అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/12/10

సమానత్వం సాధించారు

సరిగ్గా ఒకటిన్నర సంవత్సరం క్రితం మేము బ్లాగుల్లోకి వచ్చినప్పుడు బ్లాగుల్లో అసమానతలు వివరీతగా ఉండేవి. " ఎ " గ్రూపు ఆధిపత్య ధోరణి కనిపించేది. జూనియర్ల ర్యాగింగ్ జరిగేది. కొత్తగా బ్లాగులు తెరిచిన వారి మీద ఒక ఈగిల్ ఐ పని చేస్తూ ఉండేది. వాడి మానాన వాడు రాసుకున్నాడా సరే సరి చూసే చూడనట్టు వదిలేసేవారు ఆలా కాకుండా " ఎ " గ్రూపు కి నచ్చని వారి బ్లాగులు ( తెలీక) చదివి కామెంట్ పెట్టాడా ఇంకా వాడు చచ్చాడే. వేరే బ్లాగుల్లో కామెంట్లు మానుకునే వరకు వాడి అంతు చూసే వారు కొందరు అజ్ఞాతలు. ఇంకా ఆహా ఓహో లు తప్ప .. వారి మీద చిన్నపాటి వ్యంగ్యాస్త్రాలు వ్రాసినా కూడా వారి వందిమాగాదులు బెదిరించేసేవారు. మరీ ఒక బ్లాగర్ ని అయితే తను మామూలుగా వ్రాసిన ఒక విమర్శకు తట్టుకోలేక ..... మేము సమాజం లో ఉన్నత స్థానం లో ఉన్న వాళ్ళం నీ ఐపి పట్టుకుని నీ అంతు చూస్తాం అని బెదిరించారు. ( మేము ఇలాంటి ప్రయోగాలు చిన్నప్పుడే మా రాజేష్ గాడి మీద ప్రయోగించాం)

ఇంకా కొన్ని ఇరిటేషన్ కలిగించే అంశాలు ..... " ఎ " గ్రూపు వారి వ్యంగ్యమైన కామెంట్స్ ... ఎవరైనా వారి గ్రూపులో చేరకపోయినా ...... వారికి తమ మెయిల్ ఐడి ఇవ్వకపోయినా వారు వ్రాసిన టపాని వెక్కిరిస్తూ కామెంట్ పెట్టేవారు. వీరితో ఎందుకు వచ్చిన గొడవలే అని వారి దారిలోకి వస్తారని వారి భావన ఏమో. చిర్రెత్తుకొచ్చేది అవి చూస్తే .... బాగా వ్రాసే యువ బ్లాగర్లని అజ్ఞాతంగా నో లేక అనామక ఐడి క్రియేట్ చేసుకుని ...... వాడిని అల్లాడిచ్చి ఆకులు మేపేవారు. ఇలాంటి అనుభవం నాకూ ఒకసారి అయింది. అప్పుడు నేను జూనియర్ కదా అందువల్ల .. ఇష్టానుసారం అజ్ఞాతల రూపం లో దాడులు .. వల్గర్ కామెంట్స్... బాబోయి తట్టుకోలేము ఆ నీచాన్ని .

