అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/30/10

సమానత్వం పేరుతో ఎటు వెళ్తున్నాం మనం ????

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ అన్న ఎన్టీవోడు పాడుతూ ఉంటే........ పాపం అంతకు ముందు వీళ్ళు కూర్చుని ఉండేవారు కాబోలు అనుకునే వాడిని చిన్నతనం లో. అయితే స్త్రీలు పురుషులతో సమానం అని చెప్పి అన్ని రంగాలలో ముందంజ వేయడం చివరికి అంతరిక్షానికి సైతం వెళ్లి రావడం స్త్రీ జాతికి గర్వ కారణం. అయితే ప్రతి మనిషికి తన జీవిత లక్ష్యానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు కళ్ళ ముందు రెండు దారులు ఉంటాయి . వాటిలో ఒకటి ఒకటి అభివృద్ధి పధం లో మంచి అలవాట్లతో తను అనుకుంది సాధించి నలుగురి మన్నన పొందడం , నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం వగైరా వగైరా . మరి రెండవది .. సప్తవ్యసనాలకు బానిస అవడం , జులాయిగా తిరగడం , జీవితం లో ఒక లక్ష్యం , ఒక ఆశయం అంటూ లేకుండా కేవలం సెక్స్ , మద్యం రౌడీఇజం మొదలైన పతనానికి హేతువుల బారిన ( దుర్గేశ్వర గారి భాషలో కలి ప్రభావానికి లోనయి) పడి... సుఖరోగాలతో , అందరి చేత చీ కొట్టించుకుంటూ రక్తకన్నీరు నాగభూషణం టైపు లోకి వెళ్లడం.

మొదటి దశలో సమానత్వం వైపు స్త్రీలు ఎప్పుడో ఎప్పుడో అడుగులు వేశారు . దేశ ప్రధానులు అయ్యారు , నోబుల్ గ్రహీతలు అయ్యారు ఇంకా మరెన్నో సాధించారు . ఆడవారికే కాక మగవారికి సైతం ఆదర్శప్రాయులయ్యారు . మానవతా వాదులకు ఆనందం కలిగించే విషయం ఇది.

అయితే వచ్చిన చిక్కల్లా........... మనిషి పతనమయ్యే రెండో మార్గం లో ఇంతవరకు మగాళ్ళ దే పై చేయి ..... మద్యపానం వల్ల ధూమపానం వల్ల వారు పతనం అవడమే కాక భావితరాలకి కూడా అనారోగ్య లక్షణాలు అందిస్తున్నారు కొందరు ... ఇటువంటి పరిస్థితిలో స్త్రీలు సైతం మద్యపానం , దూమపానం మొదలెట్టి ఈ దరిద్రాన్ని మరింత పెంచారు. పైగా సమానత్వం పేరుతో విచ్చలవిడి వ్యవాహారాలకి కూడా మహిళలకి కూడా అవకాశాలు ఉండాలి అని వాదించే వాదనల వల్ల కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.

మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి భయపడి మనకెందుకు వచ్చిన రచ్చ అనుకుంటాం గానీ మాట్లాడి తీరాలండీ .......... ఆడాళ్ళకి వ్యభిచారం చేసే హక్కులు ఎంటండి నా బొంద. ఆడాళ్ళకి కూడా వ్యభిచారం చేసే హక్కు కల్పిస్తూ వ్యభిచారం చట్టబద్దం చేయాలట . ఇదెక్కడి గొడవ సుఖ రోగాలు కొని తెచ్చుకోవడానికి హక్కా????? ఇప్పటికే మాములుగా దొరికిన అమ్మాయి బతకడమే కష్టం.... ఇక విటురాలి ( కొత్త పదం) హోదాలో వెళ్ళిన అమ్మాయి బ్రతికిరావడమే ??? ఏంటో స్త్రీ పురుషుల సమాన హక్కులు కోసం మాట్లాడే వాళ్ళు ఇలాంటి విషయాల మీద కాన్సంట్రేట్ చేయడం ........ స్త్రీలు విచ్చలవిడి శృంగారం కోరుకుంటున్నారు అనే భావన జనాల్లో పాతుకు పోవడానికి దోహదపడుతుంది.

మనం ముందు అనుకున్నట్టు మనషి ఎంచుకోవాల్సిన మొదటి మార్గం లో స్త్రీ పురుషులు పోటీపడి భావితరాలకి ఆదర్శప్రాయులు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది . అంతే గాని మద్యపాన , వ్యభిచార వ్యవహారాలతో పురుషులతో పోటీ పడే అవకాశాలు కావాలి అని కొందరు దాంభికాలు పలికితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బ్లాగులు, పత్రికలూ చదవడానికి ఉద్యుక్తులవతున్న పసి మనస్సులో చెడు బీజాలు పడే ప్రమాదం ఉంది.

కనుక మాట్లాడండి ........... సరైన సమానత్వాన్ని చాటండి

13 comments:

Anonymous said...

typical person with a typical attitude

Anonymous said...

