పిల్లలలో కొరవడుతున్న భక్తిశ్రద్ధల గురించి ఒకరోజు నాకు మిత్రునికీ మద్య చర్చకి వచ్చింది. చర్చలో మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు. దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ సంస్కృతం అందరికీ మద్య వారధిలా ఉండేది . ఆ సంస్కృతం పోయి ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాక సంస్కృతం అలవాటు లేక సంస్కృతంలో ఉన్న క్లిష్టమైన సహస్రనామాలు , అష్టోత్తరాలు వాళ్లకి అర్ధం కాక ఇదేదో మనకి సంబంధం లేని విషయం అనుకుని వదిలేస్తున్నారు అని. హమ్ నిజమే చాలామంది ఎకాడికీ ఈ జనరేషన్ ని ఆడిపోసుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు కానీ అసలు పిల్లల సమస్యని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా ప్రవర్తిస్తున్నారు అనేది నా అభిప్రాయం.
ఇప్పుడు కొత్త జనరేషన్ కి సంస్కృతం అలవాటు చెయ్యడం అనేది మనవల్ల కాని పని........... అది అందరికీ తెల్సు . ప్రస్తుతం ఎంత ఆంగ్ల మాధ్యమంలో చదువులు అయినా ఇంట్లో మాట్లాడుకునేది తెలుగులోనేగా ? దేవుడికి దణ్ణం పెట్టుకునేది తెలుగులోనేగా........... మరి అలాంటప్పుడు రామాయణ, భాగవత , భారతాల లాగా మన విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, మంత్ర పుష్పాలు అన్నీ ఎందుకు తెలుగులో అనువదించకూడదు. మాతృభాషలో భక్తిని పరిచయం చేస్తే ఏ పిల్లవాడు కూడా దైవానికి దూరం జరగడు అనిపిస్తుంది.
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అనుకోవడం లొ ఎంత ఆనందం ఉంది . మా ఇంట్లో రోజూ మా అమ్మ విష్ణు సహస్ర నామం చదువుతుంది కానీ మాకు ఒక్క ముక్క అర్ధం కాదు. లక్ష్మీ అష్టోత్తరం కూడా బట్టీ పట్టి నేర్చుకున్నా . కానీ నేను ఏం చదువుతున్నాను అనేది నాకే తెలీదు. ముఖ్యంగా ఒక చోట నృపవేశ్మ గతానంద అని ఉండాల్సిన చోట ప్రింటింగ్ మిస్టేక్ నృపవేస్య గతానంద అని ప్రింట్ చేశాడు . శివశివా అమంగళం ప్రతిహతమగుగాక .
కానీ సాయిబాబా చాలీసా , దశ నామాలు వంటివి ఒక్కసారి చదివితే సులువుగా అర్ధమవడం , అందులొ భావం మనసుకి హత్తుకోవడమే కాక అయన యెడల భక్తి మనస్సులో దృడంగా పాతుకుంటుంది.
అందుకే ఇకపై మాతృభాషలో పూజిద్దాం . పెద్దలు సంస్కృత పండితులు ఎవరైనా పూజా సంభంద విషయాలు తెలుగులో స్ప్రష్టంగా అర్ధమయ్యేలా అనువదిస్తే గ్రామగ్రామాన వాడవాడలా అందరికీ సులభంగా అర్ధమవుతూ భక్తి ప్రపత్తులు ఇనుమడయ్యే అవకాశం ఉంది.
ఈ విషయమై నేను ఒక మిత్రునితో చర్చిస్తే " మొదలు పెట్టావా బ్రాహ్మల పొట్ట గొట్టడం " అనేశాడు. ఎందుకలా అన్నాడో నాకు అర్ధం కాలేదు. తర్వాత తర్వాత ఆలోచించగా అర్ధం అయింది అనుకోండి. కానీ శూద్రులు వేదమంత్రాలు చదివేదరు అని బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు కదా :)
16 comments:
:) :) :)
మీరన్నదే తాడేపల్లిగారు కూడా మొత్తుకుంటూంటారు.
మంచి టపా .
కవిత గారు :))
అజ్ఞాత గారు తాడేపల్లి వారు రాసిన విషయం మొత్తం చదివాక నాకు వ్యవహారం పూర్తిగా బోధపడింది :)
రెండో అజ్ఞాత గారు ధన్యవాదాలు :))
yes, తాడేపల్లి గారు కూడా ఇదే అంటారు,. తెలుగులోనే శ్లోకాలన్నీ ఉండాలనీ, మన భక్తి అంతా తెలుగులోనే దేవుడికి విన్నవించాలనీ!
ఈ మధ్య తెలుగు బాట లో కల్సినపుడు కూడా ఇదే విషయం చర్చకు వచ్చింది
సుజాత గారు ,
మరి మీరేమంటారు :))
ఓ బొజ్జ గణపయ్య వంటి పాటలు ఓకే గానీ మిగతా పూజలూ, విష్ణు సహస్ర నామాలు వంటివి సంస్కృతంలో ఉంటేనే బావుంటుందంటాను.
