శ్రీ రామచంద్రుడు రావణుడి కాళ్ళకి నమస్కరించిన ఘటన బహుశా యే కొద్ది మందికో తెలిసి ఉండవచ్చు . ఒకసారి ఆ సంఘటన గురించి చర్చిద్దాం. సీతమ్మవారిని వెదుకుతూ బయలుదేరిన రాముడు అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్టించి పూజలు చేసుకుంటూ బయలుదేరాడు అంటారు. ఆలా వారధి కట్టిన ప్రాంతం వరకు రాముడు ప్రతిష్టించిన ఆలయాలు ఉన్నాయి. అయితే చివర్లో వారధి కట్టిన తర్వాత యుద్ధానికి బయలుదేరే ముందు అక్కడ సముద్రపు ఒడ్డున శ్రీరాముడు ఇసుకతో ఒక పెద్ద శివలింగం తయారు చేశాడట. ఆ శివలింగానికి ప్రాణ ప్రతిష్ట చేయాల్సిందిగా నారద మహర్షి ని ఆహ్వానిస్తే అయన " రామా ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ట చేయగల సమర్ధత , శివభక్తి ఒక్క రావణాసురుడికే ఉంది కనుక నీవు ఆయన్ని ఆహ్వానించు " అన్నాడట. "మనం పిలిస్తే ఆయన ఎలా వస్తాడు అయినా అతని మీదకి యుద్ధానికి వెళుతూ మళ్లా అయన చేత పూజ చేయించుకోవడం ఏమిటి" అని రామచంద్రుడు ప్రశ్నిస్తే " నీ బాద్యత గా నీవు పిలువు అయన వస్తే వస్తాడు లేకుంటే లేదు " అన్న నారద మహర్షి మాట ప్రకారం రావణుడికి ఆహ్వానం పంపాడట రామచంద్రుడు.
అపర శివభక్తుడు అయిన రావణుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ ప్రాంతానికి విచ్చేసి ఆ శివలింగానికి పూజచేసి ప్రాణప్రతిష్ట చేశాడట. పూజ అంతా అయ్యాక ధర్మం ప్రకారం పూజారి కాళ్ళకి మొక్కాలి , అ పూజారి ఆశీర్వదించాలి . ఈయన ఏమని సంకల్పం చెప్పి మొక్కాలి , ఆయన ఏమని అశీర్వదించాలి ? నిన్ను చంపడానికి వస్తున్నాను నన్ను దీవించు అనుకుని ఈయన మొక్కాలి అయన తధాస్తు అనాలి . రామ చంద్రుడు రావణుడి కాళ్ళకి మొక్కితే ఆయన అభీష్ట ఫలసిద్ధిరస్తు అని దీవించాడట.
శత్రువైనా రమ్మన్న ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మరీ తన చావుకి తానే వరం ఇచ్చి వచ్చిన రావణుడి అంతరంగం ఏమిటి ? రావణుడిని చంపడానికి రావణుడి చేతే తధాస్తు అనిపించడానికే నారదుడు ఈ ఎత్తుగడ వేశాడా? ఈ రెండు ధర్మ సందేహాలు ఎవరైనా పెద్దలు వివరిస్తే సంతోషిస్తాను.
47 comments:
Ee sannivesam sundara kaanda chivarlo kaani yudha kaanda modatlo kaani vastundanukuntaa.
nenu inkaa Sree Chaaganti vaari ayodhya kaanda lone vunnanu. ee sannivesam vachinapudu, mee sandehaalaki vivarana vunte ikkada post chestaa.
Meeru kudaa chavinaalanukunte ramayana pravachanam vinaalanukunte ikkada download chesukondi : http://surasa.net/music/purana/
-- Badri
ఈ విషయం నాకు కొత్త!
ఒక కొత్త విషయం తెలియచేసినందుకు మీకు థాంక్స్!
చాలా మంచి సందేహాన్ని లేవనెత్తారు శ్రీనివాస్ గారూ, నేను కూడా సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మఒడి ఆదిలక్ష్మి గారు కానీ, ఆలోచనతరంగాలు శర్మ గారు కానీ కామెంటుతారేమో చూడాలి.
ఎక్కడ చదివారండి ఇది...? ఒక విషయం చర్చించాలంటే దాని మీద సమగ్రమయిన అవగాహన అవసరం. ఇది రాసిన రచయితలెవరు? ఎవయినా ఆధారాలున్నయా? లేక ప్రమాణ గ్రంధాలున్నాయా???
