"దొంగనాకొడుకు రెండు వందలు దొబ్బాడు .. ఈడెమ్మ .. చి ... అనవసరంగా పోయి వాడి చేతిలో పడ్డాను" అంటూ తెగ అరుస్తున్నాడు నాగి అనబడే మా ఆస్థాన మెకానిక్ నాగేశ్వరరావు. "ఏమైంది నాగి" అన్నాను . "కొత్త ట్రాఫిక్ ఎస్సై అంట అన్నా నా కొడుకు నేను ఫోన్ మాట్లాడట బండి మీద పోతా ఉన్నా రోడ్డు పక్కన వాడు ఉన్నాడు గావాల నేను చూసుకోలా ఆపి రెండు వందలు ఫైన్ వేసాడు " అంటూ తన బాధ మొత్తం చెప్పాడు నాగి. " అదేంది నాగి ఆలా అంటావ్ మరి నువ్వు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం తప్పు కదా" నా మాట సగం లో ఉండగానే అక్కడ ఉన్న మరో ముగ్గురు నాతో వాదనకి దిగారు. " ఏందన్న తప్పు , మొన్న నన్ను ఆపి లైసెన్స్ అడిగాడు లేదు అని చెప్పా , ఇంటికెళ్ళితెమ్మన్నాడు .. లేదు అని చెప్పా నాలుగువందలు ఫైన్ రాసి .. స్టేషన్ కి వచ్చి బండి తీసుకెళ్ళమన్నాడు అన్నా" అన్నాడు ఇంకొకడు. " అదేన్దయ్యా మీరు చేసింది తప్పు అతను చేసింది కరక్ట్ " అని నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినే నాధుడు లేడు. పైగా నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూడడం మొదలెట్టారు. ఆ రోజు మొదలు ఆ ఎస్సై గురించి నేను రోజు ఎక్కడో దగ్గిర తిట్లు వినే వాడిని . అతను చేసిన పనల్లా తన డ్యూటి తను చెయ్యడమే. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ ఎస్పి కారు కి పేపర్లు లేవన్న కారణం చేత పదివేలు ఫైన్ వేసిన ఘనుడు. కొందరు ప్రజాప్రతినిధులు ఒక ఫంక్షన్ కి వచ్చి రోడ్డుకి అడ్డంగా బండ్లు పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన కారణం చేత బండి తీయమంటే .... డ్రైవర్లు పెడసరంగా సమాధానం ఇవ్వడంతో ఆ కార్లకి గాలి తీసి ఎమ్యెల్యే , మునిసిపల్ చైర్మన్ లని రోడ్డు మీద నిలబెట్టిన చరిత్ర ఉంది అతనికి. అయితే తన డ్యూటి తను చేయడం వల్ల అతని కింది ఉద్యోగస్తులు అతను హెరాస్ చేస్తున్నాడు అని తిట్టేవారు. అంటే మనం ఎలా వెళ్ళినా , ఏం చేసినా పర్లేదు పోలీసులు పట్టుకోకూడదు ఫైన్ వెయ్యకూడదు అన్న భావన చాలా శాతం ప్రజల్లో ఉంది నాకు తెల్సి. ఇలాంటి ప్రజలకి మళ్లా అవినీతి అధికారులని ప్రశ్నించే హక్కు ఎక్కడి నుండి వస్తుంది.
