అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/22/10

పీకితే పీక్కోండి

కూడలి లో కెలుకుడు బ్లాగులు ఉంచాలా ?

కెబ్లాస ఒక బ్లాగర్ తో విభేదించగానే కెలుకుడు బ్లాగులు ఉంచాలా, తీసేయాలా అంటూ పోలింగ్ పెట్టాల్సిన పని లేదేమో . ఇది కెబ్లాస కి అవమానం ........... కేవలం ఒక వ్యక్తికోసం అగ్రిగ్రేటర్స్ నడవడం కడు బాధాకరం. ఒక వ్యక్తికి నొప్పి పుట్టగానే వ్యవస్థలో ఇంత మార్పు చోటుచేసుకోవడం .. ఆలోచించదగ్గ విషయం. అగ్రిగ్రేటర్ల మీద ఆధారపడి బ్లాగులు నడపాల్సిన ఖర్మ కెబ్లాస కి లేదు. పీకితే పీక్కోండి.

ఇది మాత్రం కెబ్లాస కి అవమానమే .

విమర్శలని ఎదుర్కోలేక ... తెరవెనక భాగోతాలు నడిపే వ్యక్తుల ... పిరికి చేష్టలకి కెబ్లాస ఎప్పుడు భయపడదు . దేవతల నగ్న చిత్రాలని ప్రదర్శించిన వారిని విమర్శిస్తే తట్టుకోలేనివారే దొడ్డిదారి ద్వారా ఇది చేస్తున్నారని తెలియట్లేదా?

3/20/10

అసలు రవిగారి గొడవేంటి - రౌడీ తగువేంటి

బ్లాగుల్లో కొత్త గొడవ ఏదో మొదలైంది అనుకుని హడావుడిగా నా బ్లాగులోకి తొంగి చూస్తున్న వీక్షక ప్రేక్షకులకు కెలికాస్కారం. అయితే ఈ గొడవలు ఇప్పటివి కావు దాదాపు ఐదేళ్ల కిందటివి. మరి ఆ రవిగారి గొడవలు ..... రౌడీ తగువులు .. మద్యలో అర్జున్ అరుపులు....... వీటన్నిటినీ గమనించే సెటిల్మెంట్ చిన్నోడి సిత్రాలు .... పిచ్చమ్మ సవాళ్ళు .... "పూజ"కి పనికి రాని పూలు వెరసి రెడిఫ్ చాట్ హైదరాబాద్ రూం భాగోతాలు త్వరలో ధారావాహిక రూపంలో మీకోసం.

ముఖ్యాంశాలు
అసలు రిడీఫ్ చాట్ లో ఎం జరిగింది.
రవిగారికి పిచ్చమ్మ ఏం సవాల్ విసిరింది.
మలక్ పేట్ రౌడీ , శాంతి చౌదరికి మధ్య స(అ)క్రమ సంబంధం ఏంటి
అసలు అర్జున్ ఎవరు
సెటిల్మేంట్ చిన్నొడు చేసిన ఘనకార్యాలేంటి
రెడిఫ్ చాట్ లో జరిగిన గొడవకి పాత బస్తీ నుండి పాతిక సుమోలు దిల్ సుక్ నగర్ ఎందుకు వచ్చాయి.
నాగార్జున సాగర్ లో రిడీఫ్ బాచ్ చేసిన ఘనకార్యాలేంటి ..

ఇంకా ఎన్నో మరెన్నో విశేషాలు త్వరలో మీకోసం ............................. మీ వికటకవి లో

3/18/10

ప్రాణాలపై ప్రయోగాలా!

హైతీలో భూకంపం ప్రకృతి ఆగ్రహం వలన కాదని, అగ్రరాజ్యం అమెరికా కుటిల ప్రయోగాల ఫలితమని వస్తున్న వార్తలు విని .. ఇలా ప్రజల ప్రాణాల మీద ప్రయోగాలు చేసే అలవాటున్న అమెరికాని అసహ్యించుకుంటున్నారా ... కాస్త ఆగండి మన రాష్ట్రంలో ఉన్న నరహంతకులను కూడా కలిపి ఉమ్మడిగా ఉమ్మేద్ధురు గాని.

అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే డబ్బున్న బహుళజాతి కంపెనీలకి ఆదివాశీల ప్రాణాలు బహు చులకన. ఆత్మాభిమానం లేని మన పాలకుల కక్కుర్తికి అమాయకులైన గిరిజనుల ప్రాణాలు ఎలా మార్కెట్ లో పెట్టారో తెలుసుకుంటే ....... ఇలాంటి పాలకులకు ఓటేసిన మన వేలిని మనమే నరుక్కోవాలి అనిపిస్తుందేమో చూడండి.


ఒరిస్సా లో వేదాంత ధన దాహానికి కి డోంగ్రియా కోండ్ గిరిజనుల ప్రాణాలు ఆహుతి అవుతుంటే , ఇక్కడ మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అమాయక అడవి పుత్రుల ప్రాణాలు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారి ప్రయోగాలకు బలవుతున్నాయి.


సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ కి టీకాల కోసం జరిపే ప్రయోగాల కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్వారికీ భారీగా అమాయక ప్రాణాలు కావాల్సి వచ్చాయి . ప్రపంచ వ్యాప్తంగా డబ్బుకోసం మనుషుల ప్రాణాలు అమ్మేసే హేమాహేమీల కోసం వారు జరిపిన అన్వేషణలో ఆంధ్రపాలకులు అగ్రభాగాన నిలిచారట . 2008 లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం లో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తమ ప్రయోగాలకు అనుమతి కోరగా వెనువెంటనే ఖమ్మం జిల్లాలో ప్రయోగాలకి వారికి అనుమతులు లభించేశాయి.


అసలే ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో రక్షిత మంచినీటి లేమి, పౌష్టికాహార లోపం, విష జ్వరాలు, డయేరియా, మలేరియాలతో మరణ ఘోష వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రయోగాలు చేపడితే ఒకవేళ ప్రయోగాల దశలో ఎవరైనా మరణిస్తే రెగ్యలర్ మరణాల జాబితాలో వేసేయోచ్చని తద్వారా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్వారి ప్రయోగాలకి ఆటంకాలు కలగవని రాజా వారి వ్యూహం అని తెలిసింది. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” ప్రయోగాలు మొదలెట్టాకా మరణాల సంఖ్య పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఎక్కడి నుండో ఒకడొచ్చి మీ ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టండి మేము ప్రయోగాలు చేసుకుంటాం అంటే ఊళ్ళకి ఊళ్లు రాసిచ్చిన మన పాలకులను తిట్టడానికి నాకు పదాలు దొరకడం లేదు.


ఒరిస్సా డోంగ్రియా ఖోండ్ గిరిజనుల పక్షాన " సర్వైవల్ ఇంటర్నేషనల్ " అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతుంది. ఖమ్మం జిల్లా గిరిజనుల కోసం ఎవరు పోరాడాలి ? ఎదురు తిరిగి ఎన్కౌంటర్ లో పోయే ధైర్యం మనికి లేదుగా!


3/17/10

బ్లాగులు - గ్రూపులు - అన్యాయాలు

అందరూ ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి . ఎంత మంది బ్లాగర్లు హాయిగా బ్లాగుతున్నారు .వాళ్ళల్లో ఎంత మందిమీద దాడులు జరుగుతున్నాయి. కొందరిమీద తప్ప! వ్యక్తిగత విభేదాలు లేదా ఆధిపత్య పోరులో కొందరికి పుట్టిన నెప్పి అందరికీ అంటించే ప్రయత్నాలు తప్ప మరేం లేదిక్కడ అనేది నాకొచ్చిన మెయిల్ లో మెజారిటీ బ్లాగరుల అభిప్రాయం.

