అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/8/10

హిడెన్ కెమెరాల విషయం లో దొంగలు పడ్డ ఆరేళ్లకు టీవీ 9 మొరిగినా ......................

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగితే ....అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోయి ఉంటుంది . అలాగే హిడెన్ కెమెరాల విషయం లో టీవీ 9 ప్రసారం చేసిన కధనాలు చాలామందికి భయాన్ని కలిగించినా ఈ హిడెన్ కెమెరాల సంస్కృతి ప్రస్తుతం గ్రామాలకి సైతం పాకి పోయింది. ఒకప్పుడు ఆరుబయట స్త్రీ తన బిడ్డకి పాలిస్తుంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళేవారట. మారుతున్న విలువల వల్ల ఇంతకు ముందు ఆడకూతురు ఇంట్లోనుండి బయటికి వస్తే ... తిరిగి ఇల్లు చేరే లోపు తన శరీరాన్ని గుచ్చి గుచ్చి చూసే అనేక వందల కళ్ళ మద్య లోనుండి నడవాలి అన్నది జగద్విఖితం. అయితే పదునాలుగేళ్ళ వయసు నుండి ఆ చూపులకి అలవాటు పడి మొదట్లో కాస్త ఇబ్బంది పడినా .........తర్వాత తర్వాత ఒకరకంగా ఆ చూపులను పట్టించుకోని విధంగా బండబారి పోయి ఉంటారు అమ్మాయిలు. అయితే ఆ కళ్ళ సరసన ఇపుడు మరో కన్ను వచ్చి చేరింది . అది చూడడమే కాదు చూసిన దాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అదే కెమేరా కన్ను.

కూర్చునప్పుడో , ఒంగినప్పుడో వస్త్రం కొద్దిగా పక్కకి జరిగితే చాలు అది కెమేరా కంట్లో పడిపోతుంది. కాలేజీలలో అమ్మాయిల టాయిలెట్లు , చెంజింగ్ రూమ్స్ , ట్రయల్ రూమ్స్ , ఇలా ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి షూట్ చేసి , వాటిని నెట్ లోకి ఎక్కించి అందరికీ చూపించి మజా చేసుకుంటున్న యువత ఒకటి మర్చిపోతుంది............రేపు అదే పరిస్థితిలో వారి అక్కో చెల్లో ఉంటే ?????????????? అపుడు పగిలే వాడి గుండె కి బాద్యులు ఎవరు. వాడి సంస్కృతి చేజేతులా నాశనం చేసుకున్న తర్వాత వాడు ఎంత ఏడిస్తే మటుకు ఎం లాభం. త్రిష లాంటి ఒక హీరోయిన్ స్నానం చేస్తున్న దృశ్యాలు ఎవరో చిత్రీకరిస్తే దాన్ని గంటలో ఒకటికి ఇరవై సార్లు తిప్పి తిప్పి ప్రసారం చేసిన టీవీ 9 ఈ రోజు పత్తిత్తు అయింది. tv9 సంగతి మనకి అనవసరం . ప్రస్తుతం మనకి కావాల్సింది మారుతున్న విలువల వల్ల మన తర్వాతి తరానికి కలిగే నష్టాలు బేరీజు వేసుకోవడం.

ముందుగా మేల్కోవడం మనకి కావాలి , ఎంత సేపు చరిత్ర గురించి పేరాలు పేరాలు రాసుకోవడం , ఇదేదో మనకి అర్ధం కాని గొడవ అని యువతరం పెడచెవిన పెట్టడం ....ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ఎవడో మాక్స్ ముల్లర్ ఏదో రాశాడు , ఎవడో డల్హౌసీ మన సంస్కృతి మూలాలు కత్తిరించేందుకు శతాబ్దం క్రిందటే ప్రణాళిక రచించాడు అని అనుకోవడం తప్ప ... సంస్కృతి , విలువలు అనే భావన నుండి నేటి యువతరం చాలా దూరం వెళ్లి చాలా ఏళ్ళు అయింది అన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు.

