అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/9/10

చెత్తకుండీలో మరో చిట్టితల్లి

మానవత్వం మరోసారి మంటగలిసింది . తల్లి ఒడిలో సేదతీరాల్సిన ఒక చిన్నారి పుట్టిన తొమ్మిది నెలలకే చెత్తకుండీ పాలైంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు అందరూ ఉన్నా అనాథలా మార్చారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో గల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో తొమ్మిదినెలల చిన్నారిని తల్లిదండ్రులు వదిలి వెళ్లారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ప్రస్తుతం పాప పోలీసుల సంరక్షణ లో ఉంది.

ఈ విషయానికి సంబంధించి నా విన్నపం. ఇప్పుడు ఆ పాపా పోలీసుల సంరక్షణ లో ఉంది. పోలీసులు ఆ పాపని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు .. తర్వాత అన్ని మొగ్గలలాగానే ఈ మొగ్గ కూడా ఎన్నో అవస్థలు పడాలి. అందుకే ఈ పాపకి మంచి జీవితం జీవితం ఇవ్వడం లో తోడ్పడదాం. హైదరాబాద్ లో ఉండేవారు ఎవరైనా ...ఈ పాప ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏదైనా ప్రైవేట్ అనాధ శరణాలయం లో చేర్పించేందుకు పర్మిషన్ ఇస్తారా అనేది ఎవరైనా విచారించి నాకు తెలియ చేస్తే ... మంచి ఆశ్రమం లో ఉంచి మెరుగైన విద్యాబుద్దులు చెప్పించేలా చూస్తానని సహాయ తరపున మనవి చేస్తున్నాను.

స్పీడ్ గా టైప్ చేశాను తప్పులు ఉంటే సర్దుకోగలరు.

4 comments:

స్వర్ణమల్లిక said...

శ్రీనివాస్ గారు,

నిజంగానే ఆంధ్రా కుర్రాళ్ళకి ఐడియల్ మీరు. కనీసం వందమందిలో ఒక్కరు ఇలా ఆలోచించినా .. ఈ పసిపిల్లల జీవితాలు వెలుగు దారి పడతాయి. మనలో మనం బ్లాగుల్లో ఈ విషయాల గురించి చర్చల పేరుతొ కలహించుకోడం కన్నా ఇది ఉత్తమమైన పని. ఇలాంటి పరిస్తితులను ఇప్పుడిప్పుడే మార్చలేము, మనకు చేతనయినంతలో మంచి చేయడమే.

స్వర్ణమల్లిక said...

శ్రీనివాస్ గారు,

నిజంగానే ఆంధ్రా కుర్రాళ్ళకి ఐడియల్ మీరు. కనీసం వందమందిలో ఒక్కరు ఇలా ఆలోచించినా .. ఈ పసిపిల్లల జీవితాలు వెలుగు దారి పడతాయి. మనలో మనం బ్లాగుల్లో ఈ విషయాల గురించి చర్చల పేరుతొ కలహించుకోడం కన్నా ఇది ఉత్తమమైన పని. ఇలాంటి పరిస్తితులను ఇప్పుడిప్పుడే మార్చలేము, మనకు చేతనయినంతలో మంచి చేయడమే.

శ్రీనివాస్ said...

స్వర్నమల్లిక గారు ఆ పాప వివరాలు దొరకలేదు

రేణూకుమార్ said...

సాధ్యమైనంతలొ ఆ పాప వివరాలు తెలియచెయండి, ఆ పాపని దత్తతకొసం మా బాబాయిని ఒప్పిస్థాను.

రేణూకుమార్