గమనిక : చాలా కాలం తర్వాత వ్రాస్తున్నాను కనుక అర్ధం కాని వాళ్ళు ముందు మూడు పార్ట్స్ ఓపిక చేసుకు చదువుకోవాల్సినదిగా ప్రార్ధన.
లేత మనసులు - 1
లేత మనసులు - 2
లేత మనసులు - 3
కిట్టిగాడి ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాటే గానీ ఒకపక్క నా అంతరాత్మ రేపు నీ సంగతి చూసుకోవోయి అని హెచ్చరిస్తూనే ఉంది. మర్నాడు ఉదయాన్నే జిమ్ కి వెళ్ళేప్పుడు చూసా... ఇంకా లేవలేదనుకుంటా తలుపులు మూసి ఉన్నాయి. తిరిగి వచ్చేటప్పుడు బయటనే నిల్చుని ఉంది మున్ని... పక్కనే ఉంది పూజ ... "10.30 కి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాము వచ్చేవాళ్ళు రావచ్చు" అని ఇండైరక్ట్ గా హింట్ ఇచ్చింది పూజ." హే నోర్ముయి" అని పూజ ని నవ్వుతూ గదిమినా తనలా చెప్పడం మున్ని కి ఇష్టమే అని తెలుస్తోంది. ఒక్కసారిగా మనసు గాల్లో తేలిపోయింది , మరుక్షణమే పిలిచి బకరాని చేస్తారేమో అని ఆలోచన రావడం తో మనసు గాల్లోంచి నేరుగా గుంటలో పడింది. అయినా చూద్దాంలే అనుకుని ఇంటికి వెళ్లి పూల రంగడు టైప్ లో యెర్ర టీ షర్ట్ , కింద రఫ్ అండ్ టఫ్ జీన్స్ వేసి మన సైకిల్ మీద బయల్దేరా . అప్పట్లో ఒంగోల్లో ఒకే ఒక సూపర్ మార్కెట్ ఉండేది. కూసంత పెద్దదే ! నేరుగా లోపలకి వెళ్ళా .... కొద్ది సేపటికి పూజ కనిపించింది కానీ మున్ని అక్కడ లేదు . ఇదసలే మగరాయుడు టైప్ దీన్ని పలకరించాలా వద్దా అని అనుకునే లోపే "హాయి హాయి " అంటూ వచ్చేసింది. "ఏంటి ఇంత లేటా! అయినా 10.30 కి రమ్మంటే 10 కె వచ్చి వెయిట్ చెయ్యాలి గానీ ఐదు నిముషాలు లేట్ గా వచ్చి దిక్కులు చూస్తావేంటి" ..... అని గలగలా మాట్లాడేస్తుంది. ఓ మై గాడ్ దీని వాగ్ధాటి కి నేను తట్టుకోలేను అనుకుంటూనే " మీ సిస్టర్ ఎక్కడ ?" అని అడిగాను . "అంటే నాకోసం రాలేదా!!!!!!!!! అక్క కోసం వచ్చావా " అని కళ్ళు ఎగరేస్తుంది . నాకు ఒక్క నిముషం ఫ్యూజ్ ఫెయిల్ . అంతలోనే మున్ని వచ్చేసింది . "రారనుకున్నాను .. ధైర్యవంతులే !!" అంది నవ్వుతూ హి అని పల్లికిలించి ఊరుకున్నాను." ఎం లేదు ఊరికే మీతో మాట్లాడాలి అనిపించింది అందుకే రామ్మన్నాము ... కానీ ఇక్కడ తెల్సిన అంకుల్ ఉన్నారు ఈవినింగ్ గుడి దగ్గరకి రాకూడదూ "అంది మున్ని. " సరే " అన్నాను . "ఓకే బాయి " అని బయల్దేరారు.
కొద్దిగా ముందుకి వెళ్ళాకా" అవును నాకో డౌట్" అంటూ వెనక్కి తిరిగింది పూజ. ఏమిటి అన్నట్టు చూసాను................ " అవును మీకు బాత్రూం అలవాటు ఉండదా .... ఫ్రెష్ ఎయిర్ ఉండాల్సిందేనా ? అంది కొంటెగా .... నాకు అర్ధం కాలేదు .... మళ్ళీ ఏమిటన్నట్టు చూసాను . "అదే పొద్దున్న పొద్దున్నే సైకిలేసుకుని బయలుదేరుతారు ఎక్కడికి ?" అంది .... " ఎక్కడికి అనుకుంటున్నావ్? " అన్నాను .... " హా లండన్ కేమో అనుకున్నా.. నిజమేనా !!" కిల కిలా నవ్వుతూ వెళ్ళిపోయింది. హారి భగవంతుడా ... మనం ఉదయాన్నే జిం కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ లో తెగ చించుకుని వెళ్తుంటే అమ్మాయిలకి ఇలా అర్ధం అవుతుందా ........ అనుకుంటూ ఇంటి దారి పట్టా :(
సాయంత్రం గుడి దగ్గరకి వెళ్ళాలనే అనుకున్నా ... కానీ మా వాళ్లందరూ గుడి దగ్గరే ఉంటారు మా అమ్మతో సహా అందుకే వెళ్ళలేకపోయా .... ఆ మరుసటి రోజు మున్ని కాస్తంత సీరియస్ గా చూసింది . తనకి పరిస్థితి వివరించేందుకు కుదరలేదు. అలా చూపులతో కొన్ని రోజులు గడిచాయి . అదే సమయం లో అరుదుగా హిందీ సినిమాలు రిలీజ్ అయ్యే ఒంగోలు కి 'దిల్ తో పాగల్ హైన్ 'సినిమా వచ్చింది. యాదృచ్చికంగా మున్ని వాళ్ళు మేము ఒకే రోజు ఒకే షో కీ వెళ్ళాం . వాళ్ళు మాకంటే నాలుగు వరుసల ముందు ఉన్నారు . సినిమాలో మున్ని మాధురీ దీక్షిత్ లాగా నేను షారుక్ లాగ నేను ఊహించేసుకుని ఫీల్ అయిపోయానని వేరే చెప్పక్కర లేదనుకుంటా . అది ప్రేమా , ఆకర్షణా అని తేల్చుకోలేని వయసు లో ఉన్న మనసు మీద 'దిల్ తో పాగల్ హైన్ 'లాంటి సినిమాలు బలమైన ప్రభావాన్నే చూపిస్తాయి . ఎస్ ... నేను మున్ని ని ప్రేమించేశాను.మున్ని కూడా సినిమా మద్యలో వెనక్కి రెండు మూడు సార్లు నాకేసి చూడడం గమనించాను కూడా.
