అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/12/10

ప్రేమే నేరమై - స్నేహం శాపమైతే !

ముందు మాట : ఇలాంటి యదార్ధ సంఘటనలను కధలుగా చెప్తే కొందరు అమాయకులైనా మోసపోకుండా ఉంటారేమో అనే ప్రయత్నమే తప్ప ఏ వర్గాన్ని కించపరచడానికి కాదని గమనించగలరు :)

అది ఒక మల్టీ నేషనల్ కంపెనీ. బి టెక్ పూర్తి చేయకముందే వచ్చిన ఉద్యోగాలు అవడంతో నూనుగు మీసాల కుర్రాళ్ళు .. ఉరకలేసే వయసు లో ఉండే అమ్మాయిలూ ఎక్కువగా ఉండేవారు. సాధారణం గానే ఒక సంవత్సరం లోపు కొన్ని ప్రేమ కధలు సఫలమై ఆ వెంటనే వివలమై ... మళ్లీ చేరొకరిని వెతుక్కోవడం లాంటి షరామామూలు గొడవల మద్య .. ప్రకాశం జిల్లా లో మారు మూల పల్లె నుండి చాలా కష్టపడి చదివి పైకి వచ్చి ఆకంపెనీలో ఉద్యోగం సంపాదించిన సుధాకర్ మాత్రం స్వచ్చమైన మనసుతో ఒక అమ్మాయిని ప్రేమించాడు. సుధాకర్ నేపధ్యం ఒకసారి పరిశీలిద్దాం. సుధాకర్ తండ్రిగారు , సుధాకర్ చిన్నతనం లోనే కాలం చేశారు. అతని అమ్మ గారు కూలి పనికి వెళ్తూ సుధాకర్ ని చదివించారు . సుధాకర్ కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాడు కానీ అప్పటికే అతని తల్లి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కానీ ఎదిగి వచ్చిన కొడుకుని చూసుకుని ఆమె మురిసిపోయేది.

అలాంటి సుధాకర్ జేవితంలోకి అనూహ్యంగా ప్రవేశించింది గీతిక . అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా కనపడే గీతికకి మొదట్లో తాగుడు , సిగరెట్ , ఫ్లర్టింగ్ వంటి అలవాట్లు లేని సుధాకర్ సకలగుణాభి రాముడు లాగానే కనిపించాడు. ముందు ఆమె ప్రపోస్ చేసింది. చిన్న తనం నుండి కష్టాల మద్య దిగువ మధ్యతరగతి మనుషుల మద్య పెరిగిన సుధాకర్ కి ఒక్క సారిగా అప్సరస లాంటి అమ్మాయి లభించడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆఫీసులో తన హితం కోరే కొందరు మిత్రులు వారిస్తున్నా వినలేదు .ఆమె అంటే వల్ల మాలిన ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే గుండె జబ్బు తో బాధ పడే తన తల్లి కి ఆపరేషన్ చేయించడం కూడా మరిచి గీతిక కోసం బ్యాంక్ లోన్ తీసుకుని ఒక ఫ్లాట్ కొన్నాడు.

కొన్నాళ్ళు పోయాక .. సాధారణ యువకుడు లా కనిపించే సుధాకర్ కన్నా పోష్ గా కనిపించే రాజేష్ ఆమె దృష్టిని ఆకర్షించాడు. ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ .. A జోక్స్ కట్ చేస్తూ తిరిగే రాజేష్ మీద గీతికకి క్రష్ ఏర్పడింది. సుధాకర్ తో ప్రేమ నటిస్తూనే రాజేష్ తో తిరగడం మొదలెట్టింది. పైగా రాజేష్ , సుధాకర్ కి అఫేసులో స్నేహితుడు కూడాను. సుధాకర్ కి ఏమో గీతిక అంటే అపారమైన నమ్మకం. సరిగ్గా అదే సమయంలో సుధాకర్ ఇంకా మరి నలుగురు ఉద్యోగులు కొరియా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో . సుధాకర్ స్థానే గీతిక ఇంకా రాజేష్ వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు వారు ఉండి పని చేయాల్సి ఉంది.

కొరియా వెళ్ళిన రోజు నుండి రాజేష్ గీతిక విచ్చలవిడిగా ఎంజాయి చేయడం మొదలు పెట్టారు. రాజేష్ పై పూర్తిగా మొహం పెంచుకున్న గీతిక తమ గది లో అతడు హిడెన్ కెమెరాలు ఫిక్స్ చేయడం గమనించలేదు. రాజేష్ ప్రతి రోజు తమ శృంగారాన్ని చిత్రీకరించి .. దాన్ని ఏంఏంఎస్ రూపం లో తన ఆఫీస్ కొలీగ్స్ అందరికీ పంపేవాడు. ఒక్క సుధాకర్ కి తప్ప. సుధాకర్ క్లోస్ ఫ్రెండ్స్ కి కూడా ఆ ఎంఎంఎస్ వెళ్ళింది. ఈ విషయం సుధాకర్ కి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్ధం కాక , అసలు చెప్పకపోవడమే మంచిది అని వదిలేశారు.

