అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/11/10

మాళవిక కత కమామిషు

నా గత టపాలో మాళవిక కి నాకు జరిగిన పరిచయం వగైరా వగైరా వివరాలు చెప్పాను ....ఇక అసలు కధలోకి మనం ఇప్పుడే ఎంటర్ అవబోతున్నాం.

ఆ తర్వాత మాళవిక చాలా మందితో ఏక కాలం లో చాటింగ్ చేసి బకారాలు చేసిందని ... అవతల వాళ్ళకి అన్నీ అబద్దాలు చెప్పి .... ఒక చక్కని వ్యక్తిత్వం , అభిరుచి , భావాలు ఉన్న అమ్మాయి అనే అభిప్రాయం కలగచేసి ... తీరా వారు ప్రపోస్ చేసే సమయానికి వాళ్ళకి అల్విదా ( గుడ్ బై ) చెప్పాడం వంటి అనేక పనులు చేసింది అని ... అలాగే ఒకరి దగ్గర మాటలు ఇంకొకరి దగ్గర చెప్పి తగాదాలు కూడా పెట్టేది అని తెల్సింది. చాలామంది సున్నిత మనస్కులు ఆవిడ వల్ల హార్ట్ అయ్యారు అని కూడా కధనాలు ఉన్నాయి. ఆవిడ ఆడిన గేం లో పడనీ అతి కొద్ది మంది కంత్రి లలో నేను కూడా ఒకడిని అనమాట. అయితే ఇవన్నీ నిజాలు అయి ఉండవచ్చు లేక కధనాలు అయి ఉండవచ్చు . అయితే నా పాత మిత్రుడు ఒకాయన ఈ మద్య మళ్లీ కలవడంతో మాళవిక టాపిక్ మరో సారి తెర మీదకి వచ్చింది. అతను చెప్పిన విషయాన్ని మీకు చిన్ని కధ రూపం లో అందిస్తా.

ఆ అబ్బాయి వరుణ్ , చక్కగా చదువుకుని ఒక మంచి జాబ్ చేస్తూ ఖాళీ సమయాల్లో చాటింగ్ చేసుకునే యువకుడు. అయితే ఒక సారి రాత్రివేళ అతను అనుకోకుండా యాహూ చాట్ లోకి వెళ్ళినప్పుడు దరిద్రం లా తగిలింది మాళవిక. వరుణ్ చిన్నతనం నుండి కాస్త ట్రెడిషనల్ ఫ్యామిలీ లో పెరిగాడు. అమ్మయిలపట్ల చాలా మంచి అభిప్రాయం , అందులోనూ వాళ్ళల్లో మోసాలు చేసే వారు ఉంటారు అని గ్రహించలేని మనస్తత్వం. యధాప్రకారం మాళవిక తన భావుకత్వాన్ని బయటికి తీసింది. వరుణ్ మీద రోజు కొంచెం కొంచెం ఆ బావుకత్వ దాడి కొనసాగింది. వరుణ్ కూడా మాళవిక కోసం ఎప్పుడు చూసిన మెసెంజర్ లోనే కాలం గడిపే వాడు. ఇదే సమయం లో మాళవిక గోపీ అనే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక రియల్టర్ తో కూడా ఇదే వ్యవహారం నడిపింది ... అయితే వరుణ్ తో తనకి సాన్నిహిత్యం ఉన్నట్టు గోపీకి . గోపీ తో పరిచయం విషయం వరుణ్ కి చెప్పింది. వరుణ్ పెద్దగా పట్టించుకోకపోయినా గోపీ మాత్రం వరుణ్ మీద కసి పెంచుకున్నాడు.

