అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/13/10

ఆమె - నేను - కేరళ

టపా శీర్షిక చూసి పక్కా రొమాంటిక్ లేదా కామెడీ అనుకోకండి ఇందులోకూడా కాసింత విషాదం ఉంది. అయితే జీవితం లో మొదటి నన్ను నేనే థు నా మొహం మీద చీమ చీమిడెయ్య అని తిట్టుకున్న సందర్భం ఇదే. ఇది పన్నెండేళ్ళ క్రితం స్టోరీ. అప్పట్లో మేము రోజు ఒంగోలు లో ఒక ఏరియాలో ఉన్న ఒక నర్సింగ్ హాస్టల్ పక్కనే ఉన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆ హాస్టల్ గోడ ఆనుకునే గ్రౌండ్ ఉండేది. ఆ హాస్టల్ లో ఉండే కేరళ అమ్మాయిలు మొదట్లో ఫోజు కొట్టినా పోను పోను మా ఆట చూడ్డానికి గోడ ఎక్కి కూర్చునేవారు. అయితే మా పిల్ల బ్యాచ్ లో కూడ ఎవరూ వాళ్ళని కదిలించ లేదు అనుకోండి ( అప్పుడు అంత ధైర్యం కూడా లేదు). అయితే మాకంటే ఒక నాలుగేళ్ళ పెద్ద బ్యాచ్ అయిన కన్నా అండ్ కొ బ్యాచ్ మాత్రం ఆ గ్రౌండ్ మద్య లో ఉన్న రాళ్ళ మీద కూర్చుని వాళ్లకి లైన్ వేసే వాళ్ళు. మద్య మద్య లో వచ్చి మా దగ్గర బలవంతంగా బ్యాట్ లాక్కుని ఆడేవాళ్ళు కూడా. అయితే ఎప్పుడు ఏ గొడవ జరగలేదు. పోను పోను ఆ పెద్ద బ్యాచ్ లోకి కొత్త మొహాలు రావడం స్టార్ట్ అయింది. వేరే వేరే గల్లీల వాళ్ళు, కన్నా కి పరిచయం ఉన్న వాళ్ళు రావడం మొదలైంది. ఎవడో కోతి కామెంట్లు చేయడం .. అమ్మయిలు గోడ ఎక్కడం మానుకోవడం అన్నీ చకా చకా జరిగిపోయింది. అయితే .. మేము గమనించిన అంశం ఏంటంటే .. వీళ్ళకి వాళ్లకి మద్య ఏదో నడిచింది.. మాకు అర్ధం అయ్యేది కాదు. అప్పుడప్పుడు కన్నా గాడి బ్యాచ్ ... అ నర్సులు ఉండే హాస్పిటల్ కి కూడా ఏదో వంకతో పోయి వచ్చేవారట. ఈ విషయం మా ఆస్థాన వికెట్ కీపర్ కర్ణ చెప్పాడు.