రెండు నెలల తర్వాత ఇండియా వచ్చిన రాజేష్ ...గీతికని తను ఏమేం చేసింది పెద్ద హీరోఇజం లా ఫీల్ అవుతూ చెప్పుకునే వాడు. కొన్నాళ్ళకి ఆఫీసు వ్యవహారానికి సంబంధించిన ఒక విషయం లో సుధాకర్ కి రాజేష్ కి మాటా మాట పెరిగింది .. వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత సంయమనం కోల్పోయిన రాజేష్ " నీ లవర్ పెద్ద పతివ్రత అనుకున్నావా ... అది నాతో ఎలా పడుకుందో చూడు" అని తన ఫోన్ తీసి అందులో ఎంఎంఎస్ లు సుధాకర్ కి చూపించాడు . అవి చూసి ఒక్కసారిగా కాళ్ళకింద భూమి కదిలినట్టైన సుధాకర్ మాట పలుకు లేకుండా అయిపోయాడు. స్నేహితులు ఎంతగా కదిలించినా అతనిలో మాట పలుకు లేదు .సాయంత్రం ఆఫీసు నుండి మౌనంగా వెళుతున్న సుధాకర్ ని చూసిన అతని స్నేహితుడు .. వీడిని ఇలా వదిల్తే ఎమైపోతాడో .. కాస్త బయటికి తీసుకెళ్దాం అని సుధాకర్ ని పిలుస్తూ బయటికి వచ్చాడు. అప్పటికే రోడ్డు దగ్గరికి వచ్చేసిన సుధాకర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నవ్వాడు .... తర్వాత అటు తిరిగి రోడ్డు మీద ఒక ఆల్విన్ నిసాన్ వ్యాను వేగంగా రావడం చూసి అది దగ్గరికి రాగానే రోడ్డు మీదకి దూకాడు . ఒక్క క్షణం లో సుధాకర్ ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. అనుకోని పరిణామానికి ఆశ్చర్యపోయిన అతని మిత్రులు తేరుకుని ఇక జరగాల్సిన కార్యక్రమం చూశారు. సుధాకర్ మరణించిన ఒక నెల లోపు అతని తల్లి మరణించింది. కొన్నాళ్ళకి ఆర్ధిక మాంద్యం పుణ్యమాని అందరి ఉద్యోగాలు ఊడాయి.గీతికకి సుధాకర్ కొనిచ్చిన ఫ్లాటుని వాయిదాలు కట్టలేక పోవడంతో బ్యాంకు వారు రికవరీ చేశారు.

సుధాకర్ మరణానికి కారకుడిని అయ్యాను అన్న దిగులుతోనూ , ఇటు ఉద్యోగం ఊడిన బాధతో ఉన్నరాజేష్ కి ... ఏంఏంఎస్ వ్యవహారం బయటికి పొక్కడంతో .. అందరూ పురుగుని చూసినట్టు చూస్తుండడంతో .. బిక్క చచ్చిపోయి ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. మరో పక్క గీతిక ఉద్యోగం పోయాక ... తల్లిదండ్రులు చూసిన ఒక సంభందం చేసుకుంది. ఆమె దురదృష్టవశాత్తు పెళ్లి అయిన కొన్నాళ్ళకి అతనికి ఆ ఎంఎంఎస్ వ్యవహారం తెల్సింది. ఇక ఆమెకి నిత్యం నరకం చూపించసాగాడు అ మొగుడు. రెండు సార్లు ఆత్మహత్యా యత్నం చేసినా .. మృత్యువు కూడా ఆమెని అసహ్యించుకుంది. ప్రస్తుతం క్షణమొక గండంగా గీతిక బతుకు ఈడుస్తుంది. స్వయంకృతం మరి.

ఈ యదార్ధ గాధలో నీతి .. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా !!!!!!!!!!!

52 comments:

ఇందు said...

ఎందుకండీ ఇలా పాపపుణ్యాలు కూడా చూడకుండా ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు?? అసలేం ఆనందం కలుగుతుంది వీళ్ళకి?? ఎందుకు అమాయకులను ఇలా మోసం చేస్తారు?? ఇలాంటివాళ్ళ వల్లే స్వచ్చమైన ప్రేమ,స్నేహం అనె పదాలకి అర్ధం లేకుండా పొతోంది..

Anonymous said...

అచ్చు సిన్మా కథల్లా వున్నాయి మీ స్టోరీలు. మీ దగ్గర ఇలాంటి కథల భోషాణం గని వున్నట్టుంది. యహూస్టోరీ రెడీఫ స్టోరీ లు అని అన్నారు, అవేమిటో వేయన్రి

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

కొరియా నుంచి భారతదేశానికి ఎంఎంఎస్ పంపించాడా!!!

ramya said...

