అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/18/10

సిగ్గు, శరం - బుద్ది, జ్ఞానం ఉన్నట్టా లేనట్టా ?

ఛత్తీస్ ఘడ్ దంతేవాడలో 75 మందికిపైగా పోలీసులని మావోయిస్ట్ లు బెట్టుకున్నప్పుడు ........ దానికి కనీస బాద్యత వహించాల్సిన చిదంబరం ... రాజీనామా డ్రామా ఆడి వదిలేశారు. ఆంధ్ర తెలంగాణా ఉద్యమాల్లో వేలు పెట్టి పెద్ద రచ్చ చేసినప్పుడే అయన తెలివితేటలు అందరికే అవగతం అయ్యాయి . అలాంటి వ్యక్తి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అనుకోవడం ఎస్పీవోలు , సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన నిజమైన తప్పు. సరే రాజకీయనాయకుల సంగతి వదిలేద్దాం . అడవుల్లో తిరిగే పోలీసులకి వారి ఆఫీసర్లకి కాస్తైనా జ్ఞానం ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వారానికి ఒకసారి పోలీసులపై మావోయిస్ట్ లు తెగబడుతూనే ఉన్నారు. అంతెందుకు గత 30సంవత్సరాలుగా రహదారుల్లో మందుపాతరలు పేలుతూనే ఉన్నాయి అయినా పోలీసులు రహదారి మార్గాన ప్రయాణం మానుకోలేక పోతున్నారు. ఆ దారిన వెళ్తే చచ్చే అవకాశాలు ఉన్నా ఎందుకు పోతున్నారు? విశ్లేషిస్తే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి.

మన పోలీసులకి కనీస దేహదారుడ్యం కూడా ఉండదు .. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం చేయాల్సిన పరుగు , లాంగ్ జంప్ హైజంప్ వంటివి చేయకుండా దొడ్డిదారిన ప్రవేశించడం . లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించడం ప్రధాన కారణం. ఇక ఉద్యోగాలు వచ్చేశాక ఉద్యోగ భద్రత వగైరాల వల్ల అసలు శారిరక వ్యాయామాలు చేయకపోవడం .... ఆ కారణంగా అడవుల్లో కూంబింగ్ డ్యూటీ లు వేశాక అక్కడ నడిచి తిరగలేకపోవడం. మనం ముందు అనుకున్నట్టే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు మార్గాన పోలీసులు ప్రయాణించడం ... ఆత్మహత్యా సదృశ్యం .. అసలు రోడ్డు మార్గాన వెళ్ళకూడదు ... ఒక వేళ రోడ్డు దాటాల్సి వస్తే ఇటు నుండి అటు దూకి వెళ్ళాలి ........ఇది ట్రైనింగ్ లో చెప్పే ప్రధాన పాఠం. రోడ్లకు దూరంగా మావోయిస్ట్ లు ఎలాగైతే అడవి మార్గాన సంచరిస్తున్నారో పోలీసులు కూడా అడవి లో సంచరించ లేక పోతున్నారు ఎందుకంటే . వీళ్ళకి ఆ ఓపిక లేదు , వీళ్ళు తిరగలేరు , పట్టుమని పది కిలోమీటర్లు కూడా నడవలేరు. అసలు ఒక వ్యూహం అనేది ఉండదు . పనికి మాలిన వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని అడవుల్ని జల్లెడ పట్టడానికి పంపిస్తే ఇలాగే ఉంటుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోకపోతే రేపెలా ఉంటుందో తెల్సా .. ముంబై తరహా ఘటన లు జరిగినప్పుడు కాపాడడానికి వచ్చే యెన్.ఎస్.జి కమాండో లు కూడా చేతగాని వారు వచ్చినా ఆశ్చర్యం లేదు .


