అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/6/10

సిగ్గు సిగ్గు - నరరూప రాక్షసులు తప్పించుకునే అవకాశం


గత జనవరి 30 న చిన్నారి నాగ వైష్ణవిని విజయవాడలో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన మోర్ల శ్రీనివాస రావు , జగదీశ్, పంది వెంకట్రావ్ గౌడ్ లకు శిక్ష నుండి తప్పించుకునే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. నిందితులను సరిగ్గా ఇంటరాగేట్ చేయకుండా పోలీసులు వారికి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపధ్యం లో ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ వైష్ణవి కి సంబందించిన బూడిద నుండి డియెన్ఏ సేకరించడం కష్టం అని తేల్చి చెప్పడంతో వైష్ణవి హత్యని నిరూపించే అవకాశం లేకుండా పోయింది. సంఘటనా స్థలం లో బూడిద కుప్పలా దొరికిన వైష్ణవి కి చెందిన ఎముకలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కి అందులో ఏ ఆధారాలు దొరకలేదట. డి యెన్ ఏ సేకరించలేకపోయాం అంటూ చేతులు ఎత్తేసింది. ఒక పక్క నిందితులు కోర్టులో ఒప్పుకునే పరిస్థితి లేదు. మరో పక్క నిన్ననే నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయవద్దని సుప్రీం ఆదేశించడం ఈ కేసుకి అడ్డంకి గా మారింది. వైష్ణవి తండ్రి మరణించాడు .. హంతకులను చూసిన డ్రైవర్ మరణించాడు, నిందితులు నిజం ఒపుకోవడం లేదు, నార్కో టెస్ట్ చేయకూడదు , చివరిగా మిగిలిన ఆధారం వైష్ణవి కి చెందిన అవశేషాలు ..... వాటి నుండి కూడా ఆధారాలు దొరకడం లేదు .. ఇక నిందితులు బయటికి రావడానికి మార్గం సుగమనం అయింది.


మనం ఏమీ చేయలేం -కనీసం కాసేపు సిగ్గు పడదాం................ చిన్నారి వైషు కి సారీ చెబుదాం. సారీ వైష్ణవి .. నీకే న్యాయం చేయలేక పోయాం కనీసం నీ ఆత్మకి శాంతి కలిగించలేకపోయాం.

10 comments:

చైతన్య said...

ఇది నిజమా!!
ఛ... ఎంత సిగ్గు చేటు!
అంతటి కిరాతకమైన పనిని చేసిన వాళ్ళని శిక్షించకుండా, కాపాడాలని చూస్తున్నారా వీళ్ళంతా! వీళ్ళకి, ఆ హంతకులకి ఏం తేడా ఉంది!?

ఈ మాత్రం న్యాయం చేయలేని మా సిగ్గుమాలిన చేతకానితనాన్ని క్షమించు వైష్ణవి!

అశోక్ చౌదరి said...

Hmmm...

Anonymous said...

నో కామెంట్.. అలవాటు అయిపోయింది

శరత్ కాలమ్ said...

ఇప్పటికయినా పోలీసులు నేరస్థులని ఎన్‌కవుంటర్ చేసిపడేస్తే అందరూ సంతోషిస్తారు.

sravanah said...

నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో అవుతుందని. అప్పుడే ఎన్ కౌంటర్ చేసింటే బాగుండేది.
అప్పుడు ఎన్ కౌంటర్ వద్దు, కోర్ట్ ద్వారా వెళ్దాం అని అడ్డుపడ్డ వాళ్ళను అనాలి! (జయప్రకాశ్ వగైరా) సిగ్గు పడాలి మన చట్టాలు, కోర్టులు. అసలు చిన్నపిల్లల కేసులకు కొంచెం ఎక్కువ స్వతంత్ర్యం పోలీసులకు ఇస్తేనే బాగుంటుంది.

durgeswara said...

శిక్ష ఎలా ఉండాలో చాణక్యుని అర్ధశాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి. కళ్లముందు మనిషిని చంపినా న్యాయాధికారులు శాస్త్రీయ ఆధారాలు ఉంటేగాని శిక్షించలేము అనే పరిస్థిలో ఉంటే ,ఇలాంటి న్యాయవ్యవస్థ వలన నేరాలు పెరుగుతూనే ఉంటాయి ,

Anonymous said...

Can we raise our voice (in non-violent way) so govt can hear us? I hate to see evryone giving up. We can change and start right now.

Srujana Ramanujan said...

disgusting

చైతన్య said...

@Anonymous(last)
Yes we can.
Good to see your initiative.
To work together, all of us need to know each other.

God, save media! said...

visit godsavemedia.wordpress.com
Helo Sinu, can You pls add this blog to malika and haaram aggregators please. We know you can do it. This blog wud not harm anyone.