" ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి " నిత్యం నేను స్మరించుకునే వాఖ్యమిది. 1982 వరకు మా కుటుంబానికి సాయిబాబా గురించి తెలీదు . ఆ సంవత్సరం లో సాయిని నమ్మి అయన మార్గంలో నడవడం మొదలెట్టిన దగ్గర నుండి ఇంతవరకు ఆ మార్గం విడువలేదు.
స్వర్గీయ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన సాయి లీలామృతం లో 29 వ అధ్యాయం లో మా అమ్మగారి ప్రస్తావన ఇలా ఉంది. " కామేశ్వరమ్మ ( ఒంగోలు) తమకు తెలిసిన వారి నుండి ' శ్రీ సాయి లీలామృతము' తీసుకొని శ్రద్ధగా పారాయణ చేసింది. కొంతకాలంగా ఆమెకు మూర్చవ్యాది, వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకూ తగ్గలేదు. అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా, ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టరు వలె స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు. అ నొప్పికి మెలకువ వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆమె మరింత భక్తి తో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే శిరిడీ లో సాయికెదురుగా కూర్చునట్లు భావోద్రేకం కలిగి బాహ్యస్మృతి లేకుండా 5,6 గంటల సేపు కూర్చుంది పోయేది.
ఆమెకు ఇంకెన్నో దివ్యనుభావాలు కలుగుతుండేవి . ఉదా :- 3 - 9 - 1986రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు. ఇంతలొ తెల్లని దిస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్ళను ఉరుదూ లో తిట్టి తరిమేశాడు. మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు. సాయియే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు. నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతు, భీకరులైన నలుగురు మనుష్యులు కన్పించి ఆమె మెడకు తాడుకట్టి లాగుతున్నారు. ఆమె భయంతో కేకవేసి నిద్ర లేచింది. మరలా నిద్ర పట్టాక మరలా ఆ నల్గురూ ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్ళను తిట్టి వెళ్ళగొట్టారు. ఆమెకు మెలకువ వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు క్రింద మెత్తగా ఏదో తగిలింది. కాలు ప్రక్కకు తీసేలోగా ఒక త్రాచుపాము పడగ విప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటువేసి చర చరా వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి, చెమట పట్టి, గుండెలు బరువెక్కాయి. కొందరు పరుగున పోయి పాముల నరసయ్యకు ఫోను చేసారు, కొందరు ఆమెను డాక్టరు వద్దకు తీసుకు వెళ్లాలన్నారు. ఆమె, " నన్ను సాయి పటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి. నాకు సాయియే దిక్కు. నేను డాక్టరు వద్దకు రాను. నాకెలా ఉంటే అలా జరుగుతుంది" అన్నది. క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది. ఇంతలొ ఆ ప్రదేశమంతా పరిమళాలు వ్యాపించాయి! కాసేపటికి స్పృహ వచ్చింది. త్వరలో ఆమె కోలుకున్నది.
పై విషయం లో స్థలాబావం వలన భరద్వాజ గారు పూర్తి విషయం వ్రాయలేదు. మా ఆమ్మకి మూర్చ వ్యాధి ఉండేది . అప్పట్లో ఆర్ధికంగా బాగా చిటికిన మా కుటుంబం సరైన వైద్యం చేయించుకోలేని పరిస్థితి. తెల్సిన వారి ద్వారా సాయి గురుదేవుల గురించి విని ఆయన చరిత్ర పారాయణ చేసిన కొన్నాళ్ళకి కలలో సాయి డాక్టరు రూపంలో కనిపించి ఇంజక్షన్ చేశారట. వెంటనే ఉలిక్కిపడి లేచిన మా అమ్మ మమ్మల్ని పిలిచి ఇంజక్షన్ గుర్తు చూపించారు . ఆ రోజు నుండి ఆమెకి ఫిట్స్ లేవు. అప్పటి నుండి నిత్యం సాయిని కొలవనారంభించిన మా అమ్మ తెల్లవారుఝామున నలుగు గంటలకి పూజ లో కూర్చుంటే ఒక్కొక్కసారి ఆ రోజు సాయంత్రం వరకు బాహ్య స్మృతి లేకుండా కూర్చుని ఉండేది. ఎప్పుడో మెలకువ వచ్చి లేచి నేను శిరిడీ వెళ్లి వచ్చాను అనేది. అప్పుడే నాలుగేళ్ల వయసుండే నేను " అమ్మా నువ్వు చచ్చి పోయావా ఇందాక పిలిస్తే పలకలేదు ?" అని దీనంగా అడిగేసరికి " ఏమిటి బాబా ఇంత చిన్న బిడ్డ ఉన్న నాకు ఈ ఆధ్యాత్మికత ఏంటి" అని బాద పడ్డారట. అంతే అప్పటి నుండి నేను బాగా పెద్ద వాడిని అయ్యేవరకు మా అమ్మ గారికి అలాంటి యోగస్థితి కలగలేదు. అయితే మద్య మద్యలో స్వప్న దర్శనాలు ఇస్తూ ఉండేవారట. పాము కరిచిన రోజు నాకు బాగా గుర్తు అప్పుడు నాకు నాకు ఏడేళ్ళు . తెల్లవారుజ్హామున పెద్దగ అరిచింది అమ్మ అందరం పరిగెట్టుకు వెళ్ళాం ... ప్ మా ముందు నుండే పెద్ద త్రాచుపాము వెళ్ళింది . మా అన్న నోటితో విషాన్ని లాగాడు .. కాసేపటికి గుండెల్లో పాము బుస కొడుతున్నట్టు ఉంది అన్నది అమ్మ ........ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నారు కొందరు అయితే అమ్మ మాత్రం నేనెక్కడికీ రాను నన్ను సాయి పటం వద్ద పడుకోబెట్టండి అనడంతో అలాగే చేశారు . ఐదు గంటల సమయం లో ఆ ప్రాంతమంతా చక్కని సువాసన వచ్చింది అమ్మ వంటి నిండా తెల్లగా కనిపిస్తూ ఉండడంతో భయపడి లైట్ వేసి చూసిన మేము ఆమె వంటి నిండా విభూతి చూసి ఆశ్చర్య పోయాం . ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా మా అమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలు అయింది.
