అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/6/10

రాజేష్ రిటర్న్స్

అవి మేము ఇంటర్ చదివే రోజులు. మాది లాస్ట్ బెంచ్ బ్యాచ్. ఆ రోజుల్లోనే రాజేష్ ఒకమ్మాయిని ప్రేమించాడు... అదీ చాలా ఘాడంగా! అయితే ఆ పిల్లకి ఆ విషయం చెప్పడానికి ఆడికి భయం. సరిగ్గా అదే సమయంలో ఫరూక్ ఒక కత్తి లాంటి ఐడియా రాజేష్ కి ఇచ్చాడు. అదేంటంటే తన ప్రేమనంతా పేపర్ మీద పెట్టి ఆమెకి ఇవ్వమని. సరే అని చెప్పి వెళ్ళిన రాజేష్ రెండు రోజులకి ఫరూక్ దగ్గరకి వచ్చి ప్రేమని పేపర్ మీద పెట్టడం ఎలా అని ఎర్రి మొహం ఏసుకుని అడిగాడు. "చెత్తనాయాలా, చెత్తనాయాలా, చెత్తనాయాలా ( ఇక్కడ మూడు మొట్టికాయలు) ప్రేమని పేపర్ మీద పెట్టడం అంటే లవ్ లెటర్ రాయమని అర్ధం రా అని రాజేష్ కి అర్ధమయ్యేలా చెప్పాడు ఫరూక్. ప్రపంచం లో ఎవడూ రాయలేనన్ని తప్పులని ఆ లవ్ లెటర్ లో పొందు పరుస్తూ రాసిన రాజేష్ ఆ లెటర్ ని ఆ పిల్ల నోట్ నోట్ బుక్ లో ఫరూక్ సాయంతో పెట్టేశాడు. తన జీవితం లో అంత దారుణమైన ప్రేమలేఖ అంత చిన్న వయసులో చదవాల్సివస్తుంది అని కలలోనైనా ఊహించని ఆ అమ్మాయి ఆ లెటర్ ని ప్రిన్సిపాల్ కి అందచేసింది. మనోడు అ లెటర్ కింద సంతకం పెట్టి రోల్ నంబర్ కూడ వేసేశాడని వేరే చెప్పనవసరం లేదనుకుంటా .

ఆగ్రహించిన ప్రిన్సి మనోడిని ఆ పిల్ల ముందే సావగొట్టడంతోబాటు మూడు వారాల పాటు సస్పెండ్ కూడా చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు చూడడానికే భయపడిన రాజేష్ ని చూసి జాలి పడిన అమ్మాయి కొన్నాళ్ళకి రాజేష్ ని ప్రేమించి ఆ ప్రేమని పేపర్ మీద పెట్టి రాజేష్ బుక్కు లో పెట్టింది. కానీ రాజేష్ ఆ రెండేళ్లలో ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వలేదు కనీసం కన్నెత్తి చూడలేదు. కారణం
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

మనోడు అసలు పుస్తకం తెరిచిన పాపాన పోలేదు కాబట్టి.

34 comments:

Anonymous said...

ఏడుపా నవ్వా? హరే?

టపా ఐపోయిందా? మరి జోకు ఏది బాసు?

శ్రీనివాస్ said...

@ హరే :-))

@ తారా .. ఈమధ్య మీకు ఒక పట్టాన ఏదీ నచ్చడం లేదనుకుంటా :P

నాగప్రసాద్ said...

ఇంతకీ రాజేష్‌కు ఇది ఎన్నోసారి ఇలా రిటర్న్ అవ్వడం. :-))

>>"ఈమధ్య మీకు ఒక పట్టాన ఏదీ నచ్చడం లేదనుకుంటా"

బహుశా, తార మీ పాత పోస్టుకు కామెంటలేదనుకుంటా. అందుకే జోకులు విన్నా నవ్వు రావడం లేదేమో. :-))

తార ఒక్కరికే కాకుండా, ఈ టపా చదివి ఏం కామెంటుదాములే అనుకునేవారికి ఎవ్వరికీ నవ్వు రాక, ఇటువైపు తొంగి చూడటమే మానేశారేమో. :-)))

శ్రీనివాస్ said...

అయ్యో నాగ రాజేష్ ని తీసుకుని వద్దాము అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవాంతరం రావడం నీకు తెల్సిందే.

