అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/14/10

లౌకికవాదమా? హిందూమతద్వేషమా ?

లౌకికవాదులం అని చెప్పుకు తిరిగే కొందరి శైలి గత కొద్ది కాలంగా గమనిస్తూ వస్తున్నాం . పిచ్చ క్యామెడీ గా అనిపించింది ..... హిందూ మతం మీద విషం గక్కడానికి వీరు చేసే విశ్వప్రయత్నాలు చూసి నవ్వు కూడా వచ్చింది. అసలు మతపరమైన అంశాలు నేను గమనించడం మొదలు పెట్టిన తొలినాళ్ళలో ఒక సంఘటన జరిగింది. అదే గోద్రా లో సాధువులు వెడుతున్న ఒక రైలుని యాసిడ్ బాంబులతో దాడి చేసి తగలెట్టి.... బ్రతికిన వారిపై పెట్రోలు పోసి తగలెట్టారు అప్పుడు ఎవరూ మాట్లాడలేదు ( ఒక్క బిజెపి తప్ప) దానికి ప్రతిగా కొందరు దుండగులు విధ్వంసం సృష్టించి కొందరు మైనారిటీలను పొట్టన బెట్టుకున్నప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. రెండవ సంఘటనని వీరు ఖండించడం మనం సమర్ధించగలం గానీ వీరు మొదటి ఘటన ని కూడా ఖండించి ఉంటే బాగుండేది అనిపించింది. సరే రాజకీయ నాయకుల పరిస్థితి అంతే ఓట్లు పోతాయి అనే భయంతో ఆలా మాట్లాడి ఉండవచ్చు అనుకుందాం. లౌకిక వాదుల పరిస్థితి ఏంటి. వారు కూడా దశాం లో ఇస్లామిక్ లేదా మరో మతానికి సంభందించి తీవ్రవాదం చెలరేగినప్పుడు చూడనట్టు నటిస్తారెందుకు .. మనదేశం లో ఇస్లామిక్ తీవ్రవాదం ఎంత భయంకరమైనదో ఎవరికీ ఎవరూ చెప్పనవసరం లేదు. అంతర్గతంగా విద్వంసం సృష్టించడానికి దేశీయ ముష్కరులు తయారు అవుతుంటే లౌకిక వాదులకి కనిపించదేం .. కేవలం హిందూ మతానికి సంబంధించి మాత్రం చీమ చిట్టుక్కుమంటే లటుక్కున వచ్చి పుటుక్కున బ్లాగులో రాసేసే వింత లౌకిక వాదుల ని చూసి నవ్వాలో ....ఇంకేం చేయాలో అర్ధం కావడం లేదు. హిందుత్వ తీవ్రవాదం లేదు అనడం లేదు ... కానీ లౌకిక వాదులం ... లేక ఇంకో వాదులం అని చెప్పుకునే వారు అన్ని రకాల మతాలను ఆయా మతాల తీవ్రవాదాన్ని సమ దృష్టితో చూస్తే బాగుంటుంది .

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ..... అ మధ్య MF వేరే దేశం పౌరసత్వం తీసుకున్నాడు అనే వార్త తెలియగానే లబోదిబో మని గుండెలు బాదుకున్నారు. అందరికీ తెల్సిందే ......కానీ ఈ మద్య లక్నోలోని దారుల్ ఉలూం ఆఫ్ దేవ్‌బంద్ అనే ముస్లిం సంస్థ ఒక ఫత్వా జారీ చేసింది. తాము పని చేసే చోట్ల ముస్లిం యువతులు మగవాళ్ళతో మాట్లాడకూడదు , కలిసి పనిచేయకూడదు .... ఆలా చేస్తే శిక్షార్హులు అవుతారు అనేది ఆ ఫత్వా సంక్షిప్త సారాంశం . ఇదే పని ఏదేని హిందూ సంస్థ చేసి ఉంటే మన లవ్ కిక్ వాదులు ఏం లొల్లి బెట్టేవారో తెలీదు గాని ఈ ఫత్వా జారీ అయి నాలుగు రోజులు దాటినా కుయి కయి లేదు. ఎక్కడో ఎవడో ఏదన్నా హిందూ వ్యతిరేక ఆర్టికల్ వ్రాస్తే మాత్రం వీరి గరళ కంఠం లోనుండి బౌ బౌ లు వస్తాయి. ఏం ఇస్లాం మతం లో జరిగే వివక్ష లవ్ కిక్ వాదులకి కనిపించదా ?? లేక ధైర్యం చాలదా ? లేక లౌకిక వాదం అంటే హిందూ మత వ్యతిరేకమా ??

என்னடா டேய் சொல்றா

24 comments:

చైతన్య said...

బాగుంది... మొదటి సరి తెలుగుని తప్పులు లేకుండా వ్రాసారు... గుడ్.

ఇది నా సబ్జెక్టు కాదు... సో దాని మీద నేనేమి కామెంట్ చేయటం లేదు.

చైతన్య said...

సరి = సారి

లహరి said...

