నిన్ననే ఒక టపా రాశాను ... కామెడీగా రాశాను కానీ అందులో కొని నిజం అవుతాయనుకోలేదు వా
..
ఈ కింది లింక్ చూడండి . జగన్ కి కన్ను బాలేక ఓదార్పు ఆగడం వల్ల ముగ్గురు ఫట్ . ముందు సాక్షికి సలాం చెయ్యాలి :(
http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11677&subcatid=16&Categoryid=3
‘గుండె’ చెదిరిన అభిమానం |
|
|
|
|
|
ఒంగోలు మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి అనారోగ్య కారణంతో ఓదార్పు యాత్ర వాయిదా పడడంతో కలత చెంది ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఒంగోలు పట్టణంలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. సంతనూతలపాడు మండలానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజు(22)మృతి చెందాడు. ఆ యువకుని తల్లిదండ్రులు బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని కలిసి వారి ఆవేదనను చెప్పుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు రామలక్ష్మయ్య, రమణ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. ఒక కొడుకు అంకమరాజు ఏడాది క్రితం పోలియో వ్యాధితో మృతి చెందాడు. పెద్దబ్బాయి నాగరాజు పదేళ్లు వచ్చాక పోలియో సోకింది. వైఎస్ఆర్ హయాంలో నాగరాజుకు పింఛన్ మంజూరయింది. దీంతో వైఎస్ఆర్ మీద నాగరాజు అభిమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం దెబ్బతిని ఓదార్పుయాత్ర వాయిదా పడడంతో నాగరాజు ఆవేదన చెందాడు. హఠాన్మరణం చెందాడు. ఆదుకుంటామని సుబ్బారెడ్డి వారికి హామీ ఇచ్చారు. వైఎస్ అభిమాని గుండెపోటుతో మృతిమేదరమెట్ల, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి చనిపోయాడు. కొరిశపాడు మండలం యరబ్రాలేనికి చెందిన కోటపూడి వెంకటేశ్వర్లు(59) మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో టీవీలో ఓదార్పు యాత్ర వార్తలు చూస్తూ ఉద్వేగానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. ఇతను వైఎస్ఆర్ వీరాభిమాని. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వైఎస్ మృతి చెందినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందేమోనని తీవ్రంగా బాధపడ్డాడని అతని భార్య సౌభాగ్యం ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని చెబుతుండేవాడన్నారు. వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంపై ఆగిన గుండెకందుకూరు : జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడంపై కలత చెంది ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వలేటివారిపాలెం మండలం శాఖవరంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల నుంచి ఆ గ్రామానికి చెందిన దళితులు ప్రయత్నం చేస్తున్నారు. వివాదంలో ఉన్న పంచాయతీ స్థలంలో విగ్రహ ఏర్పాటును అగ్రవర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. భూమి పూజను కూడా నిలిపివేశారు. తమ అభిమాన నేత విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో గడ్డం అచ్చయ్య(62) తీవ్రంగా బాధపడ్డాడు. బుధవారం సాయంత్రం 4 గంటలకు గుండె పోటుతో మరణించాడు. మృతునికి భార్య, వివాహమైన కుమార్తె ఉంది. వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు కమిటీ తరఫున అచ్చయ్య తీవ్రంగా కృషి చేశారు. అది విఫలం కావడంతో వేదన చెంది గుండెపోటుతో మరణించాడు. |
| |
|
25 comments:
This is only beginning. In front there is crocodile festival.
పడి పడీ నవ్వడానికి సిద్ధంగా ఉండండి.
ఇంకొన్ని అవిడియాలు ...
జగన్ పై ఆరోపణ చేసారని మనస్తాపం తో ఎనబై ఏళ్ళ వ్యక్తి మరణం
జగన్ ముఖ్యమంత్రి కావాలని 'వై ఎస్ ఆర్ యాత్ర' ౩౦ రొజుల వ్రతం ప్రారంభించిన యువజన సంఘం .వ్రతం చివరలో ఇడుపులా పాయ పుణ్య క్షేత్ర దర్శనం.
జగన్ తమ ఆస్పత్రికి రాలేదని పిచ్చాసుపత్రి లో వున్న రోగుల మనస్తాపం చెంది , ఊరిమీద పడి కనపడిన వాళ్ళని కోరికేసారు. జగన్ ఓదార్పు అందించేంతవరకు ఆగమని సాచ్చి ( సాక్షి + ఛి = సాచ్చి (ఓదార్పు సంధి)) విలేఖరికి చెప్పారు.
ఇలాంటివి ముందు ముందు జరుగుతాయి కవిగారు .. :-)
ఇంత చేసి వై.ఎస్.ఆర్. సొంత వాళ్ళలో ఎవరికీ గుండె కాదు కదా కనీసం జలుబు కూడా చేయలేదు :-(
asalu veelu nijame raasthunnaru antara??mari intha abimanama???aa prema,abhimaanam thallidhandrula meeda pettukunte ..eppudo bagu padevvalu.em chestham.Pichi janaalu.
Oo pani chedham Jagan ni Kidnap chesi konni rojulu dhaceddam.appudu em jaruguthundo chudali.
