అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

7/28/10

పడయప్పా ............. కాదు పాములోడప్పా

( ఇది టీనేజ్ కుర్రాళ్ళ సిల్లీ కధ ... ఇంటలెక్చువల్ గా ఉంటుంది అని ఆశించకండి)

అది 1999 వ సంవత్సరం .... నేను 19 -20 ఏళ్ళ వయసులో ఉండగా ఒంగోల్లో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టారు . అంత వరకు మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తప్ప గతి లేని మా ఊరికి ఇంజనీరింగ్ కాలేజీ రావడం పెద్ద విషయం కాపోయినా ......అందులో చదవడానికి... రాష్ట్ర నలుమూలల నుండి చాలా మంది అమ్మాయిలు వచ్చారు అన్న వార్త ప్రధానంగా మా కుర్ర బ్యాచ్ ని ఆకర్షించింది. అంతవరకు ఊర్లో చాలావరకు మాకు పరిచయం ఉన్న అమ్మాయిలే ఉండేవారు .. వాళ్ళతో చిన్ననాటి నుండి ఉన్న పరిచయం కారణంగా కాస్త ఆరోగ్యకరమైన స్నేహాలు ఉండేవి . కొత్తగా వంద మందికి పైగా సిటీ నుండి వచ్చిన అమ్మాయిలని చూడగానే ఏదో విధంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించాలి అనే మా కుర్రాళ్ళ తాపత్రయం ...అంతా ఇంత కాదు. కానీ ఎలా??????????? .. వాళ్లేమో వాళ్ళ హాస్టల్ నుండి ఫర్లాంగు దూరం మెయిన్ రోడ్ మీదకి వచ్చి అక్కడ బస్సు ఎక్కి కాలేజికి పోవడం తిరిగి అక్కడే దిగి మళ్లా హాస్టల్ కి పోవడం .. అంతేగానీ ఇంకెక్కడా కనిపించేవారు కాదు.

కానీ విధి చాలా చిత్రమైనది .. వాళ్ళ దృష్టిని ఆకర్చించాలని విపరీతంగా కృషి చేసిన మా నికృష్టులు..... కన్నా , రవూఫ్, సృజన్, ఇంతియాజ్, మల్లి గాడు , భానుగాడు తదితర బేవార్స్ లని వదిలేసి ... పాపం పదో తరగతి వరకే చదివి ఆ తరువాత తండ్రి చనిపోవడం వల్ల ఇంటి పోషణ భారం నిమిత్తం కూలి పనికి వెళుతున్న చాంద్ బాషా అనే పదిహేడేళ్ళ అబ్బాయిని అనవసరంగాకెలుక్కునారు ఆ అమ్మాయిలు. వివరాల్లోకి వెళ్దాం ........................ చంద్ బాషా కి ఒక కాలు మడమ దగ్గర చిన్న సమస్య ఉంది అందుకే కొంచెం ఎగిరినట్టు నడుస్తాడు ఒక రోజు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న వాడిని చూసి "అబ్బో లారెన్స్ ఒంగోల్లో తిరుగుతున్నాడే" అని ఒకరు అనడం అదో భయంకరమైన కామెడీ అన్నట్టు మిగతా వాళ్ళు నవ్వడం .. వీడు చూడగానే "లారెన్స్ కి కోపం వచ్చిందే" .. అని ఒకరు , "అయితే తాండవం చేయమను" అని ఇంకొకరు ఇలా రోజు ఏదో ఒకటి అనడంతో తిక్క రేగి మన గాలి దళానికి ఫిర్యాదు చేశాడు. ఆ రోజు సాయంత్రం మా అడ్డాకి అందరం చేరుకునే సమయానికి అక్కడ ఇదే టాపిక్ జరుగుతుంది. అక్కడ చంద్ బాషాకి న్యాయం చేద్దాం అన్న తపన కన్నా ఈ వంకతో అమ్మాయిల కంట్లో పడచ్చు అన్న యావ మన జనాలలో బాగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి గమనించిన ఫరూక్ .. " అన్నా మాటర్ చాలా కంపు అయ్యేటట్టు ఉంది దీన్ని ఇక్కడే కట్ చేయడం మంచింది" అన్నాడు. నేను చాంద్ బాశాని పక్కకి తీసుకెళ్ళి " అరె చాంద్ , మనం వెళ్లి అడిగితే మీ వాడి పేరేత్తామా.. ఊరేత్తామా అంటారు ప్రస్తుతానికి కాం గా ఉండు .. రేపు నేను చెప్తా .. ఈలోపు ఎవర్నన్నా తీసుకెళ్ళి గొడవ చెయ్యబాక" ... అని చెప్పా ... వాడు ఒప్పుకున్నాడు కానీ పక్కనోళ్ళు ఒప్పుకోవడం లా .... చివరికి ఎలాగో ఒప్పించి ..... అసలు ముందు కామెంట్ చేసిన అమ్మాయి ఎవరో చూడాలని డిసైడ్ అయ్యాం. అందరం గుంపుగా కాకుండా ... నేను , చాంద్ఇంకా కన్నా వెళ్ళాలని నిర్ణయం జరిగింది.