2008 నుండి మళ్లా యోగస్థితిలోకి మా అమ్మ వెళ్లడం ప్రారంభం అయింది. 2008 లో గురు పౌర్ణమి నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు మా పూజ మందిరంలో బాబా విగ్రహం నుండి విభూతి రావడం వచ్చింది. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి .
ఆ తరువాత 2008 దసరా రోజు రావడం మొదలైన విభూతి మూడు రోజుల వరకు పెరిగింది.
తంబూలీ అనే రౌడీ వాడు ఊర్లో నుండి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తే ...... మూడు నెలలపాటు ఊరిబయట నివసించి అయన మనకి నేర్పింది . సహనం , ప్రేమ . ఎదుటి వాడు తిడితే తిరిగి తిట్టకు వాడు తిట్టినందుకు నీకేమన్న నెప్పి పుట్టిందా ... లేదుకదా అంటూ మనల్ని తగాదాలు పెట్టుకోవద్దు అని చెబుతారు. మిట్ట మద్యాహ్నం ఆకలితో ఉన్న ఏదో ఒక జీవి కోసం ఒక ముద్ద అన్నం బయట పెట్టమని చెబుతారు. ఇరువురు కలిసినప్పుడు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి పుకార్లు మాట్లడుకోవద్దు అని చెబుతారు. ఒక మనిషి సక్రమమైన జీవితం ఎలా గడపాలో ఆయన జీవించి చూపారు. ఎన్ని పారాయణాలు చేసినా ఒక్కొకసారి సహనం నశించి అవతల వారితో యుద్ధానికి దిగినా సాయంత్రం ఇంటికెళ్ళాక అయన పటం లోనుండి "నా మాట వినలేదుగా " అన్న భావన తో ఉన్న చూపులు నన్ను వెంటాడుతాయి.
నిత్యం స్మరించుకోవాల్సిన ఆయన మాటలు కొన్ని
నీదగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలెయ్యవద్దు, ఆదరించు, ఋణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేనివారికి గుడ్డలు యివ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనాసరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు యివ్వు, లేక యిప్పించు, " లేదు" అనవద్దు. యిచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా యివ్వలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు .
ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కల్గుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నేవరైనా బాధించినా వాడితో పోట్లాదవద్దు. సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడనుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవేవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమి గుచ్చుకోవు గదా! ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు . దాన్ని లక్ష్య పెట్టక, ఋజుమార్గం లో వెళ్ళు, ఆనందానికి యిదే మార్గం.
అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దాని వలన మనకేలాభామూ లేదు. అవతల వారికే నశ్రమూ లేదు. అసూయంటే యితరుల బాగును సహించలేకపోవడమే.ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము. వారు నష్టపోతే సంతోషిస్తాము. దాని వలన మనకేమి ప్రయోజనము? అవతల వాడికి మంచి జరిగితే మనకేమి నష్టము? కాని యిది ఎవరూ ఆలోచించారు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం! లేదా మనమూ ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మనసోత్తేమి లాక్కున్నాడు? వాడి కర్మననుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు.
ఈ టపా వ్రాయడానికి కారణం నా సాయి గురించి నా బ్లాగులో వ్రాసుకున్దామనే ఈ మద్య అదుపుతప్పుతున్న నా ఆవేశాన్ని అనుచుకున్దామనే గానీ గొప్ప కోసమో లేక లేదో రుజువుల కోసమో కాదు :)
46 comments:
బావుంది శ్రీనివాస్! శ్రీ భరద్వాజ నాకు బాబాయి అవుతారు వరసకు!(దూరపు బంధువు అనుకోండి)కానీ దురదృష్టం ఏమిటంటే జీవించి ఉండగా అయన్ని ఎప్పుడూ కలుసుకోలేకపోవడం. సాయి లీలామృతం ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు.ఎన్నో కాపీలు పంచాను కూడా!
ఈ అనుభవాలన్నీ మీ అమ్మగారివని(ఎందుకంటే ఎన్నొసార్లు చదివాను కదా ఆ పుస్తకం...)తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంది.సంతోషంగా ఉంది.ఒంగోలు లో సాయి గుడి కట్టిన విధానం అంతా చక్కగా రాశారు భరద్వాజ!
మీ అమ్మగారు అదృష్టవంతులు!
ఒక్క వాక్యం కూడా వదలకుండా చదివాను ...చాలా ఆశ్చర్యం కలిగింది .చాలా సంతోషం .నమ్మినవారికి మార్గం చూపిస్తాడు .మీ అమ్మగారు చాలా అదృష్టవంతులు .విభూతి గూర్చి వినడమే కాని స్వయంగా చూడలేదు ..
