అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/16/09

స్టార్ స్లిప్స్

మహేష్ బాబు : ఎన్ని స్లిప్పులేట్టామని కాదు అన్నయా ………….. కొషిన్ దిగిందా లేదా

జూనియర్ యెన్. టి . ఆర్ : ఈ కాలేజీ లో మొదట స్లిప్ పెట్టింది మా తాత. దొరికింది మా తాత . వాటితో మీరేంటి సర్ నన్ను పీకేది

రాంచరణ్ తేజ : కొసెన్స్ ఎక్కువ ఇనా పరవాలేదు లెక్చరర్, స్లిప్ లు తక్కువ కానీకు

ప్రభాస్ : ఎండి ఒక స్లిప్ ఇవండి ………… ఎండి ఒక ఆన్సర్ చూపించండి ………….. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది ………………. ఎండి ప్లీజ్ ఎండి చూపించండి .

సాయి కుమార్ : కనిపించే ఈ 3 పేపర్లు ……. కొసిన్ పేపర్, మెయిన్ పేపర్, అడిషనల్ పేపర్ ఐతే ……… కనిపించని ఆ 4 వ పేపర్ ఏరా స్లిప్.
చిరు : నువ్వు 3 స్లిప్స్ పెట్టు …… మరో ముగ్గురికి 3 స్లిప్స్ పెట్టమని చెప్పు …… అలా మొత్తం కాన్సెప్ట్స్ కవర్ చెయ్యొచ్చు

బాలయ్య: కుమారస్వామి , గోపాలస్వామి , నాగేంద్రస్వామి , ఇలా ముగుర్రు స్లిప్పులు పెట్టి దొరికి పొతే ………. ఈసారి పుట్టేవాడు దొరక్కూడదని మొక్కి మరీ పెట్టాడు రా నా పేరు స్లిప్పు స్వామి అని

6/5/09

స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్లరు

ఒక సారి ఒక పెద్ద మనిషి చాలా రోజుల తర్వాత కనిపించాడు."రండి సర్ అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం " అంటూ ఎదురుగా ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ కి నడవబోయాడు "బాబు నేను స్టార్ హోటళ్ళకి రాను" అన్నాను.

స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్లరు మీరు అడిగాడు ఆ పెద్ద మనిషి "నిజం చెప్పమంటారా అబద్దం చెప్పమంటారా" .. .నా మాట పూర్తయ్యే లోపు తోట రాముడు లో యెన్ టీ వోడంతా సీను నీకు లేదు శీను అనేసాడు. సరే చెప్పడమెందుకు నీకే చూపిస్తా పద అనేసి లోనికి నడిచా.

కూర్చున్న కాసేపటికి సో కాల్డ్ స్టీవర్ట్ వచ్చాడు నల్ల ప్యాంటు తెల్ల చొక్కా దాని మీద నల్ల జాకెట్టు నల్ల టై చేతిలో ఎర్ర రంగు బుల్లి పుస్తకం రేనాల్డ్స్ పెన్ను. ఇది అ సదరు వ్యక్తి అవతారం .

"ఆర్డర్ చెప్పండి గురు" అన్నాడు పెద్ద మనిషి "ఆ నేనెందుకు లే మీరే చెప్పండి" అన్నాను నేను


వారిద్దరి సంభాషణ

స్టీవర్ట్ : ఏం తీస్కుంటారు సర్ కాఫీ , టీ, జ్యూస్, చాకొలేట్ , మై లో , ఐస్ క్రీం

పెద్దమనిషి : టీ ( దర్పంగా)

స్టీవర్ట్ : ఏ టీ సర్ సెయ్లోన్ టీ , హెర్బల్ టీ , బుష్ టీ , హనీ బుష్ టీ , ఐస్ టీ, గ్రీన్ టీ


పెద్దమనిషి : సెయ్లోన్ టీ (సాలోచనగా )


స్టీవర్ట్ :ఎలా కావాలి సర్ బ్లాక్ లేక వైట్


పెద్దమనిషి : వైట్ (ఏంటి తేడాగా ఉంది అనుకుంటూ )

స్టీవర్ట్ : మిల్క్ , వైట్నర్ లేక కండేన్సెడ్

పెద్దమనిషి : మిల్క్ ( అసహనం గా )

స్టీవర్ట్ :ఆవుపాలు , మేక పాలు , గేదె పాలు వీటిల్లో ఏది సర్

పెద్దమనిషి : గేదె పాలు ( దీనం గా)

స్టీవర్ట్ :చలి ప్రదేశం లో పెరిగిన గేదె లేక ఆఫ్రికా గేదె ? రెండిటి లో ఏది సర్

పెద్దమనిషి : ఆఫ్రికా గేదె ( అయోమయం గా )