మరొక కేసులో జరిగిన ఇంకొక తమాషా చూద్దాం. మా ఇల్లు ఇండేన్ గ్యాస్ ఆఫీస్ కి దగ్గర లో ఉంది. ఒకరోజు ఉదయాన్నేఒక పెద్ద మనిషి బండ బూతులు తిడుతున్నాడు ఆ గ్యాస్ కంపెనీ ముందు. "ఏంటయ్యా నీ గోల " అంటే "రేషన్ కార్డ్ లో గ్యాస్ నెంబర్ లేకపోతే గ్యాస్ ఇవ్వరంట సార్" అని ఆవేశంగా అడుగుతున్నాడు. "మరి నిజమే కదయ్యా రేషన్ కార్డ్ లో గ్యాస్ నెంబర్ చేర్పించుకోవాలి కదా ఎందుకు చేర్పించుకోలేదు" అని అడిగితే నీళ్ళు నమిలి "అప్పుడేదో ఆలా అయిపొయింది సార్ కానీ ఇపుకు కొత్త జాయింట్ కలెక్టర్ ఈ రూలు పెట్టడం తప్పు సార్ "అన్నాడు. అతనొక్కడే కాదు గంట గడిచే సరికి ఆ గ్యాస్ ఆఫీస్ డివిజన్ కింద ఉండే ఖాతా దారుల్లో తొంబై శాతం మంది అక్కడికి చేరి గొడవ మొదలు పెట్టారు. కారణం వారు ఎవరూ రేషన్ కార్డ్ లో తమకు గ్యాస్ ఉంది చెప్పకుండా...... కిరోసిన్ కూపన్లు పొంది , రేషన్ షాపు లో కిరోసిన్ చవగ్గా కొట్టేసి అధిక ధరకు పక్కన అమ్ముకోవడం మరిగారు . అందరూ మద్య తరగతి ప్రజలే . తాము చేసింది తప్పు అని ఒప్పుకోకుండా గొడవకి దిగి చివరికి ఆ రూల్ తీసిన్దాకా గొడవ చేశారు అంటే జనాలు ఏ స్థాయి లో ఉన్నారు?
మరొక చోట తనకి వికలాంగ పించన్ అపేసినందుకు అధికారులని బండబూతులు తిడతాడు ఏ రకమైన అంగ వైకల్యమూ లేని ఒక చవట. గవర్నమెంటు వారు విద్యార్ధులకి స్కాలర్ షిప్ ఇస్తున్నారు అని తెల్సి అప్లికేషన్ లో తన సంవత్సర ఆదాయం 24000/- గా నమోదు చేయించిన ఒక పల్సర్ 220 మీద రేబాన్ గ్లాసులు పెట్టి తిరిగే ఇంకొక చదువుకున్న దద్దమ్మ ని చూస్తె అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది.
అవినీతి కేవలం రాజకీయ నాయకుల దగ్గరే ఉందా , అధికారులు ఉద్యోగుల దగ్గరే ఉందా ??? జనం లో లేదా?
మీకు ఒక కొస మెరుపు చెప్పనా .... అప్పటిదాకా గాలికి తిరిగిన ఒక మిత్రుడు లేటు వయసులో "లా" చదవడం మొదలెట్టాడు. ఎందుకు అన్నా ఇప్పుడు నీకీ అవస్థ అంటే ?? లేదురా చదివితే రేపు ఎవడు ఇల్లు కట్టుకుంటున్నా ఏదో ఒక క్లాజ్ పెట్టి కేసు వేసి నోటీస్ ఇవ్వచ్చు , వాడు ప్రైవేట్ సెటిల్ మెంట్ కి వచ్చి ఎంతోకంత ముట్ట చెబుతాడు ఆలా సంపాదించుకోవచ్చు .. అసలు ఒక సినిమా మీద గోల చెయ్యొచ్చు .... ఒక పుస్తకం రాసిన వాడి మీద కేసు పెట్టొచ్చు ... అసలేమీ సంబంధం లేకుండా నీ స్థలం లోకి నిను అడుగు పెట్టనీకుండా అపెయోచ్చు ఇలా ఎన్ని చేయోచ్చ్చో అని ఆవేశంగా ఆనందంగా చెబుతున్న ఆ మిత్రుడి మొహం లో నాకు భస్మాసురుడు కనిపించాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదేమో!
26 comments:
చాలానే ఉన్నాయ్ ఇటువంటివి. మీరు రాసిన పద్దతి చాలా బావుంది as usual :)
>>అవినీతి కేవలం రాజకీయ నాయకుల దగ్గరే ఉందా , అధికారులు ఉద్యోగుల దగ్గరే ఉందా ??? జనం లో లేదా?
చాలా మంచి ప్రశ్న. అవునండీ రాజకీయ నాయకులైనా, అధికారులైనా మనలో నుంచి వచ్చే శాంపిల్సే. అందుకే జనాల్లో మార్పు కూడా చాలా అవసరం.