ఆరోజు నుండి మున్ని ని చూడడం కోసమే వాళ్ళ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు ఎక్కువ వేసే వాడిని ..... మున్ని కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తూ ఉండేది. అదేంటో గానీ ఒక నెల రోజుల పాటు చూపులు నవ్వులతో ఒకలాంటి తియ్యని ఫీలింగ్ ఉండేది మా మద్య . ఒక రోజు మా అన్న నాకొక పని అప్పగించాడు ... ఆ పని మీద వెళ్తూ మున్ని కాస్త ఆందోళనగా ఉండడం గమనించాను . నా పని ముగించుకు సాయంత్రం వచ్చేసరికి పూజా, ముష్కాన్ గేటు దగ్గరే ఉన్నారు . నేను వాళ్ళ ఇంటికి చేరువయ్యేటప్పటికి " అక్క నిన్ను రైల్వేస్టేషన్ కి రమ్మంది" అని పెద్దగా అరిచారు . వాళ్ళ పక్కింటి వాళ్ళు , రోడ్డు మీద జనాలు .. అందరూ ఒక్కసారి షాకై చూస్తున్నారు . నేను రెండో ఆలోచన లేకుండా రైల్వేస్టేషన్ కి వెళ్లిపోయా .... నేను స్టేషన్ లోపలికి వెళ్ళే సరికి ట్రైన్ వచ్చింది . నేను మున్ని ని చూసేసరికే తను ట్రైన్ ఎక్కుతూ నన్నుచూసింది .... అప్పటికే వెనకనే ఉన్న వాళ్ళ నాన్న "పద పద" అని తొందర పెడుతూ లోనికి తీసుకెళ్ళాడు . ట్రైన్ వెళ్ళిపోయింది.
కాసేపు అక్కడే కూర్చుని వెనక్కి వచ్చాను . నేను వచ్చేసరికి పూజ గేటు దగ్గరే ఉంది .ఆ పక్కనే ఫాన్సీ షాప్ దగ్గరకి పని ఉన్నట్టు వచ్చింది . " అక్కని కలిశావా" అంది ... " లేదు నేను వెళ్ళే సరికి ట్రైన్ వెళ్ళిపోయింది ... మళ్ళీ ఎప్పుడు వస్తుంది" అన్నాను ...... "అక్క ఎందుకు వెళ్ళిందో తెల్సా .....................అక్కకి రేపు పెళ్లి చూపులు .... బహుశా ఇక రాదేమో!" అంది. నాకేం అర్ధం కాలేదు ఒకరకంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో ఎలా బిహేవ్ చెయ్యాలో కూడా తెలీలేదు . ఇప్పుడు మనసులో అదోరకంగా ఉంది కానీ అది బాధ అని చెప్పలేను .. బహుశా ఒకరకమైన కన్ఫ్యూషన్ అయి ఉండవచ్చు . నేను పూజ ముందు బాద నటించాలేమో అనుకున్నాను ... నా ఆలోచనలకి నేనే నవ్వుకున్నాను . వెళ్ళే ముందు పూజ " ఎందుకో అక్కకి నువ్వంటే ఇష్టం ... కానీ ఇలాంటి పరిస్థితిలో తనకి చాయిస్ లేదు " అనేసి వెళ్ళిపోయింది.
నిజమే కనీసం మేమిద్దరం సరిగ్గా మాట్లాడుకోను కూడా మాట్లాడుకోలేదు ... మా మద్య ఉన్నది చెప్పుకోని ప్రేమేనా అన్నదానికి కూడా నాదగ్గర సరైన సమాధానం లేదు. అసలా సిట్యుయేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్ధం కాలేదు. కొన్ని రోజులు అలా గడిచాక మున్నికి పెళ్లి సెట్ అయినట్టు పూజ చెప్పింది ... కొన్నాళ్ళకి పెళ్లి కూడా అయిపొయింది . పెళ్లి అయిన ఒక నెలకి మున్ని తన హస్బెండ్ తో కల్సి ఒంగోల్ వచ్చింది . నాకా సంగతి తెలీదు నేను మామూలుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను .... " శీను ....శీను.... శీను" అని ఎవరో పిలవడంతో చూశాను వాళ్ళ వరండాలో చీర కట్టుకుని మున్ని నిల్చుని ఉంది. ఆశ్చర్యం , నన్ను ఇంత డైరక్ట్ గా పిలుస్తుంది ఏమిటా అని చూస్తున్నా "లోపలి రా" అంది చనువుగా ... మళ్ళీ పంచ్.. ఏమైంది ఈ పిల్లకి ఇలా పిలుస్తుంది అనుకుంటూ గుబులు గుబులు గా లోనికి అడుగుపెట్టా .... " రా శీను నిన్ను మా హస్బెండ్ కి పరిచయం చేస్తా రా" అంది . మూడో పంచ్ ..... ఇప్పుడు ఏమి చెబుతుంది క్లాస్ మేట్ అని చెబుతుందా లేక చిన్నప్పటి ఫ్రెండ్ అని చెబుతుందా లేక పక్కింటి అబ్బాయి అని చెబుతుందా ఏదైనా అబద్దమే కదా .. అని కొద్దిగా భయంగా , ఎవడినో మోసం చేస్తున్న ఫీలింగ్ తో గిల్టీ గా లోనికి వెళ్లాను . " హే సిద్ధూ శ్రీ అని చెబుతూ ఉంటానే తినే" అని చెప్పి పరిచయం చేసింది ." ఓ హాయి మీరేనా శ్రీను అంటే ...మున్ని చెప్పింది ... నాకొక అబ్బాయి లైన్ వేశాడు కానీ డేర్ చెయ్యలేకపోయాడు నేను డిసైడ్ అయ్యే లోపే మీతో పెళ్లి అయింది అని ఎనీ వేస్ నీకంటే నేను చాలా లక్కీ కదా ".. అని జోవియల్ గా మాట్లాడాడు . ఆరోజు గంటకి పైగా అతనితో మాట్లాడి వచ్చాను .. ఆ ఇంట్లోకి బెరుగ్గా భయంగా గిల్టీగా వెళ్ళిన నేను ... మున్ని నా గురించి సరైన ఇంట్రో ఇవ్వడంతో చాలా రిలీఫ్ గా గర్వంగా బయటికి వచ్చాను :)మళ్ళీ ఇప్పటిదాకా నేను మున్ని ని కలవలేదు , చూడలేదు .
మున్ని కి నాకు మద్య ప్రేమ కధ ఏమి నడవలేదు ... కానీ మామద్య ఒక ఎమోషన్ ఉండేది ... మున్ని పట్ల నాలో కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అవి నేను మున్ని కి కూడా చెప్పలేదు అందుకే ఆ ఫీలింగ్స్ నాలో శాశ్వతంగా నిలిచిపోయాయి.
