వైష్ణవి హత్య తర్వాత , చాలా మంది తమ ఆవేశం చూపించారు( టపాల్లో) మనమేం చేయగలం అని చాలా అర్ధవంతమైన చర్చ చేశారు . కొందరైతే ఏకంగా అలాంటి వాళ్ళని నరికి పోగులు పెట్టాలి అని , చట్ట్ట ప్రకారం శిక్షించాలి అని చాలా ఆవేశంగా లెక్చర్లు ఇచ్చారు. ఇప్పుడు మీ ( హైరాబాద్ వాళ్ళ)_ ఆవేశం చూపించే టైం వచ్చింది . హైదరాబాద్ మధురా నగర్ లో విముక్తి స్కూల్ లో చదివే శ్రీకార్ అనే నాలుగేళ్ల బాలుడిని భవానీ అనే టీచర్ విచక్షణా రహితంగా మర్మాంగాల మీద తన్నింది. రక్తం కారుతూ ఇంటికి వచ్చిన ఆ బుజ్జోడిని చూసి ఆస్పత్రికి తీసుకెళితే చావు తప్పి కన్ను లోట్టబోయినంత పనయిందట. ఇదేమని అడుగుదామని వెళితే స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల మీద దాడి చేశారట . చివరికి ఆసుపత్రి ఖర్చులు భరించేలా ఒప్పందం కుదిరిందట.
ఇదేం న్యాయం .... వాడికే ఏదైనా డామేజి జరిగితే అది మరో 20 ఏళ్ళ తర్వాత గానీ బయట పడదు ( వివరాలొద్దు) టీచర్ మీద అలాంటి స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జనాలు ఎవరన్న ఉద్యమించగాలరా???????. ఇది చిన్న విషయమని .... నాది అర్ధం లేని వాదన అని కొట్టిపారేయోద్దు. మనం కోరుకునే మార్పు ఇలాంటి చిన్న విషయాలలోనుండే రావాలి.
ఇక్కడ మరో విషయం : ఆడ పిల్లల మీద దాడులో.................. అని గుండెలు బాదుకునే ఫెనిమిస్ట్ లు ఈ సంఘటన చూసిన తర్వాతైనా మనుషుల మీద దాడులు అని తమ వాదన మార్చుకుంటారేమో చూడాలి. చాన్స్ దొరికితే ఆడది మగాడిని ఎక్కడ తన్నిద్దో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.

29 comments:
ముమ్మాటికీ చిన్న విషయం కాదు. కానీ మనుషుల్లో ఇంత రాక్షసత్వం ఎందుకు వస్తోంది. ఆ చిన్న బాబు చేసిన నేరమేంటీ అంత పెద్ద శిక్ష విధించడానికి?
అది పొరపాటున జరిగి ఉండొచ్చని ఎందుకు అనుకోకూడదు. ఆ టీచర్ కి కఠినంగా ప్రవర్తించిన చరిత్ర ఉందా.. గొడవ అవుతుందని తెలిసీ ఎవరైనా ఎందుకు అలా కొడతారు?.
నేను ఎప్పుడూ మొత్తుకునేది ఇదే! ఆడపిల్లలమీదైనా, మగపిల్లలమీదైనా , అసలు ఎవరి మీదైనా సరే..సమస్యను "మనిషి" కళ్ళతో చూడండి "ఫిమేల్" కళ్ళతో కాదు అని! రోడ్లమీద పారేసే పసి గుడ్ల విషయంలో కూడా ఇదే మాట నాది! బిడ్డను వద్దనుకున్న వాళ్ళు అది ఆడా మగా అని చూడరు."మాకు బతికే హక్కు లేదా" అని పారేయబడ్డ పిల్లలు అందరూ ప్రశ్నించాలి ..కేవలం ఆడపిల్లలే కాదు.
హైద్రాబాదులో అనేకచోట్ల బాల కార్మికులుగా ఉంది మగపిల్లలే! రోడ్లమీద చెత్త ఏరే పిల్లల్లో అధిక శాతం మగపిల్లలే! వాళ్ళు పిల్లలా కాదా అని చూడాలి కాని ఆడా మగా అని కాదు.
ఆ టీచర్ మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఇంకా ఎక్కువమంది పిల్లలు ఆ బంగారు తల్లి కోపానికి బలికాకముందే ఆమెను ఉద్యోగం లోంచి తొలగించి ఇంటికి పంపాలి.ఇలాంటి శిక్షలు విధించే టీచర్లు ఆడైనా మగైనా ఉద్యోగం తొలగించి సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. కాండక్ట్ బాడ్ అని రాయాలి.
