అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/25/09

బ్లాగోపాఖ్యానం

ముందు మాట: ముందుగా ఈ టపా చదవడానికి వచ్చిన పెద్దలకి చిన్నలకి నా విన్నపం... ఈ టపా సరదాగా నవ్వుకోడానికి రాసాను. అంతే గానీ ఎవరినీ ఎత్తి పొడవడానికి కాదు. కోప తాపాలకు తావివ్వకుండా మీ సోదరుడు చేసిన చిన్ని హాస్య రచనగా భావించి చదవండి.

మొత్తం బ్లాగ్లోకం లో బ్లాగరుల సంఖ్య నాలుగు కోట్ల మూడు లక్షల తొంభై ఆరు వేల ముప్పయి నాలుగు
వీరిలో భారతీయులు పదకొండు లక్షల ముగ్గురు
వీరిలో తెలుగు వారు ఒక లక్షా ఇరవై వేల ఇరవై నాలుగు
వీరిలో తెలుగులో బ్లాగు వ్రాయు వారు మూడు వేల మంది
వీరిలో మగ వారు పద్దెనిమిది వందల ముప్పయి మూడు
ఆడవారు పదకొండు వందల అరవై ఏడు
వీరిలో బ్లాగులు డిలీట్ చేసిన వారు వంద మంది
కూడలి లో నమోదు ఐన వారు మూడు వందల మంది
వీరిలో ఆడవారు నూట ముప్పై
మగ వారు నూట డెబ్బై
నిరంతరం బ్లాగులో టపా లు రాసేవారు రెండు వందల యాభై మంది
అప్పుడప్పుడు రాసే వారు ఇరవై మంది
బ్లాగు నమోదు చేసుకుని మాత్రమే ఉండేవారు పది మంది
ఏదో ఒక సొల్లు టపా ఒకటి అలా వదిలేసే వారు ఇరవై మంది
ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు ఉన్నవారు పంతొమ్మిది మంది
పక్క బ్లాగులు చూసి కామెంట్లు రాసి ఉత్సాహ పరిచే వారు నలభై మంది
కామెంటు చెయ్యకుండా అదే పనిగా బ్లాగులన్నీ చూసి పొయ్యే వారు డెబ్బయి మంది
అజ్ఞాత కామెంట్లు రాసే వారి సంఖ్యా అజ్ఞ్జాతం
బ్లాగులో టపా రాసి.. నా బ్లాగు చూడు చూడు అని సావ దొబ్బే వారు ఎనభై ఏడు మంది
నేను నీబ్లాగు లో కామెంటు రాస్తా నువ్వు నా దాన్లో కామెంటు రాయి అని కుళ్ళ బొడిచే వారు పది మంది.. అమ్మాయిల బ్లాగుల్లో కామెంటు రాసి వారి దృష్టి లో పడాలనుకునే మగబ్లాగార్ల సంఖ్య నూట డెబ్బై( వంద శాతం) హిట్లు పెంచుకోవడానికి హిట్ కౌంటర్ పెట్టుకుని అదే పనిగా రిఫ్రెష్ బటన్ నొక్కుకునే వారు రెండు వందల తొంభై తొమ్మిది
వివాదాల ద్వారా ఫేం అవుదాము అనుకునే వారు పన్నెండు మంది
ఫేక్ బ్లాగరులు ఇరవై ఏడు మంది

ఇంక హిట్లు...

సగటున సాహిత్య బ్లాగుకి ఒక రోజు హిట్లు ఆరు
కామెడి బ్లాగుకి వంద
రాజకీయ విమర్శకులకు ముప్పై
వ్యక్తిగత బ్లాగులకి అరవై ఆరు
చాల కాలం నుండి బ్లాగ్లోకం లో ఉంటూ సీనియెర్ లు అయిన వారికి (బుక్ మార్క్స్ అయి ఉంటారు కనుక ) నూట ముప్పై
కధలు రాసే వారికీ సగటున రోజుకి ఇరవై
బూతుల బ్లాగుకి పదకొండు వందలు ( దేవుడా రక్షించు)

గమనిక:
పైన ఉన్న వివరాలు సరి కాదని, తప్పని ఎవరికన్నా అనిపిస్తే.. సరైన వివరాలతో వారు వస్తే నేను టపా సరి చేస్తాను.
ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నా కూడలి జ్యురీష్ డిక్షన్ పరిధి లో వాదోపవాదాలు జరుగ వలెను ..
ఈ టపా వలన ఎవరి మనసులయిన మండితే రాజేష్ చేత బర్నాల్ రాపించే సౌకర్యం వినియోగించుకొనవలసిన ప్రార్ధన.

ఇట్లు
బ్లాగ్ భవదీయుడు

వికటకవి

11 comments:

చైతన్య said...

బాగానే కష్టపడ్డారు :)

మీరు చెప్పిన లిస్టులో నేను ఐదు category లలో ఉన్నాను... నాకు తెలిసి మీరు ఏడు category లలో ఉన్నారు ;)

జ్యోతి said...

hmmm. లెక్కలు బానే ఉన్నాయి...

శ్రీనివాస్ said...

ఏదో మీ అభిమానం

చైతన్య గారు మీరిలా అంతః పుర రహస్యాలు బయట పెట్ట కండి

Anonymous said...

hehehe meeru chala funny srini

చైతన్య.ఎస్ said...

బ్లాగ్ "ఠాగూర్" ఆ ??? :)
బాగుంది లెక్కలు.

నేస్తం said...

:) బాగుంది

శ్రీనివాస్ said...

అబ్బో నేస్తం గారు నా బ్లాగు లో తోలి సరి కామెంటు చేసారనుకుంట .. కుడి కాలు ముందు పెట్టి లోనికి వచ్చారా

Srividya said...

బావుంది :) :)

జీడిపప్పు said...

హ హ్హ హ్హా బాగుంది. గమనిక బహు బాగున్నది.

Farook said...

Naaa Manasu baaagaa mandindi, rajesh gadini pampava burnol ichi. Vadu Burnol techi raastado leka mottam tagaledatado konchem clearga vadiki ardham aiyela cheppi pampu seeenannna

Anonymous said...

బలే బలే