అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/5/10

ఏసే దేవుడు - తక్కిన వాళ్ళు కాదు - అవును దయ్యం చెప్పింది

మా ఫ్రెండు వాళ్ళ సెల్ ఫోన్ షోరూం లో చిన్న పని ఉండి వెళ్ళిన నేను .. అక్కడ వాళ్ళు బిజీగా ఉండడం తో ..వాళ్ళ సిస్టం లో పాత దయ్యాల సినిమా చూస్తుండగా .. వెనక నుండి " అది సైతానా బాబు " అన్న మాటలు చెవి పక్కగా వినిపించడం తో ఉలిక్కిపడి వెనక్కి తిరిగా . నా వెనక వైట్ అండ్ వైట్ లో కాలర్ బటన్ కూడా పెట్టుకుని టక్ చేసుకుని నిల్చున ఒక 50 ఏళ్ళ శాల్తీ కనిపించాడు.(బహుసా తన సెల్ రిపేర్ కి ఇచ్చి ఉంటాడు) ... "అంటే అది దయ్యం మాష్టారు" అన్నాను. "దయ్యానికి ఆకారం ఉండదు బాబు . అది సైతాన్ బానిస ... అది ఎవరికి అయినా పట్టాలి కానీ ,దానికి అంటూ ఆకారం ఉండదు .. ఈ సినిమా అంతా డూపు " అన్నాడు . ఓహో అని మళ్లీ సినిమా చూడడం లో మునిగిపోయ్యా . కాసేపు ఆగి మళ్లీ " నేను చాలా దయ్యాలని తరిమా తెల్సా" అన్నాడు. ఇదేదో మనకి పనికొచ్చే అంశంలా ఉంది అనుకంటూ సినిమా పాజ్ లో పెట్టి చైర్ ని గిర్రున 180 డిగ్రీలకి తిప్పా . ( అంటే వెనక్కి తిరిగా). ఇక మా మధ్య సంభాషణ ....

నేను : నిజ్జంగా దయ్యాలని మీరు చూశారా ?


దయ్యాలాయన : చూడడానికి అవి కనిపించవు బాబు ఎవరి ఒంట్లో అయినా ఆవహిస్తే .. వాళ్ళని అదుపులో ఉంచుకుని తిప్పలు పెట్టద్ది"

నేను : ఓహో అవునా!

దయ్యాలాయన : అవును . అప్పుడు నేను వెళ్లి ప్రార్ధన చేస్తా ... అప్పుడు దయ్యం వదిలిపోయిద్ది ... కాస్త పవర్ఫుల్ దయ్యం అయితే నేను పిడికిలి తెరిస్తే గానీ పోదు ..

నేను : అదేంటి పిడికిలి??????????

దయ్యాలాయన : అంటే నేను సాధారణంగా చెయ్యి విప్పను నేను గనక పిడికిలి ....విప్పితే ఎలాంటి సైతాన్ అయినా పారిపోవాల్సిందే.

నేను : ఓహో .. అదేలెండి. ..........సరేగానీ ఈ సారి మీరు .. దయ్యాన్ని వదల గొట్టేటప్పుడు నన్ను కూడా తీసుకు పోతారా ?

దయ్యాలాయన : అది .. నేను ఇప్పుడు చెయ్యడం లా .... నీ వయసులో ఉండగా ప్రార్ధనలు చేసే వాడిని ..... అప్పుడు దయ్యం వదిలిపోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు .. అందుకని మానేశా ఇప్పుడు నా పవర్ పోయింది .

నేను : ఓహో .. అసలు దయ్యాలు ఎలా తయారవుతాయట?

దయ్యాలాయన : అదా .. జనరల్ గా పరలోకము నుండి ప్రభువు పిలిస్తే ... సహజం గా మరణిస్తే అక్కడికి వెళ్తారు .. కానీ ఎదవ వేషాలు వేసి .. యాక్సిడెంట్ లలో మరణించిన వారు .. అక్కడికి వెళ్లేసరికి ప్రభువు తలుపు తెరవడు ... అక్కడ తలుపు మూసి ఉండేసరికి .. వెనక్కి వచ్చి ఇక్కడ తిరుగుతాయి ... అప్పుడు నాలాంటి పాస్టర్లు వాళ్ళని పరలోకానికి పంపాలి.