మరోపక్క మాళవిక వరుణ్ కి సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెల్సుకుని అవన్నీ గోపీకి చేరవేసేసింది. ... కొంత కాలానికి మాళవిక వరుణ్ ల పరిచయం చాట్ విండో లోనుండి ... ఫోన్ సంభాషణల వరకు వెళ్ళింది. మాళవిక చెప్పే కబుర్లకు ముగ్ధుడైన వరుణ్ ఒక అశుభ ముహుర్తాన మాళవిక కి ప్రపోస్ చేశేశాడు. వాస్తవానికి అప్పటికే పెళ్లి అయ్యి ఒక బాబు కూడా ఉన్న మాళవిక ఆ విషయాన్ని ఖండించకుండా ముందు మీరు ప్రస్తుతం చేసే జాబ్ కన్నా మంచి జాబ్ సంపాదించుకొండి తర్వాత చూద్దాం అని .....జ్యోతి లక్ష్మీ కనిపించీ కనిపించకుండా .. డాన్స్ చేసినట్టు అర్ధం అయ్యీ అవకుండా ఒక మాట చెప్పడంతో .. దాన్ని అర్ధాంగీకారంగా భావించిన వరుణ్ ఆమెకి తన గుండెలో గుడి కట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. వరుణ్ ఆమెకి తన ఫోటోలు పంపాడు కానీ మాళవిక తన ఫోటోలు పంపలేదు. పైగా రేపు నేను అందవికారంగా ఉంటే ఏం చేస్తావ్ అని అడుగుతూ వరుణ్ లో లేని పోనీ ఆలోచనలు క్రియేట్ చేసింది.

ఇందులో కీలక మలుపేంటి అంటే జరిగే ప్రతి విషయాన్నీ గోపీతో పంచుకోవడం. మాళవిక ని మాటల్లో పెట్టి వరుణ్ కి సంబంధించిన అన్ని వివరాలు సేకరించిన గోపీ ఇంక వరుణ్ మీద ఎటాక్ మొదలెట్టాడు. మాళవిక వరుణ్ ఇంటి నంబరు కూడా గోపీకి చేరవేయడంతో ఏకంగా ఇంటికే ఫోన్ చేసి మీ వాడిని ఇవాళ గంట లో లేపేస్తా అని అతని తల్లిదండ్రులను బెదిరించడం మొదలెట్టాడు. ఒక్కొక సారి అర్ధరాత్రి ఫోన్ చేసి తెల్లవారే లోపు మే ఇంట్లో బాంబ్ పేలుతుంది అని చెప్పేవాడట. ఆ పేరెంట్స్ ఎంతగా భయపడ్డారు అంటే ఫోన్ మోగితే ఉలిక్కిపడే స్థాయికి వచ్చేశారు .. ఎవడు చేస్తున్నాడో తెలీదు ... ఎందుకు లేపేస్తా అంటున్నాడో తెలీదు.... నువ్వు ఏమీ చేయకపోతే వాడెవడో ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు అని రోజు ఇంట్లో గొడవ పెట్టుకునే తన అన్న కి ఎం సమాధానం ఇవ్వాలో వరుణ్ కి అర్ధం అయ్యేది కాదు. వరుణ్ ఈ అయోమయం లో ఉండగానే.. వరుణ్ ఫ్యామిలీని తను రోజూ ఎలా బెదిరించేది గోపీ మాళవికకి రోజూ చెప్పి నవ్వించేవాడట.

వరుణ్ కి డైరక్ట్ ఎటాక్ ఇచ్చి చావగొట్టి మాళవికతో మాట్లాడడం ఆపమని వార్నింగ్ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్న గోపీకి ..... చాట్ మిత్రుల ద్వారా ఒక నిజం తెల్సింది. అదే మాళవిక అసలు జీవితం గురించి........ స్వతహాగా రియల్టర్ అవడం, పెద్ద సర్కిల్ అవడం వల్ల మాళవిక అసలు పేరు.. హైదరాబాద్ లో ఆమె అడ్రస్ వగైరా అన్నీ ఒక వారం లో కనిపెట్టేసిన గోపీ నిశ్చేస్టుడు అయ్యాడు. మూడు పదులు దాటిన వయసు ఉన్న మాళవిక .... పెళ్లి చేసుకుని ఒక బాబుకి తల్లి అయిన మాళవిక .. చెప్పిన మాటలు విని ఒక అమాయకుడిని ఆరు నెలల పాటు టార్చర్ చేశానే అని బాధపడ్డాడు. తర్వాత అలోచించి వరుణ్ కి ఫోన్ చేసి నింపాదిగా అన్ని వివరాలు చెప్పాడు ... మొదట బిత్తర పోయిన వరుణ్ చివరికి నిజం, తెల్సుకుని కుప్పకూలిపోయాడు. అసలే సున్నిత మనస్కుడు .,....ఇంత బాగా మాట్లాడుతూ తనకి సంబందించిన వివరాలన్నీ మరొకరికి ఎలా చేరవేయగాలిగింది .. .. ఇంత కర్కోటకురాలినా నేను ఇష్టపడింది ... అని మధనపడ్డాడు .... తనకి తెలీకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.... నిజమేంటో మాళవికనే అడిగి తెల్సుకుందాం అని అనుకున్నాడు .. కానీ అప్పటికే విషయం చూచాయగా తెల్సుకున్న ఆమె తన కాంటాక్ట్ డీటైల్స్ అన్నీ మార్చేసుకుంది.