నిన్న ఒక మిత్రుడు తన మెయిల్లో ఇలా అన్నాడు :

రాతి యుగంలో ఎప్పుడైతే ఒక మనిషి ఒక ప్రాంతం చుట్టూ కంచె వేసి అది నాది అనడం మొదలెట్టాడో అప్పుడే మనుషుల మధ్య అసమానతలు మొదలయ్యాయి. అలాగే బ్లాగుల్లో కూడా గ్రూపులు కట్టి ఎవరైనా కాస్త వ్యంగ్యంగా మాట్లాడితే చాలు దాడి చేయడానికి లేదా అవకాశం కోసం పొంచి ఉండి మరీ దాడి చేయడానికి ప్రయత్నించడం అనే అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించి .... ఏదైనా నెత్తి మీదకి రాగానే తమ జెండర్ ని బలహీనతగా చూపి సమాజం ఆసరాకి యత్నించడం వల్లనే ఇదంతా మొదలయింది అని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు.

ఆయనకీ ఒక గ్రూపు లీడర్ కి మద్య తలెత్తిన వ్యక్తిగత విభేదాన్నికాస్త ఆ గ్రూపు కి ఈయనకి మద్య విభేదం గా సదరు లీడర్ గారు మార్చేసి అగ్నికి ఆజ్యం పోశారట. ముందు వెనుక చూడకుండా , నిజానిజాలు తెలీకుండా కామెంట్లలో " తలంటడం" ఆ గ్రూపుకి వెన్నతో పెట్టిన విద్యట. తన సొంత గొడవని గ్రూపు సభ్యులకి ఈమెయిలు రూపంలో పంపడం వారి సహాయాన్ని కోరడం ఒక తప్పయితే ... ముందు వెనుకా చూడకుండా ఈయన గారికి పాడె కట్టడానికి అందరూ రెడీ అయిపోవడం యెంత అహంకారం యెంత విడ్డూరం యెంత అహంభావము అని ఆ మిత్రుడు అన్నారు.

ఇక్కడ ఇంకో పిల్ల పిట్ట కధ చెబుతా అంటూ ..... ఈ గొడవల మద్య ఒక తెల్లవారుజ్హామున ఒక "ఆకాశం" పుట్టింది. అది కాస్తా ఒక మహిళా బ్లాగరు మీద అదారాలు ఉన్నాయి అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ (నిరాధారమని తర్వాత తేలింది) ఆ బ్లాగర్ యొక్క గొంతు కూడా రికార్డ్ చేశానని బెదిరిస్తుంటే .. ఆ అన్యాయాన్ని ఈనాటి మహిళాజన పరిరక్షకులు , మహిళలకి అన్యాయం జరుగుతుంది అని మొత్తుకునే వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇదేమని అడగలేదు. అంటే గ్రూపు సభ్యులే మహిళలా ? వేరేవాళ్ళు కాదా ? ఒక ఆడమనిషి నమ్మి చెప్పిన మాటలు రికార్డ్ చేసి బయట పెడతా అని బెదిరించే పర్వర్ట్ ని ఇదేం న్యాయం అని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇంకొక మహిళ ఆఫీసులో ఏదో జరిగింది అందుకే ఆమె బ్లాగు మూసుకుంది అని గత పది రోజులుగా బ్లాగ్ మహిశాసురులు విశృంఖల నృత్యం చేస్తుంటే ఒక్కరికీ కనిపించలేదే , వినిపించలేదే ఏం వారిద్దరూ ఆడవాళ్ళు కారా??? .. అక్కడ విషయాన్ని ఖండించిన మీ ఖండనలు వీళ్ళకి కనిపించలేదా ??????
గ్రూపులు కట్టడం ...... గ్రూపులో వ్యక్తుల వ్యక్తిగత తగాదాలో అందరూ తల దూర్చడం. ఏదైనా అనుకోని అవాంతరం వస్తే ... తమ జెండర్ లని అడ్డు పెట్టుకోవడం. లేదా బ్లాగ్లోకానికే అన్యాయం జారుతుంది అని అరవడం ... పసి పిల్లలకి చెప్పమనండి వింటారేమో అని ఇంకో మిత్రుడు ఆవేశంగా అన్నాడు .

