మార్తాండ మార్తాండ నీ కులుకు ఎన్నాళ్ళు అంటే .. కొత్త డి.టి.పి ఆపరేటర్ జీతం అడిగిందాకా అన్నాట్ట.
ఉట్టికి లేనమ్మ స్వర్గానికి ఎగిరిందట.
బ్లాగు కి దిక్కులేనమ్మ సంకలినికి పెడతాను అందట.
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
అజ్ఞాత బూతు బ్లాగులకి హిట్లేక్కువ
చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు
చాదస్తపు బ్లాగర్ రాయడం ఆపడు ......కెలికితే ఏడుస్తాడు
చేతులు కాలాకా ఆకులూ పట్టుకున్నట్టు
తిట్లు తిన్నాక మోడరేషన్ పెట్టుకున్నట్టు
కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడుకొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు
కొత్త బ్లాగరు పోస్టులు ఆపడు.
టెంప్లేటు మారుద్దామని చూస్తె పోస్టులు డిలీట్ అయినట్టు
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు
సెర్చ్ చేయబోయిన బ్లాగు బుక్ మార్క్ అయి ఉన్నట్టు
అసలే కోతి , ఆపై కల్లు తాగినట్టు
అసలే మార్తాండ , ఆపై నిద్రమత్తులో రాసినట్టు
ఆయనే ఉంటే మంగలెందుకు
మనదగ్గర విషయమే ఉంటే కాపీ పేస్టులు ఎందుకు
పిండి కొద్ది రొట్టె
టపా కొద్ది కామెంట్లు
నీ బోడి సంపాదనకి ఇద్దరు పెళ్లాలా
నీ కోడి బుర్రకి రెండు బ్లాగులా
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు
నాదెండ్లకి సంకలిని అప్పగించినట్టు
మరి కొన్ని సామెతలు మనోళ్ళు కామెంట్లలో చెబుతారు కాసుకోండి.
32 comments:
మార్తాండ మార్తాండ నీ కులుకు ఎన్నాళ్ళు అంటే .. కొత్త డి.టి.పి ఆపరేటర్ జీతం అడిగిందాకా అన్నాట్ట.
రాక్...సుపర్ కేక్......కెకో కేక
హ హ హ చాలా బావున్నాయి....చాలా మటుకు నిజాలే !
keka
అంగట్లో అన్నీ ఉన్నా,అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
aggrigator లో అన్నే వున్నా,సంకలనం లో సాహిత్య అవలోకనం ఉన్నట్టు
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు
ప్రనా బ్లాగులో కామెంట్ పెట్టి కెలకకురా అని అన్నట్టు
కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసులు కారు
చాలెంజ్ లు చేసేవాల్లందరూ బైరాగులు కాదు
మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
DTP ఉన్నంత వరకు డబ్బు దండుకో
మంచిమనిషికొక మాట-గొడ్డుకొక దెబ్బ
మరిది ఒక వంద-మార్తాండ కి ఒక వ్యాఖ్య
రామాయణం అంతా విని సీత రాముడికి ఏమౌతుందని అడిగినట్లు
మార్తాండ కధ అంతా చదివి వదిన కి మరిది ఏమవుతాడు అని అడిగినట్టు
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ
రాసిందే రాయరా మార్తాండ మరిదనీ
మిగతావి మీరు కుమ్మేయండి :)
చెప్పేదేమో ప్రపీసస నీతులు దూరేదేమో పైత్యావలోకనం బ్లాగులు
:-):-)
:-))
chala bagunnayi anDi...
హా హా ...చాలా ఫన్నీగా ఉన్నాయి :-))
భలే ఐడియా వచ్చిందే. తమాషాగా వున్నాయి. నవ్వించినందుకు థాంక్స్.
భలే ఐడియా వచ్చిందే. తమాషాగా వున్నాయి. నవ్వించినందుకు థాంక్స్.
ha ha ha :) super
తా మూలిగింది గంగ తా వలచింది రంభ
తా రాసింది వంట తానూ మెచ్చిందే పాట
యి తా కి దీర్గామిస్తే తీ ఆ తీ అక్క వోకరేనా అజ్ఞత మాస్టారు ?
అమ్మో, టెంప్లేట్ మారుద్దామనుకున్నా, ఇంకా నయం మార్చాను కాదు.!
ఇన్ని సామెతలే? మీ అందరికీ ఒరిస్సా బార్డర్లో ఏజెన్సీలో వచ్చే జొరాలొచ్చేస్తాయి జాగర్త!
chalabagunnayarraa pillalu...carry on...
by the way uttiki egaralenamma swarganikegirinattu.....annadi sameta..
Excellent Saametalu. Very imaginative.
Check out the Telugu Blog World report in English.
ఏమంత బాగలేవు, చీర్ లీడర్స్ మెచ్చే లెవెల్లో వున్నాయి.
keep trying.