ఆ మర్నాడు ఉదయాన్నే ముగ్గురం ఆ ఏరియా లో రెడీగా ఉన్నాం వాళ్ళు బస్సు ఎక్కే ఏరియా కి దగ్గరలో గోడ మీద కూర్చున్నాం . అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి బస్సు ఎక్కుతున్నారు . " అన్నా ఆ పింక్ డ్రెస్ అమ్మాయి అన్నా.... ఆ పక్కన వచ్చే వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఉండి వంత పాడుతుంటారు అన్నా " అన్నాడు చాంద్. చూద్దును కదా సన్నగా పొడవుగా గట్టిగా ఊదితే పడిపోయెలా ఉన్న ఒకపిల్ల నడుచుకుంటూ వస్తుంది .... ప్రేమదేశం లో టబు ని ఇమిటేట్ చేయాలనీ ప్రయత్నించడం తెలుస్తునే ఉంది. ఆ అమ్మాయి పక్కనే ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరూ తన వీర ఫాలోయర్స్ అని అర్ధం అయింది. ఊరికే చూద్దాం అని వచ్చిన నేను ఎందుకో సంయమనం కోల్పోయాను " ఈ మినప గింజ మొహందా నిన్ను కామెంట్ చేసింది ... అందంగా ఉన్న ఆ అమ్మాయో ... లేక అబోవ్ యావరేజ్ గా ఉన్న ఈ అమ్మాయో అంటే పర్లేదుగానీ " అని కాస్త పెద్దగానే అన్నాను .... అయితే చాంద్ గాడు ఆ అమ్మాయి గురించి చెప్పిన దాన్ని బట్టి కాస్త ఘాటు గానే రిప్లై ఆశించాను .... కానీ ఆ ముగ్గురు చటుక్కున తలదించుకుని వెళ్ళిపోయారు. కానీ రియాక్షన్ పక్కన ఉన్న కన్నా గాడి దగ్గర నుండి వచ్చింది. " అరె మనం ఊరికే చూద్దాం అని కదా వచ్చాం నువ్వేమో పెద్ద పుడింగి లా కామెంట్ వేసేసావ్ ..... ఇప్పుడు చూడు రేపటి నుండి మనల్ని ఎదవల్లాగా చూస్తారు .. ఒక్కపిల్ల కూడా పడదు ..... అంతా నీవల్లే" అంటూ నస మొదలెట్టాడు. " అరె జఫ్ఫా మూసుకుని వాళ్ళలో వచ్చే రియాక్షన్ చూడు" అని చెప్పా .... మర్నాడు మళ్లీ వెళ్ళాం .... మొదటి రోజు కలిసి వెళ్ళిన వాళ్ళు ... ఈ రోజు ముగ్గురు వేరు వేరుగా ఒంటరిగా రావడం మినప గింజ నన్ను క్రోధం తో కూడిన చూపు చూడడం.... అబొవ్ యావరేజ్ కోర కోరా చూడడం ...... అందగత్తె ఫోజు కొడుతూ వెళ్ళడం చకా చకా జరిగిపోయాయి.
( నేను అన్న మాటలకి ..... వాళ్ళ అందం విషయం లో వాళ్ళ మద్య పెద్ద యుద్ధం జరిగింది అని తర్వాత తెల్సింది. సో ఆ బ్యాచ్ ని విజయ వంతంగా విడగొట్టా ......ఆ రోజు తర్వాత చాంద్ గాడిని ఎవరూ ఏమీ అనలేదు .... మనోడు కూడా హ్యాపీ ..... ఆలా చూసి వద్దామని వెళ్లి కాల్చి ( అమ్మాయిల ఫ్రెండ్ షిప్ ని ) వచ్చా. :P