2/3/11
10/28/10
లేత మనసులు -3
మరీ మరీ తిరిగి చూడమన్న ప్రసాద్ గాడి హెచ్చరికలతో వెనక్కి తిరిగిచూసా . ఆమె చటుక్కున తల తిప్పుకుంది కానీ ఆమె అప్పటిదాకా నన్నే చూస్తుంది అని గుర్తించేసా :D. ఇక ఆ రోజు రాత్రి నిద్రపోతే ఒట్టు. మరురోజు ఉదయాన్నే పూలరంగడులా రంగురంగుల చొక్కా వేసి తయారై సైకిలెక్కి బయల్దేరా. వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చేసరికి ... అక్కడ ఆమె ఉంటుంది అని.. మేమిద్దరం చూసుకుంటాం అని .... ఎన్నెన్నో ఆశలతో వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. వాళ్ళంతా వంటగదిలో బిజీగా ఉంది నా ఆవేశం మీద నీళ్ళు చల్లారు :(. కానీ అప్పటికే నేను మున్నిని ప్రేమించేశాను.. మున్ని కూడా నన్ను ప్రేమించేసి ఉంటుంది అని మెంటల్ గా ఫిక్స్ అవడంతో కొద్దిగా ముందుకెళ్ళి ఏదో మర్చిపోయినట్టు మళ్లీ వెనక్కి రావడం వంటి ప్లాన్లు వేసి మరీ నాలుగైదు రౌండ్లు బెల్లు కొట్టుకుంటూ తిరిగినా ఉపయోగం లేదు. అంతలో "సీనుగా రేయ్ " అని ఒక సుపరిచితమైన గొంతు నుండి వెలువడిన పొలికేక నా కర్ణేంద్రియాలకు బలంగా తాకడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నాకు పళ్ళికిలిస్తూ కనిపించాడు హైదరాబాద్ కృష్ణ. అంటే హైదరాబాద్ లొ చుట్టాలింట్లో ఒక వారం ఉండి వచ్చిన దగ్గర నుండి హైదరాబాదీ తెలంగాణా స్లాంగ్ లొ మాట్లాడేస్తూ మా దుంపతెంచుతుండడంతొ వాడికా పేరు పెట్టేశాం అనమాట.
"శీనూ" చాలా గారాబంగా పిలిచేశాడు కిట్టి గాడు. "ఈడెబ్బ ఈడేంటి తేడాగా ఉన్నాడు కొంపదీసి మన ఫిగర్ కి లైన్ వెయ్యడం లేదుకదా" అనుకుంటూ "ఎరా హైదర్ ( హైదరాబాద్ కృష్ణ కి షార్ట్ కట్) ఏంది సంగతి" అని అడిగా. "నాతో బాటు ఎస్.ఎస్. యెన్. కాలేజి వరకు రావా" అని అడిగాడు. హమ్ అసలే మన టర్కీ కనిపించడం లేదు కదా ఈలోపు టైం పాస్ అవుతుంది అనుకుని " మరిసైకిల్ నువ్వే తొక్కాలిరోయి" అన్నాను . పరమానందభరితుడై "అలాగే మామా నువ్వు రా చెబుతా" అని నా సైకిల్ సారధిగా మారి కాలేజీ కి తీసుకెళ్ళాడు. మెయిన్ గేట్ దగ్గర ఆపమని చెప్పి " నువ్వు తొందరగా లోనికి వెళ్లి పని చూసుకుని తొందరగా వచ్చేయరా నేను ఇక్కడనే ఉంటాను" అన్నాను. అంత కాడికి నిన్ను ఇక్కడదాకా తొక్కుకుని తేవడం ఎందుకురా" అన్నాడు. "మరెందుకు తెచ్చావ్ రా " కాస్త అనుమానంగా అడిగా..... "అనన్యకి ఈ రోజు లెటర్ ఇవ్వబోతున్నా మామా" సిగ్గుపడుతూ చెప్పాడు. ఉలిక్కిపడి "అంత డేర్ చేశావేంటి రా ? " అన్నాను..సోనాలీ బెంద్రే పిన్ని కూతురు లా ఉండే అనన్య ని ఆదరాబదరా కట్టిన మట్టి గోడలా ఉండే కిట్టిగాడిని కంపేర్ చేస్తూ. "ఆలా అంటావేంటి మామా ...ఆ అమ్మాయే రా నాకు లవ్ లెటర్ రాసింది నీకు తెల్సుగా" అదోలా కళ్ళు మూసుకుని నవ్వుతూ . నాకేం తెలుసు.... అనబోతు అర్ధోక్తిలో ఆగిపోయా ..... వాడన్న మాట నిజమే. వాడికి అనన్య ఎఫెక్టు తగలడానికి కారణం నేనే! ఆ కధ తెల్సుకోవడానికి ఒక రెండు పేరాలు రెండు నెలల వెనక్కివెళ్లి వద్దాం. ...............
"మామా కిట్టి గాడికి బాగా ఎక్కువ అయింది రా" ... మేము రెగ్యులర్ గా కూర్చునే పిట్టగోడ మీద చేరగానే గురు అన్న మొదటి డైలాగ్ ఇది . "ఏం చేశాడురా" అన్నాడు రాజేష్. "ఈ గోడ మీద కూర్చుని అమ్మాయిల మీద వరస్ట్ కామెంట్స్ వేసిపోతున్నాడు ... ఆ ఎఫెక్ట్ మనకి పడేలా ఉంది"అన్నాడు గురు. "అరే టెన్త్ క్లాస్ అమ్మాయిలని కూడా వదలడం లేదురా" చాలా ఆవేశంగా కంప్లైంట్ చేశాడు గిరి. "దుప్పటేసి ఉతుకుదాం రా ఒకసారి ఎవడుకోట్టాడో తెలీకూడదు నాకొడుక్కి" ఆవేశపడ్డాడు ఆది . "ఆగండ్రా బాబు ఆడికి అంత అవసరం లేదు వాడిని ఏంటీవీ బకరా హాట్ సీట్ మీద కూర్చోబెట్టే టైం వచ్చింది " అన్నాను." ఏం చేద్దామంటావ్?" అన్నాడు గురు. "చెప్తా! ముందు ఒక పేపర్ తీసి నేను చెప్పినట్టు రాయి" అన్నాను. రాజేష్ గాడి పుస్తకం లోనుండి పుసుక్కున ఒక పేపర్ చినిగింది. "చెప్పురా" అన్నాడు గురు రాయడానికి సంసిద్ధం అవుతూ ... అప్పుడే తట్టిన ఐడియా ప్రభావం వల్ల ఒక చిటికేసి సీనియర్ లాయర్ టైప్ లొ ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయించా....:). లెటర్ రాయడం పూర్తి అయింది. "రేపు ఎవరైనా ఆవెనక చెట్టు మీద కూర్చుని సరిగ్గా ఏదో ఒక కాలేజి బస్సు వచ్చేటప్పుడు ఈ లెటర్ వాడి ముందు పడాలి వాడికి అనుమానం రాకుండా ఎలా చేస్తారో మీ ఇష్టం ... ముఖ్యంగా ఈ తింగరి రాజేష్ గాడు అక్కడ లేకుండా చూడండి" అని చెప్పా. టోటల్ గ్యాంగ్ మొత్తం కలిసి ప్రణాళిక రచించారు.
