నిన్న మద్యాహ్నం టీవీ చూస్తుండగా ఒక్క సారిగా డాం అని పెద్ద శబ్దం ఆ వెంటనే అమ్మో అయ్యో ... అంటూ పెద్ద కేకలు వినిపించాయి. అలాంటివి జరిగినప్పుడు మనల్ని ఎవరూ కంట్రోల్ చేయలేరుగా ..... సిలిండర్ పేలి ఉంటుంది అన్న అనుమానంతో దగ్గరలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అని చూసుకుంటూనే అటు పరిగెత్తాను. అక్కడ ఆ చాయలేమీ కనిపీలేదు.. ఏమి జరిగి ఉంటుందా అని అనుకునేలోపే ఆ ఇంటికి వెనకవైపు నుండి ఏడ్చుకుంటూ వచ్చింది ఒకావిడ .... ఏమైందమ్మా అని అడిగే లోపే "మా కుక్క రాత్రి నుండి పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తుంది.. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే రాలేదు అందుకే నక్కలోడిని పిలిపించి .. కల్పించేశాం" అని చెప్పింది వెక్కుతూ. ఆ ఇంట్లో మిగతా కుటుంబసభ్యులు కూడా విషాదవదనాలు వేసుకుని బయటికి వచ్చారు . తుపాకీ భుజాన వేసుకుని చనిపోయిన కుక్కని గోతం లో వేసుకున్న నక్కలోడు కూడా బయటికి వచ్చాడు .
నేను బయటకి రాగానే ప్రతి రోజూ ఒకసారైనా నా దగ్గరికి వచ్చి నా కాలు వాసన చూసి కాసేపు ఆడుకుని వెళ్ళే ఆ కుక్క గుర్తు వచ్చి మనసంతా అదోలా అయిపోయింది ( బహుశా మా రాయుడికి సంబందించిన వాసన అది పసి గడుతుంది అనుకుంటా ) . ఇదే పరిస్థితి రేపు నా రాయుడికి వస్తే .... అమ్మో ఆ ఊహే భరించలేకపోయాను . తర్వాత డౌట్ వచ్చి అడిగా " అవును ఇంజక్షన్ లు వేయించలేదా ?" అని ... "లేదు బాబు అవసరం లేదనుకున్నాం " అని చెప్పారు వాళ్ళు.. అంత కాడికి కుక్కని పెంచుకోవడం దేనికి అని వాళ్ళ మొహన్నే అడుగుదాం అనుకున్నా కానీ అడగలేకపోయా...... కుక్కని పెంచుకోవాలి అనుకోగానే సరా ..... సరైన పద్దతిలో పెంచుకోవాలి .... ఏదో అన్నం పెట్టి వీధి లో వదిలేస్తే .... చెత్త చెదారం తినో లేక పిచ్చి కుక్కలు కరిచో దీనికీ పిచ్చిపట్టే ప్రమాదం ఉంది . చాలా ఊళ్లలో చాల మంది ఇలాగే కుక్కలు పెంచుతారని ఆతర్వాత అక్కడ జరగిన చర్చల్లో విన్నా .... ఏమైనా మనం ఏమీ చేయలేం గా ..
ప్రతి సంవతరం ఇంజక్షన్స్ వేయించాలి
ప్రతినెలా డివార్మింగ్ టాబ్లెట్స్ వేయాలి
వారానికి రెండు సార్లు లాల ( స్నానం ) పోయాలి
హెయిర్ ఫాల్ అవకుండా అప్పుడప్పుడు ఒక టానిక్కు తాపాలి
ఇవన్నీ చేయగలిగితేనే కుక్కలు పంచుకోమని .... ముందు ముందు ఎవరైనా కుక్కని పెంచుకోవడానికి ఉత్సాహపడే వాళ్ళకి చెబుదామని ఈ టపా.

16 comments:
ప్చ్
తుపాకీతో కాల్చిపడేసారా..ఎంత ఘోరం..వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలానే జరిగితే కాల్చిపడేస్తారా?? అది ముద్దు ముద్దుగా తిరుగుతూ తోక ఆడిస్తే కావాలి...జబ్బు పడితే వద్దంట..ఎంత స్వార్ధం..దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో అయినా దానికి వైద్యం చేయించొచ్చు కదా!!
దాన్ని కాల్చేసి మళ్ళీ ఏడుపా? ఎంత హిపోక్రసీ...
ఈ ఇడియట్ రాయుడుగాడికి ఇన్ని చెయ్యబట్టే ఇంత handsomeగా ఉన్నాడు.. ;-) ఈడి కొత్త ఫొటోలేవి ఈ మధ్య తియ్యలేదా?
" నక్కలోడు " పదప్రయోగం కరక్టేనా ?
హ్మ్..పాపం కదా అలా కాల్పించడం..ఇంతకీ ఆవిడ ఏడుపు ఎందుకో దగ్గరుండి చేయించి మరీ.
మీ కుక్క పేరు రాయుడు అని పెట్టడం వెనుక ఏమయినా ఇంట్రస్టింగ్ కధ ఉంటే టపా రాద్దురూ
Srujana gaaru :(
శేఖర్ గారు ..... నట్టింట్లో కాల్పించి కూడా ఏమీ జరగనట్టు సాయంత్రానికి మమూలైఒపోయారు వాళ్ళు.