ఆమె తన్నిన క్షణంలో ఆ పసి ప్రాణం బాధతో ఎంత విలవిల్లాడి ఉంటుంది?. కనీసం డాక్టర్ దగ్గరికైనా వాళ్ళు తీసుకెళ్ళకుండా ఇంటికి ఫోన్ చేశారని చదివాను. ఈ లోపు వాడికేమైనా జరిగి ఉంటే?మనుషుల్లో ఇంత రాక్షసత్వం ఎందుకు ఏర్పడుతుందో?
anonymas,
అసలు టీచర్ కి అంత కోపం ఎందుకు రావాలి నాలుగేళ్ళ పసి గుడ్డు మీద? తన్నడం అనేది ఎంత పాశవికం? అది పొరపాటు ఎందుకు అవుతుంది? గొడవ కాకపోయే పక్షంతో తన్నొచ్చా? ఇప్పుడు ఆ బాబు తల్లి దండ్రులు గమ్మున ఊరుకుంటే ఇంకోసారి కూడా ఆ టీచర్ ఛాన్స్ తీసుకుంటుందిగా?ఒకపక్కన రక్తం చిందే సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా చరిత్ర వెదకమంటారేం?
దారుణం. చదువు పేరుతో చిన్నపిల్లలను హింసించటం, ఒత్తిడి చేయటం హేయం.
ఎందుకు శ్రీనివాస్ ప్రతి విషయాన్ని ఆడ ,మగ అని విభజించి చూస్తారు..మనిషి లో రాక్షసత్వాన్ని ఎలా రూపుమాపాలో ఆలోచించాలి తప్ప ఇలా మీరంటే మీరని కొట్టుకోవడం వల్ల సమస్య తీరదు కదా...తెలంగాణ ,సమైక్య ఆంధ్రా సమస్య అయినా ఒక రోజున కొలిక్కి వస్తుందేమో కాని ఈ స్త్రీవాదం ,పురుషవాదం పేరు తో ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవడం ఎప్పుడు మారుతుందో కదా.. ఆ పొటొ చూడగానే నాకు ముందు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ..అయ్యో చిన్ని బాబుని ఎలా కొట్టిందో ,ఎంత బాధ పడ్డాడొ అని ..ఇలాంటివి జరుగ కుండా ఎంటువంటి చర్యలు తీసుకోవాలి.. స్కూల్ టీచర్స్ కు ఎలాంటి శిక్షణ నివ్వాలి ఇదీ మనం ఆలోచించాల్సింది..అంతే గాని ఏం మగ టీచర్లు చిన్నార్ల మీద అత్యాచారాలు చేయడం లేదా.. ఆడవాళ్ళు మగవాళ్ళను హింసించడం లేదా ఇది కాదు..కేవలం సమస్యని మాత్రమే చూడండి..వీలయితే పరిష్కారాలు ఆలోచించండి.. ఈ తరం వాళ్ళం ఈ తరానికి తగ్గట్టుగా ఆలోచిద్దాం .. ( నేను జ్యోతి గారి బ్లాగులో ఆ రోజు చర్చ కూడా చూసాను..ఎవరన్నా దీనికి పరిష్కారం ఇది అంటారేమో అని చూసా గాని కొట్టుకోవడమే సరిపోయింది.. చంటి పిల్లలు పురిటిలోనే చెత్త కుప్పల పాలైనపుడు దానికి కారణం అయిన వాళ్ళను చెంప చెళ్ళుమనిపించాల్సిందే,శిక్షించి తీరాల్సిందే.. దానికంటే ముందు సమస్య ఎక్కడ నుండి మొదలవుతుంది ఎలాంటి పరిష్కారమార్గాలున్నాయి అనేది ఆలోచించడం ముఖ్యం..
నేస్తం గారూ,
శ్రీనివాస్ చెప్తున్నదీ అదే! ప్రతి సమస్యనూ "మనిషి" సమస్యగా చూడమనే! ఆడా మగా జెండర్లు సమస్యకు ఆపాదించవద్దనే! జ్యోతి బ్లాగులో కూడా ఈ చర్చ చూసి ఈ గొడవ తేలేలా లేదని ఊరుకున్నా రాయకుండా!