సరిగ్గా అప్పుడే పుట్టింది కెబ్లాస ముల్లుని ముల్లుతోనే తీయాలి ... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు వారి దారిలోనే ఎదురు దాడి మొదలెట్టింది కెబ్లాస . కెబ్లాస దెబ్బకి " ఎ " గ్రూపు త్వరగానే తోక ముడిచింది. ఈ మద్య కొత్తగా బ్లాగుల్లోకి వచ్చినవారు వారికి ఇష్టం వచ్చినట్టు హాయిగా బ్లాగుతున్నారంటే ఆ పుణ్యం కెబ్లాసదే . కొందరు యువ ఔత్సాహిక బ్లాగర్లు వారం లో 50 టపాలు వేయగాలిగారంటే కారణం కేవలం కెబ్లాస. అంతకు ముందు ఒక బ్లాగర్ తనకి ఇష్టం వచ్చినట్టు బ్లాగడం మొదలెట్టగానే .... ఆలా రాయకూడదు ఇలా రాయాలి అని క్లాసులు .. వ్యంగ్యాస్త్రాలు ... పైగా " ఎ " గ్రూపు బ్లాగుల్లో కొత్త బ్లాగర్లని కామెడీ పాత్రలు చేసి ఆడుకోవడం. నిజంగా సీనియర్లు .....గత మూడేళ్లుగా బ్లాగుల్లో ఉన్న వాళ్ళు చెప్పండి ..... బ్లాగ్లోకం లో ఇప్పుడు ఉన్న సహ్రుద్బావ వాతావరణం, సమానత్వం ఏడాది కింద ఉందా??

అసలు భయంకరమైన కామెడీ ఏంటో తెల్సా .... " ఎ " గ్రూపు వారి రాజకీయాలకు భయపడి ఎవరైనా అమాయకులు బ్లాగులు మూసేస్తే ఆ నేరాన్ని తెలివిగా " ఎ " గ్రూపు ని బలంగా వ్యతిరేకించే వారి మీదకి నేట్టేయడం. వీరి వల్లనే వారి బ్లాగు మూతపడింది అని ప్రచారం చేయడం . వీరు బ్లాగు లోకాన్ని గబ్బు చేశారు ... ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్నారు .... కానీ కెబ్లాస ఆవిర్భావంతో సమానత్వపు పరిమళాలు బ్లాగ్లోకంలో వ్యాపించాయి . కెబ్లాస సభ్యులు సమానత్వం సాధించారు.

కొత్త బ్లాగరులారా ..... స్వేచ్చగా బ్లాగండి ... మీ భావాలు .. మీ ఆలోచనలను నియంత్రించకుండా ప్రపంచానికి తెలియచెప్పేందుకు మాలిక ఉంది. బ్లాగులు మూసిన బ్లాగర్లారా మళ్లీ బ్లాగులు తెరవండి .... ఒక్కసారి గట్టిగా కేక పెట్టి చూడండి. బ్లాగు లోకం ఎవరి సొత్తూ కాదు .

24 comments:

Anonymous said...

ఇప్పుడు అవేమీ లేవుగా ఇక వారిని వదిలేయండి

Anonymous said...

ఇది మాలిక కి ప్రచారమా లేక ఆ గ్రూపుకి అపచారమా?

కొత్త పాళీ said...

ఈ మాత్రం దీనికి సిపాయిల తిరుగుబాటంత బిల్డప్పు. గ్రూపిజం చేస్తున్నారని కూడలిని కాలదన్ని హారాన్ని నెత్తికెత్తుకున్నారు. జనాలు మితిమీరితే హారం వాళ్ళకి వొళ్ళుమండి నచ్చని బ్లాగుల పీక నొక్కారు. దాంతో మాలికలల్లారు. అంతవరకూ బానే ఉంది. ఇంకో సంకలిని బ్లాగుల తాజా టపాలు చూసుకోడానికి.
The more the merrier.
అంతమాత్రం చేత కెబ్లాస స్వేఛ్ఛకి గొడుగు పట్టిందీ లేదు, సమానత్వం సాధించిందీ లేదు, మరొక గ్రూపుని ఓడించిందీ లేదు. తన గుంపు తనకింపు అంతే.
ఏక్ నిరంజన్!

Malakpet Rowdy said...

మితిమీరితే హారం వాళ్ళకి వొళ్ళుమండి నచ్చని బ్లాగుల పీక నొక్కారు. దాంతో మాలికలల్లారు.
___________________________________

For your kind info, Maalika has nothing to do with whatever happened on Haaram. It is this kind of OUTRIGHT LIES that cheezed off people!

Malakpet Rowdy said...