స్టీవర్ట్ :సరే టీలో షుగర్ , స్వీట్నర్ లేక తేనే కావాలా సర్

పెద్దమనిషి : చక్కర ( పళ్ళు కొరుకుతూ)

స్టీవర్ట్ :బీట్ షుగర్ లేక కేన్ షుగర్ సర్

పెద్దమనిషి : కేన్ షుగర్ (వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ నోట్లో కర్చీఫ్ కుక్కుకుని )

స్టీవర్ట్ :వైట్ , బ్రౌన్ లేక ఎల్లో షుగర్ సర్

పెద్దమనిషి : టీ వద్దు గానీ నోరెండి పోతూ ఉంది కాస్త మంచి నీళ్ళు ఇస్తావా (కళ్ళు తుడుచుకుంటూ )

స్టీవర్ట్ :మినరల్ వాటర్ లేక మాములు వాటర్


పెద్దమనిషి : మినరల్ వాటర్ (మన్మధుడు సినిమాలో పారిపొయ్యే ముందు షూ లేస్ కట్టుకునే ముందు బ్రహ్మానందం లా చూస్తూ )

స్టీవర్ట్ :ఫ్లేవర్డ్ లేక నాన్ ఫ్లేవర్డ్

పెద్దమనిషి : (లేచి ) "అవును తాజమహల్ నేను ఎందుకు కట్టించాను .... అశోకుడు ఆడుకొవడా నికే కదా .. మరి రాయలు అలా అన్నాడేంటి .... ఏమో .. రుద్రమ దేవి చెప్పిందే నిజమవ్తుందా .. నేను ఈ పూటకూళ్ళ గృహమునందు ఎందుకు ఉన్నాను .. భటులేరి ... ఎవరక్కడ "
అంటూ చప్పట్లు కొట్టుకుంటూ టేబుల్ మీద ఉన్న గుడ్డ వీపుకి కట్టుకుని ఠీవి గా అడుగులేస్తూ వెళ్ళిపొయ్యాడు.

నాయనా సహజము గా కస్టమర్లకు విరక్తి కలిగించే వాళ్ళని చూసాను కానీ పిచ్చేక్కించే వాడ్ని నిన్నే చూసాను నీ పేరేంటి నాయనా కాస్త భయం తో కూడిన ఆసక్తి తో అడిగాను నేను.

"రాజేష్" నవ్వుతూ చెప్పాడా నల్ల గుడ్డల సాడిస్టు

4/11/09

బ్లాగరుల సృజనాత్మకత కి పరిక్ష

జనులార , హితులార , సన్నిహితులారా ,,,

మరేమో ఆల్రెడీ వికట కవి అనే పేరు తో ఒక బ్లాగు ఉన్నా సంగతి తెలీక నేను ఈ పేరెంచుకుంటిని ... మరి అదేమాదిరిగా ముందుకు పోతున్నాం... ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం , టపాలు రాసాం అన్న విషయాన్నీ మనవిచేస్కుంటున్నాను.

ఐతే ఈనాడు మరొక్క బ్లాగు ఉన్నదనీ ... ఇదే పేరు తో ఉన్నదని .. ఈ సీమ పచ్చగా ఉండాలంటే నేను పేరుమార్చాలని నిర్ణయించుకున్నా, రాజీవ్ బ్లాగు పేరు మార్పిడి పధకం కింద నా బ్లాగు పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నా.

సామజిక న్యాయం కోసం ఈ కొత్త పేరు సూచించే అవకాశాన్ని మీకు ఇస్తున్నాను మొదటి సారిగా మా ప్రజా చోద్యం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

కొన్ని పేర్లు బ్లాగెలక్షన్ కమీషన్ సూచించడం జరిగింది

డాం
గన్నేరు పప్పు
జిల్లేడు పూలు
లేవండి పడుకోండి
బ్లాగు తమ్ముడు
పాకశాల
బుర్రలో మూట
తోచింది కూస్తాను
నాన్న బడి
ఈ ప్రపంచం లో అసాద్యం
మజా రాజ్యం
నూతన పెన్ను
నా నస వీణ
మూడార్లు
పన్నెండు

ఈ పేర్లలో ఒక మంచి పేరు సూచించిన వారికి రాజేష్ తో ఒకరోజు గడిపే అవకాశం. ఈ పేర్లే కాక మీకు తోచిన పేర్లు కూడా సూచించ వలసింది గా కోరడమైనది.