..నేను సాయి ద్వారా అనూహ్యమైన సహాయాలు పొందాను .ఈ రోజు నేను చేస్తున్న పని కూడా బాబా దయే...మా వారి నాన్నగారు సరిగ్గా నా మెయిన్ పరీక్షలు పది రోజులుంది అనగా తీవ్రంగా సిక్క్ అయ్యి మా వద్ద ఐ.సి .యు లో వున్నారు ఆ పదిరోజులు ఒక ముక్క కూడా చదవలేదుబాబా మీద భారం వేసేసి వచ్చేపోయే బంధువుల తో హాస్పిటల్ కి తిరగడం అయ్యింది మెయిన్ పరీక్షలు రేపటినుండి మొదలు అనగా ముందు రాత్రి చనిపోయారు మొత్తం ఎనిమిది పేపర్స్ రాయాలి ..మొదటిరోజు ఉదయం ఒకటి మద్యాహ్నం ఇంకొక పేపర్ రాయాలి ........లక్ష ఎనభయ్యి వేలమందిలో స్క్రీనింగ్ పరీక్షలో మెయిన్ కి అయిదు వేలమందిమి రాస్తున్నాం నూటయెనిమిది పోస్ట్లకి ,అటువంటి పరిస్థితిలో మా మామయ్యగారి మరణం ..నా ఆశలన్నీ కూలిపోతున్న తరుణం లో మా శ్రీవారు స్పందించిన తీరు అనూహ్యం .మా అమ్మ నాన్నలు వారిస్తున్నా వినకుండా నన్ను మా అక్క దగ్గర ఉంచేసి తన మీద ఒట్టుపెట్టించుకునిమా వాళ్ళని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు ...ఊర్లో మా మామయ్యా ఫునరల్స్ జరుగుతుంటే నేను మద్యాహ్నం రెండో పేపర్ రాసాను పేపర్ లో ప్రతి పేజి తడిచిపోయింది కడసారి చూపులు కూడా లేకుండా , గుండె రాయి చేసుకుని మనస్సు చంపుకుని మూడో పేపర్ రాసి చిన్నకర్మకి ,లాస్ట్ పేపర్ రాసి పెద్దకర్మకి అటెండ్ అయ్యాను ..అలాటి పరిస్థితిలో కూడా ఫైనల్ ఇంటర్వ్యూ కి రెండువందల మందిలో నేను ...చివరికి ఒక పోస్ట్ నాదే అయ్యింది ..ఇది మొత్తం ఒక మిరకిల్ . భారం మొత్తం భాబా మీద వేసి ఆయనకే వదిలేసాను .భంధువులు రకరకాలుగా కామెంట్ చేసిన మా అత్తగారు మా వారు మాటపడనీయలేదు..ఇదంతా బాబా దయే .ఇది ఒక చిన్న ఉదాహరణే..నిత్యం నాతో వుంటూ హెచ్చరిస్తూ మార్గదర్శకం అవుతాడు బాబా .
మీ అమ్మగారు,ఆ మహాతల్లి కడుపున జన్మించిన మీరు ఎంత అదృష్టవంతులండీ!
It is all baseless mass hysteria. Don't believe agents/babas have faith in almighty, directly. No need of agents for reunion with God.
Srinivas Garu,
Nenu chaala happy gaa feel ayyaanu parayana pusthakam lo experience mee amma gaaradhani telisi...mee family members chaala lucky.
Sujata Garu,
Bharadwaja master garu raasindhi ongole gudi gurinchi kaadhu. Nellore Dt loni Vidyanagar temple gurinchi. Aayana akkada college lo lecturer gaa chesaru. I completed my Btech over there and used to visit that temple very regularily in my college days.
Anonymas,
you are right! I got confused.
Don't believe agents/babas have faith in almighty, directly.
___________________________________
Shirdi Sai Baba was different, man. We can't draw a comparison betwen Him and todayz babas. He was a guide and a teacher, not an agent. All he meant was good.
ఇంత అద్భుతమైన అనుభవాలు కలిగిన మీరు ఇతరుల భావాలను కించపరచేలా అపుడెపుడో ఒక టపాలో వ్రాసారు. మీకు షిర్డీ సాయి అంటే ఎంత నమ్మకమో అలాగే నాకున్న అనుభవాల వల్ల సత్యసాయి బాబా వారంటే అంతే నమ్మకం. ఆరోజు మీ టపా చదివి బాధపడ్డాను.సరేలే అన్నిటికి ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన భూషణ దూషణాలకు అతీతుడు అనుకుని ఊరుకున్నాను. కాని అంతటి మహనీయమైన విశ్వాసం గల తల్లి కడుపున పుట్టటం కూడా మీరు ఏ జన్మలో చేసిన పుణ్యమో..అనిపిస్తోంది.
విభూతి అలా పెరగడం మీ అదృష్టము. చక్కగా విభూతి వ్యాపారం పెట్టుకోవచ్చు. ఏ బంగారో , పెట్రోలో ఐతే మరీ బాగుండేది. :)
చాలా బాగుందండి. సాయి సంకీర్తన, సాయి నామం తలచుకోగలగటమే ఒక దివ్యమైన అనుభూతి. మీ అమ్మగారి కి నా నమస్సులు తెలియచేయండి. అధ్బుతం ఆమె అనుభవాలు.. భరద్వాజ్ గారి సాయి లీలమృతం లో రాసిన అనుభవాలు ఇవే నా ఐతే. సుజాత మీ బాబాయి గారా మాస్టారు. గ్రేట్... మనసు నిజం గా గురువు కోసం పరితపించినప్పుడు సాయి తప్పక మన ముందుకు వస్తారు చిన్ని... దత్తాత్రేయ రూపం కదా. గురువు ఎప్పుడైనా విస్మరించగలడా శిష్యులను మరి. చాలా బాగుంది శ్రీనివాస్.. ధన్యవాదాలు ఈ అనుభవాలను మాతో పంచుకున్నందుకు.
సుజాత గారు భరద్వాజ గారు మీ బాబాయి గారా చాలా మంచి విషయం తెలియచేశారు. ఆయనతో నా అనుభవం చిత్రమైనది. చిన్నపిల్లలు అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికి యాపిల్స్ ఇచ్చి నాకు మాత్రం కమలాలు ఇచ్చేవారు ఎందుకో అర్ధం అయ్యేది కాదు. సత్సంగానికి ఎవరి ఇంటికీ వెళ్ళని ఆయన ఒక సారి మా ఇంటికి వచ్చారు.
చిన్ని గారు మీ విషయం లో జరిగినటువంటి అనుభవాలె సాయినాధుని కృపని అందరికీ తెలియచేస్థాయి .
