అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/29/10

లేత మనసులు - 2

ఉత్తరాది నుండి వ్యాపారరిత్యా ఆంధ్రా లొ స్థిరపడిపోయిన కుటుంబానికి చెందిన అమ్మాయే మున్ని :) . ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంది. తన మేనమామ భార్యకి డెలివరీ కావడంతో తోడుగా ఉండడానికి ఒంగోల్ వచ్చింది. తనతోబాటు సెలవుల్లో ఉన్న తన కజిన్స్ ని కూడ తీసుకువచ్చింది. అయితే అంతమందికోసం వాళ్ళ ఇల్లు సౌకర్యంగా లేకపోవడం వల్ల వేరే చోట ఇల్లు తీసుకుని ఇల్లు మారారు. కొత్త ఇంటికి వచ్చి ఆటో దిగుతున్న మున్ని చూపుని కొంచెం దూరంగా సైకిల్ చక్రం లొ చున్నీ ఇరుక్కోవడంతో నానా ఇబ్బంది పడుతున్న ఒక పదిహేనేళ్ళ పాప ఆకర్షించింది. అసలే కొత్త డ్రెస్ ఏమో ఏడుపు కూడా మొదలెట్టేసింది ఆ పాప. క్షణాల్లో ఆ పాపదగ్గర నలుగురైదుగురు చేరి... ఆ చక్రం నుండి డ్రస్ తీయడం లొ తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించేస్తున్నారు కానీ పని అవడంలేదు.

కూలి వాళ్ళు సామాన్లు ఇంట్లోకి మోస్తుంటే ... మేనమామ కొడుకుని ఎత్తుకుని వరండాలో నిల్చుని అక్కడ జరిగేది చూడసాగింది. ఆ చక్రం నుండి డ్రస్ లాగే వాళ్ళ దెబ్బకి డ్రస్ ఇంకాస్త ఇరుక్కుపోయిందేమో పెద్దగా ఎడ్చేయడం మొదలెట్టింది. 'అయ్యొ పాపం ' అని మున్ని జాలిగా అనుకుంటు ఉండగానే .. హీరో రేంజర్ సైకిల్ మీద సర్రున వచ్చి ఆగాడొకడు . ఆమ్మాయిని ఏడవద్దని హెచ్చరిస్తున్నట్టుగా సైగ చేసి సైకిల్ వెనక టైర్ ఎత్తి పట్టుకుని ఫెడల్ వెనక్కి తిప్పాడు. చాలా ఈజీగా సైకిల్ చైన్ లోనుండి అమ్మాయి డ్రస్ బయటికి వచ్చింది. అందరి వంక పిచ్చ నా డాష్ ల్లారా అన్నట్టు చూసి .. సైకిలెక్కి ఎంత స్పీడ్ గా వచ్చాడో అంత స్పీడ్ గా వెళ్లిపోయాడు. 'వీడెవడ్రా బాబు రఫ్ అండ్ టఫ్ జీన్స్ యాడ్ లొ అబ్బాయిలాగా బలే వచ్చాడే' అనుకుంది మున్ని.

తర్వాత సాయంత్రం పనులన్నీ అయ్యాక తన చెల్లెల్లకి ఈ విషయం చెప్పింది. "అయితే బాగున్నాడా" కళ్ళు ఎగరేస్తూ కొంటెగా అడిగింది ముష్కాన్ . ముష్కాన్ ఇంటర్ చదువుతుంది. "ఓయ్ నొర్ముయి రాను రాను భయం లేకుండా పోతుంది " అంటు ముష్కాన్ ని కసిరింది పూజ. మున్ని కంటె రెండేళ్లు చిన్నది పూజ. పూజ కన్నా రెండు నెలలు చిన్నది ముస్కాన్ ... ముగ్గురూ అక్క చెల్లెళ్ళ బిడ్డలు. మున్నికి ఎందుకో ఆ పిల్లోడే తెగ గుర్తు వస్తున్నాడు. " ఛి ఏంటి నేను ఎవరి గురించో ఇంతలా ఆలోచించడం" అని తనలో తను అనుకుంటుంది కానీ ఎందుకో ఆ దృశ్యమే తనకి పదేపదే గుర్తువస్తుంది. ఇల్లు సరిగ్గా సర్దుకోలేదు . ఉదయాన్నే లేచి సర్దుకోవాలి అనుకుంటూ పడుకుంది. ఉదయాన్నే ఐదున్నరకి లేచి కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి వరండాలో నిల్చుంది. కళ్ళ ముందు నుండి ఆ హీరో రేంజర్ సైకిల్ వాడు ఆలా వెళుతున్నాడు. తనకి తెలీకుండానే ఒళ్ళు జలదరించింది మున్ని కి . రాత్రంతా వీడి గురించి ఆలోచించిన ఎఫెక్ట్ అనుకుంటా అని సర్దిచేప్పుకుంది. ఇంకవీడి గురించి ఆలోచించకూడదు అని డిసైడ్ అయిపోతే .... వీడేంటి నిద్రలేవగానే దర్శనం ఇచ్చాడు అనుకుంది. కాసేపటికి చెల్లెళ్ళు కూడా నిద్ర లేవడంతో ఇక దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