ఇప్పుడు అవేమీ లేవుగా ఇక వారిని వదిలేయండి
______________________________

I was about to say the same and then I saw the above comment - Looks like we both are wrong :))

yogirk said...

"అంతమాత్రం చేత కెబ్లాస స్వేఛ్ఛకి గొడుగు పట్టిందీ లేదు, సమానత్వం సాధించిందీ లేదు, మరొక గ్రూపుని ఓడించిందీ లేదు. తన గుంపు తనకింపు అంతే"

Exactly Kottapaali, you are freakin awesome maen! You. I mean YOU should stop being devastatingly intelligent. How grand are the nuggets of truth thatcha unveil so consistently ? Its freakin awesome!!

Just like you take immense pleasure in nitpicking every new blogger there with your 'sarcastic' comments, just like you vehemently support your friends - irrespective of their retardedness, just like you write scintillating poetry translations, just like you find yourself compelled to meddle with people - as natural as all of these, there is a truism to your statement "తన గుంపు తనకింపు అంతే." -

But there is a problem here. If you really understood that statement, you wouldn't have said it here. Oh well, it happens. Even to the best ones like you. Thats fine.

Another day, another person, dear kottapaali - would have gotten my typical 'shut the f%$* up' reply. Alas! it's you, the celebrated one.

more power to you!

శరత్ కాలమ్ said...

@ శ్రీనివాస్
మన సెల్ఫ్ డబ్బా కొంచెం ఎక్కువయ్యిందేమో!

Malakpet Rowdy said...

కొందరు యువ ఔత్సాహిక బ్లాగర్లు వారం లో 50 టపాలు వేయగాలిగారంటే కారణం కేవలం కెబ్లాస.
___________________________________

ఇది మాత్రం కొంచం ఎక్కువయ్యింది. కెబ్లాసకి అంత సీను లేదు. కెబ్లాస సాధించింది సమానత్వం కాదు - Equilibrium - ఒక చెంప మీద కొడితే రెండు చెంపలూ ఛెళ్ళుమనిపించి వీపు కూడా విమానం మోత మొగించమనే పాలసీతో :))

Malakpet Rowdy said...

మన సెల్ఫ్ డబ్బా కొంచెం ఎక్కువయ్యిందేమో!
____________________________

కొంచమేనా?


RK back with vengeance :))

శరత్ కాలమ్ said...

"బ్లాగ్లోకం లో ఇప్పుడు ఉన్న సహ్రుద్బావ వాతావరణం"

ఇలా కమిటయిపోతే ఇక నేను ఎవరినయినా కెలికేదెట్లా :))

శరత్ కాలమ్ said...

అయినా నన్ను కె బ్లా స అధ్యక్ష పదవి నుండి ఊడబీకగానే నేను గేబ్లాస స్థాపించుకున్నాగా! మీరు బ్లాగులోకంలో శాంతి సౌభ్రాతృత్వం, సమానత్వం కోసం కృషి చేయండబ్బా. నాకు అవి బొత్తిగా పడవు. నా గె బ్లా స బ్లాగ్లోకంలో అశాంతి కోసం, అసౌభ్రాతృత్వం కోసం, అసమానత్వం కోసం యథాశక్తిగా, నిరవధికంగా కృషిచేస్తూ వుంటుంది.

కొత్త పాళీ said...

RK .. I do try. How can I disappoint my fans like you?

Malakpet Rowdy .. reg. maalika's genesis - ok, if you say so.

మంచు said...

మాలిక ను బాగా ప్రమోట్ చెయ్యాలంటే మాలిక గొప్పదనం చెబితే సరిపొతుంది.. మిగతా అగ్రిగెటర్స్ కన్నా ఇది ఏరకం గా గొప్పో చెబితే ఒక్.. కానీ ఇలా ఆగ్రిగెటర్స్ ని గ్రూప్లకి అటాచ్ చేస్తే .. అగ్రిగేటర్ ఒక గ్రూప్ కే పరిమితమయిపొతుంది.. థట్స్ నాట్ గుడ్.. నెగటివ్ ఆడ్వర్టైజ్మెంట్ మోడ్ లోకి వెళ్ళద్దు.. కెలకాలంటే సెపరేట్ గా కెలకండి.. ఎలా మాలిక తొ ముడిపెట్టొద్దు..