శ్రీనివాస్ గారూ అంత చక్కటి పేరు తీసి కథలో విలన్‍కి పెట్టెశారేటండీ.

Anonymous said...

"భారతదేశపు ఆడవాళ్ళు ఇదివరకటిలా లేరు" అని ఒకసారెప్పుడో తాడేపల్లిగారన్నమాట అక్షరసత్యం.

నీలు said...

terrible

నాగప్రసాద్ said...

అయ్యో!!పాపం..

Anonymous said...

ఆధునికస్త్రీల డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్ చాలా ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతినీ కలిగిస్తోంది. ఒక పాతికేళ్ళ కిందట మన స్త్రీలలో ఇలాంటి ప్రవర్తనని ఊహించడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మామూలైపోతున్నట్టుంది. ఒక మగపిల్లవాడి దగ్గరికి ఒక ఆడపిల్ల భార్యగా చేరుకునే లోపల ఆమె సెకండ్ హ్యాండో, థర్డ్ హ్యాండో అయివుండే అవకాశాలు పెరిగిపోయాయి. I pity the present generaion of boys for their bad luck. ఆర్థికస్వేచ్ఛకు కాచిన కుక్కమూతిపిందెలా ఇవి ?

అతను ఆత్మహత్య చేసుకోగలిగాడు. చేసుకోలేనివాడు ఆమె చేసిన ద్రోహనికి కసిగా ఒక యాసిడ్ బాటిల్ తీసుకొని బయల్దేరతాడు. I don't support these attacks. But ఇలాంటి దాడుల వెనక ఆ అమ్మాయిల శీలహీనత్వం, వాళ్ళ Use & throw policy పోషిస్తున్న పాత్ర కూడా ఎంత ఉండొచ్చుననేదాని మీద కూడా చిన్నగా పరిశోధన జరగాలేమో.

Anonymous said...

ikkada tappu Rajesh and Geethika iddaridi emo. Ekkuva Rajesh de anipistundi.. Geethika pi anon anta cheddadi ayite inka ippudu husband chetilo badha padedi kaademo.

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

ఈ యదార్ధ గాధలో నీతి
___________________

1. Always watch out for the hidden cameras

2. Never drive an Allwyn Nissan van. You will go to jail if some Sudhakar gets runover - The biggest Bakraa in this story is the poor driver.

3. Make sure your husband has life insurance, if you have any illicit relationships ( Ref: గీతికకి సుధాకర్ కొనిచ్చిన ఫ్లాటుని వాయిదాలు కట్టలేక పోవడంతో బ్యాంకు వారు రికవరీ చేశారు.)

4. Never send any MMS with the faces visible.

5. Never marry a second time if you are a nymphomaniac

6. When you write a fake story, make sure it sounds real :))

Anonymous said...

శ్రీనివాస్,
మీరు వోపిక గా కతలా రాస్తున్నారు. ఇవి ఈ రోజుల్లో సాధారణ మైపోయాయి. కాక పోతె బ్లాగుల్లో చాలా మంది వయసు లో పెద్దవారు, ప్రపంచం అంతా ఒకప్పటి లా ఉందని నమ్మే వారు, ఉండాలని కోరుకునే వారు ఎక్కువ. వాస్తవాలు వారికి తెలిసినా తెలియనట్లు రాస్తా రేమొ అని నా అనుమానం. లేక పోతే ఎవరికి తెలియదు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజి లో జరిగె ఫాషన్ షొ లాంటి వాటిలో ఒక సారి పోటోలు చూస్తే అమ్మాయిలు ఎలా ఉన్నారో అర్థమౌతుంది. ఒక సారి నేను ఆగ్రా కి ట్రైన్ లో వేళుతూంటె నా తో పాటుగా ఇద్దరు యువకులు ఒక యువతి కుచ్చునారు. ఈ పడచు 18సం|| ఎంత తిక్క తిక్క గా ప్రవర్తించిందంటె మా అమ్మకి భయం వేసింది ఈ అమ్మాయిని చూసి ఆరకం వారను కొనిది. ఈ అమ్మాయి కొంచెం సేపు ఒకే బర్త్ మీద ఒకడి తో వాడి దుప్పట్లొ దూరి పడుకొనేది. మళ్ళి కిందకు దిగి ఇంకొకడి నెత్తి మీడ పడుతూ ఉండేది. ఇది చూసి చూసి నేను వారి వివరాలు కూపిలాగితె ఆముగ్గురు ఐ.ఐ.టి. లో చదువుతున్నారని చేప్పారు. అది చూసి నేను మొహం వేళాడెసాను. ఐ.ఐ.టి. వారు కూడా ఇలా బిహేవ్ చేస్తారా అని. ముఖ్యం గా ఆ అమ్మాయి, అబ్బాయిలు గమ్ముగా కూచోఉన్నా ఒకే ఇదిగా పైనా కిందా నెత్తిన పడటం చూసి కాలం ఎక్కడి కి పోతున్నాదా అని అనిపించిది. ఇది 5 సం|| కిందటి సంగతి.