శ్రీనివాస్ గారు బాగా చెప్పారు. ముఖ్యంగా రెండో పేరా.
మరి మన బ్లాగు మేథావులు దిని గురించి రాస్తారా రాయరు ఎందుకు అంటే అది అంతే... మళ్ళి మాట్లాడితే సాధికారత తోటకూర కట్ట అంటారు.

చిలమకూరు విజయమోహన్ said...

హిందుత్వ తీవ్రవాదం ఎక్కడ?
ఇస్లామిక్ తీవ్రవాదంతో పోల్చుకుంటే సూర్యుని ముందు నూనె దీపమంత.

Anonymous said...

kinda aa Tamil,Malayaalam text enti?

Rishi said...

ఇప్పుడే న్యూస్ చానెల్స్ చూసి అనుకుంటున్నా..మైనారిటీలంతే ఇంత ప్రేమ ఎందుకు ఈ దేశం లో..పేరు కి వారు మైనారిటీలు కాని మెజరిటీ ఆజమాయిషీ వారిదే.


పాత బస్తీ లో కాల్పులలో ఒక కానిస్టేబుల్ చనిపోయాడుట.ఆయన మైనారిటీ కాదు(పేరు ని బట్టి అంచనా వేసా).మరి ఈ ఘటన ని ఇప్పటి వరకూ ఎవరూ ఖండిచరేమి?


చానెళ్ళు కూడా మే 18,18 అని గోల పెడుతున్నాయి తప్ప.అదే,ఒక మైనారిటీ యువకుడు చనిపోయుంటే ఆ ఘటనలో? ఎంతసేపూ మైనారిటీలు వారి సంక్షేమం తప్ప వేరే వాళ్ళు అక్కర్లేదా?

....సేన ఉంది కాబట్టి ఈ మాత్రం ఉన్నామండీ బాబూ మనము. కరడు గట్టిన ఒక మతం వాది అనుకున్నా సరే నన్ను.
బ్లాగులలొనే కనీసం అభిప్రాయం చెప్పగలుగుతున్నాం.పత్రికలకి ఇలా రాస్తే పబ్లిష్ చెయ్యారు,టీవీ వాళ్ళూ అంతే. నా బాధ కి ఔట్ లెట్ అయ్యింది మీ బ్లాగు,థ్యాంక్స్.

శ్రీవాసుకి said...

>>లౌకిక వాదం అంటే హిందూ మత వ్యతిరేకమా ??

మీకు ఇందులో ఏదైనా సందేహామా. హిందూ మత వ్యతిరేకతే లౌకికవాదం.

Software Tykoon said...

ఎంటండి ఇలా అంటున్నారు. ఆ మా పనే బురద చల్లడం. ఎడా పెడా అంతే. అయినా వాళ్ళని అనే సత్తా మాకెక్కడ ఉంది. తరిమి తరిమి కొడతారు. చూసాం కదా కార్టున్ విషయం లో కాని, తస్లిమా విషయం లో కాని ఏమి చేసాం మేము మొహం మొలలో పెట్టు కున్నాం అంతే.. అదే ఇక్కడ అయితే నా రచ్చ రచ్చ చేస్తాం అది మా జన్మ హక్కు అండి

Software Tykoon said...

>>ముస్లిం యువతులు మగవాళ్ళతో మాట్లాడకూడదు , కలిసి పనిచేయకూడదు .... ఆలా చస్తే శిక్షార్హులు అవుతారు అనేది ఆ ఫత్వా సంక్షిప్త సారాంశం

ఆ వాదం ఈ వాదం అంటారు ఇది విని ఏమి అంటారు ... ఏమి అనరు అన్ని వాదాలను కలిపి మడిచి జేబులో పెట్టుకుంటారు. గోద్రా, మంగలూరు పబ్ అనండి ... ఎగేసుకుంటూ వచ్చేస్తారు

Anonymous said...

విశాల భావాలున్నవారు, విషభావాలున్నవారు ఒక్కటిగానుండు,
తరచి తరచి చూడా వారి పోకడలు వేరుగనుండు,
లౌక్య వాదులందు లౌకికవాదులుండరయా,
విశ్వబ్లాగిరామ వినర ఆకాశరామ.

దీని మీద నేను రాసిన టపా..ఆదర్శాలు ఆరబెట్టుకుందాం రా..!!

Software Tykoon said...
This comment has been removed by the author.
Software Tykoon said...

మీ అవగాహనరాహిత్యానికి నేను చెవిలో వేలు పెట్టుకుంటున్న. మీరు ముందు ఈ కింది లింక్ చదివి రండి.
www.google.com

Malakpet Rowdy said...

This is "THE" post dude! Way to begin with!

Malakpet Rowdy said...

ఎక్కడో ఎవడో ఏదన్నా హిందూ వ్యతిరేక ఆర్టికల్ వ్రాస్తే మాత్రం వీరి గరళ కంఠం లోనుని బౌ బౌ లు వస్తాయి
___________________________________

Dont insult the Dogs. They are extremely loyal and they aint no traitors

Anonymous said...