కొన్నాళ్ళు గడిచాయి ... ఒకరోజు కన్నా నన్ను వెతుకుతున్నాడు అని తెల్సి నేనే వాళ్ళ అడ్డాకి వెళ్లాను . కాసేపటికి కన్నడు వచ్చాడు. " ఏంటి కన్నా నా గురించి అడిగావంట" అన్నాను .. వీడెక్కడ అప్పు అడుగుతాడేమో అన్న భయంతో. " రేయ్ శీనుగా నువ్వు ఒక హెల్ప్ చేయాలిరా .దీనికి నువ్వు అయితేనే కరక్ట్ .... ఇంకెవారినీ నమ్మలేను " అన్నాడు దీనంగా. " ఏమైంది కన్నా " అన్నాను . డబ్బులు మాటర్ కాదని అర్ధం అయింది. "చెప్తా పద" అని నన్ను ఒక హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి చెప్పాడు " మా ఫ్రెండు దుర్గా గాడు తెల్సు కదరా వాడు .. ఆ నర్సింగ్ హాస్టల్ లో ఒక అమ్మాయిని పడేశాడు రా " అన్నాడు ... "ఓహో అయితే నేను ఇపుడు ఆ అమ్మాయికి లెటర్లు గట్రా అందివ్వాలా" అన్నాను. " కాదురా .. అ అమ్మాయి వాడికి పడింది ... ఇపుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ " అన్నాడు. ఒర్నీయయ్య ... మాకు తెలీకుండా ఎంత కత నడిపారురా అనుకుని .. "సరే ఇప్పుడేంటి మాటర్ "అన్నాను . ఏముంది నిన్న ఆ పిల్ల హాస్టల్ నుండి వచ్చేసి నా సంగతి తేల్చు అని మనోడిని నిలదీసింది. వీడు ఆపిల్లకి ఎం మాయ మాటలు చెప్పి తెచ్చాడో గానీ రాత్రి ఈ హాస్పిటల్ కి తెచ్చి అబార్షన్ చేయించాడు. తర్వాత అమ్మాయి నిద్రపోతుంది. ఆటైం లో మాఇంటికి వచ్చి .... మామా కొంప మునిగిందిరా ..... షీబా ప్రెగ్నెంట్ అయింది రా.. నేను అబార్షన్ చేయించాను ... అదేమో పెళ్లి చేసుకోమని దొబ్బుతుంది. మా ఇంట్లో చెప్తే చంపేస్తారు .. ఎలాగోలా కాపాడమని కాళ్ళు పట్టుకున్నాడు రా ... ఆ పిల్లని ఎలాగైనా కేరళా లో వదిలి రమ్మని చెప్పి జంప్ అయ్యడురా ఎటుపోయాడో తెలీదు .... ఇపుడు నాకేం అర్ధం కాడం లేదు" అన్నాడు .


ఒక్కసారిగా నాకు దిమ్మ తిరిగిబొమ్మ కనపడింది . "అబార్షన్ చేయించడం ఏంటి కన్నా తప్పు కదా" అన్నాను. దుర్గా గాడు కనిపిస్తే బహుశా కొట్టేవాడినేమో. సరే ఇంతకీ ఆ షీబా ఎవరో చూద్దామని లోపలి చూశా ... చాలా నీరసంగా మంచం మీద పడుకుని దీనంగా చూస్తుంది. నాకు చాలా బాదేసింది. ఏ తల్లి కన్నా బిడ్డో ఎందుకు ఈ పిల్లకి ఈకర్మ అనుకున్నా . లోపలోకి వెళ్లి ముందు అమ్మాయిని కేరళ వెళ్ళడానికి ఒప్పిద్దాం అన్నాడు. సరే పద అని లోపలికెళ్ళా.

దాదాపు అరగంట బతిమాలాక ఆమె ఒప్పుకుంది కానీ ... కన్నా వాళ్ళ చెల్లి పెళ్లి నాలుగు రోజుల్లో ఉంది .. కన్నాకి కుదరదు. మిగిలిన వాళ్ళకి చెబితే మొత్తం టాం టాం చేస్తారు కనుక ఆ పిల్లని కేరళ లో దింపే బాద్యత నా భుజాల మీద పెట్టాడు కన్నా. అప్పటి దాకా అటు విజయవాడ , ఇటు తిరపతి తప్ప దాటి పోనీ నేను కేరళ దాకా..... అదీ అమ్మాయిని తీసుకుని ... అని తలచుకుంటేనే ముందు భయం వేసింది. ఒక పక్క ఆపిల్లకేమో ఆరోగ్యం పూర్తిగా డామేజ్ అవుతుంది. పైగా బ్లీడింగ్ ఆగడం లేదు అని చాలా బాధగా చెప్పుకోలేక చెప్పుకుంది. నాకైతే కడుపులో దేవినట్టు అయింది. అప్పుడు సాయంత్రం ఐదు అయింది టైం .. ఎనిమిది గంటలకి శబరీ ఎక్స్ప్రెస్ ఉంది అన్నాడు కన్నా. డిస్చార్జి చేయించి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లాం ... కనిసం నేను ఇంట్లో కూడా చెప్పలేదు. టిక్కెట్లు కన్నా తీసుకొచ్చాడు . ట్రైన్ వచ్చింది. "రేయ్ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కండి ... నేను టిసి తో మాట్లాడి మీకు బెర్త్ ఆరెంజ్ చేస్తా" అని చెప్పి వెళ్లాడు కన్నా .. నేను జాగ్రత్తగా ఆమెని రైల్ ఎక్కించి ... బాత్రూం పక్కనే ఉన్న సీట్ లో అతన్ని బతిమాలి ఆమెని కూర్చోబెట్టా . ట్రైన్ కదిలింది. కన్నా అంతు పత్తా లేడు. ట్రైన్ ఊరు దాటింది. నా దగ్గర అసలు డబ్బులు లేవని అప్పుడు గుర్తు వచ్చింది. .. అమ్మాయి కడుపు నొప్పితో విల విల లాడుతుంది .... పక్కనే కింద సీట్లో జనాన్ని బతిమాలి .. పడుకోపెట్టా. జనాలు నా వైపు వింతగా చూస్తున్నారు. ఆడాళ్ళు అసహ్యంగా చూస్తున్నారు. బహుశా అమ్మాయి వాలకాన్ని బట్టి కేసు అర్ధమై అబార్షన్ చేయించింది నేనే అనుకుని ఉంటారు .