Anonymous said...

*ఆధునికస్త్రీల డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్ చాలా ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతినీ కలిగిస్తోంది.*
అనామకా, మీరు రాసిన దాని తో నేను అంగీకరిస్తాను. కాని ఈ ట్రెండ్ మొదలై ఒక 10సం|| మాత్రమే అయింది. ఇంకొంచెం కాలం మనం వేచి చూడాలి. ఎందుకంటె అందరు వయసులో ఉన్నప్పుడు చాలా ధైర్యం గా ఉంటారు కొంచెం వయసు మళ్ళిన తరువాత అసలు విషయం అర్థమౌతుంది. ఆడవారి అందం మహా ఐతె 30సం|| తరువాతా అది రోజు రోజుకి తగ్గెదే. వీళంతా రేఖలు,శ్రీదేవులు కాదు కదా వయసు పైబడుతున్నా గ్లామర్ మైంటైన్ చేయటానికి. ఆ సమయం లో ఇటువంటి వారి గత చరిత్ర తెలిస్తే వీరిని ఎవ్వరు లెక్క చేయరు. చాలా మటుకు సంబంధాలు దెబ్బ తింటాయని నా ఉద్దేసం. అది కాకా ప్రస్తుత మన సమాజం మారినట్లే పైకి కనిపిస్తున్నా నాకు తెలిసి పెద్దగా ఎమీ వస్తుతహ మారలేదు. ముందు ముందు చూడండి వీరి సంగతి .

Anonymous said...

Malakpet Rowdy గారూ ! మీ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. మనుషులు వెధవపనులు చేయాలి. కానీ తగుజాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అని మీరు చెబుతున్నారు. వినడానికే చాలా అసహ్యంగా ఉంది. డోకొస్తోంది కూడా. మీరేదో చాలా తెలివిగా, ప్రాక్టికల్ గా ఆలోచించాననుకుంటున్నారు. నీతిలేనివారు ఇతరులకు సలహాలిచ్చే అర్హతని ఆటోమ్యాటిక్ గా కోల్పోతారని అర్థం చేసుకోవాలి. సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికీ బ్రెయిన్ సరిపోదు. హృదయం కావాలి.

ఈ కథ చదివాకా నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. చాలా బాధపడ్డాను. ఏ సంబంధమూ లేని నాకే ఇంత బాధగా ఉంటే మరి చనిపోయిన సుధాకర్ కీ, చస్తూ బతుకుతున్న గీతికకీ, వారిని ప్రత్యక్షంగా చూసిన వారి మిత్రులకీ ఇంకెంత బాధగా ఉండాలి ? ఆ గీతిక బహుశా emotionally handicapped. తనపట్ల సుధాకర్ మనోభావాల్ని సరిగా అంచనా వేయలేకపోయింది. తాను చాలా ప్రాక్టికల్ అనుకుంది. అందరూ తనలాగే స్వార్థపరులుగా ఉంటారనుకుంది. కొరియాలో తాను రాజేష్ తో ఏం చేసినా ఎవరికీ తెలియదు కదా, తనకింకా పెళ్ళి కాలేదు కాబట్టి రాజేష్ తో జీవితానికంతా కలిపి ఒకసారి ఎంజాయ్ చేస్తే ఎవరు చూడొచ్చారు ? అనుకుంది. అంతేతప్ప తాను అప్పటికే ప్రపంచం దృష్టిలో, అంతకంటే ముఖ్యంగా సుధాకర్/ రాజేష్ ల దృష్టిలో సుధాకర్ కి deemed wife అన్న వాస్తవాన్ని మర్చిపోయింది. సుధాకర్ అందరి చేతా వంచితుడై తట్టుకోలేకపోయాడు. తన deemed wife ఇలాంటిదని పబ్లిగ్గా అందరికీ తెలిసీ ఎవరూ తనతో చెప్పకపోవడం, స్వయానా తన మిత్రుడే మిత్రద్రోహానికి పాల్పడి తన deemed wife ని ఎడాపెడా అనుభవించడం, సదరు deemed wife కూడా అంత దారుణంగా తనని వంచించడం - ఒక పెళ్ళికాని యువకుడిలో అంత మెంటల్ షాక్ కి దారితీయడం, అతను ఆత్మహత్య చేసుకోవడం - ఇదేమీ అనూహ్యం కాదు. యెలివిగా వ్యవహరించాననుకున్న గీతికలాంటి fool కి మాత్రమే ఇది అనూహ్యం. He died of utter inhumanity showed by others (including his own deemed wife) towards him.

