అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

11/14/09

షాడో, బుచ్చిబాబు ...... ఒంగోలు శీను

నా చిన్నతనం లో ...... అంటే నాకు పదేళ్ళు ఉంటాయనుకుంటా ... అప్పుడు జరిగిన విషయాలివి . మా అన్న నాకన్నా పన్నెండేళ్ళు పెద్దవాడు ..... మా అక్క ఎనిమిదేళ్ళు పెద్ద ... అందువల్ల చిన్నప్పటి నుండి వాళ్ళ ప్రభావం నా మీద ఎక్కువ గా ఉండేది. మా అన్న ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలు ... రాంబో సినిమాలు గట్రా చూస్తూ . ఇంటికి మధుబాబు, పానుగంటి వంటి రచయితలు రాసిన షాడో , కిల్లర్ షాడో నవలలు తెచ్చుకుని చదివే వాడు.

మా అక్క దానికి పూర్తి వ్యతిరేకం ఆవిడకు మల్లిక్ నవలలు అంటే ప్రాణం , యద్దనపూడి సులోచనారాణి నవలలు అంటే పంచ ప్రాణాలు . ఇలా ఈవిడ ఎక్కువగా మల్లిక్ నవలలు చదవడం అదే మాదిరిగా నేను కూడా వీళ్ళతో చదవడం మొదలైంది.


అయితే నా మీద బాగా ప్రభావం చూపిన వారు ... మధు బాబు మరియు మల్లిక్ . ఎక్కువగా వీళ్ళ రచనల తో ప్రత్యేకించి అందులో పాత్రల తో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని. మా వాడు ఉదయాన్నే లేచి కరాటే గట్రా చేయడం ...... ఉండి ఉండి నిట్టూర్చడం .... సాలోచనగా తల పంకించడం వంటి పనులు చెయ్యడం తో ... మా వాడే షాడో అని నాకెందుకో అనిపించసాగింది.


అలా నా మీద పడిన నవలా ప్రభావం కొన్నాళ్ళకి బయట పడడం మొదలైంది . అదెలాగంటే మా ఊరు నుండి మా మామయ్య ఒకాయన మా ఇంటికి వచ్చాడు. భోజనం చేసి అలా బయకెల్దాం అని బయట కొచ్చి జర్రున జారి పడ్డాడు. వెంటనే మా అన్నయ్య వచ్చి లేవదీశాడు. నా మది లో కోటి ప్రశ్నలు ... ఈయన జారినప్పుడు కెవ్వు అని అరవలేదేంటి? .. పడగానే చచ్చానురోయి దేవుడో అనలేదేంటి ? ఇదే వెళ్లి మా అక్కని అడిగాను. అక్కా........ మామయ్య .. మల్లిక్ నవలల్లోలాగా పడగానే కెవ్వుమని అరవలేదేంటి అని .. మా అక్క నా వైపు అదోలాగా చూసి వెళ్ళిపోయింది.

ఇప్పుడు కెమెరా మా అన్న వైపు తిరిగింది " అన్నాయి మామ పడబోతుంటే నీ వెన్ను జలదరించి .... వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఇక్కడేదో జరగబోతుంది .. అనిపించలేదా? వెంటనే వెళ్లి అక్కడే ఆగు మామయ్యా అని అపలేదేంటి అని అడిగేసా. అసలే అక్కడ నీళ్ళు పోసి మామయ్య పడడానికి కారణం అయ్యి ఎక్కడ తిడతారో అని భయం భయం గా ఉన్న మా అన్నకి ఇంకా తిక్క రేగింది. అప్పుడే జరిగింది నేను ఊహించిన సంఘటన.... అన్న కుడి చేయి నా బుర్రకి కనెక్ట్ అయింది ... కాని సటాల్ అని సౌండ్ రాలేదు. :( ....మా అన్న నోటి నుండి సింహనాదం కాదు కదా కనీసం పిల్లినాదం కూడా రాలేదు :( . పదునైన కత్తితో గుండె లో పొడిచినట్లు మొఖం చిట్లిస్తూ వెళ్ళిపోయాడు.


