అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

7/31/10

ఇది మీరు నమ్మకపోయినా .... నిజంగా జరిగిన సంఘటన

రెండు నెలల క్రితం ప్రవీణ్ అనే యువకుడు ముంబై నుండి పూణే వెళుతున్నాడు. అయితే ప్రకృతిని ఆస్వాదించే కారణం చేత కొత్తగా వేసిన ఎక్స్ప్రెస్ వే ని కాదని పాత మార్గం లోనే వెళుతున్నాడు. అది ఘాట్ రోడ్డు. సాయంత్రం అయింది అమావాస్య రోజులేమో.......... చిమ్మ చీకటి........ కాసేపటికి సన్నగా వర్షం కూడా మొదలైంది . సడన్ గా అతని కారు ఆగిపోయింది. యెంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో ... దిగి నడక ప్రారంభించాడు. ఏదన్నా వాహనం వస్తే దిగి దగ్గరలో ఉండే ఏదేని ఊరికి వెళ్ళవచ్చు అన్నది అతగాడి ఆలోచన. ఉన్నట్టుండి వర్షం పెద్దది అయిపొయింది ... ఆ కటిక చీకటిలో ... జోరున కురిసే వానలో తడిసి ముద్ద అయిన ప్రవీణ్ కి చలి మూలంగా వణుకు కూడా మొదలైంది. కన్ను పొడుచుకున్నా కాన రాని చీకటి .. వల్ల ఏదో తనకి రెండు లేక మూడు అడుగుల దూరం వరకే చూడ గలుగుతున్నాడు. .. కాసేపటికి ఒక కారు అతని దగ్గరికి నెమ్మదిగా రావడం చూసిన ప్రవీణ్ ఇంకేం ఆలోచించకుండా ఒక్క గెంతులో వెళ్లి కారు బాక్ డోర్ తీసి ఎక్కేశాడు ... పక్కన ఎవరు లేరు. డ్రైవర్ కి థాంక్స్ చెబుదాం అని ముందుకి వంగాడు ... ఆశ్చర్యం అక్కడ కూడా ఎవరూ లేరు. ఇంజను యొక్క శబ్దం లేదు మరి కార్ ఎలా???? అని అతను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యి తరువాత భయానికి గురయ్యాడు ...ఆ భయం లోకూడా తను కూర్చున్న కారు నెమ్మదిగా కదలదాన్ని గుర్తించాడు. అది ఘాట్ రోడ్డు కావడం వల్ల బిగుసుకుపోయి రోడ్డు వంక చూడడం మొదలెట్టాడు ... ఏ మలుపులో అదుపు తప్పినా నేరుగా లోయలో ఉంటాడు ...... మలుపు సమీపించగానే ప్రవీణ్ దేవుడిని ప్రార్ధించాడు ... అంతే మలుపు చేరేలోపే విండో లో నుండి ఒక చెయ్యి వచ్చి స్టీరింగ్ ఆపరేట్ చెయ్యడం మొదలెట్టింది. దాంతో ప్రవీణ్ మరింత షాక్ కి గురయ్యాడు. అక్కడి నుండి ప్రతి మలుపు వద్ద ఆ చెయ్యి వచ్చి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూనే ఉంది. ఆలా కాస్త దూరం వెళ్ళాకా దూరంగా అతనికి లైట్స్ కనిపించాయి. వెంటనే ధైర్యం తెచ్చుకుని .. డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా కదులుతున్న కారు నుండి ఒక్క జంప్ చేసి పరిగెత్తి అక్కడికి వెళ్లాడు .

