అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/18/10

వి కాంట్ పీక్ ఎనీ థింగ్

కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు నా అసహాయతకు నవ్వుకుంటూ నేను అనుకునే మాట .... వి కాంట్ పీక్ ఎనీ థింగ్ ( మనమేం పీకలేం) మచ్చుకి కొన్ని చూద్దాం.

1. అసలే బోరు కొడుతుంది .... ఆ పైగా అరగంట నుండి కాలుతున్న టార్టాయిస్ కాయిల్ చుట్టూ సరదాగా తిరుగుతూ మధ్యమధ్యలో వచ్చి కుడుతున్న దోమల్ని చూసినప్పుడు.

2. అసలే కోతి ఆ పై కల్లు తాగిన చందాన వ్రాతలు మాని వీడియో మేకింగ్ కి తన మేధస్సుని కారాగార శర్మ ధారపోస్తున్నప్పుడు.

3. ఒకరోజు టీవీ చూస్తుండగా వచ్చిన మా రాజేష్ గాడు ...టీవీ లో వస్తున్న పాట సినిమాలో మొదటి భాగం క్రూరంగా ప్రవర్తించిన పాత్ర రెండవ భాగానికి వచ్చేసరికి రియలైజ్ అయ్యి ఏడ్చేటప్పుడు " ఏంట్రా వీదిప్పుడు పశ్చాతాప్తం తో రగిలి పోతున్నాడా ?" అన్నప్పుడు .... పశ్చాతాప్తం తో ఎవడూ రగలడు రా కుములుతాడు ఎదవ.... ఎదవ ...ఎదవ ..... అని పీకుదాం అనుకుని కూడా పక్కన చుట్టాలు ఉండడం వల్ల పీకలేనప్పుడు.

4. RESUME లో మనోడు కెరిర్ ఆబ్జెక్టివ్ లో Seeking a position as a leader where i can entertaining fellow employees." అని రాసి hobbies దగ్గర "sleeping, eating, partying అని రాసినప్పుడు.


వి కాంట్ పీక్ అనీ థింగ్.

సరదాగా ఏదో రాశా నా బ్లాగుకి నేనే సుమన్ , ప్రభాకర్ కాబట్టి :))

10 comments:

Anonymous said...

కారాగార శర్మ వీడియో ఏంటి ? అర్ధం కాలేదు!

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత ... రౌడీ తాజా పోస్ట్ చూడండి :)

Anonymous said...

అర్ధమైంది.

Wit Real said...

జంట నగరాల్లో వర్షం పడ్డప్పుడల్లా అనిపిస్తుంది: వి కాంట్ పీక్ ఎనీ థింగ్

ఆ వర్షంలో అడ్డదిడ్డంగా బండ్లు/కార్లు నడిపేటోల్లని చూసినప్పుడనిపిస్తుంది: వి కాంట్ పీక్ ఎనీ థింగ్

Anonymous said...

పంచ్ తగ్గింది బాసు

jeevani said...

అవును ఇంకా పవర్ఫుల్ వి రాసుండొచ్చు. సిరియస్ గా రాయలేదు అనిపిస్తోంది. అయినప్పటికీ బనే ఉన్నయి లెండి !

Anonymous said...

ఈ బ్లాగులలో "మార్తాండ" కధా కమామీషు మీద ఒక పోస్టు వెయ్యకూడదూ శ్రీను గారూ? నాకు అర్ధమయ్యింది ఏమిటి అంటే, ఏవో వదిన కధలు రాస్తారు చెరసాల శర్మ."కత్తి" కామెడీ గా ఉంటాయవి.అసలు ఈ మార్తాండ అన్న పేరు ఎలా వచ్చింది?



మేము బ్లాగులలోకి రాక ముందు జరిగిన విశేషాలు,మీరు వారి పీచమణచకముందు వారి ప్రవర్తన ని సూచించే కామెంట్లు వగైరాల్తో దయ చేసి ఒక పోస్టు రాయండి మీకు పుణ్యముంటుంది.

శ్రీనివాస్ said...

తప్పకుండా పోస్టు వేస్తాను. వేసి తీరాల్సిన సమయం ఆసన్నం అయింది కూడా.

స్థితప్రజ్ఞుడు said...

నా బ్లాగుకి నేనే సుమన్ ప్రభాకర్ కాబట్టి..
హ హ హా...కేకో కేకస్య కేకః....
మీరు వికటకవి అని పెట్టుకోవడం లో తప్పులేదు..

Anonymous said...

ఓరేయ్! ఖైరతాబాద్ జ్ఞానేశ్ నువేదో పత్తితు లా మాట్టాడకు ,
నువ్ ఆడ బ్లోగేర్స్ వెనక ఊపుకుంటూ ఎల్టంలేదా ,మూస్కుని ఫుర్సత్ సేయ్కుండా కుసో