అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే డబ్బున్న బహుళజాతి కంపెనీలకి ఆదివాశీల ప్రాణాలు బహు చులకన. ఆత్మాభిమానం లేని మన పాలకుల కక్కుర్తికి అమాయకులైన గిరిజనుల ప్రాణాలు ఎలా మార్కెట్ లో పెట్టారో తెలుసుకుంటే ....... ఇలాంటి పాలకులకు ఓటేసిన మన వేలిని మనమే నరుక్కోవాలి అనిపిస్తుందేమో చూడండి.
ఒరిస్సా లో “వేదాంత” ధన దాహానికి కి డోంగ్రియా కోండ్ గిరిజనుల ప్రాణాలు ఆహుతి అవుతుంటే , ఇక్కడ మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అమాయక అడవి పుత్రుల ప్రాణాలు “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” వారి ప్రయోగాలకు బలవుతున్నాయి.
సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ కి టీకాల కోసం జరిపే ప్రయోగాల కోసం “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” వారికీ భారీగా అమాయక ప్రాణాలు కావాల్సి వచ్చాయి . ప్రపంచ వ్యాప్తంగా డబ్బుకోసం మనుషుల ప్రాణాలు అమ్మేసే హేమాహేమీల కోసం వారు జరిపిన అన్వేషణలో ఆంధ్రపాలకులు అగ్రభాగాన నిలిచారట . 2008 లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం లో “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” తమ ప్రయోగాలకు అనుమతి కోరగా వెనువెంటనే ఖమ్మం జిల్లాలో ప్రయోగాలకి వారికి అనుమతులు లభించేశాయి.
అసలే ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో రక్షిత మంచినీటి లేమి, పౌష్టికాహార లోపం, విష జ్వరాలు, డయేరియా, మలేరియాలతో మరణ ఘోష వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రయోగాలు చేపడితే ఒకవేళ ప్రయోగాల దశలో ఎవరైనా మరణిస్తే రెగ్యలర్ మరణాల జాబితాలో వేసేయోచ్చని తద్వారా “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” వారి ప్రయోగాలకి ఆటంకాలు కలగవని రాజా వారి వ్యూహం అని తెలిసింది. “బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్” ప్రయోగాలు మొదలెట్టాకా మరణాల సంఖ్య పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఎక్కడి నుండో ఒకడొచ్చి మీ ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టండి మేము ప్రయోగాలు చేసుకుంటాం అంటే ఊళ్ళకి ఊళ్లు రాసిచ్చిన మన పాలకులను తిట్టడానికి నాకు పదాలు దొరకడం లేదు.
ఒరిస్సా డోంగ్రియా ఖోండ్ గిరిజనుల పక్షాన " సర్వైవల్ ఇంటర్నేషనల్ " అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతుంది. ఖమ్మం జిల్లా గిరిజనుల కోసం ఎవరు పోరాడాలి ? ఎదురు తిరిగి ఎన్కౌంటర్ లో పోయే ధైర్యం మనికి లేదుగా!
7 comments:
శ్రీనివాస్ గారూ మొత్తానికి నెలలో రెండు సార్లన్నా మీరు రక్తం మరిగిస్తారు. అమాయక, నిస్సహాయ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అమానుషం...
ఖమ్మం జిల్లా గిరిజనుల కోసం ఎవరు పోరాడాలి ? ఎదురు తిరిగి ఎన్కౌంటర్ లో పోయే ధైర్యం మనికి లేదుగా!
*** *** ***
నిజమే కదా
ఒరిస్సా లో “వేదాంత” ధన దాహానికి కి డోంగ్రియా కోండ్ గిరిజనుల ప్రాణాలు ఆహుతి అవుతుంటే.........
----------
నాకు తెలిసినంతలో "వేదాంత" ఎవరిని చంపలేదనుకుంటా.
Indian government is doing that.
జీవని గారు మన రక్తం మరగడమే తప్ప మనమేమీ చేయలేకున్నాం అనేదే బాద.
గీతాచార్య గారు :)
ఏకలింగం గారు వేదాంత చేయకపోయినా అ మన గవర్నమెంటు చేసేది వేదాంత కోసమే కదా? ఒకప్పుడు చిదంబరం గారు వేదాంత లో పని చేశారు కదా
ఎదురు తిరిగి పోరాటం చెయ్యాల్సిన అవసరం లేదు జనాన్ని జాగృతం చేస్తే చాలు . మీరు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అబినందనలు.
శ్రీనివాస్ గారూ నిజమే. చాలా విషయాలు మనం ఏమీ చేయలేము. మన పరిధి, స్థాయి చిన్నది కాబట్టి. కానీ మీరు అలా అని ఊరకే ఉండలేదు. మీ స్థాయిలో సేవ చేస్తున్నారు. ఇలాంటి అకృత్యాలను దిగమింగుతూ, మన స్థాయిలో సేవ చేద్దాం. బహుశా ఇంతకు మించి మనం ఏమైనా చేయగలమని నాకూ అనిపించడం లేదు. ఇలాంటి అన్యాయాలను మీరు టపాల్లో పెడుతున్న ప్రతిసారీ నేను నా బాధ్యతను గుర్తు తెచ్చుకుంటాను. అందుకు ధన్యవాదాలు.
కమల్ గారు సరిగ్గా చెప్పారు.
:)
Post a Comment