ఇక తార విషయానికి వస్తే నా శాపాలు ఫలిస్తున్నాయి అంటావా ... లేక నన్ను జోకులు వెయ్యడం మానేయమంటావా?

చందు said...

ha ha ha :-)
bagundi.v expect these sort of posts more from u srinu.

..nagarjuna.. said...

రాజేష్, దినకర్ పూర్వజన్మలో అన్నాతమ్ముల్లేంటీ కొంపదీసి :)

Anonymous said...

గతంలో రాజేష్ గురించి రాసిన కధల్లా లేదు. కామెడీగా లేదు. ఇంకా బాగా రాయండి. మమ్మల్ని నవ్వించండి.

వేణూశ్రీకాంత్ said...

:-) హ హ

నేస్తం said...

ఒకసారి కాలేజీ ప్రేమలు అనే పోస్ట్ రాసాను చూడు.. ఆ సువర్ణకి బాబ్జి కూడా తెలుగులో బ్రహ్మాండమైన ప్రేమ లేఖ రాసాడు.. నాను నీను పామెతున్నాను అని.. :) ఆ ముక్క ఏంటో అర్ధం అయ్యేసరికి మాకు 10 నిమిషాలు పట్టింది :)మీ రాజేష్ బుద్దులే అన్ని :)

శ్రీనివాస్ పప్పు said...

పుస్తకం తియ్యకపోతే వచ్చే నష్టాలేంటో ఇలాంటప్పుడే కదా తెలిసేది మరి.

@ నేస్తం:"ఆ సువర్ణకి బాబ్జి కూడా తెలుగులో బ్రహ్మాండమైన ప్రేమ లేఖ రాసాడు.. నాను నీను పామెతున్నాను అని" కడుపుచెక్కలవుతోందండి బాబు,ఆ పోస్ట్ లింకోపాలిచ్చుకోండి దయచేసి సదివి తరిత్తాం.

3g said...

లోళ్ళు.....

కవిత said...

>>మనోడు అ లెటర్ కింద సంతకం పెట్టి రోల్ నంబర్ కూడ వేసేశాడని వేరే చెప్పనవసరం లేదనుకుంటా .
అచ్చు నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి ప్రేమలేఖ నే వచ్చింది...ఈ రాజేష్ ,ఆ రాజేష్ ఎ నా??అదన్నమాట సంగతి ..ఎంటబ్బ నాకు ఇంకా రిప్లై రావటం లేదు అని తెగ ఫీల్ అయ్యాను....అందుకనే అప్పుడప్పుడు పుస్తకాల దుమ్ము దులపమని చెప్పేది...అర్థం చేసుకోరు... (భాను ప్రియ డయిలాగు).

నేస్తం said...

శ్రినివాస్ గారు రెండు భాగాలు రాసాను.. మీ ఓపిక :)
http://jaajipoolu.blogspot.com/2009/04/blog-post.html
http://jaajipoolu.blogspot.com/2009/04/blog-post_08.html

శ్రీనివాస్ said...

సావిరహే జీ తప్పకుండా:)

@ నాగార్జున , దినకర్ కి రాజేష్ దూరపు చుట్టం

@ అజ్ఞాత తప్పక రాస్తాను :))

శ్రీనివాస్ said...

వేణు శ్రీకాంత్ గారు :))

నేస్తం గారు మీ కాలేజీ ప్రేమలు టపా లు మీరు వ్రాసినప్పుడే చూశాం. మళ్లా ఇంకొకసారి చదివి తరిస్తాం :))

పప్పు గారు హహ

శ్రీనివాస్ said...

3g గారు రోఫులు ( rofl)

హలో కవిత్ గారు మాతో బాటు ఇంటర్ చదివిన ఆ కవిత మీరేనా సూపర్ సూపరో

నేస్తం said...

>>>ఒకసారి కాలేజీ ప్రేమలు అనే పోస్ట్ రాసాను చూడు
అంటే అప్పట్లో ఒక సారి రాసాను చూడూ ..ఆ పోస్ట్లో అబ్బాయి ఇలాగే చేసాడు అని అర్ధం ... అంతే కాని మళ్ళీ ఆ పోస్ట్ చూడమని కాదు...అందులో తమరు రాసిన కామెంట్స్ కూడ గుర్తున్నాయి.. కాని మీ ఒంగోలు అబ్బాయిలకు మా గోదావరి వాళ్ళ బాష ఈ జన్మకు అర్ధం కాదంతే :/

శ్రీనివాస్ said...

