అవి మేము 6 తరగతి చదువుకునే రోజులు .... నేను, ఫరూక్ , రాజేష్ మొదట ఫ్రెండ్స్ అయినది అక్కడే. ఒక రోజు టీచర్ గారు మాకు నీతి కధలు నేర్చుకుని రండి , రేపు ప్రతి ఒక్కరు ఏం కధ నేర్చుకున్నారో చెప్పాలి ... కధలో నీతి తప్పకుండా ఉండాలి అని చెప్పారు. పోలోమని అందరం బయల్దేరాం.
మరుసటి రోజు ఏం నేర్చుకున్నామో తెలీదు చెప్తే టీచర్ గారేం అంటారో తెలీదు... ఐన ఒక్కొక్కరం ఏదో ఒక కధ.. చెప్తున్నాం. ఏం చెప్పినా టీచర్ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తున్నారు. అసలేం నేర్చుకోకుండా వచ్చిన రాజేష్ లో ధైర్యం వచ్చింది. తన వంతు వచ్చాక ఇలా చెప్పాడు.
"మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక బాడ్ ఫామిలీ ఉన్నారు టీచర్. ప్రతి ఒక్కళ్ళ తో గొడవలు పడుతూ ఉంటారు .... అందరినీ కొడుతూ ఉంటారు .... ఒక సారి మా మామయ్యా ఆఫీస్ నుండి వస్తుంటే గొడవ వేస్కున్నారు .... మా మామయ్య అసలే తాగి ఉన్నాడు ... అయన దగ్గర ఏమీ లేవ్ .. అయినా ఉత్త చేతులతో వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొట్టాడు .. టీచర్" విజయగర్వం తో చెప్పాడు రాజేష్.
"ఈ క్రూరమైన కధ లో నీతి ఏంట్రా" అయోమయంగా కాస్త కోపంగా అడిగారు టీచర్.
"తాగి ఉన్నపుడు మా మామయ్య జోలికి వెళ్ళరాదు" ముసి ముసి గా నవ్వుతూ చెప్పాడు రాజేష్.
10 comments:
మంది ఎక్కువైతే మజ్జిగ చిక్కగా వుండదు ...
మీ టపాలకు ఇది వర్తిస్తుందేమో ?
తప్పుగా అనుకోకండి నాకు అనిపించింది చెప్పాను ...
క్షమించండి ...
ఈ విషయం మీద తీవ్రం గా అలోచించి ఒక నిర్ణయానికి వస్తా
cool, manchi comedy nenaite pagalabadi navvaanu
థాంక్స్ రెండో అజ్ఞాత గారు
:) :)
wow nice it's working nenu kooda naku teliyakundane navvanu
parimalam garu :)
tamilan garu ... navvinanduku thanks
y dont u put rajesh pic in a post we want to see him
because he is popular than you
hahahahahahah.
hahhahahahaha.
and once again
hahahhaahh
mari nuvvem cheppavu?
@agnata Blog lo top lo oka link unnadi choodandi
2deepa akka Thanks
Post a Comment