మంచు said...

మాలిక వచ్చిన కొత్తలొ ఫాస్టెస్ట్ అగ్రిగేటర్ అని ప్రకటించారు.. మొన్న నేను పొస్ట్ చేసిన పొస్ట్ మాలిక కన్నా హారం లొ ముందు వచ్చింది.. బహుశా నా రెఫ్రెషింగ్ టైం లొ తేడా వుండొచ్చు.. కానీ ఇప్పుడు హారం , మాలిక రెండూ ఇంచుమించు ఒకే స్పీడ్ లొ వున్నాయి...

Krishna K said...

ఒంగోలు శీను గారు, మీరు బ్లాగ్ లకు కొత్త అంటూనే దాదాపు 4 , 5 ఏళ్ళ క్రితం ఓ కాంతామణి ఓ బ్లాగర్ ను ఎలా బెదిరించిందో కరెక్టుగా చెప్పటం ఆశ్చర్యం కల్గించింది. మీకు చెప్పింది ఎవరైనా అది నిజంగా నే జరిగింది. ఎంతైనా పెకాసం వాళ్ళు, పెకాసం వాళ్ళే, మాంచి ఇన్ఫర్మేషన్ సంపాయిస్తారబ్బా, అందుకే ఎకరాలు కోట్లు పలుకుతున్నాయి ఒంగోలు లో ఈ మద్దెన :)

ఇక పోయినేడు నుండి ఇప్పుడు (చాలా చిన్నదయినా తెలుగు) బ్లాగ్లోకం లో మార్పు వచ్చిన మాట నిజమే. అది అందరం ఒప్పుకుతీరాల్సిందే. ఏది ఏమయినా కెలుకుడు బ్లాగులవలన కొంతవరకు ఎవరి పరిమితులు వాళ్లకు తెలిసివచ్చాయేమో అని నా నమ్మకం, కాకపొతే అది ఖచ్చితంగా చెప్పటానికి ఇంకొంచం సమయం వేచి చూడాల్సి ఉంటుందేమో!!

ఇక సమానత్వం, యాభై టపాలు వేయటం లాంటి స్టేట్మెంట్లు కొంచం ఎక్కువ అయ్యాయ్యేమో అనిపించింది, అందులో నాది పుట్టిల్లు అయ్యిన పెకాసం వాడి మాట బదులు, మెట్టినిల్లు అయిన టెక్సాస్ వాని , మాటే నా మాట కూడా :)

ఇక కొత్తపాళీ గారి కామెంట్ ". తన గుంపు తనకింపు అంతే" గురించి, ఆయన ఎంతకాదన్నా సీనియర్, ఈ (గుంపు ల) విషయంలో అనుభవంతో చెబ్తున్న వారి మాటా నిజమే, ఒప్పెసుకొందాం ;)
నాకు (కోడి తలకు) అర్ధమయినంతవరకు, పాపం ప్రతి దానికి భయపడే కూడలాయన కెలుకుడు బ్లాగులను బ్యాన్ చేద్దామా అని పెట్టిన టపానే మాలిక పుడతానికి స్పూర్తి అని అనుకొంటున్నాను. అంతె తప్ప పెద్దలు, హారం లో ఎవరిదో ఆపితే, మాలిక వచ్చింది అని అనటం "చీకటిలో బాణం" అని నాకు అనిపించింది, ఏది ఏమయినా నిజం పెద్దలకే చాలా విషయాలు తెలిసిఉండాలి మరి :), లేకపోతె పొదల ప్రాంతం (Bush Country) లో ఉండే ఆయనకే తెలియాలి.