మరుసటి రోజు కావాలనే కాస్త లేటుగా వెళ్ళా ... వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం కోలాహలంగా ఉంది . "మామా మామా ఇటురా ఇటురా" అని ఆత్రంగా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు కిట్టిగాడు. "ఏందిరా నీగోల" అసహనంగా అనడానికి ట్రై చేశాను. "అబ్బా విసుక్కోకు మామా ఇది చదువ్" అని ఒక లెటర్ తీసి చేతిలో పెట్టాడు. మనోళ్ళు ప్లాన్ అమలు పరిచారన్న మాట అనుకుంటూ లెటర్ తీసి చదివా అందులో " డియర్ కృష్ణ , మీరు చాలా అందంగా ఉంటారు" అన్న వాఖ్యం చదివి వాడి వైపు చూసా ... "ఇంకా చదువు ఇంకా చదువు" అన్నాడు కిట్టిగాడు అపుకోలేని ఉత్సాహం ఆపుకోడానికి యత్నిస్తూ.... మళ్లీ మొదటి నుండి చదివా " డియర్ కృష్ణ , మీరు చాలా అందంగా ఉంటారు ముఖ్యంగా మీరు కళ్ళు మూసి నవ్వేటప్పుడు ఇంకా అందంగా ఉంటారు " అనే వాఖ్యం చదివి గిరుక్కున తల తిప్పి చూసా ... కళ్ళు మూసి నవ్వుతున్నాడు. "ఛి నీఎంకమ్మ" అనుకుని మళ్లీ లెటర్ చదవడం మొదలెట్టా " నేను రోజు బస్సు లోనుండి మిమల్నే చూస్తాను కానీ మీరు నన్ను కాకుండా అందరికీ లైన్ వేస్తున్నారు ... ఆలా చేయొద్దు ఇక నుండి నన్నే చూడాలి ప్రేమతో నీ ప్రియురాలు" చదవడం ముగించా. "ఎవరు రాశారురా ?" కాస్త పెద్దరికం జోడిస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడిగా. "తెలీదు మామా ఎస్.ఎస్.యెన్ బస్సు లోనుండి ఇది వచ్చి నా మీద పడింది" అన్నాడు. "అవున్రా నన్ను తప్ప ఇంకెవరినీ చూడవద్దు అన్నది కదా ఇకనుండి జాగర్త " అన్నాను. "అసలు ఆ పిల్ల ఎవరో తెలిస్తే కద మామా .... నన్నే చూడు అంటుంది అసలామె ఎవరో తెలిస్తే కాదా ఆమెనే చూసేది" ఆందోళనగా అన్నాడు కృష్ణ. "అందుకు నా దగ్గర ఐడియా ఉంది మామా ... ముందు మన గాలి నాయాల్ల పక్కన కూర్చోడం మానేయి ... ప్లేస్ మార్చు ... వేరే ఏరియా చూసుకో ... నీకు వర్క్ ఔట్ అయిపోద్ది "అని ఒక ఉచిత సలహా పారేశా .... అప్పుడు కళ్ళు మూసి నవ్వుతూ వెళ్ళి బస్సులెమ్మట తిరగడం మొదలెట్టిన కిట్టిగాడు .. ఇదిగో ఇప్పుడు లెటర్ రాసింది రాం నగర్ లొ ఉండే అనన్య అని ఫిక్స్ అయ్యి వచ్చాడు ... (ఇక ప్రస్తుతానికి వద్దాము.)
"ఆ లెటర్ రాసింది అనన్య అని ఎలా ఫిక్స్ అయ్యావ్ రా?" అని అడిగా . "ఆ రోజు నుండి ఆ బస్సు వెనకే ఫాలో అయ్యాను మామా చాల రోజులు ... బస్సు దిగిన అందరు అమ్మాయిలు మామూలుగా వెళ్ళిపోయేవారు కానీ ఒకరోజు ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి మళ్లీ గేటు దాకా వచ్చి వెళ్ళింది రా " అన్నాడు . "గేటు వెయ్యడం మర్చిపోయిందేమో రా అందుకే వచ్చి ఉంటుంది " అన్నా .. "కాదు మామా నాకోసమే వచ్చింది రా "అని వాదించడం మొదలు పెట్టాడు. "సరే ఇపుడు ఎం చేద్దాం అంటావ్ "అన్నాను "నువ్ కూడా తోడు వస్తే లెటర్ ఇస్తా నేను కూడా" అన్నాడు . "సరే అలాగే ఎడువ్ కానీ ఆరోజు ఆ లెటర్ ఆమె రాసి ఉండకపోతే ?" అన్నాను . "అందుకే ఆసంగతి ఇందులో రాయలేదు" మామా తెలివిగా రాశా కదా అన్నట్టు కళ్ళెగరేస్తూ అన్నాడు కిట్టి గాడు. "సరే ఇచ్చి రా.... నేనుకూడా వస్తే అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టాడా అని నీమీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది.. ఏదన్న తేడా జరిగితే నేను వచ్చి నిను సేవ్ చేస్తా అన్నాను. యే మూడ లొ ఉన్నాడో గానీ ఒప్పుకున్నాడు. " పాస్ బెల్లు కొట్టినప్పుడు పోయి ఇచ్చివస్తా "అన్నాడు. "నీ ఎంకమ్మ థూ నీ ఎలిమెంటరీ బుద్ది తగలడా .. 11.20 -11.30 లీషర్ టైం అప్పుడు బయటికి వస్తారు పోయి ఇచ్చిరా" అన్నాను. బిక్క మొహం వేసుకుని నిల్చున్నాడు
అనన్య బయటికి వచ్చింది . "రేయి పదినిముషాలే ఉంది పోయి ఇచ్చి రా నీకెందుకు నేను ఉన్నా" అని చెప్పి తోసా . వాడు బయల్దేరగానే గోడ వెనక నక్కి చూడడం మొదలెట్టా .... అనన్య ఉన్న ప్లేస్ కి మాకు ఒక వంద అడుగుల దూరం ఉంటుంది. అక్కడ జరిగేది స్ప్రష్టం గానే కనిపిస్తుంది. వీడు వెళ్లాడు ..లెటర్ ఇచ్చాడు.. ఆమె చదివింది .. అటు ఇటు చూసింది .. వాళ్ళ ఫ్రెండ్ ని ఏదో అడిగింది ..ఆమె పెన్ను తెచ్చి ఇచ్చింది .. ఇదే లెటర్ మీద ఏదో రాసి ఇచ్చింది.. మనోడు మొహం వేలాడేసుకుని వచ్చాడు. "ఏమైందిరా ?"అన్నాను.. లెటర్ చేతికి ఇచ్చాడు. లెటర్ మీద రెడ్ ఇంకు తొ REJECTED అని రాసి ఉంది. రెడ్ ఇంకు పెన్ లేకపోతే ఫ్రెండ్ ని అడిగితీసు కుని మరీ రాసిందిరా.... అంటూ వేణుమాధవ్ ఎక్సప్రెషన్ ఇచ్చాడు కిట్టిగాడు. ఆ రోజు అర్ధరాత్రి దాకా మా బ్యాచ్ మొత్తం కిట్టిగాడి కామెడీ మే చెప్పుకుని చెప్పుకుని మరీ నవ్వుకున్నాం అని వేరే చెప్పాలా?????