చీప్ గా కెమేరా ఉన్న ఫోన్ దొరికింది కదా అని అమ్మాయిల ప్రైవేట్ జీవితాలలోకి తొంగి చూసే యువత ఈ పెడ సంస్కృతి పెచ్చుమీరి రేపు ఎవడో తన భార్య తన కూతురు ని ఇలాగే చిత్రీకరించే అవకాశం ఉంది తను ఆవిధమైన అలవాట్లకి తనే వారధిగా మారబోతున్నాడు అన్న విషయం గుర్తించడం లేదు. మద్య వయసు మనుషులు కూడా రేపు ఇదే ప్లేస్ లో నా బిడ్డ ఉంటే ఏమవుతుంది అన్న ఆలోచనే లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరకు నగరాలలో ఆడవాళ్ళ మూత్రవిసర్జన శాలల్లో సైతం కెమేరా పెట్టేంత దారుణమైన స్థాయికి చేరుకున్నారు అంటే మనం ఎంత దిగజరిపోయాం అన్నది అర్ధం అవుతుంది.

దీనికి పరిష్కారం గా ప్రస్తుత తరం ఏమి చేయాలి అన్నది చర్చిద్దాం . అసలు మనది ఒక సంస్కృతే కాదు, ఆడవాళ్ళని గౌరవించండి అని చెప్పిన ఆర్యులు అసలు మనవాళ్ళు కాదు అని చెప్పే వాళ్ళని చూసి మనసులో తిట్టుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేమా? యెంత సేపు విద్యావ్యవస్థ లో మార్పు కోసం యత్నించడం కాకుండా మన వంతుగా మన చుట్టూ ఉన్న పిల్లలకి విలువలు నేర్పించడం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు అన్న మాట పిల్లల మెదళ్ళలోకి ఎక్కేలా చెప్పడం ముఖ్యమైనది అని నా అభిప్రాయం. మన సంస్కృతి ఎలా నాశనం అయింది అన్న విషయాన్ని వారికీ విసుగు పుట్టని విధంగా తెలియచేసి .. ఒకనాటి మన వైభవాన్ని తిరిగి తెచ్చే బాధ్యత వారిమీదే ఉంది అన్నంతగా వారిని ప్రభావితం చేయడం అత్యవసరం. ఇది వందేళ్ళ పోరాటం. ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఏ ప్రభుత్వం మీదో, ఏ వ్యవస్థ మీదో ఆధారపడక మంచిని కాంక్షించే ప్రతి మనిషి తన బాధ్యతగా దీన్ని గుర్తించి ఇప్పటినుండే అమలు పరచాల్సిన విషయం. ఇది మారాల్సిన సమయం ... ఇపుడైనా మనం మేల్కొకపోతే ... ఇప్పుడు రామాయణ మహాభారతాల మీద........ అవి నిజమా కాదా అని జరుగుతున్న చర్చలానే కొన్నేళ్ళ భూమిమీద స్వార్ధం లేని మనుషులు ఉండేవారట అప్పట్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారట , స్త్రీలని గౌరవించేవారట , అసలు పెళ్లి అనే పద్ధతి ఉండేదట అనే అంశాల మీద భిన్న వాదోపవాదాలు నడిచే రోజు వస్తుంది.

ఇబ్బంది అనుకోకుండా ఒక్కసారి ఈ వీడియో చూశాక నేటి మెజారిటీ యువత ప్రస్తుత గురించి స్ప్రష్టమైన అవగాహన
వస్తుంది . ఆ వీడియోలో అంత అసభ్యత ఉండదు . ఒక మంచి మెసేజ్ ఇస్తుంది

32 comments:

Pramida said...

చాలా బాగా చెప్పారు సుమీ

ఇందు said...

బాగా చెప్పారు....ముఖ్యంగా సంస్కృతి గురించి,విలువల గురించి.

