రెండు నెలల క్రితం ప్రవీణ్ అనే యువకుడు ముంబై నుండి పూణే వెళుతున్నాడు. అయితే ప్రకృతిని ఆస్వాదించే కారణం చేత కొత్తగా వేసిన ఎక్స్ప్రెస్ వే ని కాదని పాత మార్గం లోనే వెళుతున్నాడు. అది ఘాట్ రోడ్డు. సాయంత్రం అయింది అమావాస్య రోజులేమో.......... చిమ్మ చీకటి........ కాసేపటికి సన్నగా వర్షం కూడా మొదలైంది . సడన్ గా అతని కారు ఆగిపోయింది. యెంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో ... దిగి నడక ప్రారంభించాడు. ఏదన్నా వాహనం వస్తే దిగి దగ్గరలో ఉండే ఏదేని ఊరికి వెళ్ళవచ్చు అన్నది అతగాడి ఆలోచన. ఉన్నట్టుండి వర్షం పెద్దది అయిపొయింది ... ఆ కటిక చీకటిలో ... జోరున కురిసే వానలో తడిసి ముద్ద అయిన ప్రవీణ్ కి చలి మూలంగా వణుకు కూడా మొదలైంది. కన్ను పొడుచుకున్నా కాన రాని చీకటి .. వల్ల ఏదో తనకి రెండు లేక మూడు అడుగుల దూరం వరకే చూడ గలుగుతున్నాడు. .. కాసేపటికి ఒక కారు అతని దగ్గరికి నెమ్మదిగా రావడం చూసిన ప్రవీణ్ ఇంకేం ఆలోచించకుండా ఒక్క గెంతులో వెళ్లి కారు బాక్ డోర్ తీసి ఎక్కేశాడు ... పక్కన ఎవరు లేరు. డ్రైవర్ కి థాంక్స్ చెబుదాం అని ముందుకి వంగాడు ... ఆశ్చర్యం అక్కడ కూడా ఎవరూ లేరు. ఇంజను యొక్క శబ్దం లేదు మరి కార్ ఎలా???? అని అతను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యి తరువాత భయానికి గురయ్యాడు ...ఆ భయం లోకూడా తను కూర్చున్న కారు నెమ్మదిగా కదలదాన్ని గుర్తించాడు. అది ఘాట్ రోడ్డు కావడం వల్ల బిగుసుకుపోయి రోడ్డు వంక చూడడం మొదలెట్టాడు ... ఏ మలుపులో అదుపు తప్పినా నేరుగా లోయలో ఉంటాడు ...... మలుపు సమీపించగానే ప్రవీణ్ దేవుడిని ప్రార్ధించాడు ... అంతే మలుపు చేరేలోపే విండో లో నుండి ఒక చెయ్యి వచ్చి స్టీరింగ్ ఆపరేట్ చెయ్యడం మొదలెట్టింది. దాంతో ప్రవీణ్ మరింత షాక్ కి గురయ్యాడు. అక్కడి నుండి ప్రతి మలుపు వద్ద ఆ చెయ్యి వచ్చి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూనే ఉంది. ఆలా కాస్త దూరం వెళ్ళాకా దూరంగా అతనికి లైట్స్ కనిపించాయి. వెంటనే ధైర్యం తెచ్చుకుని .. డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా కదులుతున్న కారు నుండి ఒక్క జంప్ చేసి పరిగెత్తి అక్కడికి వెళ్లాడు .
అదొక చిన్న టౌన్ .. అక్కడ ఉన్న ఒక దాబా దగ్గరికి పరిగెత్తుతూ భయం తో వచ్చిన ప్రవీణ్ ని చూసి అక్కడి స్థానికులు అతన్ని వివరం అడిగి తెల్సుకున్నారు. ప్రవీణ్ చెప్పిన విషయాలు విన్న స్థానికులు .."ఈ అబ్బాయి తాగి లేడు.. నిజంగానే భయపడుతూ ఏడుస్తున్నాడు. పాపం ఇతను చెప్పింది నిజమే అయి ఉంటుంది " అని అతనికి ధైర్యం చెప్పారు. " చూడు బాబు నీకు మేము ఏ సహాయం కావాలన్నా చేస్తాము ..భయపడకు .... పోలీసులకు చెప్పి నీకు రక్షణ .. చర్చి ఫాదర్ కి చెప్పి నీ కోసం ప్రార్ధన చేస్తాం " అని ధైర్యం చెప్పసాగారు . వారిలో ఒకరు ఇంతకీ మీది ఏ ఊరు అని అడిగారు ...అయినా భయం తగ్గని ప్రవీణ్ వణికిపోతు మాది శ్రీకాకుళం అని చెబుతూ ఉండగానే .... అప్పుడే సరిగ్గా ఆ దాబా లోకి .......................................................................................................
