అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/26/10

దయ్యం అంటే ఇష్టం - ఆఖరు భాగం

మా ముత్తాత నరసింహనాయుడు గారి గురించి చిన్నప్పటి నుండి విన్న కధలు అసలు దయ్యం మీద నాకు ఆసక్తి రేగేలా చేశాయి. ప్రకాశం జిల్లా లో మారుమూల కుగ్రామం , ఆ జిల్లాలోనే 90% మందికి తెలియని గ్రామం నరసింహనాయుడి కండ్రిగ మాది. మా ముత్తాత పేరే ఆ ఊరికి పెట్టారు. ఆ ఊర్లో మొదటి ఇళ్ళు కట్టింది ఆయనే. అయన గురించి అనేక కధలు ప్రచారం లో ఉన్నాయి. ఆ రోజుల్లో బ్రిటీష్ వారికి ఎదురు తిరిగినందుకు ఆయనను పోలీసులు అరస్టు చేశారట. మా ఊరు నుండి 30 దూరంలో ఉండే కందుకూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారట. ఆ బురదలో పోలీసులు గుర్రాల మీద వెళుతుంటే వెనుక పావుకోళ్ళు వేసుకుని నరసింహనాయుడు నడుస్తుంటే బురదలో కూరుకుపోయి పావుకోళ్లు బొటన వేలు పక్క వేలు మద్య లో చీల్చుకుని మూడు అంగుళాలు కాలు చీలిపోయినా అసలు బాద కనబరచకుండా నడిచిన మొండి ఘటం అని మా వాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. :p

ఆ తర్వాత చాలా కాలానికి అయన ఒకనాటి రాత్రి పొలం నుండి వస్తుండగా రెండు ఆడ దయ్యాలు అడ్డగించాయని ...... ఆ దయ్యలని పట్టుకుని జుట్టు కట్టిరించాడని ... దాంతో ఖంగారు పడ్డ ఆ దయ్యాలు అయనని బ్రతిమాలితే మా ఇంటికి వచ్చి పని చేస్తే మీ జుట్టు మీకు ఇస్తా అని చెప్పాడని ఆలా దయ్యాలు చాలా కాలం మా ఇంట్లో ఊడిగం చేశాయని ఒక పిట్ట కధ ఉంది. అయితే ఈ కధ నిజం కాదని, కల్పితం అని మా అమ్మ తర్వాత చెప్పింది.

సదరు నరసింహ నాయుడు మరణించాక అయన వంశం లో పుట్టినవాడే పిచ్చయ్య నాయుడు .. నరసింహ నాయుడి పోలికలతో పుట్టడంతో ఆయనే మళ్లీ పుట్టాడు అని అందరూ భావించారు. సదరు పిచ్చయ నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైన కామెడీ కత ఉంది. రోజూ పిచ్చయ్య గారు తన పొలం లో వేసిన శనగ పంట దగ్గరికి తెల్లవారు ఝామునే వెళ్ళేవాడు ... ఒకరోజు ఆలా వెళుతుండగా ... ఒక్కసారిగా అయన మీద నల్లటి ఆకారం దూకింది .. వెంటనే అలర్ట్ అయిన పిచ్చయ తన దగ్గర ఉన్న కర్రతో దాన్ని బలం కొద్ది కొట్టాడట. అదేటు వెళ్లి పడిందో గాని ఇంకా కనిపించలేదట. దయ్యమే దాడి చేసింది అని ఆయన భావం. కానీ ఆ మరుసటి రోజు తలకి దెబ్బతగిలి ఒక పొలం లో పడి ఉన్న అడవిపంది యానాదులకి దొరకడం కొసమెరుపు.

ఆ పిచ్చయ్య నాయుడు గారు మరణించిన కొనాళ్ళకి అయన మనమరాలు ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది .. ఆహా పిచ్చయ్య మళ్లీ పుట్టాడు అని భావించిన పెద్దలు ఆ బాలునికి పిచ్చయ్య అని నామకరణం చేయబోతే..... ఆ తల్లి ఎందుకో నాకు ఈ బిడ్డ ఏడుకొండలవాడి వరప్రసాదం అందుకే అయన పేరే పెట్టుకుంటా అని చెప్పి .. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పేరుని సంస్కృతీకరించి సప్తగిరి శ్రీనివాసులు అని నామకరణం చేసిందట. ఆ శ్రీనివాసుడు ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా..... ...అయితే మా అమ్మమ్మ ఊరుకోకుండా చిన్నప్పటినుండి నరసింహనాయుడే ... పిచ్చయ్య గా ఆతర్వాత నేనుగా పుట్టానని నాకు లేనిపోని కధలు అన్నీ చెప్పి మరీ చావడం వల్ల నాకు కూడా దయ్యం జుట్టు కోసి పని చేయించుకోవాలి అన్న బలమైన కోరిక కలగడం లో ఆశ్చర్యం లేదనుకుంటా!