అదొక చిన్న టౌన్ .. అక్కడ ఉన్న ఒక దాబా దగ్గరికి పరిగెత్తుతూ భయం తో వచ్చిన ప్రవీణ్ ని చూసి అక్కడి స్థానికులు అతన్ని వివరం అడిగి తెల్సుకున్నారు. ప్రవీణ్ చెప్పిన విషయాలు విన్న స్థానికులు .."ఈ అబ్బాయి తాగి లేడు.. నిజంగానే భయపడుతూ ఏడుస్తున్నాడు. పాపం ఇతను చెప్పింది నిజమే అయి ఉంటుంది " అని అతనికి ధైర్యం చెప్పారు. " చూడు బాబు నీకు మేము ఏ సహాయం కావాలన్నా చేస్తాము ..భయపడకు .... పోలీసులకు చెప్పి నీకు రక్షణ .. చర్చి ఫాదర్ కి చెప్పి నీ కోసం ప్రార్ధన చేస్తాం " అని ధైర్యం చెప్పసాగారు . వారిలో ఒకరు ఇంతకీ మీది ఏ ఊరు అని అడిగారు ...అయినా భయం తగ్గని ప్రవీణ్ వణికిపోతు మాది శ్రీకాకుళం అని చెబుతూ ఉండగానే .... అప్పుడే సరిగ్గా ఆ దాబా లోకి .......................................................................................................


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ... ప్రవీణ్ ని చూసిన వారిలో ఒకరు ఇంకొకడితో అంటున్నాడు " అరేయ్ ఇందాకా మన కారు నెట్టుకుంటూ వచ్చేటప్పుడు .. గబుక్కున ఎక్కి కూర్చుని ఈ ఊరు రాగానే దూకి పారిపోయాడే వాడు వీడే".


ఒక email ఆధారంగా ...:)

7/30/10

రాముడు వాలిని చాటు నుండి చంపడం తప్పు

రాముడు వాలిని చాటు నుండి చంపడం తప్పు .... ప్రస్తుతం యువతరాన్ని అయోమయం లోకి గురి చేస్తున్న వాఖ్యం ఇదే. రామాయణం పై అనేక నీలి నీడలను ప్రసరింప చేస్తున్న అనేక వివాదాస్పద విషయాలలో ఇది కూడా ఒకటి. అయితే పూర్తి నిజాలు తెలుసు కున్న తర్వాత .. బుర్రతో కాకుండా బుద్ధితో ఆలోచించేవారికి రామయ్య ఏ ధర్మం ప్రకారం వాలిని సంహరించాడు అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వాలి, సుగ్రీవులు పోరాటం జరిపేటప్పుడు చాటు నుండి వాలి ని రామయ్య బాణం సంధించి కింద పడవేసిన తర్వాత .. కిందపడ్డ వాలి రామయ్య మీద అనేక ఆరోపణలు చేశాడు. వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాలి ఇలా అన్నాడు " రామా అందరూ నీ గురించి నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమవంతుడివి అంటారు. అటువంటి నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని" అని ఆవేశం గా మాట్లాడుతాడు.

అప్పుడు రామయ్య ఇలా సమాధానం ఇస్తాడు

ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||

" వాలీ , నీకు అసలు ధర్మార్ధకామ మోక్షాల గురించి తెలుసా ? నువ్వు అజ్ఞానివి. ఒక చిన్న బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము. నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం) అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది.

నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.

న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||

నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.


కాబట్టి వానర జాతి ధర్మాన్ని తప్పి కోడలు వంటి రుమ ని బలవంతంగా అనుభవించడం వాలి తప్పు ...... అందుకు శిక్షకి అర్హుడు. మృగం అయిన వాలిని మానవుడు , క్షత్రియుడు అయిన రాముడు తనని శరణు కోరిన సుగ్రీవుని కోసం సంహరించడం అధర్మం కాదు ( పైగా వాలికి వరం కూడా ఉంది)

కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వాలిని హీరో ని చేసి ... రామయ్య ధర్మం తప్పాడు అని ప్రచారం చేసి భావితరాలకి అసలు ధర్మమే తెలియకుండా చేయకండి.

