అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/31/10

రాయుడు గారి కధ


అది 2009 ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే . మా ఫ్రెండు ఫోన్ చేశాడు "మావా.... పింకీ కి ఐదు పిల్లలు పుట్టాయి చూద్దువ్ గానీ రా" అని. " సరే వస్తా " అని చెప్పా. నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి . నా చిన్న తనం లో మా అక్క జానీ అనే ఒక కుక్కని పెంచేది. ఐదు సంవత్సరాలు మాతో ఉన్నాక ఒక రోజు ఒక స్కూటరిస్ట్ చాలా స్పీడ్ గా వస్తూ అదుపుతప్పి దాన్ని గుద్దేశాడు ... తీవ్రంగా గాయపడిన జానీ చనిపోయింది. అప్పుడు మా అక్క పడిన బాధ చూసిన మేము అప్పటి నుండి కుక్కలు పెంచడం విషయం లో కాస్త వెనకడుగు వేస్తున్నాం. ఎందరివొ లాబ్రోడార్స్, జర్మన్ షేప్పర్డ్స్, గ్రే హౌండ్స్ పెంచుకోవడానికి ఇవ్వచూపినా ధైర్యం చేయలేకపోయాం. కానీ ఆ రోజు పింకి దగ్గర కళ్ళు మూసుకుని పాకుతున్న ఐదు బుజ్జి బుజ్జి కూనలని చూసి ఎంత ముచ్చటేసిందో! పింకి క్రాస్ బ్రీడ్ పమేరియన్ .... క్రాస్ చేసిన కుక్క క్రాస్ బ్రీడ్ జర్మన్ షెపర్డ్.

నాలుగు ఆడకుక్క పిల్లల మద్య వెరైటీ బ్రౌన్ షేడ్ లో కన్నింగ్ ఫేస్ వేసుకుని కూర్చున్న ఒక బుజ్జిగాడి దగ్గర లుక్ స్టే అయింది. రోజు వెళ్లి ఆ బుజ్జి కుక్కపిల్లల్తో ఆడుకోవడం అలవాటు అయింది. ముఖ్యంగా ఆ కన్నింగ్ ఫేస్ ఏకైక కుక్క మగధీరుడు తో చాలా టైం స్పెండ్ చేసే వాడిని. ఆలా 20 రోజులు గడిచాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలా ఒకదాన్ని తీసుకుపోతాం అని చెప్పడం మొదలెట్టారు . ఈ దొంగ రాస్కెల్ ని కూడా ఎవరన్న తీసుకుపోతారేమో అనిపించింది. ఏమో వాడిని వదిలి ఉండలేనేమో అనిపించింది ..... వీడిని నేను తీసుకుపోతానురా అని చెప్పాను మా వాడితో. అమ్మో మా బాబాయి వాళ్ళు కావాలి అంటున్నారు రా మరి ఇప్పుడెలా ?? అని నీళ్ళు నమలసాగాడు . ఒక సారి పింకి వంక చూశాను . చూడు పింకి నీ దగ్గర నుండి బిడ్డని 20 రోజులకే దూరం చేస్తున్నందుకు క్షమించు ... నీకన్నా రెండు గ్లాసులు పాలు ఎక్కువే తాగిస్తా అని చెప్పి .... ఆ బుజ్జి గాడిని ఎత్తుకుని జంప్. వెనకనుండి మా వాడు అరుస్తున్నాడు . కానీ నాకేమీ వినిపించలేదు.

ఇంటికి తీసుకెళ్ళాక మా అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందా అనుకున్నాను కానీ ఈ రాస్కెల్ అందరి మనసులు దోచేశాడు. ముఖ్యంగా మా గడప 8 అంగుళాలు ఉంటుంది. మా గడప ని అతి కష్టంగా దిగి కింద మెట్లు సైతం డింగ్ చిక్ డింగ్ చిక్ అంటూ దిగి దూరంగా పోయి పాస్ పోసుకుని మళ్లా ఆపసోపాలు పడి ఇంట్లోకి వచ్చే వాడి చేష్టాలకి అందరూ దాసోహం అయిపోయారు. మా ఇంట్లో సందడి వాతావరణమే రోజూ . కాకపోతే వాళ్ళ అమ్మ దగ్గర నుండి తీసుకు వచ్చాను అనే కోపంతో అనుకుంటా మనోడు నాతో సరిగ్గా ఉండేవాడు కాదు . నేను ఇటు ఉంటే తల అటు తిప్పే వాడు . చివరికి ఎలాగో మచ్చిక చేసుకున్నా నా తిప్పలు నేను పడి.