నేస్తం said...

శ్రినివాస్ భయవేస్తుంది ఇలాంటివి వింటున్నా ,చూస్తున్నా...మరొక ముఖ్య కోణం ఉంది... ఇప్పటికే అమ్మాయిలలో,అబ్బాయిలలో మారుతున్న సమాజపు ప్రభావం విపరీతం గా పడింది.. రేపు అలాంటి వీడియోలు చూసి,చూసి ఇదేం పెద్ద విషయం కాదులే అని సరదాకు తమకు తాము నెట్లో కనబడటానికి ప్రయత్నించే రోజులు కూడా వస్తాయంటే అతిశయోక్తి కాదేమో...ఇక మా పరిస్థితి ఏంటంటే పెళ్ళికాక ముందు ఇలాంటివి ఎక్కడ మాకు ఎదురవుతాయో అని భయం.. పిల్లలు పుట్టాక ఇవి ఎక్కడ వాళ్ళకు ఎదురవుతాయో అని మరొక భయం ..

Anonymous said...

టివీ తొమ్మిది సంగతి తెలిసిందే కదా, ఒక్క హిరోయిన్నా? ఎన్ని చోట్ల వాడు హిడెన్ కెమేరాలు పెట్టి ఎంతమందిని ఆగం చేశాడు, ప్లాస్టిక్ సర్జెన్ అని, బ్యూటీ పార్లల్ అని, ఒకటా రెండా, ఇప్పుడు వాడూ మెరుగైన సమాజం కోసం నమాజు చేస్తున్నాడా?

ఎమో అబ్బాయి, నీ ప్రశ్నలకి నా దగ్గిర సమాధానాలు లేవు..మరి..

శ్రీనివాస్ said...

@ pramida గారు :))

@ ఇందు గారు ధన్యవాదాలు

@ నేస్తం ,

ముందు ముందు రావడం ఏమిటి ఇపటికే తన వీడియోలు స్వయంగా నెట్ లో పెట్టే సుందరీమణులు ఉత్తర భారతంలో మొదలయ్యారు.

@ తార :))

శ్రీనివాస్ said...

టపా లో ఒక వీడియో జత చేశాను తప్పక చూడండి

..nagarjuna.. said...
This comment has been removed by the author.
..nagarjuna.. said...

పోస్టు విషయానికొస్తే మనవాళ్లలో దూల ఎక్కువౌతుంది అని అర్థమౌతుంది....పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు తయారవుతున్నారు....

..nagarjuna.. said...
This comment has been removed by the author.
Anonymous said...

Nagarjuna garu
thanks for the xtra info :-)

చందు said...

hmmmm :((

Anonymous said...

ఓరేయ్! ఖైరతాబాద్ జ్ఞానేశ్ నువేదో పత్తితు లా మాట్టాడకు ,
నువ్ ఆడ బ్లోగేర్స్ వెనక ఊపుకుంటూ ఎల్టంలేదా ,మూస్కుని ఫుర్సత్ సేయ్కుండా కుసో

వేణూశ్రీకాంత్ said...

well said.

Overwhelmed said...

Baagundandi.. Evariki vaaru ee principles paatiste konchem ayina baaguntundi kada..

3g said...

>>మన సంస్కృతి ఎలా నాశనం అయింది అన్న విషయాన్ని వారికీ విసుగు పుట్టని విధంగా తెలియచేసి .. ఒకనాటి మన వైభవాన్ని తిరిగి తెచ్చే బాధ్యత వారిమీదే ఉంది అన్నంతగా వారిని ప్రభావితం చేయడం అత్యవసరం.

yes.... well said ఇలా అయితే కనీసం వచ్చే తరాన్నయినా మంచిగా మార్చుకోవచ్చు.

నీహారిక said...

ఇదొక రకమైన మానసిక వ్యభిచారం లాంటిది. అసలు ఇదే ప్రమాదకరమైనది కూడా, మగవాళ్ళైనా, ఆడవారైనా కూడా తెలుసుకోవలిసిన విషయం ఇది.

