అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/15/10

జగన్.... నవ్వుల పాలు కాకముందే ఈ హత్యలు మానెయ్యి

మరణించిన వారి కోసం జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర జరగదేమో అన్న బెంగతో ఇప్పటికే మా జిల్లాలో చాలామంది చనిపోయారు. తాజాగా వై ఎస్ విగ్రహాలు తమ గ్రామం లొ పెట్టరేమో అనే బాధతోను , పెట్టడం కుదరడం లేదు అన్న బాధతోను గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. వీళ్ళందరినీ ఓదార్చుకుంటూ పోతే ఇక జగన్ మా జిల్లా దాటలేడు. ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో !!!!!!!!!!!!!!.

అసలు జగన్ ఒదార్చాల్సిన కుటుంబాలు ఉన్న గ్రామాలు కాకుండా వేరే గ్రామాలలో పర్యటించడం లొ తన హిడెన్ ఎజెండా తేటతెల్లం అయింది. అందులో భాగంగా తమకు రెగ్యులర్ గా అలవాటు అయిన మరణాల ఫార్ములా ని మళ్లీ తెర మీదకి తెచ్చారు. జగన్ తమ గ్రామానికి రాడేమో అన్న బెంగతో ఒకాయన మరణించడంతో మొదలైన కామెడీ అప్రతిహతంగా కొనసాగుతుంది. నిన్నటికి నిన్న జగన్ మా గ్రామానికి రాకపోతే కనీసం 20 దాకా చచ్చిపోతాం అని సాక్షి లొ ఒక యువకుడు రెచ్చిపోయాడు. తాజాగా ఈ రోజు తమ గ్రామంలో వైఎస్ విగ్రహం పెట్టరేమో అన్న బాధతో ఒక వీరాభిమాని మరణించడంతో కామెడీ తారా స్థాయికి చేరింది. నేను మరణించిన వ్యక్తిని ఇక్కడ అపహాస్యం చేయడం లేదు . సహజ మరణాలని తమకు అనుకూలమైన కారణాలకు మలుచుకుంటున్న పార్టీలు రేపు అవసరమైతే జనాన్ని చంపి తమ అవసరాలకి వాడుకునే దిశగా అడుగులు వేయకముందే ఈ కామెడీ మరణాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది . ముఖ్యంగా జగన్ ఇప్పటికే ఈ చావుల వ్యవహారం లొ పలుచన అవుతున్నాడు. ఇంకా జనాల్లో చులకన కాకుండా ఉండాలంటే ఈ హత్యల సంస్క్రుతి కి జగన్ చరమ గీతం పాడాల్సిందే .

26 comments:

Thiru said...

ఇంకా నవ్వులపాలు అవ్వాల్సింది ఏమైనా మిగిలుందా ????
:)

Anonymous said...

Yellow - Media అని నిరూపించుకున్నావ్

శ్రీనివాస్ said...

@ తిరు :)) అంతే అంటారా

@ అజ్ఞాత హమ్ మొత్తానికి తమకి ఈ గజ్జి వదలదు అనమాట

Anonymous said...

ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో

LOL..అయినా మీరు కొత్త అయిడియాలు ఇచ్చేస్తున్నారేంటండీ బాబూ, పాటించినా పాటీంచేయ గలడు. :)

Rishi said...

vaaaaaaa..నా ఐడియా ని హైజాక్ చేసారు మీరు :).

పోస్టు బావుంది.
>>. వీళ్ళందరినీ ఓదార్చుకుంటూ పోతే ఇక జగన్ మా జిల్లా దాటలేడు. ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో !!!!!!!!!!!!!!.

బాగా చెపారు. అయినా నాకు అర్ధం కాదు,ఊరూరా ఆ విగ్రహలెందుకండీ..పిట్టలు రెట్టలెయ్యడానికి తప్ప.

amma odi said...

శ్రీను గారు: ఇలాంటి టపాలు చదివి కూడా గుండెలు ఆగిపోతాయోమో కదా? ఆంధ్రావాళ్ళ గుండెలు ఇంత బలహీనమైనవి ఈ మధ్యే తెలిసింది. :)

Indian Minerva said...

Don't put ideas into (Jagan's) head!!!

Anonymous said...

Well said, Good post.

కృష్ణప్రియ said...

మా ఇంటి పక్కన 95 యేళ్ళ ముసలావిడ ఓదార్పు యాత్ర పేరు తో..బెంగుళూరు లో ఎక్కువ జగన్ ఉండట్లేదన్న shock తో మూడు రోజుల క్రితం గుండె ఆగి మరణించారు..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

జగన్ కంటికేదో అయ్యింది.దీనికోసం ఇంకా ఎవరూ చావలేదెందుకనో?

Anonymous said...