రచయిత లెవరయినా. మనకి వాల్మికి రాసిన మూల రామాయణమే ప్రమాణం, కనుక ఇటువంటి వాటిని నమ్మకపోవడమే మంచిది..
.....సుధ
ఈ సన్నివేశం ఏదో సినిమాలో చూసి నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. దానికి అప్పట్లో ఎవరో నాకు చెప్పిన సమాధానం:
రావణుడు బ్రాహ్మణుడు. శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి రాముని ఆహ్వానం అందినప్పుడు కూడా రావణుడు ఒక రాక్షసుడిలా కాక ఒక బ్రాహ్మణుడిగా ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. సత్కార్య నిర్వాహణకోసం వచ్చే ఆహ్వానాన్ని తిరస్కరించరాదనె బ్రాహ్మణ నీతికి కట్టుబడి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి వస్తాడు. అదే బ్రాహ్మణ నీతితో పాదాభివందనం చేసినప్పుడు సందర్భోచిత దీవెనతో ఆశీర్వదిస్తాడు.
దీనివల్ల తెలుసుకోవలసినవి (ఇవి కూడా ఆయన చెప్పినవే) -
1) ఆశీర్వాదం అనేది ఎప్పుడూ ఒకేరకంగా వుండదు. అది వారి వారి జీవనశైలి, సందర్భం మరియు సమయాన్ని బట్టి వుంటుది. ఉత్తములైతే దండం పెట్టినవారికి ఏది మంచిదో అది జరగాలని ఆశీర్వదిస్తారట. మధ్యములు దండం పెట్టినవారికి ఏది లాభదాయకమో, అది నెరవేరాలని ఆశీర్వదిస్తారట. అథములు వారికి ఏది లాభదాయకమో, దాని ప్రకారం ఆశీర్వదిస్తారట.
2) రాముడు లంకకు వెళ్లేముందు రావణుని చెరనుంచి సీతను విడిపించుకోవాలనే ఆలోచనతో బయలుదేరతాడు కానీ, రావణున్ని చంపడానికి కాదు. (ఇక్కడ రాముని అభీష్ఠం, రావణుని చెరనుంచి సీతకు విముక్తి) రావణుడు ఉత్తమజాతి బ్రాహ్మడు కనుక రాముని అభీష్ఠం నెరవేరాలని ఆశీర్వదిస్తాడు.
3) బ్రాహమ్ణుడిగా అలా ఆశీర్వదించిన రావణుడే లంకకు వెళ్లాక అహం పొడుచుకొచ్చి రాక్షసుడై రాముని అభీష్ఠానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. అది అహం చేసే కీడు.
నేను ఈ వివరణ తీసుకుని దాదాపు 15 సంవత్సరాలయింది. నాకు గుర్తున్న పాయింట్లను ఇంటర్లింక్ చేస్తే ఇదీ నా లాజిక్ కి అందింది.
నాకు తెలిసి రావణుడి కి తన జన్మ రహస్యం తెలుసు... తను ఎప్పుడూ ఒక ప్రత్యేక గదికి వెళ్తాదు అందులో జయవిజయుల అన్ని జన్మల వృత్తాంతాలు ఉంటాయి.. తనకి రావాల్సిన చావు గురించి అంటే తన విముక్తి కోసం ఏం చేయాలో పరిశీలిస్తుంతాదట ... అంటే మీ పోస్ట్ లో జరగబోయేదానిని త్వరగా జరిపించటానికి ప్రయత్నించాడు ...
నేనూ సుధగారితో ఏకీభవిస్తాను. ఇది వాల్మీకి రామాయణంలో లేదు అని నా నమ్మకం. ఉషశ్రీ కూడా దీని గురించి చెప్పలేదు. ఇది కేవలం కల్పితమని నా నమ్మకం. కావలిస్తే వాల్మీకి రామాయణాన్ని పరిశీలించండి.
http://valmikiramayan.net/
ఈ కధ నాకు తెలియదు కాని రామ రావణ సంగ్రామానికి ముహూర్తం ఎవరు పెడతారు అని రాముడు ఆలోచిస్తుంటే, నారదుడు రావణుని చేత ముహూర్తం పెట్టించుకోమని చెప్తాడు. తన చావుకే తాను ముహూర్తం పెడుతున్నానని తెలిసి కూడా బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించి రావణుడు రాముని విజయానికి ముహూర్తం పెడతాడు. రావణుడిలో ఉన్న సుగుణాలన్నీ అతనిలో స్త్రీలోలత్వం అనే దుర్గుణం వల్ల మరుగున పడి అతని రాక్షసత్వమే ప్రపంచానికి కనిపించింది అంటారు.