నేను : ఓహో అలాగా ..హ్మం

దయ్యాలాయన : అవును ... నేను ఎన్నో చోట్ల ప్రార్ధన చేశా .. నేను వెళ్ళిన చోట .. వేరే హిందువుల దేవుళ్ళ పటాలు ఉంటే తీసేస్తా ... వాళ్ళు ఆ పటాలు తీసేశాక ప్రార్ధన చేస్తా ..... "

అసలు టాపిక్ ఒక్కసారిగా ఇటు మళ్ళింది ఏంట్రా బాబు అనుకుని అసలేం చెబుతాడో విందాం అని .. "ఓహో ఎందుకలాగా " అన్నాను .. "ఏసు ప్రభువు ఒక్కడే దేవుడు .. మిగతా వాళ్ళు కాదు.. అసలు వాళ్ళు లేరు అంతా ఉత్తదే .. .... ఈ విషయం నాకు ఒక దయ్యం చెప్పింది" అన్నాడు . "అబ్బో ... అదెలా "అన్నాను . " ఒక కాగితం మీద దేవుళ్ళ పేర్లు రాసి ఇస్తే అందరి పేర్లు కొట్టేసి ఏసు పేరు మీద టిక్కు పెట్టి ఇచ్చేది "అన్నాడు . " ఓహో ... దయ్యం ఇంకా ఏమేం చెప్పింది" అన్నాను ? " ఆ ఒక సారి సునామీ వచ్చిన రోజుల్లో రాజు పాలెం లో ఒక అమ్మాయికి ఒక దయ్యం పడితే వెళ్లాను ... అక్కడ ఆ ఇంట్లో ఉన్న హిందువుల దేవుళ్ళ పటాలు మొత్తం తీసేయమని ఆ పిల్ల అమ్మకి చెప్పాను ... ఆమె తీసేసింది. కాసేపటికి దయ్యం పట్టిన అమ్మాయి వంట్లోకి దత్తాత్రేయుడు వచ్చాడు .. ఎవరు నువ్వు అన్నాను ... నేను దత్తాత్రేయుడిని.... ఈ ఇంటామెని నువ్వు పటాలు తీసేయమని చెప్పావు .... అయిన తీసేయలేదు ఒక మూల ఒక దేవుడి పటం దాపెట్టింది అది నీకు చెబుదామని వచ్చాను అన్నాడు ... ఓహో సరే నువ్వు గొప్పా మా ఏసు గొప్పా అన్నాను .. ఏసే దేవుడు అని ఒప్పుకున్నాడు .. సరే ఇంక వెళ్ళు అన్నాను దత్తాత్రేయుడు వెళ్ళిపోయాడు ... నేను కూడా దయ్యం వదలగొట్టి వచ్చేసాను" అన్నాడు.

"ఓహో .. సరే గానీ మీరు ఇరవయ్యేళ్ళ కింద మానేశాను ఇప్పుడు పవర్ అంతా పోయింది అన్నారు కదా మరి ... సునామీ వచ్చింది ఈ మద్య కదా మరెలా పవర్ వచ్చింది?" అన్నాను

నీళ్ళు నములుతూ అదీ అదీ .. అని తడుముకునే లోపు ... అవును హిందూ దేవుళ్ళు అసలు లేరు అన్నారు కదా ...మరి దత్తాత్రేయుడు ఎలా వచ్చాడు ... అని అడిగాను .. ఓక్క నిముషం బాబు . ఏదో ఫోన్ వస్తుంది అని ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడుతూ బయటికి వెళ్లాడు . ఈ లోపు సర్వీస్ సెంటర్ కుర్రాడు బయటికి వచ్చి .. అన్నా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడే ఆయన ఫోన్ లో బ్యాటరీ వేయడం మర్చిపోయి ఉత్త ఫోన్ ఇచ్చాం .. ఆయన వస్తే ఇవ్వు అని బ్యాటరీ నా చేతిలో పెట్టి వెళ్ళాడు.

34 comments:

Anonymous said...

:)

Sravya V said...

అసలు మీకు దెయ్యాల అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ పెద్ద మనిషి కి తెలియదు కదా పాపం :)

చైతన్య.ఎస్ said...

:):)

Anonymous said...

good. better. best.

శ్రీవాసుకి said...

మీ టపా బాగుంది. నవ్వు తెప్పించింది. మొన్న ఆదివారం మా ఇంటి దగ్గరలో ఒకచోట ప్రార్ధన సభలు జరిగాయి. అందులో ఫాస్టర్ గారు గాయత్రి మంత్రం చెబుతూ అది ఏసుని ఉద్ధేశించే అన్నారు. అవిగాక ఎవరికి అర్థంకాని రీతిలో మరికొన్ని మంత్రాలు చదివి ఋగ్వేదంలో ఏసు గురించి ఉందంటూ ఏవేవో చెప్పాడు. ఈ మధ్య ఇదో కొత్త ట్రెండ్. ఎక్కువ మందిని ఆ మతం వైపు తిప్పుకోవడం కోసం వేదాల మీద పడ్డారు.

..nagarjuna.. said...

:) :) గురూ...

