అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

2/18/10

ఇప్పుడు చూపించండి మీ ఆవేశం

వైష్ణవి హత్య తర్వాత , చాలా మంది తమ ఆవేశం చూపించారు( టపాల్లో) మనమేం చేయగలం అని చాలా అర్ధవంతమైన చర్చ చేశారు . కొందరైతే ఏకంగా అలాంటి వాళ్ళని నరికి పోగులు పెట్టాలి అని , చట్ట్ట ప్రకారం శిక్షించాలి అని చాలా ఆవేశంగా లెక్చర్లు ఇచ్చారు. ఇప్పుడు మీ ( హైరాబాద్ వాళ్ళ)_ ఆవేశం చూపించే టైం వచ్చింది . హైదరాబాద్ మధురా నగర్ లో విముక్తి స్కూల్ లో చదివే శ్రీకార్ అనే నాలుగేళ్ల బాలుడిని భవానీ అనే టీచర్ విచక్షణా రహితంగా మర్మాంగాల మీద తన్నింది. రక్తం కారుతూ ఇంటికి వచ్చిన ఆ బుజ్జోడిని చూసి ఆస్పత్రికి తీసుకెళితే చావు తప్పి కన్ను లోట్టబోయినంత పనయిందట. ఇదేమని అడుగుదామని వెళితే స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల మీద దాడి చేశారట . చివరికి ఆసుపత్రి ఖర్చులు భరించేలా ఒప్పందం కుదిరిందట.

ఇదేం న్యాయం .... వాడికే ఏదైనా డామేజి జరిగితే అది మరో 20 ఏళ్ళ తర్వాత గానీ బయట పడదు ( వివరాలొద్దు) టీచర్ మీద అలాంటి స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జనాలు ఎవరన్న ఉద్యమించగాలరా???????. ఇది చిన్న విషయమని .... నాది అర్ధం లేని వాదన అని కొట్టిపారేయోద్దు. మనం కోరుకునే మార్పు ఇలాంటి చిన్న విషయాలలోనుండే రావాలి.


ఇక్కడ మరో విషయం : ఆడ పిల్లల మీద దాడులో.................. అని గుండెలు బాదుకునే ఫెనిమిస్ట్ లు ఈ సంఘటన చూసిన తర్వాతైనా మనుషుల మీద దాడులు అని తమ వాదన మార్చుకుంటారేమో చూడాలి. చాన్స్ దొరికితే ఆడది మగాడిని ఎక్కడ తన్నిద్దో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.



2/16/10

వికటకవి పేరడీ

సిరివెన్నెల గారికి క్షమాపణలతో


అరతిక్కల టపాను చూసి సాహిత్యమందామా దానికి కామెంటు చేద్దామా
వదిన గాధల అరాచకాన్ని స్త్రీవాదమందామా చదివి తిక్కలోల్లమవుదామా
చలం రాతలు కాపీ కొట్టి తెచ్చిన సాహిత్యం ఈ మూర్ఖండ భాగోతం
నీ జాబితాలో చేరిన ఈ దరిద్రం చూడమ్మా ఓ మా మంచి కూడలమ్మా

అరతిక్కల టపాను చూసి సాహిత్యమందామా దానికి కామెంటు చేద్దామా
ప్రపీసస ని చూసి బుద్ధి తెచ్చుకున్దామా లేక చదివి సంకనాకుదామా
వదినకి మరిదికి లింకులు కడుతూ, బ్లాగరుల పేర్లు విలన్లకి పెడుతూ ఎక్కడ లేని తిక్కని చూపి టపాలు రాస్తాడే ........ జనాల ప్రాణాలు తీస్తాడే

పాఠకుల గోడు పట్టని మూర్ఖం తన బిసినెస్ పేరుతో దాక్కుని ఉంటూ
ప్రపీసస మొత్తం గగ్గోలెడుతుందని నిజం తెలుసుకోడే తన పైత్యపు రాతలాపబోడే
అలాంటి మూర్ఖుడి తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమి పీకాలి
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం..... ఈ బ్లాగుల హారం
దెబ్బకి హారం నుండి పోయిన ఓ పాపం కాగడా...... ఏకాకి కాగడా

అరతిక్కల టపాను చూసి సాహిత్యమందామా దానికి కామెంటు చేద్దామా
వదిన గాధల అరాచకాన్ని స్త్రీవాదమందామా చదివి తిక్కలోల్లమవుదామా

అన్యాయాన్ని సహించని పవను, దౌర్జన్యాన్ని దహించే మలక్
కాగడామొగుల్లకు బోడి లింగాలకు దాక్కుని ఉండాలా బ్లాగులు మూసుకు తిరగాలా
మూర్ఖాండతో తో పోరాడే సైన్యం బ్లాగ్లోకాన్ని కాపాడే కర్తవ్యమ్
స్వజాతి వీరుల ను అణిచే అజ్ఞాతల చేతిలో చావాలా

తమలో ధైర్యం కూడలికి ఇచ్చి తన ధర్మం హారానికి కి ఇచ్చి ఈ కలహం చూస్తూ బ్లాగర్లు శిలలా నిలుచుంటే
బలయ్యే బ్లాగరుల పాలిటి కల్పవృక్షం ----> ఈ ------>ప్రవీణ్ పీడిత సంఘం

అసలు పాట
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాసపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం
నీ పాపిట లో భక్తిన దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చని చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువని చూపి
తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనం లో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమి సాధించాలి
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరిచిన జనాల భారతమా ఓ అనాధ భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగం లా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువు తో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యమ్
స్వజాతి వీరుల ను అనచే విధి లో కవాతు చెయ్యాల అన్నల చేతిలో చావాల
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం

2/13/10

సరికొత్త ప్రేమకధ

అది ఒక ఊరు ఆ ఊర్లో అందమైన బిల్డింగ్లు చక్కని సెల్యులార్ టవర్లు , చూడచక్కని కరంటు స్తంబాలు , ముచ్చటగొలిపే కాలువలు ఉన్న ఊరు. ఆ ఊర్లో ఒకబ్బాయి ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించింది ... ఆ ఇంకొక అబ్బాయి మరొక అమ్మాయిని ప్రేమిస్తాడు .... ఆ మరొక అమ్మాయి కధలో మొదటి అబ్బాయిని ప్రేమిస్తుంది. కాని ఏ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోరు. ......... ఇది కాన్సెప్ట్ .... ఈ దీర్ఘ చతురస్ర ప్రేమకధ ని సినిమాగా తీయడానికి ఎవరికైన దమ్మున్నా లేక డబ్బున్నా లేదా దమ్ము డబ్బు రెండు కలిసి ఉన్నా సరే నిర్మాత అయ్యే చాన్స్ ఇస్తా...... ఒక ఉపేంద్ర .....ఒక పోసాని కృష్ణ మురళి ... తర్వాత ఒక శ్రీనివాస్ అని నిరూపిస్తా

నేను రెడి మీరు రెడీయా