ఒక రెండు నెలలు సాదా సీదాగా గడిచాయి... . తర్వాత ఒకరోజు అప్పటి తెలుగుదేశం గవర్నమెంటు లో మంత్రిగా పని చేసిన దామచర్ల ఆంజనేయులు గారి ఆఫీసుకి మా ఫ్రెండు రవూఫ్ పని మీద వెళ్లడం జరిగింది ...నేను కూడా వెళ్ళా. అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలు అవుతుంది .. వాడు లోపలి వెళ్లాడు నేను బయటే ఉన్నా ... కారణం ఆ పక్క బిల్డింగ్ అమ్మాయిల హాస్టల్ కావడమే :)) కాసేపటికి హాస్టల్ లో నుండిపెద్దగా కేకలు వినిపించాయి ..అమ్మాయిలు అందరూ మూకుమ్మడిగా అరుస్తున్నారు .... " పాము పాము" అని. మనికి అసలే ఆవేశం ఎక్కువ కదా...... పాము అన్న మాట వినపడితే మనల్ని ఎవరు ఆపలేరు. వెళ్లి హాస్టల్ గేటు ఎక్కి దూకా ... అది తీసే ఉందని తర్వాత అర్ధం అయింది. ఆ కాంపౌండ్ లో రెండు బిల్డింగ్ ల మద్య ఖాళి స్థలం ఉంది అక్కడ గడ్డిలో పాము కొట్టుకుంటూ కనపడింది ... అమ్మాయిలు అందరూ గోడలు కుర్చీలు ఎక్కేసారు. ఆ టైం లో అక్కడికి వచ్చిన నను సాక్షాత్తు శ్రీక్రిష్ణుడే వాళ్ళని రక్షించడాని వచ్చినట్టుగా చూసి . .... "సార్ సార్ అక్కడ ఉంది పాము చూడండి" అన్నారు. దగ్గరికి వెళ్లి చూద్దును కదా దాని తల అప్పటికే నలిగి ఉంది కానీ కొన ప్రాణం తో కొట్టుకుంటుంది. ఆ విషయం అమ్మాయిలకి కి తెలీదు . ఏ పక్షులో తీసుకెళుతుండగా జారి పడినట్టు ఉంది .. ఇలాంటి అద్భుత అవకాశాన్ని గత పదిహేనేళ్ళు గా తెలుగు సినిమాలు చూస్తున్న కుర్రాడు వదులుకుంటాడా చెప్పండి :P. వెంటనే దాని తోక దగ్గర పట్టుకుని గాల్లో గిర గిరా తిప్పి అక్కడే నేలకేసి కొట్టి , తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని నడిచి వస్తుంటే అబ్బా అబ్బా అబ్బా ...... అమ్మాయిలు అంతా చప్పట్లు .. సూపర్ ... అనే అరుపులు .. నరసింహా .. రజనీకాంత్ అని సెటైర్లు ..మద్య నడుచుకుంటూ వెళ్లి దాన్ని దూరంగా పారేశా....

అప్పటికే తాజాగా నరసింహ సినిమా రిలీజ్ అయి ఉంది. ఆహా ఏమి కో- ఇన్సిడెన్స్ అనుకుంటూ .. గేటు దగ్గర నిలుచున్నా ... అమ్మయిలు అందరూ వచ్చి అక్కడ చెరి ..పొగడ్తలు .. థాంక్స్ లు గట్రా అవుతున్డగానే మా రవూఫ్ గాడు బయటికి వచ్చాడు. ...... అక్కడ అమ్మాయిల మద్య లో ఉన్న నన్ను చూసి వాడి నవరంధ్రాల నుండి ఉక్రోషం పొంగి " పోదాం పా " అన్నాడు కాస్త సీరియస్సుగా. అక్కడి నుండి వెళ్ళిపోయాం . జరిగిన విషయం చెప్పగానే . అబ్బా జస్ట్ చాన్స్ మిస్సు అని తెగ గింజుకున్నాడు.