రాముడు రావణుని పాదాలకు నమస్కరించడం,రావణుడు యుద్ధానికి ముహూర్తం నిర్ణయించటం..ఈ కథలన్నీ కల్పితాలే.వాల్మీకి రామాయణంలో ఇవేవీ లేవనుకుంటాను.
వాల్మీకి రామాయణంలో లేనివన్నీ కల్పితాలని కొట్టిపారెయ్యడం సముచితం కాదు. ఉత్తర రామాయణమంతా (లవకుశుల కథ) వాల్మీకి రామాయాణంలో కనపడదు. అదంతా కల్పితమేనా?
కొత్త విషయం తెలియచేసినందుకు థాంక్స్.
రావణుడికి తన జన్మ రహస్యం తెలుసని తెలిసని , ఆయన అమ్మ కైకసికి తెలియకపోయినా వంశీ గారికి తెలియడం ఆశ్చర్యము, ముదావహము కలుగ చేసింది ;)
జన్మతహ బ్రాహ్మణుడైన ప్రతి ఒక్కరూ పురోహితులవగలరా? పురోహితుడవడానికి కులమేనా ముఖ్యం, గుణ కర్మాదులు ప్రమాణం కాదా? ఆ విషయం నారదుడికి, క్షత్రియ గురువు విశ్వామిత్రుడి శిష్యుడైన శ్రీరాముడికి ఆమాటకొస్తే వేదవిద్యాపారంగతుడైన రావణుడికి,తెలియదా? తెలిసిన వారు చర్చించండి.
అయ్యా !
వాల్మీకి రచనే ప్రమాణము. ఆయన ఉన్నది ఉన్నట్లు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎవరూ ఎక్కడా సరిదిద్దవలసిన పనిలేకుండా ,[అసలు ఆ అవసరమ్ లేదు] రామ కథను గ్రంథస్థం చేశారు. ఇక రామకథపైన ప్రీతి పెరిగి తనివితీరక కొందరు భక్తులు,రచయితలు కొన్ని ప్రక్షిప్తాలను చేర్చారు. అయితే వాటివల్ల రామాయణమునకు అదనంగా వచ్చే ప్రత్యేకత ఏమీ లేదు. కనుక మనం వాల్మీకిని ప్రమాణంగా తీసుకోవాలి అవాల్మీకాలను కాదు.
అసలు రామాయణం గాయత్రీమంత్రాక్షర సంఖ్యలో దేవతలకు ఇరవైనాలుగువేల లక్షల శ్లోకాలతోను,మానవులకు దక్కింది ఇరవైనాలుగువేల శ్లోకాలతోను జరిగిన రచన అని చెబుతారు పెద్దలు. ఆతరువాత వచ్చిన ప్రక్షిప్తాలలో శంభూకవథలాంటి అప్రామాణిక కథలుకూడా చొప్పించి రాముని పైనే అపవాదులేయటానికి కారణమయ్యాయి.
మీ "అన్నాడట "చెప్పాడుట "కల్పిత కథలో వాస్తవం లేదు .కులాల ప్రసక్తి లో బీజమే ప్రధానం .పౌలస్త్య పుత్రునుగా,బ్రమ్హ మనుమడిగా ,రావణుడు అక్షరాలా విప్రుడే .శివుడు స్మశానంలో ఉంటాడని ఆయన్ని చ౦ డా లు నిగా భావిన్చాలేముకదా ?ఇంటువంటి విషయాలను బ్లాగులో ఉంచేముందు ప్రామానికతలను విస్మరించకుండా ఉంటే మంచిది .మీ డటా/డుట లా వలన హిందూ-ధర్మం పైన యువతకు నమ్మకం పోతోంది.మీకు ఇవి సచాలనాత్మక౦ గా ఉండవచునేమోకాని ,వీటివలన ప్రయోజనం మాత్రం సూన్యం /చల్లా.జయదేవ్ -చెన్నై-౧౭
స్పందించిన అందరికీ ధన్యవాదాలు ,
@ సుధ గారు నేను ఈ విషయాన్ని చదవలేదు ఎవరో పెద్దల మద్య జరుగుతున్న చర్చ మీద ఒక చెవి వేసి విన్నాను. ఇది నిజమా కాదా అన్న విషయం చర్చిస్తేనే కద తెలిసేది. అందుకే చర్చకు తెరతీశాను.