క్షీరోదన్వత్ ప్రదేశే శుచి మణి విలసత్సైకతే మౌక్తికానాం.." ఇది విష్ణుసహస్ర నామంలో ధ్యానం ప్రారంభ శ్లోకం! తెలుగులో అర్థం రాసుకుని చదవడం కంటే అర్థాన్ని ఆకళింపు చేసుకుంటూ సంస్కృతంలో చదివితేనే బాగుంటుంది కదా!
శబ్దోఛ్ఛారణలో సంస్కృతానికి ఒకప్రత్యేకత ఉంది . పావుగంపాటు ఆపకుండా సమ్స్కృతాన్ని పైకి వినపడేట్టు పఠించడం వల్ల నాడీ కణాలు ఉత్తేజితమై శరీరంలో రుగ్మతలు దూరముతాయని ఈ మధ్య వైద్యులపరిశీలనలోనూ నిరూపితమైనది .
ఇక భావనాత్మకంగా తాను మాట్లాడే భాషలో పూజ వలన మేలే . కాదని ఎవరు అనరు. మనసు నిలకడ ఉంటే భాషకూడా అవసరముండదనుకోండి అవి పైస్థాయి కెళ్ళిన వాళ్లవిషయాలు . [నాలాంటి దిగువస్థాయి వాళ్లకు కాదు]
ప్రపంచంలో భాషలన్నింటిలో సంస్కృత పదాలు కనపడతాయి కనుక దేవభాష ప్రత్యేకత దానిదే .అలాగని మిగతావి తక్కువని కాదు . తల్లినిమించిన ప్రజ్ఞ ఉన్నా బిడ్దబిడ్డే .
దైవ పూజలో మనసును శరీరాన్ని సమతాస్థితికి తీసుకువచ్చేందుకు పెద్దలు ఇలా పారాయణాదులను సంస్కృతంలోనూ భజనలను భక్తి గీతాలను వాడుక భాషలలోనూ ప్రోత్సాహించారనుకుంటాను . సద్గురువులు సాయి నాధులుకూడా విష్ణుసహ్రనామాలను పారాయణ చేసేవారిని అలాచేయటం ప్రోత్సహించారని చరిత్రలద్వారా తెలుస్తుంది. స్థానిక భాషలలో స్తుతులను కూడా అంగీకరంచారు . ఇప్పుడు సాయి హారతుల మరాఠీ లో పాడుతున్నప్పుడూ భక్తులు బేధభావం లేకుండా తన్మయత్వం పొందుతూ పాడుతుండటం చూసాను . సద్గురువులు చూపిన బాటలో నడుద్దాం అప్పుడు ఏదీ ష్టం కానిదుండదు
naa coputer kedo chikin gunya vachchinatlumdi type lo baagaa tappulu paddaayi emanukokamdi . alaage vyaakhya remdusaarlumdi okasaari teesiveyamdi . deenni kudaa
కరెక్ట్ జన్మతః బ్రాహ్మిన్స్అయితే మాత్రమే మంత్రాలు స్పష్టంగాపలుకగలరు అనేది వాస్తవం కాదు.
చిన్నప్పటినుండి శిక్షణ ఉంటే, దాన్తోపాటు కుటుంబ వాతావరణం కూడా సహకరిస్తే మంత్రోచ్చారణ ఎవరైనా చేయొచ్చు. కానీ మన సమాజంలో ఈ అనుకూలతలు బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నాయి. కారణం - బ్రాహ్మణులలో హెచ్చుశాతం మంది రాజీలేని పెర్ఫెక్షనిస్టులు. మతమే కాదు, ఏ అంశానికి సంబంధించి అయినా పొరపాట్లతో ఎంతమాత్రమూ సర్దుకుపోరు. ఇతరులు చాలా తరచుగా అలా సర్దుకుపోతారు. అందువల్ల మంత్రోచ్చారణ దగ్గర సైతం అలా జాగ్రత్త వహించడం బ్రాహ్మణులకు అలవోకగానే పట్టుబడుతుంది. బ్రాహ్మణులు మంత్రోచ్చారణ బాగా చేస్తారన్నప్పుడు మనం మాట్లాడుకునేది వారి బ్రాహ్మణత్వం గురించి కాదు. వారికున్న భౌతిక అనుకూలతల గురించే.
అసలు మనకు మంత్రాలు దేనికి ?
@durgeswara : నేనూ మీతో ఏకీభవిస్తాను
కానీ భగవంతుడు ఎవ్వరికీ ఏ రెస్ట్రిక్షన్ పెట్టలేదు. మనం అనుసరించట్లేదంతే. ఆండాళ్ అమ్మవారు ధనుర్మాసంలో కాత్యాయినీ వ్రతం చేసి, పాశురాలు అరవంలో చెప్పారు, మన వద్ద వాటి తెలుగు అనుసరణను శ్రీకృష్ణదేవరాయలవారే ఇచ్చినా మనం దానిని ఇంకా ఉపయోగించటంలేదు.
అయితే ఈ ధనుర్మాసం తెలుగులోనే తిరుప్పావును అనుసంధానం చేసి మీకు నా అనుభవం చెప్తాను. ఆ పై విష్ణు సహస్రనామం నుండి, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వరకూ అన్ని సంస్కృతంలోనే కదా ఉన్నాయి....వాటిని మనమేమి చెయ్యలేము.