ఇక ఆరాత్రి అంతా .. అమ్మాయి బాత్రూం అన్నప్పుడల్లా తీసుకెళ్లడం .... మళ్లా తీసుకొచ్చి పడుకోబెట్టడం .... మద్య మద్యలో " విధి .. చాలా స్ట్రాంగు " అని బ్రహ్మానందం టైప్ లో వైరాగ్యంగా అనుకోవడంతో గడిచింది. ఆమె మాత్రం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాట్లాడేది. మర్నాడు మద్యాహ్నానికి కేరళ లోకి ట్రైన్ ఎంటర్ అవడం తోనే ఇక నేను ఎవరో తెలీనట్టు బిహేవ్ చేయడం మొదలెట్టింది. ట్రైన్ లో మలయాళీలు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు పెట్టినవి తిని కనీసం కావాలా అని కూడా అడగ లేదు . పోన్లే మళ్లా తెల్సిన వాళ్ళు ఉంటారు అని భయపడుతుంది ఏమో అనుకున్నా . అప్పటికి నేను తిని 24 గంటలు స్నానం చేసి 30 గంటలు అయింది. ఏర్నాకూలం చేరాం . అక్కడ ట్రైన్ దిగి ఆ మలయాళీలతో మాట్లాడుకుంటూ వెళ్లి అక్కడ ఏదో బస్సు ఎక్కి కూర్చుంది. ఒక థాంక్స్ కాదు కదా అసలు నా వైపు చూడను కూడా చూడలేదు. ఆ బస్సు కదిలి వెళ్ళిపాయింది. నా దగ్గర డబ్బులు లేవని అప్పుడు గుర్తు వచ్చింది. ఇక వెనక్కి ఎలా వచ్చానో ... ఇంట్లో ఎన్ని తిట్లు తిన్నానో .... హు థు నా మొహం మీద చీమ చీమిడెయ్య.

( ఇంతటితో ఈ తరహా విషాద ప్రేమ కధల సీరిస్ ముగిస్తూ ... ఇక నుండి కొన్నాళ్ళు కామెడీ టపాలు వేస్తా : )

28 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

ఇంతకీ వచ్చిన తరువాత ఆ కన్నా గాడిని ఏం చేశారు? దుర్గా అనే వాడు ఆ పాటికే అసలు ఆ కేసు మీదే అని ఊరంతా చెప్పాడా లేదా :)

Sravya V said...

ఆ చివర్లో రెడ్ కలర్ అక్షరాల్లో ఉన్న వాక్యం నాకు భలే నచ్చింది సుమండీ :)
మొత్తానికి మళయాళ కుట్టి మిమ్మల్ని బుక్ చేయకుండా వదిలినందుకు అభినందనలు !

శ్రీనివాస్ said...

@ వీకెండ్ పొలిటీషియన్ గారు, ఇంక ఆ మాటర్ అంతటితో వదిలేశాం . కన్నా గాడిని మాత్రం వంగోపెట్టి వీపు మీద గుబిల్ గుబిల్ మని గుద్దిపడేశా.

శ్రావ్య గారు ... ఇకపై అంతా కామెడీ నే :)

Malakpet Rowdy said...

Start rediff stories - change the names. You can use mine though, I have no issues

వేణూశ్రీకాంత్ said...