విజయమోహన్ గారు ధన్యవాదాలు :)
మొదటి అజ్ఞాత గారు ,
ఎవరికీ హాని కలిగించని మాస్ హిస్టీరియా లోనే మాకు ఆనందం దొరుకుతుంది :)
రెండవ అజ్ఞాత గారు ధన్యవాదాలు :)
మూడవ అజ్ఞాత గారు, మీ మనోభావాలు గాయపరచినందుకు క్షంతవ్యుడిని కాని ప్రస్తుత సమాజం లో సాయి తర్వాత అవతారం అని చెప్పుకునే వారికి నేను వ్యతిరేకిని :) తన తర్వాత అవతారం గురించి సాయి ఇంతవరకు తన భక్తులకు చెప్పలేదు కదా :)
నాలుగవ అజ్ఞాత గారు మీ మాటలు నిజమై ఏ బంగారమో , పెట్రోలో వస్తే అంత కన్నానా అందులో సగం మీకె ఇస్తా :)
ధన్యవాదాలు భావన గారు :)
" ప్రస్తుత సమాజం లో సాయి తర్వాత అవతారం అని చెప్పుకునే వారికి నేను వ్యతిరేకిని"
తనే హోల్ అండ్ సోల్ ఆథరైజ్డ్ డీలర్, ఇంకెవరికీ ఫ్రాంచైజీ లేదని మీకు సర్టిఫికేట్ చూపించాడా?
"తన తర్వాత అవతారం గురించి సాయి ఇంతవరకు తన భక్తులకు చెప్పలేదు కదా "
మీ ఇంట్లో విభూతి పోస్తానని మీకు ముందుగల్లా చెప్పే పోసిండా? మీకు కలలో కనిపించి తన అజెండా ముందే గీతోపదేశం చేయ్యాలా? లేకుంటే ఎవరితోనైనా అలా చెప్పాడని ప్రింటులో బుక్కు అచ్చేయించాలా?
అజ్ఞాత గారు దాక్కుని వ్యంగ్యంగా మాట్లాడడమెందుకు .... మీ అసలు పేరుతో రండి మీకు అన్నీ చెబుతా :)
మీ అమ్మగారి అనుభవాలు పుస్తకంలో ఎన్నోసార్లు చదివాం. మీరావిడ కొడుకని తెలిసి చాలా సంతోషంగాఉంది. సుమారు 1988 నుండి మొదలయింది బాబాతో నా పరిచయం. ఆయన బోధించిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడల్లా మీలాగే ఫీలవుతోంటా. కానీ ఎప్పటికప్పుడు కుక్క తోకే.
దొంగ బాబాలు, లక్ష రూపాయల పట్టుచీరల అమ్మలు ఎక్కువై పోయాక నిజంగా దైవ స్వరూపులైన వారిని కూడా గుర్తించలేనంతగా తయారయ్యాయి పరిస్థితులు!
షిరిడీ సాయి జీవితమంతా భిక్షువుగా జీవించారు. బిందెలతో బంగారం తెచ్చినవారిని కూడా లక్ష్య పెట్టలేదు. పట్టు పరుపుల మీద కూచుని ఉపన్యాసాలు ఇవ్వలేదు.విదేశీయులు వచ్చినా, బ్రిటిష్ వారు వచ్చినా వారెంత ధనవంతులైనా లెక్క చేసేవారు కాదు. ఆజన్మ బ్రహ్మచారి."ఆపదలో ఉన్నవారికి సహయం చేయండి! ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టండి" ఇదే స్థూలంగా ఆయన చెప్పింది. అంతే కాదు మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని అశుద్ధం స్వీకరించే సూకరంగా భావించి వదిలేయమన్నారు. ఆ పాపమంతా వారిదే కానీ మనది కాదన్నారు. తప్పుచేసిన వారిని ఎన్నడూ సాయి శిక్షిచిన దాఖలాలు లేవు. అంత క్షమ, ప్రేమ!
ఆయన్ని ఇతర బాబాలతో పోల్చడం,ఆయన ను ప్రశ్నించడం చాలా సాహసోపేతమైన పని.
ఇస్లాంలో సున్నీలు ప్రవక్త ఒక్కడె అతను మళ్ళీ మళ్ళీ రాడు అని నమ్ముతారు. అహమ్మదీయులు ఎందరో ప్రవక్తలు వస్తూవుంటారు అని నమ్ముతారు. సున్నీలు అహమ్మదీలను జిహాద్ చేయాలని అంటారు.
ఇక హిందూ మతానికి వస్తే, 'సంభవామి యుగే యుగే ' తెలిసిందే కదా, మరి మీరు సాయిబాబ మళ్ళీ వస్తానని చెప్పలేదు కదా అంటున్నారు కొంప్తీసి మీరు హిందూ ముల్లాలా?
పేర్లు, వంశవృక్షాలు, గోత్రాలు చెప్పుకోవాలా! ఏం వేదాలు ఉపదేశాలు చేస్తారా? మీరు రాసే రాతలకి ఇదే చాలా ఎక్కువ, కామెంటే అలవాటు మా అజ్ఞాతల ఇంటావంటాలేదు. మేమేమి బూతులు మాట్లాడలేదు, కదా .. అది చాలదా? ఈమాత్రం ఓపిక లేని వాడివి సాయి భక్తుడెలా అయ్యావు? ఇదంతా పురిటి వైరాగ్యమేనా?