ఇచట ఓదార్చబడును..
చిన్నా, పెద్దా, ముసలీ ముతకా, ఎవరైనా పర్లా, ఏ కులం, ఏ మతం ఐనా పర్లా,
తెల్లగా ఉంటే నల్లగా లేరని, నల్లగా ఉంటే తెల్లగా లేరని, పొట్టిగా ఉంటే పొడుగ్గా లేరని, ఎవరికి ఏ విధంగా, ఎలా కావాలంటే ఆ విధంగా, ఎంత సేపు కావాలంటే అంత సేపు ఓదార్చబడును
ఊరికే కాదు ఒక చెంచా పెరుగన్నం తిని ఒదార్చబడును
రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం

Anonymous said...

పార్టీలు రేపు అవసరమైతే జనాన్ని చంపి తమ అవసరాలకి వాడుకునే దిశగా అడుగులు వేయకముందే
>>
ఇప్పుడు ఇలాంటివి జరగట్లేదంటావా బాసు...?

గని said...

ఫై కామెంట్ నాదే - అనోన్ అని పడింది.
- గని

Kishore said...

ఎవరూ, ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ గురించేనా మీరు చెప్పేది?

krishna said...

ఇంకా నయం పురిటిలోనే పిల్ల కాయలు ఆత్మ హత్య చేసుకుంటుండారనలేదు :)

బంతి said...

ఈ ఆత్మ"హత్యలు" ఇప్పట్లో ఆగవు. కుర్సీ ఇస్తే యాత్రల తో సహా అన్ని ఆగిపోతాయి

కవిత said...

Well said.ma relative oka athanu mamulu heartattack tho YSR chanipoyina Next day chanipoyadu.Thanu YSR kosame chanipoyadu anta!!!!...aa vishayam valla wife kuda thelidu kaani..Sakshi TV vaadi ki thelisindi.Ala undi mari paristhithi.Kali kaalam...kaadu,kaadu..'jagannatakam'.

>>. వీళ్ళందరినీ ఓదార్చుకుంటూ పోతే ఇక జగన్ మా జిల్లా దాటలేడు. ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో !!!!!!!!!!!!!!.


Super kada meeru....

@Krishna...mastu chepparu.

శ్రీనివాస్ said...

ఆకాశ రామన్న గారు పాటించేస్తాడు అంటారా .. ఏదో అలవాట్లో పొరబాటుగా రాసేసానండి

మినర్వా గారు :))

క్రిష్ణప్రియగారు మీరు కేక

చెప్పుదెబ్బలు గారు రేపు పేపర్ చూశాక డిసైడ్ చేద్దాం

శ్రీనివాస్ said...

@ తార
:))

@ అజ్ఞాత , ప్రస్తుతం ఆ జాడ్యం తెలంగాణా లొ మాత్రమే ఉందని వినికిడి మరి

@ గని పైన కామెంటులో అజ్ఞాత అని తీసేసి గని అని చదువుకో

శ్రీనివాస్ said...

@ కిశోర్ , అర్ధం కాలేదు బాసు

@ పిల్లకాకి కృష్ణ గారు

కొత్త ఆలోచనలు ఈయవద్దు బాసు :))

@ బంతి , లెస్స పలికితివి

శ్రీనివాస్ said...

@ కవిత చూశార ఎన్ని నిజాలు బయటికి వచ్చేశాయో :)

@ రిషి ,

అయ్యో మీరు రాసేద్దాం అనుకున్నారా :))

విగ్రహాలు పిట్టలు రెట్ట వేయడానికి కాదు బాసు .. రేపు ఏ లారీయో వేగంగా వచ్చి పొరబాటున ఏ విగ్రహానికో చెయ్యి విరిగితే విగ్రహం ద్వంసం పేరిట ఒకరోజు బంద్ చేసుకోడానికి

శ్రీనివాస్ said...

అమ్మవడి గారు ... ముందు ముందు ఆంధ్రులు ఎంత కామెడీ అయిపోతారరో మీరు ఒక్క మాటతో తేల్చేశారు.

Anonymous said...

మన యువనేత మహానేతని ఇమిటేట్ చేస్తూంటాడు కదా అదే కిషోర్ చెప్పింది.

astrojoyd said...

ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో !!!!!!!!!!!!!!.
avunu nijame sumee?chennailo atuvanti batch okati siddhham avutondandoy..

శ్రీనివాస్ said...

హహహ ఆలా చెప్పారా మిమిక్రి ఆర్టిస్ట్ అని

@ astrojoyd ఆల్రెడీ తయారైన్డా

శ్రీనివాస్ said...

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్

జగన్ కి కన్ను వాచింది అనే బాధతో ఒకడు పోయాడని ఒంగోల్లో ఒక టాక్