(ఇంకా ఉంది)

9/29/10
లేత మనసులు - 2
ఉత్తరాది నుండి వ్యాపారరిత్యా ఆంధ్రా లొ స్థిరపడిపోయిన కుటుంబానికి చెందిన అమ్మాయే మున్ని :) . ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంది. తన మేనమామ భార్యకి డెలివరీ కావడంతో తోడుగా ఉండడానికి ఒంగోల్ వచ్చింది. తనతోబాటు సెలవుల్లో ఉన్న తన కజిన్స్ ని కూడ తీసుకువచ్చింది. అయితే అంతమందికోసం వాళ్ళ ఇల్లు సౌకర్యంగా లేకపోవడం వల్ల వేరే చోట ఇల్లు తీసుకుని ఇల్లు మారారు. కొత్త ఇంటికి వచ్చి ఆటో దిగుతున్న మున్ని చూపుని కొంచెం దూరంగా సైకిల్ చక్రం లొ చున్నీ ఇరుక్కోవడంతో నానా ఇబ్బంది పడుతున్న ఒక పదిహేనేళ్ళ పాప ఆకర్షించింది. అసలే కొత్త డ్రెస్ ఏమో ఏడుపు కూడా మొదలెట్టేసింది ఆ పాప. క్షణాల్లో ఆ పాపదగ్గర నలుగురైదుగురు చేరి... ఆ చక్రం నుండి డ్రస్ తీయడం లొ తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించేస్తున్నారు కానీ పని అవడంలేదు.
కూలి వాళ్ళు సామాన్లు ఇంట్లోకి మోస్తుంటే ... మేనమామ కొడుకుని ఎత్తుకుని వరండాలో నిల్చుని అక్కడ జరిగేది చూడసాగింది. ఆ చక్రం నుండి డ్రస్ లాగే వాళ్ళ దెబ్బకి డ్రస్ ఇంకాస్త ఇరుక్కుపోయిందేమో పెద్దగా ఎడ్చేయడం మొదలెట్టింది. 'అయ్యొ పాపం ' అని మున్ని జాలిగా అనుకుంటు ఉండగానే .. హీరో రేంజర్ సైకిల్ మీద సర్రున వచ్చి ఆగాడొకడు . ఆమ్మాయిని ఏడవద్దని హెచ్చరిస్తున్నట్టుగా సైగ చేసి సైకిల్ వెనక టైర్ ఎత్తి పట్టుకుని ఫెడల్ వెనక్కి తిప్పాడు. చాలా ఈజీగా సైకిల్ చైన్ లోనుండి అమ్మాయి డ్రస్ బయటికి వచ్చింది. అందరి వంక పిచ్చ నా డాష్ ల్లారా అన్నట్టు చూసి .. సైకిలెక్కి ఎంత స్పీడ్ గా వచ్చాడో అంత స్పీడ్ గా వెళ్లిపోయాడు. 'వీడెవడ్రా బాబు రఫ్ అండ్ టఫ్ జీన్స్ యాడ్ లొ అబ్బాయిలాగా బలే వచ్చాడే' అనుకుంది మున్ని.
తర్వాత సాయంత్రం పనులన్నీ అయ్యాక తన చెల్లెల్లకి ఈ విషయం చెప్పింది. "అయితే బాగున్నాడా" కళ్ళు ఎగరేస్తూ కొంటెగా అడిగింది ముష్కాన్ . ముష్కాన్ ఇంటర్ చదువుతుంది. "ఓయ్ నొర్ముయి రాను రాను భయం లేకుండా పోతుంది " అంటు ముష్కాన్ ని కసిరింది పూజ. మున్ని కంటె రెండేళ్లు చిన్నది పూజ. పూజ కన్నా రెండు నెలలు చిన్నది ముస్కాన్ ... ముగ్గురూ అక్క చెల్లెళ్ళ బిడ్డలు. మున్నికి ఎందుకో ఆ పిల్లోడే తెగ గుర్తు వస్తున్నాడు. " ఛి ఏంటి నేను ఎవరి గురించో ఇంతలా ఆలోచించడం" అని తనలో తను అనుకుంటుంది కానీ ఎందుకో ఆ దృశ్యమే తనకి పదేపదే గుర్తువస్తుంది. ఇల్లు సరిగ్గా సర్దుకోలేదు . ఉదయాన్నే లేచి సర్దుకోవాలి అనుకుంటూ పడుకుంది. ఉదయాన్నే ఐదున్నరకి లేచి కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి వరండాలో నిల్చుంది. కళ్ళ ముందు నుండి ఆ హీరో రేంజర్ సైకిల్ వాడు ఆలా వెళుతున్నాడు. తనకి తెలీకుండానే ఒళ్ళు జలదరించింది మున్ని కి . రాత్రంతా వీడి గురించి ఆలోచించిన ఎఫెక్ట్ అనుకుంటా అని సర్దిచేప్పుకుంది. ఇంకవీడి గురించి ఆలోచించకూడదు అని డిసైడ్ అయిపోతే .... వీడేంటి నిద్రలేవగానే దర్శనం ఇచ్చాడు అనుకుంది. కాసేపటికి చెల్లెళ్ళు కూడా నిద్ర లేవడంతో ఇక దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.
కొత్తగా తమ ఏరియాలోకి ముగ్గురు అమ్మాయిలూ దిగారు అన్న విషయం తెల్సుకున్న ఆ కాలనీ కుర్రాళ్ళు తడవకి ఒకరు వచ్చి చూసి వెళ్లడం చూసి "ఏంటి అక్కా వీళ్ళు... ఎప్పుడూ అమ్మాయిలని చూడలేదనుకుంటా" అంది పూజ వాళ్ళకేసి చూస్తూ . "మనకెందుకులేవే... అసలే కొత్తూరు........ లేనిపోని గొడవలు ఎందుకు ......అసలే ఇది మాస్ ఏరియా అంట.........." అంటూ మధ్యలోనే ఆగిపోయింది మున్ని. మళ్లీ ఆ సైకిల్ వాడే..తనలోకం తనదే అన్నట్టు ఏదో నవ్వుకుంటూ వెళ్తున్నాడు . వాడికేసి ఆలా చూస్తున్న మున్ని దగ్గరికి వచ్చి " అక్కా నిన్న నువ్వు చెప్పిన ఆ సైకిల్ హీరో వీడేనా ?" అంది పూజ. " ఆ వీడె.............. కానీ కొంచెం different గా ఉన్నాడు కదా .. మిగతా వాళ్ళలా లేడు" అంది మున్ని ( కానీ అప్పటికి వాడు ఇంకా తనని చూడలేదు అని మున్నికి తెలీదు ) .