ఇట్లాంటి విభూతి పడే బాబా ఫోటోలు, పాలుతాగే గణేష్ లు చాలా విన్నాం. ఆ ఫోటోలు ఎందుకు పెట్టారు? అవి చూసి మీ కథ నమ్మాలనా? :) ఆంగిల్ మార్చి తీస్తే విభూతి వేయకుండానే ఫోటో తీయవచ్చు, ప్రయత్నించి చూడండి. మీరు 7ఏళ్ళ వయసులో( అంటే ఓ 25ఏళ్ళక్రితం ) కలర్ ఫోటోలు అంత విరివిగా వుండేటివా? ఎందుకండీ ఈ బ్లాగోతాలు, మోసాలు? విజిటర్లను మభ్యపెట్టడానికేనా? అబద్ధపు ప్రచారంచేస్తే మీ సాయి కరుణిస్తాడేమో కాని, చిత్రగుప్తుడు మాత్రం వదిలే ప్రశ్నేలేదు. :P
తెలిసీ చెప్పకపోయారో ఇక్కడున్న చీర్ లీడర్ల మీద ఒట్టు , అంతే!
అజ్ఞాత గారేదో చాలా ఆవేశంలో ఉనట్టు ఉన్నారు. లేదా నన్ను రెచ్చగొట్టడానికి విఫల యత్నం చేస్తున్నట్టు ఉన్నారు. తమరు ముందు ఆవేశం తగ్గించుకుని సావధానంగా 2008 తర్వాత విభూతి వచ్చింది అని ఫోటోలు పెట్టాను. నా సహనానికి పరీక్ష పెట్టాలి అని ప్రయత్నిస్తున్న మీకు ధన్యవాదాలు. చిత్రగుప్తుడు కాదు కదా యమధర్మ రాజు అన్నా కూడా నాకు భయం లేదు :) :D
తమరు ముందు ఆవేశం తగ్గించుకుని సావధానం టపా మొత్తం చదవండి :D
షిర్డి సాయిబాబా వారు తను 8 యేళ్ళ తర్వాత మళ్ళి పుడతానని చెప్పిన భక్తులు ఉన్నారండి. మనకు తెలియనివన్ని అబధ్ధాలనుకుంటేనే అది అజ్ఞానమవుతుంది. పోనీ మనకు నమ్మకం లేకపోయినా ఎదుటివారి మనోభావాలను కించపరిచమని సాయిబాబా కూడా చెప్పరు. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడమంటారు. కాదని అందరిలోనూ వ్యతిరేకత మాత్రమే చూస్తానని మనం అనుకుంటే మంచిని గాక చెడునే ఆశించే సూకరాలతో సమానమని చెప్పలేదా..ఆయన చెప్పిన రెండు ముఖ్యమని శ్రధ్ధ , సబరు అనేవి కొంతలో కొంతైనా పాటిస్తేనే కదా మీరు సాయిబాబా వారి మాటకు విలువిచ్చినట్లు.ఒక సత్పురుషుడి మీద, ఆయన మాట మీద నమ్మకముంటే మనకు నమ్మకం లేకపోయినా ఇంకొక మనిషిని తూలనాడలేము అని నేను నమ్ముతాను. ఎనీ వే, మీరు మంచి భావాలు కలవ్యక్తిగా అనిపిస్తున్నారు. ఆ భావాలు తప్పు దోవ పట్టకుండా ఆ బాబా మిమ్మల్ని సదా అదుపులో ఉంచాలని ప్రార్ధిస్తాను.
ముందుగా ఒకమహాభక్తురాలి కడుపున పుట్టిన శ్రీనివాస్ కు అభినందనలు. ఎన్నోజన్మలపుణ్యానగాని అటువంటి తల్లిదండ్రుల కడుపున జన్మించటం జరుగుతుంది.
సద్గురువులలీలలు మనకు అంత తేలికగా అర్ధంకావు . భగవదాదేశానుసారం వారు భూమి మీదకొచ్చిన కార్యక్రమాన్ని భిన్నమైన పద్దతులలో నిర్వహిస్తుంటారు. దీనిని జాగ్రత్తగా పరిశీలించి శాస్త్రములలో చెప్పబడిన పద్దతులలో పోల్చి నిర్ధారించుకోవాలి. అయితే కొద్దిగా అలసత్వం వహించినా మాయగాల్లంతా మహనీయులని భ్రమపడే అవకాశం ఉంది. ఇక కలి యుగ ధర్మం వలన మంచి చెడుగా చెడు మంచిగా తోచి మనలను గందరగోళపరచడం జరుగుతుంది.
మా వినుకొండలో ఇంటర్ చదివే రోజులలో కామ్రడ్ శివయ్యస్థూపం దగ్గర జననాట్యమండలి సభ్యులు సాయిబాబో...రా.... అంటూ పాటలుపాడుతూ ఆయనను విమర్శిస్తూ ,నీల్లను పెట్రోల్ గా మార్చావట
నిన్ను సముద్రంలో తోస్తే సముద్రమంతా పెట్రోలవుతుంది కదా అని విమర్శిస్తూ పాడేపాటలు విని ,మేమెదో గొప్ప పరిశొధకులమైనట్లు ఫీలై లోకంలో మహాత్ములందరినీ దొంగలని ,అసలిదంతా తప్పని వాదించే [అ]జ్ఞానులమైపోయేవాల్లం. వయస్సు ఉద్రేకం . యుక్తాయుక్తవిచక్షణా జ్ఞానం లేని పసి తనం . తల్లిని తిట్టే చిన్నపిల్లలా మహాత్ములనూ తిట్టేవాల్లం . ఆతరువాత తరువాత ఆమహాశక్తి ఉనికేమిటో అర్ధమవుతున్నకొద్దీ ఈ పైత్యజ్ఞానం తగ్గుముఖం పట్టిందనుకోండి ....అదివేరేవిషయం
అసలు దీనికి కారణం మేమారోజులలో చూసే సినిమాలలోను,వారపత్రికలలో బి.వి.పట్టాభిరాం గారిలాంటి మెజీషియన్ లు బూడిద,కానుకలు సృష్టించటం గూర్చి వ్రాసే వ్రాతలు ఇలా పలు అంశాలు .
అయితే ఈమధ్య నా పసితనంలో విన్న పాటలద్వారా ఏర్పడ్డ వికారం తొలగిందిలాగ .
