అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/30/09

బ్లాగ్కర్ణుడు - వీడికి బ్లాగు లేదు

కూడల్లో బ్లాగరుల మద్య బ్లాగ్ కాంపిటీషన్ జరుగుతుంది .. బ్లాగ్ పెద్దలు బ్లాగ్ పూజ్యులు సీనియెర్ బ్లాగరులు ... బ్లాగ్భీష్మ పితామహులు మరియు బ్లాగ్ కురువృద్ధులు అందరు అక్కడ ఉన్నారు. తమ సత్తా నిరూపించు కోవాలని బ్లాగరులంతా ఉత్సాహం గా ఉన్నారు.

పోటీ ప్రారంభించినారు........ ఒక్కొక్కరే తమ బ్లాగును పబ్లిష్ చేస్తున్నారు . నిర్వాహకులు మార్కులు వేస్తున్నారు ......కరతాళ ధ్వనుల మధ్య రవి గారు గెలవడం దాదాపు ఖాయం అనుకున్న సమయం లో వచ్చాడొక యువకుడు " నేనుకూడా బ్లాగుతా" అంటు.

అతని పేరు
బ్లాగ్కర్ణుడు అతని మోహము లో కనిపిస్తున్న బ్లాగ్ తేజస్సు కు భయపడిన మలక్పేట్ రౌడీ ఎలా ఐనా రవి గారిని గెలిపించాలని "అటులనే బ్లాగెదవు కాని నీ బ్లాగు తెలుగు ఫాంటు లో ఉందా లేదా వివరాలేవి" అని అడిగాడు.. సమాధానంగా మౌనాన్ని ఆశ్రయించాడు బ్లాగ్కర్ణుడు . ఏమి నీమౌనము తెలుగు టైపు రాదా అని ప్రశ్నించాడు మలక్పేట్..... రాదన్నాడు బ్లాగ్కర్ణుడు .... ఐన నీవు అనర్హుడవుప్రకటించినాడు మలక్పేట్.. నిరాశ తో వెనుదిరిగినాడు బ్లాగ్కర్ణుడు.

"ఆగాగు" గంభీరమైన స్వరం వినిపించి అందరు అటు చూసారు ... లాప్టాప్ భుజాన పెట్టుకుని మధ్య లోకి వచ్చాడు వికటకవి .... "మలక్పెటా ...... ఏమంటివి ఏమంటివి ఇది బ్లాగ్ పరీక్షయే గాని ఫాంట్ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది ఫాంట్ పరీక్ష అన్డువా మొన్న మొన్న దాక ఆర్కుట్ లో మనము వాడినది ఏ ఫాంటు .. నీ రౌడీ రాజ్యము లో అప్పుడప్పుడు నీవు వాడినది ఏ ఫాంటు ఇంత ఏల లేఖిని కి ముందు అసలు మన అందరిది ఏ ఫాంటు .. నాతొ చెప్పిన్తు వేమయ్య యాహూ చాట్ లో ను .. తెలుగు పీపుల్ నందు మేము వాడినది ఏ ఫాంటు .. అతి జుగుప్సాకరమైన భాష వాడే రిడీఫ్ చాట్ నందు మన జనాలు వాడినది ఏ ఫాంటు .... హె .... మనము ఏ నాడో ఆంగ్ల ఫాంటునకు అధీనులమైనాము .. మళ్ళా ఈ నాడు ఫాంటు ఫాంటు అంటూ ఈ ఫాంటు గోల ఏమి " అన్నాడు వికటకవి ఆవేశం గా.

పరిస్థితి చేయి జారి పోతుంది అనుకున్న జీడిపప్పు గారు వచ్చి .. "సరే నాయనా వికటకవి లెస్ పలికినా లెస్స పలికితివి .... అటులైన ఫాంటు పట్టింపు లేదు కాని ఇతను బ్లాగవలెనన్న బ్లాగు కావలెను కదా ... బ్లాగు లేని ఇతను ఏల బ్లాగుతాడు ఐన ఇప్పుడు సృష్టించినా కూడలి లో సభ్యత్వం కావలెనన్న ఇంకా రెండు రోజులు పట్టును కదా" .... అని ప్రశ్నించి .. చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మానందం లా రవి గారి వంక చూసి కళ్ళెగరేసి బాగా చెప్పానా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూర్చున్నాడు.