నోట్ : నేను కూడా వాలిని రామయ్య చంపడం యెంత వరకు కరక్టు అనే ప్రశ్న లేపి పెద్దల చేత వివరణలు ఇప్పిద్దాం అనుకున్నాను కానీ గతం లో ఇలాంటి ఒక పోస్ట్ లో చర్చ పక్కదారి పట్టడం వల్ల ... నాకు తెల్సిన వివరణ నేను ఇచ్చాను .... పెద్దలు ఎవరైనా మరింత వివరణ ఇస్తే బాగుంటుంది :)

7/28/10

పడయప్పా ............. కాదు పాములోడప్పా

( ఇది టీనేజ్ కుర్రాళ్ళ సిల్లీ కధ ... ఇంటలెక్చువల్ గా ఉంటుంది అని ఆశించకండి)

అది 1999 వ సంవత్సరం .... నేను 19 -20 ఏళ్ళ వయసులో ఉండగా ఒంగోల్లో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టారు . అంత వరకు మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తప్ప గతి లేని మా ఊరికి ఇంజనీరింగ్ కాలేజీ రావడం పెద్ద విషయం కాపోయినా ......అందులో చదవడానికి... రాష్ట్ర నలుమూలల నుండి చాలా మంది అమ్మాయిలు వచ్చారు అన్న వార్త ప్రధానంగా మా కుర్ర బ్యాచ్ ని ఆకర్షించింది. అంతవరకు ఊర్లో చాలావరకు మాకు పరిచయం ఉన్న అమ్మాయిలే ఉండేవారు .. వాళ్ళతో చిన్ననాటి నుండి ఉన్న పరిచయం కారణంగా కాస్త ఆరోగ్యకరమైన స్నేహాలు ఉండేవి . కొత్తగా వంద మందికి పైగా సిటీ నుండి వచ్చిన అమ్మాయిలని చూడగానే ఏదో విధంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించాలి అనే మా కుర్రాళ్ళ తాపత్రయం ...అంతా ఇంత కాదు. కానీ ఎలా??????????? .. వాళ్లేమో వాళ్ళ హాస్టల్ నుండి ఫర్లాంగు దూరం మెయిన్ రోడ్ మీదకి వచ్చి అక్కడ బస్సు ఎక్కి కాలేజికి పోవడం తిరిగి అక్కడే దిగి మళ్లా హాస్టల్ కి పోవడం .. అంతేగానీ ఇంకెక్కడా కనిపించేవారు కాదు.

కానీ విధి చాలా చిత్రమైనది .. వాళ్ళ దృష్టిని ఆకర్చించాలని విపరీతంగా కృషి చేసిన మా నికృష్టులు..... కన్నా , రవూఫ్, సృజన్, ఇంతియాజ్, మల్లి గాడు , భానుగాడు తదితర బేవార్స్ లని వదిలేసి ... పాపం పదో తరగతి వరకే చదివి ఆ తరువాత తండ్రి చనిపోవడం వల్ల ఇంటి పోషణ భారం నిమిత్తం కూలి పనికి వెళుతున్న చాంద్ బాషా అనే పదిహేడేళ్ళ అబ్బాయిని అనవసరంగాకెలుక్కునారు ఆ అమ్మాయిలు. వివరాల్లోకి వెళ్దాం ........................ చంద్ బాషా కి ఒక కాలు మడమ దగ్గర చిన్న సమస్య ఉంది అందుకే కొంచెం ఎగిరినట్టు నడుస్తాడు ఒక రోజు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న వాడిని చూసి "అబ్బో లారెన్స్ ఒంగోల్లో తిరుగుతున్నాడే" అని ఒకరు అనడం అదో భయంకరమైన కామెడీ అన్నట్టు మిగతా వాళ్ళు నవ్వడం .. వీడు చూడగానే "లారెన్స్ కి కోపం వచ్చిందే" .. అని ఒకరు , "అయితే తాండవం చేయమను" అని ఇంకొకరు ఇలా రోజు ఏదో ఒకటి అనడంతో తిక్క రేగి మన గాలి దళానికి ఫిర్యాదు చేశాడు. ఆ రోజు సాయంత్రం మా అడ్డాకి అందరం చేరుకునే సమయానికి అక్కడ ఇదే టాపిక్ జరుగుతుంది. అక్కడ చంద్ బాషాకి న్యాయం చేద్దాం అన్న తపన కన్నా ఈ వంకతో అమ్మాయిల కంట్లో పడచ్చు అన్న యావ మన జనాలలో బాగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి గమనించిన ఫరూక్ .. " అన్నా మాటర్ చాలా కంపు అయ్యేటట్టు ఉంది దీన్ని ఇక్కడే కట్ చేయడం మంచింది" అన్నాడు. నేను చాంద్ బాశాని పక్కకి తీసుకెళ్ళి " అరె చాంద్ , మనం వెళ్లి అడిగితే మీ వాడి పేరేత్తామా.. ఊరేత్తామా అంటారు ప్రస్తుతానికి కాం గా ఉండు .. రేపు నేను చెప్తా .. ఈలోపు ఎవర్నన్నా తీసుకెళ్ళి గొడవ చెయ్యబాక" ... అని చెప్పా ... వాడు ఒప్పుకున్నాడు కానీ పక్కనోళ్ళు ఒప్పుకోవడం లా .... చివరికి ఎలాగో ఒప్పించి ..... అసలు ముందు కామెంట్ చేసిన అమ్మాయి ఎవరో చూడాలని డిసైడ్ అయ్యాం. అందరం గుంపుగా కాకుండా ... నేను , చాంద్ఇంకా కన్నా వెళ్ళాలని నిర్ణయం జరిగింది.

