మద్యం, జూదం , వ్యభిచారం .. మనిషి చాలా త్వరగా ఆకర్షించబడి చివరికి పతనమయ్యే కొన్ని అలవాట్లలో ఇవి ప్రధానమైనవి. నాకు చరిత్రలు తెలియావ్ గానీ నా చిన్న తనంలో ఎవరైనా మద్యం సేవించే వారిని ఒక విలన్ లాగా చూసే వారు మా ఏరియా లో..... మరి ఇప్పుడో ఇంటికి ఇద్దరు తాగుబోతులు ఉన్నారు ( ఎవరి మనోభావాలు అయినా గాయపడితే క్షంతవ్యుడిని) మహిళలలో సైతం మద్యం సేవిస్తున్నారు . గుట్టు చప్పుడు కాకుండా రెండు పెగ్గులు తాగి నక్కి నక్కి గుంటనక్కలా ఇంటికి పోయేవాడు ఒకడైతే మూడో పెగ్గు దాటి పులి లాగా వాడెంత , వాడెంత వీడెంత అని అరచి నానా రచ్చ చేసేవాడు ఇంకొకడు. ఈ రెండు స్టేజీలు దాటిన తర్వాత ఇంకొక స్టేజి ఉంటది..... అదే పంది దశ అంటారు ... అంటే యెంత తాగారో తెలీనంత తాగి రోడ్డు పక్కన కాలువలలో పంది లాగ పొరలె స్టేజి. గ్రామ గ్రామాన వెలసిన బెల్టు షాపులు , వీది వీధిన తాగి తిరిగే మందుబాబులు ఎక్కువ అయ్యారు ఎందుకు మన దగ్గర మద్యపానం చట్టబద్ధం అవడం వల్ల . కేవల ప్రబుత్వం తాగమంది ఆ ఒక్క మాట చాలు మిగతా నిభందనలు తుంగలో తోక్కేయోచ్చు .. ఎక్సైజు శాఖ వారికీ మామూలు ఇస్తే చాలు. మధ్యపాన నిషేధం ఉన్న రోజుల్లో రోడ్డు మీద తాగి తిరిగిన దాఖలాలు బాగా తగ్గాయి . ఎప్పుడైతే నిషేధం ఎత్త్ఘేశారో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎందుకంటే మన మనస్తత్వాలు అలాంటివి కనుక. ఇక పోతే జూదం విషయానికి వస్తే ప్రస్తుతం ఎక్కడైనా పేకాట ఆడుతున్నారు అనే సమాచారం వచ్చి పోలీసులు రైడ్ చేస్తే ఎటు వాళ్ళు అటు పరిగెత్తి పంచెలు ఎగ్గట్టి గోడలు దూకి పారిపొయి , ఎందుకొచ్చిన గొడవరా నాయనా నానా హైరానా పడి చివరకి పేకాట మానేశారు కొన్ని గ్రామాల్లో. ఉదాహరణ ప్రకాశం జిల్లా చెరువు కొమ్ము పాలెం, త్రోవగుంట, దశరాజుపల్లి వగైరా వగైరా . పోలీసులు వచ్చి కొడుతుంటే చాల చిన్న తనంగా ఉంది శీను అందుకే మద్యాహ్నం పేకాట మానేసి పని చేసుకుంటున్నా చాలా డబ్బులు సంపాదించా అని మా రెగ్యులర్ బార్బర్ కొండలు ఈ మద్య చెబుతున్నాడు. అన్ని ఏరియాలలో ఇది వర్క్ ఔట్ అవక పోయినా కాస్తంత ఉపశమనం కలిగించే విషయం.
