అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/6/10

కధ కాని కధ -- ఒక అమాయకుని మనో వ్యధ

" అబ్బా నాకైతే చక్కగా పెళ్లి చేసుకుని మా ఆయన్ని తీసుకుని మనుషులు ఎవరూ లేని చోట .. ఒక సెలయేటి ఒడ్డున చిన్న గుడిసె వేసుకుని ... అందులో రాత్రివేళ చిన్న గుడ్డి దీపం మాత్రమే ఉండేలా ఉండే చోట ఉండాలనీ , ఇంకా .....ఒక కుక్కి నులక మంచం మాత్రమే ఉండాలి మాకు. అప్పుడు మా ఆయన పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి కి వేడి వేడి అన్నం పెట్టి ఆ తర్వాత అయన నులక మంచం పై వెల్లికిలా పడుకుని ఉంటే .... ఆయన గుండెల మీద నేను తల పెట్టుకుని పడుకుని ఉంటే .. నా తలలోని మల్లెల వాసన ఆయన కి మత్తెక్కించి ....ఇంకా పైన నేను చెప్పను బాబు " అని ముగించింది మాళవిక యాహూ వాయిస్ చాట్ లొ.....ఇది దాదాపు 2005 అ ప్రాంతంలో జరిగిన సంఘటన. ఆరోజుల్లో నేను ఏ కొంచెం ఖాళీ దొరికినా రిడీఫ్ చాట్ అప్పటికే మూత పడడం తో యాహూ లో యూసర్ క్రియేటేడ్ రూం అయిన " పాడుతా తీయగా " అనే రూం కి వెళ్లి చాట్ చేసే వాడిని . అప్పుడు పరిచయం అయిన కొందరు చాట్ మిత్రులం ... పబ్లిక్ రూం లో బూతులు ఎక్కువ అవడంతో మా పాటికి మేము కాన్ఫరెన్స్ పెట్టుకుని పాటలు పాడుకుంటూ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళం . ఒకసారి మలక్ పేట్ రౌడీ ని కూడా ఈ కాన్ఫరెన్స్ కి పిలిచినట్టు గుర్తు. సరిగ్గా అప్పుడే నాకు ఎందరో పరిచయం అయ్యారు .. మాకు ఖాళీ సమయం దొరికినప్పుడే చాట్ చేసేవాళ్ళం. అదిగో అలాంటి రోజునే అందరూ బిజీగా ఉన్న ఒక రోజు ... నేను ఒక్కడినే యాహూ రూం లో సంచారం చేస్తున్న రోజు నన్ను కెలికింది మాళవిక .... వెంటనే కాన్ఫరెన్స్ షురూ .... గల గలా మాట్లాడడం ... పాటలు పాడడం .. వగైరా వగైరా లతో సన్నిహితం ( చాట్ వరకే లెండి ) అయ్యి ఒకనెల రోజులకి పైన చెప్పిందే అలాంటి డైలాగులు చెప్పే స్టేజీ కి వచ్చింది.ఆ అమ్మాయి అమెరికా లో ఉండేది . ఏదో జాబ్ చెప్పింది నాకు గుర్తులేదు.

ఆ అమ్మాయి చెప్పే మాటలు బాగా నచ్చేవి ... చక్కగా మాంచి కాలక్షేపం ...అయితే అప్పుడప్పుడు తనకి కాబోయే భర్త గురించి చెప్పే టప్పుడు కాస్త శృతి మించుతున్నట్టు అనిపించినా మనం వచ్చింది కాలక్షేపానికి ..అంతే కదా అనవసరంగా పూసుకుని తలనెప్పులు తెచ్చు కోవడందేనికి అనిపించేది. అందుకే తను ఫోన్ నంబర్ అడిగినా నేను ఇవ్వలేదు . అయితే ఆమె మాటలు కాస్త భావుకత్వం నిండిన వాళ్ళకి .....లేదా ఊరికే స్పందించే సెన్సిటివ్ కుర్రాళ్ళకి అయితే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారేమో గానీ .... నాలాంటి పక్కా ప్రాక్టికల్ మరియు చాట్ లో విషయాలు చాట్లోనే వదిలేసి పోయే రకానికి ఎం అర్ధం అవుతుంది. అందుకే నేను ఏనాడు గట్టు దాటలేదు. ఇలా సంవత్సరం గడిచింది.