ఆ మర్నాడు ఉదయాన్నే ముగ్గురం ఆ ఏరియా లో రెడీగా ఉన్నాం వాళ్ళు బస్సు ఎక్కే ఏరియా కి దగ్గరలో గోడ మీద కూర్చున్నాం . అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి బస్సు ఎక్కుతున్నారు . " అన్నా ఆ పింక్ డ్రెస్ అమ్మాయి అన్నా.... ఆ పక్కన వచ్చే వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఉండి వంత పాడుతుంటారు అన్నా " అన్నాడు చాంద్. చూద్దును కదా సన్నగా పొడవుగా గట్టిగా ఊదితే పడిపోయెలా ఉన్న ఒకపిల్ల నడుచుకుంటూ వస్తుంది .... ప్రేమదేశం లో టబు ని ఇమిటేట్ చేయాలనీ ప్రయత్నించడం తెలుస్తునే ఉంది. ఆ అమ్మాయి పక్కనే ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరూ తన వీర ఫాలోయర్స్ అని అర్ధం అయింది. ఊరికే చూద్దాం అని వచ్చిన నేను ఎందుకో సంయమనం కోల్పోయాను " ఈ మినప గింజ మొహందా నిన్ను కామెంట్ చేసింది ... అందంగా ఉన్న ఆ అమ్మాయో ... లేక అబోవ్ యావరేజ్ గా ఉన్న ఈ అమ్మాయో అంటే పర్లేదుగానీ " అని కాస్త పెద్దగానే అన్నాను .... అయితే చాంద్ గాడు ఆ అమ్మాయి గురించి చెప్పిన దాన్ని బట్టి కాస్త ఘాటు గానే రిప్లై ఆశించాను .... కానీ ఆ ముగ్గురు చటుక్కున తలదించుకుని వెళ్ళిపోయారు. కానీ రియాక్షన్ పక్కన ఉన్న కన్నా గాడి దగ్గర నుండి వచ్చింది. " అరె మనం ఊరికే చూద్దాం అని కదా వచ్చాం నువ్వేమో పెద్ద పుడింగి లా కామెంట్ వేసేసావ్ ..... ఇప్పుడు చూడు రేపటి నుండి మనల్ని ఎదవల్లాగా చూస్తారు .. ఒక్కపిల్ల కూడా పడదు ..... అంతా నీవల్లే" అంటూ నస మొదలెట్టాడు. " అరె జఫ్ఫా మూసుకుని వాళ్ళలో వచ్చే రియాక్షన్ చూడు" అని చెప్పా .... మర్నాడు మళ్లీ వెళ్ళాం .... మొదటి రోజు కలిసి వెళ్ళిన వాళ్ళు ... ఈ రోజు ముగ్గురు వేరు వేరుగా ఒంటరిగా రావడం మినప గింజ నన్ను క్రోధం తో కూడిన చూపు చూడడం.... అబొవ్ యావరేజ్ కోర కోరా చూడడం ...... అందగత్తె ఫోజు కొడుతూ వెళ్ళడం చకా చకా జరిగిపోయాయి.
( నేను అన్న మాటలకి ..... వాళ్ళ అందం విషయం లో వాళ్ళ మద్య పెద్ద యుద్ధం జరిగింది అని తర్వాత తెల్సింది. సో ఆ బ్యాచ్ ని విజయ వంతంగా విడగొట్టా ......ఆ రోజు తర్వాత చాంద్ గాడిని ఎవరూ ఏమీ అనలేదు .... మనోడు కూడా హ్యాపీ ..... ఆలా చూసి వద్దామని వెళ్లి కాల్చి ( అమ్మాయిల ఫ్రెండ్ షిప్ ని ) వచ్చా. :P