ఈ కథ ఇలా అడ్డం తిరగడానికి కారణం - ఆ గీతిక అనే వ్యక్తి ప్రవర్తన. ఇదివరకు చక్కగా చదువుకునే అమ్మాయిల దగ్గర శీలం కూడా ఉండేది. గత పదిహేనేళ్ళుగా చదువునీ, శీలాన్నీ విడగొట్టి బతకడం అలవాటు చేసుకున్నారు మన అమ్మాయిలు. మా యింటి దగ్గర ఒక విమెన్స్ హాస్టల్ ఉంది. అందులో ఒక గదిలో నలుగురు కాలేజి అమ్మాయిలు ఉంటున్నారు. ఒకరోజు హఠాత్తుగా ఆ హాస్టల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి నలుగురు దృఢకాయులు దిగి విసురుగా ఆ హాస్టల్ లోకి చొరబడ్డారు. ఆ నలుగురిని జుట్టుపట్టుకొని రోడ్డుమీదికి లాక్కొచ్చి బండబూతులు తిడుతూ "ఎందుకే ..... డల్లారా ! ఈ మధ్య రావడంలేదు ? ఆడ్వాన్సు తీసుకొని ఎగ్గొడతారంటే ?" అని అక్కడికక్కడే చితక్కొట్టారు. ఈ అమ్మాయిలు నగరంలో విలాసాలకూ, జల్సాలకూ అలవాటుపడి ఆ ఖర్చుల కోసం ఏం చేస్తున్నారో పల్లెటూళ్ళలో ఉంటున్న వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళ మార్కులూ, గ్రేడ్లూ చూసి బాగా చదువుకుంటున్నారనీ, వారికి వేరే ప్రపంచం తెలియదనీ అనుకుంటారు.

Malakpet Rowdy said...

ఎనానిమస్ గారూ,

నేను సరదాగా రాసిన దానిమీద మీరు అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. డినీకోసం మనిద్దరం వాదించుకోబ్వాల్సినంత అవసరం లేదు ఇక్కడ.

ముందుగా, అసలీకధ నిజమని నేను అనుకోవట్లేదు. కారణాలు చాలా ఉన్నాయిగానీ, మీరు ప్రత్యేకంగా అడిగితే తప్ప దానిగురించి చర్చ అనవసరం.

ఇక కధ విషయానికొస్తే, ఇలాంటివన్నీ రోజుకొకటి వింటున్నా గత పది సంవత్సరాలనించీ. మీరంటున్న నా హృదయం ఎప్పుడో మొద్దుబారిపోయింది. మీకు కూడా ఒక అయిదారేళ్ళలో అవుతుందిలెండి.

కధ ఇలా అడ్డం తిరగడానికి కారణం - సుధాకర్, గీతికల దాంపత్యంలో ప్రేమ లోపించడం. ప్రేమతో ముడిపడిన బంధమైతే ఎన్ని అవాంతరాలొచ్చినా విడిపోదు. గీతిక ప్రేమని గెలవడంలో సుధాకర్ విఫలమయ్యాడు - అందులో తన లోపం లేకపోయినా సరే.

Malakpet Rowdy said...

నేను నా వ్యాఖ్య చివర్లో పెట్టిన స్మైలీ :)) చూసి, అర్ధం చేసుకునుంటే మీకింత ఆవేశం వచ్చేది కాదేమో :))

Malakpet Rowdy said...

OOPS ఇప్పుడే కధ మళ్ళీ చదివాను. గీతిక పెళ్ళయ్యాక ఈ వేషాలు వేసిందనుకున్నాను మొదటిసారి చదివినప్పుడు (సరిగ్గా చదవలేదు). Now I understand the story completely.

ఇప్పుడు ఇంకా డౌట్లు వస్తున్నాయ్ ఈ స్టోరీ మీద!

శరత్ కాలమ్ said...

@ ఎనానిమస్ గారూ,
మలక్ సరదాగా వ్రాయలేదు. నిజంగానే వ్రాసాడు. ఆ వ్యాఖ్య అతని హృదయాంతరాలలోంచి వచ్చిందని రూఢీగా చెప్పవచ్చు. మలక్కి మహా బాగా తలంటు పోసారు. చాలా చక్కగా క్లాసు పీకారు. మీకు చప్పట్లు. ఇప్పుడేమో స్టొరీ సరిగ్గా చదవలేదనీ, అదనీ, ఇదనీ ఏదో కవరప్ చేసుకోవడానికి అవస్థ పడుతున్నాడు.

శరత్ కాలమ్ said...