@ సందీప్ గారు లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
@ దుర్గేశ్వర గారు మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు
@astrojoyd గారు అసలు రామాయణ మహా భారతాలా మీద అసలు ఆసక్తి లేని యువతరం ప్రస్తుతం ఉంది . తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకోవడం వల్ల నిజా నిజాలు బయటికి వచ్చి యువతకి ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇక హిందూ ధర్మ పరిరక్షణ విషయానికి వస్తే ఇంతకాలం మెయిల్ ఐ డి లు ఫోన్ నంబర్లు కామెంట్లలో ఇచ్చి మీలాంటి వారు చెసుకున్న ప్రచారం కారణంగా చాలా చక్కగా పరిరక్షించ బడుతుంది. మా లాంటి వాళ్ళ వల్ల వచ్చిన నష్టం లేదులెండి
పైన మొదటి అజ్ఞాత , నరేష్ , వంశి, kk, మొదలైనవారిలో ఉన భినమైన అభిప్రాయలు చూశారుగా .. అందుకే చర్చ జరిగి మంచి విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. అట, డుట ల వల్ల హిందూ ధర్మానికి వచ్చిన నష్టం ఎం లేదు.
బ్లాగును మొదటిసారి సందర్శించి, వ్యాఖ్యను పబ్లిష్ చేసేవారేవరైనా మెయిలర్ ఐడి,సెల్.న౦ ఇవ్వడం సభ్యత.దీన్ని మీ రు ప్రచారం అను కు౦టే అది మీ సభ్యత.వ్యాఖ్యలను మెయిలర్ ఐడి,సెల్.న౦ లు లేకుండా ఇవ్వాలి అనే నియమ౦ లేదే ?ముక్కు /మొహం/ఊరు/పేరు తెలియని వారి వ్యాఖ్యాలకు మీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు గాబోలు.భేష్ చాల మంచి సంప్రదాయమే మీదీ?
పురాణాలపట్ల ఆసక్తిని పెంచడానికి వాటిలోని కల్పిత గాధలను ,రుణాత్మక వ్యాఖ్యలను ఒక అ౦ శ౦ గా ఎంచుకునే వారే ప్రచారానికి ఎగబడున్నట్లు లెక్క./చల్లా .జయదేవానందశాస్త్రి-చెన్నై
I agree with astrojoyd. Srinivas is wrong and talked rubbish.
At one side you cry on anonymous people for not giving (some) name and email, on the otherside you blame the people who give it!
Don't you think you people are cranky, Mr.Srinivas?
You guys write something for keep the blog going, but never learn from your mistakes. huuh..
Well said astrojoyd, kicked straight in BOX :))
This guy deserves it! Just by writing borrowed scrap, he is thinking himself as something great/extrordinary!
maturiy is the main thing in this type of blog topics mr.srinivas.u said ur in 30tys,but i dnt think so.i have got my own reputation as a senior media man from past 20years.still in my 50tys,iam working for a leading english news channel nd my name is well known in 25countries.I dnt need any type of publicity through ur very,very smaal blog,like a frog in the well..wish u good luck my dear boy/challa.jayadev/30-5-10...
Thank u anonymous gaaru/challa.jayadev-30-5-10/chennai-17.......
@ astrojoyd
మిమ్మల్ని ఎవరో చిలక జ్యోతిష్యం చెప్పుకునే వారు అయి ఉంటారు ప్రచారం కోసం ఫోన్ నంబర్లు అవి ఇస్తున్నారు అనుకున్నాను. అందుకే ఆలా మాట్లాడాల్సి వచ్చింది. నా వయసు గురించి , నా పరిపక్వత గురించి మాట్లాడే ముందు 50 సంవత్సరాల వయసు నువ్వు బ్లాగ్ రాసుకునే వాళ్ళని బావిలో కప్పల్లా వర్ణించే నీ పరిపక్వత గురించి ముందు తెలుసుకో . నీకు 20 దేశాల్లో పేరు ఉంటే నాకేంటి 90 దేశాల్లో పేరు ఉంటే నాకేంటి డప్పు కొట్టుకోవడం మాని నా గురించి పూర్తిగా తెల్సుకొ .... బ్లాగ్ ద్వారా ప్రచారం చేసుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదు.