వెంటనే వికటకవి .... బ్లాగు ఉంటేనే ... బ్లాగానిస్తారంటే ... ఇతన్ని నా బ్లాగు లో మెంబరు గా చేర్చుకుంటా అనగానే .. .. సమయమ మించి పోయింది అని గంట కొట్టారు నిర్వాహకులు . ఈ గొడవల కారణంగా పోటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ...

మరునాడు , ఆనాడు , ఆంధ్ర మంట , చంద్ర మరియు అక్కుపక్షి పేపర్లలో న్యూస్... ఇలా ఉంది.

కూడల్లో జరిగిన బ్లాగుయ్ల పోటీ ఒక యువకుని కారణం గ రద్దయినది అని ... ఆ యువకుడు బ్లాగ్కర్ణుడు అని ఇంతకీ
బ్లాగ్కర్ణుడు ఎవరు అని ఆరా తీయగా అతని పేరు రాజేష్ అని ... బ్లాగడం కాదు కదా కనీసం బ్లాగులో పాకడం కూడా రాని వాడని...... గొడవ చేసి రవి గారి గెలుపుకు అడ్డు కట్ట వెయ్యడానికే వికటకవి అతన్ని తీస్కోచ్చాడని తెలిసిన రవి గారు కోపోద్రిక్తులై .. వికటకవి కోసం కూడలి, జల్లెడ , ఆర్కుట్ నగరాల్లో గాలిస్తున్నట్లు సమాచారం.

వికట కవి ని పట్టిచ్చిన వారికి పది కామెంట్లు బహుమతిగా ఇస్తా
అని అయన ఈ సందర్భంగా ప్రకటించినట్లు సమాచారం ,వికట కవిని పట్టుకోవడానికి మలక్, జీడిపప్పు , నేస్తం, కిరణ్ (ఐతే ఓకే ) , చైతన్య , బ్లాగు సోదరి గార్లు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారని అభిజ్ఞా వర్గాల భోగట్టా.

10 comments:

చైతన్య said...

నన్ను కూడా లాగారా మీ బాగోతం(భరతం)లోకి!!

పోస్ట్ బాగుంది :)

కన్నగాడు said...

"చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మానందం లా రవి గారి వంక చూసి కళ్ళెగరేసి బాగా చెప్పానా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూర్చున్నాడు." :)

ఏమంటివేమంటివి డైలాగు కేక,
మొత్తంగా చాలా బాగుంది.

Malakpet Rowdy said...

LOLLLLLLLLL ... hehehehhehehe

Anonymous said...

బ్లాగుంది

కొత్త పాళీ said...

హ హ హ.
Good one.

నేస్తం said...

మీరు భలేవారండి :) మొత్తానికి నన్నూ ఇందులోకి లాగారన్నమాట..మీరిక్కడున్నారని కనిపెట్టేసానుగా మరి రేపు ఈ పాటికి నా బ్లాగ్ లో 10 కామెంట్స్ రావాలి.. లేకపోతే రాజేష్ చేత మీ బ్లాగ్ కి కామెంట్స్ ఇప్పిస్తాను :)

జ్యోతి said...

బ్లాగు బ్లాగు..

సర్వం బ్లాగుమయం చేసారా?? ఇక మిగతా పురాణాల సంగతి చూడండి.. కాని DVS కర్ణ గుర్తొచ్చింది..

శ్రీనివాస్ said...

@చైతన్య ఇది బ్లాగ్భారతం

ధన్యవాదాలు ,, మలక్ , కన్నా, కొత్తపాళీ , నెటిజన్ గార్లు

నేస్తం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోడం రవి గారు కదా చెయ్యాలి .. కావాలంటే మీకు కామెంట్లు నేను రాస్తాను .... రాజేష్ ని నామీదకి వదలకండి

@జ్యోతి గారు

సర్వ వెబ్సైటానం బ్లాగ్ ప్రధానం అన్నారు కదా అందుకే సర్వం బ్లాగ్ మాయం చేసా

satya said...

too good!

జీడిపప్పు said...

హ హ్హ హ్హా, బాగుంది బాగుంది.
"లెస్ పలికినా లెస్స పలికితివి" ఇది అదిరింది.
అన్నట్టు చిత్రం భళారే విచిత్రంలో బ్రహ్మానందం తల ఎగరేసే బొమ్మ - http://i41.tinypic.com/ekq3yo.gif