కొత్తగా తమ ఏరియాలోకి ముగ్గురు అమ్మాయిలూ దిగారు అన్న విషయం తెల్సుకున్న ఆ కాలనీ కుర్రాళ్ళు తడవకి ఒకరు వచ్చి చూసి వెళ్లడం చూసి "ఏంటి అక్కా వీళ్ళు... ఎప్పుడూ అమ్మాయిలని చూడలేదనుకుంటా" అంది పూజ వాళ్ళకేసి చూస్తూ . "మనకెందుకులేవే... అసలే కొత్తూరు........ లేనిపోని గొడవలు ఎందుకు ......అసలే ఇది మాస్ ఏరియా అంట.........." అంటూ మధ్యలోనే ఆగిపోయింది మున్ని. మళ్లీ ఆ సైకిల్ వాడే..తనలోకం తనదే అన్నట్టు ఏదో నవ్వుకుంటూ వెళ్తున్నాడు . వాడికేసి ఆలా చూస్తున్న మున్ని దగ్గరికి వచ్చి " అక్కా నిన్న నువ్వు చెప్పిన ఆ సైకిల్ హీరో వీడేనా ?" అంది పూజ. " ఆ వీడె.............. కానీ కొంచెం different గా ఉన్నాడు కదా .. మిగతా వాళ్ళలా లేడు" అంది మున్ని ( కానీ అప్పటికి వాడు ఇంకా తనని చూడలేదు అని మున్నికి తెలీదు ) .


రెండు రోజులు గడిచాయి ... మున్ని అండ్ కో కి అ పేట కుర్రాళ్ళ బీట్లు ఎక్కువ అయ్యాయి . బయట ఎక్కువగా కూర్చోవద్దని మామయ్య హుకుం జారీ చేశాడు. రెండు రోజులుగా సైకిల్ వాడు కనిపించడం లేదు . ఏమయ్యాడో ? అనుకుంటుండగా ప్రత్య్యక్షం అయ్యాడు వీధి మలుపు లొ. ఎప్పుడూ చాలా సరదాగా ఉన్నట్టు కనిపించే వాడు ఈ రోజు ఏంటి నీలుక్కుని వెళ్తున్నాడు అనుకుంది మున్ని ( వాడు ఆపాటికే తనని గమనించి ఫోజు కొడుతున్నాడని తెలీదు పాపం ) " అందరూ అక్క వైపు చూస్తుంటే అక్కేమో ఆ సైకిల్ వంక చూస్తుంది పాపం" అని కౌంటర్ వేసింది ముస్కాన్. "ఏయ్ చుప్ " అంటూ ముస్కాన్ ని కసిరింది మున్ని. "నేను అన్నదాన్లో తప్పేం ఉందక్కా " అంటూ బుంగమూతి పెట్టింది ముస్కాన్." అది కాదే, ఏంటో చాలా రోజులనుండి పరిచయం ఉన్న వాడిలా అనిపిస్తున్నాడు అంతకుమించి ఇంకేం లేదు " అనేసి లోపలకి వెళ్ళిపోయింది మున్ని. ఆలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ఉదయం మన సైకిల్ హీరో, పక్కన ఇంకొకడు నడుచుకుంటూ వస్తున్నారు. " అక్కా ... కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు వీడు సైకిల్ తో పుట్టాడా? యెప్పుడు చూసినా సైకిల్ తొక్కుతూ లేక నడిపించుకుంటూ కనిపిస్తాడు" అంది పూజ నవ్వుతూ .. పూజ మాటలకూ అందరూ నవ్వేశారు. కానీ మున్ని ఆలోచనలు వేరేగా సాగుతున్నాయి. " ఏంటి వీడు.... నాకేంటి వీడితో అసలు ... ఇప్పటిదాకా ఎంతమందిని చూసినా ఏమీ అనిపీలేదు కానీ వీడితో మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకు " అని తనలోతాను అనుకుంటూ వాడి వైపే చూస్తుంది. పక్కన ఉన్న పిల్ల బొండాం గాడు "అన్నా అన్నా ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది అన్న " అని చెప్పడం వినిపిస్తుంది. అంతలో ఆ సైకిల్ శాల్తీ వెనక్కి తిరిగి చూశాడు చటుక్కున తల దించేసుకుంది. పూజ ముస్కాన్ ల పరిస్థితి కూడా అంతే . తల వంచుకుని ఏదో పని చేస్తునట్టు నటించింది. కాసేపు ఆగి తలెత్తి చూసింది . ఆ బొండాం గాడి నెట్టిన మొట్టికాయ వేస్తూ నవ్వుకుంటూ వెళ్తున్న వాడిని చూసి ముసి ముసిగా నవ్వుకుంది.

