అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/11/10

ఆన్ లైన్ బెదిరింపులు

ఏమిటో ఆ మద్య ఆర్కుట్ లో కొందరు బెదిరించేవారు ప్రొఫైల్ డిలీట్ చేస్తున్నా అని తమ ప్రొఫైల్ స్టేటస్ పెట్టేవారు ... అందరూ వచ్చి బ్రతిమాలినా వినకుండా డిలీట్ చేసే వారు ..........మళ్లీ ఐదు రోజుల్లో కొత్త ప్రొఫైల్ తో సిద్ధం అయ్యేవారు . హిహీ నను యాడ్ చేస్కో అని మెసేజ్ పెట్టే వారు. ఆ మాత్రానికి వారం ముందు బెదిరించడం దేనికో అర్ధం అయ్యేది కాదు. మళ్లీ ఆర్కుట్ ని వదిలి ఉండలేక ఒక కన్ను వెసి ఉంటారు ....... తర్వాత అందరూ తమని మర్చిపోవడం ఓర్చుకోలేక కొత్త ప్రొఫైల్ తో వచ్చేస్తారు. నిజంగా డిలీట్ చేసేసే వారు పబ్లిసిటీ లేకుండా దిలేట్ చేయొచ్చు కదా అని స్క్రాప్ పెడితే చూడనట్టే నటించేవారు. వీళ్ళు ఒక రకం జీవులు .. అందరి అటెన్షన్ తమ మీదనే ఉండాలని కోరుకునే వారు.

బ్లాగుల్లో కూడా ఇలాంటివి గతం లో జరిగినట్టు గుర్తు. గొడవలకి భయపడి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయే వారు కొందరైతే .... బెదిరింపు టపాలు పెట్టడం అందరూ కామెంట్స్ లో బ్రతిమాలాక తమ నిర్ణయం మార్చుకునే వారు కొందరు. కొందరైతే ఇవాల్టి నుండి నా కామెంట్ బాక్స్ కి తాళం వేస్తున్నా అని చెప్తారు . కొన్నాల్లకే తాళం బద్దలు కొట్టేస్తారు . ఆ మాత్రం దానికి బెదిరించడం దేనికి . ఈ మద్య ఇంక సెలవు అని టపా వ్రాసి బ్లాగు మూసేయడం లేదా ఆపేయడం ఆనవాయితీ అయినట్టు ఉంది . కొందరు ....... సెలవు ఇదే ఆఖరు టపా .. అని ఎవరికో చివరి అప్పగింతలు చెబుతున్నట్టు టపా పెట్టి అందరినీ టెన్షన్ పెట్టి మళ్లీ కామెంట్లు ఏమైనా వచ్చాయా అని అక్కడక్కడే తిరుగుతుంటారు. రెండు రోజులకు మళ్లీ ఎందుకీ బెదిరింపులు .... ఆవేశం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టుకోండి అంతే గాని బ్లాగు ఉసురు తీయకండి. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి అంటారా .... మరి ఆకేదో పువ్వేదో తెలీనోల్లు బ్లాగెలా రాయాలో బ్లాగార్లెలా ఉండాలో లెక్చర్ ఇవ్వగా లేనిది నేనివ్వకూడదా.

మనలో మాట కాగడా తన చివరి పోస్ట్ మార్చ్ 30 న వ్రాసి వదిలేశాడు అప్పటి దాకా రోజుకొక టపా వ్రాసే వారు కొందరు అదే మార్చ్ 30 న టపా వ్రాసి మళ్లీ నెల దాకా వ్రాయలేదు . వారు మొత్తం నలుగురు వారిలో ఒకరు కాగడా అయి ఉండవచ్చు అని నేను అనుకునే లోపే వారిలో ఇద్దరు వ్రాయడం మొదలెట్టారు .... మిగతా ఇద్దరు వ్రాయడం లేదు .... మరి కాగడా బిజీ అవడం వల్ల మూతపడిన ఆ బ్లాగులు ఎవరివి.

18 comments:

ఏక లింగం said...

కొంచెం టైమ్ ఇవ్వు బాసు. మళ్ళీ వచ్చి లొల్లి చేయడానికి.

(మనలో మనమాట... ఎవరా ఇద్దరు?)

Anonymous said...

ఒకరు మీరే ఏకలింగం గారు

KAMAL said...

మన ఏకలింగం గారు కాగడా కాకపోతే గుడ్డు....

ఒహవేళ అయ్యారనుకోండి...... వెరీ గుడ్డు.

ఇట్లు

కాగడా గారి ఏక బ్లాగు శిష్యుడు.