శ్రీనివాస్ said...

@ నాగ్ , వీడియో వరకు చూసి వదిలేస్తే బెటర్ బాసు ... ఎక్ష్త్రా వీడియోస్ జోలికి ఎందుకు :)) ఆ వీడియో లో ఉన్న మెసేజ్ అర్ధం చేసుకుంటే చాలీ అన్నది నా అభిప్రాయం.

@ సావిరహే :))

@ అజ్ఞాత మీ తాపత్రయం నాకు అర్ధం అయింది

శ్రీనివాస్ said...

@ వేణూ శ్రీకాంత్ థాంక్స్

@ జాబిలి గారు , నిజమే కదా :))

@ 3g గారు టపా వెనుక అంతరార్ధాన్ని చక్కగా అర్ధం చేసుకున్నారు.

@ నీహారిక గారు , చక్కగా చెప్పారు

మైత్రేయి said...

డెవ్ డ్ (Dev-D, మోడ్రన్ దేవదాస్ అనుకోవచ్చు) అనే హిందీ సినిమాలో విశాల్ భరద్వాజ్ దీన్ని గూర్చి చక్కగా తీసారు. ఒక పద్నాల్గు, పదిహేను ఏళ్ళ అమ్మాయి ఈ కెమేరా ట్రాప్ లో పడి ఎలా ఇబ్బంది పడుతుంది, చక్కటి హైమిడిల్ క్లాస్ లైఫ్ లో ఉన్న తను ఎలా చివరకు ఒక ప్రాస్టిట్యూట్ గా మారుతుంది అన్నది ఈ సిన్మాలో చూస్తుంటే గుండె పిండినట్లవుతుంది.

బండగా అమ్మాయిలు ఇలా ఉండరాదు అలా ఉన్నందువల్ల అలా జరిగింది అని తీర్పులు చెప్పటమేకాకుండా తెలిసీ తెలియని వయసులో ఇలాంటి వాటిల్లో ఇరుక్కున్న పిల్లలకు ఎంత ఫామిలీ, సొసైటీ సపోర్ట్ అవసరమో కూడా ఈ సిన్మాలో తెలుస్తుంది.

తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి విషయాలపై అవేర్నెస్ తీసుకొచ్చే సైడ్ స్టోరీస్ అన్నా ఉంటే బాగుంటుంది.

వికటకవి గారు, మంచి విషయం పై పోస్ట్ రాసారు. మీరన్నట్లు మీడియా కూడా ఇలాంటివి పదే పదే చూపి నెట్లో చూడనివాళ్ళకు కూడా చూపటం దారుణం.

మైత్రేయి said...

పై కామెంట్లో విశాల్ భరద్వాజ్ ని "అనురాగ్ కశ్యప్" గా చదువుకోండి. సారీ.,

Anonymous said...

@ maitrayi
chanda's father commits suiside after he lost his reputation due to the scandal of his daughter

While Chanda isn’t a career prostitute, she is no different as well. Instead of performing Mujras, she enacts scenes from popular American pornographic series. The only thing, that makes her different is the fact that she hasn’t given up on her studies for the profession and has also kept the exit gate open.

its an intentional trap by her fellow class mate

if she addicted to drugs the same thing will happen

the moral of this post is to be everybody should consious about everything in the family

మైత్రేయి said...

@above,
ఇది ఆ సిన్మా గురించి రెవ్యూ టాపిక్ కాక పోయినా, విషయం ఒకటేకనుక రాయాలనిపిస్తుంది.
చందా తప్పుచేసింది. అనుమానం లేదు. ఆ తప్పు తన వయసు, తనున్న వాతావరణం, అతిస్వేచ్చ, తప్పుడు స్నేహితులు వల్ల జరిగినది.

