ఒకసారి రాజేష్ కి బాగా ఆకలిగా ఉంది . ఎదురుగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లొ భోజనం చేయాలనీ కోరికగా ఉంది కానీ తన వద్ద వంద రూపాయలే ఉన్నాయి. యెలా యెలా అనుకుంటుండగా రాజేష్ కి ఒక మెరుపులాంటి ఐడియా తట్టింది. వెంటనే హోటల్ కి వెళ్లాడు కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాడు . బాగా మెక్కిన తర్వాత బిల్ చూస్తే రెండు వేలు అయి ఉంది. అప్పుడు బేరర్ తో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు రాజేష్. వెంటనే హోటల్ మేనేజర్ పోలీసులని పిలిచి రాజేష్ ని వాళ్లకి అప్పగించాడు. పోలీసులు రాజేష్ ని తీసుకెళ్ళారు.
తన వద్ద ఉన్న ఆ వంద పోలీసులకి లంచంగా ఇచ్చి ఖుషీగా వెళ్ళిపోయాడు రాజేష్ .
10 comments:
Good Idea ...
ha ha ha nice one
గురువు గారు ..ఈ ఐడియా తెలియక ..ఎన్ని సార్లు రోడ్ పక్కన తిన్నానో... ఇన్ని ఐడియాలు వచ్చె రాజేశ్ నిజం గా ఎక్కడుంటాడో సెలవిస్తే దండెసి దణ్ణం పెట్టుకుంటాము...
:))
బావుంది
ఇంతకీ రాజేష్ కుటుంబరావా!
బాగున్నాయండీ మీ రాజేష్ గారి తెలివితేటలు :))
మరి మా రాజేష్ అహ్హ ,మజాకా...ఓ ఇలాంటి అవిడియాలు చాల ఉన్నాయి తన దగ్గర.ఏమంటారు శీను?
కాస్త మంచివి రాయండి మహాప్రభో :)..చచ్చు కుళ్ళు జోకులకి బయట కొదవ లేదు :))))))))))
@ ప్రదీప్ , ధన్యవాదాలు
@ ప్రసాదం గారు ధన్యవాదాలు
@ బిరడా , అయ్యో ఇకనన్నా రాజేష్ ని ఫాలో అయిపోండి
@ హరే కృష్ణ , రాజేష్ మీ సంఘమే బాబు
@ ఇందు :))
@ కవిత , అవును మరి రాజేషా మజాకానా
@ అజ్ఞాత మహాప్రభో అవేవో మీరే రాయొచ్చు కదా చప్పట్లు కొడతాం :))
Post a Comment