ఎప్పుడో 494 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన శ్రీకాళహస్తీస్వర దేవాలయ రాజ గోపురం కూలిపోయింది మన పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా దాదాపు ఐదు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ కట్టడాన్ని సంరక్షించుకోలేకపోవడం నిజంగా పురావస్తుశాఖ, దేవాదాయశాఖ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. వారికి సిగ్గు అనేది ఎలాగు లేదు కనుక మనం విషయం లోకి వద్దాం. ఈ రాజగోపురం కూలిపోవడానికి మనకి ప్రధానంగా కనిపించే కారణం లైలా తుఫాన్ అయినా అసలు అది బలహీనపడడానికి దోహదపడిన అంశాలు ఒక సారి చూద్దాం.
ఆలయ పరిసరాల్లో లెక్కకి మించి బోర్లు వేయడానికి పర్మిషన్ ఇవ్వడం ఒక కారణం. ఆలయ పరిసరాల్లో ఇష్టానుసారం బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చినప్పుడు స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురైనా అధికారులు బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చేసారు. మరో ప్రధాన కారణం అక్కడ భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడం. అత్యంత పురాతన మట్టి కట్టడం ఉన్న చోట ఆ రాజగోపురానికి అత్యంత సమీపం లో భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టడానికి పూనుకోవడం , లెక్కకి మించి బోర్లు వేయడం వల్ల పునాదులు దెబ్బతిన్నాయి అనేది మెజారిటీ అభిప్రాయం.
కొద్ది రోజుల క్రితం లైలా తుఫాన్ ధాటికి గోపురం లో పగుళ్ళు ఏర్పడి మట్టి పెళ్లలు రాలిన సందర్భం లో చెన్నై పురావస్తు శాఖ వారు ఆ గోపురానికి 150 మీటర్లు రెడ్ జోన్ గా ప్రకటించి అది కూలిపోవడం ఖాయం అని చెప్పినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. గత రాత్రి కూలిపోవడానికి ముందు కాస్త పక్కకి వోరిగిన రాజగోపురాన్ని చూసి స్తానిక వ్యాపారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన కాసేపటికే ఒక్కసారిగా గోపురం కుప్ప కూలింది .
ఈ రాజ గోపురం కూలిపోవడం రాష్ట్ర భవిష్యత్ కి సంకేతం అని కొందరు జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు .... నాస్తికులు వారిని అవహేళన చేస్తున్నారు .. కానీ మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సూటిగా సుత్తి లేకుండా మనం ఒక అంశాన్ని గమనించే ప్రయత్నం చేస్తే ........... అతి పెద్ద హిందూ దేశం లో అత్యదికుల ఆరాధ్య దైవం అయిన ఈశ్వరుని రాజగోపురం కూలిపోవడం వెనక కూడా నిర్లక్ష్యం , అవినీతి ఆలసత్వం నిండి ఉన్నాయి అంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి . 15 రోజుల కింద హెచ్చరించినా గోపురాన్ని గాలికి వదిలేశారు అంటే రేపు జనానికి ఏదైనా అయితే ఎవడు పట్టించుకుంటాడు. దేవుడినే లెక్క చేయని ప్రభుత్వం , అధికారులు జనాన్ని చీమల్లా పురుగుల్లా హీనంగా చూడరు అని గ్యారంటీ ఉందా?
ముందు ముందు జరగబోయేవి అనీ సినిమా సీన్లే... టాగూర్ సినిమాలో ఒక ప్రాంతం అంతా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉన్నా తన స్వార్ధం కోసం పనులు ఆపని కాంట్రాక్టర్ నిర్వాకానికి జరిగిన నష్టం ఏంటో ఇక్కడ ఉన్న చాలా మంది చూసే ఉంటారు. అలాంటి ఎన్నో ఘటనలు ఇక ఇష్టానుసారం జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వ ప్రభుద్దుల నిర్వాకాలకి దేవుడికే రక్షణ లేదు. ఇక మన రక్షణ భారం ఎవరి మీద వేద్దాం . అనర్ధం ఏదన్న ఉంటే ఆ యాంగిల్ లో ఉంటుంది అని అర్ధం చేసుకోవాలి.
చివరి మాట : జ్యోతిష్కులు , పండితులు ఒక విషయానికి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు .. దేవుడికి అపచారం జరిగితే ప్రళయం వస్తుంది అని చెప్పడం వల్ల దేవుని ఆగ్రహం వల్ల అవన్నీ సంబవిస్తాయి అనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు . మనం ఎన్ని తప్పులు చేసినా .... మనలో మార్పు తీసుకువచ్చి అక్కున చేర్చుకునే కరుణామయుడు దేవుడు ... ఆ ప్రేమమూర్తి ఎన్నడు ఆగ్రహించడు కానీ ........... ఈ కలియుగానికి అధిపతి అయిన కలి పురుషుడు చూస్తూ ఊరుకోడు .. దైవ దూషణ చేసిన వారిని, ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుకునే వారిని , తాగుబోతులను , అమాయకులను మోసగించే వారిని తానేం చేసినా దేవుడు వారిని కాపాడడానికి రాకూడదు ... ఇదే కలియుగ ధర్మం. నాస్తికులు అయినా దేవుని మీద నమ్మకం లేని వారు అయినా సాటి మనిషికి సాయం చేసే వారిని కలి తాకనైనా తాకలేడు. అందువలన ఇప్పుడు కలి ఏ రకంగా తన దాడి కొనసాగిస్తాడో ? వేచి చూద్దాం.