ఒక రెండు నెలలు సాదా సీదాగా గడిచాయి... . తర్వాత ఒకరోజు అప్పటి తెలుగుదేశం గవర్నమెంటు లో మంత్రిగా పని చేసిన దామచర్ల ఆంజనేయులు గారి ఆఫీసుకి మా ఫ్రెండు రవూఫ్ పని మీద వెళ్లడం జరిగింది ...నేను కూడా వెళ్ళా. అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలు అవుతుంది .. వాడు లోపలి వెళ్లాడు నేను బయటే ఉన్నా ... కారణం ఆ పక్క బిల్డింగ్ అమ్మాయిల హాస్టల్ కావడమే :)) కాసేపటికి హాస్టల్ లో నుండిపెద్దగా కేకలు వినిపించాయి ..అమ్మాయిలు అందరూ మూకుమ్మడిగా అరుస్తున్నారు .... " పాము పాము" అని. మనికి అసలే ఆవేశం ఎక్కువ కదా...... పాము అన్న మాట వినపడితే మనల్ని ఎవరు ఆపలేరు. వెళ్లి హాస్టల్ గేటు ఎక్కి దూకా ... అది తీసే ఉందని తర్వాత అర్ధం అయింది. ఆ కాంపౌండ్ లో రెండు బిల్డింగ్ ల మద్య ఖాళి స్థలం ఉంది అక్కడ గడ్డిలో పాము కొట్టుకుంటూ కనపడింది ... అమ్మాయిలు అందరూ గోడలు కుర్చీలు ఎక్కేసారు. ఆ టైం లో అక్కడికి వచ్చిన నను సాక్షాత్తు శ్రీక్రిష్ణుడే వాళ్ళని రక్షించడాని వచ్చినట్టుగా చూసి . .... "సార్ సార్ అక్కడ ఉంది పాము చూడండి" అన్నారు. దగ్గరికి వెళ్లి చూద్దును కదా దాని తల అప్పటికే నలిగి ఉంది కానీ కొన ప్రాణం తో కొట్టుకుంటుంది. ఆ విషయం అమ్మాయిలకి కి తెలీదు . ఏ పక్షులో తీసుకెళుతుండగా జారి పడినట్టు ఉంది .. ఇలాంటి అద్భుత అవకాశాన్ని గత పదిహేనేళ్ళు గా తెలుగు సినిమాలు చూస్తున్న కుర్రాడు వదులుకుంటాడా చెప్పండి :P. వెంటనే దాని తోక దగ్గర పట్టుకుని గాల్లో గిర గిరా తిప్పి అక్కడే నేలకేసి కొట్టి , తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని నడిచి వస్తుంటే అబ్బా అబ్బా అబ్బా ...... అమ్మాయిలు అంతా చప్పట్లు .. సూపర్ ... అనే అరుపులు .. నరసింహా .. రజనీకాంత్ అని సెటైర్లు ..మద్య నడుచుకుంటూ వెళ్లి దాన్ని దూరంగా పారేశా....

అప్పటికే తాజాగా నరసింహ సినిమా రిలీజ్ అయి ఉంది. ఆహా ఏమి కో- ఇన్సిడెన్స్ అనుకుంటూ .. గేటు దగ్గర నిలుచున్నా ... అమ్మయిలు అందరూ వచ్చి అక్కడ చెరి ..పొగడ్తలు .. థాంక్స్ లు గట్రా అవుతున్డగానే మా రవూఫ్ గాడు బయటికి వచ్చాడు. ...... అక్కడ అమ్మాయిల మద్య లో ఉన్న నన్ను చూసి వాడి నవరంధ్రాల నుండి ఉక్రోషం పొంగి " పోదాం పా " అన్నాడు కాస్త సీరియస్సుగా. అక్కడి నుండి వెళ్ళిపోయాం . జరిగిన విషయం చెప్పగానే . అబ్బా జస్ట్ చాన్స్ మిస్సు అని తెగ గింజుకున్నాడు.