సత్యసాయిబాబా జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఆయనకు పరమభక్తుడైన బివీపట్టాభిరామ్ గారు కొన్ని గొప్పవిషయాలు వివరించారు. అందులో ప్రముఖ సంపాదకుడు కరంజియా ఒకసారి పుట్టపర్తి రహస్యంగా పరిశీలించాలని వెళ్ళి ఆమహాత్ముని దివ్యచర్యలకు విస్మయమొంది ఆనక ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకుని చివరగా ఒక ప్రశ్నడుగుతాడు.
స్వామీ! మీరు నీటిని పెట్రోలుగా మార్చారని మీభక్తులంతారు కదా ? ఆపనేదో ఒక సముద్రాన్ని పెట్రోలుగా మారిస్తే ప్రపంచానికి సమస్యతీరుతుంది కదా ? అంటాడు .ఆయన వ్యంగ్యపూరితంగా అడిగినా మామనసులలో అజ్ఞానంతో పేరుకుపోయిన ప్రశ్న అది.
అప్పుడూ బాబా అంటారు.
ఓ తప్పకుండా మార్చొచ్చు . కానీ బంగారూ ! ఆతర్వాత ఎవడన్నా మూర్ఖుడు ఒక అగ్గిపుల్లగీస్తే
..... ?అని అడుగుతాడు .
అంతే ఈప్పటిదాకా నా సంకుచితత్వంతో ఇలాంటి సమాధానమే ఊహించని మెదడు మొద్దుబారిపోయింది అది చదివి. మహాత్ముల పని సృష్టి వికాశమే కాని వినాశం కాదనే ప్రాథమిక జ్ఞానం కూడా లేని అజ్ఞానిని నేనెంత నాబ్రతుకెంత మహనీయుల చర్యలలో లోపాలు వెతకటానికి.అని విపరీతమైన వేదనపడ్దాను.
ఇక్కడ మనం సద్గురువులబాటలో నడుస్తున్నమనే నమ్మకం మంచిదే . కాని నేను నడుస్తున్నదే సరైనబాట అనే అహం మనసులో ప్రవేసించనీయకుండా జాగ్రత్తపడమనే భరద్వాజ మాస్టర్ గారు హెచ్చరించారు పలుచోట్ల . ముందు వినయం .తరువాత వివేకం ,సునిశితమైన పరిశీలన ముఖ్యం .అదిలేకుండా వాదనలు పాపహేతువులు.
పూర్వకాలంలో అంతమంది మహాత్ములు సిద్దపురుషులను అనుసరించేవారున్నా వారి మధ్యవిబేధాలులేవు. కారణమేమిటి ? వివరించారు చాలాచోట్ల మాస్టర్ గారు.
మన ఆయువు చాలా చిన్నది . మనకున్నసమయం చాలా తక్కువ ,వెర్రి ఆలోచనలతో,స్వార్ధాలతో దైవమార్గగమనాన్నికూడా వ్యాపారసరళిలో కొనసాగిస్తూ ఎవడో మోసగానిని మహాత్ములుగా ,ఇంకొంచెంపైత్యం ముదిరితే దేవునిగా నమ్మి మోసపోయేవాల్లు, అలాగే సరైన పరిశీలనజరిపే ఓపికలేక ఆసక్తి .ఆశక్తి గాని లేక నాకు తెలియనిదంతా అబద్దం అనే వితండవాదులు ఇద్దరు కూడా సమయం వృధాచేసుకుంటారు తస్మాత్ జాగ్రత్ అని హెచ్చరించారు పెద్దలు. మంచి చర్చలో పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాస్ కు ధన్యవాదములు.
(సరైన పరిశీలనజరిపే ఓపికలేక ఆసక్తి .ఆశక్తి గాని లేక నాకు తెలియనిదంతా అబద్దం అనే వితండవాదులు ఇద్దరు కూడా సమయం వృధాచేసుకుంటారు)
On the otherhand సరైన పరిశీలనజరిపే ఓపికలేక ఆసక్తి .ఆశక్తి గాని లేక నాకు తెలిసిందంతా నిజం అనే తండవాదులు కూడా సమయం వృధాచేసుకుంటారే.
ఇవాళ మీరు రాసిన ఈ విషయాలు చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంది. మీ జన్మ ధన్యమయ్యింది. మీ తల్లిగారికి నా పాదాభివందనాలు. ఆ షిర్డీ సాయి వారి ఆశీస్సులు మీకు సదా లభ్యం కావాలి.
నిన్ననే ఈ వ్యాసం చూసాను. కామెంటు పెడదామా వద్దా అనే తటపటాయింపుతో ఆగాను. సరే, శీనుగారు మీ అమ్మగారికి కలుగుతున్న ఈ విచిత్రమైన అనుభవాలకు కారణం ఏమిటని మీ ఉద్దేశ్యం? నా వరకు అది భక్తియోగం. ఆ భక్తియోగానికి ఇలా విభూది రావటం పరాకాష్టగా మీ అమ్మగారు భావిస్తున్నారా అని ఓసారి అమ్మగారిని అడగండి. ఖచ్చితంగా కాదు అని చెబుతారు. ఎందుకంటే, ఆ భక్తియోగసాధనలో ఆమె మోక్షగామి కానీ కామ్యగామి కాదు. అలానే, మోక్షసాధనకు ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలోవే మంత్రసాధనలు కూడా. మీ ఇంట్లో విభూది ప్రకటితమయ్యింది కాబట్టి, ఆ భక్తియోగమార్గమే గొప్పదని, ఇతర మార్గాలు తప్పు అని మీరు చెప్పటం సరికాదు. సదా నా రక్షకుడు నా సాయిబాబా అని భక్తిప్రపత్తులు చాటుకుంటూ, ఆ సాయిబాబా ఆదర్శాలకు వ్యతిరేకంగా మరొకరి సాధనామార్గాన్ని కించపరచటంలోని ఔచిత్యం ఏమిటి?