అజ్ఞాత , మీకు నక్కలోల్ల గురించి తెలీదనుకుంటా ... నక్కలోదిని నక్కలోడు అనకపోతే తగాదాకి వస్తాడు .. అయితే నక్కలోడా అని పిలవాలి లెకపొతే కోరివికార్ అనాలి.
మొదటి అజ్ఞాత గారు .. త్వరలో రాయుడి తాజా ఫోటోలు పెడతా
రిషి గారు వీడి పేరు రాయుడు అని పెద్డటం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉంది తప్పకుండా రాస్తా.
:-(
hmm :(
నీ లాంటి వాళ్ళు పక్కన ఉంటే ... ఆ కుక్క చావుకి నీకు కూడా భాగం ఉంది... కుక్కలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించు ... కనీసం మనుషులపై నైనా జాలి దయ చూపిస్తారు .. జాగ్రత్తగా నడుచుకుంటారు ...
@ బురుసు బాబా
అవున్రా నువ్వు కూడా రారా . కలిసి అవగాహన కర్యక్రమాలు నిర్వహిద్దాం. సరేనా .. చెప్పరా
అయ్యో. ప్రేమతోపెంచుకున్న దాన్ని ఎలా చంపించగలిగారో!!
>>ప్రతి సంవతరం ఇంజక్షన్స్ వేయించాలి
ప్రతినెలా డివార్మింగ్ టాబ్లెట్స్ వేయాలి
వారానికి రెండు సార్లు లాల ( స్నానం ) పోయాలి
హెయిర్ ఫాల్ అవకుండా అప్పుడప్పుడు ఒక టానిక్కు తాపాలి<<
కుక్కని పెంచుకోవాలనుకునేవారికి నాది ఇంకొక విన్నపం. ఇండియన్ డాగ్ పెంచుకొండి. వీటికి వ్యాధులు రావటం కుడా తక్కువ. చాలా ప్రేమ చూపుతాయికుడా.
అన్నట్టు మీరాయుడు పమేరియన్ కదూ. బాబోయ్ ఇవి మరీ అలుగుతాయండి. గారాబంచేస్తూ ఉండాలి :(
టిపికల్ రాయుడు చేసే పనులు
ఇంజక్షన్ వేయించిన రోజు రాయుడు నాతో అసలు పలకడు
వాడి ముందు నన్ను ఎవరైనా పట్టుకుంటే చాల పోస్సేసివ్ అయిపోతాడు
ఇంకో కుక్కని వాడి ముందు పొరబాటున తల నిమిరితే ఇంకా ఇళ్ళు పీకి పందిరే
మా ఇంట్లోకి ఎవరైనా ఏదైనా తేవచ్చు గానీ .... ఇంటి నుండి బయటికి చీపురు పుల్ల తీసుకెళ్ళినా వాళ్ళు ఔట్
మొదట్లో పక్కిళ్ళ లోనుండి జండూ బాం లు , దువ్వెనలు తెచ్చేవ్బాడు .. ఆ అలవాటు మానిపించడానికి నా హ్యాట్ లో ప్రాణం బూట్ లోకి వచ్చింది.
మీరు చూడలేదనుకుంటాను ఆ మధ్య NTVలో చూపించారు ఒక న్యూస్ స్టోరీ! ఒకాయన మనవడిని కుక్క కరిస్తే అది సీరియస్ అయి చచ్చిపోయాడట.(ఇంజక్షన్ ఇప్పించకుండా మంత్రం ఏదో వేయించి ఉంటారు) అప్పటి నుంచి కుక్కల మీద పగ బట్టి విషం ఇంజెక్షన్లు ఇరవై ముప్ఫై సంచిలో పెట్టుకుని సైకిల్ మీద భార్యా భర్తలిద్దరూ ఊరూరూ తిరిగి కనపడిన కుక్కలన్నింటికీ ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తున్నారు. NTVకెమెరా ముందే రెండు కుక్కల్ని చంపేశాడు. వీళ్ళేమో వినోదంగా అదంతా షూట్ చేసి వార్తల్లో చూపించారు. విషం ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే అవి గిల గిలా కొట్టుకుని చావడం చూస్తే ఎంతో బాధ వేసింది.
అలాంటివాళ్ళ గురించి పోలీసులకు చెప్పాల్సింది పోయి దాన్ని చిత్రీకరించిన వాళ్ళనేమనాలో అర్థం కాలేదు.
ఏమైనా కుక్కని అలా చంపి పారేయడం అమానుషం! పరిస్థితి ఇంకా విషమించలేదు కాబట్టి వేరే ఏదైనా చర్య తీసుకుంటే బావుండేదేమో! చేతులారా పెంచిన జంతువును అలా చంపడం ఘోరం!
bavunnayi mee Rayudu chese panulu . vadi gurichi seperate post rayandi photos to patu.
శ్రీనివాస్ గారు మీ వూళ్ళో తూఫాన్ భీభత్సం చేసిందంట. ఇప్పుడు అంతా క్షేమమేకదా.
రెండ్రోజులుగా పోస్టేమీలేదు మీరు ఎలాఉన్నారు.
Hey Hope you are doing fine.
Post a Comment