అప్పుడే మనోడికి ఏదైనా మంచి పేరు పెడదామనే ఆలోచన వచ్చింది . సరిగా అప్పుడే టీవీ లో పెదరాయుడు సినిమా వస్తుంది. మనకి ఎలాగు వెరైటీ పేర్లు పెట్టే సరదా ఉండనే ఉంది. అందుకే రాయుడు అని ఫిక్స్ చేశా . మా పిన్నమ్మ కొడుకు వెంకట్రాయుడు నుండి రుసరుసలు వస్తాయని అప్పుడు అనుకోలేదు. వెంకట్రాయుడు నాకు చేసిన ద్రోహం ఇక్కడ చూడండి.

రాయుడు మా జీవితం లో అతి ముఖ్యమైన శాల్తీ అవుతున్న రోజులు అవి. వాడికి ఆల్బుమార్ వెయ్యడం ఒక పెద్ద ప్రసహనం . అల్బూమార్ అంటే చిన్ని బిడ్డలకి woodwards gripe water వంటిది అన్నమాట. మామూలుగా నోట్లో సిరంజి పెట్టి వేస్తారు కుక్కలకి . అన్ని కుక్కల్ల వేయించుకుంటే వీడు రాయుడు ఎందుకు అవుతాడు. వాడికి ఆల్బూమార్ వెయ్యడానికి నేను కాళ్ళు చాపుకుని కూర్చుని నా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆటలు ఆడించి మాయ చేసి నోరు తెరిపించి నోట్లో లటుక్కున వేయాల్సి వచ్చేది. 50 రోజుల బిడ్డ అయ్యాక ఇంజక్షన్స్ వేయించా. అదే నేను చేసిన పెద్ద నేరం . ఇంజక్షన్ వేయించిన ప్రతిసారి రాయుడు నాతో పలకడు. చాల సీరియస్ గా ఉండేవాడు . మళ్లా రెండు రోజులకు మామూలే అనుకోండి.

రెండు నెలలు గడిచాయి ఈ సారి పక్కిళ్ళ నుండి కంప్లైంట్స్ రావడం మొదలైంది. పక్కింటి ఆంటీ టీవీ చూస్తూ పొరబాటున ఆమె కళ్ళద్దాలు తీసి కింద పెట్టిందా .... ఇక అటు చూసి ఇటు చూసే సరికి అవి తీసుకుని వచ్చి మా ఇంట్లో డ్రస్సింగ్ టేబుల్ మీదా మా అమ్మ కళ్ళద్దాల పక్కన పెట్టేది. జండూ బాం సీసాలు , దువ్వెనలు ఇలా ఏది దొరికితే అది తీసుకు రావడం మా ఇంట్లో ఒక మూల పెట్టడం. ఈ అలవాటు మాన్పించడానికి నేను కొత్త ఎత్తులు వేసి అవన్నీ వాడికి ఇచ్చి నేను దగ్గర ఉంది మళ్లా వాళ్ళ ఇంట్లో పెట్టించే వాడిని . చివరికి అలవాటు మాన్పించాను అనుకునే లోపు .. మా ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు :((((.

మా ఇంటికి పాలు పోసే సుబ్బయ్య గారు పాలు పోసి ఖాళీ గిన్నె దాపెట్టుకుని తీసుకెళ్ళాల్సి వచ్చేది . గిన్నె తో సహా ఇచ్చి వెళ్ళాలి లేకపోతె వెంట పడేది. ఆయన వెనక దాపెట్టుకుంటే ఆయన వెనక్కి వెనక్కి తిరిగి మరీ చూసేది. ఎన్నో కుక్కల్ని చూశాను గానే ఇలాంటి ఖిలాడీ ని నేనెక్కడా చూడలేదండీ అనేవాడు ఆయన.

అలా మాకుటుంబం లో ఒక భాగం అయిపోయాడు రాయుడు. రాయుడి గారికి బ్లాగులో ఒక అజ్ఞాత అభిమాని ఉన్నారు. వారి కోరిక మేరకు వారి కోసమే ఈ టపా.

14 comments:

chaitanya said...

నాకు కుక్కలంటే భయం... కలల్లో కూడా వస్తాయి...!
అవి పెంచుకోవాలంటే కూడా ఎందుకో ఇష్టం ఉండదు.

మీ రాయుడు ఫోటో బాగుంది!

Vinay Chakravarthi.Gogineni said...

srinivas post bagundi.......

సుజాత వేల్పూరి said...