ఒకసారి నేను అన్న .. "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాకి వెళ్ళాం. సినిమా ఇంటెర్వల్ లో అన్న లేచి బయటకి వెళ్ళాడు. అన్నకి తెలీకుండా నేను వెనకే వెళ్లి కొన్ని నిజాలు తెల్సుకున్నా అవేంటంటే ... మా అన్న కూల్డ్రింక్ షాప్ లో డబ్బులు ఇవ్వడానికి వాలెట్ లోనుండి ఒక కరెన్సీ కట్ట తీసి అందులోనుండి ఒక నోటు ఇవ్వలేదు. జేబులోనుండి పది రూపాయల నోట్ ఇచ్చాడు. మరొకటి సిగిరెట్ సగం తాగి పడేసాడు .. మా వాడే కనుక షాడో అయి ఉంటే చివరికంటా కాలిన సిగిరెట్ వేళ్ళను చురుక్కుమనిపించిన తర్వాత కదా పడేయాలి. సాలోచనగా తల పంకిస్తూ మా వాడు షాడో కాదన్న నిర్ణయానికి వచ్చా. అంతలో ఇద్దరు దృడకాయులు మా అన్నకి దగ్గర గా వెళ్ళారు...... కాని వాళ్ళు మా అన్నని ఏం అడగలేదు ..... మా అన్న వాళ్ళనేం పట్టించుకోలేదు. అయితే వాళ్ళు దృఢ కాయులు కాదని .... ఊబకాయులని నాకు తర్వాత తెలిసింది.

మా వాడు షాడో కాదని తెలియడం తో నా నోరు వేపాకులు నమిలినట్లు చేదు గా అయింది. మస్తిష్కం లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. "ఇక్కడేం చేస్తున్నావ్ రా" అంటూ మా అన్న తల మీద ఒక్కటివ్వడం తో ఈ లోకం లోకి వచ్చా.

మా అన్న షాడో కాకపోతేనేం నేనే షాడో అవుదామని నిర్ణయించుకున్నా. అయితే నేను ఇంకా ఆరవ తరగతి చదవుతుండడం వలన ఇంటర్ పోల్ లో చేర్చుకోరు కనుక హైస్కూల్ పోల్ లో చేరడానికి ప్రయత్నాలు మొదలెట్టా .... అందులో భాగం గా ఎవరైనా ముసలాయన సిగార్ వెలిగించి కనిపిస్తే సార్ మీ పేరు కులకర్ణి నా అని అడుగుతూ ఉండేవాడిని.

అయితే షాడో పక్కన ఎప్పుడు శ్రీకర్ ఉంటాడు కదా .. మరి నా పక్కన ఉండడానికి ఒకడు కావాలి కదా అనుకోగానే "సీనూ ఆడుకుందామా" అంటూ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు రాజేష్ . అహ వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే కదా అనుకున్నా కాని నాకప్పుడు తెలీదు వీడు మధుబాబు నవల లోని వాడు కాదు మల్లిక్ నవలలోని కారెక్టర్ అని.

వీడు ఎంత వరకు పనికొస్తాడా అని నేను రాజేష్ ని గమనించడం మొదలెట్టాను. కాని వీడు హి హి హి అని పళ్ళికిలిస్తూ నవ్వడం .. అర్ధం కాని విషయాలకు బుర్రగోక్కోడం .... సినిమా వాల్ పోస్టర్ లు నోరెళ్ళబెట్టి చూడ్డం వంటి చేష్టలతో నన్ను విసిగించే వాడు. ఎప్పుడన్నా నేను వాడిని "దింగాల డిప్పి "అని తిట్టినప్పుడు గుడ్ల నీరు కుక్కుకోవడం వంటివి చేసే వాడు.