"లోకుల మీద అన్యాయపు దాడులు జరిగితే మాకెందుకులే అని ఊరుకునే వారు తమ దాకా వచ్చేసరికి అది మొత్తం లోకం మీద జరిగేదాడిగా వర్ణించడం ఒక ఎత్తైతే .. అసలు విషయం తెలీని కొన్ని జొల్లు పార్టీలు చొంగ కారుస్తూ వచ్చి తందానా తాన అంతు డప్పు కొట్టి తమ విధేయత ప్రదర్శించడం మరొక ఎత్తు. సరిగ్గా ఇదే సమయంలో ఊరూ పేరు లేని కొత్త కొత్త బ్లాగ్ ట్యూబ్ బేబీస్ పుడుతుంటారు . స్మైలీలు పెడితే తప్పు. వీరికి నచ్చని బ్లాగుల్లో పోయి ఎవరైనా కామెంట్లు పెడితే తప్పు .... మళ్లా ఆ తప్పులను బ్లాగ్ ట్యూబ్ బేబీస్ ఎత్తి చూపడం ఒక కామెడీ "అన్నాడు ఇంకొక మిత్రుడు.

వీరి మాటల వల్ల నాకు అర్ధమైన నీతి : ఎవరి బ్లాగులు వారు రాసుకుంటే , మూసుకోవాల్సిన అగత్యం పట్టదు.


3/16/10

అవును నేను అబ్బాయిలకి ప్రతినిధిని

అబ్బాయిలందరికీ నువ్వు ప్రతినిధివా? అని జ్యోతిగారు వారి బ్లాగులో నన్ను చాలా ఆవేశంగా ప్రశ్నించారు. మరి మీరు మహిళా బ్లాగర్ల తరపు ప్రతినిధా?????? ఆ పోస్టు మీకు ఎవరు ఇచ్చారు ? ఎలా అయితే మీరు మహిళల తరపున మాట్లాడుతున్నారో , అలాగే నేను అబ్బాయిల తరపున మాట్లాడుతున్నాను. ఎస్ నేను అబ్బాయిలకి ప్రతినిధిని.

మీ పోస్ట్ లో నా మొదటి కామెంట్ మామూలుగానే పెట్టాను. మీ వివరణ బాగుంది అన్నాను . మీ పేరు వాడినందుకు ఖండిస్తాను అని కూడా అన్నాను. ఆ కిరణ్ కుమార్ ని చూశాక నాకు కోపం వచ్చింది . మీరు ఏకపక్షంగా శ్రీనివాస్ నీకెందుకు అంత కోపం అని అడిగితే ఎలా????? అతడు ఒకప్పుడు నన్ను తిట్టి ఉన్నాడు అందుకే కోపంగా అడిగా . నేనేదో మీ టపాకి కోప్పడుతున్నట్టు మీరు బిల్డప్ క్రియేట్ చేసుకుంటే నాకు వచ్చిన నష్టం లేదు . నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో ...... మీ పోస్టులో 15 వ కామెంటు పెట్టిన కిరణ్ కుమార్ వచ్చి చెండాలంగా కామెంట్ చేసి పోయాడు . అసలు అపుడు నాకు ఏ గొడవల్లో సంబంధం లేదు . అయినా తిట్టాడు. అప్పుడు నేను భయస్తుడిని అవడం వల్ల ఆ కామెంట్ డిలీట్ చేశాను. ఇప్పుడు ఇదిగో మళ్లీ మీ బ్లాగ్ లో ప్రత్యక్షం అయ్యాడు. జ్యోతక్క గారు అని ఆప్యాయంగా మాట్లాడుతూ పెద్ద పత్తిత్తు లాగ కామెంట్ పెట్టాడు. మరి మీ తమ్ముళ్ళు
--తాను చేసే సంసారం ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం-- అనే టైపు లో మాట్లాడే వ్యక్తులా అబ్బాయిలని గురించి అవాకులు చెవాకులు పేలేది.