ఇక అలాగే వ్యభిచారం విషయానికి వస్తే ప్రస్తుతం రెడ్ లైట్ ఎరియాలలో వేశ్యా గృహలకి నక్కి నక్కి పోతున్నారు చాలా మంది వరకు ... వచ్చిన చిక్కంతా హైటెక్ వ్యభిచారం వచ్చిన తర్వాతే .. నివాస గృహాల మద్య ఖరీదైన మనుషుల్లా తిరుగుతూ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయడం వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్ల వ్యభిచారం అనేది ఊరి బయట నుండి ఊరి మధ్యకి ఎప్పుడో వచ్చేసింది. కాకపొతే టీవీ కెమేరాలకి పరువుకి కొండొకచో పెళ్లాల భయానికి కొందరు మానేసిన మాట వాస్తవం. అయితే చట్టబద్ధం చేయడం వలన చాలామందికి రెక్కలు వస్తాయి . ఎలా అయితే మద్యం వ్యాపారి ఈనాడు అత్యున్నత దేవాలయ పదవి అలంకరించాడో .... చట్టబద్దం అయిన తర్వాత చట్టబద్ధమైన వ్యభిచార గృహాలు మన నేతలు నడపడం మొదలెట్టి రాష్ట్రం లో అత్యధిక ఆదాయం గల వ్యభిచార గృహ నిర్వహాహక నేత ఏదో ఒక పవిత్రమైన పదవి అధిస్టించే ప్రమాదం లేకపోలేదు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం లో రామ్ నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతం రెడ్ లైట్ ఏరియా గా బాగా ప్రాచుర్యం లో ఉంది. అయితే పోలీసులు దాడులు చేసి పట్టుకుని కోర్టులో వారు 25 ర్తూపాయలు ఫైన్ కట్టి మళ్లీ అదే పని చేయడం ఇలా జరుగుతూ ఉండేది . చివరికి ఒక బ్రహ్మాండమైన ఐడియాతో పోలీసులు వారి ఆట కట్టించారు. ఆ గృహాలు వెళ్ళే దారులన్నీటి లోనూ మఫ్టీ లో ఉన్న పోలీసులు దాగి అక్కడికి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కడిని పట్టుకుని స్టేషన్ లో పెట్టడం మొదలెట్టారు. దీంతో అటు వెళితే పోలీసులకు పట్టు బడడం ఖాయం అనే భయంతో కొన్నాళ్ళ తర్వాతా ఆ రెడ్ లైట్ ఏరియాకి ఎవరూ వెళ్లకపోగా నిర్వాహకులు సైతం వేరే వ్యాపారాలో నిమగ్నమై అ వృత్తి మానేశారు . అయితే ఇదంతా జరగడానికి పదేళ్ళకి పైగా పట్టింది. ప్రస్తుతం వ్యభిచారం చేస్తే పోలీసులో , టీవీ వాల్లో పట్టుకుంటే పరువుపోతుంది అనే భయం వల్ల జనాల్లో చాలా మంది వ్యభిచారం జోలికి పోవడం లేదు. అదే చట్టబద్దం చేస్తే భయపడే వాడేవడు. అంతంతమాత్రంగా ఉన్న కాపురాలు సైతం కల్లోలం అవుతాయి. ప్రస్తుతం యువతకి సహనం తగ్గింది. ప్రతి చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన అవుతుంది. ముఖ్యంగా భార్య భర్తల మద్య . సరిగ్గా అదే సమయం లో " వంటకని వైఫెందుకురా హోటళ్ళు చాలు , వంటికని ఒకటా రెండా అంగడి అందాలు " అనే లైన్లతో వినడానికి చక్కగా ఉండే పాటలు ఉత్సాహపరుస్తుంటే , శనగలు తిని చెయ్యి కడుక్కునే వారు ఎక్కువ అవుతారు. ప్రస్తుతం వ్యభిచార గృహం గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించే బడా బడా నేతలు ఈ వ్యాపారం లోడైరక్టు దిగుతారు. ట్రాఫికింగ్ అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది . వ్యాపార అభివృద్ధికి అందంగా ఉండే అమ్మాయిల కిడ్నాప్ లు ఎక్కువ అవుతాయి. వాళ్ళని మాదక ద్రవ్యాలకి బానిసల్ని చేసి వారితో వ్యాపారం చేస్తారు. నిబంధనలు అన్నీ తుంగలో తొక్కుతారు. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది . ఇప్పుడు గ్రామాల్లో తిరునాళ్ళలో నగ్న నృత్యాలు చేస్తున్నారు అదీ పోలీసుల భయంతో కొన్ని చోట్ల మానేశారు . ముందు ముందు వ్యభిచారం చట్టబద్ధం అయితే ఇవన్నీ శృతి మించుతాయి. అశ్లీల నృత్యాలు చేసేటపుడు పోలీసులు వస్తే ఇక్కడ జరిగేది నృత్యాలు కాదు వ్యభిచారం చేస్తున్నాం అని చెబుతారు. పోలీసులు ఏమి చేయగలరు . ఒక కామెడీ ఉదాహరణ : పలాన గ్రామంలో వ్యభిచారం చేయడానికి డి.ఎస్.పి కి పర్మిషన్ లెటర్ పెడితే ఎంత చండాలంగా ఉంటుంది .