@ అనమకా/ అనామకీ
అజ్ఞాత మొహం వేసుకొచ్చి అడ్డంగా వాగడం కాదు . దమ్ముంటే చల్లా జయదేవ్ లాగా ఏదో ఒక ఐడెంటిటీ తోరా ఎవడి బాక్స్ బద్దలు అవుతుందో చూద్దాం.
నేను చెప్పిన కధ నేను కల్పించిన కధ కాదు చాలా మందిలో ప్రచారం లో ఉన్న కధ ఆ కధ తప్పు కాదు అని చెప్పాల్సిన భాద్యత పెద్దవాళ్ళ మీద ఉంటుంది. అది మానేసి మా లాంటి వాళ్ళ వల్ల హిందూ ధర్మము మీద యువతకి నమ్మకం పోతుంది అని విమర్స్ధాలు చేశారు. ఇలా కొట్టుకోవడం వల్లనే అన్యులు హిందూ మతాన్ని పురాణాలని అపహాస్యం చేస్తున్నారు . యువకులమైన మేము ఆవేశపడ్డా .. సరిదిద్దల్సిన వారు వెక్కిరింథలకి దిగబట్టే మీ పెద్దరికం పోతుంది.
నాది ఇంత పొడుగు నాది అంత పోదుకు అని డబ్బాలు కొట్టుకోవడం మాని మీ వయసుకు తగినట్టు ప్రవర్తిస్తే మంచింది.
నా స్టాట్ కౌంటర్ ఆ అజ్ఞాత మీరు ఇద్దరూ ఒక్కరే అని చెబుతుంది ..... అ కామెంట్లు పంబిష్ అయిన సమయం లో మీరు మాత్రమె నా బ్లాగ్ లో తిరుగుతున్నారు జయదేవ్ గారు . ఇది చాలు మీ నిజ స్వరూపం తెలుసుకోవడానికి..
శ్రీనివాస్ ,
ఆయన మిమ్మల్ని విమర్శించేలేదనుకుంటా! "అన్నాడట "చెప్పాడుట " వంటి వాటి వల్ల సమస్య అన్నారు. మీరు ఆవేశపడి ఆయనని నేరుగా విమర్శలకి దిగారు.
astrojoyd గారు మధ్యలో అజ్ఞాతకి శ్రీనివాస్ కి గతంలో అనేక విషయాలలో అభిప్రాయభేదాలు ఉన్నాయి. మీ ఇద్దరి వాడులాటని వారు తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు పెద్దలు , అర్ధం చేసుకోదగిన వారు కనుక మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదనుకుంటాను. మీరు ఇరువురూ వ్యక్తిగత విమర్శలు మాని సరైన చర్చ కొనసాగించండి అని నా మనవి.
శ్రీనివాస్ ,
మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి బాబు. నేను అజ్ఞాతంగా వాఖ్య చేసినందుకు నన్ను తిట్టకండి.
@ పై అజ్ఞాత నేను మంచిగా కామెంట్స్ పెట్టే అజ్ఞాతల జోలికి వెళ్ళను. కేవలం తిట్టడానికి అజ్ఞాత ముసుగు వేసుకునే వాళ్ళకే నేను వ్యతిరేకం. ఇదే టపాలో కొందరు అజ్ఞాతలకి నేను మర్యాదగా ఇచ్చిన సమాధానం చూడండి. ఒక అజ్ఞాత చేసిన కామెంట్ చూడండి
At one side you cry on anonymous people for not giving (some) name and email, on the otherside you blame the people who give it!
__________________________________
బట్ట తలకి మోకాలికి ముడి పెట్టాడు ఇతగాడు . అజ్ఞాత రూపం లో దాడులు చేసేవారిని వ్యతిరేకించడానికి అదే సమయం లో నా గత టపాలో
" మరొక ౪౫ రోజుల వ్యవధి అనతరం కుజుడు ,కన్యా రాశిలోని శనితో కలవనున్నాడు .దీనినే గ్రహయుద్ధ్హం అంటారు.ఇందువలన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పెద్దపెట్టున రాజకీయ స౦ క్క్షోభాలు చోటు చేసుకోన్నున్నాఈ " అని కామెంట్ పెడుతూ తన ఫోన్ నంబర్లు ఇచ్చిన ఈయన ఎవరో జ్యోతిష్కుడు అయి ఉంటాడు అని భావించి నేను బ్లాగుల్లో ఫోన్ నంబర్లు ఇవ్వడం మీద చేసిన కామెంట్ కి ముడి పెట్టిన అజ్ఞాత ని ఏమనాలో .. ఆ అగ్నతకి థాంక్స్ చెబుతూ కామెంట్ పెట్టిన 50 ఏళ్ళ 20 దేశాల ప్రముఖుడిని ఏమనాలో అర్ధం కావడం లేదు.