క్రింది వీడియో చూడండి







ఈ వీడియో లోలాగా పాముని పట్టుకున్న నన్ను కూడా వాళ్ళు ముద్దుగా నరసింహా ( పడయప్పా) అని పిలుచుకుంటారేమో ఆనుకున్నా ... కానీ చాలా కాలానికి .. హాస్టల్ లో ఉన్న మా ఫ్రెండు గాడి ఒక లవర్ ద్వారా లీకైన .. విషయం ఏంటంటే .....వాళ్ళు నాకు పడయప్పా అని కాకుండా పాములోడు అని పేరు పెట్టారని ... అందులోనూ నా కామెంట్ వల్ల హార్ట్ అయిన మినప గింజ పగబట్టి మరీ ఆ పేరుపెట్టి .... ప్రచారం కల్పించింది అని తెల్సుకుని ............... అమ్మనీ యెంత దెబ్బ కొట్టావే అనుకున్నా ....................:)

7/7/10

మీ కంప్యూటర్ కి తెలుగు నేర్పండి

బహుశా ఇప్పుడు నేను చెప్ప బోయే అంశం చాలా మందికి తెలిసే ఉండవచ్చు. కానీ కొందరు ఈ విషయం మీద టపా వేయమని కోరారు . వారి కోరిక మేరకు ఈ టపా . పైగా కొందరు bsnl limited ప్యాకేజి వాడకం దారులకు టపా రాసినంత సేపు నెట్ కనక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కూడా. కంప్యూటర్ లోకి తెలుగు టూల్ install చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మీరు తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.

దీనికోసం మీరు చేయవలసినది , ముందుగాhttp://www.google.com/transliterate/ నొక్కండి తర్వాత .. ఆ లింక్ లో కుడివైపు పై భాగం లో New Download Google Transliteration IME అని ఉంటుంది . అది క్లిక్ చేయండి . ఇప్పుడు మీరు కింది ఇమేజ్ ఉన చోటుకి చేరుతారు . ఇమేజ్ లో ఉనట్టు గా choose IME language అనే ఆప్షన్ క్లిక్ చేసి తెలుగు సెలక్ట్ చేసి కింద ఉన్న Download Google IME అనే బటన్ క్లిక్ చేయండి







ఇప్పుడు మీకు ఒక software డౌన్లోడ్ అవుతుంది. అది మీ కంప్యుటర్ లో సేవ్ చేసి తర్వాత install చేయండి. install చేసాక క్రింది విధం గా చేయండి.



Windows 7/Vista


  1. Control Panel -> Regional and Language Options -> Keyboard and Languages tab
  2. Click on Change keyboards... button to open Text services and input languages dialog
  3. Navigate to Language Bar tab
  4. Enable the radio button Docked in the taskbar under Language Bar section
  5. Apply all settings and try to display language bar as mentioned in previous section.
Windows XP
  1. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Advanced Tab
  2. Make sure that under System configuration, option Turn off advanced text services is NOT checked.
  3. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Settings Tab
  4. Click Language Bar
  5. Select Show the Language bar on the desktop. Click OK.
  6. If you are installing the IME for East Asian language or Right-To-Left language, go to Control Panel -> Regional and Language Options -> Languages Tab
  7. Make sure that options Install files for complex scripts and right to left languages and Install files for East Asian languages are checked in the checkboxes. This requires installation of system files and the system will prompt to insert the Operating System Disc.
  8. Apply all settings and try to display language bar as mentioned in previous section.
సోర్స్ : http://www.google.com/ime/transliteration/help.html#installation.

ఇన్స్టాల్ ప్రాసెస్ ముగిసాక. క్రింది ఇమేజ్ లో ఉనట్టుగా మీరు టూల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి లాంగ్వేజ్ బార్ తెచ్చుకోండి .