@ ఎనానిమస్ గారూ,
నిజంగానే మలక్ చెప్పిన నీతి సూత్రాలు చూస్తే నాక్కూడా డోకు వచ్చిందండీ. ఒకసారి వాంటింగ్ కూడా చేసుకున్నాను. ఈ టపా చదివాక నాకు కూడా మనసు వికలమయ్యిందంటే నమ్మండి. ఆఫీసులో అస్సలు పనిచెయ్యలేకపోయాను. గీతిక గురించే నా ఆలొచనంతా. గీతిక శీలం గురించే నా ఆళొచనంతా. ఎందుకు ఆడవాళ్ళు పుట్టిన వెంటనే క్లిటారిస్ కట్ చేసుకోరు? ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆఫ్రికా ఆదిమవాసుల్లాగా క్లిటారిస్ కట్ చేసి వేస్తే జీవితంలో మళ్ళీ ఇలాంటి సమస్యలు రావు కదా అని ఎంతో బాధ పడ్డాను. సివరాఖరుకి నా బ్లాగులు కూడా సరిగ్గా వ్రాయాలనిపించలేదు. రాయకపోతే అభిమానులు గొడవచేస్తారని మనసు దిగమింగుకొని హృదయాన్ని భారంగా చేసుకొని ఎలాగోలా మూడు పోస్టులు అయ్యాయనిపించి అభిమానులను సంతృప్తి పరిచాను. నాకే ఇంత ఒంగోలు శీను ఇస్టొరీలు చదివి హింత బాధేసిందంటే పాపం, అసలే మీది సున్నితమయిన హృదయం, మీకెంత కష్టం వచ్చింది. ఇలాంటప్పుడే మనసు గట్టి చేసుకోవాలి. ఏం చేస్తాం. ఇలాంటి భారమయిన ఇస్టొరీలు వ్రాయొద్దంటే వినడానికి ఒంగోలు శీను మన పక్కింటి కుర్రాడు కాదు కదా.

శరత్ కాలమ్ said...

ఏడీ, మలక్కేడీ, నా తిట్లు తిని పారిపోయాడా?!

Malakpet Rowdy said...

పారిపోలేదు. ఆకాశంలో ఉల్కలేమైనా కనిపిస్తాయేమో అని చూడడానికెళ్ళా - మొత్తం మబ్బులే!

Malakpet Rowdy said...

నిద్రొస్తోంది. ఇక పడుకుంటా. పాపం ఆ ఆల్విన్ నిసాన్ డ్రైవర్ని తలచుకుంటుంటే నాకెంత బాధగా ఉందో

Malakpet Rowdy said...

ఏమిటో, మీ బావ మీద జోకులేసీ వేసీ నా సెన్స్ ఆఫ్ హ్యుమర్ మొత్తం పోయింది. జనాలకి నా జోకులు స్మైలీలు పెట్టినా అర్ధం కావట్లేదంటే, ఫ్యూచర్లో "నా జోకులు చదివినవారికి కితకితలు ఉచితం" అని ప్రకటించాలేమో .. వా వా వా వా :((

శరత్ కాలమ్ said...

అంటే మీ ఉద్దేశ్యం ఏంటీ? మీరేమో హాయిగా పడుకుంటారు. మేమేమో ఇక్కడ బాధపడుతూ కూర్చోవాలా? కుదర్దు. లేవండి, లేవండి. అందరం గీతిక గురించి బాధపడుతూ సుధాకర్ కోసం శవ జాగారం చేద్దాం.

Malakpet Rowdy said...

సెంట్రల్ టైంవాళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్తారు. ఒక గంటాగితే తెలుస్తుంది అసలు సంగతి :))

Anonymous said...

శరత్ గారూ ! ఒక నపుంసకుడికి సెక్సుపాఠాలు బోధించే యోగ్యత లేనట్లే మీలాంటివాళ్ళకి ఇలాంటి ఇష్యూల్లోని సీరియస్ నెస్ ని వీటి వెనక ఉండే humanitarian issues నీ, మనోవ్యథనీ అర్థం చేసుకునేంత సీన్ లేదులెండి. మీరు అలవాటు చేసుకున్న కల్చర్ వేరు. అక్కడే ఉండండి. మీరెందుకు అనవసరంగా మీకు అర్థం కాని విషయాల్లోకి తలదూరుస్తారు ?

శరత్ కాలమ్ said...

అనానిమస్ గారూ,
అవునండీ. మీరు చెప్పింది నిజం. మీకు ఈ కథ, మలక్ కామెంట్లు బాగా అర్ధమయ్యాయి. నాకు కాలేదు.

Indian Minerva said...

"ప్రేమతో ముడిపడిన బంధమైతే ఎన్ని అవాంతరాలొచ్చినా విడిపోదు."

@Malak : నూరుశాతం నిజం. కానీ చాలా మంది కోరుకొనేది అదికాదు. వాళ్ళకు కావాల్సిందల్లా శీలం/freshness (దయచేసి ఈ మాటకి మంచి గుణం అని "పెడర్ధాలు" తీయవద్దని మనవి).