గమనిక : బ్లాగు పేరు మాత్రమే మార్చుతున్నాను .. బ్లాగ్ లో ప్రధాన పాత్ర ధారుడిని కాదు .... రాజేష్ పాత్ర ఎవరికిఇవ్వబడదు

4/9/09

రాజేష్ రియాల్టీ షో

మీరు ఒక కాలనీ లో ఉంటున్నారు .. మీ పక్క పోర్షన్ లో రాజేష్ ఉంటున్నాడు .. ఒక రోజు మీ అబ్బాయి ని టమాటాలు తీసుకురమ్మని మార్కెట్టుకు పంపారు ... వెళ్ళిన బాబు యెంత సేపు కి తిరిగి రాలేదు( సరదాగా నే కాసేపు అనుకోండి) .... కంగారు కంగారు గా పక్కనే ఉంటున్న రాజేష్ దగ్గరకెళ్ళి ఇలా అన్నారు " రాజేష్ మా బాబు టమాటా ల కోసంమార్కెట్ కి వెళ్లి మూడు గంటలైంది ఇంక రాలేదు నాకేంటో కంగారుగా ఉంది కాస్త వెళ్లి చూస్తావా" అన్నారు. అప్పుడు రాజేష్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు????
ఆప్షన్స్

ఏ: వెంటనే బాబు ని వెదికి తేవడానికి మార్కెట్ కెళ్తాడు.

బి: మార్కెట్ కెళ్ళి టమాటాలు తెస్తాడు.

సి: ఇంట్లో టమాటాలు తెచ్చి ఈ పూటకి కానీవండి అంటాడు.

డి: వేరే కూర వండుకోండి అంటాడు.

కరక్టు సమాధానం తెలిసిన వారు కూడలి అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ టైప్ చేసి జల్లెడకి పంపండి.

4/7/09

నా జీవితం లో మరపురాని దృశ్యాలు (కొన్ని మాత్రమే)

పెద్దదిగా చూడుటకు ఫోటో మీద క్లిక్ చేయండి

పి ఏం.ఏం అనాధ శరణాలయం




బ్లైండ్ స్కూల్




కేర్ అండ్ లవ్ అనాధ శరణాలయం



న్యూ లైఫ్ హోం పిల్లలతో




సహాయ యానివర్సరీ గురించి పేపర్లో



సాయినాధ అనాధ సదన్ లో దుర్గమ్మ తో



హృదయస్పందన


చక్రం

3/31/09

సర్దార్జీ క్షమించు

ఇందాకే ఒక మిత్రుడు సిక్కుల గురించి ఉన్న దాదాపు అన్ని జోకులు మెయిల్ చేసాడు ... కాసేపయ్యాక ఆకాశమంతా .... సినిమా రివ్యూ చదవడం జరిగింది ... అందులో కూడా సర్దార్ ల మీద వచ్చే జోకుల గురించి ప్రస్తావనఉంది.
సర్దార్ జోక్స్ ఇవాళ ఇంతలా ఫేమస్ అవడానికి కారణాలేంటి .... అసలు సర్దార్ జోకులెలా పుట్టాయి అని కాస్త లోతుగా కొద్దో గొప్పో నాకు పరిచయం ఉన్నా సర్కిల్ లో ఆర తీయగా కొన్ని విషయాలు తెలిసాయి.
స్వతంత్ర పోరాటం లో తెల్ల వాడికి చెమటలు పట్టించటం లో సర్దార్జీల పాత్ర చాలా ఉందని అసలు స్వాతంత్రం కోసంప్రాణాలు ఒడ్డి పోరాడిన యోధులు వారి లోనే ఎక్కువని .. వారు చూపిన తెగువను తట్టుకోలేని తెల్లవాడు అక్కసు తోవారి వారి పార్టీలలో సర్దార్జీ జోకులు మొదలెట్టాడని .. తెల్సుకున్న తర్వాత .. నా మీద నాకే కోపమొచ్చిందికొన్నాళ్ళు సర్దార్జీ జోకులు నేను ఆస్వాదిన్చినదుకు. తెల్లవాడు మన వారి మీద మొదలెట్టిన దాడి ని మనమేకొనసాగిస్తున్నాం.
సర్దార్జీల మీద ఈనాడు ఇన్ని జోకులా. గూగుల్ సెర్చ్ లో సర్దార్ అని కొడితే కొన్ని వందల వెబ్సైట్లు .. దర్సనమిస్తున్నాయి .. ఒక్క సారి ఆలోచిస్తే ఆ సామజిక వర్గం లోని వారు యెంత ఆత్మన్యూనతా భావానికీలోనవుతారు .. పాఠశాలల లో కళాశాలల లో సాటి పిల్లల అవహేళన మద్య ఆ పిల్లల మానసిక పరిస్తితి .. నిజం గామనకే అలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది .... ... గాడ్ .... నిజం గా ప్రపంచం మొత్తం కలిసి ఒక జాతి మీద జరుపుతున్న హేయమైన దాడిగా అనిపించింది. నా సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ మీ వాళ్ళకికాస్ట్ ఫీలింగు ఎక్కువ రో అని నన్ను స్కూల్ లో కాలేజి లో కొందరు మాట్లాడుతుంటేనే నాకు చాలా బాదేసేది. అలాంటిది ప్రపంచమంతా ఇంత దారుణమైన ప్రక్రియ జరుగుతుంటే వారెంత బాధ పడుతున్నారో.