:)
మా అమ్మగారు వరంగల్లులో బ్యాంకు ఉద్యోగం చేసినప్పుడు అక్కడి వాళ్ళు సామెతలలో చాలా బూతులు వాడడం విన్నాను. కోస్తా వాళ్ళ సామెతలలో బూతులు ఉంటాయి ఒరిస్సాలో మరిది మాత్రమే అలాంటి సామెతలు చెప్పగలరు. విజయనగరం బాగా వెనకబడి పోతుంది నేను అక్కడ పర్యటించాలని అనుకున్నాను కానీ నేను రేపు యాదగిరి గుట్ట పర్యటనకు వెళుతున్నాను నా స్వంత ఖర్చులపై వెళతాను మా అమ్మ గారు ఉద్యోగం చేస్తారు గనక నా వద్ద డబ్బులు ఉన్నాయి.
మా నానమ్మ రిక్షావాడిని బూతులు తిట్టింది నేను ఆమెని బాగా తిట్టాను.
:)
:) :)
ఏగాణి ముండకి డబ్బున్నర క్షవరం అని పాత సామెత
రాసే ఒక్క బోడి పోస్టుకే రెండు అజ్ఞాత తింగరి కామెంట్లు అందామా?
అడ్డాల నాడు బిడ్డలు కానీ,గడ్డాల నాడు కాదు
పోస్టు రాసినంతవరకే మనచేతిలో కాని కామెంట్లు మన చేతిలో ఉండవన్నట్లు.
అంగట్లో అన్నీ ఉన్నా,అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
పోస్టులో సరుకున్నా కామెంట్లు సున్నా అన్నట్లు.
అమ్మ కడుపు తడుముతుంది,పెళ్ళం జేబు తడుముతుంది.
బ్లాగ్ ఫాలోయర్ పోస్ట్ కెవ్వ్ అంటాడు,అజ్ఞాత భౌ అంటాడు.
అన్ని చోట్లా బావే కానీ..వంగ తోట కాడ మాత్రం కాదు.
శరత్ కి పోస్ట్లన్నిట్లోనూ మార్తాండ బావే కానీ కామెంట్లప్పుడు మాత్రం కాదట
అబ్బా ఇంక రాయలేను కానీ ఇక్కడ సామెతలిస్తా దానికి పేరడీలు రాయమను బాబూ.
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు.
అనుమానం పెనుభూతం.
అప్పిచ్చువాడు వైద్యుడు.
అర్ధరాత్రి మద్దెలదరువు.
అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడట ఒకడు.
అసలు కంటే వడ్డీ ముద్దు
అసలుకే ఎసరు పెట్టినటు.
అసమర్థుడికి అవకాశమివ్వనేల?
అతి రహస్యం బట్ట బయలు.
అత్త లేని కోడలుత్తమురాలు,కోడలు లేని అత్త గుణవంతురాలు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
అత్త సొమ్ము అల్లుడు దానం.
అయిన వారికి అరిటాకుల్లో...కాని వారికి కంచాల్లో.
అయితే ఆదివారం,కాకుంటే సోమవారం.
అయ్యవారు వచ్చే వరకూ అమావాస్య ఆగుతుందా?
అయ్యకి లేక అడుక్కుని తింటుంటే,కొడుకొచ్చి కోడి పలావు అడిగాట్ట.
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యినట్లు.
సరదాకి వ్రాసినా జ్యోతి గారి మీద వ్రాసిన కమెంట్ మీరు తీసివేయవలసింది. ఇతరుల మీద అటువంటి వ్యాఖ్యలు వచ్చినపుడు మీరు అలా ప్రచురించడం, నేరం చేసిన వారిని ప్రోత్సహించడం లాంటిది. మీ వంటి వారు కూడా ఇలా చేయడం నాకు నచ్చలేదు.
@ నీహారిక గారు నన్ను గిల్లి గొడవ వేసుకోవాలి అనుకుంటే డైరక్ట్ గా రండి డొంక తిరుగుడు వద్దు :))
కామెంట్ తీసేస్తున్నా :))
ఈ బ్లాగులు రాసుకోవడం ,చదవడం రెండు కూడా ఏదో సామెత చెప్పినట్టున్నై .
పైసా ఆదాయం లేదు క్షణం తీరిక లేదు.అని నా దృష్టిలో బ్లాగ్స్ రాయడం అనేది వేస్ట్ఆఫ్ టైం .కాదంటారా?
మా బాగా చెప్పారు .
ఒంగోలు సీన్ పై గత నెల బ్లాగు వీక్షణం, ఈ నెల ప్రమదావనం బ్యాచ్ దాడికి దిగినట్టు కనిపిస్తుంది.
అజ్ఞాతలు తగ్గాలి మరి ..ఇక్కడ అంత గొడవ ఏమీ లేదు. బ్లాగు వీక్షణానికి వనానికి ముడి పెడితే నేనేదో అవేశాపడిపోతాను అనుకోవడం ఔట్ డేటెడ్ ఆలోచన అనమాట.
Good ones... but not great!! Keep them coming :)
Post a Comment