ఒక email ఆధారంగా ...:)
అదొక చిన్న టౌన్ .. అక్కడ ఉన్న ఒక దాబా దగ్గరికి పరిగెత్తుతూ భయం తో వచ్చిన ప్రవీణ్ ని చూసి అక్కడి స్థానికులు అతన్ని వివరం అడిగి తెల్సుకున్నారు. ప్రవీణ్ చెప్పిన విషయాలు విన్న స్థానికులు .."ఈ అబ్బాయి తాగి లేడు.. నిజంగానే భయపడుతూ ఏడుస్తున్నాడు. పాపం ఇతను చెప్పింది నిజమే అయి ఉంటుంది " అని అతనికి ధైర్యం చెప్పారు. " చూడు బాబు నీకు మేము ఏ సహాయం కావాలన్నా చేస్తాము ..భయపడకు .... పోలీసులకు చెప్పి నీకు రక్షణ .. చర్చి ఫాదర్ కి చెప్పి నీ కోసం ప్రార్ధన చేస్తాం " అని ధైర్యం చెప్పసాగారు . వారిలో ఒకరు ఇంతకీ మీది ఏ ఊరు అని అడిగారు ...అయినా భయం తగ్గని ప్రవీణ్ వణికిపోతు మాది శ్రీకాకుళం అని చెబుతూ ఉండగానే .... అప్పుడే సరిగ్గా ఆ దాబా లోకి .......................................................................................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ... ప్రవీణ్ ని చూసిన వారిలో ఒకరు ఇంకొకడితో అంటున్నాడు " అరేయ్ ఇందాకా మన కారు నెట్టుకుంటూ వచ్చేటప్పుడు .. గబుక్కున ఎక్కి కూర్చుని ఈ ఊరు రాగానే దూకి పారిపోయాడే వాడు వీడే"..
.
.
.
.
.
.
.
.
.
.
.
ఒక email ఆధారంగా ...:)
40 comments:
very good writing
నేను నమ్మను.
మా అన్న డిక్షనరిలో "సంబ్రమాశ్చర్యాలు" అనే పదం లేదు.
"మలుపు సమీపించగానే ప్రవీణ్ దేవుడిని ప్రార్ధించాడు", అన్న హేతువాది ఇలాంటి ప్రార్ధించాడం లాంటివి జాన్తా నై.
"ఇంజను యొక్క శబ్దం లేదు మరి కార్ ఎలా??" అని ఆశ్చర్యపోడు, ఎందుకంటె అన్న సైన్స్ లో అసాధ్యం అనే మాట లేదు.
కాబట్టి ఇవన్నీ కట్టుకధలని కొట్టిపారేస్తున్నాం. ఇవన్ని గతితప్పిన వాదం వాళ్ళతో కలసి ఫ్యూడల్ వ్యవస్థ పన్నిన కుట్ర అని భావుస్తున్నాం.
he he hhhhe...
good one
నమ్మినా నమ్మకపొయినా కామెడీ బాగా పండింది :))
బాగా రాశారు
వికటకవి గారూ స్టోరీ బాగుందండీ...
"ఈ టపా చదివి చదివి నవ్వకుండా పోయే వారికి ఎన్ని జోకులు విన్నా నవ్వు రాకుండు గాక"
అన్నట్లుగా వుందండీ మీ స్టోరీ..:)
LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL
ha ha ha ha....:) :) :) :) :) :) :) :)
keka...arupulu..
ఇది నిజంగానే జరిగింది. అందుకు నేనే సాక్ష్యం. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఏకలింగం మరియు నేను.
ఎంటో మా అన్నకి అభిమానులు ఎక్కువ ఐపొతున్నారు, అసలు వచ్చే ఎన్నికల్లో వదిన రాజ్యం పార్టీ పెడతాడు అంట. మరి మీరూ ఇలా అన్న పేరు వాడుకొని హిట్స్ పెంచుకొనటమేనా? లేక ఎమైనా ప్రచారం చేస్తారా? మీరు వంద ఖర్చు పెడితే రెండొందలు ఫ్రీ...
అన్నయ్య దేవుడ్ని నమ్మడు, కాబట్టి సైన్సు దేవుడ్ని ప్రార్ధించి ఉంటాడు.
@ kavuri garu thanks
@badri మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం కావాలంటే శరత్ ని అడగండి లేకపోతే సింగిల్ లింగం గారిని అడగండి.