"( ఇంతటితో ఈ తరహా విషాద ప్రేమ కధల సీరిస్ ముగిస్తూ ... ఇక నుండి కొన్నాళ్ళు కామెడీ టపాలు వేస్తా : )"

శుభం :-) waiting for your next post.

Anonymous said...

మహాప్రభో ఇంక ఆపండి బాబు ఈతరహా కధనాలు మంచి నవ్వించే పోస్టులు వేయండి.

Anonymous said...

నాకు దీన్లో మాంచి హీరోయిజం కనిపిస్తున్నదప్పా,
అసలు కేరళ నుంచి మళ్ళీ ఒంగోలుకి ఎలా వచ్చారో కాస్త రాస్తే బాగుంటుందెమో..నాకు మాంఛి సాహస యాత్ర కనిపిస్తున్నది దీన్లో..

మహానుభావా said...

సూడు పెద్ద శీను ... నీ మేడలో బంగారు గొలుసులు అట్లా ఏమైనా ఉండేవా ? అక్కడి నుండి ఎలా వచ్చావనేది కావాలి నాకు ... దొంగ లా ట్రైన్ ఎక్కి lavetory లో 24 గంటలు కూచుని వచ్చావని నా నమ్మకం .. ఎతంటావు ...

Sai Praveen said...

దిల్ చాహతా హై లో సైఫ్ లాగ తిరిగొచ్చి దిండు మీద కూర్చుని ఉంటారు. అందుకే చెప్పట్లేదు :P (Just kidding)
కామెడి రాస్తానంటే ఎవరు వద్దనరు కాని అప్పుడప్పుడు ఇలాంటివి కూడా రాస్తూ ఉండండి. They are interesting too..

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

interesting. how you came back?

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

interesting. how you came back?

Unknown said...

మలక్కు మద్యలో నన్ను లాగకు
రిడిఫ్ఫ్ అంటే పిచ్హపిచా కధలు గుర్తొస్తే కష్టం
యింక పాయింట్ లోకి వస్తే కేరళ కుట్టి
దార్లో యి పీనాసి శీను నాకు కనీసం బటానీలు కూడా కొనివ్వ లేదు
బాత్ రూం కి తీసికేల్లడం తప్ప అనుకుని దిగాక బదలా తీర్చుకుందేమో?
మనసిలాయో?

నేస్తం said...

దార్లో యి పీనాసి శీను నాకు కనీసం బటానీలు కూడా కొనివ్వ లేదు
అనుకుని దిగాక బదలా తీర్చుకుందేమో?
మనసిలాయో?
రవిగారి డవుటే నాకూను
అయినా నేను ఒక మోస్తరు విలన్ లా అనుకుంటుంటే ఇలా మంచిపనులు చేసి హీరోవి అయిపోవడం నాకు అసలు నచ్చలేదు :)

నేస్తం said...

దార్లో యి పీనాసి శీను నాకు కనీసం బటానీలు కూడా కొనివ్వ లేదు
అనుకుని దిగాక బదలా తీర్చుకుందేమో?
మనసిలాయో?
రవిగారి డవుటే నాకూను
అయినా నేను ఒక మోస్తరు విలన్ లా అనుకుంటుంటే ఇలా మంచిపనులు చేసి హీరోవి అయిపోవడం నాకు అసలు నచ్చలేదు :)

ప్రసాదం said...

అబ్బే వెధవ మొహమాటం మీరూనూ ఇంకా రాయండి, ఏ రాధికానో, ఏక్తా కపూరో మిమ్మల్ని కిడ్నాప్ చెయించే వరకు రాస్తూ ఉండండి. అసలు మీరు ఎలా వెనక్కి వచ్చారు. మీరు చెప్పకపోతే మరో మహానుభావుడు వచ్చి మరేదో చెప్పి మీకు జీవితం మీద విరక్తి కలిగిస్తారు. :)

శ్రీనివాస్ said...

@ మలక్ ఇక నుండి మొదలెడతా ..బ్రదర్
@ వేణు గారు ఇక మిమ్మల్ని నవ్వించే బాద్యత నాది

@ అనానిమస్ ... తప్పకుండా
@ తారా హీరోఇజం కనిపిస్తుందా లేక బకారాయిజం కనిపిస్తుందా .. నేను వెనక్కి ఎలా వచ్చానో .. ఆ దేవుడికే తెలియాలి

శ్రీనివాస్ said...