మీరెప్పుడైనా సర్దార్జీ ని కలిసారా .. కలిస్తే గమనించండి యెంత మంచి వారో .... యెంత దేశభక్తి కల వారో తెలుస్తుంది.. పెళ్ళాం పిల్లల్ని వదిలి దేశం మొత్తం లారీ డ్రైవర్లు గా , హైవే పక్కన ధాభాలు నడుపు కుంటూ మనకెంతో సేవ చేస్తున్నారు ... తన మీద తనే జోకు వేసుకునే మంచి వాడు సర్దార్జీ ... అలాంటి సర్దార్జీని బాద పెడితే మనకి పాపం.
పైగా కొన్ని జోకుల్లో వారి స్త్రీల కారెక్టర్ గురించి చెండాలమైన కామెంట్స్ ఉన్నాయి. ఇదెంత కుసంస్కారం.
నవ్వు కోవాలి కాని అది కొందరి పాలిట శాపం గా మారకూడదు.
గమనిక : నేను తెలుగు బ్లాగ్లోకం లోకి కొత్తగా వచ్చాను .. ఈ చర్చ ఇంతకు ముందు కూడా జరిగి ఉండవచ్చు .. మళ్ళా జరిగితే తప్పులేదుగా.
(ఈ సారి సర్దార్ జోకులు ఎవరికన్నా చెప్పేటప్పుడు సర్దార్ పేరు తీసేసి తన పేరు పెట్టుకోమని రాజేష్ ఉచిత సలహా ఇస్తున్నాడు)

3/30/09

బ్లాగ్కర్ణుడు - వీడికి బ్లాగు లేదు

కూడల్లో బ్లాగరుల మద్య బ్లాగ్ కాంపిటీషన్ జరుగుతుంది .. బ్లాగ్ పెద్దలు బ్లాగ్ పూజ్యులు సీనియెర్ బ్లాగరులు ... బ్లాగ్భీష్మ పితామహులు మరియు బ్లాగ్ కురువృద్ధులు అందరు అక్కడ ఉన్నారు. తమ సత్తా నిరూపించు కోవాలని బ్లాగరులంతా ఉత్సాహం గా ఉన్నారు.

పోటీ ప్రారంభించినారు........ ఒక్కొక్కరే తమ బ్లాగును పబ్లిష్ చేస్తున్నారు . నిర్వాహకులు మార్కులు వేస్తున్నారు ......కరతాళ ధ్వనుల మధ్య రవి గారు గెలవడం దాదాపు ఖాయం అనుకున్న సమయం లో వచ్చాడొక యువకుడు " నేనుకూడా బ్లాగుతా" అంటు.

అతని పేరు
బ్లాగ్కర్ణుడు అతని మోహము లో కనిపిస్తున్న బ్లాగ్ తేజస్సు కు భయపడిన మలక్పేట్ రౌడీ ఎలా ఐనా రవి గారిని గెలిపించాలని "అటులనే బ్లాగెదవు కాని నీ బ్లాగు తెలుగు ఫాంటు లో ఉందా లేదా వివరాలేవి" అని అడిగాడు.. సమాధానంగా మౌనాన్ని ఆశ్రయించాడు బ్లాగ్కర్ణుడు . ఏమి నీమౌనము తెలుగు టైపు రాదా అని ప్రశ్నించాడు మలక్పేట్..... రాదన్నాడు బ్లాగ్కర్ణుడు .... ఐన నీవు అనర్హుడవుప్రకటించినాడు మలక్పేట్.. నిరాశ తో వెనుదిరిగినాడు బ్లాగ్కర్ణుడు.

"ఆగాగు" గంభీరమైన స్వరం వినిపించి అందరు అటు చూసారు ... లాప్టాప్ భుజాన పెట్టుకుని మధ్య లోకి వచ్చాడు వికటకవి .... "మలక్పెటా ...... ఏమంటివి ఏమంటివి ఇది బ్లాగ్ పరీక్షయే గాని ఫాంట్ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది ఫాంట్ పరీక్ష అన్డువా మొన్న మొన్న దాక ఆర్కుట్ లో మనము వాడినది ఏ ఫాంటు .. నీ రౌడీ రాజ్యము లో అప్పుడప్పుడు నీవు వాడినది ఏ ఫాంటు ఇంత ఏల లేఖిని కి ముందు అసలు మన అందరిది ఏ ఫాంటు .. నాతొ చెప్పిన్తు వేమయ్య యాహూ చాట్ లో ను .. తెలుగు పీపుల్ నందు మేము వాడినది ఏ ఫాంటు .. అతి జుగుప్సాకరమైన భాష వాడే రిడీఫ్ చాట్ నందు మన జనాలు వాడినది ఏ ఫాంటు .... హె .... మనము ఏ నాడో ఆంగ్ల ఫాంటునకు అధీనులమైనాము .. మళ్ళా ఈ నాడు ఫాంటు ఫాంటు అంటూ ఈ ఫాంటు గోల ఏమి " అన్నాడు వికటకవి ఆవేశం గా.

