దయ్యాల వేటలో ఆలా కొన్ని అనుకోనిదెబ్బలు తిన్నప్పటికీనిన్నీ ఒకపరి ఆ భూతమును వీక్షించవలెనన్న కోరిక అలాగే ఉండిపోయింది. కొన్నాళ్ళకి నా మిత్రుడు..... నాకంటే రెండేళ్ళ పెద్ద వాడు అయిన గురు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మోసుకొచ్చాడు. ఇక్కడ మా గురించి ఒక నాలుగు లైన్లు చెప్పుకోవాలి. చాలా చిన్నప్పటి నుండే ....అంటే నాకు ఐదు , గురు ఏడేళ్ళు వయసు నాటికే మాకు ఆరిందా చేష్టలు బాగా వచ్చేశాయి. నానా అల్లరి చేసే వాళ్ళం అప్పుడు మేము సంతపేట లో ఉండేవాళ్ళం మా ప్రాంతానికి మూడు కిలోమీటర్లు దూరాన ఉండే లాయర్ పేట లో సాయిబాబా గుడి ఉండేది. ఆ గుడికి వెళ్దామని ప్లాన్ చేశాం ఇంట్లో చెప్పకుండా .. చెబితే పంపరు ఎందుకంటే అ అడ్వెంచర్ టైం కి నా వయసు ఏడేళ్ళు వాడికి తొమ్మిదేళ్ళు. సాయంత్రం స్కూల్ నుండి వచ్చి స్నానం చేసి ఐదు గంటలకి బయలుదేరాం దారిలో సినిమా పోస్టర్లు చూసుకుంటూ ..... ఒకసారి వాళ్ళ నాన్నతో వచ్చి ఉండడం చేత గురుకి దారి తెల్సు. వాడి చొక్క పట్టుకుని నేను ఆలా వెళ్ళిపోయాం. గుడిలో భజన జరుగుతుంది భజన అయిపోయేదాకా ఉండి.... రాత్రి హారతి ఇచ్చే దాకా అక్కడే ఉండి ప్రసాదాలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చాం. టైము పదయింది. అప్పుడు (1987 ) ఒకటి అరా సైకిల్ లేదా స్కూటర్ వాళ్ళు తప్పరోడ్డు మీద మనుషులు లేరు. యధాప్రకారం రాళ్ళు తన్నుకుంటూ .... చిరంజీవి సినిమా పోస్టర్ ఉన్న దగ్గర ఆగి చూసుకుంటూ ఇళ్ళు చేరేటప్పటికి అక్కడ ఊరు వాడా అంత మా ఇంటి ముందు గుమి గూడి ఉన్నారు . టూ టౌన్ పోలీసులు కూడా సిద్ధం. అమాయకంగా అడుగులు వేసుకుంటూ వస్తున్న నన్ను పక్కకి లాగి గురు గాడికి ఇచ్చాడు వాళ్ళ నాన్న పెద్ద కోటింగ్ . నన్ను ఎవరూ ఏమీ అనలేదు మరి! పసి బిడ్డని ఆలా తీసుకెళ్ళడం ఏంట్రా అని వాడిని కొడుతుంటే నేను పసిబిడ్డని కాబోలు అనుకున్నా ( అంటే అప్పటికే స్కూల్ లో స్వప్నని పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం అని నేను ప్లాన్స్ వేస్తున్న సంగతి ఇంట్లో తెలీదు కదా ) .
ఆలా చిన్నప్పటి నుండి నేను గురు చేసిన అడ్వెంచర్లు చాలానే ఉన్నాయి. కానీ తాజాగా గురు గాడు తీసుకొచ్చిన విషయం ఏంటంటే కందుకూరు ప్రాంతం లో దామా శైలజ అనే ఒక విద్యార్ధిని ని కొందరు రేప్ చేసి చంపేశారు కందుకూరు సింగరాయకొండ అనే ఊర్ల మద్యలో. ఆ అమ్మాయి ని చంపేసిన చోట ఎవరో మూలుగుతూ ఏడుస్తూ ఉన్న శబ్దాలు వినిపిస్తున్నాయని నిన్న సాయంత్రం అటు నడిచివెళ్ళే వాళ్ళు చాలా స్ప్రష్టంగా విన్నారని చెప్పాడు. షాడో లాగా సాలోచనగా తల పంకిస్తూ వాడి వైపు చూశా .... వెళ్దామా అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు . ఇంకా ఆలస్యం ఏంట్రా పద అని .. నా బైక్ తీసా ... అప్పట్లో నాకు BSA- Bond బైక్ ఉండేది . ఇప్పుడు అవి దొరకడం లేదు. 40 కిలోమీటర్లు అరగంట లో చేరుకున్నాం. ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళాం ఎం వినిపించడం లేదు. చాల సేపటి తర్వాత ఎరా ఇక్కడ ఎం లేదేంటి అన్నానో లేదో సన్నగా మూలుగు స్టార్ట్ అయింది. వెంటనే ఏడుపు లాగా వినిపించడం మొదలైంది. మా ఖర్మ కాలి అమావాస్యకీ అటు ఇటుగా వెళ్ళామేమో అసలేం కనపడి చావడం లేదు. టైం పన్నెండు అవుతుంది. మేము మౌనంగా గా ఉంటే ఎం లేదుగాని మేము ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తే మూలుగు వస్తుంది. మూలుగు ను బట్టి రోడ్ కి ఎడమ వైపు వస్తుంది అని కనిపెట్టాం. అక్కడ కాలువ ఉంది మూలుగు వచ్చేదగ్గర తూము లాగా ఉంది ఒక 20 అడుగులు తూము ఉంది తూము పైన మట్టి రోడ్డు ఉంది . బండి స్టార్ట్ చేసి చూశాం . ఎం కనిపించడం లేదు . ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు అసలు భయం వెయ్యకపోవడం , సినిమాల్లో చూపిచ్చినట్టు అడుగులో అడుగు వేస్కుంటూ నడవడం ఇలాంటివెం లేవు చాలా కాజువల్ గా ఉన్నాం. అ తూము దగ్గరగా వెళ్లి తొంగిచూస్తున్నాం.