Wit Real said...

>> ఈ కథ ఇలా అడ్డం తిరగడానికి కారణం -
>> ఆ గీతిక అనే వ్యక్తి ప్రవర్తన.

అద్యచ్చా! ఆ పై అజ్ఞాత కామెంట్ని నే కండిత్తన్నా!

మా అబ్యుదయ ప్రగతిశీల స్త్రీ వాదం పెకారం, స్త్రీ తనకు కావాల్సినట్టుగా బతకొచ్చు!

దీన్ని కాదనేవారి పై మా సంధ్యక్కతో క్లాసు పీకిస్తా!

Wit Real said...

@ Indian Minerva said...
>> కానీ చాలా మంది కోరుకొనేది అదికాదు.
>> వాళ్ళకు కావాల్సిందల్లా శీలం/freshness


ఆ చాలామంది లో, ఎంతమంది మీతో ఈ విషయం సెప్పారు?

కనీసం, ఒక్క ఎదవైనా అలా సెప్పాడా?

లేక ఇది మీ ఊహ మాత్రమేనా?

శ్రీనివాస్ said...

రాత్రి ఈ టపా వ్రాసిన కాసేపటికి మా ప్రాంతంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి ...విద్యుత్త్ సబ్ స్టేషన్ భారీగా దెబ్బతిని విద్యుత్ అంతరాయం కలగడం వల్ల కామెంట్ల విషయం లో స్పందించలేకపోయాను. మిత్ర్రులు అర్ధం చేసుకోవాలి

శ్రీనివాస్ said...

@ ఇందు గారు స్వచ్చమైన ప్రేమ అనేది దాదాపు అంతరించి చాలా కాలం అయింది. ప్రస్తుతం మోసగాళ్ళదే రాజ్యం. మనం చేయగలిగింది మనకి తెలిసిన వారిని మోసపోకుండా చూడడమే.:)

@ అజ్ఞాత :) రిడీఫ్ స్టోరీలు రాయడానికి నాకేం అభ్యంతరం లేదు .... కాకపోతే కొందరి సహాకారం కావాలి కొన్ని విషయాల సేకరణలో అందుకే లేట్ అవుతుంది. ఇక సినిమా కధలు అంటారా .... ఎందుకులే త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల మొదలైన వారి పొట్ట కొట్టడం అనే జాలితో సినిమా కదల జోలికి పోవడం లేదంతే :P

శ్రీనివాస్ said...

లక్ష్మీ నారాయ గారు అతను అవి debonair****.com కి అప్లోడ్ చేసి అందరికే లింకులు మెయిల్ చేశాడు. నేను కధలో అందరికీ అర్ధం అవడం కోసం ఎంఎంఎస్ అని వాడాను అంతే:)

రమ్య గారు రాజేష్ అనేది నాక్లోస్ ఫ్రెండ్ పేరు... వాడి పేరు నేను యెలా వాడుకున్నా వాడికి ఆనందమే :)

@ అజ్ఞాత ఇప్పుడు వారిని తల్చుకోవడం ఎందుకులెండి :)

శ్రీనివాస్ said...

@ నీలు :)

@ నాగప్రసాద్( బ్లాగు బాబ్జి) .... అవును పాపం.

@ అజ్ఞాత ..

ఆధునికస్త్రీల డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్ చాలా ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతినీ కలిగిస్తోంది
_______________________________________

ముందు మనకి ... ఆ తర్వాత నలుగురిలో అభాసు పాలయ్యాక వారికి కలిగిస్తుంది దిగ్బ్రాంతి.

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత ....ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది .. గీతికడి ద్రోహం ఐతే .... రాజేష్ డి రాక్షత్వం అంతే .

@ మలక్ .. నా కధని మీలా అర్ధం చేసుకునే పాఠకుడు దొరకడం నా అదృష్టం :P:P:P

@ మలక్ తర్వాత అజ్ఞాత .... మీరు చూసిన అమ్మాయి లాంటి వారి జీవితాలు కాలక్రమంలో ఎలాంటి పాట్లు పడతాయో చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం.

@ తర్వాత అజ్ఞాత ....గ్లామర్ సంగతి పక్కన పెడితే .. నేటి తప్పులు రేపటి శాపాలు అవుతాయి .. అనడంలో సందేహం లేదు :)

శ్రీనివాస్ said...

@ మలక్ మీద మంది పడ్డ అజ్ఞాత ... మలక్ ఆ కామెంట్లు సరదాగా వ్రాశారు అని ఘంటాపధంగా చెప్పగలను.

ఇక మీ మిగతా కామెంట్స్ విషయానికి వస్తే కధ ని చక్కగా అర్ధం చేసుకున్నారు. మీ ఇంటి దగ్గర హాస్టల్ వద్ద జరిగిన ఉదాహరణ చాలామందికి కళ్ళు తెరిపించే ఘటన.

