అవి నేను పంతొమ్మిది -ఇరవై ఏళ్ళ వయసు మద్య నేను కుర్రపిల్లాడినా లేక పెద్దకుర్రాడినా అన్న మీమాంస లొనుండి పూర్తిగా బయటపడని రోజులు. అందరు అబ్బాయిలలాగే అమ్మయిలవంక తిరిగి తిరిగి చూసేవాడిని. మనలో మనమాట నాకూ ఒక గాళ్ ఫ్రెండ్ ఉండి తీరాల్సిందే అన్న ఆలోచన మనసులో బలంగా ఉండేది. కానీ ఎప్పుడూ ఏ అమ్మాయి వెనక వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ... వెళ్ళాలనిపించలేదు, ఆ అమ్మాయి హార్ట్ ని టచ్ చేయలేదు అనే టైపు సినిమా డైలాగులు చెప్పనుగానీ ప్రత్యేకించి పలానా అమ్మాయికి ఫిక్స్ అవడంలో నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్న టైం అని చెప్పుకోవచ్చు. జీన్ క్లాడ్ వాండమ్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ల సినిమాలు చూసి పూర్తిగా ఇన్స్పైర్ అయ్యి ఉదయాన్నే ఐదున్నరకి జిమ్ కి వెళ్లడం,కండలు కరిగేలా కసరత్తులు చేసి ఎనిమిదింటికి ఇంటికి రావడం ...ఏదో వెళ్ళాం అన్నట్టు కాలేజికి వెళ్లడం.... మద్య మద్యలో అమ్మాయిలకి బీట్లు కొట్టడం..ఇలా సాగేది దినచర్య.
సాయంత్రం అయ్యేసరికి గోడల మీద కూర్చుని వచ్చేపోయ్యే అమ్మాయిలకి బీట్లు కొడుతూ .....కామెంట్స్ విసుర్తూ వాళ్ళు తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తే ఒకటికి పదిసార్లు చెప్పుకుని నవ్వుకోవడం వంటివి చేసే తరహా సగటు ఆంధ్రా కుర్రాళ్ళ బ్యాచే మాదికూడా. సైకిల్ మీద వెళుతుంటే అమ్మాయి ఎదురుగా వచ్చేటప్పుడు అమ్మాయినే చూస్తూ ఉండగా ....దగ్గరగా వచ్చాక ఆ అమ్మాయి ఒక్క క్షణం చటుక్కున మనవైపు చూసి ఇద్దరి చూపులు కలుసుకుని మరుక్షణం ఆమె చూపులు తిప్పుకునే లోపు ఆ కళ్ళు కలిసిన టైంలో ఉండే జిల్ బలే ఉంటుందిలే. అలాంటి ప్రేమదేశం తరహా సంఘటనలు మనకి కోకొల్లలు. అంతకుమించి కధ ముందుకి వెళ్ళదు. ఆళ్ళు మనల్ని చూడడం మనం ఆళ్ళని చూడటం.
ఆలా సరదాగా రోజులు గడిచిపోతున్న సమయంలో ఒకరోజు మా కాలనీలొ చివరగా ఉండే ఇల్లు, అదీ గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఒక పెద్దఇంట్లోకి ఎవరో సామాన్లు మోసుకోవడం కనిపించింది. మరుసటి రోజు ఉదయాన్నే నేను జిమ్ నుండి వస్తుండగా ఆ ఇంట్లో ముందు వరండాలో ముగ్గురు అందమైన అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు.చాలా చక్కగా ఉన్నారు. అప్పటివరకు మేము ఒంగోల్లో అలాంటి అందగత్తెలని చూడలేదంటే నమ్మండి. నిజం చెప్పొద్దూ ఇక్కడే విధి తనపని తాను కానిచ్చింది అదేంటంటే ... ఇంత అందమైన అమ్మాయిలు అసలు మనవంక చూస్తారా .... అసలు మనల్ని పట్టించుకుంటారా ... అనవసరంగా మనం దేబిరిచ్చుకుని చూడటం తప్ప అనుకుని అసలు వాళ్ళని గమనించనట్టే వెళ్లిపోయా. కాస్త ముందుకి వెళ్ళాక మా సెంటర్ లొ కుర్రాళ్ళ మద్య బీబత్సమైన డిస్కషన్ జరుగుతుంది.