రెండు రోజులు గడిచాయి ... మున్ని అండ్ కో కి అ పేట కుర్రాళ్ళ బీట్లు ఎక్కువ అయ్యాయి . బయట ఎక్కువగా కూర్చోవద్దని మామయ్య హుకుం జారీ చేశాడు. రెండు రోజులుగా సైకిల్ వాడు కనిపించడం లేదు . ఏమయ్యాడో ? అనుకుంటుండగా ప్రత్య్యక్షం అయ్యాడు వీధి మలుపు లొ. ఎప్పుడూ చాలా సరదాగా ఉన్నట్టు కనిపించే వాడు ఈ రోజు ఏంటి నీలుక్కుని వెళ్తున్నాడు అనుకుంది మున్ని ( వాడు ఆపాటికే తనని గమనించి ఫోజు కొడుతున్నాడని తెలీదు పాపం ) " అందరూ అక్క వైపు చూస్తుంటే అక్కేమో ఆ సైకిల్ వంక చూస్తుంది పాపం" అని కౌంటర్ వేసింది ముస్కాన్. "ఏయ్ చుప్ " అంటూ ముస్కాన్ ని కసిరింది మున్ని. "నేను అన్నదాన్లో తప్పేం ఉందక్కా " అంటూ బుంగమూతి పెట్టింది ముస్కాన్." అది కాదే, ఏంటో చాలా రోజులనుండి పరిచయం ఉన్న వాడిలా అనిపిస్తున్నాడు అంతకుమించి ఇంకేం లేదు " అనేసి లోపలకి వెళ్ళిపోయింది మున్ని. ఆలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ఉదయం మన సైకిల్ హీరో, పక్కన ఇంకొకడు నడుచుకుంటూ వస్తున్నారు. " అక్కా ... కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు వీడు సైకిల్ తో పుట్టాడా? యెప్పుడు చూసినా సైకిల్ తొక్కుతూ లేక నడిపించుకుంటూ కనిపిస్తాడు" అంది పూజ నవ్వుతూ .. పూజ మాటలకూ అందరూ నవ్వేశారు. కానీ మున్ని ఆలోచనలు వేరేగా సాగుతున్నాయి. " ఏంటి వీడు.... నాకేంటి వీడితో అసలు ... ఇప్పటిదాకా ఎంతమందిని చూసినా ఏమీ అనిపీలేదు కానీ వీడితో మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకు " అని తనలోతాను అనుకుంటూ వాడి వైపే చూస్తుంది. పక్కన ఉన్న పిల్ల బొండాం గాడు "అన్నా అన్నా ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది అన్న " అని చెప్పడం వినిపిస్తుంది. అంతలో ఆ సైకిల్ శాల్తీ వెనక్కి తిరిగి చూశాడు చటుక్కున తల దించేసుకుంది. పూజ ముస్కాన్ ల పరిస్థితి కూడా అంతే . తల వంచుకుని ఏదో పని చేస్తునట్టు నటించింది. కాసేపు ఆగి తలెత్తి చూసింది . ఆ బొండాం గాడి నెట్టిన మొట్టికాయ వేస్తూ నవ్వుకుంటూ వెళ్తున్న వాడిని చూసి ముసి ముసిగా నవ్వుకుంది.
కానీవాడు చూసే సమయానికి తను తలదించుకోవడం వాడు గమనించాడు అని తెలుస్కోలేకపోయింది. అ మర్నాడు .............
( ఇంకా ఉంది )

9/27/10
లేత మనసులు
అవి నేను పంతొమ్మిది -ఇరవై ఏళ్ళ వయసు మద్య నేను కుర్రపిల్లాడినా లేక పెద్దకుర్రాడినా అన్న మీమాంస లొనుండి పూర్తిగా బయటపడని రోజులు. అందరు అబ్బాయిలలాగే అమ్మయిలవంక తిరిగి తిరిగి చూసేవాడిని. మనలో మనమాట నాకూ ఒక గాళ్ ఫ్రెండ్ ఉండి తీరాల్సిందే అన్న ఆలోచన మనసులో బలంగా ఉండేది. కానీ ఎప్పుడూ ఏ అమ్మాయి వెనక వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ... వెళ్ళాలనిపించలేదు, ఆ అమ్మాయి హార్ట్ ని టచ్ చేయలేదు అనే టైపు సినిమా డైలాగులు చెప్పనుగానీ ప్రత్యేకించి పలానా అమ్మాయికి ఫిక్స్ అవడంలో నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్న టైం అని చెప్పుకోవచ్చు. జీన్ క్లాడ్ వాండమ్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ల సినిమాలు చూసి పూర్తిగా ఇన్స్పైర్ అయ్యి ఉదయాన్నే ఐదున్నరకి జిమ్ కి వెళ్లడం,కండలు కరిగేలా కసరత్తులు చేసి ఎనిమిదింటికి ఇంటికి రావడం ...ఏదో వెళ్ళాం అన్నట్టు కాలేజికి వెళ్లడం.... మద్య మద్యలో అమ్మాయిలకి బీట్లు కొట్టడం..ఇలా సాగేది దినచర్య.
సాయంత్రం అయ్యేసరికి గోడల మీద కూర్చుని వచ్చేపోయ్యే అమ్మాయిలకి బీట్లు కొడుతూ .....కామెంట్స్ విసుర్తూ వాళ్ళు తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తే ఒకటికి పదిసార్లు చెప్పుకుని నవ్వుకోవడం వంటివి చేసే తరహా సగటు ఆంధ్రా కుర్రాళ్ళ బ్యాచే మాదికూడా. సైకిల్ మీద వెళుతుంటే అమ్మాయి ఎదురుగా వచ్చేటప్పుడు అమ్మాయినే చూస్తూ ఉండగా ....దగ్గరగా వచ్చాక ఆ అమ్మాయి ఒక్క క్షణం చటుక్కున మనవైపు చూసి ఇద్దరి చూపులు కలుసుకుని మరుక్షణం ఆమె చూపులు తిప్పుకునే లోపు ఆ కళ్ళు కలిసిన టైంలో ఉండే జిల్ బలే ఉంటుందిలే. అలాంటి ప్రేమదేశం తరహా సంఘటనలు మనకి కోకొల్లలు. అంతకుమించి కధ ముందుకి వెళ్ళదు. ఆళ్ళు మనల్ని చూడడం మనం ఆళ్ళని చూడటం.
ఆలా సరదాగా రోజులు గడిచిపోతున్న సమయంలో ఒకరోజు మా కాలనీలొ చివరగా ఉండే ఇల్లు, అదీ గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఒక పెద్దఇంట్లోకి ఎవరో సామాన్లు మోసుకోవడం కనిపించింది. మరుసటి రోజు ఉదయాన్నే నేను జిమ్ నుండి వస్తుండగా ఆ ఇంట్లో ముందు వరండాలో ముగ్గురు అందమైన అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు.చాలా చక్కగా ఉన్నారు. అప్పటివరకు మేము ఒంగోల్లో అలాంటి అందగత్తెలని చూడలేదంటే నమ్మండి. నిజం చెప్పొద్దూ ఇక్కడే విధి తనపని తాను కానిచ్చింది అదేంటంటే ... ఇంత అందమైన అమ్మాయిలు అసలు మనవంక చూస్తారా .... అసలు మనల్ని పట్టించుకుంటారా ... అనవసరంగా మనం దేబిరిచ్చుకుని చూడటం తప్ప అనుకుని అసలు వాళ్ళని గమనించనట్టే వెళ్లిపోయా. కాస్త ముందుకి వెళ్ళాక మా సెంటర్ లొ కుర్రాళ్ళ మద్య బీబత్సమైన డిస్కషన్ జరుగుతుంది.