వీడిని ఎలాగైనా శ్రీకర్ ని చెయ్యాలని నేను చేయని ప్రయత్నం లేదు .... అలా ఆరు నెలలు గడిచాయి .... మా చేష్టలని వింతగా చూస్తూ నవ్వుకునే వారు మా క్లాస్మేట్స్ వాళ్ళకి నేను పెట్టిన పేరు డస్కు డమాల్ గాళ్ళు . పైటింగు నేర్పిద్దామని ఊరికే ఎటాక్ చెయ్యరా అంటే .... దబుక్కున ఎగిరి దుబుక్కున నా మీద పడే వాడు .... ఓరి నీ పుస్కున్నర పుస్కు అలా కాదు రా అంటే దుబుక్కున ఎగిరి దబుక్కున పడాలా అనేవాడు ... కోపంగా పళ్ళు కొరికి .. నెప్పి పుట్టి అబ్బో అనే వాడిని దవడ పట్టుకుని. "ఎందుకు శీను అలా పళ్ళు కొరుకుతావు ... మరీ పళ్ళు అంత జిలగా ఉంటే జీళ్ళు కొనుక్కుని నమలచ్చుగా .. ఉచిత సలహా పడేసాడు .. వాడికి కూడా సగం ఇస్తానని ఆశతో నాలిక తడుపుకుంటూ. చాల్లే నీ చచ్చు తెలివి తేటలు .. కిలారి కిత్తిగా అని వాడిని ఒక తోపు తోసి వాడు డుంకి డుంకి అని దింకిలు కొడుతుంటే అహ లపక్ చక లపక్ చక అని గంతులు వేస్తుండగా నాకు అన్పించింది నేను షాడో నా లేక మల్లిక్ నవలల్లో బుచ్చిబాబునా ? నేను వాడిని మార్చానా లేక వాడు నను మార్చేసాడా?







33 comments:

phanishankrrocks said...

anna keka stroy ga

chow said...

nice presentation.

Unknown said...

/// నేను షాడో నా లేక మల్లిక్ నవలల్లో బుచ్చిబాబునా ? నేను వాడిని మార్చానా లేక వాడు నను మార్చేసాడా? ////

హి హి హి eadi correct inthaki :P ....

super story :) keka vundi

Vennela kona said...

ఒక్కసారి గా మా బాల్యం గుర్తు వచింది.అన్న నేను ఈ లాగే బూక్స్ చదివి మెరుపు వేగం తొ కదిలాను.చేతిని కత్తి ల మలచి కొడతాను అనుకునే వాళ్లము

tamilan said...

jambara hamba bale navvinchavu

నేస్తం said...

ఏం బాడపడద్దు శ్రీను ...శ్రీమతి శ్రీనివాస్ ని అడిగితే ఇట్టే తేల్చేస్తారు తమరెవరో..:)

మంచు said...

భలేవుంది.. సీను.. బాగా నవ్వించావ్.

శ్రీనివాస్ said...

ధన్యవాదాలు ఫణి , చౌ

శ్రీనివాస్ said...

పవన్ నువ్వ్వు మరీనూ ,

వెన్నెల కోనా దాదాపు అందరు నా బాపతేమో

శ్రీనివాస్ said...

తమిళన్ గారు .... ధన్యవాదాలు


నేస్తం గారు ,,, శ్రీమతి శ్రీనివాస్ గారు ఆల్రెడీ .... ఆ నలుగురులో రఘురామయ్య కారెక్టర్ ఇచ్చేసారు : హి హి

Farook said...

Nuvvu nenu and e world lo evaru raajesh gaadini jeevitham lo marchaleru.... vaade manandarini tingarolluga marchestadu

Anonymous said...

keka

Bhargavi said...

emi seenu.... ippatikaina telisinda nuvvu evaro....
nenaithe chinnappudu cinemalu chusi andulo fights chesedanni ma tammullatho...
ofcourse nene hero character vesedanni anukondi...
aa character naku ivvakapothe nenu aadanani bedirinchedanni kada...