10 comments:
ప్రకృతికి మనము ఎదురుతిరిగితే సంభవించే పరిస్తుతులకి ఒక సూచన ఇది. మీరు క్రిందటి పోస్ట్ లో ఉదాహరించిన వాగు పొంగటం -- చెరువు స్థలం కబ్జా తో పూడ్చివేత -- తరువాత కట్టిన కాంప్లెక్స్ మునిగి పోవటం ఇవన్నీ ప్రకృతి తిప్పి కొడటానికి సూచనలు. చెడు జరగ పోతోంది అని సూచనలు కనపడినప్పుడు చెప్పటం మన విధి.ఈ సూచనలు పాటించి మనము మన నడవడికను మార్చు కోవచ్చు లేక దివాలా తీసే దాకా చూస్తూ కూర్చోవచ్చు, ఇవ్వే మన చేతుల్లో వున్నవి.
మీరుంటున్న ఆ కలి సైతం ఆ దేవుని సేవకుడే అని మరువరాదు.ఇక శాస్త్రపరంగా ,మరొక ౪౫ రోజుల వ్యవధి అనతరం కుజుడు ,కన్యా రాశిలోని శనితో కలవనున్నాడు .దీనినే గ్రహయుద్ధ్హం అంటారు.ఇందువలన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పెద్దపెట్టున రాజకీయ స౦ క్క్షోభాలు చోటు చేసుకోన్నున్నాఈ .అయీతే ఈ ఘటనలకు ,ఈశ్వరునికి సంభందం ఉన్నదనే చెప్పాల్సిఉంది,ఎన్ దు కంటే ,శాస్త్రపరంగా అటు కుజునికి -ఇటుశనికి శివ సంభందం ఉన్నది కనుక /చల్లా.జయదేవానంద శాస్త్రి /చెన్నై-౧౭ /mail id -joyd1961@gmail.com/cell-09884675329.
కర్నూల్ లో కోటీశ్వరులు సైతం కట్టుబట్టలతో మిగిలిన వైనం మరువకూడదు.ప్రళయం ముంచుకు వస్తుంది అన్నది మాత్రం సత్యం.
జ్యోతిర్గణ్న ప్రకారం ప్రళయం సంభవించడానికి 42స౦.ల సమయం ఉంది ,అంటే 2052-లో కాని ప్రళయం రాదనీ గమనించాలి./జయదేవానంద శాస్త్రి -చెన్నై-౧౭ .
గోపురం కూలడం వల్ల కె బ్లా స కి ఏమన్నా మూడిందేమో చూడండి :)
@శరత్,
మీ బుక్ ప్రింటింగ్ ఆగిపొయింది :) :)
@ కార్తీక్
అయ్బాబోయ్. గోపురం నుండి గేబుక్కుకి ఏంపెట్టారండీ లింకూ!
"కలి" అంటే ఎవరు?
ప్రతి యుగానికి దానిని పాలించే పురుషుడు ఉంటాడు.యుగాలు నాలుగు.ఇప్పుడు నడుస్తున్న కలియుగాన్ని పాలించే వ్యక్తీ పేరు కలి.ఇంటువంటి పురుషునికి కొన్ని ధర్మాలున్టాయీ.ఈ పురుషుని ధర్మాలను ప్రతివారు పాటించి తీరాలి ,లేకుంటే అదొక పాపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.ఉ.దా.అసత్యం /అధర్మం /బంగారాన్ని కూడబెట్టడం /మద్య-మాంస భక్షణం /వ్యభిచారం /లంచం ...అనేవి కలి ధర్మాలు .వీటిలో మనం ఏదో ఒక ధర్మాన్ని మరణ్న్చేలోగా ఆచరించాల్సి వస్తున్నది.---జయదేవానందశాస్త్రి /చెన్నై-౧౭
చారిత్రక ప్రసిధ్ధి గాంచిన గుడులు ఎక్కువగా నదీ తీరాల్లో ఉన్నాయి.వాటికి ఇసుక మాఫియా తీవ్ర నష్టం కలిగిస్తోంది.గనులు తవ్వే ఘనులు కొన్నిచోట్ల గుడుల్ని కూడా తవ్వేశారు.ఆలయాల ప్రక్కనే హెవీ ట్రాఫిక్,షాపింగ్ కాంప్లెక్స్ ల కోసం లోతైన త్రవ్వకాలు అన్నీ కారణాలే.గుడి కూలును నుయి పూడునువడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమౌఅని గువ్వల చెన్నడు ఆనాడే చెప్పాడు.ఏ మతం గుడి అయినా కూలినా కూల్చినా బాధే.మిగతావాటిని కూలకుండా కాపాడుకోవాలి.కూలినవాటిని తిరిగి కట్టాలి.
Post a Comment