మరొక కారణం పై స్థాయిలో అవినీతి ...అసలు కేంద్రం తలుచుకుంటే గగన మార్గాన తిరగడానికి పోలీసులకు హెలికాప్టర్లు .. అత్యదునిక శాటిలైట్ ఫోన్లు సమకూర్చలేదా? సమకూర్చగలదు కానీ ఒక వేళ వాటికి నిధులు మంజూరు చేస్తే ... చివరికి పోలీసుల వద్దకి వచ్చేవి డబ్బా ఫోన్ లు ... తుప్పుపట్టిన పాత హెలికాప్టర్లు .

ఆయుధాల్లో నాణ్యత లేదు, మనుషుల్లో సత్తా లేదు. అసలు గ్రీన్ హంట్ ఎందుకో ఎవడికీ తెలీదు . అంతా మాయ . ఈ సారి పోలీసులతో బాటు ప్రజల ప్రాణాలు సైతం గాల్లో కలిసి పోయాయి. మావోయిస్ట్ లు సమసమాజం స్థాపించే లోపు సమాజమే లేకుండా పోతుందేమో !

11 comments:

Anonymous said...

నైక్ క్యాపానంద స్వామి garu,

Its a nice post !!

Anonymous said...

ఒక వేళ రోడ్డు దాటాల్సి వస్తే ఇటు నుండి అటు దూకి వెళ్ళాలి ........
>.How this is possible?Just curious..

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత గారు అడవుల్లో రోడ్ల వెడల్పు మన దిల్ సుఖ నగర్ మెయిన్ రోడ్ అంత ఉండదు లెండి

వీరుభొట్ల వెంకట గణేష్ said...

ఎందుకో కాని, ఈ పోస్ట్ మీరు రాసినట్టు లేదు. క్లారిటీ మిస్ అయ్యింది.

శ్రీనివాస్ said...

@ ganesh క్లారిటీ లేకపోయినా కాన్సెప్ట్ అర్ధం అయితే చాలు

Anonymous said...

ఓ,అలాగా..మరి ఈరోజు ఈనాడు పేపర్ లో వేసిన ఫొటోలలో రోడ్డు ఓ మాదిరి వెడల్పుగానే ఉందే?అంటే అటునుండి ఇటు జంప్ చేసి వెళ్ళేంత వెడల్పు లేదు
మీరు కొన్ని విషయాలు గమనించకుండా అన్ని ప్రాణాలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయేసరికి ఆవేశం తో టపా రాసినట్లున్నారు

1)రోడ్డు దాటడానికి అటు నుండి ఇటు జంప్ చెయ్యాలి సరే,అడవులలో అయితే ఇలాగ,మీరన్నట్లు మన దిల్సుఖ్ నగర్ రోడ్డు అంత వెడల్పు ఉండవు కాబట్టి

మరి ఒక ఊరు నుండి ఇంకొక ఊరుకి కూడా గెంతాలా?

2)>>పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం చేయాల్సిన పరుగు , లాంగ్ జంప్ హైజంప్ వంటివి చేయకుండా దొడ్డిదారిన ప్రవేశించడం . లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించడం

ఇది అందరికీ వర్తించదు అనుకుంటా..అన్నీ చేసి ఉద్యోగం లోకి వచ్చినా తరువాత ప్రాక్టీసు ఉండదు అనండి,ఒప్పుకునే నిజం అది.నేను ఒప్పుకోవడం కాదు,ఫ్యాక్ట్ అది

3)>>వీళ్ళకి ఆ ఓపిక లేదు , వీళ్ళు తిరగలేరు , పట్టుమని పది కిలోమీటర్లు కూడా నడవలేరు
మీ భాష లో చెప్పాలి అంతే తెగ బలిసి ఇలా ఎవ్వరూ చావుకు ఎదురెళ్ళరండీ
రోజుల తరబడి అడవులలో తిరిగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారా
మావోలకి అంటే ఇల్లు,ఊరు ఉండవు కాబట్టి అడవులలో ఎన్ని రోజులయినా ఉండగలరు.