నేను ఊహించింది నిజమే మనోళ్ళు ఆ అమ్మాయిల గురించే ఒక రేంజిలో చర్చలు జరుపుతున్నారు. వాళ్లకి పాలు పోయడానికి కుదిరిన బర్రెల వెంకాయమ్మ ద్వారా మనోళ్ళు లాగిన విషయం ఏంటయ్యా అంటే ఆ అమ్మాయిలు ముగ్గురూ కజిన్స్ అనమాట అంటే ఆ ముగ్గురి తల్లులూ అక్క చెల్లెళ్ళు. వాళ్ళ మేనమామది ప్రేమవివాహం అవడం వల్ల బిడ్డ పుట్టినా ఆయన భార్య తరపువాళ్ళు ఎవరూ సాయానికి రాకపోవడం వల్ల వీళ్ళు వాళ్ళ అత్తకి తోడుగా ఉండటానికి వచ్చారు.పైగా వాళ్ళు నార్త్ ఇండియన్స్. కానీ చిన్నప్పటి నుండి ఆంధ్రాలో పెరగడం వల్ల తెలుగు అమ్మయిలలాగానే మాట్లాడతారు అన్నది సారాంశం.
చర్చలు ముగిశాయి .... తర్వాత ఆవిషయమే మర్చిపోయా .. మరో రెండు రోజుల తర్వాత నేను, మా ఫ్రెండ్ తమ్ముడు రాజేంద్ర గాడు సినిమా చూసి నడుచుకుంటూ వస్తున్నాము. ఆ ఇల్లు దగ్గర అమ్మాయిలని దూరంగానే చూశాను కానీ పట్టిచ్చుకోవడం అనవసరం అనుకున్నాగా అనుకుని మామూలుగా వచ్చేస్తున్నా .... " అన్నా ఆ అమ్మాయి నిన్ను తెగ చూస్తుంది అన్నా " అన్నాడు రాజేంద్ర . "ఏ అమ్మాయిరా" అన్నాను.అప్పటికే మేము ఆ ఇల్లు దాటి వచ్చేశాం. " అదే అన్నా ఆ చివర ఇంట్లో అమ్మాయి" అన్నాడు. "మనల్ని కాదేమోలేరా" అంటూ ముందుకే నడిచా ... వాడు వెనక్కి చూస్తూ "అబ్బా నిన్నే అన్నా నేను బాగా గమనించా కదా కావాలంటే చూడు" అన్నాడు. తల తిప్పి చూశా.............. అక్కడ .............( ఇంకా ఉంది )

9/22/10
అమ్మాయిలు అర్ధం చేసుకోలేరు
అది ఒక రోడ్ . అ రోడ్ లొ ఒక అబ్బాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు . అదే రోడ్ లొ ఎదురుగా ఇంకొక అమ్మాయి మరొక కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది . వారు ఒకరినొకరు క్రాస్ చేసుకునే సమయంలో అబ్బాయి విండో ఓపెన్ చేసి పెద్దగా గాడిద అని అరిచాడు. క్షణం ఆలస్యం చేయకుండా అమ్మాయి అదే స్పీడ్ లొ కోతిగా అని తిట్టేసింది . ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయారు . తన స్పాంటేనియస్ రెస్పాన్స్ పట్ల అమ్మాయి తీవ్రంగా సంబరపడిపోతూ కొద్దిగా ముందుకి వెళ్లేసరికి ఇలా అయింది.
కధలో నీతి : అబ్బాయిలు తమకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అమ్మాయిలకి అసలు అర్ధం చేసుకోలేరు.
.

9/21/10
'పోకిరి' పులి
గమనిక : ఈ టపాలో కంటెంట్ నా స్వంతం కాదు , ఈమెయిలు లొ దొరికింది పట్టుకొచ్చా :))
సబ్జెక్ట్ : పోకిరి సినిమాలో గలగలా పారుతున్న గోదారిలా అనే సాంగ్ కి ముందు వచ్చె సీన్ లొ పవన్ కళ్యాణ్ ఉంటే ఎలాఉంటుంది
ఇలియానా : ఇప్పుడు మళ్లీ ఏం సినిమా తీశావ్ ... ఎంత ప్రేమించాను నిన్ను .. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను .. ఎంతో మంచి యాక్టర్ అనుకున్నాను.
(జనం పరిగెత్తుతుంటారు : అక్కడ ఎవరో పులి సినిమా చూసి పోయారట ... ఎవరు ?.. తెలీదు )
ఇలియానా : ఇప్పుడు నేనేం చెయ్యాలి .. నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా
పవన్ కళ్యాణ్ : మర్చిపో
ఇలియానా: ఎలా మరచిపోగలను ఈ సినిమాలు ఆపుతావా లేదా ? చెప్పు ... ప్రతిక్షణం నీ సినిమానే గుర్తువస్తుంది... నిద్రలో ఆ పీడకలలే ... ఖాళీగా ఉన్న బుకింగ్ కౌంటర్ చూస్తే నువ్వే గుర్తు వస్తావ్ ... కాస్త తేడాగా ఉన్న ఎవరు కనిపించినా నువ్వే గుర్తువస్తావ్ ... ఏ హెలికాప్టర్ చూసినా నువ్వే గుర్తు వస్తావ్ ..అన్నం తింటుంటే గుర్తువస్తావ్ ... ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తువచ్చి బాధ పెడతావ్... నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి డిస్ట్రిబ్యుటర్ అనుకుని భయపడతాను గడియారం వంక చూసుకుని ఈ టైం లొ ఏ ఫ్లాప్ తీస్తుంటాడో అనుకుంటాను ..ఏం చేస్తున్నాడో అనుకుంటాను . కానీ నువ్వేం తీస్తున్నావ్ బిల్డింగ్ ల మీద దూకుతూ తిరుగుతుంటావ్... ఆ డైరక్టర్ ఎవరు...
పవన్ కళ్యాణ్ : ఎస్.జే సూర్య అని ఫ్రెండ్
ఇలియానా: వాడితో ఎందుకు తీయడం ..వాడు డైరక్టర్ కాదు
పవన్ కళ్యాణ్ : అందుకే తీస్తున్నాను
ఇలియానా: వాడి సంగతి నాకు తెలీదు ఇలా ఎన్ని ఫ్లాప్స్ తీస్తావ్
పవన్ కళ్యాణ్ : శృతి నీకొక విషయం అర్ధం కాడం లేదు .. నేనెప్పుడు ఫ్లాప్ సినిమాలు తీస్తూనే ఉన్నాను .. ఇప్పుడు తీసిన ఫ్లాప్ సినిమా కొత్తదేమీ కాదు ఇదివరకు చేసిందే... కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నా సినిమా చూసి తప్పు చేశావ్. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయినే ప్రేమించాను .. నా సినిమాలు చూసి ఎడిచారు కానీ నాకోసం ఎవరూ ఇలా ఏడవలేదు అది బానచ్చింది.