క్రింది వీడియో చూడండిఈ వీడియో లోలాగా పాముని పట్టుకున్న నన్ను కూడా వాళ్ళు ముద్దుగా నరసింహా ( పడయప్పా) అని పిలుచుకుంటారేమో ఆనుకున్నా ... కానీ చాలా కాలానికి .. హాస్టల్ లో ఉన్న మా ఫ్రెండు గాడి ఒక లవర్ ద్వారా లీకైన .. విషయం ఏంటంటే .....వాళ్ళు నాకు పడయప్పా అని కాకుండా పాములోడు అని పేరు పెట్టారని ... అందులోనూ నా కామెంట్ వల్ల హార్ట్ అయిన మినప గింజ పగబట్టి మరీ ఆ పేరుపెట్టి .... ప్రచారం కల్పించింది అని తెల్సుకుని ............... అమ్మనీ యెంత దెబ్బ కొట్టావే అనుకున్నా ....................:)

42 comments:

తార said...

ఆ, తరువాత...

నేను బ్లాగులెమీ రాయడం లేదు అని అంటునే మీ నాగ, ఎవో 2-3 బ్లాగులు తెగ రాసేస్తున్నాడని టాక్, విన్నారా?

నేస్తం said...

పాములోడు గారు చాలా బాగా రాసారండి..

హరే కృష్ణ said...

:D :D

nicely written

వెంకట్ said...

సార్ పుట్టలో చెయ్యెట్టారు కదండి పాము కుట్టలేదా?

Vinay Chakravarthi.Gogineni said...

baagundi

శేఖర్ పెద్దగోపు said...

హా...హ్హా...హ..
మొత్తానికి మీ అనుభవం ద్వారా నాకు తెలిసిందేమిటంటే అమ్మాయిలు పాముల్లాగే
పగబట్టి చివరాకరికి పగ తీర్చుకుంటారని... :-)
వారి అందాన్ని categorize చేసి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి భలే విడదీసేసారే !! (Point to be noted) :-)

నాగప్రసాద్ said...

@తార: అవును. ;-)

Malakpet Rowdy said...

LOL Sreenu :))


Venkat,

One snake did bite him, but died immediately after biting him :))

శ్రీనివాస్ said...

@ తారా ఆ తర్వాత జరిగింది తదుపరి టపాలో వివరంగా
@నేస్తం గారు ఈ సారి మీ టపాలో దొరక్కపోరు
@హరే కృష్ణ :))
@వెంకట్ .... మలక్పేట రౌడీ గారు చెప్పింది ఖాయం చేసుకోండి :))

శ్రీనివాస్ said...

@ వినయ్ థాంక్స్
@ శేఖర్ గారు మొత్తానికి టపా వెనక నీతి పట్టేశారు .... మీరు నోట్ చేసుకున్న పాయింట్ అన్ని సందర్భాలలో వాడకండి.
@ నాగ

నీ బ్లాగుల లిస్టు చెప్పు బాసు

@ మలక్

rofl

శరత్ కాలమ్ said...

నాకయితే చచ్చిన పాముని పట్టుకోవాలన్నా గగుర్పాటు కాబట్టి హీరో అయిపోతే అయిపోయాడు అనుకొని పక్కన మా ఫ్రెండు వుంటే వాడిని ముందుకు తోసేసి నేను ఎందుకయినా మంచిదని (ఏ పాములో ఏ ప్రాణం వుందో ఎవడికి తెలుసు?) ఇంకొంచెం వెనక్కి జరిగేవాడిని.

Anonymous said...

baagundi mee silly kadha. Template inkaa bagundi.

చందు said...

వడయప్పా ...ఎన్నా అప్ప ఇది ? రొంబ సాంబార్ వడ మాదిరి మంచి taste గ పుడిస్తివి , ఎన్నడే గురువయురప్పా !!!

Unknown said...

ఆ తర్వాతే గా శీను నీ నోము ఫలించి
హైదరాబాద్ లో పూజ లభించింది .

మధురవాణి said...

ఎంత దెబ్బ తగిలిన పామే అయినా.. మీరు నిజంగా గ్రేటేనండీ! పోన్లెండి.. వాళ్ళు అలా అన్నా గానీ మేము పడయప్పా.. అంటాం లే! :-)

Anonymous said...

ఈ సన్నివేశం వెంకటేశ్ మరియు మీనా నటించిన చిత్రం లోనిది ....

కౌటిల్య said...