పరిస్థితి చేయి జారి పోతుంది అనుకున్న జీడిపప్పు గారు వచ్చి .. "సరే నాయనా వికటకవి లెస్ పలికినా లెస్స పలికితివి .... అటులైన ఫాంటు పట్టింపు లేదు కాని ఇతను బ్లాగవలెనన్న బ్లాగు కావలెను కదా ... బ్లాగు లేని ఇతను ఏల బ్లాగుతాడు ఐన ఇప్పుడు సృష్టించినా కూడలి లో సభ్యత్వం కావలెనన్న ఇంకా రెండు రోజులు పట్టును కదా" .... అని ప్రశ్నించి .. చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మానందం లా రవి గారి వంక చూసి కళ్ళెగరేసి బాగా చెప్పానా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూర్చున్నాడు.

వెంటనే వికటకవి .... బ్లాగు ఉంటేనే ... బ్లాగానిస్తారంటే ... ఇతన్ని నా బ్లాగు లో మెంబరు గా చేర్చుకుంటా అనగానే .. .. సమయమ మించి పోయింది అని గంట కొట్టారు నిర్వాహకులు . ఈ గొడవల కారణంగా పోటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ...

మరునాడు , ఆనాడు , ఆంధ్ర మంట , చంద్ర మరియు అక్కుపక్షి పేపర్లలో న్యూస్... ఇలా ఉంది.

కూడల్లో జరిగిన బ్లాగుయ్ల పోటీ ఒక యువకుని కారణం గ రద్దయినది అని ... ఆ యువకుడు బ్లాగ్కర్ణుడు అని ఇంతకీ
బ్లాగ్కర్ణుడు ఎవరు అని ఆరా తీయగా అతని పేరు రాజేష్ అని ... బ్లాగడం కాదు కదా కనీసం బ్లాగులో పాకడం కూడా రాని వాడని...... గొడవ చేసి రవి గారి గెలుపుకు అడ్డు కట్ట వెయ్యడానికే వికటకవి అతన్ని తీస్కోచ్చాడని తెలిసిన రవి గారు కోపోద్రిక్తులై .. వికటకవి కోసం కూడలి, జల్లెడ , ఆర్కుట్ నగరాల్లో గాలిస్తున్నట్లు సమాచారం.

వికట కవి ని పట్టిచ్చిన వారికి పది కామెంట్లు బహుమతిగా ఇస్తా
అని అయన ఈ సందర్భంగా ప్రకటించినట్లు సమాచారం ,వికట కవిని పట్టుకోవడానికి మలక్, జీడిపప్పు , నేస్తం, కిరణ్ (ఐతే ఓకే ) , చైతన్య , బ్లాగు సోదరి గార్లు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారని అభిజ్ఞా వర్గాల భోగట్టా.

3/25/09

బ్లాగోపాఖ్యానం

ముందు మాట: ముందుగా ఈ టపా చదవడానికి వచ్చిన పెద్దలకి చిన్నలకి నా విన్నపం... ఈ టపా సరదాగా నవ్వుకోడానికి రాసాను. అంతే గానీ ఎవరినీ ఎత్తి పొడవడానికి కాదు. కోప తాపాలకు తావివ్వకుండా మీ సోదరుడు చేసిన చిన్ని హాస్య రచనగా భావించి చదవండి.