Anonymous said...

ప్రవీణ్ శర్మ????

నాగప్రసాద్ said...

ఇదేదో నన్నే కెలికినట్లుందే. :-))). పైగా కాగడాను కూడా లాగావు చివర్లో. :-))).

నేను నా బ్లాగును పర్మినెంట్‌‍గానే మూసేస్తున్నాను. మూసెయ్యడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. బ్లాగును మూసెయ్యడం ఇష్టం లేకపోయినప్పటికీ, ఆ ప్రత్యేక కారణం వల్లనే మూసేయాల్సి వస్తోంది. నేను క్లోజ్ చేసేది కేవలం సందేహం బ్లాగు మాత్రమే. నా మిగతా సైన్సు, ఆధ్యాత్మిక మరియు కెలుకుడు బ్లాగులు ఆక్టివ్ గానే ఉంటాయి. :-))).

ఇన్నాళ్ళూ బ్లాగుల వల్ల ఎంతోమందితో పరిచయాలు పెరిగాయి కాబట్టి, అందరికీ చెప్పాను. అంతకుమించి వేరే కారణం లేదు.

ఏక లింగం said...

నాకు కాగడా అంత సీన్ లేదు. అంత క్రియేటివిటీ లేదు. కాగడా కాగడానే.

@ నాగా...
మొన్న నాలుగు రోజులు బ్లాగును "only for invited users" అని మార్చావు. ఇప్పుడేమో పూర్తిగా దుకాణం ఎత్తేస్తానంటున్నావు. ఇలా గడికో మాట మాట్లాడుతున్నావు అంటే కారణం మీ ఇంట్లో నీకు పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టారనుకుంటా..!! అవునా??

బ్లాగును మూయడం తెరవడం ఎందుకు? అలాగే ఉంచి రాయకుండా ఉంటే సరిపోతుంది కదా?

నాగప్రసాద్ said...

ఏకలింగం గారు, అలానే ఉంచగలిగే పరిస్థితి ఉంటే, బ్లాగును ఆపకుండా రాసేవాణ్ణి కదా. :-))). దుకాణం పూర్తిగా మూసెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.

కత పవన్ said...

?

శ్రీనివాస్ said...

నాగప్రసాద్ బ్లాగ్ మూసేయమని మిమ్మల్ని బెదిరిస్తున్న వారి పేర్లు చెప్పగలరా

Anonymous said...

నాగప్రసాద్ బ్లాగ్ మూసాడు

Anonymous said...

intaki evaro aa iddaru maku kuda cheppachu kada. enta alochinchina tattaledu naku. any clues

మిరియప్పొడి said...

ఏంటండి నేను మొన్నే బ్లాగ్ తెరిచాను. ఆరోజునె సుమమాల బ్లాగ్లో ఎవరో నలుగురు అంటూ రాశారు, బ్లాగుల్లో బెదిరింపులు అంటు. ఇప్పుడేమో మీరు. ఇంతకి కాగదా అంటే ఎవరు? నాగగారి బ్లాగ్ ఎక్కద? ఎంధుకు ముసేసారు?

శరత్ కాలమ్ said...

బ్లాగులని బహు శ్రద్ధగానే రెసెర్చ్ చేస్తున్నారు! ఎవరు మూసారు, ఎంత తెరిచారు లాంటివన్నీ బాగానే నోట్ చేసుకుంటున్నారే :) హమ్మయ్య, నేను వ్రాయడం ఆపలేదు కనుక నేను కాగడా కాదని రూఢీ అయిపోయినట్లే.

శ్రీనివాస్ said...

శరత్ గారు నాకు ఈ రిసెర్చ్ కి గానీ ఏదేని యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వచ్చు అంటారా?

Anonymous said...

మొక్కలా ఉన్నప్పుడు నిన్ను వంచుదామనుకున్నారు
తీగలా మారి వారి వసారాలో పాకావు
ఆనక మానులా తయారై వారి కోట బీటలు వారే దెబ్బ కొట్టావు
వికటకవి నీవు హీరోలాకనిపించే విలనువు

Anonymous said...

మీ బ్లాగు మొత్తం తిరగేస్స్తున్నా ఈరోజు .. ఈ టపా చదువుతుంటే ఈ రోజు ఒక బ్లాగర్ రాసిన టపా పరమ కామెడీగా అనిపించింది. చాలా చక్కగా అనలైజ్ చేశారు.

చందు said...

:-)))))

పానీపూరి123 said...

> Anonymous, May 11, 2010 8:20 PM
Thats true :-)