నాలో సభ్యత, నాగరికతా చచ్చిపోయాయి...మనుషులు చస్తేకూడా నవ్వుతున్నా.....హ హ్హహ్హ హహ్హహ్హ
శ్రీనివాస్ మీరు సాక్షి మీద కేస్ వెయ్యొచ్చు, మీరు బ్లాగులో రాసుకున్నవి కాపీ కొట్టి పేపర్లో వేసుకున్నారు అని
మిత్రులారా టెంప్లేటు మార్చుకుంటుండా ఆలస్యంగా రిప్లై ఇస్తా :))
@ jatar ( సాక్షి + ఛి = సాచ్చి (ఓదార్పు సంధి))
KEKA...RACHHA RACHHA
anna seenanna template baagaa ledannaa....
ఔ ఔ కొత్త టెంప్లెట్ బాలే....
బ్లాగుల్లో ఇంత గొప్ప కామెడి టపాని నేనింతవరకూ చూడలేదండీ ఇప్పటివరకూ....తోటరాముడిగారి టపాలు కూడా ఈ టపా ముందు బలాదూర్..:-)
నాకూ ఓ ఓదార్పు కావాలి. ఆ మధ్య నా మనోభావాలు ఎవరో గాయపరిచారు. మనసు చచ్చింది, కట్టెలాంటి ఈ శరీరం మిగిలింది. ఖళ్..ఖళ్. నాకూ ఎవరయినా ఓదార్పు నిచ్చి దాంతో పాటే డబ్బులూ ఇస్తే పోయిన మనస్సుని వెనక్కి తెచ్చుకొని మీకందరికీ షేవ్ సారీ అప్పుతచ్చు సేవ చేస్తా!
@కవిత ,మీరు చెప్పిన పని చేస్తే ఎనభై శాతం తెలుగోళ్ళ గుండెలాగిపోతాయి,అప్పుడు జగనన్న జీవితాంతం ఓదార్పు యాత్రలు చేయాల్సి వస్తుంది.
@ కవిత జగన్ ప్రస్తుతం నాకు చాలా దగ్గరలో ఉన్నాడు .. పదిహేను ఇళ్ళ దూరం లొ
@ శరత్ జీ ,
looooooooooooooooooool
>> పదిహేను ఇళ్ళ దూరం లొ
అద్గదీ! పదేనిళ్ళవతలుండి ఇంకా నిన్ను ఓదార్చలేదని, కుళ్ళు నీకు!
హ్మ్ పదిహేను ఇళ్ళదూరమా...
ఐతే వచ్చేవారం ఐనా మీ ఇంటిదాకా వస్తాడా?
@ తార , రెస్ట్ తీసుకున్తుండు మినిస్టర్ ఇంట్లో
ఓ విట్ రియల్ నువ్వు రియలా డూపా
విత్ రియల్ గారికి సాక్ష్యాలు కావాలంట..
ఏంటీ ఎస్వీ సుబ్బారెడ్డి ఇల్లు 15 ఇళ్ళ దూరమేనా మీకు! మరి వెళ్ళి జగన్‌ని ఓదార్చడమో - వద్దులెండి ఓ లక్షన్నా చేతిలో పెట్టకపోతే బావుందదు కదా - జగనుతో ఓదార్పించుకోవడం బావుంటుంది. కాస్త శ్రమ అనుకోక ఓ పదిహేనిళ్ళు దాటి వెళ్ళి ఎవరిదో ఓ బ్లాగరు పేరు చెప్పి ఓ లక్షన్నా దండుకోండి. ఈ మంచి అవకాశం మించిన రాదు. ఓ ఐడియా ఇచ్చి మీ జీవితాన్నే మార్చేసినందుకు గాను డబ్బులొస్తేనే అందులో ఓ 15% నాకు సమర్పించుకోండి. డబ్బులు కాకుండా ఇంకేమయినా వస్తే క్రిష్ణ కివ్వండి వాటా - నాకొద్దు - ఎందుకయినా మంచిది.
శరత్ గారు ఆయన ఎస్వి కాదు వై వి సుబ్బారెడ్డి
అయిన ఇప్పుడు మలక్ దెబ్బకి ఒక వ్యక్తి ఓదార్పు కోరుకుంటూన్నాడు లెండి ఆయన పేరు చెప్పి అడుగుతా హిహిహి
రెండు రూపాయలకే బోలెడు కాగితాలు వస్తున్నాయని చాలామంది ఆ పేపర్ కొనుక్కుంటున్నారు అందులో ఫ్యామిలీ తప్ప మిగతా అంతా చెత్తే చదవకుండా కప్ బోర్డ్స్ లోనో ఇంకెక్క డన్నా వేస్కోండి . అలాంటి పనికి మాలిన పేపర్లు ఇంకా ఉన్నాయ్ ఆంధ్ర ప్రదేశ్ లో కొనుక్కొని టైలేట్ పేపర్ గా వాడుకోండి కనీసం ....
>> ఓ విట్ రియల్ నువ్వు రియలా డూపా
ఓసోస్, మనకు డూపులు కూడా వున్నారేటి?
పదిహేను ఇళ్ళదూరమా...హే అయితే నేను చెప్పిన ప్లాన్ కి ఇదే మంచి సమయం.మీరు అమలు చేయండి.మీ వెనకాల నేను,రాజేష్ ఉన్నాం.ఏమంటారు?
@విజయ్ గారు,ఏదో ఒకటిలెండి...అలాగయిన జగన్ కి ఒక పని(ఉద్యోగం ) ఇచ్చిన వాళ్ళం అయితాం .మా Relative వాళ్ళ ఇంటికి కి ఓదార్పు కి వచ్చి ,నేను CM అయితే మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చేవాడి ని అని వపోయాదంటా.CM అయితే అయిదేళ్ళు..ఇదయితే జీవితాంతం కదా!!!!!.
Post a Comment