ఆ గ్రామం వెళితే నా కోరిక తీరుతుందేమో అన్న ఆశతో ఒకసారి ఆ ఊరు వెళ్ళా .... రాత్రి ఎవరికీ చెప్పకుండా మా పొలాల వైపు వెళ్ళా ....... మా పొలాలకి వెళ్ళే దారిలో వాగు దాటాలి ( నీళ్ళు ఉండవు అనుకోండి) అక్కడ మైదానం లో మద్య లో ఉండగా తెల్లని ఆకారం గాలిలో తేలుతూ నా వైపు వస్తుంది ..... నా గుండెలో రైలు పరిగెట్టడం మొదలైంది. ఆ ఆకారం చాలా వేగంగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడెలారాదేవుడా అసలు నేను ప్రిపేర్ అవలేదు ......ఎం లేదు ఇదేమో దగ్గరికి వచ్చేస్తు ఉంది అనుకుంటున్నా ఆ ఆకారం దగ్గరికి వచ్చేసింది కిర్రు కిర్రు శబ్దాలతో .. .... అప్పటి దాకా ఉన్న ధైర్యం అవిరవడంతో బిగుసుకుని నిలబడిపోయా ...... దగ్గరికి వచ్చిన ఆకారం సైకిల్ దిగినట్టు దిగింది. ఇంకాస్త దగ్గరికి వస్తే అది నిజంగా సైకిలే .... వచ్చింది మా ఊరి వెంకటప్పయ్య .... "ఏందీ చక్కర కేళీ ( సప్తగిరి అనేది నోరు తిరక్క ) ఈ టైములో ఇక్కడ ఉన్నావ్" అన్నాడు .. "ఊరికే వచ్చా గానీ నిన్ను చూసి దయ్యం అనుకున్నా" అన్నాను . అసలు దయ్యాలు ఎక్కడివి............... ఇంతవరకు దయ్యాల గురించి మాట్లాడుకోవడమే గానీ మా తాతల కాలం నుండి ఈ రకంగా రాత్రుళ్ళు పొలాల్లో అడవుల్లో తిరిగే మేము ఇంతవరకు చూడలేదు అన్నాడు. ఆ రోజు వెంకటప్పయ్య తో డీప్ డిష్కషన్ తర్వాత ......దయ్యాన్ని చూడాలని ఉబలాట పడిన నేను చివరకి తెలుస్కున్నది ఏంటయ్యా అంటే ...........................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.

.

.
.

.
.
.
.










దయ్యాలు లేవు

19 comments:

దయ్యం :) said...

ఒప్పుకోం దయ్యాలు ఉన్నాయి :)

Sujata M said...

దెయ్యాలు ఉండే ఉంటాయి. ఉన్నాయి. మనసు పెట్టి చూడాలి ! చూడగలగాలి. మీరే గనక, నిఝ్ఝంగా, హృదయపూర్వకంగా దెయ్యాలతో ఊడిగం చేయించుకోదలచుకుంటే - చేయించుకోగలరు. విల్ పవర్ ఉండాలి. అంతే గానీ దెయ్యాలు లేవేమో అని డీలా పడిపోకూడదు. ఇలా మమ్మల్ని డిస్కరేజ్ అసలే చెయ్యకూడదు. ఏమంటారు ?

వెంకట్ said...

హె హె అవును దెయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి, దేవుడు ఉంటే దయ్యం కూడా ఉండే వుంటుంది

మనోహర్ చెనికల said...

ఏమండీ,
మీరీ దయ్యాలన్నింటినీ ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే చూసే కన్ను, చూసింది అని కన్‍ఫర్మ్ చేసే బుద్ధి ఒప్పుకోక మీరలా అనుకుంటున్నారని నా ఆలోచన.కానీ మీ మనసు ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అన్ని దయ్యాలను చూసేసింది. ఇంద్రియాలు చేసిన,చేస్తున్న పనిని బుద్ది చూస్తుంది, చేయాల్సిన పనిని మనసు నియంత్రిస్తుంది. అందుకే ఈ రెండింటికి పడదు. కాబట్టి ఈ అభినవ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పేదేమంటే మీరు దయ్యలగురించి ఆలోచించడం మానరు. ఒకవేళ మానేసినా నరసింహనాయుడు గారు,పిచ్చయ్య నాయుడు గారు దయ్యాలై వచ్చి మీ మనసు మార్చు గాక(:- )

కాబట్టి ఇలాంటి ఆఖరు భాగాలు మరిన్ని రాస్తారని కోరుకుంటూ.....