@ మహాను బావా .. ఏమీ లేవు బాబు . జస్ట్ ట్రైన్ ఎక్కి జనాల మద్యలో కూర్చున్నా .. టిసి అను పేరుగల మఘానుభావుడేవడూ రాక పోవడం వల్ల రెండు రైళ్ళు మారి ఇంటికి చేరుకున్నా

@ సాయి ప్రవీణ్ .... విషయం ఉన్న టపాలు అయితే తప్పకుండా వేస్తా

@ లక్ష్మీ నారాయణ గారు పైన ఇచ్చిన సమాధానం చూడండి

శ్రీనివాస్ said...

@ రవి గారు రేడిఫ్ఫ్ కధలు మొదలయ్యేది ముందు మీ పిచ్చ కద తోనే

@ నేస్తం .... నా మీద ఈ రేంజి కక్ష ఉందని ఇప్పుడే అర్ధం అయింది.

@ ప్రసాదం గారు .. మొతానికి సీరియల్స్ రాయడానికి బాగా పనికి వస్తాను అంటారు.

హరే కృష్ణ said...

:) :)
బావుంది :P

శ్రీనివాస్ said...

@ హరికృష్ణ ... ఏం బాగుంది ... డబ్బుల్లేకుండా నేను బుక్ అవడమా?

హరే కృష్ణ said...

శ్రీనివాస్ గారు
మీరు రాసిన విధానం బావుంది అని అన్నాను :)

ఒంగోలు రాయుడు said...

asalu kerala to ongole ela vacharo... o story raste baguntundemo...

Anonymous said...

బాసు, నేను ఐతే, నా దగ్గిర పైసా లేదు అని తెలిసాక, రైల్లోనుంచి దూకి ఐన వచ్చేసేవాడ్ని తెక్కడ తెలిసిందో అక్కడినుంచే.. కానీ మీరు తెలిసీ కేరళా వెళ్ళటం, మళ్ళీ రావటం చాలా ధైర్యం కావాలి, అది ఖచ్చితంగా సాహస యాత్రే మరి.

అసలు ఇంట్లో చెప్పే వెళ్ళారా? తిరిగి వచ్చాక ఇంట్లో ఏమన్నారు? అసలు ఎలా మ్యానేజ్ చేసారు, అబ్బ చెప్పండి భలే సస్పెన్స్లో వదిలేస్తే ఎలా?

Anonymous said...

ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆ మలయాళ కుట్టి మనసులో మీరో బ్రోకర్ లాగా అనిపించి విఉంటారు. అంటే సినిమాలో విలన్ పక్కన వుండే గుండోళ్ళలా. ఏమనుకోకు బ్రదర్ కొంచెం విడమర్చి చెప్తా, ఓ విధంగా రేపులు జరిగేసాక పక్కలు సర్దే రకం అనుకోండి. పింపులకు ఎవరైనా థాంక్సులు చెప్తారా? మీరు ఫ్రీగా కేరళ ట్రిప్ వస్తే వదులుకోరని మీ ఆ జులాయి మిత్రులకు బాగా తెలుసు , అందుకే మీరే ఈపనికి స్పెసల్గా ఎన్నుకోబడ్డారు. మీరు చేసిన పనికి థాక్సులు మరోటే మరోటో ఆ మలయాళ కుట్టి నుంచి ఆశించడం అత్యాశ, పశ్చాత్తాప పడటం మంచిది.

శ్రీనివాస్ said...

@ పై అజ్ఞాత ,:) మీ పదాల ప్రయోగం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా

ఓం సాయిరాం ఇదే నా సమాధానం

నేను said...

chivari ajnaata,
baaga chepparu. meeku manchi anubhavam vunnattundi. kaakapote daanlo mee character edo ardham chesukolekapoyaanu.

Anonymous said...

పాపం పై అజ్ఞాత గారికి పచ్చ కామెర్ల వ్యాది ఉన్నట్లుంది .

Anonymous said...

sreenivaas spandinchina vidhaanam prashamshaneyam.