టల్ లో ఉన్న మా ఫ్రెండు గాడి ఒక లవర్ ద్వారా లీకైన .. విషయం ఏంటంటే .....వాళ్ళు నాకు పడయప్పా అని కాకుండా పాములోడు అని పేరు పెట్టారని ... అందులోనూ నా కామెంట్ వల్ల హార్ట్ అయిన మినప గింజ పగబట్టి మరీ ఆ పేరుపెట్టి .... ప్రచారం కల్పించింది అని తెల్సుకుని ............... అమ్మనీ యెంత దెబ్బ కొట్టావే అనుకున్నా ....................:)

7/7/10

మీ కంప్యూటర్ కి తెలుగు నేర్పండి

బహుశా ఇప్పుడు నేను చెప్ప బోయే అంశం చాలా మందికి తెలిసే ఉండవచ్చు. కానీ కొందరు ఈ విషయం మీద టపా వేయమని కోరారు . వారి కోరిక మేరకు ఈ టపా . పైగా కొందరు bsnl limited ప్యాకేజి వాడకం దారులకు టపా రాసినంత సేపు నెట్ కనక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కూడా. కంప్యూటర్ లోకి తెలుగు టూల్ install చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మీరు తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.

దీనికోసం మీరు చేయవలసినది , ముందుగాhttp://www.google.com/transliterate/ నొక్కండి తర్వాత .. ఆ లింక్ లో కుడివైపు పై భాగం లో New Download Google Transliteration IME అని ఉంటుంది . అది క్లిక్ చేయండి . ఇప్పుడు మీరు కింది ఇమేజ్ ఉన చోటుకి చేరుతారు . ఇమేజ్ లో ఉనట్టు గా choose IME language అనే ఆప్షన్ క్లిక్ చేసి తెలుగు సెలక్ట్ చేసి కింద ఉన్న Download Google IME అనే బటన్ క్లిక్ చేయండి







ఇప్పుడు మీకు ఒక software డౌన్లోడ్ అవుతుంది. అది మీ కంప్యుటర్ లో సేవ్ చేసి తర్వాత install చేయండి. install చేసాక క్రింది విధం గా చేయండి.



Windows 7/Vista


  1. Control Panel -> Regional and Language Options -> Keyboard and Languages tab
  2. Click on Change keyboards... button to open Text services and input languages dialog
  3. Navigate to Language Bar tab
  4. Enable the radio button Docked in the taskbar under Language Bar section
  5. Apply all settings and try to display language bar as mentioned in previous section.
Windows XP
  1. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Advanced Tab
  2. Make sure that under System configuration, option Turn off advanced text services is NOT checked.
  3. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Settings Tab
  4. Click Language Bar
  5. Select Show the Language bar on the desktop. Click OK.
  6. If you are installing the IME for East Asian language or Right-To-Left language, go to Control Panel -> Regional and Language Options -> Languages Tab
  7. Make sure that options Install files for complex scripts and right to left languages and Install files for East Asian languages are checked in the checkboxes. This requires installation of system files and the system will prompt to insert the Operating System Disc.
  8. Apply all settings and try to display language bar as mentioned in previous section.
సోర్స్ : http://www.google.com/ime/transliteration/help.html#installation.

ఇన్స్టాల్ ప్రాసెస్ ముగిసాక. క్రింది ఇమేజ్ లో ఉనట్టుగా మీరు టూల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి లాంగ్వేజ్ బార్ తెచ్చుకోండి .




తెచ్చుకున్న తర్వాత మీకు కింది విధంగా టూల్ బార్ లో లాంగ్వేజ్ బార్ కనిపిస్తుంది.


ఆ తర్వాత లాంగ్వేజ్ బార్ ని కింది ఇమేజ్ లో చూపి నట్టుగా రిస్టోర్ చేయండి .

ఇప్పుడుమీకు డెస్క్ టాప్ మీద కనిపించే ఈ లాంగ్వేజ్ బార్ లో ఇలా తెలుగు సెలక్ట్ చేయండి.


ఇప్పుడు మీకు కింది ఇమేజ్ లో లాగ కుడి వైపు కింద టూల్ బార్ వస్తుంది .





ఇప్పుడు అక్కడఉన్న ' ' అనే అక్షరాన్ని ఒక సారి నొక్కితే అది' A' గా మారుతుంది. ' ' లో ఉంటే తెలుగు 'A' లో ఉంటే ఇంగ్లీష్ . ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సహాయం లేకుండానే టైప్ చేసుకోవచ్చు. ఏదేని డౌట్స్ ఉంటే అడగండి .