మనోహర్ చెనికల said...

అన్నట్టు మరో దయ్యం కథ చదివారా, చాలా బాగుంటుంది.

Anonymous said...

ఇంతకీ మీరు కమ్మలా లేక నాయుడు గార్లా?

jeevani said...

శ్రీనివాస్ గారూ

మీరు చెప్పిందే నిజం. లేకపోతే తెల్లోల్లు ఈ పాటికి దెయాలతోనే పనులు చెయిస్తూ ఉండాల్సింది.

Sravya V said...

sujatha గారు చెప్పినట్లు దెయ్యాలు ఉండే ఉంటాయి మీరే మనుసు పెట్టి వెతకటం లేదు ఎక్కడో మీకు దెయ్యాలు లేవు అని బలమైన నమ్మకం, ఆ నమ్మకం
మీ కోరికకు అడ్డుపడుతుంది . మీకు అర్జెంట్ గా ఒక దెయ్యం కనపడాలని ఆ దెయ్యం జుట్టు కోసి పని చేయించుకొని మీరు పోస్ట్ రాయాలని నా వంతు గా నేను దెయ్యాల్ని ప్రార్దిస్తున్నా ;)

శ్రీనివాస్ said...

@ దయ్యం , నేను అనేది బ్లాగుల్లో దయ్యాల గురించి కాదు రియల్ దయ్యాల గురించి.

@సుజాత గారు,

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడం మానేసి విల్ పవర్ ఉంటే దయ్యానికి బాసులు అవుతారు అని చెప్పుకోవాలనమతా ఇంక. మిమ్మల్ని దిస్కరేజ్ చెయ్యను దయ్యం కనిపించగానే ముందు మీకే చెబుతా

శ్రీనివాస్ said...

@ వెంకట్
హీరౌన్నాడు గాబట్టి విలన్ ఉంది తీరాల్సిందే అంటారా?

మనోహర్ గారు నేను ఆ కధ చదవలేదు ... చదివి నేను మరో కధ రాస్తాలెండి

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత
జల్సా సినిమాలో సునీల్ ని కట్టేసి ధర్మవరపు ట్రీట్మెంట్ ఇచ్చే సన్నివేశం గుర్తుందా ? అందులో అసలు విషయాన్ని వదిలేసి అనవసరమైన ప్రశ్నలు వేసేవాడిని ఏమంటారు ?

శ్రీనివాస్ said...

@ జీవని గారు మీరు మాత్రం సూపర్ పాయింట్ పట్టుకున్నారు ... మీకు టోపీలు ఎత్తాలి ( హాట్స్ ఆఫ్ )

శ్రావ్య గారు , నిజంగా జుట్టే గనక కొస్తే ముందు మే ఇంట్లో పని చేయిన్చాకనే మా ఇంటికి తీస్కేల్తా

ఒంగోలు రాయుడు said...

srinannayya pichannayya ayyevadu naku :D

Anonymous said...

దెయ్యాల జుట్టుకోసి పని చేయించే సంగతి అలాపెట్టు ఇకటకవి, ఖంగారులో సెకండ్ షోకి వెళ్లి వచ్చే లేడీస్ ని చూసి జుట్టుకోస్తా అని ఎమ్మట పడి తన్నులు తినమాక. అసలే ఒంగోల్ లేడీస్ పక్కా మాస్ అంట.

శ్రీనివాస్ said...

ఒరేయ్ రాయుడు అప్పుడు నీకు తిక్కలకోటయ్య అని పేరు పెట్టేవాడిని

@ అజ్ఞాత............. ఐ హార్ట్ ఏకలింగం వచ్చి అపాలజీ చెప్పాల్సిందే

కత పవన్ said...

అవును శరత్ గారు కుడా వచ్చి ప్రనా కు అపాలజీ చెప్పాల్సిందే....

Anonymous said...

avunu meeku hatsoff...maavi kaadu...sarath hatsoff....sarath photo choodandi...chinna hat off

Anonymous said...

అరె ఏందిభాయ్, మీ పక్క గుంటుర్లో పులిరాజా అని ఓ పొరగాడి పెల్లి ఖరాబ్ చేసినారంట?

చందు said...

hahaha ............!
kevvu keka !!!