ఒక చిన్న తిరకాసేంటంటే, రాజకీయ నాయకులు తమకు తాముగా నాయకత్వం వహించడానికి ముందుకొచ్చిన వాళ్ళు కాబట్టి ప్రజలు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా వున్నాం అని చెప్పడం బావుండదు. కేవలం ప్రజలని ప్రతిబింబిస్తే సరిపోదు, నాయకత్వం వహించాలి కదా! (ఉదాహరణకి, గాంధీ గారు బాల్య వివాహాలు వద్దు అన్నప్పుడు ప్రజలంతా ఆయన వైపు ఉన్నారా? కాకపోతే గాంధీ గారు ప్రజల్లో మార్పు తీసుకురాగలిగారు)
హ్మ్!!...సమాజం లో పేరుకుపోయిన కుళ్ళు కి భాద్యులు ఎవరూ అంటే...అందరూ అనాల్సివస్తుందేమో....అపరిచితుడు సినిమా లో చెప్పినట్లు భాద్యత ఉన్న పౌరులు ఉంటే కదా భాద్యత కలిగిన సమాజం ఉండేది...
>>గవర్నమెంటు వారు విద్యార్ధులకి స్కాలర్ షిప్ ఇస్తున్నారు అని తెల్సి అప్లికేషన్ లో తన సంవత్సర ఆదాయం 24000/- గా నమోదు చేయించిన ఒక పల్సర్ 220 మీద రేబాన్ గ్లాసులు పెట్టి తిరిగే ఇంకొక చదువుకున్న దద్దమ్మ ని చూస్తె అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది.
----------
మా కాలేజీలో కోకొల్లలు ఇలాంటి వారు, చివరకి పరీక్ష ఫీజు కుడా అక్కర్లేదు.
దీనికి తోడు, వాళ్ళు వెనకబడిన కులాలవారు ఐతే ఇంకో పదిహేను వేలు ఎక్కువ, ఒక ఇరవై మందిని వేసుకోని పార్టీ చేసుకోవడం డబ్బులు వచ్చినరోజు.
అసలైన పేదలు, ఆ సర్టిఫికెట్స్ అన్నీ తెచ్చేందుకు డబ్బులు లేకో, తెలియకో వాళ్ళకిరావు, అప్పనంగా లంచాలు ఇచ్చి ముప్పై వేలు తెచ్చుకోని తిని తాగడం
అవినీతి అసలు రూపం అది. మనకు లాభించినదాకా మనం నోరెత్తం.
అట్లా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళను మనం కాపాడుకోవాలి. ఆయనకి అభినందనలు తెలపడమో, కుదిరితే సన్మామమో చేయాలి.
నాయకులు అధికారులు కూడా జనంలోనుంచి వచ్చిన వారే కదా, జనంలో లేదని చెప్పలేం మొత్తం సిస్టం అలాఉంది కానీ నాయకులు అధికారుల విషయంలో ఇది పెద్దమొత్తంలో ఉండటంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అపరిచితుడులో చెప్పినట్లు భాధ్యతలేని పొరులవల్ల పోతున్న వందల ఐదుపైసళ్ళు ఎవ్వరికీ కనపడవు.
చాలా మంచి విషయం గురించి టపాయించినందుకు అభినందనలు. సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ ఈ చైతన్యం రావాలి అందిన కాడికి దోచుకుతిందాం అన్న ధోరణి మారాలి.
నిజాయితీ పూర్తిగా చచ్చిపోయిందని చెప్పలేము కానీ ఖచ్చితంగా అణగత్రొక్కబడుతోంది అవినీతి అనే ఉక్కుపాదంతో.ఆ అవినీతికి లంచంతో కల్సినప్పుడు పుట్టిన అక్రమ సంతానపు వికృత స్వరూపాలే ఇటువంటి రాజకీయనాయకులయినా,అధికారులయినా,సామాన్యప్రజలయినా.
ప్రజల్లో మార్పు రానంతవరకూ నిజాయితీ గురించిన కధలు ఇలా డిజిటల్ కాగితాల మీద రాసుకోడానికో,సిల్వర్‌స్క్రీన్ మీద అపరిచితుడు లాంటి సినిమాలు చూసి ఊహించుకోడానికో తప్ప ప్రయోజనం ఏమీఉండదు.
భస్మాసురుడు ఎలా ఉన్నాడు .. అసలు ఎలా కనపడ్డాడు.. ఇతను నేర్చుకుని ...తనకు తెలిసింది ఉపయోగించి అది తెలియని వాడిని మోసం చేస్తా అనుటున్నాడు... భస్మాసురుడి కాన్సెప్ట్ ఎలా వస్తుంది ?
Nicely pointed out.