ఇక పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఆఫీస్ కి కూడా సరిగ్గా వెళ్ళక పోవడంతో వరుణ్ ఉద్యోగం పోయింది. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటూ విపరీతంగా నిద్ర మాత్రలు మింగుతూ ... తిరుగుతున్న ఆ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు పడ్డ వేదన వర్ణనాతీతం. వరుణ్ పరిస్థితి సరిగా అర్ధం చేసుకోకుండా అతని అన్న చీటికి మాటికి గొడవ పెట్టుకోవడంతో ... ఒక రోజు ఆ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యి .. అన్నగారు అలిగి భార్యని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. కుటుంబం ముక్కలు అయింది. కొడుకు బాధ చూడలేక తల్లిదండ్రుల ఆరోగ్యాలు పాడు అయ్యాయి.
ఇటువంటి పరిస్థితి లోనే వరుణ్ ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు .... చాలా సేపు పిచ్చాపాటీ మాట్లాడిన తర్వాత అసలు విషయం చెప్పాడు .

"అసలు చాట్ లో ఇలాంటివి అన్నీ నమ్మకూడదు మాష్టారు ... అయినా మీరెలా నమ్మారు .. ఇంతకీ ఆ అమ్మాయి ఐడి చెప్పండి "అన్నాను .. మాళవిక ఐడి చెప్పాడు వరుణ్. నా యాహూ లో చెక్ చేశాను . మాళవిక ఐడి అని కన్ఫర్మ్ అయింది . మొదట మాళవిక మీద కోపం వచ్చింది... కానీ వరుణ్ పరిస్థితిలో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అర్ధం అయింది. అందుకే శంకర్ దాదా ఎంబిబిఎస్ లో .... చైలా చైలా సాంగ్ టైపు లో భగవద్గీత రేంజ్ లో ఒక రెండు గంటలు నాన్ స్టాప్ భోద చేశా ..... నేను ఊహించిన దానికంటే వరుణ్ లో చాలా మార్పు వచ్చింది. నా మాటలు ఎలా పని చేశాయో గాని .. " చీ అసలు ఇలాంటి దాని కోసమా నేను ఇలా అయిపోయింది .... మళ్లీ జాబ్ కొట్టి .. మంచి పోసిషన్ కి వచ్చి ...ఏదో ఒకరోజు అది నాకు కనిపించకపోదు అప్పుడు మంచి గుణపాఠం నేర్పిస్తా " అని చెప్పి వెళ్ళిన వరుణ్ ... అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నా.

35 comments:

కవిత said...

Srinivas....heart touching story chepparu.nijam ga ila chat parichayaalu ...nijame,kaado kuda thelusukokunda...ekkadikoo velli povadam,sarva sadharanam ayyayindi.Kaani maalavika lanti ammayilani ela kanukkovali anede..anthu chikkani prashna.

Mothani ki meeru manchi pani chesaru...inko vishayam andoy...kantri ani kuda oppesukunnaru.Hats off.

ప్రసాదం said...

శ్రీనివాస్ గారూ గొప్ప పని చేసారు. మాళవిక తప్పక మానసిక వ్యాధిగ్రస్తురాలు అయి వుంటుంది.

Anonymous said...

could u confirm malavika ID..

malavika_sweet16@yahoo.co.in?

శ్రీనివాస్ said...

@ కవిత గారు .. అలాంటి వ్యక్తులను కనుక్కోవడం కన్నా ... మనం మన పరిధిలో ఉన్నంత వరకు ఇబ్బంది రాదు అని నా అభిప్రాయం.