తెచ్చుకున్న తర్వాత మీకు కింది విధంగా టూల్ బార్ లో లాంగ్వేజ్ బార్ కనిపిస్తుంది.


ఆ తర్వాత లాంగ్వేజ్ బార్ ని కింది ఇమేజ్ లో చూపి నట్టుగా రిస్టోర్ చేయండి .

ఇప్పుడుమీకు డెస్క్ టాప్ మీద కనిపించే ఈ లాంగ్వేజ్ బార్ లో ఇలా తెలుగు సెలక్ట్ చేయండి.


ఇప్పుడు మీకు కింది ఇమేజ్ లో లాగ కుడి వైపు కింద టూల్ బార్ వస్తుంది .





ఇప్పుడు అక్కడఉన్న ' ' అనే అక్షరాన్ని ఒక సారి నొక్కితే అది' A' గా మారుతుంది. ' ' లో ఉంటే తెలుగు 'A' లో ఉంటే ఇంగ్లీష్ . ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సహాయం లేకుండానే టైప్ చేసుకోవచ్చు. ఏదేని డౌట్స్ ఉంటే అడగండి .

7/6/10

మీ బ్లాగు ట్రాఫిక్ సోర్సు తెలుసుకోవాలి అనుకుంటున్నారా



మీ బ్లాగులోకి వస్తున్న ట్రాఫిక్ సోర్సు వివరాలు అనగా సంకలిని నుండి వస్తున్న సందర్శకుల సంఖ్య వివరాలు, అలాగే గూగుల్ లో యే పదాలు టైప్ చేయడం వల్ల మీ బ్లాగ్ లోకి సందర్శకులు వస్తున్నారు అన్న వివరాలు తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్దతి కన్నా రెండవ పద్దతి చాలా సులువు అయినా మీకు రెండూ చెబుతాను. :)

ఒకటి.

ముందుగా మీరు http://www.google.com/analytics ఈలింక్ ని నొక్కాలి. ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ ఉంటే సరే సరి లేదంటే కొత్తది తయారు చేసుకోండి . మీ గూగుల్ అకౌంట్ రెడీ అయ్యాక అక్కడ ACCESS ANALYTICS అన్న మీట నొక్కండి . అక్కడ ఐడి, పాస్ వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఈ క్రింది ఇమేజ్ లో ఉన చోటుకి చేరుతారు.


పై ఇమేజ్ లో sign up అన్న మీట నొక్కండి ఇప్పుడు మీరు క్రింది ఇమేజ్ ఉన్న చోటుకి చేరుతారు .


అక్కడ మీ బ్లాగు లింక్ ఇచ్చి క్రింద మీ పేరు , మీరు ఉన్న దేశం సమయం వివరాలు ఇచ్చి continue అన్న దాని మీద నొక్కండి. ఇప్పుడు మీరు కింది ఇమేజ్ ఉన్న దగ్గర చేరుతారు. అక్కడ మీ పేరు , మీరు ఉన్న దేశం సరిగా ఇచ్చి మరలా continue అన్న బటన్ నొక్కండి.
ఇప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండీషన్స్ అగ్రిమెంట్ ని ఓకే చేయాల్సి ఉంటుంది . కింది ఇమేజ్ లో చూపిన లాగా Yes, I agree to the above terms and conditions. అని ఉన చోట టిక్ పెట్టి కింద create new account అన్న బటన్ నొక్కండి.


ఇప్పుడు మీరు క్రింది ఇమేజ్ లో ఉన్న చోటుకి చేరుతారు అక్కడ మీకు లభించే code తీసుకెళ్ళి మీ బ్లాగులో html గాడ్జెట్ లో పెట్టండి. అదెలా పెట్టాలో చెప్పనక్కర్లేదనుకుంటా :P . తర్వాత అక్కడ save& finish బటన్ నొక్కడం ద్వారా మీరు సైట్ లోకి ప్రవేశిస్తారు.

