అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/23/10

ఆచారి ఏమంటివి ఏమంటివి

మా ఇంటికి గానీ మా ఫ్రెండ్స్ ఇళ్ళకి , ఆఫీసులకి గాని ఏదైనా చెక్క పని చేయాలంటే మా ఆస్థాన కార్పెంటర్ ఆచారి గారినే సంప్రదిస్తాం. అయితే ఆచారి లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం చెప్పింది తను చెయ్యడు . తనకి నచ్చినట్టు చెయ్యాలని చూస్తాడు. అందుకే దగ్గరుండి చేయించుకోవాలి. అదీ గాక మనం ఒకటంటే తను ఇంకోటి అంటాడు. వయసులో పెద్దవాడు అయినా చాలా కాలం నుండి పరిచయం ఉండడంతో కాస్త ఫ్రెండ్ షిప్ డెవలప్ అయింది మా మద్య. ఆ మద్య ఒంగోల్లో మా మిత్రుడు తన ఇంట్లో ఏసి బిగిస్తూ విండో అడ్జస్ట్ చేయాల్సిందిగా ఆచారిని పిలిస్తే షరామామూలుగా మనం చెప్పింది కాక అతనికి నచ్చినట్టు చెయ్యాలని చూస్తాడు .... టేకు చెక్క తప్పితే పనికి రాదంటాడు ... చూసీ చూసి తిక్కరేగిన నేను ఆచారీ ...... ఏమంటివి ఏమంటివి ..... టేకు చెక్క తప్పితే మారు జాతి చెక్క పనికి రాదందువా ఎంతమాట ఎంత మాట. కిందటి నెల సెల్ రేంజి షాపులో టేబుల్ చేయుటకు నువ్వు వాడినది ఏ చెక్క , అంతకు ముందు నా కంప్యుటర్ టేబుల్ కి వాడినది యే చెక్క ........ వేప చెక్కతో మా వాళ్ళ గడపలు చేయలేదా ..... మద్ది చెక్కతో కిటికీలు చేయలేదా .... న్యూ ఉడ్ తో షో కేసులు చేయలేదా .... టేకు టేకు అని చేబుతూనేమా వాళ్ళ ఇళ్ళన్నీ రకరకాల చెక్కలతో నింపి కంపు చేసినావు ... మళ్లా ఈరోజు చిన్న చెక్క ముక్క కొట్టడానికి టేకు టేకు అని ఎందుకు నీలుగుతున్నావ్ అనగానే ... ఆచారి నోరు తెర్సుకుని చూస్తున్నాడు ... మా ఫ్రెండ్ వాడి భార్య నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకోలేక తంటాలు పడుతున్నారు.

10 comments:

గీతిక said...

ha ha ha.....

Software Tykoon said...

:)

Anonymous said...

nice joke

Sravya V said...

బాగున్నాయ్ డైలాగులు ! ఎన్నిసార్లు చూసారు D V S కర్ణ :)

శ్రీనివాస్ said...

thanks గీతిక గారు, గోవిందయ్య , అజ్ఞాత

శ్రీనివాస్ said...

శ్రావ్య గారు నేను పెద్ద ఎన్టీఆర్ కి మెగా ఫాన్ లెండి

మనోహర్ చెనికల said...

హ హ హ!

మధురవాణి said...

హ్హ హ్హ హ్హా... నాకా ఆచారి గారి మొహం కనిపిస్తోంది.. పాపం! ;-):-D

Anonymous said...

lol

చందు said...

"chakka chekka " ani tadipivuntadu pakka raatramtaa ...pch ..papam aachari !!!