మొత్తం బ్లాగ్లోకం లో బ్లాగరుల సంఖ్య నాలుగు కోట్ల మూడు లక్షల తొంభై ఆరు వేల ముప్పయి నాలుగు
వీరిలో భారతీయులు పదకొండు లక్షల ముగ్గురు
వీరిలో తెలుగు వారు ఒక లక్షా ఇరవై వేల ఇరవై నాలుగు
వీరిలో తెలుగులో బ్లాగు వ్రాయు వారు మూడు వేల మంది
వీరిలో మగ వారు పద్దెనిమిది వందల ముప్పయి మూడు
ఆడవారు పదకొండు వందల అరవై ఏడు
వీరిలో బ్లాగులు డిలీట్ చేసిన వారు వంద మంది
కూడలి లో నమోదు ఐన వారు మూడు వందల మంది
వీరిలో ఆడవారు నూట ముప్పై
మగ వారు నూట డెబ్బై
నిరంతరం బ్లాగులో టపా లు రాసేవారు రెండు వందల యాభై మంది
అప్పుడప్పుడు రాసే వారు ఇరవై మంది
బ్లాగు నమోదు చేసుకుని మాత్రమే ఉండేవారు పది మంది
ఏదో ఒక సొల్లు టపా ఒకటి అలా వదిలేసే వారు ఇరవై మంది
ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు ఉన్నవారు పంతొమ్మిది మంది
పక్క బ్లాగులు చూసి కామెంట్లు రాసి ఉత్సాహ పరిచే వారు నలభై మంది
కామెంటు చెయ్యకుండా అదే పనిగా బ్లాగులన్నీ చూసి పొయ్యే వారు డెబ్బయి మంది
అజ్ఞాత కామెంట్లు రాసే వారి సంఖ్యా అజ్ఞ్జాతం
బ్లాగులో టపా రాసి.. నా బ్లాగు చూడు చూడు అని సావ దొబ్బే వారు ఎనభై ఏడు మంది
నేను నీబ్లాగు లో కామెంటు రాస్తా నువ్వు నా దాన్లో కామెంటు రాయి అని కుళ్ళ బొడిచే వారు పది మంది.. అమ్మాయిల బ్లాగుల్లో కామెంటు రాసి వారి దృష్టి లో పడాలనుకునే మగబ్లాగార్ల సంఖ్య నూట డెబ్బై( వంద శాతం) హిట్లు పెంచుకోవడానికి హిట్ కౌంటర్ పెట్టుకుని అదే పనిగా రిఫ్రెష్ బటన్ నొక్కుకునే వారు రెండు వందల తొంభై తొమ్మిది
వివాదాల ద్వారా ఫేం అవుదాము అనుకునే వారు పన్నెండు మంది
ఫేక్ బ్లాగరులు ఇరవై ఏడు మంది

ఇంక హిట్లు...

సగటున సాహిత్య బ్లాగుకి ఒక రోజు హిట్లు ఆరు
కామెడి బ్లాగుకి వంద
రాజకీయ విమర్శకులకు ముప్పై
వ్యక్తిగత బ్లాగులకి అరవై ఆరు
చాల కాలం నుండి బ్లాగ్లోకం లో ఉంటూ సీనియెర్ లు అయిన వారికి (బుక్ మార్క్స్ అయి ఉంటారు కనుక ) నూట ముప్పై
కధలు రాసే వారికీ సగటున రోజుకి ఇరవై
బూతుల బ్లాగుకి పదకొండు వందలు ( దేవుడా రక్షించు)

గమనిక:
పైన ఉన్న వివరాలు సరి కాదని, తప్పని ఎవరికన్నా అనిపిస్తే.. సరైన వివరాలతో వారు వస్తే నేను టపా సరి చేస్తాను.
ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నా కూడలి జ్యురీష్ డిక్షన్ పరిధి లో వాదోపవాదాలు జరుగ వలెను ..
ఈ టపా వలన ఎవరి మనసులయిన మండితే రాజేష్ చేత బర్నాల్ రాపించే సౌకర్యం వినియోగించుకొనవలసిన ప్రార్ధన.

ఇట్లు
బ్లాగ్ భవదీయుడు

వికటకవి

3/24/09

"నీ పేరు రాజేషా !!?"

ఒక రోజు ఉండి ఉండి సడన్ గా నా కొత్త కంప్యుటర్ ఎల్.సి.డి. మానిటర్ పనిచెయ్యడం ఆగిపోయింది .. విజయవాడలో కొన్నాను ..ఇప్పుడు వాడేం అంటాడో అనుంటూ ఫోన్ చేశా వాడికి..... నా గోడు మొత్తం విని తీసుకురండి సార్ అన్నాడు వాడు . ఇపుడేమో చాలా పని ఉండి పోయింది ఎలా అబ్బా అనుకుంటుండగా మా రాయుడు (కుక్క పిల్ల) ఆందోళనగా మూలగడం మొదలెట్టాడు .... ఏదో ఉపద్రవం రాబోతుంది అనుకుంటుండగా రాజేష్ లోపలికొచ్చాడు.

అహ టైము కి వచ్చావ్ రా విజయవాడ దాక పోయి వస్తావా .. నా మాట పూర్తయ్యేలోపే సరే అని లేచి బయల్దేరాడు రాజేష్ ... దాదాపు రాజేష్ గేటు దాటే లోపు తేరుకున్న నేను "రాజేష్" అని గర్జించడం చూసిన రాయుడు లోపలకేల్లి తలుపు చాటున దాక్కున్నాడు. "ఏంటి శీను" ఆముదం తాగినట్ట్టు మొకం పెట్టుకుని వచ్చి అడిగాడు రాజేష్ గాడు.