నేను కంత్రీ అనేది నా మాట కాదు జన ఉవాచ :)

@ ప్రసాదం గారు మీరు అన్నట్టు చెదిరిన మాళవిక మానసిక పరిస్థితి దీనంతటికీ కారణం.

@ అజ్ఞాత Dude/Dudette నేను పేర్లు మార్చాను ...ఆమె అసలు పేరు మాళవిక కాదు :)

మనసు పలికే said...

శ్రీనివాస్ గారు, చాలా మందికి ఉపయోగపడే విషయాన్ని పంచుకున్నారు మీ టపాలో..ముందుగా మీకు అభినందనలు. ప్రసాదం గారు చెప్పినట్లుగా ఆ మాళవిక తప్పకుండా మానసిక వ్యాధిగ్రస్తురాలు అయ్యుంటుంది. దురదృష్టం ఏమిటంటే ఇలాంటి మానసిక వ్యాధిగ్రస్తులు చాలా మందే ఉన్నారు మన చుట్టూ కూడా..నాకు ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం కాలేదు..:(
వరుణ్ లో మార్పు తెచ్చింది మీరా..? లేదా మీ స్నేహితుడా..? మీరైతే మీకు అభినందనలు. లేదా మీ స్నేహితుడైతే, ఆ అభినందనలని మీ నేస్తానికి కొరియర్ చెసెయ్యండి..:)

శ్రీనివాస్ said...

@ జుమ్బారే గారు మీరు పబ్లిష్ చేయనక్కర లేదు అన్న కామెంటు తీసేశాను.

ఈ మధ్య నేను ఎటాక్ లు మానేశాను లెండి :) మద్యలో వచ్చినవి గతం గతః :) ... ఇక మీరు చెప్పిన మాటల్లో నాకు పనికొచ్చేవి తీసుకుంటాలెండి :)

అందరూ బాగుండాలి :)

@ మనసు పలికే

వరుణ్ ని మార్చిన ఘనత నాకే దక్కుతుంది :)

Sravya V said...

హ్మ్ !

తార said...

ఆలూ లేదు చులూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు. అసలు నెట్ లో పరిచయాలు పెళ్ళిల్లా.. ఏడిసినట్టున్నది..

అంతే తప్పదులే, ఇలానే ఒక సారి ఎవడ్నో ఏడిపించటానికి అమ్మాయి పేరుతో ఐడి చేసి, నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఒక్కో సారి ఒక్కొక్కళ్ళం ఎత్తేవాళ్ళం చివరకి మాకే చిరాకు వచ్చి, అది ఉత్త ఐడిరా ఎదవ అని చెప్పేదాకా చేస్తునే ఉన్నాడు..

శ్రీనివాస్ said...

శ్రావ్య గారు నేస్తం గారు సాధారణంగా ఆ హ్మ్ !, :) అనే కామెంట్లు నావి మీరు కాపీ కొట్టేస్తున్నారు :P

తార గారు మీవాళ్ళు ఏడిపించింది ఉత్తరాంద్ర వ్యక్తిని కాదు కదా ?

Malakpet Rowdy said...

ఇదేదో - ఒక యాహూ, ఒక రీడిఫ్ స్టొరీ - రెండూ కలిపి రాసినట్టుంది.

నేస్తం said...

ఇంకా నయం ఆ రెండూ నేనే కనిపెట్టాను అనలేదు..అయినా 6 నెలలు అయితే వారు వీరు అవుతారు..వీరు వారవుతారు అని వినలేదా.. 6 నెలలుగా నీ స్మైలీలు చూసి చూసి అదీ సంగతి

శ్రీనివాస్ said...

@ మలక్ :) ఇది పూర్తిగా యాహూ స్టోరీ :)

నేస్తమా ఇద్దరి కామెంట్ల స్టైల్ ఒకటే లేవమ్మా అందుకీ నా కామెంట్లు కూడా నువ్వే పెట్టమ్మా :P

..nagarjuna.. said...

ఇదేదో శరత్‌గారి బ్లాగుపోస్టుతో inspire అయ్యి మాసాలలు కలిపి చెప్తున్న కథలా వాసన వస్తుందేమిటో మరి. హిహ్హిహి..నిజం మీకు ఆ యాహూ చట్ బాక్స్‌కే ఎరుక

Sravya V said...