అయితే గుళ్ళలో ఏ మాసానికి సంబంధించిన పురాణం ఆయా మాసాల్లో తెలుగులో పారాయణం చేస్తే ఒక మంచి మార్పు తేవచ్చు.
ఉదా-కార్తీక మాసంలో కార్తీక పురాణం, శ్రావణం లో శ్రావణపురాణం అలా.....
అంతే కాదు, గుడిలోని పూజారులు మాంగళాశాసనం చేసేప్పుడు దానికి అనుబంధంగా ఒక తెలుగు కీర్తనను జోడించవచ్చు
@durgeswara : నేనూ మీతో ఏకీభవిస్తాను
కానీ భగవంతుడు ఎవ్వరికీ ఏ రెస్ట్రిక్షన్ పెట్టలేదు. మనం అనుసరించట్లేదంతే. ఆండాళ్ అమ్మవారు ధనుర్మాసంలో కాత్యాయినీ వ్రతం చేసి, పాశురాలు అరవంలో చెప్పారు, మన వద్ద వాటి తెలుగు అనుసరణను శ్రీకృష్ణదేవరాయలవారే ఇచ్చినా మనం దానిని ఇంకా ఉపయోగించటంలేదు.
అయితే ఈ ధనుర్మాసం తెలుగులోనే తిరుప్పావును అనుసంధానం చేసి మీకు నా అనుభవం చెప్తాను. ఆ పై విష్ణు సహస్రనామం నుండి, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వరకూ అన్ని సంస్కృతంలోనే కదా ఉన్నాయి....వాటిని మనమేమి చెయ్యలేము.
అయితే గుళ్ళలో ఏ మాసానికి సంబంధించిన పురాణం ఆయా మాసాల్లో తెలుగులో పారాయణం చేస్తే ఒక మంచి మార్పు తేవచ్చు.
ఉదా-కార్తీక మాసంలో కార్తీక పురాణం, శ్రావణం లో శ్రావణపురాణం అలా.....
అంతే కాదు, గుడిలోని పూజారులు మాంగళాశాసనం చేసేప్పుడు దానికి అనుబంధంగా ఒక తెలుగు కీర్తనను జోడించవచ్చు
భగవంతుడిని వాడుక భాషలో ప్రజలకి దగ్గర చెయ్యడం అన్న ప్రక్రియ పొరుగు రాజ్యాల్లో ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ప్రారంభం అయ్యింది.
నాకూ అర్థం కానిది ఇదొక్కటే. తెలుగు బాష లో ఇటువంటి సౌలభ్యం ఎందుకు లేదన్నది అర్థం కాని ప్రశ్నే!!!
గమనించి చూస్తే చాలా వందల ఏళ్ళ క్రితమే వాడుక భాష లో స్త్రోత్రాలు మొదలయ్యాయి. కన్నడ భాషలో దీనికి ఆద్యులు వైకుంఠదాసులవారు.పదమూదవ శతాబ్దానికి చెందిన వారు..కన్నడ భాష లో ఈయన మొట్టమొదటి పదకవితా పితామహుడు అనవచ్చు. ఈయన తరువాత , శ్రీపాదరాజులవారు, వ్యాసరాజులవారు, పురందర దాసులవారు కనకదాసుల వారు ( కనకదాసుల వారు ఒక దళితుడు. ఇది ఇక్కడ అప్రస్తుతం కాదు అనుకుంటాను.ఈయన రచించిన కేశవనామ స్తుతించని మాధ్వ బ్రాహ్మణుడు/బ్రాహ్మణ స్తీ లేరు అంటే అతిశయోక్తి కాదేమో!!!సాక్షాత్తు యమధర్మరాజ అంశ గా భావిస్తారు ఈయనని.!!) మొన్న మొన్నటి జగన్నాధ దాసుల వరకు కన్నడంలో రచించిన స్త్రోత్రాలు అసమాన్యం. ఒక విధంగా చెప్పాలంటే, కన్నడ సాహిత్య భాండాగారాన్ని మరింత సమృద్ధం, పరిపుష్టం చేసాయి.ఒక్క పురందర దాసుల వారి కీర్తనలే నాలుగు లక్షలా దెబ్భయి అయిదు వేల దాకా ఉన్నాయి అంటే ఊహించగలరా.? మనకి ఇలాంటి దాతలు కొరవడ్దారని నా నమ్మకం
మరి తెలుగు లో సాహిత్యం అనగానె గుర్తొచ్చే పేర్లు వేళ్లమీద లెక్క పెట్టొచ్చు.మనకి శృంగార గ్రంధాలే ఎక్కువ. నిజంగా బాధ కలిగించే విషయమే ఇది.
మన తెలుగుభాష ప్రాచీనం అయితే అవ్వొచ్చు గాక!!!. కాని మన తెలుగు వాళ్ళ వల్లే అత్యంంత నిరాదరణకు గురయినది అని నా గట్టి అభిప్రాయం.
--Sudha-Bangalore
Post a Comment