నేను: ఎక్కడికి రా

రాజేష్ : విజయవాడ పోయి రమ్మన్నావ్ గదరా ఇపుడే

నేను : &%%^&*$#$%^*))&^%$&&%**&^%$ ( ఇవన్ని పత్రికలలో రాయడానికి వీలు కాని బూతుల బాష గా గుర్తించండి )

నేను: విజయవాడ పోయి ఏం చేస్తావ్ రా...చెత్తనా .....

రాజేష్: అబ్బా మర్చిపొయ్య శీను దేనికి విజయవాడ ???

నేను: &%%^&*$#$%^*))&^%$&&%**&^%$ ........... మొన్న కొన్నాం కదా కంప్యుటర్ ... విజయ వాడ లో దాని మానిటర్ దొబ్బింది మార్చుకురా. అడ్డ్రస్ తెలుసా కే. కే. ఎలక్త్రానిక్స్ . మొఘల్ రాజ పురం ... ( అన్ని చెప్పి) ఇంక పో అని పంపా


ఇప్పుడు కెమెరా రాజేష్ తో పటు పయనం అయినది ( కధ లో నా పాత్ర నిష్క్రమిస్తుంది )

స్థలం ఒంగోలు రైల్వే స్టేషన్ ... టికెట్ కౌంటర్ ..

రాజేష్ : ఒక టికట్ ఇవ్వండి

రైల్వే ఎంప్లాయి: (విసుగ్గా ) ఎక్కడికయ్య

రాజేష్ : కే. కే. ఎలక్త్రానిక్స్ . మొఘల్ రాజ పురం..

రైల్వే ఎంప్లాయి: &%%^&*$#$%^*))&^%$&&%**&^%$ ఊరి పేరేంటి రా చచ్చు వెధవ

రాజేష్: (నాలిక కరుచుకుని ) విజయ వాడ హి హి హి

రైల్వే ఎంప్లాయి: నీ పేరు రాజెషా

రాజేష్ : మీకెలా తెలుసు సార్ ( ఒకింత ఆశ్చర్యంగా )

రైల్వే ఎంప్లాయి: ఒంగోల్లో అందరికి తెలుసు ... ఊరికి తింగరోడు ఒకడున్నాడని

రాజేష్ గర్వంగా ప్లాట్ ఫారం మీదకొచ్చాడు ....

ట్రైన్ వచ్చింది .. ఎక్కాడు ..... రైలు రెండు స్టేషన్లు దాటాక పక్కనే కూర్చున్న ముసలాయన " బాబు తరవాత వచ్చేది చీరాలేనా అని అడిగాడు. చీరాలే గాని అది రాదు మనమే వెళ్తాం తెలివిగా బదులిచ్చానన్న గర్వం తో చూసాడు రాజేష్ .

ముసలాయన : %%^&*$#$%^*))&^%$&&%**&^%$... నీ పేరు రాజేషా ...

రాజేష్ : అవును .. అయినా మీది పక్క ఊరు కదా మీకెలా తెలుసు ..

ముసలాయన: జిల్లా లో అందరికి తెలుసు రా తింగరి వెధవ

రాజేష్ : ఏంటో యెంత వద్దనుకున్నా పాపులర్ అయిపోతున్నాను .. (దిగులు నటిస్తూ)

విజయవాడ

ట్రైన్ దిగిన రాజేష్ అక్కడ ఏం ఘన కార్యం చేస్తాడో అన్న భయం తో నేను ముందుగా ఒక ఫ్రెండు తో మాట్లాడడం తో వాడు స్టేషన్ కి వచ్చి రాజేష్ ని పిక్ అప్ చేసుకుని గమ్యానికి చేర్చి వెళ్లి పొయ్యాడు ... షాపు వాడికి కూడా నేను ఫోన్ చేసి చెప్పడం తో వీడి తో మాటలు కలప కుండానే నా మానిటర్ రిప్లేస్ చేసి ఇచ్చాడు.
బయటికి వచ్చిన రాజేష్ ఈ సారి సొంత తెలివి తేటల తో బతకాల్సిన టైము వచ్చింది ....
స్టేషన్ కి వెళ్ళడానికి రిక్షా ని పిలిచాడు ..