ఏమిటి, అప్పుడే అయిపోయిందా వాడి స్టోరీ? ఒక ఎపిసోడ్ తోనే?

Anonymous said...

bagundi kadha . em cheseru intlo vastuvulu bayata pette alavatu manipichadaniki. Mee rayudu photo matram kekaaaa

శ్రీనివాస్ said...

@ చైతు కుక్కలంటే భయం పోగొట్టడానికి మా రాయుడుని కొన్నాళ్ళు మీ ఇంటికి పంపిస్తాను.

@ వినయ్ , మధురవాణి గారు .. థాంక్స్

@ సుజాత గారు ఇప్పటి దాకా చెప్పింది రాయుడు బాల్యం .. నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది అదీ త్వరలోనే

@Anonymous ఇంట్లో వస్తువులు బయట పడేయకుండా ఉండడానికి గాను ఒక పెద్ద స్కెచ్ గీసి అమలుపరిచా .. అది తదుపరి టపాలో చెబుతా

హరే కృష్ణ said...

చాలా బావుంది
మమ్మల్ని అందర్నీ రాయుడి ఫాన్స్ ని చేసేసారు
చాలా బాగా రాసారు

Anonymous said...

ఏంటి రాయుడు గారా?? నాకు మాత్రం వాడు ఇడియట్ రాయుడు గాడు... వాడి పేరు మాత్రం నిజ్జంగా కేక.. అచ్చమైన తెలుగు పేరు సూపర్. మీరేంటి పినాసిలా మరీ ఒక్క ఫొటొ పెట్టారు?? చాలా సంతోషం నా కోసం టపా రాసినందుకు.. నేను అమ్మాయిని లెండి హి హి హి మా రాయుడు డార్లింగ్ కి I luv u చెప్పానని చెప్పండి... వాడి ఇది వరకు ఫొటోలన్ని సేవ్ చేసుకున్నా... వాడు నా డెస్క్ టాప్ వాల్ పేపర్.. (చైర్ లో కూర్చొని ఇలా బుంగమూతి వేసుకుని ఉంటాడు కదా అది)

శ్రీనివాస్ said...

@ హరే కృష్ణ గారు మా ఊర్లో రాయుడికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు.

@ రాయుడు అభిమాని గారు .. ఈ టపా రాసింది మీకోసమే . మీ ఇడియట్ కి మీ తరపున ఆ మూడు ముక్కలేవో చెప్పేస్తాలెండి.

ప్రేరణ... said...

రాయుడు.....సో క్యూట్:)

రాయుడు అభిమాని said...

ohh naku machi pere pettaru రాయుడు అభిమాని ani... enka ma idiot migilina muchatlu kuda raseyyandi.. twaraga... velite vadi panulu konni videos kuda teyyandi sweet memories kada baguntai.. saibaba ki epudina vaadu dannam pettukuntada?? leda prasadam tinatam varakena??

రాయుడు అభిమాని said...

ohh naku machi pere pettaru రాయుడు అభిమాని ani... enka ma idiot migilina muchatlu kuda raseyyandi.. twaraga... velite vadi panulu konni videos kuda teyyandi sweet memories kada baguntai.. saibaba ki epudina vaadu dannam pettukuntada?? leda prasadam tinatam varakena??

శేఖర్ పెద్దగోపు said...

బుజ్జి గాడు భలే ముద్దొస్తున్నాడు...అన్నట్టు ఈ పెంకి రాయుడు గాడికి నేను కూడా పేద్ద ఫ్యాన్ అండి..వాడి ఫోటోలు మరిన్ని పెట్టుంటే నాలాంటి వీరాభిమానులు తనివితీరా వాడిని చూసుకుంటారు కదండీ...

నేస్తం said...

నేను మీ పోస్ట్లు చదువుతున్నపుడల్లా మావారు ఏది ఆ కుక్క పిల్లను చూపించు భలే ఉంది కదా అని అడుగుతునే ఉంటారు :) రాయుడూ బాగున్నాడు ..వాది పేరూ బాగుంది

sudharani said...

రాయుడిగారి కథ ఈ రోజే చూసాను.
రాయుడి లాంటి రౌడీ రాయుడు మరోడి కథ ఇక్కడ రాసాను. చూడండి.
మీ పోస్టులన్నీ చదువుతున్నాను. చాలా బాగున్నాయి.
http://illalimuchatlu.blogspot.com/2010/06/blog-post_27.html
(ఇంతకుముందు కామెంట్స్ లో ఉన్న సుధ నేనుకాదు.)