ఇదేదో తేల్చుకునే వెళ్ళాలి అనిపించింది . తెల్లరిందాకా అక్కడే గడిపాం కబుర్లు చెప్పుకుంటూ .. తెల్లారింది.... వేకువ వెలుగులు రాగానే గురు వైపు చూస్తా బండికి అనుకుని కూర్చుని నిద్రపోతున్నాడు. నేనే లేచి వెళ్లి ఆ తూము దగ్గర వంగి చూశా పడి అడుగుల దూరం లో రెండు కాళ్ళు కనిపించాయి ... లైఫ్ లో ఫస్ట్ టైం నాకు గుండె జల్లుమంది. వెంటనే గురు ని పిలిచా .. వాడు వచ్చాడు ... అటువైపు పనులకు వెళుతున్న వాళ్ళు కూడా వచ్చారు. కాళ్ళు కనపడుతున్నాయి అని నేను చెప్పగానే సగం మంది జంప్ . నలుగురు మాత్రం ధైర్యంగా తొంగి చూసి అవి కాళ్లే అని కన్ఫర్మ్ చేశారు . తూముకి రెండో వైపు వెళ్లి చూస్తె మొహం అస్ప్రష్టంగా కనిపిస్తుంది . మూలుగులు ఎక్కువ అయ్యాయి.
ఒక పది నిముషాలు చర్చల అనంతరం ... బయటికి లాగాలని డిసైడ్ అయ్యాం , ఉచ్చు రెడీ అయింది పదే పది నిమిషాలు ఆ శాల్తీ కాలికి ఉచ్చు పడడం , లాగడం కూడా అయిపోయింది. తీరా చూస్తే అరవైఏళ్ళ ముసలోడు .... అక్కడికి దగ్గరగా ఉండే సంచార జాతులకి చెందిన వాడు ... వణుకుతూ లేచి కూర్చున్నాడు రెండు చేతులతో తాబేలు పిల్లని బద్రంగా పట్టుకుని ఉన్నాడు. కాస్త ఉపశామించాక అతను చెప్పిన విషయం ఏంట్రా అంటే ..... మొన్న సాయంత్రం ఆ తూములోకి తాబేలు పిల్ల వెళ్లడం చూశాడు ... పట్టుకుందాం అంటే దొరకలేదు .. కొద్ది కొద్దిగా వెళ్లి లోపల ఇరుక్కుపోయాడు . ఎవరో ఒకరు వచ్చి తీస్తారు అనే ఆశాభావంతో ఉన్నాడు ... అందుకే తాబేలు పిల్లని వదల్లేదు. అదీ సంగతి.
10 comments:
సరిపోయింది. మొతానికి రెండో భాగంలో కూడా పాఠకులకూ,మీకూ నిరాశ కలిగిందన్నమాట. వచ్చే భాగాల్లో మీ కోరిక తీరాలని కోరుకుంటున్నా.
దెయ్యాలెలా ఉంటాయో చూడాలి అంతేగా మీ కోరిక! ఎవరిదైనా voter ID card చూడొచ్చుగా!వాటిలో ఫొటోలన్నీ అలాగే ఉంటాయి.
శ్రీనివాస్!
మంచి కథనం! చదువుతుంటే టాం సాయర్ గుర్తొచ్చాడు.
@సుజాత,
:-) మీ కామెంట్ చదివి గట్టిగా నవ్వేసాను.
శ్రీనన్న ఓ లుక్కేసుకో... నా గర్ల్ ప్రెండ్ సాయంతో బ్లాగ్ క్రియేట్ చేసుకున్నా...భౌ...భౌ..
నా ఫ్యాన్ ఇక నుండి ఈ ఐడెంటిటీతో... కామెంటుతుంది...(to prevent fake identity)
మనోహర్ గారు ఇంతవరకు కోరిక తీరనే లేదండి
@ సుజాత గారు ఓటర్ ఐడి కార్డ్ గురించి సంవత్సరం క్రితం మీరు వేసిన టపా సూపరండి
@ కృష్ణప్రియ గారు మీ డైరీ కన్నానా
రాయుడూ :P ఓరి ఇడియట్ ఎంత పని చేశావురా...
రాయుడు ఫాన్ గారు గుడ్ ఐడియా.
సూపర్,భలే రాసారు
waiting for next part
ha ha ha !
Post a Comment