శ్రీనివాస్ గారూ..ఎప్పట్నుంచో మీ బ్లాగు చూస్తుంటా..కాని కామెంటు రాద్దామంటే, మహా వళ్ళు బద్ధకం..ఇదిగో ఇప్పటికైంది...నేనూ ఒంగోల్లో ఓ మూడేళ్ళు చదువు వెలగబెట్టా...నా లైఫ్ లో స్వీట్ మెమొరీస్ అన్నీ అక్కడున్నప్పటివే(చదువు తప్ప అన్నీ చేశేవాళ్ళం..అందుకనే)..ఇప్పుడు మీ టపా చూస్తుంటే అవన్నీ గుర్తొచ్చి కామెంటు పెట్టకుండా ఉండలేకపోయా..థాంక్స్ ఫర్ ద పోస్ట్...

నేస్తం said...

శ్రినివాస్ ఇప్పుడే యూ ట్యూబ్ లో లింక్స్ చూసాను..సహాయ పౌండేషన్ వి..చాలా సంతోషం వేసింది మనసుకు ...ముఖ్యం గా యువకులు ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండటం నిజంగా అభినందనీయం .. good

శ్రీనివాస్ said...

@ Anonymous thanks

@ రవిగారు .. నా పూజ ఫలించలేదు .... ఆ పూజ రవికిరణాల కోసం తపించింది అని విన్నా :)

@ సావిరహే ..... మీది ప్రకాశం జిల్లా లో బ్రాహ్మణ నిడమానూరేనా?

శ్రీనివాస్ said...

@ శరత్ గారు ... పాముని పట్టుకోవడానికి గట్స్ కావాలండీ

శ్రీనివాస్ said...

@ మధురవాణి గారు చివరకు మే చేత అయినా పడయప్పా అనిపించుకున్నా ... చాలా థాంక్స్

@అజ్ఞాత అది వెంకటేష్ మీనా సినిమా కాదు ... వెంకటేష్ , నగ్మా నటించిన కొండపల్లి రాజా చిత్రం లో ఉంది.

@ కౌటిల్య గారు నా టపా ద్వారా ఒంగోల్లో మీ మధురానుభూతులు మళ్లీ గుర్తువచ్చినందుకు సంతోషం ... టపా చూసి కామెంట్ పెట్టకుండా పోయిన వాళ్ళకి కొమ్ములు వచ్చుగాక ....

@ నేస్తం గారు :::))))

3g said...

"టపా చూసి కామెంట్ పెట్టకుండా పోయిన వాళ్ళకి కొమ్ములు వచ్చుగాక ..."

ఇప్పుడు కొమ్ములవీ ఎందుగ్గాని పోస్టు చాలా బాగుందండి. పొద్దున కామెంట్ పోస్ట్ చేసాననుకున్నానుకాని రాలేదనమాట.

అయినా మీరు బ్రిటిష్ వాళ్ళ సూత్రం సగమే ఫాలో అయ్యారు అందుకే వడయప్పా బదులు ఇంకోటేదో వచ్చింది. ఈసారి ఎవరినైనా విభజించినపుడు పాలించే చాన్స్ కూడా మీరే తీసుకోండి.

Ram Krish Reddy Kotla said...

శీనుగారు ఇరగ్గోట్టారు...సూపర్...అసలు మీ పోస్ట్ నిన్నే చూసా, కామెంట్ తర్వాత ఇద్దామనుకున్నా, కానీ బద్దకించి ఇవ్వలేదు...ఈ రోజు "టపా చూసి కామెంట్ పెట్టకుండా పోయిన వాళ్ళకి కొమ్ములు వచ్చుగాక" అన్న మీ మాటలు చూసి, ఈ మాత్రం గ్లామర్ కే అమ్మాయిలు పడట్లేదు, ఇక కొమ్ములు కూడా వస్తే ఆ గ్లామర్ కి అసలు పెళ్ళే కాదు అని భయమేసి ఇలా కామెంట్ ఇస్తున్నా అనమాట... మొత్తానికి అమ్మాయిలని భలే విడగోట్టారే...గుడ్...కీప్ ఇట్ అప్..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా కొంత మంది అమ్మాయిలను విడగోడతాను...ఆ తర్వాత ఆ అమ్మాయి పగబడితే, అప్పుడు మిమ్మల్ని సలహా అడుగుతా...సరేనా?...ఒంగోలు లో మొదటిగా పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీ నాకు తెలిసీ, QIS engg college..rite? or else would it be SSN?

శ్రీనివాస్ said...