నన్ను ఒకడు ఒక బ్లాగులో "ఈడెమ్మ" అని తిట్టాడు ఈ మధ్యనే ... ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి అప్పుడు మీకు కోపం రాలేదు ??? ఏమండీ బ్లాగులు రాసే వారి తరపునే వకాల్తా పుచ్చుకుంటారా? అప్పుడు నేను సదరు వ్యక్తి ఐపి దొరికింది , పట్టుకున్నాను అతను పలానా ఊరు నుండి నన్ను అన్యాయంగా తిట్టాడు అని కూడా నా బ్లాగులో పోస్ట్ పెట్టాను ....ఒక్కడంటే ఒక్కడు కూడా మద్దతు పలక లేదు . కనీసం ఖండించనూ లేదు . ఏం ఆడాళ్ళని తిడితేనేఈ మగమహారాజులకి పొడుచుకుని వస్తుందా? ( అదేనండి కోపం)



గతం మరువకండి ... ఒక సారి నేను ఒకే ఒక టపా సరదాగా రాసి అందులో శరత్ అనే పేరు ఉచ్చరించినందుకు అజ్ఞాతలు నన్ను, నాకు మద్దతు పలికినందుకు నా స్నేహితురాలీని ఎంత నీచమైన మాటలు అన్నారు .. అపుడు ఎవడూ మాకు సపోర్ట్ రాలేదే. మేము అపుడు ఎవరి జోలికి వెళ్ళే వాళ్ళం కాదే. అప్పుడు ఈ జనాలు ఎవరూ నోరు మెదపలేదే?

ఆ కామెంట్లు సరిగా గుర్తు లేవు కానీ మహిళా బ్లాగర్లు పెట్టేవే కొని ఉదాహరణలు చూద్దాం :-

1) ఒంగోలు శ్రీనివాస్ తను సహాయ ఫౌండేషన్ ప్రతినిధి అని చెప్పుకుంటాడు. కానీ చేసేవే దగుల్బాజీ పనులు . అసలు శరత్ రాసే రాతలు రేపు నా బిడ్డ చూస్తే ఎలా తయారవుతాడో అని భయపడాల్సి వస్తుంది.

పై కామెంట్ లో నాతో బాటు సహాయ ని లాగారు అవసరమా . ...... అప్పుడు నేను మీకు లాగానే మొత్తుకున్నాను ఒక్కడు సపోర్ట్ రాలేదు.

2) ఆ అమ్మాయి ఒంగోలు శ్రీను బ్లాగులో శరత్ కి మద్దతు పలికింది . రేపు ఆవిడ అన్నో తమ్ముడో ఆవిడ మీద ఏమన్నా చేస్తే తెలుస్తుంది. అసలు ఆడ జన్మ ఎందుకు ఎత్తానా అనిపిస్తుంది.

అసలు శరత్ ఎం రాస్తాడో కూడా మాకు తెలీదు మొర్రో అంటున్నా వినకుండా ఈ రకంగా ఆడుకున్నారు . ఏకపక్షంగా .. అజ్ఞాత రూపం లో అప్పుడు మాకెవడూ సపోర్ట్ రాలేదే. అదే శరత్ తో ఇప్పుడు అందరూ బాగనే చంగలిచ్చుకుంటా తిరుగుతున్నారు.