నోట్ : దేశం లో రేపుల సంఖ్య తగ్గించడానికి వ్యభిచారం చట్టబద్దం చేయడం ... ఎలుకలున్నాయని ఇళ్ళు తగలబెట్టడంతో సమానం అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు .

13 comments:
సెక్స్‌తో బీపీ తగ్గించుకోండి: బ్రెజిల్ మంత్రి
బ్రసీలియా: 'వారానికి ఐదుసార్లు సెక్స్‌లో పాల్గొనండి. డ్యాన్స్ చేయండి. బస్కీలు తీయండి. బరువును నియంత్రించుకోండి..' అధిక రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నిరోధానికి బ్రెజిల్ ఆరోగ్య మంత్రి గోమ్స్ టెంపోరవ్ ఇచ్చిన సలహాలివి. 19 కోట్ల బ్రెజిల్ జనాభాలో పాతిక శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీన్ని నివారించడానికి ఉద్దేశించిన ప్రచార కార్యక్రమాన్ని టెంపోరవ్ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై సలహాలు ఇచ్చారు. 'నేను జోక్ చేయడం లేదు. శృంగారం ముఖ్యంగా సురక్షిత శృంగారం, వ్యాయామం రక్తపోటును, మధుమేహాన్ని అడ్డుకుంటాయి. కూరగాయలు, పళ్లు బాగా తినండి' అని ఆయన దేశ ప్రజలకు ప్రబోధించారు.
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=489896&Categoryid=1&subcatid=31
శ్రీనివాస్,
ఏ౦టయ్యా ని చాదస్త౦ ఈ రోజుల్లో.. కాస్త ఈ జనరేషన్ కి తగినట్టు ఆలోచి౦చు.
అ ద్వాపర యుగ౦లోనే కృష్ణ పరమాత్ముడు రాధ తో అక్రమ స౦భ౦ధ౦ (సారీ, సహజీవన౦) పెట్టుకుని మన జడ్జిల చేత చివాట్లు పెట్టి౦చినా ఇ౦కా ఇలాగె ఆలోచిస్తు౦టే ఎలాగయ్య? మారవయ్య మారూ..!
nice srinivas.......
వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే గవర్నమెంటుకి ట్యాక్సులు వస్తాయి. శ్రీకృష్ణ దేవరాయులు కూడా వేశ్యల నుంచి ట్యాక్సులు వసూలు చేసేవాడని ఓసారి తాడేపల్లి గారు చెప్పారు కదా.
hi
.
.
.
.
.very interesting article.
chala baga chepparu
బాగా చెప్పారు.
గొర్రెపిల్లలను కొని పెంచి మాసం కొట్టుకి అమ్మే బిజినెస్ పెట్టుకున్నా అన్నంత ఈజీగా అమ్మాయిలను కొని పెంచి ఓకంపనీ పెట్టుకున్నా అనే ప్రపంచంలోకి ప్రయాణించబోతున్నామేమో!
మనిషిలోని మృగ లక్షణాలను తొలగించే ప్రయత్నంలో మనిషి సంస్కరింపబడుతూ వచ్చాడు. మతం చట్టం ఇవ్వన్నీ ఏర్పాటు చేసుకున్నదేందుకు.
మూర్ఖులు తిరోగమనాన్ని నాగరికత అని మురుస్తున్నారీ సూడో మేతావులు.
హింస, అబద్దము, దొంగతనము, వ్యభిచారము, మోసము, జూదము ఇవి చాలా చిన్నపదాలు పెద్దగా అభ్యంతరకరం కాని పనులూ బ్రతుకుతెరువు కై చేయదగినవి అంటారేమో ఈ కొత్త సంఘుసంస్కర్తలు!
భవిష్యత్తు తరాలకి మనం అందించబోయేదేమిటి అని బాధగా ఉంది ఇలాంటివి చదువుతోంటె.
చదువులేని వాళ్లు వెనకబడినవాళ్ళు తెలియక అవలక్షణాలు కలిగుంటారు అనేవాళ్ళు నా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు.
దొంగలను ఇంకా బాగా దొంగతనం చేయడం ఎలా, వ్యభిచారులను హైటెక్ వ్యభిచారం హక్కుల పోట్లాటా ఇలా ఇవేనేమో చదువులు అలాంటివాళ్ళకు అందిస్తున్నవి. చదువుకున్న సూడో మేతావులకి ఆ చదువు సంస్కారాన్ని, భాద్యతనూ ఇవ్వడంలేదు.