సుజాత గారు నిజమే ,ఆ రోజు చర్చకు, ఆ తరువాత కొంతమంది వ్రాసిన కొన్ని పోస్ట్ లు చదివాక నాకు నిజం గానే తల నెప్పి వచ్చింది.. అర్రే ఏంటి ఈ గోల అని.. ఈ పోస్ట్ కూడా ఇలాగేనేమో అని పొరపాటున కోపం లో వ్యాఖ్య రాసేసాను ..శ్రీనివాస్ సోరీ ..ఈ సారికి క్షమించేసేయ్ :)
కోపంతో తల్లిదండ్రులు కొట్టినప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగొచ్చు. నిజంగా ఆ టీచర్ కర్కశి అయితే నిత్యం ఎవరో ఒక పసిపాప తట్లు తెలే దెబ్బలతో బయటకు రావాలి. అలాంటి చరిత్ర ఎమన్నా ఆ టీచర్ కి వుంటే మనుషుల కర్కసత్వం అన్న కొణంలో దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ తప్పించుకొజూసిన బాధ్యతారాహిత్యం కనిపిస్తున్నది(అది భయం వల్ల కావొచ్చు).
నంబరు ప్లేటు లెకుండా తప్పించుకొజూసిన వ్యక్తిని ఆపటానికి ప్రయత్నం లో జరిగిన దురదృష్ట సంఘటనను కూడా మీడియా పోలీసుల దౌర్జన్యంగా చిత్రీకరించింది. పొరపాటున తప్పు చేసిన, నెలకు 5000 రూపాయలు జీతంగల ఒక ల్.క్.గ్ టీచర్ దృక్కోణం లో అలోచిస్తే ఈ కోణం ఎందుకు పరిశీలించాలో తెలుస్తుంది. సెన్సేషన్ పరమావధిగా గల మీడియా కోణంతోనే ఆలోచిస్తే ఉద్యమాలు పోలీసు కేసులు మాత్రమే స్ఫురణకు వస్తాయి.
anonymas గారు,
అసలు స్కూళ్ళలో శారీరక శిక్షలు విధించడానికి వీల్లేదని చెప్తుంటే మీరు "పొరపాటు" అని వర్ణిస్తారేమిటి? ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల్ని తప్పు చేసినా,చదవకపోయినా శారీరకంగా శిక్షించడానికి వీల్లేదు.పైగా "కాలితో" తన్నడం అనేది ఎంత కోపం వస్తే చేసే పని? అంతకాని పని ఆ పసివాడు ఏం చేసి ఉంటాడో ఆలోచించండి.
ఒక రైమ్ చెప్పలేకపోవడమో ..మహా అయితే పక్క వాడిని గిల్లడమో! అవేమీ చేయకుండానే పెరిగి పెద్దయ్యామా మనం?
ఇక్కడ జరిగింది "పొరపాటు" కానేకాదు. నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం! అంత పసివాడిని కాసేపు నిలబెట్టడం కూడా శిక్షే క్లాసు రూములో! ఇక్కడ ఆమె నెలజీతం ఎంత తీసుకుంటుందన్నది ప్రశ్న కాదు.తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తూ పిల్లలకి విద్యాబోధనతో పాటు వాళ్ళని "పిల్లలు"గా చూసిందా లేదా అన్నది ఆలోచించండి!
ఇలా మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతే మర్డర్ చేసిన వాడిక్కూడా "నిజానికి చంపేంత కోపం లేదు గానీ ఏదో పొరపాటున జరిగింది"అని వాదించే అవకాశం ఉంటుంది.
నాకు తెలిసి నాలుగేళ్ళు కూడా నిండని పసి గుడ్డు మీద ఎంత కోపం వచ్చినా ఏ తల్లిదండ్రులూ ఈ రకంగా శిక్షించరు.
@స్వర్ణ మల్లిక గారు , గీతగారు , రమణ గారు స్పందించినందుకు ధన్యవాదాలు.
సుజాతగారు ,
అన్యాయం జరిగింది ఆడపిల్లకా , యువతికా , ముసలివారికా అనేది చూడడం మానేసి మనిషికి అపకారం జరిగింది అనే భావన అందరికీ వచ్చిన నాడు తప్పులు జరగడం కూడా తగ్గిపోతాయి.
నా అభిప్రాయాలతో ఏకీభవించినందుకు ధన్యవాదములు
నేస్తం గారు
ఈ సారన్నా నా టపా పూర్తిగా చదివి కామెంటండి :-
)
అజ్ఞాత గారు
పొరబాటున చంపేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా ???? టీచర్ కి కఠినంగా ప్రవర్తించే చరిత్ర ఇక ముందు మొదలవ్వోచ్చేమో ఎవరు చెప్పారు ?