తను మేజర్ కాదు చిన్నపిల్ల. దానికి తను చెల్లించుకోవలసిన మూల్యం తన మొత్తం జీవితమా?

ఆ సిన్మాలో తన చేతే అనురాగ్ చెప్పించినట్లు, వాళ్ళ నాన్న ఆరోజుల్లోనే బ్రిటీష్ అమ్మాయిని పెళ్ళిచేసుకొన్న మోడ్రన్ వాడు అసలు తన వీడియో ఎందుకు చూడాలి? అంత పిరికిగా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? వాళ్ల అమ్మ తనను వదిలించుకోవటానికి ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్ళి ఎందుకు చెయ్యాలి? ఆ కుటుంబం మొత్తం అతలాకుతలం అయ్యేంతగా సమాజం ఎందుకు వాళ్ళని ఎగతాళి చెయ్యాలి?

వీడియో తీసిన అబ్బాయి తో పాటు వీళ్ళందరూ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినవాళ్ళని నా అభిప్రాయం.

మనం హిడెన్ కెమేరా పెట్టేంత ధైర్యం, నీచత్వం కలవాళ్ళం కాకపోయినా, అల్లాంటివి చూసేవాళ్ళం అయినా, విక్టిమ్స్ ని మాటలతో హింసించేవాళ్ళం అయినా, పిల్లలను కనిపెట్టని వాళ్ళం అయినా, వాళ్ళకు ఇబ్బందుల్లో మానసిక ధైర్యం ఇవ్వని వాళ్ళం అయినా మనం అందరం నేర్చుకోవలసింది ఆ అమ్మాయి కధలో ఉంది.

Anonymous said...

వాళ్ళ అమ్మ కూడా బతికే ఉంది కదా అంటే దానర్ధం ఆ క్యారెక్టర్ కి ధైర్యం ఎక్కువ ఉంటుంది అనే కదా దర్శకుడు చూపించింది including chanda

they were going to shifted to a new place
because of the media and news channels harrasment he commits suicide

list of తప్పులు
1.చెడు స్నేహం
2.చెడు తిరుగుళ్ళు
3.తండ్రి అవమాన0 పడడం
4.న్యూస్ చానల్స్ అతి వైఖరి

Anonymous said...

బాబు సీనా ఆ పైన వాళ్ళు చెప్పే సినిమా ఏదో ఉంటే పెట్టు చూద్దాం.

Anonymous said...

chanda
ధైర్యం గా పోరాడింది
but her father didnt

ఒంగోలు రాయుడు said...

elanti progs chuste life lo unna kasta happiness kuda potundi... manavaallani kuda anumanichevidamga tayarautam...

elanti vaati gurinchi alert cheyyali... kaani vaalu cheppe paddati b.ground music... baboiiiii... mati matiki a video clippings chupinchadam... bayamesi cartoon network tune chesa :(

lekunte naku life lo unna kasta happy kuda aaviri aipotundi :(

Anonymous said...

ఒంగోలు రాయుడు gAru
భయపడకండి రాయుడు సంతానాన్ని మీరు ఆడుకోవడానికి తీసుకెళ్ళండి మీకు కాస్త happiness దొరుకుతుంది

Anonymous said...

ఆలోచింపచేసే పోస్టు

..nagarjuna.. said...

బ్లాగ్‌ ఓనర్‌కు, రీడర్స్‌కు లేని ప్రాబ్లం నాకెందుకు... :)

Anonymous said...

మనం ఎంత దిగజారామో చాలా భాధ గా ఉంది. టీవిల వాళ్ళు చెబితె శుంగారం . వాళ్ళు ఖండిస్తె వ్యభిచారం.నేటి

Anonymous said...

Srinivas Anna

youtube lo video code copy chese time lo related videos ani oka option vuntundi adi un check cheste vere chetta videos evari ee video ki ravu update it asap

శ్రీనివాస్ said...

@ above తమ్ముడు /చెల్లి

మంచి సలహా ఇచ్చావ్ :)థాంక్స్