అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/13/10

రాజేష్ --- ఫైనాన్స్ మేనేజ్మెంట్

ఒకసారి రాజేష్ కి బాగా ఆకలిగా ఉంది . ఎదురుగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్  లొ భోజనం చేయాలనీ కోరికగా ఉంది కానీ తన వద్ద  వంద రూపాయలే ఉన్నాయి. యెలా యెలా అనుకుంటుండగా రాజేష్ కి ఒక మెరుపులాంటి ఐడియా తట్టింది. వెంటనే హోటల్ కి వెళ్లాడు కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాడు . బాగా మెక్కిన తర్వాత బిల్ చూస్తే రెండు వేలు అయి ఉంది.   అప్పుడు బేరర్ తో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు రాజేష్.  వెంటనే హోటల్ మేనేజర్ పోలీసులని పిలిచి రాజేష్ ని వాళ్లకి అప్పగించాడు. పోలీసులు రాజేష్ ని తీసుకెళ్ళారు.

తన వద్ద ఉన్న  ఆ వంద పోలీసులకి లంచంగా ఇచ్చి ఖుషీగా వెళ్ళిపోయాడు రాజేష్ .

10 comments:

Pradeep said...

Good Idea ...

prasadam said...

ha ha ha nice one

బిరడా said...

గురువు గారు ..ఈ ఐడియా తెలియక ..ఎన్ని సార్లు రోడ్ పక్కన తిన్నానో... ఇన్ని ఐడియాలు వచ్చె రాజేశ్ నిజం గా ఎక్కడుంటాడో సెలవిస్తే దండెసి దణ్ణం పెట్టుకుంటాము...

హరే కృష్ణ said...

:))
బావుంది
ఇంతకీ రాజేష్ కుటుంబరావా!

ఇందు said...

బాగున్నాయండీ మీ రాజేష్ గారి తెలివితేటలు :))

కవిత said...

మరి మా రాజేష్ అహ్హ ,మజాకా...ఓ ఇలాంటి అవిడియాలు చాల ఉన్నాయి తన దగ్గర.ఏమంటారు శీను?

Anonymous said...

కాస్త మంచివి రాయండి మహాప్రభో :)..చచ్చు కుళ్ళు జోకులకి బయట కొదవ లేదు :))))))))))

శ్రీనివాస్ said...

@ ప్రదీప్ , ధన్యవాదాలు

@ ప్రసాదం గారు ధన్యవాదాలు

@ బిరడా , అయ్యో ఇకనన్నా రాజేష్ ని ఫాలో అయిపోండి

శ్రీనివాస్ said...

@ హరే కృష్ణ , రాజేష్ మీ సంఘమే బాబు

@ ఇందు :))

@ కవిత , అవును మరి రాజేషా మజాకానా

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత మహాప్రభో అవేవో మీరే రాయొచ్చు కదా చప్పట్లు కొడతాం :))