అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/4/10

ఒక సారి "కేక " పెట్టి చూడండి

సాధారణంగా మనకి తెల్సిన( నచ్చిన) ఒక విషయాన్ని నలుగురితో పంచుకోవాలి అనిపిస్తుంది. అందుకే ఈమెయిలు ఫార్వర్డ్ చేయడం ద్వారా మన మిత్రులకు చెబుతూ ఉంటాం . ఆ విషయం చెప్పింది మనమే అని అందరికీ తెలియాలంటే అందుకు అనువైన వేదిక బ్లాగు. మనకి బ్లాగు రాయడం అలవాటు అయిన తర్వాత మనకి తెల్సిన ప్రతి విషయాన్ని బ్లాగులో రాయాలి నలుగురితో పంచుకోవాలి అనిపిస్తుంది . ఇది సహజం నేను అయితే నాకొచ్చిన కల కూడా వ్రాసాను. అయితే ప్రతి చిన్న విషయాన్ని మనం బ్లాగులో రాయలేం . ఈ క్షణం ఏం చేస్తున్నాం అనేది సరదాగా వ్రాయాలంటే దానికి బ్లాగు కన్నా సరైన వేదిక మైక్రో బ్లాగింగ్. ట్విట్టర్ వాడే వారికి చెప్పనవసరం లేదు కానీ చిన్న చిన్న లైన్లు ఒకటి రెండు పదాలు బ్లాగడానికి అనువైన వేదిక మైక్రో బ్లాగింగ్ కాన్సెప్ట్. ఇప్పటికిప్పుడు మీరేం చేస్తున్నారు అనే విషయాలతో బాటు మీ మిత్రులతో సరదాగా చర్చించడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది . వీటి కోసమే ఏర్పాటు చేయబడింది కేక .

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయిన ఆర్కుట్ , ఫేస్ బుక్ లకంటే భిన్నమైనది కేక . కేకలో అంతా బహిరంగమే . కేక లో మీరు మీ అప్ డేట్స్ పోస్ట్ చేయవచ్చు , వేరొకరి అప్ డేట్స్ చదవచ్చు. కేక అలవాటైనాక చాలా చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారు . బ్లాగింగ్ కి సరి కొత్త రూపమైన కేక లో ఒకకేక పెట్టి చూడండి .... ఇంక కేక లు పెడుతూనే ఉంటారు.

13 comments:

మిరియప్పొడి said...

కేకో కేక!

Anonymous said...

బాగా డప్పు కొడుతున్నావు ఎంత ఇస్తామన్నారేమిటి

శ్రీనివాస్ said...

అజ్ఞాతా మా అంతఃపుర రహస్యాలు నీకేందుకు. నచ్చితే కేక పెట్టు నచ్చకుంటే అదే అక్కడ కేక లో పెట్టు

yogirk said...

ఒరే/ఒసే అనామకా(కీ), నువ్వు డప్పు కొడితే ఎంతతీస్కుంటవేటి?

Unknown said...

I never understand why there are trolls around, all the time! God bless you troll. Good luck.

Anonymous said...

Akka ajnaati

neeku koodali muttacheppe danikanna oka rupayi ekkuvele

చైతన్య said...

మైక్రో బ్లాగింగ్ కోసం "కువకువలు" ఉంది కదా... మళ్ళీ "కేక" ఎందుకు? కువకువలు కి, కేక కి ఏంటి తేడా !?

శ్రీనివాస్ said...

చైతన్య గారు ఆర్కుట్ ఉంది కదా మరి ఫేస్ బుక్ ఎందుకు అన్నట్టు ఉంది మీ ప్రశ్న

ranjani said...

perhaps the title itself shows the difference

kuvakuvalu : use for general chit chat

keka : use it to shout !

చైతన్య said...

నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడే కొత్తగా మైక్రో బ్లాగింగ్ కోసం ఇది కనిపెట్టినట్టు చెప్పారు కదా మీరు... అందుకే అడిగాను... మైక్రో బ్లాగింగ్ కి ఆల్రెడీ సైట్స్ ఉన్నాయి కదా... వాటికి దీనికి ఏదైనా తేడా ఉందా అని అడిగాను..

శ్రీనివాస్ said...

రంజని గారు మీరు కేకండి

yogirk said...

ఆమాట కొస్తే "కువకువలు" ను కూడా ఎవ్వరూ "కనుక్కో"లేదు కదండీ. అప్పుడెప్పుడో సరదాగా శరత్ గారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఉంటే బాగుండునని ఆయన బ్లాగులో రాస్తే, నేను అప్పటికే అందుబాటులో ఉన్న షౌటెం ని ఉపయోగించి కువకువలు చేసాను. ఇప్పుడీ "కేక" దేనికంటే -

షౌటెం లాగే మనకు నచ్చినవిధంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లను రూపొందించుకునే నింగ్ తో "లోగిలి" అనే సైటు ఒకటి తయారు చేసాను. మొదట్లో ఉచిత సర్వీసు అన్నారు, ఇప్పుడు కొన్ని రోజుల్లో అది పెయిడ్ కాబోతోంది. అదీ సంగతి, లోగిలిలా వేరే సర్వీస్ మీద ఆధారపడకుండా తయారు చేసినది "కేక". మనోళ్ళకు మైక్రోబ్లాగింగ్ బాగా ఎక్కినాక ఐడెంటికా తో చేద్దామని ఆలోచన

చైతన్య said...

'కువకువలు' ఎవరో కనిపెట్టారని నేనెప్పుడు అన్నాను :ఓ

జస్ట్ దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అని అడిగా...
మైక్రో బ్లాగింగు కోసం ఉన్న ఇతర సైట్స్ లాగానే ఇప్పుడు కొత్తదా 'కేక' అని వచ్చింది అని చెప్పకుండా... అంతగా దాని గురించి వివరిమ్గా రాస్తే డౌట్ వచ్చింది... దీనికేమైనా స్పెషల్ పుర్పొసె ఉందేమో అని... అందుకే అడిగాను... అంతే!