ఒక సంవత్సరం తర్వాత నాకు ఇంకా తీరిక దొరకనటువంటి పనులలో బిజీ అయిపోయా .... దాదాపు చాలా కాలం తర్వాతా మళ్లీ ;లాగిన్ అయ్యి చూస్తే ... పాతవాళ్ళు చాలామంది కనిపించలేదు. మా రిడీఫ్ ఫ్రెండ్ సముద్ర ( ఇతని అసలు పేరు మలక్ గెస్ చేయొచ్చు) కనిపించాడు . పాత మిత్రుల గురించి అడుగుతూ ఈ అమ్మాయి ప్రస్తావన వస్తే తను అప్పుడు చెప్పాడు... ఆ అమ్మాయి అసలు పేరు అది కాదు ..... చెప్పిన జాబ్ అది కాదు .. అసలు ఆ అమ్మాయికి ఇది వరకే పెళ్లి అయిపోయింది ఒక బాబు కూడా ఉన్నాడు .. కనీ చాట్ లో అందరికీ రక రకాలుగా చెబుతుంది ... అని చెప్పాడు. సముద్ర మాటలకి నేను పెద్దగా ఆశ్చర్య పోలేదు . ఎందుకంటే మేము రిడీఫ్ చాట్ లో ఇంతకీ పదింతలు చూసి వచ్చాము. మాళవిక అలా చెప్పడం తప్పు అని కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే చాట్ లో ఎవరినీ నమ్మలేము కనుక . అంతటితో మాళవిక కి నాకు మద్య జరిగిన ఎపిసోడ్ క్లోస్ .

మరి అమాయకుడి వ్యధ అన్నారు ఏంటా అనుకుంటున్నారా ??? అసలా అమాయకుడు ఎవరు ? అతని వ్యధ ఏంటి? మాళవిక కి ఈ కధకి సంబంధం ఏంటో తరువాత ఎపిసోడ్ లో చెబుతా :)

18 comments:

NaveenSakh said...

will be waiting

తార said...

మాళవిక అబ్బాయా??

సముద్ర గారూ తప్పారా

..nagarjuna.. said...

కొంపదీసి ఆ అమాయకుడు మలక్ కాదుకదా..!! ‌

శ్రీనివాస్ said...

@ naveen రేపు మిగాతభాగం :)

@ తార ఇది మీరు ఊహించలేని సెకండ్ హాఫ్ లెండి

@ నాగార్జున మలక్ ని అమాయకుడు అన్న మొదటి వ్యక్తి బహుశా మీరేనేమో

Sai Praveen said...

మాళవిక మాటలు నిజమనుకుని ఎవడైనా పడిపోయడా?

శ్రీనివాస్ said...

సాయి ప్రవీణ్ గారు ... ఆ పడడం అలా ఇలాకాదు ... అయిన తినబోతూ రుచి దేనికి ... కాస్త ఆగండి చెబుతా :)

Anonymous said...

youtube video lo undi meerena?

శ్రీనివాస్ said...

అవును రెడ్ కుర్తా లో ఉంది నేనే :)

ప్రీతి said...

ఇలా అమ్మాయిల పేర్లతో వచ్చే వాళ్ళని గుర్తు పట్టడం కష్టమే ... మీరు బుద్దుని లా ఉండటం వల్ల వలలో పడలేదేమో ?... దీనికి పరిష్కారం అవసరమా అసలు ? ఎలాగూ కాలక్షేపమే కదా !!!!!!!!!

శ్రీనివాస్ said...

@ ప్రీతీ గారు నేను చెప్పబోయేది పరిష్కారం కాదు .. నిజంగా జరిగిన కధ .... రెండవ భాగం లో చాలా ట్విస్టులు ఉన్నాయి.

Anonymous said...

handsome gaa unnaru anna naa comment teesesaaru enduku ?

Unknown said...

నాయనా శీను నన్ను మాత్రం ఇందులో ఇరికించ మాక
అసలే మెస్సేజ్ పెట్టిన మంటల నుంచి యింకా తేరు కోలేదు

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత మరో అమాయకుడు అవలేక మీ కామెంట్ తీసేసా JK
@ రవి గారు మిమ్మల్ని తుమ్మకుర్ , కర్ణాటక కేసులో ఇరికిస్తా

కవిత said...

Inthaku asalu em jarigindo thondharaga cheppandi babu...aa maalavika ammayi kademo????

శ్రీనివాస్ said...

హా కవిత గారు మాళవిక అమ్మాయే .. కాకపోతే ఎం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు మరి కాస్త ఓపిక పట్టాల్సిందే :)

తార said...

@ naveen రేపు మిగాతభాగం :)

రేపు కాదు ఏకంగా ఎల్లుండే ఐపోయింది..
ఇక్కడ కాసుకు కుర్చున్నాం

Anonymous said...

బాగుంది

Anonymous said...

chaalaa bagundi