డ్యూటీ లో అలసిపోయిన వీరు ఇంటికి త్వరగా చేరుకుండామనే తపన ఉండటం సహజం కాదా?అఫ్కోర్స్,ఎవరయినా ఆఫీసరు ఉండి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అనుకోండి

4)>>మనుషుల్లో సత్తా లేదు. అసలు గ్రీన్ హంట్ ఎందుకో ఎవడికీ తెలీదు .
మనుషులలో సత్తా లేదనడం సరికాదు.సత్త ఉన్న వాళ్ళనే అడవులలోకి పంపుతున్నారు,ఎట్లీస్ట్ సగం మంది.కానీ వారితో వారి శక్తి సామర్ధ్యాలకి మించి పని చేయిస్తున్నారు.మనకి వరుసగా 2 రోజులు సరి అయిన నిద్ర లేక్పోతేనే మెదళ్ళు పని చెయ్యవే.మరి రోజుల తరబడి అలా పరిచయం లేని అడవులలో ఉన్న వాళ్ళ పరిస్థితి....?

ఇంకొక ముఖ్య విషయం...విమర్శ ని సహ్రుదయం తో స్వీకరించడం అలవర్చుకోండి.ప్రతీ టపా కీ ఆహా ఓహో లే రావాలి అంటే కుదరదు ఏమో?

శ్రీనివాస్ said...

ప్రతీ టపా కీ ఆహా ఓహో లే రావాలి అంటే కుదరదు ఏమో?

అల ఆహా ఒహోలు కోరుకునే బ్యాచ్ వేరే ఉంది లెండి ...... మీ ముక్కలు అక్కడ చెప్పండి

శ్రీనివాస్ said...

ఇకమీరు వ్రాసిన విషయానికి వస్తే ఆ పేపర్ లో ఫోటో నేను కూడా చూశాను మందు పాతర ఎక్కడ ఎలా పెడతారు .... రోడ్డు పరిమాణాన్ని బట్టి ఎలా జంప్ చేయాలి అన్నదాని మీద వాళ్లకి ట్రైనింగ్ ఉంటుంది తెల్సా మీకు ....

మరి ఒక ఊరు నుండి ఇంకొక ఊరుకి కూడా గెంతాలా?

ఇంత ఏటకారం అవసరమా

చస్తామని తెలిసి కూడా ఎదురు వెళ్లారు అంటే తెగ బలిసి వెళ్ళడమే .

కానీ వారితో వారి శక్తి సామర్ధ్యాలకి మించి పని చేయిస్తున్నారు.మనకి వరుసగా 2 రోజులు సరి అయిన నిద్ర లేక్పోతేనే మెదళ్ళు పని చెయ్యవే.మరి రోజుల తరబడి అలా పరిచయం లేని అడవులలో ఉన్న వాళ్ళ పరిస్థితి....?

అదేనండి నేను చెప్పింది సరైన వ్యూహం లేకుండా తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని ...

శ్రీనివాస్ said...

and మీరన్నట్టు ఆవేశం లోనే వ్రాశాను ..... ఒకటి రెండు పాయింట్స్ నేను వివరించడం లో క్లారిటీ లేదని అర్ధం అవుతుంది.

కెక్యూబ్ వర్మ said...

మీరు రాసిన దాంట్లో ఏమీ తప్పులేదు. బాగానే రాశారు. అసలు సామాన్యజనం ప్రయాణించే బస్సులలో, జీపులలో వీళ్ళని ఆయుధాలతో కానీ, గుర్తించే విధంగా కానీ వెళ్ళరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా వాళ్ళు ట్రైన్డ్ పెర్సన్స్ కాదు. కోయ కమాండోస్ గా పిలుస్తున్న ఆదివాసీలలో మావోయిస్టులపైకి ప్రయోగిస్తున్న సల్వాజుడుం ఫోర్స్. వీళ్ళకు హత్యలు, దోచుకోవడం, మానభంగాలు చేయడం, గృహదహనాలు చేయడమే పని. అందుకే వీళ్ళని టార్గెట్ చేసారు. అయినా సామాన్య జనం వున్నారని తెలిసి ఆ విధంగా చేయడం తప్పే..

Anonymous said...

if they have helicopters, they never do their job. Let them learn to fight or die. This is the rule or forest.