ఈ టపా ఎవరినో దెప్పి పొడవడానికి కాదు . నిత్యం మన చుట్టూ జరిగే విషయాల్లో మన సంకుచిత్వాన్ని ప్రశ్నించుకునే ప్రయత్నం. చదువుకున్న పరిస్థితుల వల్ల అయితే నేమి , స్నేహాల వల్ల అయితేనేమి మనలో చాలా మంది వ్యవస్థలో బలమైన మార్పులు కోరుతున్నాం. కాని మూలాల్లో నుండి మన మనస్తత్వాల లో మార్పు తెచ్చుకుంటే తప్ప అంత తేలిగ్గా పెద్ద పెద్ద విషయాల్లో లో మార్పులు కష్టం అనేది నా భావన.
ఉదాహరణకి ఒక రిక్షా కార్మికుడు సెల్ లో మాట్లాడుతుంటే " చూడు సెల్ ఫోన్లు ఎంత చీప్ అయిపోయాయో , ఆఖరికి రిక్షా వాడు కూడా సెల్ లో మాట్లాడుతున్నాడు అని సెటైర్లు చాలా మంది వేసే ఉంటారు లేక పోతే మన పక్కన వాళ్ళు వేయగా వినే ఉంటారు .. ఏం రిక్షా వాడు సెల్ లో మాట్లడకూడదా................ అతనికి చుట్టాలు ఉండరా లేక అతనికి సెల్ ఫోన్ లాంటి ఉపకరణాలు నిషిద్ధమా ?? ఆర్ధిక పరమైన అంశాల మూలంగా మనుషులను అంచనా వేసే దౌర్భాగ్య మనస్తత్వాల్లో మార్పు రావాలి .
ఇక ఇప్పుడు రాయబోయే పాయింట్ మన మార్తాండ కి బాగా పరిచయం ఉండవచ్చు . ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లి పెన్ డ్రైవ్ నుండి ఒక రెండు ప్రింట్ ఔట్స్ తీసుకుంటుంటే ఆ కేఫ్ ఓనరు రెండు రూపాయలు అడిగి తీసుకుంటాడు ... మరీ రెండు రూపాయలకి ఇతనికి ఎం వస్తుంది అనుకునే లోపే మరొకతను వచ్చి మరో ప్రింట్ ఔట్ తీసుకున్నాడు . ఓనర్ ఒక రూపాయి అనగానే మొహం చిట్లించి ఎందుకు అర్ధ రూపాయి ఏ కదా అన్నాడు అదోలా ........ ఆ వ్యక్తి వంక తేరిపార చూశా చాలా ఖరీదైన బట్టలే వేసుకున్నాడు మరెందుకు ఇంత కక్కుర్తి ???? " ఇలాంటి వాళ్ళు రోజుకి పది మంది వస్తారు సార్ " అన్నాడతను ? అర్ధ రూపాయి కోసం ఇంత కక్కుర్తా?
చాలా కష్టపడి పైకొచ్చిన ఇంకొక ఫ్రెండ్ చెబుతూ ఉండేవాడు అతను బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఫ్రెండ్స్ దగ్గరకెళ్ళి భోజనం పెట్టించమని అడిగితే గేలి చేసేవారట...... రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయించిన తర్వాత ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాం అని వెళ్ళిపోయి ఇంక కనిపించే వారు కాదట ... అదే సిగిరెట్ అడిగినా మందు పార్టీ ఇవ్వమన్నా వెంటనే బయలుదేరేవారట .... ఆ రోజుల్లో 15 పెట్టి భోజనం పెట్టలేదు గానీ ... వంద రూపాయలు పెట్టి మందు మాత్రం పోయిస్తారు ఎం మనస్తత్వాలో ఏంటో అంటూ ఉంటాడు.
కస్టపడి బట్టలు చించుకుని బాలయ్య సినిమా టిక్కట్ 200 పెట్టి కొంటాం గానీ అక్కడే రోడ్డు పక్కన చెట్టుకింద కాలు చాపుకున్న ముసలవ్వ కి ఒక్క రూపాయి కూడా ధర్మం చేయాలనే ఆలోచన రాని మెంటాలిటీ ప్రతి జనరేషన్ కి పెరుగుతుంది. ఉచితార్ధంగా ఆధిపత్యం కోసం పోరాటం. ఏదైనా ఈవెంట్ కోసం కష్టపడేప్పుడు ఒక్కడు రాడు. అదే దానికి పేరు వస్తే ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడానికి ..... ఎక్కడ లేని ప్రయత్నాలు చేయడం. చదవకుండా పాసైపోదామనుకునే పిల్లల లో వచ్చిన మార్పు మొగ్గ దశలోనే మాడిపోవాలి.