ఇంకా మాతంగుల, కేతి గాళ్ళ కామెంట్లు రాకపోవటం మాత్రం, కొంచం నిరాశే కలిగిస్తుంది :) ఏమిచేద్దాం, రోజులు మారాయి అని చెబ్తున్నారు గా, దానికి నిదర్సనమేమో!!

KumarN said...

నాకు ఈ గ్రూపుల సంగతీ అదీ అస్సలు తెలీదు. అస్సలు అలా గ్రూపిజం ఉండిందో లేదో నాకు తెలీదు కాని, కొంత మంది సీనియర్ బ్లాగర్లు మాత్రం , కొత్తగా బ్లాగుల్లో కామెంట్స్ చేసేవాళ్ళని కానీ, కొత్త బ్లాగర్లనీ కాని వాళ్ళ టపాల మీద, కామెంట్స్ మీదా తెగ సర్కాస్టిక్ కామెంట్స్ పాస్ చేసే వాళ్ళు. వీళ్ళ మేధావి తనాన్నంతా బయట పెట్టుకుంటూ.. ఈ హై రోడ్ ఆటిట్యూడ్ అవతలి వాళ్ళకి చిరాకే కాకుండా, వీళ్ళ పట్ల ఉన్న పెద్దరికమూ, గౌరవమూ పోగొట్టేలా చేస్తుందన్న కొంచెం ఆలోచన కూడా ఉండేది కాదు వీళ్ళకి. భలే చిరాకేసేది నాకు వీళ్ళ చెత్త సుపీరియర్ ఆటిట్యుడ్ డిస్ప్లే కి.

పోనీ లెండి, ఈ మధ్యన వాళ్ళు అలాంటి కామెంట్స్ పాస్ చేయట్లేదు, ఏదో ఒకరిద్దరు అక్కడక్కడా వెకిలి వ్యంగ్యం, లాజిక్ కామెంట్స్ రాస్తానే ఉన్నారు కాని...అమీర్ ఖాన్ భాషలో చెప్పాలంటే 'ఆల్ ఈజ్ వెల్

Bhãskar Rãmarãju said...

>>సరిగ్గా ఒకటిన్నర సంవత్సరం క్రితం మేము బ్లాగుల్లోకి వచ్చినప్పుడు బ్లాగుల్లో అసమానతలు వివరీతగా ఉండేవి. " ఎ " గ్రూపు ఆధిపత్య ధోరణి కనిపించేది. జూనియర్ల ర్యాగింగ్ జరిగేది. కొత్తగా బ్లాగులు తెరిచిన వారి మీద ఒక ఈగిల్ ఐ పని చేస్తూ ఉండేది. వాడి మానాన వాడు రాసుకున్నాడా సరే సరి చూసే చూడనట్టు వదిలేసేవారు ఆలా కాకుండా " ఎ " గ్రూపు కి నచ్చని వారి బ్లాగులు ( తెలీక) చదివి కామెంట్ పెట్టాడా ఇంకా వాడు చచ్చాడే.

నిజమా? నాకెప్పుడూ ఇలా తగల్లేదే.
ఆధిపత్య ధోరణి నాకు అనిపించలా.
గ్రూపులు - యెస్. ఉన్నాయ్.
ఇప్పటికీ ఉన్నాయి.
అవి హెప్డూ ఉంటాయ్.
ఎన్ని కొత్త యాగ్రిగేటర్లు వచ్చినా గ్రూపిజంని ఆపలేవు. ఆపజాలవు.

కోతి said...

చెత్తపాళీ, ఎన్ని సార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? పుస్తకం నెట్ లో కూడా రచయిత్రుల పేరు కనపడగానే నువ్వు రెడీ అయిపొతావ్. ఛీ.
శ్రీనివాస్, మీరు చెప్పింది సత్యమే. ఈ కొత్తపళీ గ్రూపు ఎందరిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో చూస్తూనే ఉన్నాం. మాలిక హాయిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా.
ఆర్కే, సుత్తి లెకుండా నా మాటలే భలె చెప్తావు. గూడ్.