నేను ఊహించింది నిజమే మనోళ్ళు ఆ అమ్మాయిల గురించే ఒక రేంజిలో చర్చలు జరుపుతున్నారు. వాళ్లకి పాలు పోయడానికి కుదిరిన బర్రెల వెంకాయమ్మ ద్వారా మనోళ్ళు లాగిన విషయం ఏంటయ్యా అంటే ఆ అమ్మాయిలు ముగ్గురూ కజిన్స్ అనమాట అంటే ఆ ముగ్గురి తల్లులూ అక్క చెల్లెళ్ళు. వాళ్ళ మేనమామది ప్రేమవివాహం అవడం వల్ల బిడ్డ పుట్టినా ఆయన భార్య తరపువాళ్ళు ఎవరూ సాయానికి రాకపోవడం వల్ల వీళ్ళు వాళ్ళ అత్తకి తోడుగా ఉండటానికి వచ్చారు.పైగా వాళ్ళు నార్త్ ఇండియన్స్. కానీ చిన్నప్పటి నుండి ఆంధ్రాలో పెరగడం వల్ల తెలుగు అమ్మయిలలాగానే మాట్లాడతారు అన్నది సారాంశం.
చర్చలు ముగిశాయి .... తర్వాత ఆవిషయమే మర్చిపోయా .. మరో రెండు రోజుల తర్వాత నేను, మా ఫ్రెండ్ తమ్ముడు రాజేంద్ర గాడు సినిమా చూసి నడుచుకుంటూ వస్తున్నాము. ఆ ఇల్లు దగ్గర అమ్మాయిలని దూరంగానే చూశాను కానీ పట్టిచ్చుకోవడం అనవసరం అనుకున్నాగా అనుకుని మామూలుగా వచ్చేస్తున్నా .... " అన్నా ఆ అమ్మాయి నిన్ను తెగ చూస్తుంది అన్నా " అన్నాడు రాజేంద్ర . "ఏ అమ్మాయిరా" అన్నాను.అప్పటికే మేము ఆ ఇల్లు దాటి వచ్చేశాం. " అదే అన్నా ఆ చివర ఇంట్లో అమ్మాయి" అన్నాడు. "మనల్ని కాదేమోలేరా" అంటూ ముందుకే నడిచా ... వాడు వెనక్కి చూస్తూ "అబ్బా నిన్నే అన్నా నేను బాగా గమనించా కదా కావాలంటే చూడు" అన్నాడు. తల తిప్పి చూశా.............. అక్కడ .............( ఇంకా ఉంది )
21 comments:
1st comment nade seenu
లవ్ స్టోరీనా, రాయండి రాయండి, అంతా అయిపోయాక వీటన్నింటినీ ప్రింట్- అవుట్ తీసి పెట్టుకుంటా, మీరు ఎప్పుడైనా బ్రహ్మీల మీద సెటైర్ వేసినప్పుడు ఈ వాటన్నింటినీ మీ అవిడకి ఒక ఆకాశరామన్న ఉత్తరం లో పంపిస్తా ... :D
@ ఆకాశరామన్న
:) yes yes.. you must ;)
పిల్లకాకుల గోల పట్టించుకోకన్నా :)
తర్వాతేమైంది?
తర్వాత ఏమైంది?