సరే ఐతే నా కామెంట్ - !హ్మ్

తార said...

అప్పుడు ఉత్తరాంధ్ర కాదు కదా.. గోదావరి,
ఆతనే అయ్యి ఉండొచ్చు, కానీ వేయి పడగల పేరు విని వెయ్యి నామాలతో సంచరించే జీవిని ఏల పట్టుకోగలం??

Sai Praveen said...

మీ ఫ్రెండ్ ని ఏడిపించడం వరకు బాగానే ఉంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తల్లి తండ్రులను బెదిరిస్తున్నాడు అని తెలిసినా కాని నవ్వుకుందా? ఆడదేనా అది?
disgusting !

కృష్ణప్రియ said...

@ శ్రీనివాస్,
ఇలాంటి వారు కేవలం థ్రిల్ కోసం, బోరింగ్ జీవితం నుండి కాస్త విముక్తి కోసం ఫేక్ జీవితం గడుపుతారేమో అక్కడివరకూ ఓకే కానీ వేరే వారి జీవితం తో ఆటలాడటం మాత్రం చాలా తప్పు.. నాకు తెలిసిన అమ్మాయి ఎవరో అమ్మాయనుకుని చాట్ రూం లో పరిచయమైన వ్యక్తి కి పర్సనల్ విషయాలు చెప్పి.. చాలా నెత్తి మీదకి తెచ్చుకుంది. అతను ఈ అమ్మాయి ని భయపెట్టి, బాధపెట్టి, ఆర్కుట్ అకౌంట్ లో ఫ్రెండ్స్ అందరికీ ఈ అమ్మాయి మీద చాడీలు చెప్పి, మోసం చేసిందని వాపోయి.. ఆఫీస్ డైరెక్టరీ లో ఫొటో సంపాదించి పోస్టర్స్ తయారు చేసి.. తర్వాత ఆ బెడద తప్పినా అసలు ఒక్క మనిషితో కూడా మాట్లాడకుండా పని చేసుకుంటుంది ఇప్పుడు.

కృష్ణప్రియ/

Anonymous said...

సెక్యూరిటీ కోసం తమ వివరాలు వెల్లడించకుండా సరదాగా టైం పాస్ చేయడం తప్పంటారా వికటకవి గారూ?

శ్రీనివాస్ said...

@ నాగ్

శరత్ చెప్పారు అని కాదు రాయాలనిపించి .... రాస్తున్నా అంతే :)

శ్రావ్య గారు కుడి ఎడమైందా

తారా మీ అన్న అంటే మీకు ఎంత అభిమానం :P

సాయిప్రవీణ్ గారు ఇంకా చాల విషయాలు సెన్సార్ చేశాను
:)

కృష్ణ ప్రియ గారు త్రిల్ కోసం ..ఏదో కాలక్షేపానికి అవతలి వారికి హాని కలగనంతవరకు పరవాలేదు కానీ మీరు అన్నట్టు జీవితాలతో ఆడుకోవడం ఎక్కువ అయింది ఇప్పుడు. ఆర్కుట్ లో నేను పరిష్కరించిన కేసులు కోకొల్లలు అండీ బాబు :)

రేపు మరో ఆసక్తికరమైన త్రికోణం విషాదాంత ప్రేమ కధ రాయబోతున్నా

శ్రీనివాస్ said...

అజ్ఞాత గారు ... అసలు వ్యక్తి గత వివరాల జోలికి వెళ్ళకుండా ... ఎవరి కాలక్షేపం వారు చేసుకుంటే తప్పేముంది :)

శరత్ కాలమ్ said...

@ నాగార్జున
శరతే సీతా కాలం అని కొందరు చెవులు కొరుక్కుంటున్నట్లు శరతే శ్రీనివాస్ అని అనలేదు మీరింకా :)

మంచు said...

"శరత్-కాలం" "సీతా-కాలం" వేరు వేరు అనుకుంటున్న అమాయకులు ఎవరయినా వున్నారా ఇంకా

Unknown said...