ఏక లింగం said...

కొత్తపాళీ గారు మీ నుండి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని అనుకోలేదు. సరే... మాలిక సభ్యునిగా నేను మళ్ళీ మళ్ళీ మీకు చెబుతున్నది ఏమిటంటే, మాలిక ఉన్నది ప్రతి ఒక్కరికి అవకాశం కలిపించడానికి, బ్లాగర్లు ఏమి వ్రాసినా వాళ్ళ భావాలు స్వేచ్చగా అందరితో పంచుకోవడానికి ఒక వేదికగా నిలవడానికి మాత్రమే. ఎవరేమి వ్రాసినా మాకేమీ అభ్యంతరం లేదు.

మేమెప్పుడూ గ్రూపులను రూపుమాపుతామని, తెలుగు భాషోద్దరణ చేస్తామని చెప్పింది లేదు. మాకావసరం కూడా లేదు.

అయినా శ్రీనివాస్ గారు ఏవో గ్రూపుల గురించి మాట్లాడితే మీరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చారో అర్థం కావడంలేదు.

Anonymous said...

థాంక్యు శ్రీనివాస్ అందరికీ తెలిసినా ఇలా ఎవరూ ఈ సమస్యని బహిరంగంగా చర్చించలేదు.
వాళ్ళ వల్ల నేనూ ఇబ్బంది పడ్డాను. రాయటమేకాదు విసుగుతో బ్లాగులు చదవడం కూడా మానేశాను. ఎవరు ఒనన్నా కాదన్నా ఒప్పుకున్నా పోకపోయినా క్లేబాసా వాళ్ళ పుణ్యమాని బ్లాగ్లోకం ఇప్పుడు ప్రశాంతంగావుంది. మీకు తెలిసో తెలియకో చాలా మేలుచేశారు.
అందరూ మూసిన బ్లాగులు తెరచి హాయిగా రాసుకొండి అంటున్నారు సరె. కాని క్లెబస సభ్యుల బ్లాగులు మూతపడకుండా చూడాలండి.

Anonymous said...

pramaadavanam blog lo srinivas ni bedirinchi blog mooseyamani bootulu tittinavaaru aa group vaare antaaraa

Malakpet Rowdy said...

కెలుకుడు బ్లాగులను బ్యాన్ చేద్దామా అని పెట్టిన టపానే మాలిక పుడతానికి స్పూర్తి అని అనుకొంటున్నాను
__________________________________

Exactly!

Anonymous said...

యీ పోస్ట్ కి టిఆర్పి రేటింగ్స్ పెరిగిపోతున్నాయా

Anonymous said...

నేను చాలా కాలం నుండి బ్లాగ్స్ లో ఉన్నా అప్పుడప్పుడూ మాత్రమే టైం దొరుకుతూ ఉంటుంది బ్లాగ్స్ చూడటానికి కానీ రాయటానికి కానీ. అప్పుడు రెగ్యులర్ గా రాసే చాలా మంది (దాదాపు ఒక 10 మంది , కొత్త వాళ్ళు (పాత వాళ్ళైనా యాక్టివ్ గా లేనివాళ్ళు కూడా) ఏది రాసినా వాళ్ళ మీద విమర్శలు, నీతి బోధలు చేసే వారు. కొంచే సెన్సిటివ్ గా ఉండే నేను వాళ్ళ దెబ్బకి నేను ౩ బ్లాగ్స్ క్లోజ్ చేసేసాను.

మళ్ళీ చాలా కాలం తరువాత బ్లాగ్స్ లో కి వచ్చి చూస్తే వాతావరణం చాలా మారినట్లు అనిపించింది కానీ దీని వెనకాల గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని మాత్రం తెలియదు.