@ నాగార్జున, జీవని గారు ధన్యవాదములు
@ రాజి గారు మొదటి సారి న బ్లాగులో కుడికాలు ముందు పెట్టి వచ్చి కామెంట్ చేసినందుకు చాలా థాంక్స్
@ మలక్ :P
థాంక్స్ వేణు , అజ్ఞాత
శరత్ గారు .. విండో లోనుండి చెయ్యి పెట్టి స్టీరింగ్ కంట్రోల్ చేసింది మీరేనా?
@ తార గారు మీ అన్నకి అభిమానులు .... అయన బావ బ్లాగుకి కమెంటర్లు కూడా గణనీయంగా పెరిగిపోతున్నారు.
ఐతే శరత్ గారు యూత్ అన్న మాట.
అవనవును, అన్న పేరుని వాడుకొని శరత్ గారు, కామెంట్లు పెంచుకుంటున్నారు, ప్ర.పి.స.స అనుమతి లేకుండా ఇలాంటి పనులు చెస్తే వల్లభ లు ఐపొతారు అని, లెదా మాకు 100 కి 200 ఇచ్చి హక్కులు కొనుక్కోవాలి.
బాగుంది జోక్ .
Srinu
nee mail idi pampayyaa kaasta
Srinu
nee mail idi pampayyaa kaasta
:)
గతితప్పిన వాదం వాళ్ళతో కలసి ఫ్యూడల్ వ్యవస్థ పన్నిన కుట్ర అని భావుస్తున్నాం.
I second that. :)
చంద్రముఖి లాంటి స్టొరీ అనుకున్నా... అద్భుతమైన ముగింపు. అందుకే మీరు వికటకవి
:)
@ తార
ఇలా మాటిమాటికీ అందరూ నా యవ్వనాన్ని ప్రశ్నించడం బావోలేదు. నా వయస్సింకా పదహారేళ్ళే అని ఒక శిలా శాసనం వ్రాయించి ఏకలింగాన్ని బ్రతిమలాడి మాలిక సైటులో బ్యానర్ మీద పెట్టిస్తా!
@ శ్రీనివాస్
పొరపడ్డారు. ఎక్కింది దయ్యమో, పిశాచమో అని భయమేసి ఏకలింగాన్ని ముందుకు తోసా - నేను వెనుక నుండి తోసా!
@ శ్రీనివాస్
"అయన బావ బ్లాగుకి కమెంటర్లు కూడా గణనీయంగా పెరిగిపోతున్నారు."
కుళ్ళు. అందుకే నాకు పోటీగా ఈ టపా వేసారు!
నేను ఇంతకుముందే చదివాను, ఐనా మీరు బాగా రాసారు
హ.హ్హ..హ్హా...! జోకు అదిరిందండి. :)
ఏం జరుగుతోందిక్కడ? నాకు తెలియాలి! తెలియాలి! తెలిసి తీరాలి!!!
అసలు ఈ కథ పోస్ట్ మార్టెం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది(హోల్ సర్చింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా)
//రెండు నెలల క్రితం ప్రవీణ్ అనే యువకుడు ముంబై నుండి పూణే వెళుతున్నాడు.//
అసలు పూనా,ముంబైలలో రెల్లివీధులున్నాయా? అన్న అవి లేని ఊర్లలో అడుగుకూడా పెట్టడు.. ఈ మధ్యనే శ్రీకాకుళం లో రెల్లి వీధి వాళ్ళకి భోగం వీధివాళ్ళకి ఇంటర్ వీధి మిక్సడ్ డబుల్స్ గోటీ బిళ్ళా కాంపిటీషన్ జరిపిస్తుంటే సమైక్యవాద రౌడీలు వచ్చి గొడవ చేశారని అభిజ్ఞ వర్గాల భోగట్టా..
//ఏ మలుపులో అదుపు తప్పినా నేరుగా లోయలో ఉంటాడు ...... మలుపు సమీపించగానే ప్రవీణ్ దేవుడిని ప్రార్ధించాడు//
అన్న అలాంటి మలుపులు వచ్చినప్పుడు అశోకుని కాలం నాటి తన కెమెరా తో ఫోటోలు గట్రా తీస్తూ ఉంటాడు.. ఫోటో బ్లాగ్ కానీ మిస్ అయ్యారా?? హన్నా! దేవుడిని ప్రార్థించడమా??
ఏది ఏమైనా వికటకవి కథ వల్ల ప్రపీసస సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక దీనికి నైతిక బాధ్యత వహిస్తూ శరత్ గారు తన ముక్కును మానిటర్ కు రాసి అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..