Any ways, I leave it at this.
కిరణ్ గారిది మంచి ప్రశ్నే. మీ అమ్మగారికి పనిచేసిన మహాత్యాలు, మంత్రాలు, ఇంకొకరికి ఎందుకు పనిచేయవు? కొద్దిగా వివరిస్తారా?
@ SNKR పై టపాలో నేను ఎక్కడన్నా మంత్రం అనే మాటా వాడానేమో ఒక సారి వెతికి వచ్చి మళ్లీ ప్రశ్నించండి. మహాత్యానికి , మంత్రానికి తేడా ఉంది :))
దేవుడిని నమ్మిన వారికి జరిగిన మంచికి ,మాంత్రికుడి మంత్రాలకి లింక్ పెట్టకండి.
ఇక కొండముది సాయి కిరణ్ గారు , కుశాభావు కంటె గొప్ప శక్తి కలవారా ఈనాటి యోగులు???? ఎంతో మంత్ర శక్తి కల వాడిని అని చెప్పుకు విర్రవీగే కుశాభావుతో బాబా " నువ్వు మంత్రాలు అని వెటి గురించి అనుకున్తున్నావో అవన్నీ తక్షణమే వదిలేస్తే గానీ నామసీదు లోకి రావద్దు అన్నారు. అందుకు అంగీకరించి ఇక మంత్రం అనే మాట నా నోటివెంట రాదు అని కుశాభావు ప్రతీన చేశాక అతని చేత గురుచరిత్ర 108 సార్లు పారాయణ చేయించిన తర్వాత ఆదరించారు బాబా :) బాబా సైతం మాయలు మంత్రాలను వేశ్యా ప్రదర్శనలతో పోల్చారు .... ఆయన శిష్య పరమాణువు అయిన నేను ఎంత :)
బాబా సైతం మాయలు మంత్రాలను వేశ్యా ప్రదర్శనలతో పోల్చారు.
===
అది మంత్రాలను దురుపయోగం చేసే ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్న మాటలే కానీ, మంత్ర తంత్రాలను ప్రస్తావిస్తూ అన్న మాటలు కావు. వీలైతే, ఎవరైనా సంస్కృతపండితుడిని శ్రీ ఉపాసనీ బాబా వ్రాసిన సాయిబాబా స్తోత్రంలో ఉన్న మంత్రాల గురించి వివరించమని చెప్పండి. ఆ స్తోత్రంలో ఎన్ని కామ్యసిద్ధి కలిగించే బీజాక్షర సహిత మంత్రాలు ఉన్నాయో తెలుస్తుంది.
నిజానికి, ఆయన నిరసించింది మంత్ర తంత్రాలను కాదు. వామాచారంలో చేసే సాధనా పద్ధతులనే. జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు కూడా వామాచార పద్ధతిలో చేసే సాధనలను నిషేధించారు. వామాచారమంటే మీరు విమర్శించే చేతబడులు, బాణామతులు. వాటికి, దక్షిణాచారంలో చేసే మంత్ర సాధనలకు ఏమాత్రమూ సంబంధం లేదు.
పై స్టేట్మెంటుతో మీరు సాయిబాబాను వివాదాస్పదుడిగా చేయటం సరికాదు.
జస్ట్ ఫర్ ఇంఫర్మేషన్ కోసం : నాకు ఎనిమిదేళ్ళ వయసు నుండి నేను సాయి చరిత్ర చదువుతున్నాను. కొన్ని వేలసార్లు చదివి ఉంటాను. శ్రీ పత్రి నారాయణరావు గారు అనువదించింది, శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు వ్రాసినది, ఇంగ్లీషులో గుణాజీ గారు అనువదించిన గ్రంధాలు నేను చదివాను. గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సాయిబాబా మందిరం కట్టించింది మా అమ్మమ్మగారు (గుంటూరు జిల్లా, పొన్నూరు తాలూకా, నండూరు గ్రామం).
పై స్టేట్మెంటుతో మీరు సాయిబాబాను వివాదాస్పదుడిగా చేయటం సరికాదు.
______________________________________
అవును మరి నా తాజా పోస్ట్ లకి ఈ పోస్ట్ లకి లంకె పెట్టింది నేనే కదా . బాగుంది మేము బాబా భక్తులం కాబట్టి మంత్రగాళ్ళని నమ్మాలా? అంటే దేవుడిని నమ్మే వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పే అన్నిటికీ వంత పాడాలా? లేకపోతే వివాదం మీరు రాజేసి తర్వాత ఎదుటి వాడి మీదకి నేట్టేస్తారా?
ఏమిటీ మోహన క్రియ ప్రయోగించి ఒక వ్యక్తిని మోహంలో బందిస్తారా? స్తంభన క్రియ ఉపయోగించి గొంతు పెగలకుండా చేస్తారా? ఏందయ్యా ఆత్మలు తరిమి కొడతారా? విద్వేషణ క్రియ ద్వారా ఇద్దరు వ్యక్తులను విడగోడతారా?
క్రింద లైన్ మరీ ఫన్నీ
మారణ క్రియ:-- దీని వల్ల మరణాన్ని ఒక వ్యక్తిపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇది నేటి కేపిటల్ పనిష్మంట్ వంటిది. దీనిని తిప్పికొట్టటం వల్ల చేసినవారిమీద విరుచుకుపడి వారి ప్రాణాలే తీస్తుంది.
పై వంకర క్రియలకి బాబా కి పోలిక పెట్టి ఆయన్ని వివాదాస్పదుడిని చేసింది మీరు , నేను కాదు .... అడ్డంగా వాదించి మా నోళ్ళు నొక్కడానికి యత్నించకండి.