>>>>ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ... వెళ్ళాలనిపించలేదు, ఆ అమ్మాయి హార్ట్ ని టచ్ చేయలేదు అనే టైపు సినిమా డైలాగులు చెప్పనుగానీ
ఇవన్నీ సినిమా డైలాగ్స్ ఆ ఎంత పని అయ్యింది శ్రీనివాస్ :(
బాగుంది శ్రీనివాస్ గారు.. మరి తర్వాత కథ ఎప్పుడు పంచుకుంటారు మాతో..? వెయిటింగ్ ఇక్కడ..:)
@ వీరు
మనదేమన్నా జాజిపూలు లేక తోటరాముడి బ్లాగా మొదటి కామెంట్ కోసం పోటీ పడటానికి :P
@ ఆకాశరామన్న గారు,
ఏమిటి ఈ ఎమోసినల్ అత్యాచార్
@ పి.కా. కృష్ణ గారు
అవన్నీ మర్చిపోండి :)
@ తిరు
తర్వతేమైనదో తర్వాత చెప్తా
@ అజ్ఞాత , మీకూ అదే ఆన్సర్ :D
@ నేస్తం మేంసాబ్
అరే భాయి మీకి సిన్మా డైలాగ్ ఎట్లా ఉంటై తెల్వద్ అంటే హేట్లా
@ మనసు పలికే గారు ,
తర్వాత కధ త్వరలో పంచుకుంటా మీరు ఖంగారు పడి కామెంట్ డిలీట్ చేయకండి :P
ఆ అమ్మాయి నిజంగానే నా వైపు చూస్తోంది. మా వాడి దూరదృష్టికి నాకు ముచ్చటేసింది. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఆ అమ్మాయి వైపు నడిచాను. ఆమె సిగ్గుతో బొటనవేలితో నేలను రాస్తోంది. ఒంగోలు మొత్తానికి పొడిచేసే ధైర్యవంతుడిని అని మన ఫీలింగు కదా. అదేంటో మరి ఆ క్షణం నాకు నోట మాట రాలేదు. ఆమె నేలను గోకుతూనే ఉంది.
రాజేంద్ర గాడు మోచేత్తో డొక్కలో పొడిచాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాను. అప్పటికి ఆమె నేలను గోకీ గోకీ ఇంకుడు గుంతను తయారు చేసింది. కాసేప్పోతే అక్కడ చెక్ డ్యాం కట్టాల్సి వస్తుందని భయపడి ఎందుకండీ అలా నా వైపు చూస్తున్నారు అని అడిగాను.
ఆ అమ్మాయి ఇంకుడు గుంత తవ్వడం ఆపి నా వైపు తలెత్తి చూసింది. జిం కు వెళ్ళి కండలు కరిగించే వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నాను. నార్త్ ఇండియాలో జిం కు వెళ్ళి కండలు పెంచుతారు. చిన్నపుడు మా ఊర్లో ఓం ప్రతాప్ ఖర్మ, వేద ప్రతాప్ ఖర్మ అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లు కండల్ని కుండల్లా పెంచారు. ధనిక భూస్వామ్య బూర్జువాల్లో ఇది చాలా మామూలు విషయం. నేను నిద్ర మత్తులో ఉన్నపుడు ఇలా దారిన పోయేవాళ్ళని చూస్తుంటాను. నాకు నిద్ర పోయింది ఇంట్లోకి వెళ్తున్నా టాటా బై బై అని వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయిని కాదు ఈ జఫ్ఫా గాడిని తన్నాలి అని పక్కకు చూసాను రాజేంద్ర గాడు ఎప్పుడో జంప్...
@ Durabhimani
రాను రాను సరసాలవర్మకి డూప్ లా కాక సరసాలవర్మలా తయారవుతున్నారు
seenu garu, thanks for ur compliment
తర్వాత ఏమైంది?
దురాభిమాని గారూ,
చాలా బావుంది మీ కంటిన్యుయేషన్. దాదాపు శీనన్న్న రేంజ్!
"ధనిక భూస్వామ్య బూర్జువాల్లో ఇది చాలా మామూలు విషయం. "
ఎక్కడో చదివినట్టుగా ఉందే?
సరసాలవర్మ ఎవరు????
ఆకాశరామన్నా...నువ్వు అలాగే ప్రొసీడ్ అన్నా...
శ్రీనన్నా...మొన్న అభాండాలు వేసాుగదయ్యా..అందుకే అనుభవించురాజా...అనభవించురాజా...
అయ్ బాబోయ్...రాయుడుగోరు పెదరాయుడయ్యారాండే..సానా సంతోషమండి. బలాగు ఎదో మొదలెట్టాడు పెద్దపనిలో పడి ఈ సిన్న పనుల్ని మర్సినారేటండె...
tarvata tarvata
ఆ ....అక్కడ ??
@srinivas........
mee posts chaala baaguntayi......
@durability
continuation iragadeesaaru..........
endi comments em sariga kanapatledu...evvaru em cheppatledhantabba??
త్వరగా రెండవ భాగం రాయండి.
Last comment kuda nade
Post a Comment