వెక్కిరింతకు విమర్శకి తేడా ఉందని గ్రహించండి.వయసులో పెద్దగా మీమ్మల్ని సరిదిద్దుదామనే ఆ వ్యాఖ్యనును వ్రాసాను.అవేశపడింది మీరే గాని నేనుకాదు.ఆకసం మీద ఉమ్మేస్తే అది ఎవరిమీద పడుతుందో గ్రహించగలరు.చిలకశాస్త్రం ఒకరిది ,చింతపండు/చిల్లర వ్యాపారం మరొకరిది కావచ్చు.మీ కోపమే మీ శత్రువు అని గ్రహిస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం.మీ గురించి తెలుసుకోవాల్సి గొప్ప మహనీయులు కాదు మీరు.అహంకారం పతన హేతువు అని గ్రహించండి ..చల్లా.జయదేవ్ /చెన్నై-౧౭
Mr.Srinivas,
Whatever be his/my profession, what he said should of concern not what he is! your defence is illogical and weak. What your wisdom says, on this?
'Better keep quiet, more you talk, more others know what you are up to' - a saying
నేను ప్రతి వ్యాఖ్యలో నా పేరు ఇస్తున్నేఉన్నాను.ఇందులో అజ్ఞాతం ఏమిలేదు.కుజుని వ్యాఖ్య కూడా నేను పబ్లిష్ చేసినదే.అందులో సైతం పేరు ఉంది.జ్యోతీశ్యం నా అభిమాన విషయం.మీ స్టాట్ ను ఒక సారి పి.సి.టేచ్ తో వెరిఫి చేఇంచండి. మీడియా మాన్ గా నేనెప్పుడు అజ్నాతపు ఐ.డి ల తో వ్యాఖ్యలు పబ్లిష్ చెయ్యలేదు.సాంకేతికంగా ఒక యంత్రం చూపినదానిని బట్టి మనిషిని అంచనా వేసే మిమ్మలును చూస్తుంటే జాలి వేస్తున్నది.బ్లాగు రచయుతలకు సహనం/సమ్స్కారం ప్రధ్హానమైనవి అనగ్ర హించండి.మీ సమాదాన్నాల్లో ఇకమీదట ఏకవచన సంభోధనలు రానివ్వకండి .
అసలు చర్చ నుండి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఎక్కువై ..... ఇతరులకు పలుచన అవుతున్నాము. ఇక ఈ విషయం మీద వాద ప్రతివాదాలు ఇంతటితో ముగిద్దాం.
ఒకరు తమ చిలక వ్యాపారానికి ఫోన్ నమ్బెర్లు ఇవ్వవచ్చు .మరొకరు సమాజ సేవ అంటూ వెబ్ల ద్వారా తమని గురించి ప్రచారం చేసుకోవచ్చును,డోంట్ పాయింట్ అవుట్ యువర్ ఫింగేర్స్ ఆన్ అన్య్బోడి శ్రీనివాస్ గారు /చల్లా.జయదేవ్ /౩౦-౫-౧౦ /చెన్నై-౧౭
Mr . astrojoyd
నేను ఇప్పటికే ఈ విషయం మీద చర్చ ముగిద్దాం అన్నాను . ఇందులో సమాజసేవని లాగకండి. చివరి సారిగా చెబుతున్నాను ఇతర విషయాలు ముగిద్దాం.
ఓకే ..అట్లాస్ట్ ఆ గుడ్ ఎండ్..శ్రీనివాస్ గారు /జయదేవ్ ..చెన్నై
ippti daka chadivinanduku nenu vedavana..
Srinivas garu meeru raji padithe ela :)
Just joking Don't attack on me.