నాకు నా ఫ్రెండ్ కి కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదు ... మరి మేము ఎందుకు రావాలండి ? యేవో బ్లాగుల్లో స్మైల్ ఇస్తున్నాము అన్నారు . ఇంకేం చేయమంటారు .
ఇక సురేఖా గారి కామెంట్ కి నా స్పందన టాపిక్ పక్కదారి పడుతుంది అని మాత్రమె . బ్లాగుల్లో మీ ఐడి లు వాడుకునే వారికి బైకుల్లో తిరిగే కుర్రాళ్ళకి ఎం సంబంధమో నాకు అర్ధం కాలేదు. ఇప్పటికీ అర్ధం కాలేదు .


చివరిగా మీరు భరద్వాజ్ కి ఇచ్చిన సమాధానం

భరద్వాజ్ గారు,

మీరు భలే చెప్తారండి.. స్రీనివాస్ ఏమో మీరెప్పుడూ మహిళా బ్లాగర్ల వైపే మాట్లాడతారు. పురుష బ్లాగర్లని కూడా వెకిలిగా రాస్తున్నారు కదా మరి అంటేనే నేను చివరి లైను కలిపాను.


నా కామెంట్ కి మీరు పోస్ట్ ఎడిట్ చేసి కొత్త లైన్ కలిపినప్పుడే నేను గెలిచాను .

to be continued ................................

3/9/10

చెత్తకుండీలో మరో చిట్టితల్లి

మానవత్వం మరోసారి మంటగలిసింది . తల్లి ఒడిలో సేదతీరాల్సిన ఒక చిన్నారి పుట్టిన తొమ్మిది నెలలకే చెత్తకుండీ పాలైంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు అందరూ ఉన్నా అనాథలా మార్చారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో గల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో తొమ్మిదినెలల చిన్నారిని తల్లిదండ్రులు వదిలి వెళ్లారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ప్రస్తుతం పాప పోలీసుల సంరక్షణ లో ఉంది.

ఈ విషయానికి సంబంధించి నా విన్నపం. ఇప్పుడు ఆ పాపా పోలీసుల సంరక్షణ లో ఉంది. పోలీసులు ఆ పాపని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు .. తర్వాత అన్ని మొగ్గలలాగానే ఈ మొగ్గ కూడా ఎన్నో అవస్థలు పడాలి. అందుకే ఈ పాపకి మంచి జీవితం జీవితం ఇవ్వడం లో తోడ్పడదాం. హైదరాబాద్ లో ఉండేవారు ఎవరైనా ...ఈ పాప ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏదైనా ప్రైవేట్ అనాధ శరణాలయం లో చేర్పించేందుకు పర్మిషన్ ఇస్తారా అనేది ఎవరైనా విచారించి నాకు తెలియ చేస్తే ... మంచి ఆశ్రమం లో ఉంచి మెరుగైన విద్యాబుద్దులు చెప్పించేలా చూస్తానని సహాయ తరపున మనవి చేస్తున్నాను.

స్పీడ్ గా టైప్ చేశాను తప్పులు ఉంటే సర్దుకోగలరు.

3/2/10

అనాధ బాలల్ ఇన్సురెన్స్ : update



నా గత పోస్ట్ లో అనాధ బాలల కి హెల్త్ ఇన్సురెన్స్ గురించి తెలియచేయడం అయింది. దానికి చాల రెస్పాన్స్ వచ్చింది . నేను ఒంగోలు లో ఉన్నప్పటికీ  హైదరాబాద్ లో ఉన్న కొంతమంది మిత్రుల సహకారంతో ఆ డబ్బు వారికి అందజేయడం జరిగింది దాతల వివరాలు కింద ఇస్తున్నాను .

సహాయ ఫౌండేషన్ : 4280
ఉమా . ఏలూరి : 4000 ( జ్యోతి వలబోజు గారి ద్వారా)
శేషాద్రి & శైలజ : 1000
వరప్రసాద్ ( తీరం సీరియల్ ఫేం ) : 640
రామిరెడ్డి : 640

మొత్తం : 10560