___________________________________________________________________
మన నాగార్జున సౌజన్యంతో క్రింది వీడియో చూడండి :)

9/20/10
తెలుగు లొ పూజిద్దాం :)
పిల్లలలో కొరవడుతున్న భక్తిశ్రద్ధల గురించి ఒకరోజు నాకు మిత్రునికీ మద్య చర్చకి వచ్చింది. చర్చలో మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు. దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ సంస్కృతం అందరికీ మద్య వారధిలా ఉండేది . ఆ సంస్కృతం పోయి ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాక సంస్కృతం అలవాటు లేక సంస్కృతంలో ఉన్న క్లిష్టమైన సహస్రనామాలు , అష్టోత్తరాలు వాళ్లకి అర్ధం కాక ఇదేదో మనకి సంబంధం లేని విషయం అనుకుని వదిలేస్తున్నారు అని. హమ్ నిజమే చాలామంది ఎకాడికీ ఈ జనరేషన్ ని ఆడిపోసుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు కానీ అసలు పిల్లల సమస్యని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా ప్రవర్తిస్తున్నారు అనేది నా అభిప్రాయం.
ఇప్పుడు కొత్త జనరేషన్ కి సంస్కృతం అలవాటు చెయ్యడం అనేది మనవల్ల కాని పని........... అది అందరికీ తెల్సు . ప్రస్తుతం ఎంత ఆంగ్ల మాధ్యమంలో చదువులు అయినా ఇంట్లో మాట్లాడుకునేది తెలుగులోనేగా ? దేవుడికి దణ్ణం పెట్టుకునేది తెలుగులోనేగా........... మరి అలాంటప్పుడు రామాయణ, భాగవత , భారతాల లాగా మన విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, మంత్ర పుష్పాలు అన్నీ ఎందుకు తెలుగులో అనువదించకూడదు. మాతృభాషలో భక్తిని పరిచయం చేస్తే ఏ పిల్లవాడు కూడా దైవానికి దూరం జరగడు అనిపిస్తుంది.
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అనుకోవడం లొ ఎంత ఆనందం ఉంది . మా ఇంట్లో రోజూ మా అమ్మ విష్ణు సహస్ర నామం చదువుతుంది కానీ మాకు ఒక్క ముక్క అర్ధం కాదు. లక్ష్మీ అష్టోత్తరం కూడా బట్టీ పట్టి నేర్చుకున్నా . కానీ నేను ఏం చదువుతున్నాను అనేది నాకే తెలీదు. ముఖ్యంగా ఒక చోట నృపవేశ్మ గతానంద అని ఉండాల్సిన చోట ప్రింటింగ్ మిస్టేక్ నృపవేస్య గతానంద అని ప్రింట్ చేశాడు . శివశివా అమంగళం ప్రతిహతమగుగాక .
కానీ సాయిబాబా చాలీసా , దశ నామాలు వంటివి ఒక్కసారి చదివితే సులువుగా అర్ధమవడం , అందులొ భావం మనసుకి హత్తుకోవడమే కాక అయన యెడల భక్తి మనస్సులో దృడంగా పాతుకుంటుంది.
అందుకే ఇకపై మాతృభాషలో పూజిద్దాం . పెద్దలు సంస్కృత పండితులు ఎవరైనా పూజా సంభంద విషయాలు తెలుగులో స్ప్రష్టంగా అర్ధమయ్యేలా అనువదిస్తే గ్రామగ్రామాన వాడవాడలా అందరికీ సులభంగా అర్ధమవుతూ భక్తి ప్రపత్తులు ఇనుమడయ్యే అవకాశం ఉంది.
ఈ విషయమై నేను ఒక మిత్రునితో చర్చిస్తే " మొదలు పెట్టావా బ్రాహ్మల పొట్ట గొట్టడం " అనేశాడు. ఎందుకలా అన్నాడో నాకు అర్ధం కాలేదు. తర్వాత తర్వాత ఆలోచించగా అర్ధం అయింది అనుకోండి. కానీ శూద్రులు వేదమంత్రాలు చదివేదరు అని బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు కదా :)

9/17/10
పాపం 'తార'కెన్ని కష్టాలు :P
బ్లాగులు చదివే వారిలో అసైన్సు కబుర్లు తార తెలీని వాళ్ళు ఉండరు. అయితే ఈ తారకి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు. బ్లాగు లోకం లొ ఎవరూ ఎదుర్కోనన్ని నీలాపనిందలు ఎదుర్కొన్న మన తార .......యెంత మంది చవితి చంద్రులను దర్శించాడో గాని! ......... ప్రపీసస పుట్టిన కొత్తలో నేను అందులో తార అంటే అమ్మాయి అనుకుని మన నాగ ప్రసాద్ ని అడిగా "ఎవరా అమ్మాయి" అని ... 33 సార్లు ఇలా పొర్లి పొర్లి నవ్విన నాగప్రసాద్ "అమ్మాయి కాదు అబ్బాయి"అని చెప్పాడు. కానీ అప్పటికే మెజారిటీ బ్లాగు లోకం తార ని అమ్మయిగానే గుర్తిస్తు వస్తుంది అప్పటి దాకా. అయితే ఇంగ్లీషు లొ స్టార్ అని ఉంటే అబ్బాయి అని తెలుగులో తార అని ఉంటే అమ్మాయి అనుకోవడం మన అవివేకం అనేది నా అభిప్రాయం.
ఇక ప్రజలు అప్పటికే అమ్మాయి అని అపార్ధం చేసుకున్న తార ని మొన్న ఒకాయన "బాబు యోగి అంటే నువ్వే కదా" అని అడిగాడట. దెబ్బకి దిమ్మ తిరిగిన తార ఆయనకి అసలు విషయం అర్ధం అయ్యేలా చెప్పి బయటికి వచ్చె సరికి విమల్ రెడీగా ఉన్నాడు . "హే తార బ్లాగు బాబ్జి నువ్వే కదా" అని టీనేజి పిల్లాడు విమల్ అమాయకంగా అడిగేసరికి మన తార గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. నేను బ్లాగు బాబ్జీ ని కాను మొర్రో అని మొత్తుకుని అక్కడి నుండి బయట పడ్డ తార నేరుగా బ్లాగు బాబ్జి దగ్గర ఈ విషయమై కామెంట్ పెడదామని వెళ్లాడు . అక్కడ తారని చూసిన బ్లాగు బాబ్జి .....................................

"అన్నాయి మార్తాండ అంటే నువ్వే కదా" అని అడిగేశాడు . పాపం తార :P
9/16/10
ఒరేయ్ మీరు మారర్రా - మీరు మారరు
నిన్ననే ఒక టపా రాశాను ... కామెడీగా రాశాను కానీ అందులో కొని నిజం అవుతాయనుకోలేదు వా ..
ఈ కింది లింక్ చూడండి . జగన్ కి కన్ను బాలేక ఓదార్పు ఆగడం వల్ల ముగ్గురు ఫట్ . ముందు సాక్షికి సలాం చెయ్యాలి :(

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11677&subcatid=16&Categoryid=3
‘గుండె’ చెదిరిన అభిమానం | ||
|