Yamini Meduri said...

i was into blogging frm 1.5 years but never got to read a complete telugu blog....thanks friend...thanks a ton for letting me know abt this blog..!!!

శ్రీనివాస్ said...

అవును .. ఫరూక్ వాడిని మార్చలేము,

ధన్య వాదాలు అజ్ఞాత గారు

భార్గవి ఇప్పుడు తెలిసింది లే

సరి కొత్త తెలుగు బ్లాగ్లోకానికి స్వగతం యామిని

లక్ష్మి said...

ప్చ్...మీరేంటో మీకే అర్థం కాని ఒక ఖిచిడీ పాత్రలాగ మిగిలిపోయారు కదా, విధి బలీయము, విధి వెక్కిరించటము గట్రా అంటే ఇదేనేమో

శ్రీనివాస్ said...

లక్ష్మి గారు ఇంకా నయం విధి ఆడిన వింత నాటకం లో పాత్ర అన్నారు కాదు

Deepa said...

haahha evaru evarini marcharu ani intha sandehamenti thammudu.. nuvvu mallik ~ buchibabu vi kadu. nnuvvu HERO vi ra... 6 mnths saavasam lo vallu vellu avutharu ani antaru kadaa adi entha varaku nijamo ani TEST cheyyadaaniki ala genthave thappa.. Simham simhame ra... Ongolu githa Ongolu githe!!!

Nuvvu em maraledu kani nee katha chadivi.. nene Spring lagaa maari maree navvukunnanu. chala bagundi nanna... kitakitalu chalane vunnayi nee daggaraa hahaha

పరిమళం said...

శ్రీనివాస్ గారు , మల్లిక్ గారి రచనలు పరిచయం ఉంది ఈ షాడో అంటే యండమూరిగారి అష్టా వక్రలో ఉంటాడు ...కాని శ్రీకర్ గురించి తెలుసుకోవాలంటే ఎలా మరి ? మరి రాజేష్ చంటబ్బాయ్ లో శిష్యుడి టైపనుకుంటా కదండీ :) :)

శ్రీనివాస్ said...

@ @ దీప అక్కా బాగా కనిపెట్టారు ... అంతలా నవ్వినందుకు థాంక్స్

పరిమళం గారు రాజేష్ ఆ టైపే, కాని షాడో శ్రీకర్ లు మధు బాబు డిటెక్టివ్ కధల్లో ఉంటారు

sunita said...

mallik, madhubaabu, style ను బాగా గమనించి వాళ్ళ పడికట్టు మాటలతో రాసారు.చాలా బాగుంది.

Anonymous said...

మీరు మనసుపెడితే మంచి రచయిత అవుతారు అనడంలో సందేహం లేదు. కాకుంటే అప్పుడప్పుడు తింగరి జోకులు ప్రచురిస్తూ పాఠకులకు చులకన అవుతున్నారని నా అభిప్రాయం. పోస్టులు తగ్గించి ఇలాంటి పోస్టులే రాయండి. త్వరలో అందరు మీ తదుపరి పోస్టు కోసం ఎదురుచూసే రోజొస్తుంది.

శ్రీనివాస్ said...

@ సునీత గారు ,, చెప్పాగా చిన్నప్పటి నుండి అదే పని

@ అజ్ఞాత గారు మంచి రచయిత అవడము కన్నా మంచిగా అందరినీ నవ్వించడం నాకు ముఖ్యం. పైగా హాస్యం రాయడం రాని వారంతా కామెడి బ్లాగులకు హిట్లు ఎక్కువయ్యాయని క్రైయింగ్ పాపం

jyothi said...

bagundandi. chal rojula taruvata shadow peeru mee nota vinnanu.. neenu madhu babu gari books ekkuvagane chadivanu.. srikar vaasanti srivastava shadow...

mottaniki shadow la vachi buchibabula navvincharu.. bagundi.. keep going on..

jyothi

శ్రీనివాస్ said...

ధన్యవాదాలు పద్మజ గారు

Anonymous said...