పెరుగుతున్న తీవ్రవాదం గురించి కాదు.. పెరిగిపోయిన తీవ్రవాదం గురించి, జరుగుతున్న మత మార్పిడుల గురించి చెప్పడు ఆ వెధవ ...
కసబ్ లాంటి వాళ్ళకి హెల్ప్ చేసేది ఇలాంటి వెధవలే .. అనుమానం లేదు...
వాడి జీవితం లో ఎంతమంది హిందువుల నుండి సహాయం పొందాడో .. ఒక్కసారి కూడా చెప్పేలేదు..

వాడి ప్రొఫైల్ ఫోటో చూస్తుంటే డ్రాకులా లాగా అనిపిస్తున్నాడు ఈ మధ్య..
సైతాను బిడ్డ అంటే ఇలాగే వుంటాడేమో ...

Anonymous said...

elastic laagi vellameeda kodithe sarak antadi choodu ala kottav

Anonymous said...

అసలు ఆయన రాసే రాతలకు ఆయన బ్లాగులో కామెంట్లు రాయకుండా మంచి పని చేస్తున్నారు మన బ్లాగర్లు. ఎంతసేపు హిందూ మతం మీదే విషం చిమ్మడం తప్ప ఇతర మతాల గురించి పట్టించుకోడు.అమ్మ పాలు తాగి ఆమె రొమ్మునే గుద్దే ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు.

శరత్ కాలమ్ said...

@Anonymous
"అసలు ఆయన రాసే రాతలకు ఆయన బ్లాగులో కామెంట్లు రాయకుండా మంచి పని చేస్తున్నారు మన బ్లాగర్లు"

Really :)) అక్కడ కామెంట్లు వ్రాయడం లేదు కానీ పోలోమంటూ అందరూ ఇదో ఇలాంటి టపాలు వ్రాస్తున్నారు :) ఇంకా చాలా బ్లాగుల్లో చాలా టపాలు వస్తాయి. అక్కడాయన ఎంచక్కా తడిగుడ్డేసుకొని ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తుంటారు :))

Anonymous said...

@శరత్ గారు,
మరేం చేద్దాం?.ఆయనకేం సమాధానం చెప్పకుండా ఊరుకుందామంటారా చెప్పండి? మనం ఆయన బ్లాగులో కామెంట్ రాయకుండా ఉండటం వల్ల మరింత రెచ్చిపోకుండా చూస్తున్నారు కదా...

Malakpet Rowdy said...

అక్కడ కామెంట్లు వ్రాయడం లేదు కానీ పోలోమంటూ అందరూ ఇదో ఇలాంటి టపాలు వ్రాస్తున్నారు :)
___________________________________

Everybody wants hits right? So if you write it in your blog, you will get the hits :))

Saahitya Abhimaani said...

మానవ హక్కులంటూ వెర్రి వాగుళ్లు వాగే వాళ్ళు, ఈ సేక్యులిరిజం పాట పాడే వాళ్ళు ఒక్కటే. వీళ్ళకి ఇలా పిచ్చి కూతలు కుయ్యటానికి డబ్బులు ఎవరిస్తున్నారో మరి? చైనా లేక పాకిస్తానా? ఇద్దరూ అయ్యి ఉంటారు.

Dharanija said...

loukika vaadam antene hindoo vyatirekata kadaa.baagaa cheppaarandee.chaalaa thanks.

Nrahamthulla said...

please see http://nrahamthulla.blogspot.com/

krishna said...

@ శ్రీనివాస్
" లవ్‌కిక్ " కావాలనే రాసారా? చాలా ఫన్నీగా వుంది.
ఇక హిందూ తీవ్రవాదం .....మతం పేరు పెట్టేంతే తీవ్రంగా లేదు కదండీ. ఇంకా చెప్పాలంటె నిరూపణ కూడా అవ్వలేదు. కాని వేరె మతం వాళ్ల మీద విచారణ జరుగుతున్నాప్పుడు చాలా మంది, నిందితుడిని ముద్దాయి చెసెస్తారు, తీర్పు రాకముందే!
కాని ఒకరి మత విశ్వాసాలు దెబ్బ తింటాయనొ, ఓటు బ్యాంకు నష్ట పోతామనొ వెదవ రాజకీయాలు ఆడే తొంగిరీసు వాళ్లకి, మెజారిటీ ని మైనారిటీ కానివ్వమని పరమత ద్వేషం కక్కే మత పార్టీలు సమాధానం కాదు. ఒక తప్పుకి మరొక తప్పు సమాధానం కాదు.అసలు లౌకిక వాదం మతాలన్నింటిని ( ఆ మాట కి వస్తే జాతులని కూడా ) సమానంగా చూడడం కాదు. నీదే మతం కులం అని అడగకుండా సమాన అవకాశాలు ఇవ్వడం , ప్రత్యేక సదుపాయాలు అంటు ఒకరి మీద ఒకరికి అసూయ కలగనివ్వకపోవడం.
అసలు పేదవాడికి మేలు చెయ్యలంటె వాడి మత కుల ప్రసక్తులు అడగవలసిన అవసరం ఏమిటి?