ఇలాంటి వాళ్ళు కోకొల్లలు. మాకు ఇంత ఆస్థి ఉంది, మాకు ఇన్ని బిజినెస్‌లు ఉన్నాయి అని ఎప్పుడు డబ్బా కొట్టుకుంటూ తిరిగే మా స్నేహితుడు ఒక రోజు వాళ్ళ ఇంట్లో కరెంట్ కి బిల్ పడకుండా దొంగ కనెక్షన్ ఎలా ఇస్తారో చాలా గొప్పగా గర్వంగా చెప్పాడు. అప్పుడు నాకు వాడిని లాగి ఒకటి పీకాలనిపించింది.
చాలా బాగా రాసారు శ్రీనివాస్.
చుట్టూ వున్న వాళ్ళని, కనీసం మన కుటుంబ సభ్యులని ఆలోచింప చేయగలిగితే, మనం సరైన దారి మీదున్నట్టే.
రోజూవారీ జీవితంలో జరిగే సంఘటనల గురించి ఆలోచింపచేసే టపాలు రాస్తున్నందుకు అభినందనలు. (రెండురోజుల క్రితం కూడా మీది అలాటిదే ఒక టపా చదివాను).
శారద
హ్మ్.. అన్ని చోట్ల ఇదే తంతు.. మా ఇంటి దగ్గర ఓ One-way రోడ్ ఉంది.. అక్కడ చిన్న turn తీసుకుంటే ట్రాఫిక్ సమస్యలు ఉండవు, one-way లో వెళ్ళక్కర్లేదు.. అయినా అందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు అదే రోడ్డులో వెళుతుంటారు.. ఒకసారి ఇదే విషయం ఫ్రెండ్ తో అంటే, ఆ అందరూ ఇటే వెళుతున్నారు కదా, మనం వెళ్ళనంత మాత్రాన మార్పులు ఏమీ రావు అన్నాడు! మనం చేసే పని తప్పు ఒప్పుకోవడానికి బదులు అవతలి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు అని చూపించడానికి ఎక్కువ ఉత్సాహపడిపోతున్నారు! 100 మంది తప్పు చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అవదు అనే సంగతి ఎప్పటికైనా అర్ధమవుతుందో లేదో.....
ఒకరు చదివే విషయాన్ని అర్థవంతంగా తెలపండి
మంచి పదాలతో మంచి భావార్థాలతో లిఖించండి
వ్రాయటం వచ్చని మేధస్సు లేకుండా వ్రాయకండి
విశ్వ విజ్ఞానమున నిలిచే మహా జ్ఞానాన్ని తెలపండి
ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఎంచుకోండి
కాలం మారినా సాంకేతిక విజ్ఞానం వస్తున్నా నీతి ఒక్కటే
పదాలలో పరమార్థాన్ని తెలుపుటకు మేధస్సును ఉపయోగించండి
మనం వ్రాసే విధానం ద్వారా సమాజంలో అవే మాటలు వినిపిస్తాయి
అజ్ఞాన పదాలు నా నాలుకకు అందకుండా పోతున్నాయి
చెవిని తాకే అజ్ఞాన మాటలు మేధస్సుకు చేరకున్నాయి
సమాజాన్ని మార్చే ఆయుధం పదాలలో కనిపించాలి
Hi,
welcome to gsystime.blogspot.com
This blog is enough for change the world-I have an idea to solve the all problems
Writing is professional
you can write anything it should has the meaning to attract the society also legends
హ్మ్! మంచి విషయాన్ని సూటి గా చెప్పారు శ్రీనివాస్ . యధా ప్రజా తధా రాజా !
Well written "Vikatakavi". We deserve the kind of Politicians. Yes, times have changed యధా "ప్రజా" తధా "రాజా". Until and unless everyone of us mercilessly introspects about what we are doing daily in a very routine manner and try to take conscious action to avoid doing what is not correct, the corruption shall be haunting us evern after 1000 years
@ Weekend Politician
Thank you , మార్పు అన్నది ప్రజల్లోనే అవసరం , సరైన అక్షరాస్యత వల్ల అది సాధ్యం.