హ్మ్..ముందు చూసి ఇదేదో హారర్(ఎవరన్నా మీ ఫ్రెండు రియల్ ఎక్స్ పీరియన్సేమో) అనుకున్నా..చివర్లో మలుపు..భలే ఉంది..(క్యారెక్టర్ కాదు..కారు తొయ్యడం)...
శ్రీనివాస్ గారూ..మీతో మాటాడాలి,సహాయ గురించి...కొంచెం ఎలానో చెప్తే....ః-)..
@ కార్తీక్
ప్రాణం లేని వస్తువులకు ముక్కు రాయనని లంగోటీలు కట్టుకోని రోజులకు ముందే తొడగొట్టి శపధం చేసాను. మలక్కన్నా ఆఖరుకి కుక్కకన్నా ముక్కు రాస్తాను గానీ మానిటర్కి మాత్రం ముక్కు రాయనంటే రాయను. ఒకరు కొమ్ము రుద్దమంటారు, ఒకరు ముక్కు రుద్దమంటారు. తరువాతేమంటారో తెలియదు. ఎక్స్క్యూజ్ మీ. అసలిక్కడ ఏం జరుగుతోంది?
ప్రపీసస డిమాండును పెడచెవిన పెట్టిన కారణంగా శరత్ గారిని వచ్చే జన్మలో వల్లభగా పుట్టమని శపిస్తున్నాను..
శరత్ గారూ,
వల్ల భ అంటే ఎవరో తెలుసు కదా??
@ తిక్క కార్తీకు , గే శరత్
ఆపండహే మీ చచ్చు కుళ్ళుజోకుల గోల. బ్లాగులో ఎక్కడ కొత్త పోస్ట్ పడ్డా మీ హడావిడి ఎక్కువైపోనాది.
భలే ఉంది.. అన్నకి బ్లాగర్లందరి తరపునా పెద్ద సన్మానం చేయాలి,.. న భూతో న భవిష్యత్ ప్రవీనన్న అని... అన్న కి కిరీటం లో లైట్ పెట్టి సన్మానం చేయాలి అని నా కోరిక ...
ఇలా అజ్ఞాత చేత నన్ను తిట్టించినందుకు గానూ మలక్ పేట్ రౌడీ వచ్చి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..
//బ్లాగులో ఎక్కడ కొత్త పోస్ట్ పడ్డా మీ హడావిడి ఎక్కువైపోనాది.
very simple solution..బ్లాగులు చదవడం మానెయ్.. అంతే !!
"ఎక్కడ కొత్త పోస్ట్ పడ్డా మీ హడావిడి ఎక్కువైపోనాది"
" ఎక్కువైపోనాది".. అన్న శ్రీకాకుళం నుండి అనుకుంటా... ప్రవీనన్నా... నువ్వోచ్చావా అన్నా...
బాగుంది.
bavundi :)
idi nenu chinnappudu radio lo vinnaanu. ippatiki gurtundi poyindi.
danlo chivara petrolbunk vadda car agagaane atadu digi aa venaka akkadiki vachchina varito cheputadu, e carlo dheyyam vundi ani. appudu vaallu, Ori vedava nuvvu car ekki koorchunnavaa. enduku car chaalaa baruvugaa ayyindani memu anukuntunnam antu kummestaru.
క్లైమాక్స్ లో ప్రవీణ్ ఇంకో అమ్మాయి తో వడి వడి గా నడుచుకుంటూ వెళ్లి పోతూ ఉంటాడు .
డాబా వాడు పరిగెత్తుకుని బయటకు వచ్చి బాబోయి మా వదిన , మా వదిన అంటూ వాళ్ళ వెనక వెళుతూ ఉంటాడు
వాళ్ళ నడ్డి మీద శుభం కార్డు .
శ్రీనివాస్,
రెండు రోజులనుండీ చాలా ప్రాబ్లెం గా ఉంది... మా బాసు ఎన్ని జోకులేసినా నవ్వు రావట్లేదు.. అసలే అప్రైజల్ టైం.. ఏంటి? ఎందుకిలా? నేనేం చెయ్యను? దీనికి పరిష్కారమే లేదా? ..అని ఆక్రోశం లో మునిగి ఊర్కే మాలిక తెరిచి చూస్తే.. చటుక్కున వెలిగింది!!.. వికటకవి టపా చదివీ, కామెంట్ పెట్టలేదు.. దాని ఫలితమే అని..
Good post as usual..
కృష్ణప్రియ/
వార్నీ అన్నా నువ్వు కేకంతే
Post a Comment