శ్రీవాసుకిగారు, మీరనేలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయండి. ఓసారి యుట్యూబ్‌లో చూడండి.....వేదాల్లో, బైబిల్లో కూడా ప్రవక్త ఉన్నాడంటారు.....ఏది తోస్తే అది అనేస్తారేంటో!!!

Anonymous said...

very interesting
i was laughing for at least 2 minutes
non stop

తార said...

ఎమయ్యా, నాకూ నీ దెయ్యం పట్టింది, నాకు ఇప్పుడు దెయ్యం కావాలీ, నేనో దెయ్యాన్ని చుడాలీ...

చిక్కోలం వెళ్ళు అని చెప్పకండి, నాకు వదిన దెయ్యం వద్దు..

నేను ఎప్పుడు చుస్తానో ఆ దెయ్యాన్ని..

రాజేష్ జి said...

:) అబ్బ నవ్వలేకుండా ఉన్ననుకోండి.. ఆ చివర్లో కొసమెరుపు అదిరింది{నో బాట్టేరీ}

తార గారు ,
ఆ సదరు ఫాదర్ గారిని కలవండి త్వరగా మరి :)

ప్రభుడు said...

"నీ కోసం నా తలుపులు ఎప్పుడునూ తెరిచియే యుండును" కదా.. అలా ఎలా మూసుకుపోయాయి ?..వీళ్ళ తిక్క పనులు ఇంకా చెప్పాలంటే .. చిన్న పిల్లలని బస్ లో తీసుక వెళ్లి మద్యలో బస్ ఆపేస్తారు ... మొదట హిందూ దేవుళ్ళను ప్రార్థించమంటారు... బస్ స్టార్ట్ కాదు... తర్వాత ఏసు ప్రభువుని ప్రార్థించమంటారు .. అప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఏమీ చేయలేమా ?

Anonymous said...

అంతే ప్రభువు కరుణామయుడు కాదా? మరి ఆ సినిమాలో అలా వుందే?!

ఈ ప్లాస్టరేంటో , దయ్యాలు వదలగొట్టటం ఏంటో అర్థం కాలేదు. ప్లాస్టర్ పుళ్ళకు , గాయాలకు కదా వేస్తారు?!

దయ్యం చెప్పిదే ప్లాస్టరూ చెబుతున్నాడన్నారు, మరి అతను మనిషే అని ఏమిటి నమ్మకం?

Anonymous said...

ఇంతకు మునుపు వాడెవడో ధనుంజయశాస్త్రి అట . వేదాలలో చెప్పబడిన రహస్యాలు చెబుతానంటూ ప్రచారాల మొదలెట్టేవాడు అతని పేరుక్రింద [తిరుపతి మాజీ పీఠాధిపతి] అని వాల్ పోస్టర్లలో ఉండేది . నేను తిరుపతితిరుమల వారి దృష్టికి ఈవిషయం తీసుకెళ్ళినతరువాత ఆపదం తొలగించి ఈయన బహుజ్ఞాని నో మరేదో వాడి బొంద తిలించుకుంటున్నాడు డిగ్రీ కింద . అసలదేమిటో అక్కడెక్కడో శబరిమలలో జ్యోతి అభూతకల్పన అంటూ గుండెలు బాదుకునే హేతువాదులకు మాగుంటూరు గుంటగ్రౌండ్స్ లో గుడ్డివారు చూడబడుదురు,మూగవార మటాడబడుదురు అని నిర్వహిమ్చే స్వస్థత కూటముల మహిమలగూర్చి నోరెత్తటానికి రాదు .ఎందుకు చెప్మా ! ప్రార్ధనలతో గుడ్డివారు చూడబడి అప్పటికప్పుడే స్టేజీ ఎక్కి ప్రకటిస్తుంటారు కదా ? మరి రైల్లలో రోజూ ప్రభువు పాటలు పాడేగుడ్డోళ్లకు కళ్ళురావెందుచేతనో ? అసలు ప్రార్నలద్వారానే స్వస్థత చేకూర్చగల దైవజనులు మరలా హాస్పటల్స్ ఎందుకు పెదతారో అర్ధం కాదు నా మట్టిబుర్రకు .

Dharanija said...

super post andee.chaalaa baagundi.

krishna said...

hillarious post bro :)
బాగుంది టపా! ఇంతకీ మనోడి పిడికిలిలో ఏముందో తెలియలేదు కదా! అన్నట్టు టైటిల్ లో ప్రభువు అని పెడితే బెటరేమో ? మరీ ఇలా డైరెక్టుగా ... మీ ఇష్టం !
వీడియో ఇప్పుడే చూసాను ! గుడ్ వర్క్ ! నాకు కొన్ని అనుమానాలు వున్నాయి, సమాజ సేవ అన్న కాన్సెప్ట్ మీద ! త్వరలో ఒక పోస్టు వేస్తాను, వీలుంటే ఆ అనుమానాలకి సమాధానం ఇవ్వు బాసు !