అయ్యో మీరెక్కడున్నారండీ బాబు :)రెండవ మార్గంలో కూడా కొందరు వెనకతి తరం వాళ్ళు సమానత్వం సాధించేశారెప్పుడో.
ఓ పేద్ద ఆఫీసర్ ఉండేవాడు మాఇంటికెదురుగా చిన్న వయసులోనే (రిజర్వేషన్స్) చాలా పెద్ద స్థాయి కెదిగాడు. ఊరి నుండి ఆయన అమ్మగారు అప్పుడప్పుడూ వచ్చేవారు ఆవిడ ఇంటిముందు రోడ్డు పక్కన పేద్ద చెట్టుకింద కూర్చుని చుట్టలు కాలుస్తూ వుండేది. వాళ్ళ పాప చెపుతుండేది మా అవ్వ తాగుతుంది కూడా అని :)


ఐనా ఆడవాళ్ళు ఇప్పట్లో అంతసమానత్వం కోరుకోరు లెండి బియ్యం పప్పులు కొనుక్కునేసరికే నెలజీతం సరిపోతుంది. ఇంట్లో ఇద్దరికీ వ్యసనం ఉంటే పిల్లలు రోడ్డున పడాల్సిందే.

శరత్ కాలమ్ said...

@ పై ఎనానిమస్
నిజమే. సేవా కార్యక్రమాలు మినహాయిస్తే శ్రీను యొక్క మిగతా భావాలాన్నీ చాలా సాధారణంగా, సగటు మనిషి భావాల్లాగే వుంటాయి. ఎందులోనూ మార్పు వుండదు, మార్పు కోరుకోరు.

Anonymous said...

శరత్ గారు మీరు కోరుకునే మార్పెంటో తెలిసిపోయింది లెండి

శరత్ కాలమ్ said...

@ ఎనానిమస్
:)

@ శ్రీను
"ఆడాళ్ళకి కూడా వ్యభిచారం చేసే హక్కు కల్పిస్తూ వ్యభిచారం చట్టబద్దం చేయాలట"

ఇది నేను కూడా ఖండిస్తున్నాను. మగవారిక్కూడా వ్యభిచారం చేసే హక్కు కల్పించాలి :) స్త్రీ పురుష సమానత్వం జిందాబాద్.

Anonymous said...

నాకు నిన్నటి వరకు 'స్త్రీ పురుష సమానత్వం' అనే అంశం లో నాకు ఏదో స్పష్టత లోపించింది...మీరు రాసింది చదివాక...ఆ గీత కనిపించింది...

Anonymous said...

intaki saarina samanatvma ante emiti. kasta detailed ga cheptara

Anonymous said...

అవును, చట్టబద్ధత కల్పించాల్సిందే.
చట్టబద్ధతే వుంటే వాళ్ళింట్లో ఆడోళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించి పెట్టేవారేమో అని అది కోరుకున్నవారి భాధను తమరు అర్థంచేసుకోవాంలో విఫలమయ్యారని చెప్పాడానికి చింతిస్తున్నాను.

Wit Real said...

బెదరూ:

సచ్చిన పాముని ఇంకా కొట్టటం అనవసరం.
ఆవిడ సమానత్వం జెండా పట్టుకుని పరిగెడతా వుంటది. దేనిలో సమానత్వమో ఆవిడకి అనవసరం.


ఇసుమంటిదే ఇంకొ కత జరిగింది అమెరికాలో

ఎవరొ ఇస్లామిక్ పంతులు గారు, ఆడోళ్ళు క్లీవేజ్ కనిపించేలా బట్టలేసుకుంటే బూకంపాలొచ్చెత్తాయ్ అన్నాడంట

ఇహసూస్కొ! ఆ పంతులు గార్ని తప్పని ప్రూవ్ సేసేకి... మాంచి డీప్ కట్ టాప్ లేసుకుని తిరిగారంట పోరిలు!

Anonymous said...

Wit Real , haa.. haa.. nice! Kudos to the Islamic scholar.. :)

Wit Real said...

couldnt resist posting this:

>> సమానత్వం పేరుతో ఎటు వెళ్తున్నాం మనం ????

ఇటు ->

This week, some women did a topless demonstrations in Portland Maine.

The women participating in the demonstrations assert, fairly logically and persuasively, that prohibiting women from enjoying the pleasures a man enjoys in walking around bare-chested on a hot summer day is discriminatory.

Some blogger's comments:
In some cultures, bare-breasted women would not garner a second glance from a man. But here in the U.S., they get second, third and fourth glances. Unless someone can show that bare-chested women would not cause the sort of distractions that result in car crashes, twisted ankles and slaps from spouses, the women’s point is lost.

మంచు said...

Wit real : ఈ సారి ఇలాంటివి జరిగేటపుడు కాస్త ముందు చెప్తావా :-))

Unknown said...

బ్లాగ్ లో ఇప్పటివరకు చాలా పోస్టులు చదివెను .. అబ్బో సూపర్ అసలు నేను ఎలా మిస్ ఐయ్యాను అనుకుంటున్నా