విష్ణు సహస్ర నామాలకి, లలితా సహస్ర నామాలకి , అమ్మవారిని స్తుతించే మంత్రాలకి .... వ్యక్తులను చంపే , అనారోగ్యపరచే , వశీకరణ, మోహన క్రియలకి పోలికా ?
నేను మాట్లాడిన దాన్లో తప్పు ఏదైనా ఉంటే ముక్కోటి దేవతల మీద ఆన రేపు ఈపాటికి నేను ఉండను :)
సత్య నారాయణ శర్మ చెప్పారు...
విష్ణు సహస్రనామం గురించి షిరిడీ సాయిబాబాగారు చెప్తే కాని మీకు తెలీలేదన్నమాట. తంత్రశాస్త్రం అనేది మన హిందూ మతంలోని అంతర్భాగం అన్న విషయం తెలీని మీలాటి కుహనా హిందువులకు షిరిడీ సాయిబాబాలూ, ఇమాం బుఖారీలే గతి.చివరికి జాకీర్ నాయక్ శిష్యులవుతారేమో జాగ్రత్త.
______________________________________
పై స్టేట్మెంట్ వివాదాస్పదం కాదా? బాబాని , ఇమాం భుకారీ తో పోల్చిన యోగి గారిని మీరు కనీసం ఒక్క మాట కూడా అనకపోవడం కడువిచారకరం.
కిరణయ్య మరి ఆ మంత్రాలు గట్రా ఔరంగజేబు మీదో, ఘజనీ మీదో, ఘోరీమీదో ప్రయోగించి బ్రామ్మల ఊచకోతని ఒక్కడూ ఆపలేదు ఎందుకనో..
మీ మంత్రాలు, తంత్రాలు నిజమైతే అజ్ఞాత రూపం లొ తకిటధిమి అనే బ్లాగ్ పెట్టరు కిరణ్ గారు. పూరిపాక బ్లాగు చూసి అతను భయపడి ఉండవచ్చు. తకిటదిమి బ్లాగు చూసి నేను భయపడను. హహహ
అంటే పూరిపాక బ్లాగు వ్రాసేది కిరణ్ గారా?!
శరత్ కెలుకుడు గుంపు కొట్టుకుని తమ రహస్యాలు అన్నీ బయట పెట్టేసుకుంటున్నారే, భలే ఉన్నది కానివ్వండి
ippudde satyannarayana sharma gari blog lo aa blog link chooshaanu. Saibaba Patam petti vibhoodhi saitam avamaninchadam lo sarma and gang enthakaina digajaaruthaaru annadi ardham avuthundi.
" మా బాబాది మహాత్యం, మీ మంత్రాలు మూర్ఖత్వం" ఇది మీ వరస. బాగుంది, పేడతో దాడికి తెగబడండి. మీ డాబా, బాబా అదే చెప్పాడేమో కదా. గే లగురించి డాబా ఏం చెప్పారు?
రేపీపాటికి నేనుండను, డాబా లో వుంటాను.
good job.
"మా బాబాది మహాత్యం, మీ మంత్రాలు మూర్ఖత్వం ఇది మీ వరస. బాగుంది, పేడతో దాడికి తెగబడండి. మీ డాబా, బాబా అదే చెప్పాడేమో కదా. గే లగురించి డాబా ఏం చెప్పారు?
రేపీపాటికి నేనుండను, డాబా లో వుంటాను."
haahaahaa good comment. You have no answer?
ఈ టపాకి సంబంధించినంత వరకు ఎన్ని కామెంట్స్ చేసినా నా సమాధానం ఓం సాయి రాం :)
నీవు ఎందులో వారికన్నా ఎక్కువని వాళ్ళనమ్మకాలను విమర్శిస్తున్నావు? నీ బాబా బూడిదకే శక్తివుంటే నీ బూతు నోట్లో బూడిద నిండుకునేది. నీలాంటి వాళ్ళు భక్తులుగా వున్న ఆ డాబా ఎంత దౌర్భాగ్యుడో.
నాతో ప్రాబ్లం ఉంటే నాతో పెట్టుకొండ్రా, నను తిట్టండి రా మధ్యలోకి బాబాని లాగుతారెంటి రా వెధవల్లారా
@ పైనున్న అజ్ఞాత ఏంటి నీ ప్రాబ్లమ్ .... తాజా పోస్ట్ లోకి రా చూసుకుందాం.
అనానిమస్ గాబూతు కామెంట్లు, స్వంత ఐడితో ఇంకోరి నమ్మకాలను అసహ్యంగా విమర్శించేటపుడు, నీకు ఆ సాయిరాం గుర్తుకు రాడా? ఎందుకీ దొంగ భక్తి? బూడిదలు కురిపించేది కాదు, నీ డాబా కే శక్తి వుంటే ఈనెలాఖరు లోపల నా మీద చూపించమని వేడుకో. లేకుంటే నీవు నీ చెత్త కుళ్ళు జోకుల బ్లాగులు వదిలేసి షిరిడీ వెళ్ళి ముష్టి ఎత్తుకో, బుద్ధి వస్తుందేమో చూతాము.
నేను అలాంటి పనులు చేస్తే ఆ తగలాల్సిన పాపాలు శాపాలు ఏవో నాకే తగులుతాయి మిస్టర్. నెలాఖరు లోగా నీ ప్రయోగించాలా?? అంతలేదు నాయన మాకు.
బాబాకి తెల్సింది ప్రేమ పంచడమే !! నేను షిరిడీ వెళ్లి ముష్టి ఎత్తుకోవాల్సిన రాత ఉంటే అంతకన భాగ్యం లేదు. నాకు బుద్ది వస్తుంది అంటే అదే పని చేద్దాం .
చివరిగా నీకు నాతో ప్రాబ్లం ఉంటే నాతో పెట్టుకో . మద్యలో ఇంకెవరూ వద్దు .
@Srinivas why don't you enable comment moderation or stop the comments for this post ?
Post a Comment