జోన్నాదుల గారు,
శ్రీనివాస్ లాంటి మనిషి రాజీ పడ్డాడు అంటే ఏదో తెరవెనుక వ్యూహం అని అర్ధం అవడం లేదా? వెనకడుగు వేసినట్టే వేసి మార్తాండ కి తలంటిన వైనం మరిచారా?
@ జొన్నాదుల గారు చర్చ పక్కదారి పడుతుంది మద్యలో కొందరు అజ్ఞాతలు వచ్చి ఆజ్యం పోస్తున్నారు అనే వుద్దేశం తోనే నేను చర్చ ముగించాను
@ అజ్ఞాత వ్యూహాలు లేవు స్కెచ్ లు లేవు నాకు ముసుగు వేసే పని మాని పనికొచ్చే పని ఏదన్నా చేయండి
Anonymous May 29, 2010 7:49 AM
రావణుడికి తన జన్మ రహస్యం తెలుసని తెలిసని , ఆయన అమ్మ కైకసికి తెలియకపోయినా వంశీ గారికి తెలియడం ఆశ్చర్యము, ముదావహము కలుగ చేసింది ;)
~~~~~~~
జన్మతహ బ్రాహ్మణుడైన ప్రతి ఒక్కరూ పురోహితులవగలరా? పురోహితుడవడానికి కులమేనా ముఖ్యం, గుణ కర్మాదులు ప్రమాణం కాదా? ఆ విషయం నారదుడికి, క్షత్రియ గురువు విశ్వామిత్రుడి శిష్యుడైన శ్రీరాముడికి ఆమాటకొస్తే వేదవిద్యాపారంగతుడైన రావణుడికి,తెలియదా? తెలిసిన వారు చర్చించండి.
~~~~~~~
వాదనల్లో పడి పైన ఈ చక్కటి అంశాన్ని మర్చిపోయారు...
శ్రీనివాస్ గారు!॒...మీరు అనుమతిస్తే ఆ చర్చ ని కొనసాగిద్దాం.
-సుధ
How come I missed this?
ఇస్ష్యూ లేకుండా గొడవ అంటే ఇదే :)) LOOOOOOL
పురోహితుడవడానికి కులమేనా ముఖ్యం, గుణ కర్మాదులు ప్రమాణం కాదా?
____________________________________
Very well said! Actually the second one is more relevant than the first.
తప్పకుండా చర్చ కొనసాగించండి సుధ గారు
నాకు తెలిసిన రెండుముక్కలు- రాముడు శివలింగాలను ప్రతిష్టించింది లంకకు వెళ్తూకాదు. రావణసంహారం చేశాక. అందుకు కారణం- రావణుడు బ్రహ్మజ్ఞాని. అతనిని సంహరించండం వల్ల రామునికి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. దానికి పరిహారంగా మహర్షులు లింగస్థాపనను సూచించారు. మీరు రామలింగేశ్వరుని పటం చూస్తే అందులో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వానరులు కనిపిస్తారు.
గుణకర్మాదులు ముఖ్యంకాదా? అన్నారు. రావణుని గుణగణాలు లెక్కించేస్థాయికాదు మనది. ఆత్మలింగాన్నే ఒడిసిపట్టుకున్న వ్యక్తి. ఆయన జన్మతః బ్రాహ్మణుడు. పూజాపునస్కారం చేసేవాడు. కాకపోతే సంభావనలకోసం వ్రతాలుచెయ్యించే సిద్ధాంతికాదు. మీకోసంగతి తెలుసోలేదో. ఆయనా సంఖ్యాఋణగణభూషితుడు. అంటే గణితశాస్త్రంలో ప్రావీణ్యం కలవాడు. కానీ తల్లినే చెరపట్టాలన్న పాడుబుద్ధికి బలికాక తప్పలేదు.
ఈకథను నమ్మబుద్ధికావట్లేదు. వాల్మీకి తనరచనలో రావణుని గొప్పగా పొగిడాడు. ఒకవేళ ఇదినిజమయ్యి ఉంటే ఇంతముఖ్యమైన దానిని ఆయన వదలడుకదా
శ్రీరాముడు,రావణుడు వారిరువురూ ఒకరికొకరు ఎదురెదురుగా తారసపడిన సంఘటనలు ఎక్కడా కనిపించవు.యుద్ధకాండలో చివర రోజులలో రామ,రావణులు తలపడే సంఘటనలోనే ఇరువురూ ఒకరిని ఒకరు చూసుకుంటారు.అలాగే శ్రీరాముడు శివలింగ ప్రతిష్ట కూడా తిరుగు ప్రయాణంలో ప్రతిష్టించింది. మరి అలాంటి ఘటనలో రావణుడు వచ్చాడు అనడానికి ఆధారమే లేదు.