ఇలా కాదు మార్పు రావాలి ......... వృత్తుల మీద గౌరవం పెరగాలి , సినిమా రిలీజ్ రోజు ఎండకి ఎండి వానకి తడిసి హీరోకి కటౌట్ పెట్టే కురాళ్ళు కనిపించకూడదు. అసలు సినిమా టిక్కట్లు బ్లాక్ లో కొనే దౌర్భాగ్యం ఉండకూడదు. బస్సుల్లో స్త్రీల సీట్లలో కూర్చోవడం మానాలి ఇంకా ఎన్నో ఉన్నాయి . నేను చెప్పింది కొన్ని ఉదాహరణలే
ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి గానీ ముందు ఇలాంటి బుద్ధులు మారితే కదా తర్వాత మనం అనుకునే పెద్ద పెద్ద విషయాలలో మార్పు కోరుకునేంత విశాల పరిపక్వత చెందిన ఆలోచనలు వచ్చేది . రూట్ లెవల్లోనే మనం చాలా వెనక బడి ఉన్నాం ఇంకా ఇది దాటి ... సహజీవనాలు , పెళ్ళికి ముందే కిల్లీలు , కొన్ని విషయాలకి చట్టబద్ధతలు అంగీకరించే కనీసం ఆలోచించేదశకు సమాజం చేరుకోవాలంటే చాలా కష్టం . ఏమంటారు ????
ఇవన్నీ వదిలేసి పనికి మాలిన విషయాల్లో మార్పు కోరుకుంటుంటే సమాజం సంకనాకి పోద్ది
17 comments:
Well said
accepted
నేను ప్రింట్ కి తీసుకునేది 3 రూపాయలు. A4 సైజ్ పేపర్ ఖరీదు పావలా. అర్థ రూపాయి తీసుకుంటే టోనర్ పౌడర్ ఖర్చు, కరెంట్ ఖర్చు ఎక్కడి నుంచి వస్తాయి.
great
ప్రవీణు మరి రెండు రూపాయలకి తీయవా?
ప్రవీణ శర్మ గారు
మూడు రూపాయలు తీసుకుంటున్నారు కదా
ఇలా ప్రజల సొమ్ముతిని అక్కడ ధారబోస్తున్నారు కదా
మీరు రెల్లి వీధిలో మరి వందకి రెండొందలు ఎందుకిస్తున్నారో ఇప్పుడు తెలిసింది
బాలయ్య టికెట్ రెండు వందలా శీనన్నా? వైజాగ్ లో ఎవడో ఇంద్రా టికెట్ బ్లాక్ లో రెండు వేలకి కొన్నాడు.
బ్లాక్‌లోకి రిలీజ్ చేసింది థియేటర్ యజమానే. అంత ఖర్చు పెట్టే వెర్రి వెంగళప్పలు ఉంటారని తెలిసి.
మ్మ్... ప్రాధాన్యాలను బట్టి కార్యాచరణ ఉండాలంటారు...సమాజం లోప్రతి ఒక్కరి ఆకలి తీరే వరకూ మన ఇంట్లో పార్టీ జరగ్కూడదు అనేది చాలా ఉదారమైన ఆలోచన..కానీ ఇది మన జనస్వామ్యం లో సాధ్యం కాదనుకొంటా...ఐతే ముందు జనాల అంతరాత్మ,ఆత్మ విమర్శ స్థాయి ని పెంచటం చేయాలి. ఎవరు చేయాలి?......
ఎంత జల్సా అయితే మాత్రం రెండు వేలు పెట్టి చిరంజీవి సినిమా చూడడం అవసరమా?
ఎవడో రెండు వేల డలర్లు పోసి బాలయ్య టిక్కెట్టు కొని సిమ్హా సినిమాకి వెళ్ళాడట.