తార said...

రాజేష్ గారు, ఆయన ఈ మధ్య కీను రీవ్స్ సినిమాలు మానేసాడు అంట, ఇంక దెయ్యాలని తరిమే కొత్త పద్దతలు తెలియవు అంట..

ఇది Constantine వచ్చిన కొత్తలో కదా శ్రీనివాస్ గారు..

కౌటిల్య said...

బాఁ రాశారు....ఈ విషయం మీద రాయాలంటే ఎంత పెద్ద టపా ఐనా చాలదేమో....కాని ఒక్క చిన్నమాట..అక్కడ ఎక్కువశాతం మానసిక బలహీనతకి పరాకాష్ఠ...మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, ఇలానే ప్రభువు పిలుస్తున్నాడని వెళ్ళి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది...వాళ్ళకి నాన్నకూడా లేరు..ఇప్పుడు వాళ్ళు అనాథలయ్యారు...ఆ సంగతన్నా ఆ తల్లికి ఆ క్షణంలో గుర్తురాలేదెందుకో...ఆ ప్రభువైనా గుర్తు చెయ్యలేదెందుకో!...

jeevani said...

good one :))

Anonymous said...

హహా.... మాంచి ఝలక్ ఇచ్చారు...!! దెబ్బకు వదిలివుంటాది అ ప్రెభువు నీడలోని దెయ్యం......!!!

శ్రీనివాస్ said...

స్పందించిన అందరికీ ధన్యవాదాలు

@ శ్రావ్య గారు దయ్యాల మీద నాకున్న ఆసక్తి అతన్ని పట్టిచ్చింది మరి :)

@ శ్రీవాసుకి గారు ...ఇలాంటివి కూడా జరుగుతున్నాయా

@ నాగార్జున, చైతన్య , అజ్ఞాతలు ... ధన్యవాదాలు

శ్రీనివాస్ said...

తారా ఇంట విశ్వప్రయట్నం చేసిన నాకే దయ్యం కనిపించలేదు .... కానీ ఒక చిన్న చిట్కా ఉంది మరి ....మీరు చెయ్యగలిగితే చెబ్తా

@ రాజేష్ థాంక్స్

ప్రభుడు :))

థాంక్స్ ధరణిజ గారు

శ్రీనివాస్ said...

@ కృష్ణ వారు డైరక్టుగా అన్న మాటలే నేను డైరక్టుగా పెట్టేశాను కనుక ప్రాబ్లం లేదు అనుకున్తునాను .. సమాజ సేవ అనే కాన్సెప్ట్ లో అనేకనుమానాలు , విభిన్న అభిప్రాయాలు సహజమే మీరు పోస్ట్ రాయండి నా అనుభవం పరిధిలో సమాధానం ఇస్తాను :))

శ్రీనివాస్ said...

థాంక్స్ కౌటిల్య , జీవని :))

తార said...

చిక్కోళం వెళ్ళు అని కాకుండా ఏది చెప్పినా చేస్తాను..
నాకొక దెయ్యమ్ కావాలి

తార said...

తారా ఇంట విశ్వప్రయట్నం :
ఇంట విశ్వప్రత్నం చేసితిరా? ఇంట కాకుండా బయట చేయాల్సింది.

శ్రీనివాస్ said...

వేగముగా టైపు చేయుటలో నాలిక మడతపడినది విశ్వప్రయత్నం గా చదువుకొన మనవి.. :D

శ్రీనివాస్ said...

రెల్లీవీది గలీ గల్లీ అన్వేషిస్తే మీకు అక్కడ అవి కనిపించవచ్చు అన్న సాక్షిగా :D

తార said...

ఎవరూ కనపడేది అన్నా??

హరే కృష్ణ said...

:) :)

నాగప్రసాద్ said...

:) :)

శ్రీనివాస్ said...

నాగా ....నన్ను చూసి అందరూ స్మైలీలు పెట్టడం నేర్చేసుకున్నారు అయ్

Raja said...

hahahahaha, keka pettincharu gaa aa father ni

Anonymous said...

అల్టిమేట్ గ ఉండండి......సూపర్.....

Unknown said...

యేసు క్రీస్తు అందరికి ప్రభువు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. 18ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 19ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20దుష్కార్యము చేయు4 ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. 21సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచ బడునట్లు వెలుగునొద్దకు వచ్చును.

ఈ టపా వ్రాసిన వారు, చదివిన వారు, చదవబోయే వారు, అందరూ రక్షించబడాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

Anonymous said...

పాస్టర్ బయ్యా నువ్వు రాసింది నీకు అర్థమయితుందా. ఏంది వయ్యా బుచికి బోధనలతోని సంపకతింటారు.