మీరు ఈ సంఘటన ను ఏదో సంఘటనతో పోలుస్తారేమిటి ???? నెలకి 5000 తెసుకునే టీచర్ అయితే ఒక కోణం .... 150000 అయితే ఒక కోణం .... ఏంది ఈ కోణాలు ? కొలబద్దలు ?
పిల్లోడిని యెగిరి తన్నిన్దిరా స్వామే అంటుంటే చరిత్ర , కోణాలు కోడిగుడ్డు అంటారేంటి మీరు మా ప్ర.నా అన్నాయి లాగా
నేస్తం గారు సారీ అన్నారా సోరీ అన్నారా??
కఠినంగా అన్నదాన్ని నిర్వచించండి. హత్యానేరం మోపాలంటారా మీరు. లేదా ఆమెను వుద్యోగం నుంచి తీసెస్తే అది కఠిన శిక్షా?.
కుర్రాడిని అడిగితే టీచర్ కొట్టిందని చెప్పి వుంటాడు. ఈనాడు తన్నిందని రాసింది. మీరు "ఎగిరి తన్నింది" అంటున్నారు...
పొరపాటున ఒకరు చంపబడితే ఏ న్యాయ శాస్త్రం ప్రకారం కూడా అది హత్య అవ్వదు. మీరు లేవనెత్తిన ఇది కూడా నా వాదనను బలపరిచేలాగే వుంది. మీడియా బాధ్యతా రాహిత్యం చెప్పటం కోసం వరంగల్ ఘటన ప్రస్తావించాను. ఇలా ప్రవర్తిస్తున్న మీడియా వార్తను పట్టుకొని మీరు వుద్యమాలు అంటె ఈ కోణం లో ఎందుకు అలోచించరు అని అడిగాను. మీ వుద్దేశం ఆడ, మగ అని చూడకూడదు అని ఎత్తి చూపటం మాత్రమే అయితే నా వాదన ఇంతటితో ముగిస్తాను.
>>>ఈ సారన్నా నా టపా పూర్తిగా చదివి కామెంటండి
అంటే ఎప్పుడూ నేను చదవకుండా కామెంటేస్తాననా :)
మరేం చేయను జ్యోతిగారి బ్లాగ్‌లో ఆ రోజు మీ అందరి ఆవేశం చూసాకా , ఆ తరువాత ' కొన్ని ' అర్ధం పర్ధం లేని పోస్ట్‌లను చదివాక ,ఇంకా మీ పోస్ట్ టైటిల్ చూసాకా ఇంక విసుగొచ్చేసి శ్రీనివాసే కదా ఒక సారి తిట్టేసి కాస్త ప్రశాంతత పొందుదాం అని కామెంటెను.. sorry నే :)
గౌరవ అజ్ఞాత గారు ....
ఆమెని శిక్షించి తీరాలి ... అసలు స్కూళ్ళలో శారీరక శిక్షలు విధించడానికి వీల్లేదని ఎన్ని సార్లు మొత్తుకున్నా పిల్లలని కొట్టడం ఏమిటి. అసలు కొట్టడం అనే దాన్ని తీసి పక్కన పెడితే ఇవన్నీ ఉండవ్ కదా. అంట బుజ్జి పిల్లాడిని కొట్టాల్సిన అవసరం ఏంటి ? ఆవిడకి మరణ శిక్ష విధించనవసరం లేదు అలాగని గుడ్డిగా శిక్ష అని అనలేము కానీ మరోసారి ఇంకొకరు ఇలాంటి దురాగతానికి పాల్పడకుండా కేసు నమోదు చేయాలి, విచారణ జరపాలి , కోర్టు మెట్లు ఎక్కించాలి ఆవిడ ప్రవర్తన అంచనా వేయాలి తర్వాత తగిన శిక్ష విధించాలి. ముందు ముందు టీచర్ల ఎంపికలో కొన్ని మార్గదర్శకాలు స్కూళ్లకు ఇవ్వాలి .
కొడితే తగిలే ప్లేసులకి , తంతే తగిలే ప్లేసులకి తేడా ఉంటుంది. కాస్త గమనించండి.
మీడియాని తీసి పక్కన పెట్టండి కాసేపు వేరే టాపిక్స్ వద్దు . ఆడ మగ తేడా గురించి నేను చెప్పింది కేవలం రెండు లైన్లు అది కూడా కొందరు ఇస్టులకు మాత్రమె .. దాని గురించి చర్చ పక్క దారి పట్టనక్కర లేదు.