ఇక్కడ అలాంటి సంఘటనలు కొన్ని సినిమాలలో హీరోల స్థానంను పెంచుకునే దిశగా వ్యాపార దృష్టితో చిత్రిస్తారు. వాటిని కాకుండా గ్రంధపఠనం సత్సాంగత్యం లలో ఇలాంటివాటిని విశ్లేషంచుకోవచ్చు.
అలానే సూపర్ డూపర్ హిట్ అయిన "మాయాబజార్"సినిమా లో పాత్రలు అయితే మహాభారతంలో ఉన్నవే.. ఒకటి అర పాత్రలు తప్ప. కానీ పూర్తిగా సినిమా పరంగా చూస్తే, ఆ సంఘటన మహాభారతంలో లేనేలేదు. శశిరేఖ పాత్రే కల్పితం. ఇది ఎంతమందికి తెలుసు.
అలా సినిమాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషణ అంటే చర్చ అసంబద్దంగా అసంపూర్తిగా సాగవచ్చు.
రామాయణ మహాభారతంలు చరిత్రలు యదార్థ జరిగిన సంఘటనలు.. కాలప్రభావంలో కవుల అభిరుచులు అలంకార రూపంలో కొంత జోప్పించి ఉండవచ్చు. గానీ ఆనాటి వారి మనో స్థితి స్థాయి మనకంటే ఎన్నోరెట్లు అధికం.అందువలననే రాజ్యరికం నుండి వనవాసంకు ఏగినా ఎవరినీ ఏమీ అనకుండా వారు వారి మార్గంలో వర్తమానంలో జీవించారు.
గతంను తలవకుండా భువిష్యత్తులో విహరించకుండా.. వర్తమానంలో జీవించారు. వర్తమానంలో ధర్మం భవిషత్తుకు బాట.
వారికి తెలుసు కాలమహిమ. గతంకు వర్తమానం భవిష్యత్తు అని,భవిష్యత్తుకు వర్తమానం భవిష్యత్తు.కాలం ధర్మం తో ముడిపడి ఉంటుంది.. అందుకే వారు ఎపుడూ ధర్మం ను వీడలా..!
ధర్మో రక్షతి రక్షితః
నాకు తెలిసినంతలో
🙏
హరిబాబు
హరి బాబు గారు మీ వ్యాఖ్య బాగుంది.
Haribabu said...
శ్రీరాముడు శివలింగ ప్రతిష్ట కూడా తిరుగు ప్రయాణంలో ప్రతిష్టించింది.
hari.S.babu
తిరుగు ప్రయాణంలో అంత తీరిక ఎక్కడుంది?సీత అగ్నిప్రవేశ ఘట్టం అయిపోగానే రాముడికి భరతుడు గుర్తొచ్చాడు.శరవేగాన వెళ్ళే ఉపాయం చెప్పమంటే విభీషణుడు పుష్పకం గురించి చెప్పి అందరూ ఎక్కి అయోధ్యకి వచ్చేస్తారు.మధ్యలో ఆగాల్సి వచ్చినప్పుడు కూడా హనుమని భరతుడికి విషయం చెప్పమని పంపించి గానీ ఆగలేదు రాముడు.వాల్మీకి రాముడుమధ్యలో పుష్పకాన్ని ఆపి లింగప్రతిష్ఠ చేసినట్టు చెప్పలేదు,అవునా?
అసలైన విచిత్రం ఏమిటంటే సీతకి యుధ్ధం మొదలయ్యే ముందు గెలుపు కోసం తను శివలింగప్రతిష్ఠ చేసి చాతుర్మాస్యం చేసిన చోటును చూపిస్తాడు.
Haribabu said...
రామాయణ మహాభారతంలు చరిత్రలు యదార్థ జరిగిన సంఘటనలు..
hari.S.babu
మరి చరిత్రని ఎందుకు వక్రీకరించారు?"శ్రీరాముడు శివలింగ ప్రతిష్ట కూడా తిరుగు ప్రయాణంలో ప్రతిష్టించింది." అనే అవాల్మీక విశ్కేషణ చెయ్యడం తప్పు కాదా!
Post a Comment