రాజేష్ : అబ్బాయి రైల్వే స్టేషన్ కి వస్తావా

రిక్షా పుల్లర్ :వస్తానండే మరేమో పది రూపాలివ్వలండే

రాజేష్ : చాలా చీపు ..... నా దగ్గర సామాను కూడా ఉందయ్యా

రిక్షా పుల్లర్: సామాను కి ఏమి తీస్కోనండే దానికి ప్రీ

రాజేష్ : ఐతే సామాను తీస్కెళ్ళి రైల్వే స్టేషన్కి పద నేను నడిచొస్తా

రిక్షా పుల్లర్: %%^&*$#$%^*))&^%$&&%**&^%$ .. నీ పేరు రాజేషా ...

రాజేష్ :( సినిమాల్లో సునీల్ లాగ అవక్కై) హె నీకెలా తెల్సు... నీది మా జిల్లా కాదు గదా

రిక్షా పుల్లర్: ఆంధ్ర దేశం లో అందరికి తెలుసు నీలాంటోడు ఒక్కడే ఉన్నాడని ...

రాజేష్ ఆశ్చర్యం ... సంభ్రమం తట్టుకోలేక స్టేషన్ వైపు ప్రయాణం సాగించాడు .... అప్పుడే........
"ఏరా బంటి " " రారా చంటి " .. అనే రెండు గొంతులు విని అటు చూసాడు...... తెలుగు దేశం వారి టి.వి. యాడ్స్ లో కోడి పిల్లలు అక్కడ ఉన్నాయి .. వాటి వైపు నడవ బోతుండగా ... రారా రాజేష్ .. బాగున్నావా .. అంటూ అవే ఎదురొచ్చాయి .
ఆశ్చర్యం గా ఉందే నేను మీకూ తెల్సా ఎలా తెల్సు ...అడిగాడు రాజేష్ .

చంటి : కూడల్లో తెలిస్తే బ్లాగ్లోకం లో తెలుస్తుంది ......

బంటి : అంటే లోకం కోడై కూస్తుంది " నువ్వు తింగరి వెదవని "

3/21/09

నీకైతే ఐదు నాకైతే ఐదొందలు

రాజేష్ ఒక సారి న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ లో బయల్దేరాడు .. పక్కనే ఉన్న ఫారినర్ కి బోర్ కొట్టడం వలనరాజేష్ తో మాట మాట కలిపాడు .. ఏదన్నా ఫన్ని గేమ్ ఆడదాం అన్నాడు రాజేష్ ఆసక్తి చూపలేదు ... కిటికీ బయటకుచూస్తూ తనలో తానూ నవ్వుకోసాగాడు ................

నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు సమాధానం చెపితే నేను ఐదు డాలర్ లు ఇస్తా .. చెప్పలేక పొతే మీరు ఇవ్వాలిఅన్నాడు ... ఈసారి రాజేష్ పెదవి విరిచి నిద్రకి ఉపక్రమించాడు ..


ఈ సారి ఫారినర్ కొత్త ఆఫర్ ఇచ్చాడు ఓకే మీరు ఓడిపోతే నాకు ఐదు $ ఇవ్వండి నేను ఓడిపోతే మీకు ఐదు వందలు $ ఇస్తా అని..... రాజేష్ అలర్ట్ అయ్యాడు ... సరే అడగండి అన్నాడు

వెంటనే అడిగాడు ఫారినర్ " మేరి వాళ్ళ నాన్న గారికి నలుగురు కుమార్తెలు పెద్దమ్మాయి పేరు ఈస్ట్ , రెండో అమ్మాయివెస్ట్ మరియు మూడో అమ్మాయి పేరు నార్త్ .... ఐతే నాలుగో అమాయి పేరు ఏంటి ?

సౌత్ అన్నాడు రాజేష్ వెంటనే ...

హేహే పిజ్జా లో లేగ్గేసారు అసలు ఆన్సర్ మేరి అన్నాడు ఫారినర్ ...... సరే అని తన జేబు లో నుండి ఐదు $ ఇచ్చాడురాజేష్ ...

"ఇప్పుడు మీ టర్న్" అన్నాడు ఫారినర్

"మూడు కాళ్ళతో కొండ ఎక్కి నాలుగు కాళ్ళతో దిగేది ఏది " అన్నాడు రాజేష్

వెంటనే నొసలు చిట్లించిన ఫారినర్ చాల ఆలోచించినాడు .. లాప్టాప్ తీసి సెర్చ్ చేసాడు మిత్రులకు మెయిల్స్ పంపాడుఫలితం శూన్యం....... వెంటనే ఐదు వందలు తీసి ఇచ్చాడు

వెంటనే నిద్రకి ఉపక్రమించాడు రాజేష్
ఆన్సర్ తెల్సుకోవాలన్న ఆరాటం ఆగని ఫారినర్ రాజేష్ ని లేపి అసలు ఆన్సర్ ఏంటి అని అడిగాడు .... వెంటనే తన జేబులో నుండి ఐదు $ తీసి అతని చేతిలో పెట్టాడు రాజేష్.