మనిషి మీద జరిగిన దాడి అన్నదానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను.
ఈ టపా మీద ఇంకా రాసేది ఉందికానీ, చర్చ పక్క దారి పట్టకుండా ప్రస్తుతానికి వదిలేస్తున్నాను.
అన్నట్టు, ఆరోజు జ్యోతిగారి బ్లాగులో చివర్లో మాంచి అవిడియా ఒకటి ఇచ్చాను చూశారా? :)).
ఆడైన మగైనా తప్పు జరిగితే సమాన శిక్ష ఉండాలి..
అదే పిల్లడి స్దానం లో పాప ఉండి టిచర్ స్ధానం లో మాస్టారు ఉండి ఉంటే మహిళ సంఘాల కు పోడుచుకోని వచ్చేది...రచ్చరచ్చ చేసుంటారు...
ఇంతకన్న నేను ఏమి చెప్పాను బాబు అసలే ఇక్కడ రచ్చరచ్చ గా ఉంది
అది పొరపాటున జరిగి ఉండొచ్చని ఎందుకు అనుకోకూడదు. ఆ టీచర్ కి కఠినంగా ప్రవర్తించిన చరిత్ర ఉందా.. గొడవ అవుతుందని తెలిసీ ఎవరైనా ఎందుకు అలా కొడతారు?.
----------------------------------
ఈ వాక్యం రాసిం అడో మగో నాకు తేలిదు కాని మగావాడైతే అతన్ని కుడా తన్ని పోరపాటు అంటే అప్పుడు తేలుస్తుంది ఆ కుర్రోడి బాధ..ఇక అడవారి రాసుంటే .....(వద్దులేండి బుతై పోద్ది)...
First ban that school and cancel the licence for recruiting the untrained teachers and attacking their parents.
The teacher must be imprisoned for at least 5 Years.
ఇక్కడ టీచర్ కోపానికి ఇంతగా హింసించబడ్డ పసిపిల్లవాన్ని చూస్తుంటే నిజంగా ఈ చదువుల కర్మాగారాలను మూసివేయాల్సినదేనని పిస్తోంది. మానవతను మరచిపోయేలా చేస్తున్న ఈ పరుగు ,వ్యాపారం తప్ప వేరే ఉన్నతలక్ష్యం లేని ఈ చదువుల పరిశ్రమ ఎన్ని అనర్ధాలను తీసుకువస్తుందో ఇదొక ఉదాహరణ . ప్రతిరోజో ఎక్కడొ ఓచోట ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తూ ఈ చదువులతో మనకెంతప్రమాదమో హెచ్చరిస్తూనే ఉన్నాయి.
ఈ చిన్నవయస్సులో ఆడుతూ పాడుతూ తూనీగల్లా పిల్లలు స్వేఛగా విహరిస్తూ ,తమతమ ఓహాలోకాల్లో పక్షులలై ఎగురుతూ ,కనిపించిన ప్రతిదాన్నీ ఉత్సహంగా ప్రశ్నిస్తూ నేర్చుకోవలసిన సమయము. కానీ ఏం జరుగుతోంది? ఎగిరే పక్షి రెక్కలను యూనిఫార్మలతోటీ చుట్టగట్టి టైతోబిగించి బూట్లతో బంధించి మూర్చరోగిలా బిల్లలు మెడలో వేలాడదీసి కట్టి కొట్టి కూర్చో బెట్టి బలవంతపు ఫీడింగ్ కుక్కుతున్నాము మెదడులో . ఎల్కేజీ నుండే ఎంసెట్ కోచింగ్ ఇవ్వగల పాఠశాలలకే ప్రాధాన్యత తల్లిదండ్రులిస్తారు కనుక అంతకంటే ఇంకా మంచి ఆఫర్లు ఇవ్వటానికి పీటీ పడే ఈ వ్యాపార సంస్థలు కొత్తకొత్త ఆలోచనలు చేస్తాయి. పిల్లవాడి సృజనాత్మకత ను చంపి ,మారకులు ర్యాంకులు వారానికొక పరీక్ష రోజురోజూ మూల్యాంకనం ....ఇలా దిక్కుమాలిన విద్యబోధనలో వాడు పిల్లవానిగా పుట్టటమే నేరమై నిరంతరం హింసించబడుతూనే ఉన్నాడు.