అలాగైతే ' చట్టబద్ధమైన హెచ్చరిక ' ఏమయ్యుంటుంది, , గుర్తు ఎక్కడ వేస్తారు? అదికూడా సెప్పరాదే అన్నా. రాజకీయవ్యభిచారం ఎప్పుడో చట్టబద్ధమైంది అని శిబూసోరెన్ , లాలూ యాదవ్ పదే పదే గుర్తుచేస్తున్నాడు. :D
ఓహ్ మన ఒంగోలు వాడివన్న మాట. బాగుంది. మద్యం వ్యభిచారం ....మీ భావాలు మెచ్చుకోదగినవే. మన ఒంగోలు విషయాలు బాగా రాయండి.
వెంకట సుబ్బారావు కావూరి 9963427519
వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్ జనరల్ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు అని ధర్మాసనం పేర్కొంది.(ఈనాడు10.12.2009)
ఎయిడ్స్ విషయంలో కుష్బూ 2005లో ఒక చర్చలో పాల్గొంటూ ''గర్భం రాకుండా, లైంగిక వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వివాహానికి ముందు సెక్స్ తప్పేంకాదు'' అని బాలికలకు సలహా ఇచ్చారు.
చదువుకున్న మొగాడెవరూ తన భార్య కన్యగానే తన జీవితంలోకి అడుగు పెడుతుందని ఆశించడు'' అని మరో బాంబు పేల్చారు. ఈ సందర్భంగా ఆమె వివాహబంధం లేకుండా యువతీ యువకులు కలిసి జీవించడాన్ని కూడా సమర్థించారు. కుష్బూ వ్యాఖ్యలతో తమిళనాడులో సంప్రదాయవాదులు భగ్గుమన్నారు. కోర్టు ఖుష్బూ వ్యాఖ్యలను సమర్థించింది. పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి కాకుండా సహజీవనం సాగించడం నేరాలుగా చెప్పలేమని స్పష్టం చేసింది. అనైతికం అనుకునేవన్నీ నేరాలుగా చెప్పలేమని పేర్కొంది. తీర్పు వెలువడిన తర్వాత కుష్బూ తిరిగి తన పాత వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.29.4.2010
పెళ్ళికి ముందు శృంగారం పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు: పెళ్లికి ముందు శృంగారం చట్టబద్ధమైన నేరం కాదు.ప్రజాదరణలేని అభిప్రాయాల్ని వ్యక్తంచేసినంత మాత్రాన వ్యక్తులను క్రిమినల్ చట్టం శిక్షింపజాలదు.అలా చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది.పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మాత్రమే శృంగారం జరగాలనేది మన సమాజంలో బలంగా ఉన్న అభిప్రాయం. ఐపీసీ 497 సెక్షన్లో నిర్వచించిన 'వ్యభిచారాన్ని' మినహాయిస్తే... వివాహ బంధానికి వెలుపల పెద్దలు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది చట్టబద్ధమైన నేరం కాదు.పెళ్లికి ముందు శృంగారానికి చట్టబద్ధమైన అడ్డంకులేవీ లేవు.పెళ్లికి ముందు శృంగారం సహజీవనం తప్పుకాదని ఖుష్బూచేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగానో, హానికరంగానో లేవు. ఇలాంటి సామాజిక అంశాలపై బహిరంగ చర్చ జరిగే సంస్కృతి అభివృద్ధి చెందాల్సి ఉంది.'భారతదేశంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన సామాజిక వ్యవస్థ.అదే సమయంలో ఈ అభిప్రాయంతో ఏకీభవించని వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయన్న వాస్తవాన్ని మరువకూడదు. మన సమాజంలోనే కొన్ని జాతుల వారు పెళ్లికి వెలుపల లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రధాన జనజీవన స్రవంతిలో కూడా చాలా మంది పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదని భావిస్తున్నారు.ఇద్దరూ ఇష్టపడి శృంగారంలో పాల్గొంటున్న కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దానిని సమాజం కూడా అంగీకరించాలని ఖుష్బూ కోరారే తప్ప అన్ని రకాల శృంగార కార్యకలాపాలకు బహిరంగ ఆమోదంగా దీనిని పరిగణించకూడదు.(ఈనాడు30.4.2010)
శీను గారు , మీరు కరెక్ట్ గా చెప్పారు ,
@ రాజా గారు థాంక్స్
Post a Comment