కానీవాడు చూసే సమయానికి తను తలదించుకోవడం వాడు గమనించాడు అని తెలుస్కోలేకపోయింది. అ మర్నాడు .............


( ఇంకా ఉంది )


లేత మనసులు - 1

20 comments:

మనసు పలికే said...

వికటకవి గారూ.. భలే కామెడీగా రాస్తున్నారు.. సైకిల్ లో పడ్డ డ్రెస్ తీసేసి హీరొ అయిపోయారా మీరు..? చెప్పనేలేదు ఇన్ని రోజులూ..;)
బాగుంది మీ లేతమనసు(లు)..:)

తిరు said...

సైకిల్ లో పడ్డ డ్రెస్ తీసేసి హీరొ అయిపోయారా మీరు..?
బావుందండీ, మరీ అంత వెటకారమా, హుం :(
శీనన్న అంత చీప్‌గా ప్రవర్తించడు!

నేను చెప్తా ఆ సైకిల్ హీరో ఎవరో ...
మార్తాండ కదా :)

(లేకపోతే మరీ 199x తెలుగు సినిమా స్టోరీలా మాకు వినిపించేది)

కవిత said...

endi ...akka peru pooja..chelli peru muskhaan ahh?

Super kada meeru...

Anonymous said...

తిరు సీనన్నని మార్తాండతో పోల్చావా బలే బలే హిహిహి

..nagarjuna.. said...

ఇకనుండి కామెంటకపొతే ఎటువంటి శాపాలు లేవనమాట...సరే, భలే మంచి ఆఫరు, పసందైన ఆఫరు

తిరు said...

ఓయ్ అనామకా, కామెంట్ సరిగ్గా చదవ్వోయ్ ముందు.

కాయ said...

నా ఆటోగ్రాఫ్ లా బాగుంది సీను బాబు.. మున్ని నీ గురించి ఏమనుకుందో కానీ నువ్వు మాత్రం బాగ ఎక్కువ రాస్తున్నవ్.. నెక్ష్ట్ పార్ట్ లో గుండె పగలటం ఉంటుందని నా గెస్స్

నేస్తం said...

మున్ని వాళ్ళ మేనమామ ,అతని కొడుకు మనసులో ఏమనుకున్నారో రాయలేదేం ఓ పని అయిపోయేది ..

Overwhelmed said...

aa cycle kottesindi mirena?

Sai Praveen said...

Interesting :)

జేబి - JB said...

ఏమో! నాకు పాత్రలన్నీ ముదురుగానే అనిపిస్తున్నాయి. మీరేమో లేతమనసులు అని అంటున్నారు.

శ్రీనివాస్ said...

@ మనసు పలికే :)

మరీ హీరో అవలేదు లెండి ... దృష్టిలో పడిపోయా అంతే

@ తిరు

GRRRRRRRRRRRRRRRR

@ నాగార్జున :) :)

@ కాయ ఫ్రం కర్నూల్

అప్పుడే గెస్ చేయకండి .... అయినా ఊహించిన మలుపులే ఉంటాయి

శ్రీనివాస్ said...

నేస్తం గారు :) ఏం చేస్తామండి మీ అంత ఎత్తు ఎదగలేదింకా.... ఎదిగాక రాస్తా

శ్రీనివాస్ said...

జాబిలీ గారు ఏ సైకిల్ అండీ ??????

థాంక్స్ సాయి ప్రవీణ్

జెబి గారు ముదురు మనసులు అని పెడితే బాగోదని :)

హరే కృష్ణ said...

ముదురు మనసులు :))

ఇందు said...

ఏంటండీ పార్ట్-3 వేయకుండానే 'రోబొ ' గురించి పోస్ట్ వేసారు?? కాని కథ మాత్రం కామెడి గా బాగుందండీ...ఇంకా మీ వికటకవి పిక్ కూడా బాగుంది కాని కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుందేమో!!

పరిమళం said...

ప్చ్ .....మళ్ళీ బ్రేక్ :)

శ్రీనివాస్ said...

@ హరి :))
@ ఇందు గారు వీకెండ్స్ టపా వేస్తే అంతే సంగతులు :)) సోమవారం పొద్దున్న వేస్తా :))

@ పరిమళం గారు ..... సోమవారం గేర్ వేస్తా లెండి

kavya said...

bagundandi next post eppudu rastunaru ?? bale comedy ga manchi feel to undi

కాయ said...

ఇది మీరనుకునే కాయ కాదు... అమెరికా కాయ లెండి.. . ఇంతకీ తరువాత టపా ఎక్కడ ???