అవును మరి మీ గోదారోళ్ళు తెలుగు సరిగ్గా నేర్చేసుకుంటే మాకీ తిప్పలు ఉండక పోను :))

ramya said...

:)
కొన్ని జీవితాలంతే :)

పరిమళం said...

:) :) ఇది మీ టపాకి !
మా గోదారోళ్ళకి తెలుగు రాదా ఆఆఆఅయ్ ...ఎంతమాటనేశారు హన్నా :-/

ప్రేమిక said...

joke pandaledu basu...
intaku mundu rajesh gurinchi rasina posts chusanu.. aa ranege lo ledu....

Anonymous said...

ప్రేమిక గారు
పాత పోస్ట్ లో మీ లాంటి వాళ్ళ కామెంట్లు లేక ప్రోత్సాహం కరువయ్యి ఈ పోస్ట్ మీరు అనుకున్నంత బాగా లేదు
next పోస్ట్ బావుంటుంది

శ్రీనివాస్ said...

@ రమ్య గారు :)) అంతే అంతే

@ పరిమళం గారు :)) :))

మీరు ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నారని తెలీక ఆ ఏదో మన నేస్తమే కదా అని ఆలా అనేశాను ... గోదారోల్లందరూ తగాదాకి రాకండి:))

@ ప్రేమిక గారు
మళ్లీ తిరిగి ఆ రేంజి లో రాసేద్దాం అంతే :D

నాగప్రసాద్ said...

నిజమే, గోదారోళ్ళకు తెలుగు రాదు. :-)) వాళ్ళ భాష అర్థం కాక జుట్టు పీక్కోవాల్సివస్తోంది. :((.

Anonymous said...

నాగప్రసాద్ మీకంటే అలోవేరా ఉత్పత్తులను వాడుతున్నారు పీక్కున్నా మీకేమీ కాదు :) :)

Anonymous said...

నాగప్రసాద్, మీ సీమ తెలుగుకన్నా మా గోదారోళ్ళ తెలుగేమీ తక్కువేం కాదులే. అప్ప అప్పా అంటూ అర్ధం కాని అరవ యాస మీరూను

నాగప్రసాద్ said...

అనానిమస్: హుమ్మ్..ఆ ఉత్పత్తులు వాడబట్టే, నా జుట్టు ఇంకా పదిలంగా ఉంది. లేకపోతే, ఈ గోదారోళ్ళ భాష దెబ్బకి, జుట్టు మొత్తం ఊడిపోయి ఏవీయస్ లాగా గుండుతో తిరగాల్సి వచ్చేది. :-))

నాగప్రసాద్ said...

మేము అప్పా అప్పా అంటే మీరు ఆయ్...ఆయ్.. అంటూ దూడను గేదె పిలిచే భాషలో మాట్లాడతారు. (స్వగతం: కొంచెం ఎక్కువ మాట్లాడానా) :-))

Anonymous said...

గోదారోళ్ళ తెలుగు గేద గొంతు లెక్క ఉంటుంది
http://www.youtube.com/watch?v=6awi9iUHW7M

Anonymous said...

స్వచ్చమైన తెలుగు ఖైరతా బాద్ జ్ఞానేశ్వర్ లెక్క ఉంటుంది

Anonymous said...

మరి బ్లాగు బాబ్జీది ?

Anonymous said...

ఖైరతాబాద్ నానేశ్వరా? గాడెవడు? గాడి భాస సక్కగుంటదా? దిమాక్ ఖరాబైమ్దా తమ్మి.

Anonymous said...

గీ పోరగాళ్ళదెవర్దీ కాదు. ఒంగోలు శీనన్న బాసనే సక్కగుంటది. గదే సక్కనైన తెలుగు. తమ్మీ గిది ఫైనల్.

Anonymous said...

గోదాట్లో అప్పా అంటేనండి, మరేనండి, అక్క అటామండి. అదేనండి, మీ అప్ప మాకు అక్కండి, మా అయ్య మీ అప్ప అండి. త్మరు చిత్తగించాలండి ఆయ్