@ మలక్ మీ డౌట్స్ మళ్లీ అడిగి " తలంటు " పోయించుకోవాల్సిన్డిగా విజ్ఞప్తి.

శ్రీనివాస్ said...

శరత్ గారు మీ కామెంట్ కి నా కామెంట్ నొ కామెంట్

ఒంగోలు రాయుడు said...

ma rayudu story epudu rastraru??? panakamlo pudakala madyalo nedo gola ani tittukokandi lol :P

నాగప్రసాద్ said...

బ్రాకెట్లో బ్లాగు బాబ్జీ ఏంటి? నేను ఖండిస్తున్నా...

శ్రీనివాస్ said...

ఆ రాయుడు గారు త్వరలో మీకోసం ఒక టపా ఖాయం సేస్కోండి.

నాగా అయితే బ్రాకెట్ బలో whatsup అని పెట్టనా?

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

వికటకవి గారు, మీరు మరీ ఇంతలా బేసిక్ తప్పులు చెస్తే చానా కష్టం.

బ్లాగ్ బాబ్జి( నాగా) అని రాయాలి.

నేను said...

@Vikatakavi

meeru raasinavanni abaddhalu ani Malak antunnaru. anduvalla meeru debonair****.com loni links ikkada pettavalasindiga korutunnaam :P

శ్రీనివాస్ said...

@ తార , ఇకనుండి అలాగే రాస్తా
ఏడో నాలుగు టపాలు రాసుకునే వాడిని నలుగురి చేత నా మీద నాలుగు రాళ్ళూ వేయించే ప్లాన్లు వేయకు బాబు :)

krishna said...

బేర్...బేర్... నేను తట్టుకోలేక పోతున్నాను బాబొయ్..కెవ్వ్..కెవ్వ్.. హింత బాధాకరమైన కధలాంటి టపా రాసినందుకు శ్రీనివాసు బ్లాగుని బహిస్కరిస్తున్నాను, ఉరఫ్ నిషేదిస్తున్నాను :)
హింతకీ ఇది ఏ భాషలో వచ్చిన సినిమా బ్రదర్ ? ఇంకా ఏ సినిమా గాను రాకపొతే ఈ కధ హక్కులు నాకే ఇవ్వరా ప్లీజు :)

నాకు కూడా మలక్ కామెంట్లు చూసి డో..క్కు వచ్చేసింది బాబొయ్ !

ఇది కధే అనుకుని నా అభిప్రాయం చెబుతున్నాను, తప్పంతా బుర్ర లేని సుధాకర్‌ది . వాడికి అంత కన్నా పెద్ద శిక్ష పడాలి. గుం.. కోసం ( సారీ ఏం, కోపంలో బుర్ర దొ.....) అంత పిచ్చి వుంటే అలాగే మట్టి కొట్టుకు ( సారీ ... ఆల్విన్ నిస్సాన్ వాన్ ) పోతారు :)

Anonymous said...

హ్వ హ్వ హ్వా బాగుంది. @ Malkpet Rowdy

ramya said...

ఒప్పుకున్నాం మీ ఫ్ర్ండ్ పేరుపై హక్కులన్నీ మీకే ఇచ్చుకున్నాం :)
కానీ నేను అన్నది కథలోని ఆ అమ్మాయి పేరుగురించండి.

శ్రీనివాస్ said...

@ కృష్ణా .. ఇది ఏ హిందీ సినిమా కాదు ... హక్కులు మీకే ఇస్తున్నా సినిమా తీసేస్కోండి :)

snkr :))

@ రమ్య గారు ... రెండు అక్షరాల మార్పుతో పేరు మార్చా అందుకే ఆలా వచ్చేసింది :)

Anonymous said...

యధార్ద గాధ?

Sai Praveen said...

ఇలాంటివి చాలా విన్నాను ఈ మధ్య. పెళ్ళికి ముందు చేసేవాళ్ళు కొంతమంది పెళ్ళికి తరవాత చేసేవాళ్ళు కొంతమంది. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదు.
వీకెండ్ పొద్దున్నే లేచి ఇది చదివి బుర్రంతా పాడైపోయింది. ఇప్పుడు ఈ మూడ్ నుంచి బయటకి రావడానికి ఏ తోటరాముడి టపానో మళ్ళీ చదవాలి. :)
ఆ debonair****.com కి ఇలా కావాలని పంపే వాళ్ళు కూడా ఉంటారా? ఇన్నాళ్ళు వాడికి ఇన్ని స్కాండల్ వీడియోలు ఎక్కడ దొరికేస్తున్నాయని తెగ ఆశ్చర్య పడిపోయేవాడిని.

శ్రీనివాస్ said...

sai praveen idainaa parledu

http://ongoluseenu.blogspot.com/2009/03/blog-post_14.html