శీను చూస్తుంటే యిదేదో నా అతనెవరు కధకి
ఆమె ఎవరు అని మార్చి రాసినట్టు గా వుంది
రీడిఫ్ఫ్ నాటి పాత్రలు యిన్నేల్లైనా ''పూజ '' కి పనికి వస్తున్నాయి
అయినా బ్లాగ్ లోకం లోనే ఆడ పేరు మీద వున్న బ్లాగులకి
వచ్చే కామెంట్స్ కి మగ పేరు మీద వున్న బ్లాగులకి వచ్చే వాటిని పరిశీలిస్తే
ఈ కుతూహలం అప్రతి హతం గా అలా సాగి పోతూనే ఉంటుందని తెలియటం లేదా?
అయితే మేక (బకరా )అవడమా మేకు కోట్టడమా అన్నది మన తెలివి తేటల మీద ఆధార పడి వుంటుంది .

Anonymous said...

సీతాకాలం, శరత్‌కాలం, స్వప్నరాగలీన,బ్లాగ్ బాబ్జి ఇంకా శరత్ గారి బ్లాగులు లిస్ట్ చెప్పండి

..nagarjuna.. said...

కాగడా..?

..nagarjuna.. said...

@శరత్‌: మీ ఫేసు, శ్రీను‌గారి ఫేసులు సుసేసాం కాబట్టి ఆ అనుమానం నాకైతే లేదు

నాగప్రసాద్ said...

హుమ్మ్..

శరత్ కాలమ్ said...

ఆ ఆ. బెండు అప్పారావు ఎందుకో మరచిపోయారే! అది కూడా నాదే మరి.

Wit Real said...

అందరూ ఇలా దొంగపేర్లతో ఎందుకు రాస్తన్నారబ్బా?

Anonymous said...

మగవాళ్ళు కూడా కొంత మంది పెళ్ళై పిల్లలు ఉన్నా ఇలానే ఇంటర్నెట్ మీద అమ్మాయిలతో పెళ్ళి కాలేదని, చేస్కుంటామని మోసం చేసేవారు ఉన్నారుగా.
Hmm...ఆడైనా మగైనా మరి ఇలా మోసం చేయడం అబద్దాలడటం , వాళ్ళకి మనసిక రుగ్మతో, ఆనందమో కాని , వాళ్ళ వల్ల సున్నిత మనస్కులు మీద చాల ఎఫెక్ట్.ఎవరు ఎలాంటి వాళ్ళో అసలు చెప్పలేం ఈ రోజుల్లో..ముఖ్యం గా ఇంటర్నెట్ పరిచయం.

శ్రీనివాస్ said...

@ శరత్ అపాలజీలు ఏకలింగం వంతు .... గుర్తు తెలియని బ్లాగులు భుజాన వేసుకోవడం మీ వంతు :)

రవి గారు " పూజ" తాలూకు గాయాలు ఇంకా మానినట్టు లేదు :P

@ తారా , శరత్ గారి కొత్త బ్లాగు whatsup

@ Wit Real ....దొంగ పేర్లతో రాసే బ్లాగులకి హద్దులు ఉండవు , పరిధులు ఉండవ్ విచ్చలవిడిగా చేక్కిపారేయోచ్చు ....అదీ సంగతి

@ అజ్ఞాత మగాళ్ళలో ఇలా చేసే వాళ్ళు కోకొల్లలు కానీ బయట పడిన వాళ్ళు తక్కువ :)

krishna said...

అందుకే ఇలాంటి బాధలు లేకుండా ఆడ మగా అందరూ అయితే శ్రీనివాసు లా కంత్రీలో , శరత్ గారిలా జగత్‌కంత్రీలో అవ్వాలి మరి :)

Anonymous said...

ఇంటర్నెట్ పరిచయాలు దాదాపుగా ఇలానే అవుతున్నాయి.

RK said...

Same characte.r Nagarjuna university lo 1999-2002 lo MCA batch lo chusamu.
Buvusa avide evidemo.
Class mates lo godavalaku karanam ame.

చందు said...

ento !!! addam lo mukham chusukunnattu gaa vundi.
nenu cheppaboye oka nija jeevithakadha ku toli mettu vesaremo !!!
twara lo meku naa blog lo viavaristhan