హి హి మల్లిక్ కథలు గుర్తు రాగానే నాలో వీణలూ సితార్లు ఒక్కసారిగా మ్రోగడం మొదలెట్టాయి. నాలాగే మీరూ మల్లిక్ రచనలకు డింగాల డిప్ప అన్నమాట :)
స్వాతిలో మధుబాబు కొత్త సీరియల్స్ ఇప్పటికీ వదలను నేను.

>>మా వాడు షాడో కాదని తెలియడం తో నా నోరు వేపాకులు నమిలినట్లు చేదు గా అయింది<<
హి హి బయటే కాదు సినిమా హీరోలలో కూడ వెతికి వేపాకు నమిలాను నేను.
కొన్ని మహేష్ బాబు సినిమాల్లో హీరో షాడోకి దగ్గరగా అనిపిస్తాడు. ఐనా కొన్ని పాత్రలు ఊహల్లోనే బావుంటాయ్ :)
మల్లిక్ కథల్లో కారెక్టర్స్ మాత్రం సినిమాల్లో కావలసినన్ని ఉంటాయి. అన్నింట్లోకి హన్నా చెల్లెమ్మల రక్తసంబంధం హైలైట్.

మల్లిక్ మధుబాబులను చదువుతూ పెరిగి పెద్దయ్యారన్నమాట! అందుకే మీరు వికటకవి అయ్యారు :))

శ్రీనివాస్ said...

హిహి అజ్ఞాత గారు .. మరే వా అని ఏడవడం కూడా మొదట అందరికీ పరిచయం చేసింది మల్లిక్ ఇంకా ..... కరాటే లో అతి భయంకరమైన పోసిషన్ ఆ నింజా ఫైటర్ తీసుకోగానే కులకర్ణి గారిని మరోసారి తిట్టుకుంటూ అంతకన్నా ప్రమాదకర పోసిషన్ షాడో తీసుకోవడం అన్ని గుర్తు ఉండేఉంటాయి మీకు

Sudhakar said...

Navvi Navvi Kalla llo Neellu vachaai ra, Nee presentation chaalaa baagundi...

రాజ్ కుమార్ said...

నేను షాడో నా లేక మల్లిక్ నవలల్లో బుచ్చిబాబునా ? నేను వాడిని మార్చానా లేక వాడు నను మార్చేసాడా

sooper......

Anonymous said...

అబ్బా అబ్బ ఏమి రాశావు బాబు.

Sravya V said...

హాయ్ భలే రాసారు. నేను చదవటం మిస్సయ్యానేమో ఇంతకు ముందు , ఇప్పుడు అజ్ఞాత గారి తో కామెంట్ తో వచ్చా ఇక్కడకి . నిజం గా భలే ఉంది !

కృష్ణప్రియ said...

చాలా సరదాగా ఉంది మీ కథ. I was giggling at , అన్న కుడి చేయి నా బుర్రకి కనెక్ట్ అయింది ... కాని సటాల్ అని సౌండ్ రాలేదు. :( ....మా అన్న నోటి నుండి సింహనాదం కాదు కదా కనీసం పిల్లినాదం కూడా రాలేదు : at work..

Very entertaining post!

Anonymous said...

//మా వాడే కనుక షాడో అయి ఉంటే చివరికంటా కాలిన సిగిరెట్ వేళ్ళను చురుక్కుమనిపించిన తర్వాత కదా పడేయాలి//
షాడో మరీ కక్కుర్తి మనిషి అయివుండచ్చు అనిపించలేదా, ఒంగోలు శ్రీను? :))
నేనూ షాడో చదివే వాడిని, చాలా బాగుండేవి. మీరు రాసిన తీరు బాగుంది, నాకు నచ్చింది .. హమ్మ్ కాదు కాదు ' మా ఇంటిల్లిపాదినీ అలరించాలి లేదా ఆనందడోలికల్లో ఉర్రూతలాగించాలి ' కదా? :)