@ ఇందు గారు
బాద్యత కలిగిన పౌరులని తయారు చేయడం లో మొదట తల్లిది ప్రధాన పాత్ర . నేటి యువతులు అందరూ ఈ విషయాన్ని తమ బిడ్డలని డాక్టర్ గానో ఇంజనీర్ గానో తయారు చేయాలనుకునే ముందు మంచి సిటిజెన్ ని చేయాలి అనుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
@ తార ఒక్కసారి నాతో వస్తే ఈ స్కాలర్ షిప్పుల వ్యవహారం లో ఎంత కామెడీ నడుస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తా :))
good post
@ అజ్ఞాత ,
ఆహా ఏం చెప్పారండీ , ఒక్క ముక్కలో ప్రస్తుత వ్యవస్థని బాగా ఎత్తి చూపారు. నిజమే మీరు అన్నట్టు నిజాయితీ పరులని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది :))
@ వేణు శ్రీకాంత్
అసలు ముందు మనం దోచుకుంటుంది మన సొమ్మే అన్నది ప్రజలకి అర్ధం అయ్యేలా యెలా చెప్పాలో ఎవరికీ అర్ధం కావడం లేదు
@ పప్పు గారు
అపరిచితుడు సినిమా చూసినప్పుడు ఆవేశం రావడం , జాకీ చాన్ సినిమా చూసినప్పుడు కరాటే నేర్చుకోవాలనిపించడం. మామూలే లెండి
@ కాయ ,
మీ పేరు సూపర్ , భస్మాసురుడు లాగానే ఇతను కూడా ఏదో ఒకరోజు తనే బలి అయిపోతాడు అన్నది నా కాన్సెప్ట్
@ సాయి ప్రవీణ్ ,
మీ డబ్బున్న మిత్రుని వంటి వారికి మా ఊర్లో కొదవ లేదు
@ శారద గారు ,
నా చుట్టూ ఉన్నవారిని ఆలోచింప చేయడం అనే కాన్సెప్ట్ నేను ఫాలో అవుతున్నా :)
@ మేధ గారు
ఒన్ వే వాడడం లో మన వారి చాకచక్యం ప్రత్యేకంగా చెప్పాలా :))
@ నాగరాజు గారు మీ తపన నాకు అర్ధం అయింది :))
@ శ్రావ్య గారు ... సూటిగా సుత్తిలేకుండా చెప్పడమే
వి' కట్' కవి స్టైల్ :))
@ శివ గారు ,
సమయం ఆసన్నమైంది అవినితి కోట్లు దాటి లక్షల కోట్లు దాకా వెళ్ళింది. ఇప్పుడే మేలుకోకపోతే జనం ఇంకెప్పటికీ మేలుకోలేరు. :))
@ జీవని ధన్యవాదాలు
అందుకే అన్నారు.
"ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి"
@ శ్రీనివాస్,
>>మార్పు అన్నది ప్రజల్లోనే అవసరం , సరైన అక్షరాస్యత వల్ల అది సాధ్యం.
హ్మ్... మీరు చెప్పినట్టు అక్షరాస్యత ముఖ్యమే గానీ, పైన మిరు చూపించిన ఉదాహరణల్లో అంతా నిరక్షరాస్యులే ఉన్నారంటారా! ఒక్కోసారి, అనవసర విషయాల్లో కుల, మత, ప్రాంతీయ ఉన్మాదం చదువుకున్న వాళ్ళలోనూ కనిపిస్తుంది కదా!
అందుకే అక్షరాస్యత తో పాటు మంచి నాయకత్వం కూడా చాలా అవసరమనిపిస్తుంది నాకైతే. మీరు పైన చెప్పినట్లు పిల్లల్ని మంచి పౌరులుగా తయారుచెయ్యడం, అతి ముఖ్యమైన ప్రారంభం కాగలదు.
అక్షరాస్యత కాదు సుమీ సరైన అక్షరాస్యత :)
:) oh.. I missed the qualifier.
నాకు కూడా అలాంటి వాళ్ళని చూస్తే చిరాకు, కోపం కలుగుతాయి. ఒక ౩ ఏళ్ళక్రితం ఇలాంటి విషయంమీదే నా ఇంగ్లీషు బ్లాగులో రాశాను.
http://jb-journeyoflife.blogspot.com/2007/10/moralethical-values-start-thinking.html
ilaa raasevallao comment chesevallalo avasaram lenappudu maatrame neeti kaburlu entamandi cheputunnamo aatmasodhna cheste manchidi. ramakrishna parama hansa said, tanani taanu telusukunte devuduni telisikunnatle. that is why' know thyself'.
@ akella ramakrishna
అర్ధం అయ్యేలా చెబితే బాగుంటుంది
Post a Comment