24 గంటల తర్వాత మీరు మీ ట్రాఫిక్ సోర్స్ క్రింది విధంగా చూచుకోవచ్చు .నేను కొత్త (బ్లాగు) సామెతలు అనే పోస్టు రాసిన జులై 5 న నా బ్లాగ్ ట్రాఫిక్ సోర్సు క్రింది ఇమేజి లో మీరు గమనించ వచ్చు.


పై ఇమేజ్ లో view report అన్న చోట నొక్కండి. తర్వాత క్రింది ఇమేజ్ లో ఎడమ వైపు ఉన్న మెనూ లో Traffic Sources అన్న చోట నొక్కండి. కుడి చేతివైపు మీకు యే డేట్ నుండి యే డేట్ వరకు కావాలో కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.




ఇప్పుడు మీరు కింది ఇమేజ్ లో లాగా మీ ట్రాఫిక్ సోర్సు , ఇంకా గూగుల్ నుండి యే పదాలు నొక్కి మీ బ్లాగునకు వస్తున్నారు అనే వివరాలు తెల్సుకోవచ్చు.

పై వివరాలు ఒక్క జులై ఐదవ తారీఖు నాటివే.

గమనిక : ఇమేజ్ ని పెద్దదిగా చూడడానికి ఇమేజ్ మీద క్లిక్ చేయండి :)

రెండవ పద్దతి.

http://draft.blogger.com నొక్కండి మీ గూగుల్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అందులో కింది ఇమేజ్ లో చూపినట్టిగా మీ బ్లాగు చివర stats అని వస్తుంది అదే కాకుండా పైభాగాన Make Blogger in Draft my default dashboard అని వస్తుంది. అక్కడ టిక్ పెట్టి ... stats నొక్కండి . సులభంగా మీ బ్లాగు ట్రాఫిక్ రిపోర్ట్ ఎప్పటికి అప్పుడు చూడండి.




రెండవ పద్దతి చాలా సులువు సుమా.

7/5/10

కొత్త ( బ్లాగు) సామెతలు

భోగీ భోగీ నీ భోగం ఎన్నాళ్లె అంటే మా అయన సంతకి వెళ్లి వచ్చే దాకా అందట.
మార్తాండ మార్తాండ నీ కులుకు ఎన్నాళ్ళు అంటే .. కొత్త డి.టి.పి ఆపరేటర్ జీతం అడిగిందాకా అన్నాట్ట.
ihikhik

ఉట్టికి లేనమ్మ స్వర్గానికి ఎగిరిందట.
బ్లాగు కి దిక్కులేనమ్మ సంకలినికి పెడతాను అందట.
tumbuk

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
అజ్ఞాత బూతు బ్లాగులకి హిట్లేక్కువ
gile

చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు
చాదస్తపు బ్లాగర్ రాయడం ఆపడు ......కెలికితే ఏడుస్తాడు
gelakguling

చేతులు కాలాకా ఆకులూ పట్టుకున్నట్టు
తిట్లు తిన్నాక మోడరేషన్ పెట్టుకున్నట్టు
gatai

కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
కొత్త బ్లాగరు పోస్టులు ఆపడు.
senyumkenyit

కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు
టెంప్లేటు మారుద్దామని చూస్తె పోస్టులు డిలీట్ అయినట్టు
garupale

వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు
సెర్చ్ చేయబోయిన బ్లాగు బుక్ మార్క్ అయి ఉన్నట్టు
sembah

అసలే కోతి , ఆపై కల్లు తాగినట్టు
అసలే మార్తాండ , ఆపై నిద్రమత్తులో రాసినట్టు
blur

ఆయనే ఉంటే మంగలెందుకు
మనదగ్గర విషయమే ఉంటే కాపీ పేస్టులు ఎందుకు
busuk

పిండి కొద్ది రొట్టె
టపా కొద్ది కామెంట్లు
siul

నీ బోడి సంపాదనకి ఇద్దరు పెళ్లాలా
నీ కోడి బుర్రకి రెండు బ్లాగులా
pokpok

కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు
నాదెండ్లకి సంకలిని అప్పగించినట్టు
doa

మరి కొన్ని సామెతలు మనోళ్ళు కామెంట్లలో చెబుతారు కాసుకోండి.
tepuktangan