నిన్న TV9 లో చూసాను.
ఎవడో మెదడు మోకాలికి దిగిన ఎదవ అయ్యుంటాడు.
బాగా చెప్పారు!
సమాజం -- పోతే మాకేంటంట. అహ మాకేంటంట. దేశభక్తి అనే బానిసత్వం లోకి మమ్మల్ని నెట్టాలనే దుర్మార్గపు ఆలోచనలు మీవి. భక్తి అనేదే నాన్సెన్సు.
//గానీ ముందు ఇలాంటి బుద్ధులు మారితే కదా తర్వాత మనం అనుకునే పెద్ద పెద్ద విషయాలలో మార్పు కోరుకునేంత విశాల పరిపక్వత చెందిన ఆలోచనలు వచ్చేది//
రూట్ లెవలు సంగతి మాకెందుకు. రోడ్డు పక్కన అడుక్కుతినే వాడిని తీసుకుపోయి శిక్షణ ఇస్తే డాక్టర్ అయి తీరతాడు.దానికి చదువెందుకు?
మాదంతా ప్రత్యేక వర్గం మాదంతా ప్రత్యేక దోరణి. మాకోసమే ప్రభుత్వం ప్రజలు ఉన్నది. మాకు భాధ్యతలు వద్దు. మేం విచ్చలవిడిగా బదుకుతాం, మాపిల్లల సంగతంటారా. ప్రభుత్వ వసతి గౄహాలు, ప్రత్యేక సౌకర్యాలు మాసొంతం ఒక్కమార్కు వస్తే చాలుడాక్టర్ ఇంజనీర్ సీటు మా హక్కు. పనిచేసినా చేయకపోయినా మాకు ప్రమోషన్ ఖాయం అలా ఉన్నత శిఖరాలకు చేరతాం ఎవరన్నా మమ్మల్ని విమర్షించారో ఖనబడ్దార్ కేసులు వేస్తాం న్యాయం మా ఇంటి నౌకరు.
వ్యసనాలు ఎన్ని చేసుకున్నా ఆరోగ్యం చెడినా జీతం ఇంటికే పంపేలా హక్కులు సాధిస్తాం మేం ప్రత్యేక వర్గం కదా మరి. మాకోసం ఉచితంగా కార్పోరేట్ ఆసుపత్రులలొ వైద్యసేవలు ఉంటాయి.
కనుక మిత్రులారా మధ్యతరగతి ప్రజలు ఏరిజర్వేషనూ లేని దిక్కులేని ప్రజలు మీ బిడ్డలకు కష్టపడ్డా ఉద్యోగాలు వస్తాయో రావో ఏవ్యసనమూ జోలికి పోకుండా డబ్బు దాస్తూ మీ వర్గం అసమాన సమాజంలో హక్కులేని బానిసలుగా బతకండి.
సమానత్వం పేరుతో మేం మీ సంసౄతిని విషమయం చేసి తరతరాలుగా మాపై జరిగిన దాడికి కసి తీర్చుకుంటాం.
పౌరుషం చచ్చిన పరాన్న జీవులం మేము. కులం బిక్ష డిమాండ్ చేసుకుని పడి పడి తిని సమాజం మీద బ్రతికేస్తాం, సిగ్గు అన్నది మా డిక్ష్నరీలో లేదు. 60 ఏళ్ళు కాదు , ఇంకో 6000 ఏళ్ళైనా వెనకబడేవుంటాం , ఆమాటకొస్తే ఎంగిలికూటికి ఎన్నేళ్ళైనా వెనకబడివుంటాం.
ఎందన్నో ఈమధ్య తోపుతీరుగా రాశ్చన్నావ్
ఎవడో రిసర్వేషన్లు దొబ్బేస్తున్నారన్న మంట వుంటుంది చింపే ద్దామ్ అనిపిస్తుంది,అదే అవకాశం మనకొస్తే వదిలేస్తామా????మనమూ దొబ్బేయమా???అప్పుడు వాళ్ళల్లా మనమూ ఆర్గ్యూ చేయమా???అందని ద్రాక్ష పుల్లన...ఎన్ని వాదించండీ...అదే అవకాశం మనకుంటే ..ఈ కబుర్లు వుండవు...వదిలేస్తామా?????
Post a Comment