ఇక పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని వారి ని తీర్చిదిద్దాలసిన ఉపాధ్యాయులు ఈ వ్యాపార చట్రం లో కనిపించే అవకాశం లేదు. మేనేజ్ మెంట్ నిర్దేశించిన లక్ష్యాలప్రకారం పిల్లవాన్ని ఎలాపిండాలి ? ఎలా బట్టీపట్టించి కక్కించాలి? ఇవితప్ప వేరే లక్ష్యాలు లేనప్పుడు ,వచ్చే చాలీ చాలని జీతాలు ,ఎప్పుడుంచుతారో తీసేస్తారో తెలియని అభద్రతా భావం తో తన ఇంట సుఖశామ్తులు లేణి టీచర్లు ప్రశాంతంగా ఉండలేరు. దానివల్ల ప్రేమభావన అడుగంటి రాక్షసత్వం చోటూచేసుకుంటుంది . ఎవరు విద్యాబోధన చేయాలో ,కొన్ని ప్రమాణాలున్నాయి . కానీ అన్నింటికన్నా తేలికైనది విద్యాబోధన అనే దురభిప్రాయం పాతుకుపోయి ఎవరుబడితే వారు ఉపాధికోసం ఈరంగం లోకి రావటం కూడా ఈ అనర్ధాల కారణాలలో ఒకటి.
ఇలా ..... విశ్లేషించుకుంటూ బోతే చాలా కారణాలున్నాయి. ఈకారణాలేవీ తెలియని బాల్యం అమాయకంగా ఏమిటి మాకీ శిక్ష అని రోదిస్తూనే ఉంది . ఇలాంతి వత్తిడి చదువులలో పెరిగి మనసు మొద్దుబారి సమాజ హింసకులుగా తయారవుతున్న తరాలు పెరుగుతున్నాయి . ఇవేవీ పట్టని మనం మావోడూ అమెరికాపోవాలె ? తల్లికడుపులోంచే డిగ్రీలతో పుట్టాల్సింది అని ఆవేదన పడుతూ ఎండమావులవెంట పరిగెడుతూ పిల్లలను పరిగెత్తిస్తూనే ఉన్నాము ........

చాలా దారుణం.ఆ టీచర్ ని శిక్షించాల్సిందే. పిల్లాడు తప్పుచేస్తే బెంచిమీద నిలబెట్టడం,గుంజీలు తీయించడం చెయ్యాలి గానీ....ఇదేమిటి?ఎంత కోపం గా వుండి వుండకపోతే అలా తన్నుతుంది?కొంతమంది అన్నట్టు మగ టీచర్ అయ్యుంటే ఇంకా ఎక్కువ రాద్ధాంతం చేసేవాళ్ళేమో.కానీ ఇలాంటి సంఘటనలను మనిషి దృష్టిలో చూడాలి.
When I asked the question "What could we do?", you and Srinivas Pappu responded positively and you even agreed to start the "Child Watch" on an experimental basis in Ongole right? I dont understand what made you criticize it now.
I still ask the same question - What can we do about this?
ఆడ పిల్లల మీద దాడులో.................. అని గుండెలు బాదుకునే ఫెనిమిస్ట్ లు ఈ సంఘటన చూసిన తర్వాతైనా మనుషుల మీద దాడులు అని తమ వాదన మార్చుకుంటారేమో చూడాలి.
i agree.
ఆల్రెడీ వైష్ణవి హత్య ఉదంతంతో... మనం అందరం బ్రతుకుతుంది అడవి మృగాల మధ్య అని తేలిపోయింది. మృగాలు ఇంతకన్నా ఏం చేయగలవు కనక! ఇంకా ఇలాంటి ఎన్ని దారుణాలు చూడాలో!
ఆ పిల్లవాడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా.. అంత దారుణంగా కొట్టటం మృగత్వమే. పొరపాటు జరిగింది అనుకోవటానికి కూడా... అసలు కొట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి?
పిల్లలు మనలా కాదు కదా ... వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోగల జ్ఞానం ఉంటుంది. దండించాల్సిన పని లేదు.
మార్పు రావాలి. చూసే జనాల్లోనే కాదు.. ఆ పిల్లవాడి తల్లితండ్రులలో కూడా. హాస్పిటల్ ఖర్చులు కాదు కదా ఇక్కడ సమస్య, అవి వాళ్ళు పెట్టుకుంటారని వదిలేయటానికి.
last line bagundhi
Post a Comment