@3g తప్పకుండా మనిద్దరం కలసి పాలిద్దాం లెండి

@ రామకృష్ణ రెడ్డి అది SSN :))

Gani said...

>>టపా చూసి కామెంట్ పెట్టకుండా పోయిన వాళ్ళకి కొమ్ములు వచ్చుగాక

దీన్ని చూసి భయపడే కామెంటు తున్నా, మాది కూడా ఒంగోలే.

Anonymous said...

ni titlu tagaleyya.. asle baba daya unnavaadivi, endukule comment chesta. aa ammayi minapa ginja ayite nuvvu veru senaga ginja vi..

నేను said...

అంతకు ముందే కొమ్ములు వున్నవాళ్ళకి అవి పోయే ఫెసిలిటీ ఏమన్నా వుందా అద్దెచ్చా ?

శ్రీనివాస్ said...

@ gani మనం మనం ఒంగోల్ వాళ్ళం ఆ మాత్రం కార్పోరేషన్ లేకపోతే ఎలా :)

@ అజ్ఞాత వేరుశనగ వల్ల లాభాలు వెయ్యి రకాలు :) కామెంటినందుకు థాంక్స్

@ బద్రి ఉన్న కొమ్ములు పోవాలంటే మలక్పేట రౌడీ ని కెలుకుతూ పోస్టు వేస్తే సరి.

రౌడీ శిష్యుడు. said...

@ ఉన్న కొమ్ములు పోవాలంటే మలక్పేట రౌడీ ని కెలుకుతూ పోస్టు వేస్తే సరి.

వీపు గోకుడా లేక ఇది వీర గోకుడా లేదా వికట గోకుడా...

__________________________________

LOL...........

Anonymous said...

vikatakavi yokka veera veepu gokudemo.

Malakpet Rowdy said...

Hey ... గోకాలంటే గోళ్ళు కత్తిరించుకొచ్చి గోకు GRRRRRR :P

శ్రీనివాస్ said...

అప్పుడు గోకడం ఎందుకు ?

నేను said...

@Malak anna
గోల్లు కత్తిరించుకుని గోకేపనైతే అసలు గోకుడెందుకు.

Btw, //ఉన్న కొమ్ములు పోవాలంటే మలక్పేట రౌడీ ని కెలుకుతూ పోస్టు వేస్తే సరి// అంటే కొమ్ములతో అవి అరిగేవరకు గోకమనేమో.

Malakpet Rowdy said...

Btw, //ఉన్న కొమ్ములు పోవాలంటే మలక్పేట రౌడీ ని కెలుకుతూ పోస్టు వేస్తే సరి// అంటే కొమ్ములతో అవి అరిగేవరకు గోకమనేమో.
____________________________________

VAMMOOOOOOOOOOOOOOOOOOOOOOO .. Guys, here I run!

Malakpet Rowdy said...

Sreenu, check your mail

శరత్ కాలమ్ said...

ఇక్కడెవరికో బహు దురదగా వున్నట్లుంది! నేను వచ్చి ఎవరినయినా గోకేదా?

Anonymous said...

శరత్గోకుడు మై గాడ్ !

పానీపూరి123 said...

> వెంకటేష్ , నగ్మా నటించిన కొండపల్లి రాజా చిత్రం లో ఉంది
ఆ సినిమాలో సన్నివేశం గుర్తుకురాగానే మిమ్మలని మీరు తిట్టుకున్నారా?
చీ ఆ చెత్త పాము, ఇంట్లో/హాస్టల్లో/బాత్రూంలో ఉంటే ఎంత బాగుండో అని అనుకున్నారా? :-D

శ్రీనివాస్ said...

పానీ పూరి గారు ఒక వేళ పాము మీరు చెప్పిన ప్రాంతాల్లో ఉన్నా .... నేను వెళ్ళే సరికి అక్కడ పాము నేను తప్ప ఎవ్వరూ ఉండరు .... ఆ పాటికే అందరూ పారిపోయి ఉంటారుగా ... అదీ సంగతి

Anonymous said...

hahaha

..nagarjuna.. said...

రౌడి,శరత్‌లను గోకి ఆ తరువాత బుర్ర గోకడంకన్నా కొమ్ములతోనే బెటర్...లేటేస్ట్ ఫాషన్‌ అని సరిపెట్టుకోవొచ్చు

chandu said...

చాల బాగా రాసారు